రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment