ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్‌ సోరెన్‌ | Former Jharkhand CM Champai Soren Admitted To Hospital In Jamshedpur, Post Goes Viral | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్‌ సోరెన్‌

Published Sun, Oct 6 2024 5:49 PM | Last Updated on Mon, Oct 7 2024 11:37 AM

Champai Soren admitted to hospital in Jamshedpur

రాంచీ:  జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్‌ షుగర్‌కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్‌ ఆసుపత్రిలో చేరినట్లు  ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ ఆసుపత్రిలో చేరారు.

‘‘చంపయ్‌ రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది.దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చంపయ్‌ పరిస్థితి మెరుగుపడుతోంది’ అని టాటా మెయిన్ హాస్పిటల్ జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.

ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపయ్‌ సోరెన్‌  బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. చంపయ్‌ సీఎంగా ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు. హేమంత్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంపయ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. జూలైలో హేమంత్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి చంపయ్‌ సోరెన్‌ జేఎంఎం పార్టీకి దూరంగా ఉండి.. అనంతరం బీజేపీలో చేరారు.

చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ పట్టివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement