
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ విమర్శించారు. సోమవారం ఆయన నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ‘‘గతంలో శరద్‌పవార్ నాకు లేఖ రాశారు. వ్యవసాయ మార్కెట్ యాక్ట్‌లో సవరణలు తేవాలని లేఖలో రాశారు. సోనియా, రాహుల్, శరద్‌పవార్ ప్రైవేట్ మార్కెట్ల ఓపెన్‌కు అనుకూలంగా మాట్లాడారు.ఇప్పుడు బీజేపీ అదే నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకిస్తున్నారని’’ ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవేనని శివరాజ్‌సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment