Shivraj Singh Chauhan
-
ఇదే లక్ష్యం.. జాతీయ సదస్సులో కేంద్రమంత్రి
ఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్‌లో రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. భారతదేశంలో వార్షిక వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యాన్ని 341.55 మిలియన్ టన్నులుగా నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో ఆరు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, 31 రాష్ట్రాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరిలు రైతులు వేగంగా పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.రైతుల ఆదాయం పెరగని ప్రాంతాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాము. అలాంటి ప్రాంతాల్లోని రైతులపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతుందని ఈ సమావేశంలో వెల్లడించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 131 రోజుల్లో రైతుల ప్రయోజనాల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని.. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. 17 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో విజయవంతంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగంలో రాష్ట్రాలు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.ధాన్యం ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందించడం, రైతులకు నష్టపరిహారం అందించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ధాన్యాలకు సరైన నిల్వ సౌకర్యాలు కల్పించడం వంటి వాటితో పాటు ప్రపంచానికి భారతదేశాన్ని ఆహార కేంద్రంగా స్థాపించడం వంటివి ప్రభుత్వ లక్ష్యాలని చౌహాన్ వివరించారు. రబీ సీజన్లో ఆవాలు, శనగలు మొదలైన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న కాంగ్రెస్ ఆరోపణలపై శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ప్రతిపక్షాల ప్రశ్నలకు వచ్చే సమావేశంలో సమాధానాలు చెబుతామని వెల్లడించారు. -
రైతుల ఆదాయం పెంచే ‘మౌలిక నిధి’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రైతుల పట్ల గల అమిత శ్రద్ధ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయం ఆయన రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నదాతల జీవితాలను మార్చడమే ప్రధాని మొదటి, అత్యంత ప్రాధాన్య లక్ష్యం. అందుకే ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వ్యవసాయం, రైతులకు అధిక ప్రాధాన్యం కొనసాగించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘వ్యావసాయిక మౌలిక సదుపాయాల నిధి’ (ఏఐఎఫ్), ‘పీఎం ఆశా’ వంటి పథకాలలో ఈ నిబద్ధత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఏఐఎఫ్ రూపంలో సుస్థిర పరిష్కారాన్ని అందించడం ద్వారా రైతుల సాధికారతకు ప్రభుత్వం గణనీయమైన సహకారం అందిస్తోంది.దేశంలో పంట కోత అనంతర నష్టాలు ఒక పెద్ద సవాలు. ఇది వ్యవసాయ రంగ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. లక్షలాది రైతుల శ్రమను నీరుగారుస్తోంది. తాజా అంచనాల ప్రకారం, దేశంలో ప్రతి ఏటా మొత్తం ఆహార ఉత్పత్తిలో 16–18% ఈ విధంగా నష్టపోతున్నాం. పంట కోత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ వంటి వివిధ సందర్భాల్లో ఈ తరహా నష్టాలను చూస్తున్నాం. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం, తగిన శుద్ధి యూనిట్ల కొరత, సమర్థమైన రవాణా సదుపాయాలు లేని కారణంగా ఈ భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఇది మొత్తం ఆహార భద్రతపై దుష్ప్రభావం చూపిస్తోంది.నిల్వ సదుపాయాలు పెరిగాయిమోదీ సమర్థ నాయకత్వంలో శాస్త్రజ్ఞుల పరిశోధనలను ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా 2020 జూలైలో ‘ఏఐఎఫ్’ను ప్రధాని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట తరువాతి నిర్వహణ సమస్యలను పరిష్కరించడం, తద్వారా ఆహార నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. కొత్త ప్రాజెక్టులు, కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. ఏఐఎఫ్ కింద బ్యాంకులు 9 శాతం వడ్డీ పరిమితితో ఏడాదికి 3 శాతం వడ్డీ రాయితీ రుణాలు, ‘సీజీటీఎంఎస్ఈ’ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్) కింద ఆర్థిక సంస్థలు రూ. 2 కోట్ల వరకు రుణాలు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా గత ఆగస్టు వరకు మంజూరు చేసిన మొత్తం రూ. 47,500 కోట్లు దాటింది. ఇందులో రూ. 30 వేల కోట్లకు పైగా ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. మంజూరైన ప్రాజెక్టుల్లో 54 శాతం... రైతులు, సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘా లకు అనుసంధానం కావడం విశేషం. ఇది పొలాల వద్దే మౌలిక సదుపాయాలను అందించడంలో రైతుల బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.పంట నష్టాల నుంచి రైతులను కాపాడటానికి నిల్వ (డ్రై, కోల్డ్ స్టోరేజీలు), రవాణా మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యమిస్తున్నారు. డ్రై స్టోరేజ్ పరంగా చూస్తే, దేశంలో 1,740 లక్షల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 44% కొరత ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఉద్యాన ఉత్పత్తుల కోసం, దేశంలో సుమారు 441.9 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉంది. ఈ సామర్థ్యం దేశంలోని పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 15.72% మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐఎఫ్ వల్ల సుమారు 500 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య అంతరాన్ని తగ్గించడానికి వీలైంది. దీనివల్ల పంట కోత అనంతర నష్టం రూ. 5,700 కోట్లు ఆదా అవుతుంది. సరైన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యాన ఉత్పత్తుల నష్టం 10% తగ్గింది. పాతిక లక్షల మందికి ఉపాధివ్యవసాయ మౌలిక సదుపాయాల వృద్ధి, అభివృద్ధికి ఏఐఎఫ్ కొత్త ఉత్తేజాన్ని అందిస్తోంది. గత ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 74,695 వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఏఐఎఫ్ కింద ఆమోదం లభించింది. వీటిలో 18,508 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 16,238 ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు, 13,702 గోదాములు, 3,095 సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, 1,901 కోల్డ్ స్టోర్స్, కోల్డ్ చైన్లు, 21,251 ఇతర రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2015 నుంచి వ్యవసాయ రంగంలో రూ. 78,702 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రభుత్వ చర్యల వల్ల యువత కూడా వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో సుమారు 50,000 కొత్త వ్యవసాయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది రైతుల స్వావలంబనకు దారి తీస్తోంది. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రయత్నాలు 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించదానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 25 లక్షల ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. పొలాల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన వల్ల రైతులు తమ పంటలను నేరుగా ఎక్కువమందికి అమ్ముకోవడానికి వీలు కలిగింది. ఆధునిక ప్యాకేజింగ్, స్టోరేజీ వ్యవస్థల కారణంగా రైతులు మార్కెట్లలో తమ ఉత్పత్తులను మరింత సమర్థంగా అమ్ముకోగలుగుతారు. ఫలితంగా మంచి ధర దక్కుతుంది. ఈ యత్నాలు రైతుకు సగటున 11–14% అధిక ధరలను పొందడానికి వీలు కల్పిస్తున్నాయి.పూచీకత్తు భరోసా, వడ్డీ రాయితీ ద్వారా రుణ సంస్థలు తక్కువ రిస్క్‌తో రుణాలు ఇచ్చి, తద్వారా తమ వినియోగదారులకు సాయ పడతాయి. నాబార్డ్ రీఫైనాన్ ్స సదుపాయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని భాగస్వామ్యం చేయడం వల్ల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల(పీఏసీఎస్) వడ్డీ రేటును ఒక శాతానికి తగ్గించడం గమనార్హం. దీంతో ఇలాంటి పీఏసీఎస్‌లతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూ రాయి. ఏఐఎఫ్ కింద 9,573 పీఏసీఎస్ ప్రాజెక్టులకు నాబార్డ్ ఇప్పటి వరకు రూ. 2,970 కోట్ల రుణం మంజూరు చేసింది.ఆరు సూత్రాల వ్యూహంవ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం, వ్యవ సాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తగిన ఉపశమనం కల్పించడం, వ్యవసాయం, ప్రకృతి సేద్యాన్ని వైవిధ్యపరచడం వంటి ఆరు సూత్రాల వ్యూహంతో ముందుకు వచ్చాం. హైడ్రోపోనిక్ వ్యవ సాయం, పుట్టగొడుగుల పెంపకం, వెర్టికల్ ఫామింగ్, ఏరోపోనిక్ వ్యవసాయం, పాలీహౌస్, గ్రీన్ హౌస్ వంటి ప్రాజెక్టులను రైతు సమూహాలు, సంఘాలకు మాత్రమే కేటాయించారు. వాటి పరిధిని విస్తరించడం ద్వారా వ్యక్తిగత లబ్ధిదారులు ఇప్పుడు ఈ ప్రాజె క్టులను చేపట్టడానికి ఏఐఎఫ్ కింద అనుమతులు పొందడానికి అర్హులయ్యారు. దీనికి అదనంగా, ‘పీఎం–కుసుమ్’ యోజనలోని ‘కాంపోనెంట్ ఎ’... బంజరు, బీడు, సాగు, పచ్చిక బయలు లేదా చిత్తడి భూములలో రెండు మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనిని సులభంగా ఎఐఎఫ్ పథకంతో అనుసంధానించవచ్చు. ఈ వ్యూహాత్మక సమ్మేళనం రైతులకు వ్యక్తిగ తంగా సహాయపడుతుంది. రైతు సమూహాలను సాధికారం చేస్తుంది. ‘అన్నదాత’ నుండి ‘ఉర్జాదాతా’ (ఇంధన ప్రదాత) వరకు వారి పాత్రను పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వసనీయమైన ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విస్తృత స్థాయిలో మెరుగు పడిన సమాచార వ్యవస్థ, సమష్టి కృషితో రైతు సంక్షేమంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ‘వికసిత భారత్’లో భాగంగా అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాసకర్త కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం; గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి; మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి -
ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.3,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాయి
రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తాం. రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తా. – కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్కేసరపల్లి(గన్నవరం)/సాక్షి, అమరావతి: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం మండలంలోని కేసరపల్లి–సావరగూడెం రోడ్డులో ముంపునకు గురైన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును కేంద్ర మంత్రికి విన్నవించుకున్నారు. వారం రోజులుగా నీట మునిగిపోవడం వల్ల వరిపైరు కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిన ఉంటుందని జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పసుపు, పత్తి, అరటి, మినుము రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చౌహన్ మాట్లాడుతూ రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తానని చెప్పారు. పసల్ బీమా యోజన కింద రైతులకు ఆదుకుంటామని పేర్కొన్నారు. ఎంపీలు, మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ రంగాన్ని ఆదుకోండిసంక్షోభంలో ఉన్న ఆయిల్ పామ్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ జాతీయ ఆయిల్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీఎస్ఆర్ ప్రసాద్, కే.క్రాంతి కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులపై తక్షణమే దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, డైనమిక్ డ్యూటీ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం
సాక్షి, అమరావతి: జల ప్రళయాలను తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తామని, దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 400 మి.మీ వర్షం రావడంతో బుడమేరు కట్ట తెగి ఎన్నడూ చూడని జలప్రళయం వచ్చిందని, ఈ విపత్తు నుంచి బయట పడేలా కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వరద నష్టం పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో చౌహాన్ మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయినవారిని కేంద్రం ఆదుకుంటుందన్నారు. ఫసల్ బీమా యోజన కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తామన్నారు. కేంద్ర బృందం నివేదిక వచ్చేలోగా తక్షణ సాయం అందిస్తామన్నారు. బుడమేరు గండ్లను పూడ్చడానికి కేంద్ర ఆర్మీ రంగంలోకి దిగిందని పేర్కొన్నారు.15 లక్షల క్యూసెక్కులకు పెంచాలి: అంతకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బుడమేరు, వరదప్రాంతాలతో పాటు ఫొటో ఎగ్జిబిషన్ చూశారని, వరద నష్టం గురించి అన్ని వివరాలను తెలియజేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 11.90 లక్షల క్యూసెక్కులను మాత్రమే తట్టుకుంటుందని, దీన్ని 15 లక్షల క్యూసెక్కులకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
‘శివరాజ్ సింగ్ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’
భోపాల్: లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్ సింగ్ చౌహన్) ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.లోక్‌సభ ఎన్నికల విదిశ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని జితూ పట్వారీ అన్నారు. మరోవైపు.. శివరాజ్ సింగ్ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
కేంద్ర వ్యవసాయ మంత్రిగా మాజీ సీఎం? ప్రధాని మోదీ లేఖలో స్పష్టం?
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్‌లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్‌ను ప్రశంసించారు.ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్‌కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్‌లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. -
బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా?
మధ్యప్రదేశ్. బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రం. మధ్యలో ఓ 15 నెలలు మినహాయిస్తే గత 18 ఏళ్లుగా అక్కడ బీజేపీదే అధికారం. అదే ఈసారి కొంప ముంచవ చ్చని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే ముందుజాగ్రత్తగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. తద్వారా వ్యతిరేక ఓటు కాస్తయినా తగ్గుతుందన్నది బీజేపీ ఆశ. ఇక కాంగ్రెస్ గత 20 ఏళ్లలో బీజేపీ కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే. ఏకైక పెద్ద పార్టీగా అధికారం చేపట్టినా అది 15 నెలల ముచ్చటగానే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీతో అధికారాన్ని ఒడిసిపట్టాలని కాంగ్రెస్ గట్టిగా పోరాడుతోంది. బీజేపీ కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ క్రమంలో సీఎం శివరాజ్ అనేకానేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. మరెన్నో హామీలు గుప్పించారు. ప్రచారంలో ఇరు పార్టీలూ హోరాహోరిగా తలపడ్డాయి. చివరికి ప్రచార పర్వం ముగిసింది. ఇక అందరి దృష్టీ శుక్రవారం జరగనున్న కీలక పోలింగ్‌పైనే నెలకొంది. ఈ నేపథ్యంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే. విశేషాలు... మధ్యప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 5.5 కోట్లు పురుష ఓటర్లు 2.88 కోట్లు మహిళా ఓటర్లు 2.72 కోట్లు 2008 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 143 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. శివరాజ్‌సింగ్ చౌహాన్ వరుసగా రెండోసారి సీఎం అయ్యారు. 2005లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బీజేపీకి 37.64 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.39 శాతమే వచ్చాయి. ఆ పార్టీ 71 స్థానాల్లో నెగ్గింది. ఇక బీఎస్పీ 8.27 శాతం ఓట్లతో 7 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. మరోసారి ఓటమి పాలైనా, 2003 అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన సంతృప్తి కాంగ్రెస్‌కు మిగిలింది. 2003లో ఆ పారీ్టకి కేవలం 38 స్థానాలే రాగా బీజేపీ ఏకంగా 173 సీట్లు నెగ్గింది. 2013 ఈసారి బీజేపీ ఏకంగా 44.88 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 36.38 శాతానికి పరిమితమైంది. బీఎస్పీకి 6.29 శాతం వచ్చాయి. బీజేపీ 165 సీట్లతో సత్తా చాటగా కాంగ్రెస్ కేవలం 58 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివరాజ్‌సింగ్ చౌహాన్ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతటి బీజేపీ హవాలోనూ 30 మంది మంత్రుల్లో ఏకంగా ఏడుగురు ఓటమి చవిచూడటం విశేషం! బీఎస్పీ 4 అసెంబ్లీ స్థానాలు సాధించి ఉనికి చాటుకుంది. అనంతరం 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవాయే నడిచింది. 29 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 27 నెగ్గగా కాంగ్రెస్ రెండింటికి పరిమితమైంది. 2018 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద ఏకైక పార్టీగా నిలిచింది. బీజేపీకి 109 సీట్లొచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక గమ్మత్తు చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు 40.89 శాతం ఓట్లు రాగా బీజేపీకి అంతకంటే కాస్త ఎక్కువగా 41.02 శాతం వచ్చాయి! బీఎస్పీ 5.01 శాతం ఓట్లు సాధించింది. ఒక సమాజ్‌వాదీ ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో 15 ఏళ్ల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. 29 స్థానాలకు గాను ఏకంగా 28 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అదే ఊపులో మరుసటి ఏడాదే కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి షాకిచి్చంది. 2020 మార్చిలో ప్రపంచమంతా కరోనా లాక్డౌన్ గుప్పెట్లోకి వెళ్లేందుకు కాస్త ముందు ఏకంగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు! అసంతృప్త నేత జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో వారంతా బీజేపీ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్ సర్కారు 15 నెలల్లోపే కుప్పకూలింది. బీజేపీ అధికారంలోకి రావడం శివరాజ్‌సింగ్ చౌహాన్ మరోసారి సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జరిగిన ఉప ఎన్నికల ఫలితాల అనంతరం అసెంబ్లీలో బీజేపీ బలం 128కి పెరిగితే కాంగ్రెస్ బలం 98 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. -
పొమ్మనలేక పొగ!
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుతోంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీలో ముగ్గురు కీలక నేతల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజె సింధియా, రమణ్‌సింగ్ గతంలో అన్నీ తామై ఒంటి చేత్తో ఎన్నికల భారం మోసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బీజేపీ అధిష్టానం కొత్తగా తెరపైకి తెచ్చిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని మూడు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని అసలు ఉద్దేశం వారు ముగ్గురినీ పక్కన పెట్టడమేనని చెబుతున్నారు. అక్కడ సీఎం అభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించకపోవడం అందులో భాగమేనని అంటున్నారు. శివరాజ్‌కు బై బై...! మధ్యప్రదేశ్‌లో శివరాజ్ రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా సీఎంగా ఉమాభారతి దారుణమైన పనితీరు అనంతరం బాబూలాల్ గౌర్‌కు అవకాశమిచ్చి భంగపడ్డాక చివరికి శివరాజ్‌కు ప్రభుత్వ పగ్గాలను పార్టీ అప్పగించింది. దాన్ని ఆయన రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు పార్టీని గెలిపించి 13 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రాభవానికి ముందు జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా కనిపించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి 2020లో నాలుగోసారి శివరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇమేజీ, ఆదరణ ఈ మూడు సంవత్సరాల్లో క్రమంగా తగ్గుముఖమే పడుతూ వచ్చాయి. దాంతో మోదీ–అమిత్ షా ద్వయం ఆయనపై బాగా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే ఈసారి శివరాజ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లరాదని నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందునుంచే శివరాజ్ ప్రాధాన్యం మరింత తగ్గుతూ వచి్చంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ఆ దిశగా మరింత బలమైన సంకేతాలే అని చెప్పొచ్చు. ► ఈసారి బీజేపీ నెగ్గినా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారని చెబుతున్నారు. ► లేదంటే మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ద్వారా కమల్‌నాథ్ సర్కారు పుట్టి ముంచిన జ్యోతిరాదిత్య సింధియాకు కుర్చీ దక్కినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. వసుంధరకు వీడ్కోలే..! రాజస్తాన్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు వసుంధర రాజె సింధియాదీ దాదాపు అదే పరిస్థితిలా ఉంది. భైరాన్‌సింగ్ షెకావత్ అనంతరం రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిన నాయకురాలిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ రోజుకూ రాజస్తాన్ బీజేపీలో కరిష్మా ఉన్న నాయకురాలు వసుంధరా రాజె మాత్రమే. అంతేగాక ప్రజాదరణ విషయంలో ఇప్పటికీ ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఆమెకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెస్తున్న అర్జున్‌రామ్ మెఘ్వాల్, సతీశ్ పునియా, సీపీ జోషీ, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా తదితరులెవరూ సామాన్య ప్రజానీకంలో మంచి ప్రజాదారణ ఉన్న నాయకులు కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వారికి పెద్ద ఆదరణ లేదు. అయినా సరే, బీజేపీ ఈసారి వసుంధరకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎన్నికల బరిలోకి దిగింది! కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఆయన మంత్రివర్గ సహచరులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు ప్రధానిగా మోదీ కరిష్మా తోడై సులువుగా గెలుస్తామని నమ్ముతోంది. అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుకోవడం కష్టమేమీ కాదనే భావనలో ఉంది. రమణ పర్వానికి తెర! కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరిస్థితి మరీ ఆశావహంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దూకుడు మీదున్నారు. రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల హామీల సమర్థ అమలు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్‌సింగ్‌ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఫలితంగా బీజేపీకి ఒకరకంగా రాష్ట్రాస్థాయి కీలక నాయకత్వమంటూ లేకుండా పోయింది. ఏదేమైనా రాష్ట్రంలో పారీ్టకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే మోదీ–అమిత్‌షా ద్వయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ కేవలం మోదీ కరిష్మా మీదే భారం వేసి బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ, అనంతరం కర్ణాటకలోనూ ఇదే ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న వైనాన్ని తలచుకుని బీజేపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ
భోపాల్: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధిలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. -
వలంటీర్ వ్యవస్థ బాగుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఇంటి వద్దే ప్రభుత్వ పథకాలు, సేవలను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించడం, 2.62 లక్షల మందికి గ్రామస్థాయిలో సేవ చేసే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. దీనిపై తక్షణం అధ్యయనం నిర్వహించి నివేదిక సమరి్పంచాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. సీఎం శివరాజ్‌సింగ్ ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ లోకేష్ నవరత్నాలు, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ గురించి ‘సాక్షి’ ప్రతినిధి నుంచి వివరాలను సేకరించారు. మరి కొద్ది నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి భోపాల్‌లోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం శివరాజ్‌సింగ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో అమలవుతున్న పలు పథకాల గురించి ఆరా తీశారు. ఆ వివరాలివీ.. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 500కిపైగా సేవలందించడం, ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున నియమించడం వినూత్నం, అభినందనీయం. యువతకు స్థానికంగా తోటివారికి సేవలందించే అవకాశం లభిస్తుంది. ► ఎలాంటి పడిగాపులు లేకుండా ఇంటివద్దే రేషన్ సరుకులు అందించడం కూడా బాగుంది. ► ప్రజాస్వామ్యంలో అందరినీ స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ మరింత జోరుగా మా రాష్ట్రానికి రావచ్చు. అయినా తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి దేశం మొత్తానికి తెలుసు. -
ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: హిందీలో వైద్య విద్యను అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఇకపై ప్రిస్కిప్షన్లపై తొలుత ‘శ్రీహరి’ అని రాసి తర్వాత మందుల పేర్లు రాయొచ్చన్నారు. ‘‘పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటి?’’ అన్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్‌లో హిందీలో వైద్య పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు. -
‘సూపర్ మామ్’ కాలర్‌వాలీ ఇక లేదు.. సీఎం చౌహాన్ విచారం
సియోని (మధ్యప్రదేశ్): ఆవు, గేదె లాంటివి తమ జీవితకాలంలో అధికసంఖ్యలో పిల్లలను కంటే దాని యజమానుల ఆనందమే వేరు. సంతాన లక్ష్మి, అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది ఏకంగా 29 పిల్లల్ని కంటే. ఈ పులి అదే చేసింది. 29 పులి పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వు (పీటీఆర్)కు గర్వకారణంగా నిలిచిన ఈ విఖ్యాత పులి పేరు ‘కాలర్‌వాలీ’. ఈ సూపర్ మామ్ 17 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూసింది. పులి సాధారణ జీవితకాలం 12 ఏళ్లు. కాలర్‌వాలీ దానికి మించి ఐదేళ్లు బతికి వృద్ధా్దప్య సమస్యలతో మరణించింది. చివరిసారిగా ఈనెల 14న సందర్శకులకు కనిపించిన కాలర్‌వాలీ చాలా బలహీనంగా ఉందని, వారం రోజులుగా దాని ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని పెంచ్ టైగర్ రిజర్వ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే కాన్పులో ఐదు పిల్లలు... కాలర్‌వాలీ మొత్తం ఎనిమిది కాన్పుల్లో 29 పులి పిల్లలకు జన్మనివ్వగా... ఇందులో 25 బతికాయి. 2008లో మొదటిసారిగా తల్లి అయిన కాలర్‌వాలీ మూడు పిల్లలను కన్నది. దురదృష్టవశాత్తు ఇందులో ఒక్కటీ బతకలేదు. 2010 అక్టోబరులో ఒకే కాన్పులో ఐదు పిల్లలకు (నాలుగు మగ కూనలు, ఒక ఆడపులి పిల్ల) జన్మనిచ్చింది. చివరిసారిగా 2018 డిసెంబరులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఈ మహాతల్లి కడుపున పుట్టిన పులి పిల్లల సంఖ్య 29కి చేరింది. అడవిలో పులుల సంఖ్య గణనకు, వాటి ప్రవర్తనను గమనించేందుకు, జాడను కనిపెట్టేందుకు రేడియో సిగ్నల్స్‌ను పంపే పట్టీలకు పులుల మెడకు కడతారు. 2008లో కట్టిన పట్టీ పనిచేయకపోవడంతో 2010 మరో పట్టీని ‘టి15’గా పిలిచే ఈ పులికి కట్టారు. దాంతో దీనికి కాలర్‌వాలీ అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్‌లో 526 పులులున్నాయి. 2018లో అత్యధిక పులులున్న రాష్ట్రంగా అవతరించిన మధ్యప్రదేశ్ భారతదేశపు ‘టైగర్ స్టేట్’గా గుర్తింపు పొందింది. కాలర్‌వాలీ పెంచ్ రిజర్వు పెద్ద ఆకర్షణగా ఉండేది. ‘సూపర్ మామ్ కాలర్‌వాలీకి నివాళులు. 29 పిల్లలతో మధ్యప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచింది. అని రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఓ ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. मप्र को टाइगर स्टेट का दर्जा दिलाने में महत्वपूर्ण भूमिका निभाने वाली, मध्यप्रदेश की शान व 29 शावकों की माता @PenchMP की ‘सुपर टाइग्रेस मॉम’ कॉलरवाली बाघिन को श्रद्धांजलि। पेंच टाइगर रिजर्व की 'रानी' के शावकों की दहाड़ से मध्यप्रदेश के जंगल सदैव गुंजायमान रहेंगे। pic.twitter.com/nbeixTnnWv — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 16, 2022 -
వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు..
సాక్షి, సిద్దిపేట: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేదని నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని.. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు ఉంది. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం పదవి పొందిన శివరాజ్‌కి సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. సీఎంగా నాలుగేళ్లలో ఏం సాధించావు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించింది’’ అంటూ దుయ్యబట్టారు. వ్యాపం సంగతేంటి? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం జరిగింది. ఆ కేసులో ఎవరికైనా శిక్ష పడిందా..? విచారణ నీరుగార్చేందుకు మనుషులనే మీరు చంపేశారు. ఈ విషయంలో మీ కుటుంబం మీద, మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అలాంటి మీరా తెలంగాణలో అవినీతి ఉందంటూ ఆరోపణలు చేసేది అంటూ దుమ్మెత్తిపోశారు. రాజకీయ దురుద్దేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా చెప్పారు. విమర్శలు చేసే ముందు ఓ సారి నిజానిజాలు పరిశీలించుకోవాలని’’ హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగాలు రావొద్దా ? 317 జీవో రద్దు చేయాలంటున్నారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా ? ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడి వారికి ఉద్యోగాలు రావద్దన్నట్టుగా బీజేపీ కుట్ర చేస్తోందంటూ హరీశ్ మండిపడ్డారు. -
అసెంబ్లీలో ‘పప్పూ’ ‘దొంగ’ పదం నిషేధం
భోపాల్: వాస్తవంగా నాలుగు నెలలకోసారి చట్టసభల సమావేశాలు జరగాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయాలతో చట్టసభల ప్రాధాన్యం తగ్గిస్తున్నాయి. ఒకవేళ సమావేశాలు నిర్వహిస్తే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టు ఒక్కనాడు కూడా సక్రమంగా జరగవు. ఈ సమావేశాల్లో వాగ్వాదాలు ఏర్పడి ఒక్కోసారి తీవ్రస్థాయిలో వాదనలు ఉంటాయి. ఈ సమయంలో పచ్చిబూతులు కూడా వస్తుంటాయి. స్పీకర్ వాటిని వినలేకపోతుంటారు. తూక్కెత్తా అంటే తూక్కెత్తా అంటూ మాటల దుమారం ఏర్పడుతుంది. ఇలా సభలో అన్‌పార్లమెంటరీ భాష వినియోగం అధికమవుతుండడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సభలో కొందరు సభ్యులు పలికిన పదాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఆ విధంగా నిషేధించిన పదాల వివరాలతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో పప్పూ అనే పదం కూడా నిషేధం ఉండడం గమనార్హం. ఈ పదంతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఒకరు గుర్తుకు వస్తుంటారు. తమ నేతను ఆ పదంతో సంబోధిస్తున్నారనే ఉద్దేశంతో ఈ పదాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. మొత్తం 38 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 1,161 పదాలు నిషేధంలో ఉన్నాయి. దొంగ, చెడిన, అవినీతిపరుడు, నియంత, గూండా, వ్యభిచారి, అబద్ధాలకోరు, మామ తదితర పదాలు నిషేధం. ఈ పుస్తకాన్ని ఆదివారం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సోమవారం నుంచి ఈ పుస్తకాలను అసెంబ్లీ సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ప్రారంభమైన వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులు సంయమనంతో సభలో పాల్గొనేలా ఆ పుస్తకం మార్పు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విలువలతో విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. -
‘ఆ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ విమర్శించారు. సోమవారం ఆయన నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ‘‘గతంలో శరద్‌పవార్ నాకు లేఖ రాశారు. వ్యవసాయ మార్కెట్ యాక్ట్‌లో సవరణలు తేవాలని లేఖలో రాశారు. సోనియా, రాహుల్, శరద్‌పవార్ ప్రైవేట్ మార్కెట్ల ఓపెన్‌కు అనుకూలంగా మాట్లాడారు.ఇప్పుడు బీజేపీ అదే నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకిస్తున్నారని’’ ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవేనని శివరాజ్‌సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. -
దివ్యసాకేతాలయంలో మధ్యప్రదేశ్ సీఎం పూజలు
శంషాబాద్ రూరల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు శుక్రవారం ముచ్చింతల్‌లోని దివ్యసాకేతాలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చౌహాన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం దివ్యసాకేతాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న శ్రీ భగద్రామానుజుల వారి సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆలయంలో వంట పనులు చూసుకునే మనోజీ కూతురు ఆకాంక్ష మిశ్ర పదో తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించడంపై సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు దంపతులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం
భోపాల్ : పదో తరగతి పరీక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్ జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రద్దైన పరీక్షలకు సంబంధించి ‘పాస్’ రిమార్క్తో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు.(చదవండి : భిన్నంగా లాక్డౌన్ 4.0) మార్చి 19 నుంచి లాక్డౌన్ ముగిసేవరకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. మరోవైపు మిగిలిపోయిన ఇంటర్ పరీక్షలను మాత్రం జూన్ 8 నుంచి జూన్ 16 మధ్యలో నిర్వహించాలని మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసకుంది. కాగా, మధ్యప్రదేశ్‌లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత.. కరోనా లాక్‌డౌన్‌తో మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. (చదవండి : 60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్) -
కరోనా కాలంలో కేబినెట్ విస్తరణ
భోపాల్ : ఓ వైపు మధ్యప్రదేశ్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన ముగ్గురు తిరుగుబాటు నేతలకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కాగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్ సర్కార్ కూలిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా ఐదుగురు మంత్రులకు అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1450కి చేరింది. వైరస్ కారణంగా 78 మంది మృతి చెందారు. -
బలపరీక్ష నెగ్గిన చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు హాజరుకాలేదు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ దేవ్డా స్పీకర్‌గా వ్యవహరించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలోని ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు దేవ్డా ప్రకటించారు. బహుజన్ సమాజ్‌పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు సురేంద్ర సింగ్, విక్రమ్‌సింగ్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ బలపరీక్షలో మద్దతు తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్ష అనంతరం సభను ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు దేవ్డా ప్రకటించారు. సభకు ముందు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. -
మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆయనతో సోమవారం రాత్రి 9 గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్ కూడా హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలెవరూ హాజరు కాలేదు. మధ్యప్రదేశ్‌లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. శాసనసభాపక్ష నేతగా.. సోమవారం సాయంత్రం చౌహాన్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీనియర్ బీజేపీ నేత గోపాల్భార్గవ శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించగా మరి కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను బలపరిచారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.. చౌహాన్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగాప్రకటించారు. అనంతరం చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు విక్టరీ గుర్తును చూపిస్తూ కనిపించారు. కేవలం చౌహాన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో వచ్చే వారంలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 107 మంది ఎమ్మెల్యేలతో.. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటంతో, ఆయన వెంట ఉన్న 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. 230 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించగా, 22 మంది రాజీనామా చేశారు. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. -
ఎమ్మెల్యేలను నిర్బంధించవద్దు
భోపాల్/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేదికగా మధ్యప్రదేశ్ రాజకీయం బుధవారం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి. కమల్‌నాథ్ ప్రభుత్వం మనుగడ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని కోర్టు అంగీకరిస్తూనే.. బలపరీక్షను నిర్ణయించే అసెంబ్లీ కార్యకలాపాల్లోకి తాము రాదల్చుకోలేదని స్పష్టంచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారని ప్రశ్నించింది. ‘రెబెల్ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాలా లేదా అనేది వారి ఇష్టం. వారిని నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వారు స్వేచ్ఛగా ఉన్నారా లేదా అనేది మేము చూడాలి. వారిని నిర్బంధంలో ఉంచకూడదు’అని స్పష్టంచేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను గురువారం జడ్జి చాంబర్లో హాజరుపరుస్తామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. వారు నిర్బంధంలో లేరని ఎలా నమ్మాలో చెప్పాలంటూ చౌహాన్ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీని అడిగింది. అయితే వారు స్వచ్ఛందంగానే బెంగళూరులో ఉన్నారని, నిర్బంధంలో లేరని ఆయన సమాధానం ఇచ్చారు. రెబెల్ ఎమ్మెల్యేల లాయర్ మణిందర్ సింగ్ కల్పించుకొని, స్పీకర్ ముందుకు తమ ఎమ్మెల్యేలు రాబోవడం లేదని, కొందరి రాజీనామాలను స్వీకరించి మరికొందరివి ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచిందని, వారిని కలిసేందుకు అనుమతించేలా కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయగా.. రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేగానీ.. కాంగ్రెస్ నేతలతో కలవబోమని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాదించారు. బీజేపీ హిట్లర్ పోకడ: కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న∙రిసార్ట్ వద్ద ఆ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ ఆందోళనకు దిగగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయడం బీజేపీ హిట్లర్ తరహా నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని కొనియాడారు. -
ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు
భోపాల్ : రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సర్కార్ సంకటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల మేరకు సోమవారం శాసనసభలో విశ్వాసపరీక్ష జరుపనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్ చేరుకున్నారు. జ్యోతిరాదిత్యా సింధియా అనుకూల వర్గంగా భావిస్తున్న వీరంతా బెంగళూరులోని రిసార్టులో ఇన్నిరోజులు గడిపారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ వెంట ఉన్న శాసన సభ్యులను సీఎం కమల్‌నాథ్ జైపూర్ క్యాంపుకు తరలించారు. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో బీజేపీ భేరసారాలు నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. (విశ్వాస పరీక్షకు సిద్ధం) సోమవారం అసెంబ్లీలో స్పీకర్ నర్మద ప్రసాద్ ప్రజాపతి సమక్షంలో బలపరీక్ష జరుగనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కమల్‌నాథ్ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి.. బలపరీక్షపై అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చర్చించారు. బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ భోపాల్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమకు సింధియాపై అభిమానం మాత్రమే ఉందని, ఆయనతో పాటు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఓ తిరుగుబాటు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేకిత్తిస్తున్నాయి. దీంతో 22 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభిస్తుందని భావించిన కమళ దళానికి భంగపాటు ఎదురైంది. (ఆ 22 మందికి నోటీసులు) మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్న ఎస్పీ, బీఎస్సీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇదివరకే సంప్రదింపులు జరిపి.. వారిని బీజేపీ గూటికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరుగురు మంత్రులను కమల్‌నాథ్ ఇదివరకే మంత్రిమండలి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు. కాగా మొత్తం 228 సభ్యులు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే 22 మంది కాంగ్రెస్ సభ్యుల రాజీనామాతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. (జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!) -
దమ్ముంటే ఆ పనిచేయండి : ఎంపీ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని భీరాలు పలుకుతున్న బీజేపీ నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇండోర్‌లో శనివారం జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్-2019 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘మా ప్రభుత్వాన్ని కూల్చుతామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, కైలాష్ విజయ్వార్గియా పలు సందర్భాల్లో హెచ్చరించారు. మరి అంత దమ్ముంటే ఎందుకు ఆగుతున్నారు. మాపై కనికరం చూపుతున్నారా. ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు కాబట్టే అధికారంలో ఉన్నాం. కార్యకర్తల్లో జోష్ పెంచడానికే బీజేపీ నేతలు పసలేని మాటలు చెప్తున్నారు’అన్నారు.మరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలెందుకు ఆదరించలేదన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర, జాతీయ రాజకీయాలు ఒకేలా ఉండవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరగాలని లేదు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే, బీజేపీ ఒక్కటే జాతి కోసం పనిచేస్తున్నట్టు కాదు’అన్నారు. -
ఇలాంటి సీఎంను చూడలేదు
సాక్షి, హైదరాబాద్: ‘నేను 15 ఏళ్లు సీఎంగా ఉన్నాను. సచివాలయానికి వెళ్లని ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రముఖ్ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. బుధవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. అంతకంటే ముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెక్రటేరియట్‌కే వెళ్లని సీఎంకు కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ కావాలట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజల సంక్షేమంపై దృష్టి ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. అంతా టీంగా పనిచేద్దామని ప్రధాని నరేంద్రమోదీ నీతి ఆయోగ్ సమావేశం పెడితే, ఎంతో ముఖ్యమైన ఆ భేటీకి సీఎం కేసీఆర్ హాజరుకాలేదన్నారు. తెలంగాణలో కుటుంబపాలనకు ప్రజలు స్వస్తి పలుకుతున్నారని, అందులో భాగంగానే నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపించారన్నారు. తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు, ఒక సీటు వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం ఓట్లతో నాలుగుసీట్లు వచ్చాయన్నారు. జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు.. జూలై 6వ తేదీన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదినాన్ని పురస్కరించుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆగస్టు 11వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 8 వేల శక్తి కేంద్రాల్లో 8 వేల మంది విస్తారక్కులు వారం రోజులపాటు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అందరినీ కలుస్తామని, పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. సమావేశానికి అ«ధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాలను మధ్యప్రదేశ్‌లో ఎప్పుడో అమలు చేశారన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీమంత్రి బండారు దత్రాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
'బుధ్నీ' మే సవాల్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత నియోజకవర్గం బుధ్నీలో నువ్వా నేనా అన్నట్టుగా రసవత్తర పోటీకి తెరలేచింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలమైన అభ్యర్థి బరిలో లేకపోవడంతో చౌహాన్ విజయం నల్లేరు నడకలా సాగింది. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓబీసీ నాయకుడు అరుణ్ యాదవ్‌ను బరిలోకి దింపడంతో చౌహాన్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో నెలకొన్న రైతు సమస్యలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగా లేకపోవడం వంటి సమస్యలతో చౌహాన్‌కు విజయం అంత సులభంగా దక్కేలా కనిపించడం లేదు. మామ మంచోడే.. కానీ! శివరాజ్ సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గత పదమూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చాలా చేశారు. ఇప్పుడు అక్కడ విద్యుత్ కోతలు లేనే లేవు. అద్దంలాంటి రోడ్లు తళతళలాడిపోతున్నాయి. బుధ్నీ నుంచి ఎవరు సీఎం కార్యాలయానికి పని నిమిత్తం వచ్చినా వెంటనే ఆ పని జరిగేలా స్వయంగా చౌహానే చూస్తారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రోజుకి 20 గంటలు కష్టపడతారు. ఇవన్నీ చౌహాన్‌కు కలిసొచ్చే అంశాలే. అయితే కొన్ని పల్లెల్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో వైద్య చికిత్స కోసం కొన్ని పల్లెల్లో ప్రజలు మైళ్లకి మైళ్లు నడవాల్సి వస్తోంది. పక్కనే నర్మదా నది ప్రవహిస్తున్నప్పటికీ ఎన్నో పొలాలకు నీరు అందడం లేదు. తాను రైతు బిడ్డనని ఎన్నికల ప్రచారంలో పదే పదే చౌహాన్ గుర్తు చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో రైతులే చౌహాన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సాగునీరు లేక, పంటలకు మద్దతు ధర రాక ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక నర్మద నదిలో ఇసుక మాఫియాకు అండగా ఉంటారన్న ఆరోపణలు చౌహాన్‌పై వ్యతిరేకతను పెంచాయి. యాదవ ఓట్లపై నమ్మకంతో.. దిగ్విజయ్ సింగ్ హయాంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన సుభాష్ యాదవ్ కుమారుడే అరుణ్ యాదవ్ . 46 ఏళ్ల అరుణ్ యాదవ్.. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా పని చేశారు. ఇటీవలే అరుణ్ యాదవ్ ను తప్పించి కమల్‌నాథ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో అరుణ్ యాదవ్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎంపై యాదవ్‌ను నిలబెట్టింది. ఎందుకంటే బుధ్నీ నియోజకవర్గంలో చౌహాన్ సామాజికవర్గానికి చెందిన కిరార్ ఓట్లరు ఎంత మంది ఉన్నారో యాదవులు కూడా అంతే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం యాదవ్‌ను ఏరికోరి రంగంలోకి దింపింది. నర్మద నది తీరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించిన అరుణ్ యాదవ్ చౌహాన్ సర్కార్‌ను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇసుక మాఫియాకు చౌహాన్ కుటుంబం అండగం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. యాదవ్ పీసీసీ చీఫ్ పదవిని లాగేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను బలిపశువుని చెయ్యడానికే తనపైన నిలబెట్టిందంటూ శివరాజ్ చౌహాన్ దీటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రచారం భాబీదే! ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. అలాగే చౌహాన్ విజయాల వెనుక ఆయన భార్య సాధనా సింగ్ చౌహాన్ కృషి ఎంతైనా ఉంది. బుధ్నీ నియోజకవర్గం ప్రజలు ఆమెను ప్రేమగా భాబీ అని పిలుస్తారు. చౌహాన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో సాధన బుధ్నీపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరిస్తారు. ‘సాధన ఎన్నడూ సీఎం భార్యగా ప్రవర్తించలేదు. అందరినీ సమానంగా చూస్తారు. మాకే సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు’ అని స్థానిక మహిళలు చెబుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఆమె ఒక అధికార కేంద్రంగా ఎదిగారు. చౌహాన్ గత కొన్నేళ్లుగా తన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోయినా సాధన ఆ లోటు తెలీకుండా వ్యవహారాలను చక్కచెట్టుకుంటూ వస్తున్నారు. కుమారుడు కార్తికేయ చౌహాన్ కూడా నియోజకవర్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. చౌహాన్ వెంటే నీడలా ఉంటూ సాధనా అన్ని అంశాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. బాబూలాల్ గౌర్‌ను సీఎంగా తప్పించి చౌహాన్‌ను సీఎంను చేసిన తర్వాత 2006లో బుధ్నీలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనే తొలిసారిగా సాధన కనిపించారు. అప్పట్నుంచి భర్తను గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాలపైనే మోశారు. సాధనకూ గ్రహణశక్తి చాలా ఎక్కువ. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా తొందరగా పట్టు సాధించారు. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, వద్దనుకున్నా నిర్ణయం ఆమెదే. ఇక అధికారుల బదిలీలు కూడా ఆమె కనుసన్నల్లోనే సాగుతాయన్న ఆరోపణలూ ఉన్నాయి. సాధనను పార్టీ కార్యకర్తలు హాఫ్ చీఫ్ మినిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అదే ఇప్పుడు విపక్షాలకు ప్రచారాస్త్రంగా కూడా మారింది. సాధన అత్యుత్సాహంతో ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం తమకు మేలే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన వ్యాపమ్ సహా ఎన్నో కుంభకోణాల్లో సాధన ప్రమేయమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సారి కూడా చౌహాన్ విజయాన్ని ఒక సవాల్‌గా స్వీకరించిన సాధన తాను ఏదైనా సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో చౌహాన్‌ను గెలిపించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో చౌహాన్ 84వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 20 మంది మంత్రుల మోహరింపు ముఖ్యమంత్రి భార్య సాధనా సింగ్ చౌహాన్, ఆయన కుమారుడు కార్తికేయ చౌహాన్ కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. అయితే చాలా చోట్ల వారు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించరా.. అంటూ ప్రచార సభల్లో మహిళలు నిలదీస్తున్నారు. చౌహాన్‌ను మామా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే నియోజకవర్గ ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఎదురు కావడంతో చౌహాన్ ఏకంగా 20 మంది మంత్రుల్ని రంగంలోకి దింపారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం చౌహాన్ బుధ్నీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1990 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత లోక్‌సభకు వెళ్లిపోయారు. తిరిగి 2003 అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్‌పైన పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్లు తిరక్కుండానే ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇక 2008 ఎన్నికల నాటికి తన పట్టును పెంచుకొని 41 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2013 ఎన్నికల నాటికి చౌహాన్ ఇమేజ్‌కు తిరుగే లేకుండా పోయింది. కాంగ్రెస్ నేత మహేంద్ర సింగ్ చౌహాన్‌పై 84వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు. -
బలమే బలహీనతై
మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అన్నిరంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర పగ్గాలు తీసుకున్న సమయంలో ఉన్న పప్పు అని ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామ అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికి ఎదిగిన చౌహాన్ గత రెండు ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే కనబడుతోంది. వరుసగా నాలుగోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌహన్‌కు బలం అనుకున్న అంశాలే ఇప్పుడు బలహీనతలుగా మారుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, రైతులు శివరాజ్‌పై తిరుగుబాటు బావుటీ ఎగరేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు.. మధ్యప్రదేశ్‌లో పార్టీకి నష్టం చేస్తాయనే భావన వినిపిస్తోంది. ఈ చట్ట సవరణలతో అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు సొంతం పార్టీలు పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఏపీఏకేఎస్ ఏర్పాటు మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలే కాదు, ప్రభుత్వంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం వారిలో అసంతృప్తిని పెంచింది. దీంతో వారు ఓబీసీలతో చేతులు కలిపి సామాన్య పిఛ్డా ఔర్ అల్పసంఖ్యాక వర్గ కర్మచారి సంస్థ (ఎస్ఏపీఏకేఎస్) ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఓటర్లలో అగ్రవర్ణాలు 15%, ఓబీసీ ఓటర్లు 37%. గత 30 ఏళ్లుగా బీజేపీకే మద్దతుగా ఉన్నాయి. దళితుల్లో అసంతృప్తి బీజేపీ ప్రభుత్వం దళితులకు పలు పథకాలు తీసుకొచ్చినా.. రోహిత్ వేముల ఉదంతం, గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులపై దాడుల వంటి ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్ ఓటర్లలో 16% దళితులే. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ సమయంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా నిరసన స్వరాలు వినిపించాయి. జై ఆదివాసీ యువ సంఘటన్ మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ ఓటర్లు 23%. గత రెండు సార్లు వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎస్టీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఆదివాసీల సంక్షేమం కోసం డాక్టర్ హీరాలాల్ ఏర్పాటు చేసిన జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) బీజేపీకి పక్కలో బల్లెంలా మారుతోందనే అంచనాలున్నాయి. ఒక సామాజిక సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన జేఏవైఎస్తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అన్నదాతల ఆగ్రహం శివరాజ్‌సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. అయినా ఆ రైతులే ఆయనకు వ్యతిరేకంగా మారారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది మందసౌర్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించడం బీజేపీకి తీవ్ర నష్టం చేయనుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడంతో రైతులు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారు. కేంద్రంపై వ్యతిరేకత గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీ మ్యాజిక్ ప్రధాన కారణం. యూపీఏపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ ఈ సారి కేంద్రంపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అంచనా. ఈ వ్యతిరేకత ఈ సారి చౌహాన్‌కు నష్టం చేకూరుస్తుందంటున్నారు. బలాలు ♦ ప్రజలతో మమేకం కావడం ♦ పని రాక్షసుడని పేరు ♦ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బలహీనతలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ♦ రైతుల్లో అసంతృప్తి ♦ వ్యాపమ్ సహా పలు కుంభకోణాలు ♦ బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు చెక్ పెట్టగలరా? చౌహాన్ జోరును ఆపేందుకు విపక్షం విశ్వప్రయత్నం ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భరోసా పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి సొంత ఇమేజ్‌తో మళ్లీ గెలవాలని శివరాజ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రవేశపెట్టిన పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అటు, ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ నేతల గొప్పదనమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరుపార్టీల్లోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో అగ్రనేతలే తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటుంటే.. టికెట్ల పంపిణీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ప్రజలతో ఆప్యాయంగా మామా అనిపించుకుంటున్న చౌహాన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాదంలో కాషాయ నేతలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్ నాయకులెందరో వివాదాల్లో ఇరుక్కున్నారు. నరోత్తమ్ మిశ్రా పెయిడ్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాటవ్ హత్య కేసులో.. లాల్ సింగ్ ఆర్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌పాల్ సింగ్.. ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్ను చెరిపేస్తున్నారు. ఇతర సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్, కుసుమ్ మహ్దెలేలు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. బహిరంగంగానే పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యాఖ్యలుచేశారు. తన కోడలు కృష్ణకు టిక్కెట్ ఇచ్చిన తర్వాత బాబూలాల్ గౌర్ శాంతించారు. సర్తాజ్ సింగ్ ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు, పార్టీకి గట్టిపట్టున్న ఇండోర్, విదిశ, మహూ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీలో అంతర్గత పోరు పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, పార్లమెంటు స్పీకర్ సుమిత్ర మహాజన్‌లకు పడడం లేదు. కాంగ్రెస్ విశ్వప్రయత్నం ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యం. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామిక రంగం ఇలా అత్యధిక జనాభా ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలు పన్నుతోంది. ఆ ముగ్గురిపై నమ్మకం కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కానీ మధ్యప్రదేశ్‌లో పరిస్థితి వేరు. ఒక్కరిద్దరు కాకుండా ముగ్గురు బలమైన నేతలుండటం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. ఒక్కో నాయకుడికి ఒక్కో ప్రాంతంలో పట్టుండడం విశేషం. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది. పీసీసీ చీఫ్ కమల్‌నాథ్‌కు మహాకౌశల్ ప్రాంతంలో తిరుగేలేదు. ఇక ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో మంచి ఇమేజ్ ఉంది. టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ప్రాంతీయ, కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకొని నేతలందరూ ఇంచుమించుగా సంతృప్తి చెందేలా టిక్కెట్లు ఇచ్చింది. -
ఆ 5 నగరాలే కీలకం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేలో అంచనా వేసింది. సాధారణంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్‌లు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకం. ఈ ఐదు నగరాల్లో ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే అంత ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. ఈసారి బీజేపీ గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజారిటీ బాగా తగ్గుతుందనీ, 230 సీట్లున్న శాసన సభలో బీజేపీ 122, కాంగ్రెస్ 95 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. 2013 ఎన్నికల్లో బీజేపీకి 165, కాంగ్రెస్‌కు 65 సీట్లు వచ్చాయి. ఈ నెల 28న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉండే సీట్లలో 70శాతం బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనీ, కాంగ్రెస్ 27శాతమే దక్కించుకోగలదని సర్వే వెల్లడించింది. చౌహాన్ ముఖ్యమంత్రి కావాలని 40.11% ఓటర్లు కోరుకోగా, కమల్‌నాథ్‌కు 20.32%, జ్యోతిరాదిత్య సింధియాకు 19.65% మద్దతు పలికారు. ప్రాంతాల వారీగా చూస్తే చంబల్ మినహా మల్వా నిమార్, బఘేల్ఖండ్,భోపాల్, మహాకౌశల్లలో ఇతర పార్టీల కంటే బీజేపీదే పైచేయిగా ఉంది.సర్వేలో భాగంగా 77 నియోజకవర్గాల్లో 9240 మంది అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు నగరాలు... భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్‌లు రెండు పార్టీలకూ కీలకం. ఈ ఐదు నగరాల్లో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంతవరకు ఈ నగరాలు బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈ కోటల్ని బద్దలు కొట్టగలిగితేనే చౌహాన్ అధికారంలోకి రాకుండా నిరోధించగలుగుతుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నగరాల్లో బీజేపీదే పై చేయి. గత ఎన్నికల(2013)విషయానికి వస్తే ఇక్కడున్న 36 సీట్లలో బీజేపీ 30 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇవి కాకుండా సత్నా, సాగర్ వంటి వాణిజ్యప్రధాన ప్రాంతాలు కూడా పార్టీ గెలుపులో కీలక భూమిక వహిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి 51 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సీట్లే కాక ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇటీవలి సర్వేలో పట్టణాల్లో బీజేపీ ఓట్ల శాతం 40 నుంచి 45 శాతానికి పెరిగిందని, కాంగ్రెస్ ఓట్ల శాతం 25–35 శాతాల మధ్య ఊగిసలాడుతోందని వెల్లడయింది. ఓట్ల శాతంలో తక్కువ తేడా ఉన్నా సీట్ల సంఖ్యలో తేడా వస్తుంది. ఈ కారణంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందని టైమ్స్ నౌ తేల్చింది. ఏబీపీ–సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42శాతం ఓట్లు, బీజేపీకి 40శాతం వస్తాయని అంచనా వేసింది. ఈ తేడాను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే 117 సీట్లు గెలుచుకోవడం కష్టం కాదని ఆ సర్వే పేర్కొంది. అయితే, ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టి ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుందనీ, అదంత సులభం కాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, వ్యవసాయ సంక్షోభం, బీజేపీ ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఉపయోగించుకుని, విభేదాల్ని తాత్కాలికంగానైనా పక్కనపెట్టి గట్టి అభ్యర్ధులను పోటీకి దింపితే–ముఖ్యంగా ఈ ఐదు నగరాల్లో– ఫలితాలను తిరగరాసే అవకాశాలు కాంగ్రెస్‌కు ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది. -
నాణేలు.. ‘పది’వేలు
మధ్యప్రదేశ్‌లో నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్‌గా 10 వేల ‘రూపాయి’ బిల్లలు(నాణేలు) చెల్లించి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు దీపక్ పవార్ అనే అభ్యర్థి. ఇండోర్–3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవార్ నామినేషన్ పత్రాలతోపాటు ఓ సంచీలో ఒక రూపాయి నాణేలు పదివేలు తీసుకువచ్చారు. వీటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక చివరకు...ఐదుగురు సిబ్బందితో దాదాపు 90 నిమిషాల పాటు నాణేలు లెక్కించారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశ్వత్ శర్మ మాట్లాడుతూ ‘నామినేషన్‌కు అఖరు తేదీ కావడంతో పవార్ చెల్లించిన 10 వేల రూపాయి బిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మా సిబ్బంది లెక్కించారు. నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించిన రశీదును ఆయన ఇచ్చాం’ అన్నారు. ఇంతవరకు ఎన్నికల నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎవరూ ఇలా రూపాయి నాణేలను ఇవ్వలేదన్నారు. పదివేల రూపాయి నాణేలు ఇవ్వడంపై అభ్యర్థి దీపక్ పవార్ మాట్లాడుతూ ..‘నేను విరాళాల ద్వారా స్వీకరించిన మొత్తం రూపాయి నాణేలే. అందుకే అవే సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాను’ అని చెప్పకొచ్చారు. ‘బుధ్నీ’కా రాజా! మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా బుధ్నీ నియోజవకర్గం.. ఆ రాష్ట్ర సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌కు పెట్టని కోట. 1990లో ఇక్కడినుంచే ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్‌పేయి తప్పుకోవడంతో ఖాళీ అయిన విదిశ ఎంపీ స్థానం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1996, 1992, 1999, 2004ల్లో విదిశ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2006లో బుధ్నీ నుంచే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్‌కుమార్ పటేల్‌పై 36వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008లో (41వేల మెజారిటీ), 2013లో (84వేలు)నూ బుధ్నీలో సాధించిన ఘన విజయంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. -
s/o సన్నాఫ్..
మధ్యప్రదేశ్ వారసత్వానికి ఒక లక్షణం ఉంది. అదే పేరు, అదే వంశం,.. ఉంటే చాలు ఏ కాస్త క్వాలిటీ ఉన్నా రాణించేయొచ్చు. రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ. మధ్యప్రదేశ్‌లో మరీ ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బడా నేతలంతా పొలిటికల్ పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు. మరి ఈ వారసుల్లో మహావృక్షంగా మారేవారెవరు? మర్రిచెట్టు కింద మొక్కలా మిగిలేవారెవరు? చూడాలి.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి వారసుల జోరు ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ వరకు అన్ని కుటుంబాల్లో పుత్రోత్సాహం పొంగిపొరలుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసు రాకపోయినా ఈ నయా లీడర్లు వచ్చే ఎన్నికలకు పునాదిగా తండ్రుల నియోజకవర్గాల్లో వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 55 శాతం వరకు 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఉంటే, ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది వృద్ధులే. అందుకే వారసుల్ని రంగంలోకి దింపి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు నేతలు. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మధ్యప్రదేశ్ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, మనవలు ఇప్పటికీ వంశం పేరు చెప్పుకునే ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారు. రవిశంకర్ శుక్లా కుమారుడు శ్యామ్ చరణ్ శుక్లా, మనవడు అమిత్ శుక్లా, మోతీలాల్ ఓరా కుమారుడు అరుణ్ ఓరా, దిగ్విజయ్‌సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్, దివంగత కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్, ఇలా ఎందరో ఉన్నారు. వీళ్లంతా తండ్రులు, తాతల పేరు చెప్పుకునే రాజకీయాల్లో రాణించారు. ఒకసారి బలపడ్డాక క్రమంగా లీడర్లుగా స్వీయ ప్రతిభ చూపుతున్నారు. చక్రం తిప్పుతున్న సింధియా కుటుంబం సింధియా రాచ కుటుంబం అటు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. విజయ రాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె కుమారుడు, దివంగత నేత మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిపోయారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విజయ రాజే సింధియా కుమార్తె వసుంధరా రాజె రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లోక్‌సభ ఎంపీ. కుమార్తె యశోధర రాజె సింధియా మధ్యప్రదేశ్ లో మంత్రిగా ఉన్నారు. నయా లీడర్స్ కార్తికేయ సింగ్ చౌహాన్: ముఖ్యమంత్రిగా పార్టీని ముందుండి నడిపించాల్సిరావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఈ బాధ్యతల్ని ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఇంకా రాకపోయినప్పటికీ ప్రచారంలో తనదైన ముద్ర చూపుతున్నాడు. బుధ్నీ నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క భోపాల్‌లో పూలు, పాల వ్యాపారాలు చూసుకుంటూనే తండ్రి నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మహానర్యామన్ : కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానర్యామన్కి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. డూన్ స్కూలులో గ్రాడ్యుయేషన్ చేసిన మహానర్యామన్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రచార బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు. నకుల్‌నాథ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ కుమారుడు నకుల్ నాథ్. తండ్రి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడే నకుల్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో నైట్ లైఫ్‌కు బాగా అలవాటు పడిన నకుల్ ఎన్నికల వేళ మాత్రం భోపాల్‌లోనే ఉంటూ తెగ తిరిగేస్తున్నారు. బోస్టన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన నకుల్ బేతల్ నుంచి పోటీ పడే అవకాశాలున్నాయి. అభిషేక్ భార్గవ్ : మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ కుమారుడైన అభిషేక్ రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించారు. రెహిల్ నియోజకవర్గం నుంచి గోపాల్ భార్గవ్ గత ఏడుసార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అభిషేకే తండ్రి తరఫు పొలిటికల్ మేనేజర్‌గా వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచార వ్యూహాలన్నీ అభిషేకే రచించారు. విక్రాంత్ భూరియా: కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భూరియా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కుమారుడు విక్రాంత్ భూరియా తండ్రి నియోజకవర్గమైన రట్లామ్ బాధ్యతలు తీసుకున్నారు ప్రజా సంబంధాలు ఏర్పరచుకొని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తండ్రిని గెలిపించుకున్నారు. పైన చెప్పినవాళ్లే కాకుండా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మంధర్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ వార్గియా కుమారుడు ఆకాశ్ , ప్రజా సంబంధాల శాఖా మంత్రి డా. నరోత్తమ్ మిశ్రా కుమారుడు సుకర్ణ మిశ్రా, ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ కుమారుడు సిద్ధార్థ మాలవీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ తదితరులు సైతం రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీరిలో పలువురు తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. -
‘థర్టీన్’ చౌహాన్..యూత్ మహాన్..
పదమూడేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయన పట్ల బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు చౌహాన్ పలు యత్నాలు చేస్తున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.09%. అంటే సగానికి పైగా ఓటర్లు యువతే. అందుకే వారి వ్యతిరేకత బీజేపీని భయపెడుతోంది. అసంతృప్తితతో ఉన్న యూత్‌ను ఆకర్షించడానికి చౌహాన్ ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. రెండునెలల్లో ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తుందనగా మెగా ఎంప్లాయిమెంట్ డ్రైవ్స్, స్టార్టప్ ఫెయిర్స్ నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే మేధావి విద్యార్థి యోజన పథకాన్ని అన్ని కులాలకు వర్తింపజేశారు. మొదటి సారి కాలేజీలో అడుగు పెడుతున్న 3 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, మరో 22 వేల మందికి ల్యాప్‌ట్యాప్‌ల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎందుకీ అసంతృప్తి ? రెండేళ్లుగా మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యువత నైపుణ్యం పెంచుతూ వారిని పారిశ్రామిక రంగం వైపు మళ్లేలా చేస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగంపై గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. పట్టణప్రాంతాల్లో నిరుద్యోగులు 46శాతం, గ్రామాల్లో44 శాతం ఉన్నారు. నికరంగా నిరుద్యోగం 43 శాతంగా ఉంది. 13 ఏళ్ల పాలనలో చౌహాన్ సర్కార్ ఏడాదికి సగటున 17,600 ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. యువతలో నిరుద్యోగిత, అల్పుఉద్యోగిత(చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం) కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62కి పెంచడం కూడా నిరుద్యోగాన్ని పెంచిందనే విమర్శలూ ఉన్నాయి. యువ నేతలకు ప్రోత్సాహం సామాజికంగా యువతను ఆకట్టుకునే పథకాలతో పాటు రాజకీయంగా యువనేతలను ప్రోత్సహించేందుకు బీజేపీ నడుం బిగించింది. మధ్యప్రదేశ్‌లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యువ నేతల్ని ప్రోత్సహిస్తోంది. అనురాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ప్రచార బాధ్యతల్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్‌ని తీసుకువస్తూ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. గ్వాలియర్‌లో మారథన్ రన్లు, బుందేల్ ఖండ్‌లో జానపద నృత్యాల ఫెస్టివల్, భోపాల్‌లో కవి సమ్మేళనాలు, కుస్తీ పోటీలు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. - మేధావి విద్యార్థి యోజన: అఖిలభారత ఎంట్రన్స్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఉన్నత విద్యలో ఫీజు మినహాయింపు. - యువ కాంట్రాక్టర్ ఇంజనీర్ యోజన: మౌలిక సదుపాయాల రంగంలో యువ ఇంజనీర్లకు ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కాంట్రాక్ట్ లైసెన్స్ ఇస్తారు. - ప్రతిభ కిరణ్ యోజన: సాధికారత కోసం మహిళలకు ఉన్నతవిద్యలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. - గావోంకీ బేటీ యోజన: పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు పైచదువుల కోసం ఆర్థిక సాయం. - లాడ్లీ లక్ష్మి యోజన: అమ్మాయిలు విద్యార్థి దశలో ఉన్నప్పట్నుంచి బాండ్ల రూపంలో ఆర్థిక సాయం. - కన్యావివాహ్ యోజన: సామూహిక వివాహాలు జరిపించి పెళ్లీడు ఆడపిల్లల పెళ్లికి 15 వేల ఆర్థిక సాయం - యువ స్వరోజ్‌గార్ యోజన: చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా యువతకు రుణాల్లో సబ్సిడీ, బ్యాంకు గ్యారంటీ. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 5.39కోట్లు తొలిసారి ఓటు వేస్తున్నవారు 15 లక్షలకు పైగా 18 –29 ఏళ్ల ఓటర్లు 1.53 కోట్లు 30–39 ఏళ్ల ఓటర్లు 1.28 కోట్లు కాంగ్రెస్‌లో కిరార్ కిరికిరి! మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు గులాబ్ సింగ్ కిరార్ని కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా పార్టీలోకి ఆహ్వనించారు. అయితే వ్యాపం స్కాంతో కిరార్‌కు సంబంధం ఉన్నదంటూ గతంలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగిన విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు. నాటి విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. మొదట కిరార్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వనిస్తూ అధికారిక వెబ్సైట్ లో చేసిన ట్వీట్‌ని తొలగించడమే కాకుండా.. గులాబ్ సింగ్ కిరార్ తమ పార్టీలో చేరారన్న వాదనను కాంగ్రెస్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి తోసిపుచ్చడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ గందరగోళంలోనే కిరార్ కాంగ్రెస్‌లో చేరినట్టు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి స్పష్టం చేయడం జరిగింది. అయితే తనగురించి కాంగ్రెస్ ఎలా అనుకున్నా, నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తాననీ, ఎందుకంటే తాను కాంగ్రెస్ సభ్యుడిననీ గులాబ్ సింగ్ చెప్పుకుంటున్నాడు. కిరార్ వ్యవహారంతో కాంగ్రెస్ బుద్ధి బట్టబయలైందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. కిరార్ కిరికిరి కాంగ్రెస్ నైజాన్ని బహిర్గతం చేసిందన్న ఆనందంలో బీజేపీ ఉంది. కిరార్ మధ్యప్రదేశ్ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కమిషన్ మాజీ సభ్యుడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. 2011 పీజీ వైద్య ప్రవేశ పరీక్ష సందర్భంగా జరిగిన అవకతవకల్లో కిరార్కీ, అతని కుమారుడికీ సంబం«ధం ఉందని సీబీఐ ఆరోపించింది. వ్యాపం స్కాంతో ఆయనకు సంబంధమున్నట్లు బయటపడడంతో మూడేళ్ల క్రితమే బీజేపీ అతన్ని పార్టీనుంచి తొలగించింది. తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహిళలకే మీ ఓటు! మిజోరంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువఉన్నప్పటికీ.. శాసనసభలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని మార్చి ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకు ఈ రాష్ట్రంలోని ఏకైక మహిళా సంస్థ ’మిజో మీచే ఇన్సుయిఖ్వామ్ పాల్’ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఉధృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదని.. అన్ని పార్టీల్లోని మహిళా అభ్యర్థులను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజలను చైతన్యపరుస్తోంది. మహిళలు తమ శక్తిని చాటేందుకు ఇంతకన్నా మంచి సమయం రాదంటోంది ఈ సంస్థ. ’మాకు పార్టీ ముఖ్యం కాదు. మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడమే ముఖ్యం’ అని ఈ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 1978 నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలు మాత్రమే మిజో శాసనసభకు ఎన్నికయ్యారు. గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి పట్టు మధ్యప్రదేశ్‌లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజవర్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు ఎన్నికలుగా బీజేపీ పట్టు సాధిస్తోంది. గిరిజనులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లు మాత్రం కమలంపైనే విశ్వాసం ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 47 ఎస్టీ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో పరిస్థితిని ఓసారి గమనిస్తే.. ఇటలీ, స్వీడన్.. ఇవన్నీ ఓటర్ల పేర్లే మేఘాలయలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇటలీ, అర్జెంటైనా, స్వీడన్, ఇండోనేసియాలు దిగ్విజయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దేశాలేంటి, మేఘాలయ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడమేంటి అనుకుంటున్నారా.. అవి దేశాల పేర్లు కాదండీ బాబూ.. అవి మేఘాలయకు చెందిన ఉమ్ని– మర్ఎలాకా గ్రామ ప్రజల పేర్లు. అవేం పేర్లు అని ఆశ్చర్యపోకండి, ఆ ఊర్లో అందరి పేర్లూ విచిత్రంగానే ఉంటాయి. ఈ ఊళ్లో జనాలకు ఇంగ్లీష్ రైమ్స్పై ఆసక్తి కాస్త ఎక్కువంట. కానీ వాటి అర్ధాలు మాత్రం తెలియవట. అందుకే శబ్దం బాగుంటే పేరుగా పెట్టుకుంటూ ఉంటారు. కేవలం పదాలు బాగున్నాయనే ఏకైక కారణంతో ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని అక్కడి సర్పంచ్ ప్రీమియర్ సింగ్ చెప్పారు. టేబుల్, గ్లోబ్, పేపర్, శాటరన్, అరేబియన్ సీ, రిక్వెస్ట్, లవ్లీనెస్, హ్యాపీనెస్, గుడ్నెస్, యూనిటీ, స్వీటర్, గోవా, త్రిపుర.. లాంటి పలు నామధేయులు ఆ ఊర్లో మీకు ఎదురవుతారు. అన్నింటికనా విచిత్రంగా ఆ ఊర్లో ఒకామె పేరు ‘‘ఐ హావ్ బీన్ డెలివర్డ్’’. ఇవన్నీ చదువుతుంటే మనకు సరదాగా ఉంది కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించే అధికారులు మాత్రం ఈ పేర్లతో గజిబిజి పడుతున్నామని వాపోతుంటారు. -
మధ్యప్రదేశ్‌లో కమలానికి షాక్..!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడవడం కమలనాధులను కలవరపరుస్తోంది. అక్టోబర్ 30న ముఖ్యమంత్రి చౌహాన్‌కు ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు సమర్పించిన రహస్య నివేదిక బీజేపీలో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్ధానాల్లో 128 స్ధానాల్లో పాలక బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. బీజేపీ కేవలం 92 సీట్లలోనే గెలుపొందే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఆరు సీట్లలో, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ మూడు సీట్లలో విజయం సాధించవచ్చని నివేదిక అంచనా వేసింది. రుస్తం సింగ్, మాయా సింగ్, గౌరీ శంకర్ షెజ్వార్, ఎస్పీ మీనా సహా పది మంది మంత్రులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అతితక్కువగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు సీఎం చౌహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఎస్పీ మీనా పార్టీ టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ నివేదిక ముఖ్యమంత్రికి చేరిన రెండు రోజుల తర్వాతే తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం గ్వాలియర్ చంబల్ డివిజన్లోని 34 స్ధానాలకు గాను 24 స్ధానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీ కేవలం ఏడు సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తుండగా, మిగిలిన మూడు సీట్లలో బీఎస్పీకి విజయావకాశాలున్నాయి. వింధ్య ప్రాంతంలోని 30 స్ధానాల్లో కాంగ్రెస్ 18 స్ధానాల్లో ప్రత్యర్ధుల కంటే పైచేయి సాధించగా, బీజేపీ 9 స్ధానాల్లో, బీఎస్పీ మూడు స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక మహాకోశల్ ప్రాంతంలోని 38 స్ధానాల్లో కాంగ్రెస్ 22 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 13 స్ధానాల్లో నెగ్గే అవకాశం ఉంది. ఎస్పీ రెండు స్ధానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇక రైతు ఆందోళనలు, పోలీసు కాల్పులతో అట్టుడికిన మాల్వా నిమర్ ప్రాంతంలో కాంగ్రెస్ 34 స్ధానాల్లో, బీజేపీ 32 స్ధానాల్లో గెలిచే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. -
కమల్ వర్సెస్ కమలం
సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలపై చెరగని ముద్ర వేసి మామా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పిలిపించుకునే కమలనాథుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకవైపు, ఇందిరాగాంధీకి కుడి భుజంగా పేరుతెచ్చుకొని సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న కమల్‌నాథ్ మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ప్రజల మనసు దోచుకునే ‘నాథు’డెవరు? పేదల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ధనిక పార్లమెంటేరియన్ కమల్‌నాథ్ ఢీ కొనగలరా? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అత్యంత కీలకం. 29 లోక్‌సభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌పై పట్టు సంపాదించడం కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ఆవశ్యకం. అంతకుముందు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నేత చౌహానే. సంక్షేమ పథకాలతోనే ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే 13ఏళ్లు సీఎంగా ఉండటం, వ్యాపమ్ సహా వివిధ కుంభకోణాలు, రైతు సమస్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతరులతో పోలిస్తే వెనకబడడం వంటికి చౌహాన్‌కు ఈ ఎన్నికల్లో సవాల్‌గా మారాయి. రాష్ట్రంలో ఇంకా 70% మంది ప్రజల ఆదాయ వనరు వ్యవసాయమే. నెలవారీ రూ.1300 తలసరి ఆదాయంతో వీరి పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ సగటుకంటే ఇది 7% తక్కువ. గతేడాది మందసౌర్‌లో రైతుల ఆందోళనలు, పోలీసుల కాల్పులు, ఆరుగురు రైతులు చనిపోవడం శివ్‌రాజ్ మెడకు చుట్టుకున్నాయి. ఇన్ని సమస్యల మధ్య చౌహాన్ సంక్షేమ కార్యక్రమాలు, హిందుత్వ కార్డు, మోదీ ఇమేజ్ను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. అయితే.. ఇప్పటికీ 46% మంది చౌహాన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. శివరాజ్ వ్యూహాలు రైతు సమస్యలు, నిరుద్యోగమే ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. వీటినుంచి బయటపడేందుకు చౌహాన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. జనాశీర్వాద్ యాత్ర, జనాదేశ్ యాత్రల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రైతులకోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొస్తున్నారు. గత ఏడాదిలో రూ.32,701 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. రాష్ట్రంలో 90% హిందువులే ఉండడంతో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే గో సంరక్షణకు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామంటున్నారు. మామ ఇమేజ్ శివరాజ్ సింగ్ చౌహాన్‌ది రైతు కుటుంబం. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్‌తో అనుంబధం ఏర్పడింది. ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో తొలిసారిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీగా నాలుగు సార్లు వరసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2003లో రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో ఆయనపై పప్పు అనే ముద్ర ఉండేది. కానీ తనకున్న నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యాలతో ఆ ఇమేజ్ను చెరిపేసుకుని అందరితో మామ అని పిలిపించుకునే స్థితికి ఎదిగారు. 2008 ఎన్నికల్లో చౌహాన్ 143 స్థానాల్లో, 2013లో 165 చోట్ల పార్టీని గెలిపించుకున్నారు. కమల్‌నాథ్ ప్లానింగ్.. మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్ష పగ్గాలను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కమల్‌నాథ్‌కు అప్పగించింది. కమల్‌నాథ్ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్త. పారిశ్రామిక, ఆర్థిక రంగాలపై మంచి పట్టు ఉంది. తొమ్మిదిసార్లు మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కమల్‌నాథ్‌కు రాష్ట్రంలో ప్రతి నాయకుడి పాజిటివ్, నెగటివ్ అంశాలు బాగా తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలతోనూ మంచి అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేయడంపై కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చౌహాన్ ‘మామ’ ఇమేజ్ మసకబారేలా, ప్రజల్లో ఆయన విశ్వసనీయత దెబ్బ తీసేలా కుంభకోణాలపైనే దృష్టి సారించారు. హిందూత్వ కార్డునీ ప్రయోగిస్తున్నారు. ‘మేము కూడా మతాన్ని గౌరవిస్తాం. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోం. చింద్వారాలో 101 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. కానీ దానిని ప్రచారం చేసుకోలేదు’ అంటూ పదే పదే చెబుతున్నారు. రాజకీయ ప్రస్థానం కమల్‌నాథ్ సంజయ్‌గాంధీకి సమకాలికుడు. ఇందిర నుంచి రాహుల్ వరకు మూడు తరాల గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1980 నుంచి చింద్వారా లోక్ సభ స్థానానికి తొమ్మిది సార్లు గెలిచారు. 16వ లోక్‌సభలో కమలనాథే సీనియర్ సభ్యుడు. కమల్‌నాథ్‌కు ఏవియేషన్ రంగంలో వ్యాపారాలతో పాటు ఎన్నో రెస్టారెంట్లకు అధినేత. 187 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్లో ప్రకటించుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు సృష్టించనుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రానుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ సీఎం కానున్నారు. ఈ నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటీవీ–సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒక ఒపీనియన్‌పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఈసారి 128 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కాస్త పుంజుకుని 85 స్థానాల్లో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. అలాగే, బీఎస్పీ 8 సీట్లలో, ఇతరులు 9 సీట్లలో గెలుస్తారని పేర్కొంది. మాల్వానిమాఢ్ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, అక్కడ 45 సీట్లు గెలుచుకున్నా.. 2013 కన్నా అది 16 స్థానాలు తక్కువేనని వెల్లడించింది. కాంగ్రెస్ అక్కడ గతంలోకన్నా 14 సీట్లు పెంచుకుని 24 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. మళ్లీ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగే కావాలని 41% కోరుకోగా, జ్యోతిరాదిత్య సింధియాను 22% మంది, కమల్‌నాథ్‌ను 18% మంది సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక శాతం మాత్రమే సీఎంగా దిగ్విజయ్‌సింగ్‌కు ఓటేయడం గమనార్హం. ముఖ్యమంత్రిగా శివరాజ్ పనితీరుకు 30 శాతం చాలా బాగుందని, 11% బావుందని, 16% పర్లేదని, 22% బాగా లేదని తీర్పిచ్చారు. నిరుద్యోగం, రైతు సంక్షోభం, మహిళల భద్రత.. మొదలైనవి ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ ఒపీనియన్ పోల్‌లో మొత్తం 10 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. -
కాంగ్రెస్‌కూ కాషాయం రంగు
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా కాషాయం రంగు పులుపుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మెజారిటీ హిందువులను ఆకర్షించడం కోసం బీజేపీ బాటలో మత రాజకీయలను ఆశ్రయిస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల క్రితం మాటిచ్చి మరచిపోయిన ‘రాముడు వనవాసానికెళ్లిన బాట’ను ఓ సర్క్యూట్‌గా తాము అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చింది. అందుకు సంకల్పంగా ‘రామ్ వన్ గమన్ పథ్ యాత్ర’ను నిర్వహిస్తామని ప్రకటన కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఆగస్టులో రాష్ట్రంలోని ప్రముఖ గుళ్లను సందర్శించడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి పంచాయతీ పరిధిలో ఓ గోశాలను ఏర్పాటు చేస్తామని పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. రాముడి మార్గాన్ని నిర్మిస్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. రాముడి వనవాస మార్గాన్ని నిర్మిస్తానని మాట తప్పిన శివరాజ్ సింగ్ చౌహాన్, ఎన్ని అవినీతి కుంభకోణాలు వెలుగుచూసినా వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. సంచలనం సృష్టించిన వ్యాపమ్, ఇసుక కుంభకోణాల్లో స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ చేతులు కాలినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఆయన్నే కొనసాగించడానికి కుల, మత రాజకీయాలే కారణం. వ్యావసాయక్ పరీక్షా మండల్ (వ్యాపమ్)గా పిలిచే ‘మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు’ నిర్వహించిన వైద్య కళాశాల ప్రవేశ పరీక్షలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులు, అటవి సిబ్బంది తదితర 13 కేటగిరీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అప్పట్లో వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర మంత్రలు, ఎమ్మెల్యేలు, బడా వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కూడా వెల్లడయింది. వ్యాపమ్, ఇసుక కుంభకోణాలతోపాటు 15 ఏళ్ల బీజేపీ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదన్న వివిధ వర్గాల ప్రజల ఆందోళనతో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ మట్టి కరవడం ఖాయమని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కాషాయం రంగు పులుపుకోవడానికి ప్రయత్నించడం శోఛనీయం. ఆ మాటకొస్తే మతపరమైన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదు. ముస్లింల మెజారిటీ రాష్ట్రమైన కశ్మీర్లో హిందువులను ఆకర్షించడం కోసం మత రాజకీయాలను ఆశ్రయించిన సందర్భాలు అనేకం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాలను తెగ తిరిగిన విషయం తెల్సిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ రథ యాత్రను నిర్వహించింది. మత రాజకీయాల ప్రాతిపదికనే సంఘ్ పరివార్ ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెట్టిందనే విషయం తెల్సిందే. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాట అనుసరిస్తుంటే లౌకికవాదం, సహనం, మైనారిటీల భద్రత, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి వ్యక్తం చేసే స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఏ పార్టీ ముందుకొస్తుందీ? -
మధ్యప్రదేశ్ సీఎంపైకి చెప్పు?
సీధీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌పై చెప్పువిసిరినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రమంతా ‘జన ఆశీర్వాద యాత్ర’ చేస్తున్న చౌహాన్ ఆది, సోమవారాల్లో యూపీ సరిహద్దుల్లోని సీధీ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కొందరు నల్లజెండాలతో ఆయన బస్సుకు స్వాగతం పలికారు. ఓ చోట ఆయన బస్సుపై రాళ్లు రువ్వగా బస్సు అద్దాల్లో చీలిక వచ్చింది. పూజా పార్క్ ప్రాంతంలో ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియోలో ఆయనపైకి చెప్పు విసిరిన దృశ్యం రికార్డయింది. నల్లజెండాలు చూపడంతోపాటు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం వాహనంపై రాళ్ల దాడి
సిద్ధి(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివరాజ్‌సింగ్ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం సిద్ధి జిల్లాలోని చుర్హట్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. ఈ ఘటనపై చుర్హట్ పోలీస్ అధికారి బాబు చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో శివరాజ్‌సింగ్‌కు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర విషయాలు వెల్లడించటానికి ఆయన ఆసక్తి కనబరచలేదు. శివరాజ్ సింగ్ వాహనంపై దాడి జరిగిన చుర్హట్ ప్రాంతం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ నియోజకవర్గంలో ఉందని మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రాజ్నీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ దాడి కాంగ్రెస్ నేతలు చేసిందేనని ఆరోపించారు. తన బహిరంగ సభ అనంతరం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. అజయ్ సింగ్‌కు ధైర్యం ఉంటే బహిరంగంగా తలపడాలని సవాలు విసిరారు. తను శారీరకంగా బలహీనుడైనప్పటికీ.. రాష్ట్ర ప్రజలు తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఈ దాడితో తనకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని అజయ్ సింగ్ తెలిపారు. తమ పార్టీ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడదని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక కుట్ర ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. తనను, చుర్హట్ ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. -
సీఎం బామ్మర్దిని.. నాకే జరిమానా విధిస్తారా..!
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర విధాన సభ ముందు ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు.తాను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బామర్దిని అంటూ హంగామా సృష్టించాడు. ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆ వ్యక్తిని పోలీసులు ఆపారు. దీంతో తాను ముఖ్యమంత్రి బామ్మర్దినని, తనకే జరిమానా విధిస్తారా అంటూ ఆందోళన చేశాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మరి కొంతమంది పోలీసులు వచ్చి గొడవను తగ్గించారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారి భర్తలందరూ తనకు బావబామ్మర్దులు అవుతారని నవ్వుతూ చెప్పారు. -
అమ్మాయిలంటే ఇలా ఉండాలి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలన్న ధ్యేయంతో చిన్నప్పట్నుంచీ ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ వచ్చింది ఆంచల్ గంగ్వాల్. క్లాస్‌లోనే కాదు, క్లాస్ బయట ఆటల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. కలలకు రెక్కలు కట్టుకుని చదివి, ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీటు సాధించింది! వేటూరి గారు అన్నట్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’. అంతేనా! ఆంచల్ గంగ్వాల్ కూడా అవుతారు! తమ మీద తమకు అచంచలమైన నమ్మకం ఉండి కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించింది ఆంచల్. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ఇటీవలే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్వీస్‌కు ఎంపికైంది. ఆరు లక్షల మంది రాసిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 22 మంది ఎంపికయ్యారు. వారిలో అమ్మాయిలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఫ్లయింగ్ బ్రాంచికి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక అమ్మాయి ఆంచల్. అందుకే ఆంచల్ సాధించిన విజయం పట్ల ఆమె అమ్మానాన్నలతో పాటు రాష్ట్రం కూడా గర్వపడుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఆంచల్‌కు అభినందనలు తెలియచేశారు. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అర్చనా చిట్నీస్ అయితే స్వయంగా ఆంచల్ ఇంటికి వచ్చి మరీ అభినందించారు. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ని అంచల్ బుగ్గలు పుణికారామె. పెద్దింటమ్మాయి కాదు! ముఖ్యమంత్రి అభినందనలు, మంత్రి ప్రశంసలు అందుకున్న ఆంచల్.. ఆర్థికంగా ఒక సాధారణ దిగువ తరగతి ఇంటి అమ్మాయి. నీముచ్ జిల్లా కేంద్రంలో బస్‌స్టాండ్‌లో టీ దుకాణం నడుపుతాడు ఆంచల్ తండ్రి సురేశ్. అయితే ఇప్పుడు పట్టణంలో అందరికీ ఆంచల్ వల్లనే ‘నామ్‌దేవ్ టీ స్టాల్’ గురించి తెలిసింది. ‘‘నా టీ స్టాల్‌ని వెతుక్కుంటూ వచ్చి ఆంచల్ తండ్రి మీరేనా అని అడిగి మరీ నన్ను అభినందిస్తున్నారు, నా కూతురు పైలటయినా అంత ఆనందం కలిగిందో లేదో కానీ తండ్రిగా నా గుండె ఉప్పొంగిపోతోంది’ అంటున్నాడు సురేశ్. ఇది ఆరో ప్రయత్నం రక్షణ రంగంలో చేరాలనే ఆలోచన బాల్యంలోనే మొలకెత్తింది ఆంచల్‌లో. నీముచ్‌లోని మెట్రో హెచ్ఎస్ స్కూల్లో క్లాస్ టాపర్ అయ్యింది. దాంతో స్కూల్ కెప్టెన్ అయింది. తర్వాత ఉజ్జయిన్లో విక్రమ్ యూనివర్సిటీలోనూ ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్కు ఎంపికైంది. బాస్కెట్‌బాల్, 400 మీటర్ల పరుగులో కాలేజ్‌కు ప్రాతినిధ్యం వహించింది. డిఫెన్స్‌లో చేరాలంటే అన్ని రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఇన్నింటిలో చురుగ్గా ఉండేదాన్నని చెబుతుంది ఆంచల్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులు కోవడానికి కారణమూ డిఫెన్స్ పట్ల ఇష్టమేనంటోంది. సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరితే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ప్రిపరేషన్‌కి వెసులుబాటు ఉండదని వదిలేసిందామె. ఆ తరువాత వచ్చిన లేబర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రిపరేషన్‌కి అవకాశం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే చేరింది. ఒక పక్క ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తను కలగన్న డిఫెన్స్ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ వచ్చింది. ఐదు ప్రయత్నాలు సఫలం కాకపోయినా సంకల్పాన్ని వదలకపోవడమే ఆంచల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆరవ ప్రయత్నంలో ఆమె ఎయిర్‌ఫోర్స్ రంగంలో సెలెక్ట్ అయింది. ఆ ఫలితాలు ఈ నెల ఏడవ తేదీన వెలువడ్డాయి. అప్పటి నుంచి ఆమె ఇంటి ఫోన్ రింగవుతూనే ఉంది. ‘ఆంచల్! నేల మీద నుంచి నింగి దాకా ఎదిగావు’ అంటూ అభినందనల వాన కురుస్తూనే ఉంది. – మంజీర ఆ వరదలే కారణం! నేను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు బాధితులను రక్షించడానికి ఆర్మీ జవాన్లు బృందాలుగా వచ్చారు. తమకు ఏమవుతుందోననే భయం వారిలో ఏ కోశానా కనిపించేది కాదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చొరవగా దూసుకెళ్లిపోయి బాధితులను కాపాడడం చూసినప్పుడు నాకు ఒళ్లు పులకరించినట్లయింది. ఇలాంటి సర్వీసుల్లో చేరాలని నాకప్పుడే అనిపించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పట్లో చేరలేకపోయాను. ఆ కల ఇప్పటికి తీరింది. నా కోచింగ్ కోసం నాన్న లోన్ తీసుకున్నాడు. ఉద్యోగంలో చేరగానే లోన్ తీరుస్తాను. ఆ లోన్ తీర్చినప్పుడే నాన్న కళ్లలోకి ధైర్యంగా చూడగలుగుతాను. – ఆంచల్, ఐఎఎఫ్ -
మరో వారసుడి పొలిటికల్ ఎంట్రీ..!
భోపాల్ : మధ్యప్రదేశ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహానార్యమన్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. రాజవంశానికి చెందిన మహానార్యమన్ డెహ్రాడూన్‌లో హై స్కూల్ విద్యనభ్యసించారు. ప్రస్తుతం అమెరికాలో ఎంబీఏ చేస్తున్న మహానార్యమన్ వేసవి సెలవుల నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వచ్చారు. తరతరాలుగా గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో సింధియాల కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తనయుడిని సైతం రాజకీయాల్లోకి తీసుకురావాలని జ్యోతిరాదిత్య భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ ప్రచార కార్యక్రమాలకు తనతో పాటు కుమారుడిని కూడా వెంట తీసుకువెళ్తున్నారు. శివపురి నియోజక వర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరైన మహానార్యమన్ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగే తండ్రి హాజరుకాలేని కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజవంశీకుడు అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉండే మహానార్యమన్ ఎక్కడికి వెళ్లినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడంటూ.. ఇది అతడి రాజకీయ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని సింధియా కుటుంబ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్థాన్ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో సుమారు 34 అసెంబ్లీ స్థానాల్లో సింధియా కుటుంబ సభ్యులు, వారి అనుచరులు గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారి బాటలోనే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు రాజకీయ నాయకుల వారసులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్థన్ సింగ్ గత ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కార్తికేయ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిరాదిత్య కూడా వారసుడి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల శ్రమ వృథా కాదు
పంటకు మద్దతు ధర ఇస్తాం.. శాంతించండి ► రైతులకు మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పిలుపు ► శాంతి కోసం సీఎం నిరవధిక నిరాహార దీక్ష భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, అన్నదాతలు ఆందోళన విరమించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కోరారు. రైతుల శ్రమ వృథాకానీయమని సమస్యలు తెలిసిన ప్రభుత్వంగా వారి పంటకు సరైన మద్దతుధర కల్పిస్తామన్నారు. రైతుల ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడేందుకు భోపాల్‌లోని దసరా మైదాన్‌లో శనివారం చౌహాన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. భారీ సంఖ్యలో రైతులతోపాటు పార్టీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వారి పంటకు సరైన ధర ఇస్తామని చౌహాన్ అన్నారు. ‘పంట ఉత్పత్తి అనుకున్నదానికన్నా ఎక్కువగా రావటంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. నాకు మీ (రైతుల) సమస్యలు తెలుసు. ప్రభుత్వం అండగా ఉంటుంది. మేం పంటను మీకు లాభం చేకూర్చే ధరకే కొనుగోలు చేస్తాం’ అని చౌహాన్ స్పష్టం చేశారు. రైతుల కోసం మరెన్నో చేస్తాం ఇప్పటికే కనీస మద్దతు ధరతో (కిలో రూ.8) ఉల్లిగడ్డలు కొనుగోలు చేసిన విషయాన్ని చౌహాన్ గుర్తుచేశారు. ‘శ్రమ వృథా కానీయం. అన్ని ధాన్యాలను కనీస మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని సీఎం తెలిపారు. గతేడాది సోయాబీన్ పంట నష్టపోతే రూ.4,800 కోట్లు పరిహారం ఇచ్చామని.. రూ.4,400 కోట్ల పంటబీమా అందజేశామన్నారు. 11 గంటలకు వేదికపైకి వచ్చిన చౌహాన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దసరా మైదాన్ నుంచే సెక్రటేరియట్లో చేయాల్సిన పనులన్నీ చేయనున్నట్లు చౌహాన్ తెలిపారు. మండిపడ్డ విపక్షాలు సీఎం చౌహాన్ దీక్ష నాటకమని కాంగ్రెస్ మండిపడింది. ‘అన్నదాతలను విస్మరించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన సీఎం.. ఎవరికి వ్యతిరేకంగా దీక్ష చేయాలనుకుంటున్నారు?’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా విమర్శించారు. రైతుల మృతిపై ఇంతవరకు హత్యకేసు ఎందుకు నమోదు చేయలేదని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. నిరవధిక నిరాహార దీక్ష చేసే బదులు మంద్సౌర్ వెళ్లి రైతులను పరామర్శించి వస్తే బాగుండేదని శివసేన విమర్శించింది. అనంతరం కొందరు శివసేన ప్రతినిధుల బృందం సీఎం చౌహాన్‌ను కలిసి సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలు చేసింది. కాగా, రైతుల ఆందోళనకు కేంద్రమైన మంద్‌సౌర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. శనివారం కర్ఫ్యూను ఎత్తేసినట్లు ఎస్పీ ప్రకటించారు. పిపల్మండీలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. -
‘రైతు’ నిరసనలు ఉధృతం
► ఎంపీ రాజధాని సమీపంలో ట్రక్కు తగులబెట్టిన రైతులు ► మంద్సౌర్ జిల్లాలో మరో రైతు మృతి భోపాల్: మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లాలో చెలరేగిన రైతుల నిరసన సెగ శుక్రవారం భోపాల్‌కు చేరింది. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఫాండాలో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.ఆందోళనకారులు ఓ ట్రక్కును తగులబెట్టి, పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ జరిపి 27 మందిని అరెస్టు చేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. మరో రైతు మృతి.. హింస చెలరేగిన మంద్సౌర్ జిల్లాలో మరో యువ రైతు ఘనశ్యాం ధకడ్ (26) మరణించాడు. బదవన్ గ్రామానికి చెందిన అతడిని పోలీసులే కొట్టి చంపారని, ఒంటి నిండా గాయాలున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం ఘనశ్యాం గుడికి వెళుతుండగా, పోలీసులు ఆపి లాఠీలతో చితకబాదారన్నారు. అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడన్నారు. మృతికి కారణాలేమిటో తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ, కలెక్టర్ తెలిపారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సజ్జన్‌సింగ్ వర్మా... పోలీసులే రైతును కొట్టి చంపారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరో ముగ్గురు రైతులు అదృశ్యమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసుల కాల్పులకు ఐదుగురు రైతులు బలైన విషయం తెలిసిందే. రుణమాఫీ, అధిక మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌తో మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంత రైతులు ఈ నెల 1 నుంచి ఆందోళన చేస్తున్నారు. నేటి నుంచి సీఎం చౌహాన్ నిరాహారదీక్ష రైతు నిరసనల నేపథ్యంలో.. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు శనివారం నుంచి దసరా మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించా రు. రుణాలు తిరిగి చెల్లించలేని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘రుణ పరిష్కార పథకం’ త్వరలో తేనున్నట్టు వెల్లడించారు. -
'కేసీఆర్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు'
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ట్విట్టర్లో ఈ వ్యవహరంపై ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 'వ్యాపమ్ కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకుంటున్నారు' అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. Telangana Medical Exam leak. KCR learning lessons from CM MP Shivraj Singh Chauhan master mind of Vyapam Scam. Guilty must be punished. — digvijaya singh (@digvijaya_28) 29 July 2016 -
ఎమ్మెల్యే లాడ్ నిధులు 2 కోట్లకు పెంపు
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ వరం ప్రకటించారు. వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి నిధులను ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెంచారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లాడ్ కింద నిధులు కేవలం రూ. 77 లక్షలు మాత్రమే ఉండగా, దాన్ని రూ. 2 కోట్లకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రకటించారు. మరో రెండేళ్లలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత 2003 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, ప్రతిసారీ బీజేపీయే గెలుస్తూ వచ్చింది. 2003లో అధికారం చేపట్టినప్పుడు ఉమాభారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చౌహాన్ నాయకత్వానికి ఎదురులేకుండా కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ.. రాబోయే ఎన్నికల్లో కూడా విజయపతాకం ఎగరేయాలన్న ఉద్దేశంతోనే ఈ భారీ పథకాన్ని చేపడుతోందని అంటున్నారు. -
మధ్యప్రదేశ్ ‘స్థానికం’లో హస్తం హవా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకోగా.. బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాతో పాటు మరో రెండు స్థానాల్లో మాత్రమే కమలం గెలిచింది. ఈ విజయంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. భోపాల్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బిహార్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం తగ్గిందని.. ప్రజలకు మళ్లీ కాంగ్రెస్‌పై నమ్మకం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. -
మధ్యప్రదేశ్ లో హరీష్ బృందం పర్యటన
ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రుల బృదం రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్ లో పర్యటించనుంది. మధ్యప్రదేశ్ లోని లిఫ్ట్ ఇరిగేషన్, సాగు నీటి ప్రాజెక్ట్ లలో కాల్వల ద్వార కాకుండ పైప్ లైన్ల ద్వార నీటిని సరఫరా చేస్తున్న పద్దతిని తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృదం అధ్యయనం చెయనుంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు బేగంపెట ఎయిర్ పోర్ట్ నుండి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు ప్రయణం కానున్నారు. ఈ పర్యటనలో ఓం కారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లను ఈ బృందం సందర్శిస్తుంది. ఇక్కడి ఆయకట్టుకు నీరును పైపు లైన్ ల ద్వారా అందిస్తున్న పద్దతులను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లలో పని చేస్తున్న ఇంజనీర్ల తో సమావేశం కానున్నారు. వీరితో పాటు.. ఆయకట్టు కింద వ్యవసాయం చేస్తున్న రైతులతో కూడా మంతృల బృందం మాట్లాడనుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా భోపాల్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ కానున్నారు. మద్యప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో ఉంటారు. మంత్రుల బృందంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ లు ఉన్నారు. -
కుదరని సయోధ్య
ఫలితం లేకుండా ముగిసిన అఖిలపక్షం * రాజీనామా డిమాండ్‌పై వెనక్కి తగ్గని కాంగ్రెస్ * రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: 15 రోజులుగా పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ సీఎంలు వసుంధరా రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామాల డిమాండ్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. అయితే రాజీనామా డిమాండ్‌కు ప్రభుత్వం ససేమిరా అనడంతో సోమవారం జరిగిన అఖిలపక్ష భేటీ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. కాంగ్రెస్ డిమాండ్‌కు జేడీయూ, లెఫ్ట్ పూర్తి మద్దతు తెలుపగా.. తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ తదితర ప్రాంతీయ పార్టీలు మాత్రం పార్లమెంట్లో ప్రతిష్టంభనపై రెండు జాతీయ పార్టీల తీరును తప్పుపట్టాయి. భేటీ అనంతరం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ సమావేశం వల్ల ఫలితం శూన్యం. మేము డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంటును అడ్డుకునే సంస్కృతిని ప్రారంభించింది బీజేపీయే అని ఆరోపించారు. ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనా లేకుండా వచ్చిందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. కాంగ్రెస్ విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ఖండించారు. ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం ఎప్పుడు ఒక అడుగు ముందుకే వేసిందని చెప్పారు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులను సెలక్ట్ కమిటీకి అప్పగించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రధాని కూడా వీటిపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే ఎన్డీఏ మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని, వారు ఎటువంటి అక్రమాలకు.. అనైతిక చర్యలకు పాల్పడలేదని చెప్పారు. -
పార్లమెంట్లో సీఎంల మంటలు!
బీజేపీ ముఖ్యమంత్రులపై ఆరోపణలతో దద్దరిల్లనున్న సమావేశాలు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు టార్గెట్ 21 నుంచి మొదలుకానున్న వర్షాకాల సమావేశాలు న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రులపై వచ్చిన ఆరోపణలు ఈసారి పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనున్నాయి. వారు గద్దె దిగాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో గొంతెత్తనున్నాయి. జూలై 21నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణం వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, లలిత్‌గేట్ స్కాంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, పీడీఎస్ స్కాంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లపై ఆరోపణలను అస్త్రంగా మలిచి ప్రధాని నరేంద్రమోదీని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీజేపీ సీఎంలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ కూడా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్(కాంగ్రెస్) వ్యవహారాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. త్రిపురలో చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సర్కార్(సీపీఎం)ను నిలదీసేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేకపోతున్నారని విమర్శలపాలవుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్(ఎస్పీ), అనేక అంశాలపై కేంద్రంతో విభేదిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు సంధించనున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంతమంది సీఎంలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించలేదు. ఈసారి మాత్రం ముఖ్యమంత్రులపై ఆరోపణలే ప్రధానాస్త్రాలుగా ఒకరిపై ఒకరు విరుచుకుపడేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతుండడం గమనార్హం. అలాగే లలిత్‌మోదీకి వీసా సాయమందించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, విద్యార్హతల విషయంలో వివాదంలో చిక్కుకున్న మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ప్రధాని భేటీకి కాంగ్రెస్ సీఎంల డుమ్మా! భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు 15న మోదీ తలపెట్టిన సీఎం సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరించనున్నారు. భూసేకరణ బిల్లుపై ప్రతిష్టంభన తొలగించేందుకు, ఈ సమావేశాల్లోనైనా బిల్లును గట్టెక్కించే ఉద్దేశంతో భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరు కాబోనని బెంగాల్ సీఎం మమత ఇప్పటికే వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత తొమ్మిది రాష్ట్రాల సీఎంలు గైర్హాజరైతే దేశవ్యాప్తంగా 30 మంది సీఎంలలో ఏకంగా 10 మంది ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టినట్టవుతుంది! నేడు సోనియా ఇఫ్తార్ విందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం పలు పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు తమతో కలసి వచ్చే పార్టీల నేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ విందు సమావేశంలో సోనియా.. నేతలతో చర్చించనున్నారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), శరద్‌పవార్(ఎన్సీపీ), సీతారాం ఏచూరి(సీపీఎం), దేవెగౌడ(జేడీఎస్), అహ్మద్(ఐయూఎంఎల్), కనిమొళి(డీఎంకే), డి.రాజా(సీపీఐ), సుధీప్ బంధోపాధ్యాయ(తృణమూల్ కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్)కు ఆహ్వానాలు పంపారు. -
స్కాం మొత్తానికి సూత్రధారి ముఖ్యమంత్రే: కాంగ్రెస్
దేశం మొత్తాన్ని వరుస మరణాలతో వణికిస్తున్న 'వ్యాపమ్' స్కాంకు సూత్రధారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానేనని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయించాలని, సీఎం చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతేనే విచారణ సవ్యంగా సాగుతుందని, అందువల్ల ఆయన వెంటనే రాజీనామా చేసి స్వతంత్ర విచారణ వేయాలని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ పీసీసీ కూడా సీఎం రాజీనామాకు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కూడా వ్యాపం స్కాంలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తోందని, కానీ తమ పార్టీకి ఈ దర్యాప్తుపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఈ స్కాంతో సంబంధమున్న 43 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. -
అద్వానీ, మురళీ మనోహర్ ఔట్
* బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ * శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, జేపీ నడ్డాలకు చోటు * బీజేపీలో అద్వానీ శకం ముగిసినట్లే! సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళంలో కొత్త తరం బాధ్యతల స్వీకారం పరిపూర్ణమైంది. నాలుగు దశాబ్దాలుగా పార్టీపై చెరగని ముద్ర వేసిన ‘త్రిమూర్తులు’కు విశ్రాంతి కల్పించారు. బీజేపీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషిలను తప్పించారు. పార్టీని అన్నీ తానే అయి నడిపించిన లాల్ కృష్ణ అద్వానీ శకం బీజేపీలో దాదాపుగా ముగిసినట్లే అయింది. 1980 నుంచి పార్టీకి రెండు కళ్లుగా వ్యవహరించిన ఇద్దరిలో వాజ్‌పేయి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరమైతే.. రామ రథయాత్రతో బీజేపీకి వైభవాన్ని తెచ్చిపెట్టిన అద్వానీ క్రమంగా కనుమరుగు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరికీ తోడుగా పార్టీని ప్రభావితం చేసిన మురళీమనోహర్ జోషీకీ ‘విశ్రాంతి’ తప్పలేదు. నూతన కమల దళపతి అమిత్‌షా నేతృత్వంలో 12 మందితో పార్టీ విధాన నిర్ణాయక పార్లమెంటరీ బోర్డు ఏర్పడింది. దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. అయితే విశ్రాంతినిచ్చిన ఈ ముగ్గురు నేతల సేవలను వినియోగించుకోడానికి కొత్తగా ఓ మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఐదుగురు సభ్యులుండే ‘మార్గదర్శక్ మండల్’లో వీరికి స్థానం కల్పించారు. పార్టీ కి సలహాలివ్వటం ఈ మండలి పని. ఈ ముగ్గురితో పాటు మోడీ, రాజ్నాథ్లూ ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. మూడుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంవైపు నడిపించిన మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డాలకు కొత్తగా పార్టీపార్లమెంటరీ బోర్డులో చోటు దక్కింది. పార్టీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోడీతో చర్చించిన అనంతరం కమళదళం నూతన సారథి అమిత్ షా ఈ మార్పులు చేపట్టారు. ప్రతి విభాగంలోనూ ప్రధాని మోడీ ముద్ర స్పష్టంగా కనిపించింది. - అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని 15 మందికి కుదించారు. - రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుల సంఖ్య 19 ఉండగా, కొత్త అధ్యక్షుడు అమిత్‌షా సభ్యుల సంఖ్యను 15కు పరిమితం చేశారు. - బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయ రాహత్కర్ నియమితులయ్యారు. - కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓర్నంకు 15 మంది సభ్యులు ఉండే పార్టీ ఎన్నికల కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీ నుంచి యూపీ నేత వినయ్ కతియార్‌ను తప్పించారు. పార్లమెంటరీ బోర్డు అమిత్ షా, నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ, అనంత్‌కుమార్, థావర్‌చంద్ గెహ్లాట్, శివరాజ్‌సింగ్ చౌహాన్, జగత్ ప్రకాష్ నడ్డా, రామ్‌లాల్ మార్గదర్శక మండలి ఏబీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్జోషి, నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ ఎన్నికల కమిటీ అమిత్ షా (అధ్యక్షుడు), నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య, నితిన్ గడ్కారీ, అనంత్‌కుమార్, థావర్‌చంద్ గెహ్లాట్, శివరాజ్ సింగ్ చౌహాన్, జగత్ ప్రకాశ్ నడ్డా, రామ్‌లాల్, జూయల్ ఓరం, షానవాజ్ హుస్సేన్, విజయ రహాట్కర్ -
మధ్యప్రదేశ్ సీఎం నిరాహార దీక్ష
రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా... భోపాల్: నిరసన, నిరాహార దీక్షలు చేపడుతున్న సీఎంల జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆపన్న హస్తం అందించలేదని ఆరోపిస్తూ రాజధాని భోపాల్‌లో తన సహచర మంత్రులతో కలిసి గురువారం ఆయన నాలుగు గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి మధ్యప్రదేశ్ రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తమ మంత్రివర్గం మొత్తం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించేందుకు కూడా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తుపాను, అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికే తాము రూ.2వేల కోట్లతో ఆదుకున్నామని, ఇది ఇంతటితో ఆగబోదని మరింత సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ. 7.42 కోట్లను కూడా రైతులకు అందించామని పేర్కొన్నారు. శాశ్వత జాతీయ విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో జరిపిన తన పర్యటనను సైతం విపక్ష కాంగ్రెస్ రాజకీయం చేసిందని విరుచుకుపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం దక్కేలా కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని సరళీకరించాలని ఈ సందర్భంగా కోరారు. -
శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
-
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
-
మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్ ప్రమాణం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రామ్నరేష్యాదవ్ ఆయనతో ప్రమాణం చేయించారు. శివరాజ్‌సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్సింగ్, పార్టీ లోక్‌సభాపక్షనేత సుష్మాస్వరాజ్... అగ్రనేతలు అద్వానీ, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాజస్థాన్ సీఎం వసుంధరారాజే, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఇతర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్, మిజోరంలలో నేడే పోలింగ్
భోపాల్/ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో సోమవారం 270 అసెంబ్లీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో మొత్తం 2,583 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 4,64,57,724 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్నీ, విదిష స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ‘అభివృద్ధి’ మంత్రంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత అజయ్ సింగ్ కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చుర్హత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 142 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన ఎండీఏ మొత్తం 40 స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 6,90,860 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలిసారి ప్రింట్ అవుట్ విధానం... దేశంలోనే తొలిసారిగా మిజోరంలోని 10 నియోజకవర్గాల్లో వీవీపీఏటీ(ఈవీఎం ప్రింట్ అవుట్) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఫలితంగా ఈవీఎంకు అమర్చిన వీవీపీఏటీ మిషన్ల ద్వారా ఓటరుకు తాను వేసిన ఓటుకు సంబంధించి ఓ ముద్రిత ప్రతి అందుతుంది. తద్వారా తాను వేసిన ఓటు సరిగా పడిందో లేదో అప్పటికప్పుడే పరిశీలించుకునే సౌలభ్యం సంబంధిత ఓటరుకు కలుగుతుం ది. నాగాలాండ్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఈసీ ఇప్పుడు మిజోరంలో అమల్లోకి తెస్తోంది. -
కమలానికి ‘కరెంటు’ గుబులు!
మధ్యప్రదేశ్‌లో వ్యవసాయానికి సరిగ్గా విద్యుత్ ఇవ్వలేకపోయిన చౌహాన్ సర్కారు ఎన్నికల్లో ఆ అంశం ప్రతికూలంగా మారే అవకాశం రైతులను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ మధ్యప్రదేశ్ నుంచి సాక్షి ప్రతినిధి ప్రవీణ్ కుమార్ లెంకల: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ‘కరెం టు కష్టాలు’ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 60 శాతం బోర్లు, బావులపై ఆధారపడిన వ్యవసాయ రంగానికి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ సర్కారు గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విద్యుత్ సరఫరా చేయలేకపోవడం ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభా వం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 50 జిల్లాలున్న మధ్యప్రదేశ్‌లో బేతుల్, చింద్వాడ, బాలాఘాట్, డిండౌ రీ, అన్నుపూర్, ఉమరియా, షెహడోల్, సీథీ జిల్లాల్లో సాగునీటి సదుపాయం లేకపోవడంతో రైతులు వర్షాధారంగానే పంటల ను సాగుచేస్తున్నారు. రీవా, సత్నా, పన్నా తదితర జిల్లాల్లో రైతులు బోర్లు, బావుల ద్వారా పంటలు సాగుచేస్తున్నా పొలాలకు రోజుకు కేవలం నాలుగైదు గంటలే కరెంటు సరఫరా అవుతోంది. దీనికితోడు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కరెంటు కోతలు అమలవుతున్నాయి. మాండ్లా, డిండోరి తదితర జిలా ్లల్లో అధిక నీరు అవసరమైన వరి పంటను కూడా వర్షాధారంగానే పండిస్తుండటం రైతుల కరెంటు కష్టాల తీవ్రతను తెలి యజేస్తోంది. పంటకాలం మధ్యలో వర్షాలు పడకపోతే బోర్లు వేయించుకునే స్థోమతలేని ఇక్కడి రైతులు సమీపంలోని వాగులు, వంకల నుంచి డీజిల్ ఇంజిన్ల ద్వారా తాత్కాలిక పైపులైన్లు వేసుకోవడం, లేదా ఎడ్లబండ్లలో డ్రమ్ముల ద్వారా నీరు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానంవైపు ఆశగా చూస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే రూ.51 వేల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయానికి ఆరు నెలలపాటు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వడం రైతులను ఆకర్షిస్తోంది. ఈ పరిణామం అధికార బీజేపీలో గుబులు పుట్టిస్తోంది. -
సోనియాపై రూ.10కోట్ల దావా!
భోపాల్: అసత్య ఆరోపణలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆయన భార్య సాధనాసింగ్ నోటీసు జారీ చేశా రు. చౌహాన్‌ల ఇంట డబ్బులను లెక్కించే మెషిన్ ఉందని, ముఖ్యమంత్రి తన సమీప బంధువులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ పత్రికల్లో, ఇంటర్నెట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇవ్వడంతో చౌహాన్ దంపతులు చర్య లు చేపట్టారు. ఆరోపణలను వెనక్కి తీసుకుంటూ 15రోజుల్లోగా ప్రకటన లివ్వకపోతే రూ.10కోట్ల మేర పరువు నష్టం వాటిల్లిందంటూ వ్యాజ్యం వేస్తామన్నారు. -
ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో పోటాపోటీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ ఉందని ‘జీ మీడియా- సీ ఫోర్’ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్న గత సర్వేలకు విరుద్ధంగా ఈ సర్వే ఫలితాలు ఉండటం విశేషం. మధ్యప్రదేశ్‌లో ద్విముఖ పోరు ఉందని, మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 100 -110 సీట్లు, కాంగ్రెస్‌కు 99 -109 సీట్లు రావచ్చని సర్వే వెల్లడించింది. బీఎస్పీకి 5-12 సీట్లు రావచ్చంది. ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను 51 శాతం, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను 31 శాతం ఓటర్లు కోరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ద్విముఖ పోరే నెలకొందని, మొత్తం 90 స్థానాలకు గానూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు రెండూ 41 నుంచి 46 సీట్లు గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. భర్త కంటే ధనవంతురాలు: విధిశ స్థానం నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సెహోర్ జిల్లాలోని బుధ్ని స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తన ఆస్తుల కన్నా తన భార్య సాధన సింగ్ ఆస్తులు ఎక్కువని ఆయ న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.3.8 కోట్లు కాగా చౌహాన్‌కు 2.4 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. -
మధ్యప్రదేశ్‌లో బీజేపీకి సంకటం!
ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంపై కార్యకర్తల ఆగ్రహం వారికి టికెట్లు రద్దు చేయాలంటూ నిరసనలు అసమ్మతి నేతల నుంచీ ఇబ్బందులు భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార బీజేపీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. 147 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ప్పటి నుంచీ అసమ్మతి జ్వాలలతో సతమతమవుతున్న పార్టీపై తాజాగా కార్యకర్తలు తిరుగుబాటుకు సిద్ధమవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు కేటాయించడంపై కార్యకర్తలు ఆగ్రహించడం, వారికి టికెట్లను రద్దు చేయాలంటూ వీధికెక్కడం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రసింగ్ తొమర్ సహా రాష్ట్ర నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా అటవీశాఖ మంత్రి సర్తాజ్ సింగ్ టికెట్‌ను రద్దు చేయాలంటూ కార్యకర్తలు భోపాల్‌లోని పార్టీ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టికెట్‌ను రద్దు చేయకుంటే అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తానని రెబెల్ నేత యోగేంద్రసింగ్ మండ్లోయ్ హెచ్చరించారు. అయితే కార్యకర్తల చర్య మొదటి జాబితా ప్రకటించాక వచ్చిన తొలి స్పందనేనంటూ బీజేపీ చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీగా ఉన్న నిరసనకారుల సంఖ్య ఈ విషయంలో పార్టీపై వ్యతిరేకతను చెప్పకనే చెబుతోంది. ‘‘మా మనోభావాలను పట్టించుకోకపోతే అభ్యర్థులను ప్రచారం కూడా చేసుకోనివ్వం’’ అని ఓ బీజేపీ కార్యకర్త పేర్కొన్నాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. మరోవైపు ఇప్పటికే టికెట్ దక్కనందుకు నిరసనగా పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి దేవీసింగ్ సరేయం బీజేపీకి గుడ్‌బై చెప్పి గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పోటీ చేసే యోచనలో ఉండగా మరికొందరు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అభ్యర్థుల రెండో జాబితాలో ప్రజావ్యతిరేక ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్లు ఇవ్వరాదని బీజేపీ భావిస్తోంది. కానీ తొలి జాబితాలో కేటాయించిన టికెట్లను రద్దు చేయడంపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటించే వరకూ వేచి చూడాలని యోచిస్తోంది. తద్వారా ఆ పార్టీ అసంతృప్తుల నుంచి పెల్లుబుకే వ్యతిరేకత తమ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో సమానం కాగలదని ఆశిస్తోంది. ఛత్తీస్‌గఢ్ మళ్లీ కమలానిదే! న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ఏబీపీన్యూస్- దైనిక్ బాస్కర్-నీల్సన్ సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ హ్యాట్రిక్ కొడతారని తెలిపింది. ఆ ముందస్తు సర్వే వివరాలు.. 90 సీట్లున్న అసెంబ్లీలో 44 శాతం ఓట్లతో బీజేపీ 60 సీట్లను కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్‌కు 27, స్వతంత్రులకు 3 సీట్లు దక్కుతాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన దక్షిణ, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ లాభపడి వరుసగా 12, 17 సీట్లు సాధిస్తుంది. మధ్య ఛత్తీస్‌లో కాంగ్రెస్ గతం కన్నా 7 సీట్లు నష్టపోయి 16 సీట్లతో సరిపెట్టుకుంటుంది. దేశంలో నిత్యావసరాల రేట్లు పెరిగినా రాష్ట్రంలో ఆ ప్రభావం లేకుండా చూసుకోవడమే బీజేపీకి లాభించిందని సర్వే చెప్పింది. నక్సలిజాన్ని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడడం కూడా ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని పేర్కొంది. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్లలో బీజేపీకే పట్టం!
భోపాల్/ఛత్తీస్‌గఢ్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి రాగలదని, ఈసారి మరిన్ని స్థానాలను అదనంగా చేజిక్కించుకోగలదని సీఎన్ఎన్-ఐబీఎన్, ది వీక్ సర్వే వెల్లడించింది. అక్టోబర్ 13-20 తేదీల్లో నిర్వహించిన ఈ సర్వేలో తిరిగి బీజేపీకే పట్టం కట్టాలనుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల ఓటర్లూ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందని సీఎన్ఎన్-ఐబీఎన్, ది వీక్ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం బీజేపీకి 50 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 61-71 స్థానాలు లభించే అవకాశాలు ఉండగా, 38 స్థానాలున్న కాంగ్రెస్, ఈసారి 16-24 స్థానాలతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుందని ఈ సర్వే తేల్చి చెబుతోంది. ఓటర్లలో ప్రభుత్వ సానుకూలత మధ్యప్రదేశ్, ఛత్తీస్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌లకు ఈ ఎన్నికల్లో కలసి వచ్చే అంశం. ఛత్తీస్‌గఢ్ ఓటర్లలో 47 శాతం మంది ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. రమణ్‌సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 69 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత అజిత్ జోగీకి కేవలం 18 శాతం ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. ఒకవైపు ఓటర్లలో ప్రజాదరణ లేకపోగా, మరోవైపు పార్టీలోని ముఠా కుమ్ములాటలు కాంగ్రెస్‌కు సమస్యగా మారాయి. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని ఓటర్లు అభిప్రాయపడుతున్నా, రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్స్ సమస్యను ఎదుర్కోవడంలో బీజేపీ మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆహార భద్రత చట్టం ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 80 శాతం మంది, బీపీఎల్ వర్గాల్లో 93 శాతం మంది లబ్ధి పొందుతున్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సైతం గడచిన ఐదేళ్లలో బీజేపీ మరింతగా బలం పుంజుకుంది. రాష్ట్రంలోని 230 స్థానాల్లో బీజేపీకి 148-160 స్థానాలు లభించే అవకాశాలు ఉండ గా, కాంగ్రెస్‌కు 52-62 స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయి. శివరాజ్‌సింగ్ చౌహాన్ పనితీరుపై 78 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
రతన్‌గడ్ ఘటనలో కలెక్టర్, ఎస్పీ సహా 19 మంది సస్పెన్షన్
రతన్‌గడ్ దేవాలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగి 117 మంది మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. అ ఘటనకు బాధ్యులు భావిస్తూ దతియా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లతోపాటు మరో 19 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వచ్చే నెల 25 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో వారందరిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సస్పెన్షన్ చేశారు. అలాగే ఆ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేపట్టిన విచారణ మంగళవారం నుండి ప్రారంభం అవుతుందని సోమవారం సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందజేస్తారని తెలిపారు. తొక్కిసలాటకు ముందు భక్తులతో, ఘటన అనంతరం మృతదేహలతో పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అన్ని అంశాలపై జడ్జి విచారణ జరిపి నివేదిక అందజేస్తారని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌గడ్ దేవాలయం సమీపంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 117 మంది మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.