
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర విధాన సభ ముందు ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు.తాను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బామర్దిని అంటూ హంగామా సృష్టించాడు. ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆ వ్యక్తిని పోలీసులు ఆపారు. దీంతో తాను ముఖ్యమంత్రి బామ్మర్దినని, తనకే జరిమానా విధిస్తారా అంటూ ఆందోళన చేశాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మరి కొంతమంది పోలీసులు వచ్చి గొడవను తగ్గించారు.
కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారి భర్తలందరూ తనకు బావబామ్మర్దులు అవుతారని నవ్వుతూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment