మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్ ప్రమాణం | Shivraj Singh Chauhan takes oath as Madhya Pradesh Chief Minister | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్ ప్రమాణం

Published Sat, Dec 14 2013 2:54 PM | Last Updated on Mon, Oct 8 2018 3:31 PM

మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్ ప్రమాణం - Sakshi

మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్ ప్రమాణం

భోపాల్ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ రామ్‌నరేష్‌యాదవ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. శివరాజ్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి.

ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్‌, పార్టీ లోక్‌సభాపక్షనేత సుష్మాస్వరాజ్‌... అగ్రనేతలు అద్వానీ, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాజస్థాన్‌ సీఎం వసుంధరారాజే, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ ఇతర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement