Madhya Pradesh CM
-
వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు
భోపాల్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్‌కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ భావించడం లేదు. నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు. గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్‌ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్‌ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు. -
ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ
భోపాల్: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధిలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. -
ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: హిందీలో వైద్య విద్యను అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఇకపై ప్రిస్కిప్షన్లపై తొలుత ‘శ్రీహరి’ అని రాసి తర్వాత మందుల పేర్లు రాయొచ్చన్నారు. ‘‘పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటి?’’ అన్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్‌లో హిందీలో వైద్య పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు. -
సాక్షి కార్టూన్ 14-7-2022
...షోకాజ్‌లు ఇస్తున్నారని ఇప్పుడే నిప్పుల మీద నుంచి తీసిన చాయ్ ఇచ్చాన్సార్! -
వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు..
సాక్షి, సిద్దిపేట: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేదని నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని.. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు ఉంది. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం పదవి పొందిన శివరాజ్‌కి సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. సీఎంగా నాలుగేళ్లలో ఏం సాధించావు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించింది’’ అంటూ దుయ్యబట్టారు. వ్యాపం సంగతేంటి? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం జరిగింది. ఆ కేసులో ఎవరికైనా శిక్ష పడిందా..? విచారణ నీరుగార్చేందుకు మనుషులనే మీరు చంపేశారు. ఈ విషయంలో మీ కుటుంబం మీద, మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అలాంటి మీరా తెలంగాణలో అవినీతి ఉందంటూ ఆరోపణలు చేసేది అంటూ దుమ్మెత్తిపోశారు. రాజకీయ దురుద్దేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా చెప్పారు. విమర్శలు చేసే ముందు ఓ సారి నిజానిజాలు పరిశీలించుకోవాలని’’ హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగాలు రావొద్దా ? 317 జీవో రద్దు చేయాలంటున్నారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా ? ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడి వారికి ఉద్యోగాలు రావద్దన్నట్టుగా బీజేపీ కుట్ర చేస్తోందంటూ హరీశ్ మండిపడ్డారు. -
మధ్యప్రదేశ్ లో కొలువుతీరనున్న బీజేపీ ప్రభుత్వం
-
జనతా కర్ఫ్యూని పాటించండి
భోపాల్: మధ్యప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే అని సూచన ప్రాయంగా తెలుస్తోంది. ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూని పాటించండంటూ చౌహాన్ ప్రజలను కోరడం ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా లేఖను గవర్నర్‌కి సమర్పించిన అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాలనీ, ఎవ్వరూ బయటకు రాకూడదనీ, జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుని ప్రజలంతా పాటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలను కోరారు. అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలిందనీ, అందులో బీజేపీ పాత్ర లేదన్నారు. అయితే తమ పార్టీ శాసనసభ్యులకు బీజేపీ డబ్బులు ఎరగా వేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌కి ఎవరు సీఎం కావాలనే విషయంలోనూ చౌహాన్‌కీ, మిశ్రాకీ విభేదాలున్నాయని దిగ్విజయ్ అన్నారు. -
కమల్‌నాథ్ రాజీనామా
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కమల్‌నాథ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టాండన్‌కి కమల్‌నాథ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. కమల్ నాథ్ రాజీనామాతో 15 నెలల కాంగ్రెస్ పాలన అర్థాంతరంగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. 22 మంది శాసనసభ్యుల రాజీనామా చేయడంతో బలపరీక్షకు సుప్రీంకోర్టు శుక్రవారం సమయమిచ్చింది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్‌పార్టీ శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గడువునిచ్చిన మరునాడే కమల్‌నాథ్ రాజీనామాకు ఉపక్రమించారు. గవర్నర్‌కి సమర్పించిన రాజీనామా పత్రంలో ‘నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామిక విలువలతో కూడిన, స్వచ్ఛమైన రాజకీయాలు నెరపాను. వాటికే ప్రాముఖ్యతనిచ్చాను. ఐతే గత రెండు వారాల్లో ప్రజాస్వామ్య విలువలకు స్వస్తిపలికే సరికొత్త అధ్యాయానికి బీజేపీ తెరతీసింది’ అని కమల్‌నాథ్ ఆరోపించారు. గవర్నర్‌కి రాజీనామా సమర్పించిన కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌కి కాబోయే నూతన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తన తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఈ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కి అందజేయడానికి ముందు కమల్‌నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్ని ప్రజాస్వామిక విలువలను ఖూనీ చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి జ్యోతిరాదిత్య సింధియా కారకుడంటూ నిందించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనకు అనుకూలంగా 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షకు సిద్ధం కమ్మంటూ సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వానికి గురువారం గడువునిచ్చింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ శాసనసభలో 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విశ్వాసపరీక్ష కోసం మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైంది. కమల్‌నాథ్ రాజీనామాతో రాష్ట్ర అసెంబ్లీ వాయిదాపడింది. ఒంటిగంట ప్రాంతంలో కమల్‌నాథ్ గవర్నర్‌కి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపిన స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి, కమల్‌నాథ్ రాజీనామాతో ఆ ఆవశ్యకత లేదని వెల్లడించారు. -
కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి కోవిడ్‌తో తాత్కాలిక ఊరట లభించనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండగా ఎమ్మెల్యేల వేరు కుంపటితో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. కోవిడ్ భయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తత ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించింది. శనివారం మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవసరం కూడా ప్రస్తుతానికి కమల్‌నాథ్ ప్రభుత్వానికి తప్పనుంది. విశ్వాసపరీక్ష జరపాలి: బీజేపీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం గవర్నర్ టాండన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆదివారమే బలపరీక్ష చేపట్టాలి’ అని గవర్నర్‌ను కోరామన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం విమానాశ్రయం నుంచి వెళ్తున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదుట నల్ల జెండాలు ప్రదర్శించిన 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ఎన్నార్సీ లేని ఎన్పీఆర్ ఓకే
భోపాల్/బెంగళూరు/లక్నో/ వాషింగ్టన్: జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) బదులు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అమలు చేయాలని తమ పార్టీ కోరుకుంటోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రకటించారు. ఎన్పీఆర్తో కలిపి ఎన్నార్సీని చేపట్టడంపై వెనుక మోదీ ప్రభుత్వ ఉద్దేశాలపై∙అనుమానం వ్యక్తం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా భోపాల్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఏఏలో లొసుగులున్నాయి. ఎన్పీఆర్ను మేం కోరుకుంటున్నాం. అయితే, ఎన్నార్సీతో కలిపి కాదు. కేంద్రం రెంటినీ కలిపి తేవడం వెనుక కేంద్రం ఉద్దేశం స్పష్టమవుతోంది. సీఏఏ, ఎన్నార్సీ వంటి చట్టాలు గతంలో ఎన్నడూ లేవు’ అని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోదన్నారు. అపోహలు దూరం చేసేందుకు: దుష్ప్రచారం, అపోహల కారణంగానే భారత్‌లో ఎన్నార్సీ, సీఏఏపై ఆందోళనలు చెలరేగాయంటూ భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. అమెరికాలోని పలు నగరాల్లో ఎన్నార్సీ, సీఏఏ అనుకూల ర్యాలీలు చేపట్టారు. డల్లాస్, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, శాన్‌జోస్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొడతారనే అపోహలు, వామపక్ష సంస్థల ప్రచారం కారణంగా భారత్‌లో నిరసనలు జరుగుతున్నాయని వినీత్ అనే నిర్వాహకుడు తెలిపారు. పథకం ప్రకారం అల్లర్లు: మంగళూరులో పోలీసుల కాల్పుల ఘటనపై దర్యాప్తు నివేదిక అందే వరకు కాల్పుల్లో మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని నిలిపివేస్తున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ‘నేరస్తులకు పరిహారం క్షమార్హం కాని నేరం. మంగళూరు అల్లర్లు పథకం ప్రకారం జరిగాయి. ఆనాడు ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. వారిని వదలం’ అని అన్నారు. 60 మందికి యూపీ సర్కారు నోటీసులు సీఏఏకి వ్యతిరేకంగా రాంపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఆందోళనల్లో హింసకు కారణమైన 60 మందికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన అధికారులు..అల్లర్ల కారణంగా రూ.25 లక్షల మేర ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. దీంతో ఇందుకు కారణమైన 28 మందికి బుధవారం నోటీసులిచ్చారు. దీనిపై వారు వారంలోగా వివరణ అయినా ఇవ్వాలి లేదా నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. లేకుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు కారకులుగా గుర్తించిన 33 మందికి పోలీసులు నోటీసులిచ్చారు. -
పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్
సాక్షి, ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో వివాదాలపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. ఇలాంటివి తమ పార్టీలోనే కాదు ప్రతీ పార్టీలోనూ ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడారు. జ్యోతిరాదిత్య సింధియాతో విభేదాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. అదేం పెద్ద సమస్య కాదని కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవిని సింధియాకు ఇచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు ఎందుకుఇవ్వకూడదని తిరిగి ప్రశ్నించారు. ఆయనకు అనుభవముంది. నాయకత్వ లక్షణాలున్నాయి. తనకంటూ ఓ టీమ్ ఉందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న సింధియా సీఎం కావాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం కమల్‌నాథ్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు సింధియా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు. ఇది సింధియాకు మైనస్‌గా మారిందని పార్టీ వర్గాల సమాచారం. అంతేకాక ఇటీవల వచ్చిన వర్షాలకు మధ్యప్రదేశ్‌లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ విషయంలో ప్రభుత్వ చర్యల పట్ల సింధియా అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై వెంటనే సర్వే నిర్వహించి బాధితులను ఆదుకోవాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ విషయం కమల్‌నాథ్ ముందుంచగా, రుతుపవనాలు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. ఇప్పుడు సర్వే నిర్వహించినా తర్వాత మళ్లీ వరదలొస్తే రీసర్వే నిర్వహించమని డిమాండ్ చేస్తారు. అలా కాకుండా పరిస్థితులు సద్దుమణిగాక ఒకే సారి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై కమల్‌నాథ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. -
కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కమల్‌నాథ్‌పై నమోదైన కేసును రీ–ఓపెన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది. కమల్‌నాథ్ కేసుతో పాటు మరో 6 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను సిట్ పునర్విచారణ జరపనుంది. ఈ విషయమై ఢిల్లీ సిక్కుల గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే మన్జిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ..‘1984 అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై నమోదైన కేసును సిట్ పునర్విచారించనుంది. సిక్కుల ఊచకోతకు సంబంధించి 7 కేసుల్లో నిందితులైన ఐదుగురికి కమల్‌నాథ్ ఆశ్రయం కల్పించారు. గతేడాది నేనుచేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన హోంశాఖ, తాజా సాక్ష్యాల ఆధారంగా మళ్లీ విచారణ జరిపేందుకు వీలుగా కేసు నంబర్ 601/84ను రీ–ఓపెన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇది అకాలీదళ్ సాధించిన విజయమే. ఈ కేసును మళ్లీ విచారించనున్న సిట్‌కు ధన్యవాదాలు. సిక్కులను కమల్‌నాథ్ చంపుతుండగా చూసిన సాక్షులు ధైర్యంగా ముందుకు రండి. భయపడాల్సిన పనిలేదు. కమల్‌నాథ్ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముక్తియార్ సింగ్, సంజయ్ సూరీ సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే కమల్‌నాథ్ అరెస్ట్ అవుతారు. కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు పట్టిన గతే(యావజ్జీవ శిక్ష) కమల్‌నాథ్‌కు పడుతుంది. ’ అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనీ, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు సహకరించాలని మన్జిందర్ సింగ్ కోరారు. కమల్‌నాథ్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలేను పట్టుకునేందుకు ప్రధాని ఇందిర ఆదేశాలతో ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను చేపట్టింది. ఆపరేషన్‌లో స్వర్ణ దేవాలయం తీవ్రంగా దెబ్బతినడం, ఆర్మీ బూట్లతో ఆలయంలోకి వెళ్లడంతో ఈ చర్యను తమ మతంపై దాడిగా సిక్కులు భావించారు. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 31న సిక్కు మతస్తులైన సొంత బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కు మతస్తులు లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా వద్ద కమల్‌నాథ్ నేతృత్వంలో విధ్వంసానికి దిగిన అల్లరిమూక ఇద్దరు సిక్కులను చంపేసింది. ఈ ఘటనపై 2000లో బీజేపీ ప్రభుత్వం నానావతి కమిషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్‌నాథ్.. ‘ఆ రోజున నేను ఘటనాస్థలిలోనే ఉన్నా. ఆవేశంతో ఊగిపోతున్న అల్లరిమూకను శాంతింపజేసేందుకు ప్రయత్నించా’ అని వాంగ్మూలమిచ్చారు. చివరికి నానావతి కమిషన్ ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కమల్‌నాథ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద విడిచిపెట్టింది. తాజాగా ఈ కేసులో కమల్‌నాథ్ పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలున్నాయని భావించిన కేంద్రం, కేసును రీ–ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శస్త్రచికిత్స జరిగింది. భోపాల్‌లోని హమిదియా హాస్పటల్లో ఆయన వేలుకు (ట్రిగ్గర్ ఫింగర్) వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది,. కొన్ని గంటలపాటు ముఖ్యమంత్రిని అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘కమల్ నాథ్ శనివారం ఉదయం 9 గంటలకు హమీదియా ఆసుపత్రిలో చేరారు. అతని కుడి చేతి ట్రిగ్గర్ వేలికి ఆస్పత్రి వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది’ అని గాంధీ మెడికల్ కాలేజీ డీన్ అరుణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీఎంకు కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. మరోవైపు హాస్పటల్లో ఇతర రోగులు, సిబ్బందికి అసౌకర్యం కలిగించవద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దంటూ కమల్‌నాథ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్‌నాథ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. -
హామీలు నెరవేర్చకుంటే బట్టలిప్పి కొట్టండి!
ధనోరా: లోక్‌సభ ఎన్నికల్లో ఛింద్వారా నుంచి తన కుమారుడు నకుల్‌నాథ్‌ను గెలిపించాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రజలను కోరారు. ఒకవేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే అతని దుస్తులను చించివేసి శిక్షించాలని సూచించారు. ధనోరా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఛింద్వారా నియోజకవర్గంతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమల్‌నాథ్..‘నకుల్ ప్రస్తుతమిక్కడ లేకపోయినా మీకు సేవ చేస్తాడు. నకుల్‌కు ఆ బాధ్యతను నేను అప్పగించాను. మీరిచ్చిన శక్తి, ప్రేమ వల్లే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను. మనం త్వరలోనే సరికొత్త చరిత్రను సృష్టించడంతో పాటు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం’ అని అన్నారు. -
మధ్యప్రదేశ్‌లో 281 కోట్ల అక్రమ నిల్వలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన సోదాల్లో రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని ఐటీ అధికారులు చెప్పారు. ఈ నిధుల్ని సేకరించేందుకు విస్తృతంగా వ్యవస్థీకృత రాకెట్ ఒకటి నడుస్తోందని తెలిపారు. ఆదివారం నాటి దాడుల్లో లెక్కల్లో చూపని రూ.14.6 కోట్ల నగదు, మధ్యప్రదేశ్–ఢిల్లీ మధ్య జరిగిన అనుమానిత లావాదేవీలకు సంబంధించిన కంప్యూటర్ ఫైల్స్‌ను జప్తు చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో నివాసముంటున్న ఓ నాయకుడి ఇంటి నుంచి నుంచి ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయానికి రూ.20 కోట్లు తరలించినట్లు గుర్తించామని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) తెలిపింది. నకిలీ బిల్లుల ద్వారా రూ.242 కోట్లను దోచుకున్నట్లు కనిపెట్టామని పేర్కొంది. -
కమల్‌నాథ్ సంబంధీకులపై ఐటీ దాడులు
భోపాల్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్లపై ఆదాయ పన్ను శాఖ దాడుల చేసింది. ఐటీ ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై 200 మంది ఐటీ అధికారులు, పోలీసులు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 50 చోట్ల సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు భద్రతగా సీఆర్పీఎఫ్ బలగాల్ని మోహరించారు. ఇండోర్, భోపాల్, ఢిల్లీలో సోదాల్లో కమల్‌నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు. సీఎం బావమరిది సంస్థ మోసర్ బేయర్, మేనల్లుడు రతుల్ పూరి సంస్థల ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో సోదాలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియాకూ ఓఎస్డీగా ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భూరియా రాట్లాం–జాబువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో గత వారం ఈడీ ఢిల్లీలో రతుల్ పూరిని విచారించింది. కోల్‌కతాకు చెందిన వ్యాపారి పరాస్ మల్ లోధా కార్యాలయంలో కూడా దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐటీ దాడులపై కమల్‌నాథ్ స్పందిస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. భోపాల్‌లో ‘కోల్‌కతా’ డ్రామా ఐటీ దాడుల సందర్భంగా భోపాల్‌లో కోల్‌కతా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్రవీణ్ కక్కడ్ సన్నిహితుడు ప్రవీణ్ ఇంటికి పోలీసులొచ్చాక సీన్ సీరియస్‌గా మారింది. పోలీసులను చూడగానే ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ సాయంతో ఇంటి తలుపులు మూసేశారు. దీంతో కొద్ది సేపు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. లోపల సోదాలు కొనసాగుతున్నందునే బయటి వారికి అనుమతించలేదని అన్నారు. తమ చర్యను భోపాల్ పోలీసులు సమర్థించుకున్నారు. ఐటీ దాడులతో తమకేం సంబంధం లేదని, ప్రవీణ్ కుమార్ నివాసంలో ఒకరికి అత్యవసరంగా వైద్యం అందించాలని సమాచారం అందిందని, అందుకే అక్కడికి తమ సిబ్బంది వెళ్లారని భోపాల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. -
17న కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్‌నాథ్‌కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్‌నాథ్‌ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్‌సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్‌పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్‌లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్‌నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
వాటర్‌ఫాల్స్‌లో కొట్టుకుపోయిన యువకులు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం ప్రమాదం చోటు చేసుకుంది. శివపురి, గ్వాలియర్ పరిధిలోని సుల్తాన్‌ఘర్ జలపాతంలో కొంతమంది యువకులు కొట్టుపోయారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురిని రక్షించగలిగారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, హెలికాఫ్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15సెలవు దినం, మరోపక్క వర్షాల కారణంగా నిండుగా కళకళలాడుతున్న జలపాతాలు. దీంతో దాదాపు 20మంది యువకులు జలపాతానికి పిక్నిక్కి వెళ్లారు. అయితే హఠాత్తుగా వరద నీరు పోటెత్తడంతో 11మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పిక్నిక్ వెళ్లినవారు స్నానాలు చేస్తుండగా ఉధృతంగా నీరు కిందికి ప్రవహించడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. 100 అడుగుల ఎత్తు నుండి నీరు వేగంగా కిందికి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రెస్య్కూ టీం ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడిందనీ, పదకొండుమంది యువకులు కొట్టుకుపోయారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు. దాదాపు 30-40మంది ఇంకా అక్కడే చిక్కుకు పోయినట్టు చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రంనుంచి భారీగా కురుస్తున్న వర్షం, చీకటి సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా నీటికి దిగువకు వదలడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పద్మావతిపై మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం
సాక్షి,భోపాల్: వివాదాస్పద పద్మావతి మూవీపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్పుట్ సంఘాలు వినతి పత్రం ఇచ్చిన మీదట సీఎం చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్ సమస్యల నేపథ్యంలో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర మేకర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలను ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి పేర్కొన్నారు. మరోవైపు బోర్డు సర్టిఫికెట్ పొందకుండానే పలు మీడియా ఛానెళ్లకు చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్సీ నిర్మాతకు తిప్పిపంపింది. -
24 గంటలు తిరక్కముందే సీఎం ట్విస్ట్
భోపాల్: రాష్ట్రంలో రైతులు ఆందోళన విరమించి, శాంతి నెలకొనేవరకు దీక్ష కొనసాగిస్తానన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శిరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్యంగా దీక్ష విరమించారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష ప్రారంభించి సరిగ్గా 24 గంటలు కూడా గడవకముందే ఆయన దీక్ష విరమణ ప్రకటన చేయడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం రైతు సంఘాల నేతలు, రాష్ట్ర మంత్రులు కలిసి సీఎంకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. నిరాహార దీక్ష చేయవద్దని రైతులు కోరినందునే తానీ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం శివరాజ్ మీడియాకు తెలిపారు. రుణాల మాఫీ, కనీస మద్దతుధర అంశాలపై రైతులు ఆందోళన చేయడం, మాంద్సౌర్లో ఐదుగురు రైతులను పోలీసులు కాల్చిచంపడంతో మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రహింస చెలరేగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతిని కాంక్షిస్తూ సీఎం శివరాజ్ శనివారం నుంచి నిరాహారదీక్షకు దిగారు. అయితే మాంద్సౌర్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు సీఎంను కలిసి దీక్ష విరమించాలని కోరారు. ఆ మేరకు సీఎం నిమ్మరసం సేవించారు. కాగా, రైతులపై కాల్పులు జరిపినవాని కఠినంగా శిక్షిస్తామని సీఎం అన్నారు. -
నిరాహార దీక్ష చేపట్టిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకూ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చౌహన్ తన భార్య సాధనతో కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు దీక్షలో కూర్చున్నారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష కొనసాగుతున్నది. కాగా మందసౌర్ జిల్లాలో రైతులపై కాల్పులు ఘటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా హింస పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసుల కాల్పుల్లో అయిదుగురు రైతులు మృతి చెందారు. దీంతో రైతులు రోడ్లను బైఠాయించి నిరసనలు, నినాదాలతో పాటు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం కూడా పోలీస్ కస్టడీలో ఉన్న మరో రైతు ప్రాణాలు కోల్పోవడంతో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి. ఈ ఆందోళనలు పక్క జిల్లాలకు కూడా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చౌహన్ ఈ దీక్షకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రి ....ఇక్కడ నుంచే పాలన కొనసాగిస్తారని అధికారులు తెలిపారు. ప్రజలు... సీఎంను కలిసి తమ సమస్యలను చర్చించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు రైతులకు పంట రుణాల నుంచి విముక్తి కల్పించడం అసాధ్యమని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జీఎస్ బైసన్ అభిప్రాయపడ్డారు. -
ఆ సీఎం ప్రధాని అవుతారని అద్వానీ భావించారు!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తుండగా, మరికొందరు కేంద్రంలో చోటు దక్కించుకునే పనిలో ఉన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడం, ఆపై మెజార్టీ పార్టీగా అవతరించకున్నా.. గోవా, మణిపూర్లలో చక్రం తప్పి అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది బీజేపీ. ఈ క్రమంలో మనోహర్ పారికర్ రక్షణమంత్రి పదవికి రాజీనామా చేసి, తన సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. గోవా సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్రం నుంచి పిలుపొచ్చిందని, ఆయనకు రక్షణశాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ వదంతులను సీఎం శివరాజ్ ఖండించక పోవడంతో అది నిజమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ఒకానొక దశలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ.. శివరాజ్ చౌహన్ ప్రధాని అవుతారని, ఆ పదవికి ఆయన సమర్ధుడని భావించారట. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో కన్నా అద్వానీతో శివరాజ్‌కు సత్సంబంధాలు ఉండేవి. 2005 నవంబర్ 28న తొలిసారిగా శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వ్యాపమ్ కుంభకోణం, అక్రమ మైనింగ్, డంపర్ స్కామ్ లాంటి సమస్యలను ఆయన ఎదుర్కొని నిలబడ్డారు. ప్రస్తుతం రక్షణశాఖ అదనపు బాధ్యతలను అరుణ్ జైట్లీకి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత హితేష్ బాజ్‌పాయ్ మాత్రం ఈ వదంతలును కొట్టిపారేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివరాజ్ నేతృత్వంలోనే బీజేపీ బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. శివరాజ్ కేంద్రానికి వెళ్లాలనుకుంటే ఇదే సరైన సమయమని, లేని పక్షంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించయినా కేంద్రానికి షిఫ్ట్ అవుతారని పార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు. -
సీఎం గారూ.. బూట్లు మోయిస్తారా?
ఉజ్జయిని: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శివరాజ్ తన బూట్లను భద్రత సిబ్బందితో మోయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుధవారం ఉజ్జయినిలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో శివరాజ్ పాల్గొన్నారు. వేదిక వద్దకు వెళ్లే మార్గం మధ్యలో జైన సన్యాసి ప్రగ్యా సాగర్ ఆశ్రమం వద్ద ఆయన కాసేపు ఆగారు. సీఎం తన బూట్లను ఆశ్రమం బయట వదలి లోపలకి వెళ్లారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత భద్రత అధికారి పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు బూట్లు తీసుకెళ్లారు. వాటిని వేసుకోవడానికి నిరాకరించిన శివరాజ్ సాక్సులతోనే దగ్గరలో ఉన్న వేదిక వద్దకు వెళ్లారు. ముందు శివరాజ్ వెళ్లగా, ఆయన వెనుక పోలీసు అధికారి బూట్లను మోసుకుంటూ వెళ్లారు. అయినా శివరాజ్ వారించే ప్రయత్నం చేయలేదు. అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో ఈ తతంగాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తూ నెటిజెన్లు కామెంట్ చేశారు. గతేడాది కూడా శివరాజ్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ రాష్ట్రంలో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రిని మోకాళ్లలోతు నీళ్లలో తడవకుండా ఉండేందుకు భద్రత సిబ్బంది ఇద్దరు చేతులపై ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ ఫొటో మీడియాలో రావడంతో శివరాజ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. (సీఎం గారూ.. మీరు చూపిన బాటలోనే) -
మధ్యప్రదేశ్ సీఎం నివాసాన్ని చూసే కట్టించా
ప్రగతి భవన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇటీవల సీఎం కేసీఆర్ గృహప్రవేశం చేసిన కొత్త క్యాంపు కార్యాలయం తరచూ వార్తల్లో అంశంగా మారుతోంది. అనవసరంగా నిర్మించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం, నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావనకు తేవడంతో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా మంగళవారం మరో సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రే దాన్ని ప్రస్తావించారు. మత్స్యశాఖపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన దీని గురించి మాట్లాడారు. ‘‘నేను మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ అధికార నివాసాన్ని చూసిన తర్వాత అలాంటి భవనం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండాలని భావించి ప్రగతి భవన్ నిర్మించా. మధ్యప్రదేశ్ సీఎం నివాసంలో దాదాపు 2 వేల మంది సామర్థ్యంతో భారీ సమావేశ మందిరం ఉంది. అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది పాల్గొనాల్సిన సమావేశాలకు అలాంటి హాలు అవసరం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంలో జనహిత పేరుతో అలాంటి హాల్‌నే నిర్మించా. దాదాపు 1,500 మంది ఇందులో కూర్చోవచ్చు. ఇప్పుడు ఆ హాలులో మత్య్యకార వృత్తిలో ఉండే వారితో సమావేశమవుతా. వీలైతే సంక్రాంతి సమయంలోనే సమావేశం ఏర్పాటు చేస్తా’’అని వివరించారు. మంత్రి తలసాని సూచనతో మంగళవారం ముఖ్యమంత్రి శాసనసభ వేదిక ద్వారా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా చేపట్టబోయే వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మించాలని సూచించానని, అవి కూడా నీటిని నిల్వ చేస్తే వాటిల్లో కూడా చేపలు పెంచే వెసులుబాటు ఉంటుందని సీఎం అన్నారు. -
రాహుల్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. రాహుల్ మాటలను ఎవరూ నమ్మరని, దేశంలో ఎవరు కూడా ఆయన్ను సీరియస్‌గా తీసుకోరని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా స్వాగతిస్తోందని చౌహాన్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అందుకే తనను పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాగా మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారమని, ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి అనంతకుమార్ అన్నారు. ఆధారాలుంటే రాహుల్ ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని, పార్లమెంటులో ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని మండిపడ్డారు. -
తల, ఛాతీలపై కాల్చి చంపారు!
సిమి కార్యకర్తల పోస్టుమార్టమ్ భోపాల్: తల, ఛాతీలపై కాల్చడంతోనే 8 మంది సిమి కార్యకర్తలు చనిపోయినట్లు మృతుల కుటుంబాల లాయర్ పర్వేజ్ అలమ్ తెలిపారు. వారిపై ముందువైపు నుంచే కాల్పులు జరిపారని చెప్పే పోస్టుమార్టమ్ నివేదికను తాను చూశానని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నడుము కింది భాగంలోనే పోలీసులు కాల్చాలని, కాని నడుము పైభాగంలో కాల్పులు జరిపారని పేర్కొన్నారు. భోపాల్ జైలులోని మిగిలిన 20 మందికిపైగా సిమి కార్యకర్తలపైనా విచక్షణా రహితంగా దాడి జరిగిందని ఆరోపించిన పర్వేజ్.. వారికి వైద్య పరీక్షలు జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. కాగా, పోస్టుమార్టమ్ అనంతరం సిమి కార్యకర్తల మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. ‘బిర్యానీ తింటున్నారు’ ‘ఉగ్రవాద నిందితులు జైళ్లలో ఏళ్లపాటు చికెన్ బిర్యానీ తింటూ గడిపేస్తున్నారు. విచారణ పూర్తయి, వారికి శిక్ష పడ్డానికి చాలా ఏళ్లు పడుతుంది. దీంతో రోజూ బిర్యానీ బాగా తింటారు.తర్వాత తప్పించుకుంటారు. నేరాలకు పాల్పడతారు. అవినీతి కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నప్పుడు, ఉగ్రవాదులను శిక్షించేందుకు మాత్రం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఎందుకు ఉండకూడదు’ అని మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. -
శివరాజ్‌సింగ్ ఇంట వినాయక నిమజ్జనోత్సవం
-
ఆ ఒక్క ఫొటోను హైలైట్ చేశారు : సీఎం
మధ్యప్రదేశ్‌లో వరదలు సంభవించిన నేపథ్యంలో పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలపాలయ్యారు. సోషల్ మీడియా వెబ్ సైట్లు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కూడా ఆయనపై కొంతమంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది మోస్తుండగా శివరాజ్ దర్జాగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు కనిపించే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలపై ఎట్టకేలకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన పలు ప్రాంతాలలో తాను పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. అయితే కేవలం ఓ ప్రాంతంలో తప్పనిసరి పరిస్థితులలో సిబ్బంది తమ చేతులతో తనను మోయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఇలాంటి ఒక్క ఫొటో దొరికిందన్న కారణంగా తనను విమర్శించడం తగదని సూచించారు. బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు డేవిడ్ కామెరాన్ స్వయంగా నడిచి వెళ్లి వరద ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారని శివరాజ్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా చేయడం సమంజసమేనా అని మరికొందరు నేరుగా శివరాజ్ చర్యను తప్పుపడుతున్నారు. మీరు కేవలం ఈ ఒక్క ఫొటోను చూసి తనను అంచనా వేయకూడదన్నారు. -
చాయ్‌వాలాగా మారిన సీఎం
ఉజ్జయిని: వెళ్లిన ప్రాంతాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి తగిన విధంగా ప్రవర్తిస్తుండటం, దుస్తులు ధరించడం రాజకీయ నేతలకు అలవాటే. ఉజ్జయినిలో జరుగుతోన్న మహా కుంభమేళాలోమధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే పనినిచేశారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా సిప్రా నదీ తీరంలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యాంప్ లను శుక్రవారం తెల్లవారుజామన సందర్శించిన ఆయన చాయ్ వాలా అవతారం ఎత్తారు. కెటిల్ చేతబట్టుకుని అక్కడున్న భక్త పరివారానికి చాయ్ పోసి సంతోషింపజేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఏప్రిల్ 22న మొదలై మే 21 వరకు కొనసాగే సింహస్థ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సిప్రా నదీ తీరంలో గురువారం భారీ వర్షం, ఈదురు గాలులు చోటుచేసుకోవడంతో గుడారాలు కూలి ఏడుగురు భక్తులు మృత్యువాతపడ్డారు. (చదవండి: కుంభమేళాలో అపశ్రుతి) -
జీతాల పెంపునకు ఓకే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటున్నారు. అయితే, ఇక్కడ ఉన్నంత కాకుండా కొంచెం తక్కువ మొత్తంలోనే అక్కడి జీతాలు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల జీతాలు రూ. 2 లక్షలకు పైగానే ఉండగా.. మధ్యప్రదేశ్‌లో మాత్రం ఎమ్మెల్యేల జీతం ప్రస్తుతం రూ. 71 వేలు ఉండగా, దాన్ని రూ. 1.10 లక్షల వంతున పెంచాలని ప్రతిపాదించగా దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రికి ప్రస్తుతం రూ. 1.43 లక్షలు జీతం ఉండగా దాన్ని రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. మంత్రులకు జీతాలు ప్రస్తుతం రూ. 1.20 లక్షలు ఉండగా దాన్ని రూ. 1.70 లక్షలకు పెంచారు. సహాయమంత్రుల జీతాలు ఇకమీదట రూ. 1.50 లక్షలు అవుతాయి. -
గణేశ్ నిమజ్జన వేడుకల్లో మధ్యప్రదేశ్ సీఎం
-
సీఎంతో సంభాషణ రికార్డు చేశా
వ్యాపమ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ వెల్లడి * ఆనంద్ రాయ్, ఆయన భార్యను బదిలీ చేసిన ప్రభుత్వం * కొద్ది గంటల్లోనే యూ టర్న్ ఇండోర్: వ్యాపమ్ స్కామ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో తన సంభాషణను రహస్యంగా రికార్డు చేశారనే విషయం వెలుగు చూసింది. ఆగస్టు 11న సీఎం అధికారిక నివాసంలో రాత్రి 9.45 నుంచి 10.50 దాకా చౌహాన్‌తో భేటీ అయ్యానని, తమ సంభాషణను చేతి గడియారంలోని కెమెరాతో రహస్యంగా రికార్డు చేశారని ఆనంద్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం సీఎంతో తన భేటీని రహస్యంగా రికార్డు చేసి... వారికి పనికొచ్చే భాగాలనే విడుదల చేస్తుందనే ఉద్దేశంతోనే తానీ పని చేశానని, బ్లాక్మెయిల్ చేసేందుకు కాదని అన్నారు. స్కాంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. అయితే శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డాక్టర్లయిన ఆనంద్ రాయ్, గౌరి దంపతులను ప్రభుత్వం ఇండోర్ నుంచి బదిలీ చేసింది. కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. పరపతి ఉన్న మంత్రులు, బీజేపీ నేతలపై తాను ఫిర్యాదు చేసినందువల్లే కక్షసాధించేందుకు ప్రభుత్వం తమను బదిలీ చేసిందని ఆనంద్ ఆరోపించారు. స్కాంలో తన పేరును, కుటుంబ సభ్యుల పేర్లను బయటపెట్టకూడదనే షరతుతో చౌహాన్ తమ బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించారన్నారు. సంభాషణను బయటపెడతారా? అని విలేకర్లు అడగ్గా ‘అలా చేయడం నైతికత అనిపించుకోదు’ అని రాయ్ బదులిచ్చారు. -
వ్యాపమ్ స్కామ్‌లో దోషులను వదలం
న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో ఒక్క దోషిని కూడా వదలిపెట్టేదిలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. తన రాజీనామాకు కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఆదివారం తోసిపుచ్చారు. 2013లో ఈ స్కామ్‌ను గుర్తించి తొలుత ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది తానేనని తెలిపారు. కేసు సంక్లిష్టత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తుకోసం టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేశామన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ హైకోర్టు నియమించిన సిట్ కింద పనిచేస్తోందని వివరించారు. రాష్ట్రంలో జరిగిన లక్షలాది ఉద్యోగ నియామకాల్లో కేవలం కొన్ని వందల కేసుల్లో మాత్రమే అవకతవకలు జరిగాయని, ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలోనే తాను ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వదిలేదిలేదని ఆయన స్పష్టంచేశారు. -
మీ వల్లే.. కాదు మీ వల్లే!
పార్లమెంట్ ప్రతిష్టంభనపై అధికార, విపక్షాల పరస్పర నిందలు న్యూఢిల్లీ: పార్లమెంటు కార్యక్రమాల ప్రతిష్టంభనపై అధికార, విపక్షాలు పరస్పర నిందారోపణలు ప్రారంభించాయి. ప్రతిష్టంభనలో ప్రభుత్వం తప్పు లేదని, విపక్ష కాంగ్రెస్, వామపక్షాలే దానికి కారణమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించగా.. ప్రధాని మోదీ అహంకారం, మొండి పట్టుదల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఎదురుదాడి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, సభను సజావుగా నడిపేందుకు సోమవారం మరోసారి అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిష్టంభనపై అన్ని విపక్ష పార్టీలతో చర్చించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని, శుక్రవారం కూడా అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ ముందుకురాలేదని వెంకయ్య చెప్పారు. 14 నెలల బీజేపీ పాలనలో అవినీతి ఆరోపణలేవీ రాలేదని శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘రెండు వారాలు సభను అడ్డుకోవడంతో కాంగ్రెస్ సంతోషంగా ఉంది. కానీ వారు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుర్తించలేకపోతున్నార’ని అన్నారు. సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి జీతభత్యాల్లో కోత విధించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. అలాంటి డిమాండ్లు మరిన్ని రావాలన్నారు. ప్రభుత్వం జరపనున్న అఖిలపక్ష భేటీపై కాంగ్రెస్ స్పందించింది. మోదీగేట్‌లో పాత్ర ఉన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్లు రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌పై ప్రధాని నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే.. అఖిల పక్ష భేటీకి వెళ్తామని చెప్పంది. ‘ఫొటోలు, టీ, శాండ్విచ్ల మొక్కుబడి భేటీపై మాకు ఆసక్తి లేదు’ అని ఆనంద్ శర్మ అన్నారు. -
వ్యాపమ్‌పై సీబీ‘ఐ’
కేసుతో సంబంధమున్న వారి వరుస అసహజ, అనుమానాస్పద మరణాలతో దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయనుంది. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్ టీఎఫ్ లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. స్కామ్‌తో పాటు అనుమానాస్పద మరణాలపైనా దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం దర్యాప్తు పర్యవేక్షణపై 24న నిర్ణయం * సోమవారం నుంచి సీబీఐ పని షురూ * మధ్యప్రదేశ్ గవర్నర్ తొలగింపుపై కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు న్యూఢిల్లీ: అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘వ్యాపమ్’ స్కాం దర్యాప్తును సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో అక్రమ నియామకాల భారీ కుంభకోణంతో పాటు ఆ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న అనుమానాస్పద మరణాలకు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసులపై స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. ఇప్పటివరకు ఆ కేసులను విచారిస్తున్న సిట్, ఎస్టీఎఫ్లను ఆ బాధ్యత నుంచి తప్పించి, ఆ కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేసింది. స్కామ్‌లో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ పాత్ర ఉందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తొలగించడానికి సంబంధించి స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, స్కాం వెలుగుచూడడానికి కారకులైన ఆశిష్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే, ఆప్ నేత కుమార్ విశ్వాస్ సహా పలువురు దాఖలు చేసిన వ్యాపమ్ సంబంధిత పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పై ఆదేశాలు జారీ చేసింది. వ్యాపమ్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ రామ్‌నరేశ్ ను ఆ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని, స్కామ్‌ను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని ఆ దావాల్లో పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు.. చేతులు దులిపేసుకుంది! అంతకుముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. అనుమానాస్పద మరణాలు సహా అన్ని వ్యాపమ్ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో, ఈ కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేసిన ధర్మాసనం.. సోమవారం నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుందని పేర్కొంది. జూలై 24న కోర్టుకు తొలి నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశిస్తూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై జూలై 24న సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు విచారణ జరపనుందనే కారణం చూపుతూ వ్యాపమ్‌ను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసిన విషయాన్ని అటార్నీ జనరల్ ప్రస్తావించగా.. ‘అలా హైకోర్టు చేతులు దులిపేసుకుంది’ అని ధర్మాసనం పేర్కొది. పిటిషన్‌దార్ల తరఫున వాదనలకు హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తన్ఖా.. స్కాం దర్యాప్తు పర్యవేక్షణలో హైకోర్టు తీరును తప్పుబడుతూ, భవిష్యత్ దర్యాప్తు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా ధర్మాసనం అడ్డుకుంది. ‘ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి వచ్చింది కదా! ఇక ఈ విషయంలో హైకోర్టు ఎలా ముందుకెళ్తుంది? కచ్చితంగా వెళ్లదు! ఆ విషయం వాళ్ల(హైకోర్టు)కు తెలీదా?’ అని వ్యాఖ్యానించింది. అధికరణ 361(2)ను కారణంగా చూపుతూ.. ఈ కేసులో నిందితుడైన గవర్నర్ రామ్‌నరేశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదును హైకోర్టు అడ్డుకుందని, గవర్నర్ పదవి గౌరవాన్ని కాపాడాలంటే ఆయన రాజీనామా చేయాలని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై.. ఆ విషయంపై ఇప్పుడు తామేమీ మాట్లాడబోమంటూ ధర్మాసనం స్పందించింది. స్కాం తీవ్రతను వివరిస్తూ.. రోజుకొకరు చనిపోతున్నారని సిబల్ పేర్కొనగా.. మృతుల సంఖ్యను 36 నుంచి 38కి పెరగనివ్వబోమని కోర్టు హామీ ఇచ్చింది. దానికి, మృతుల సంఖ్య 36 కాదు 49 అని సిబల్ పేర్కొనగా, పిటిషన్లో 36 అనే ఉందని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు వివరించారు. ఇదిలా ఉండగా, వ్యాపమ్ కేసుల్లో సాక్షిగా ఉన్న సంజయ్ సింగ్‌యాదవ్(35) కాలేయసంబంధ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 8న చనిపోయాడని ఇప్పటివరకు స్కామ్‌పై దర్యాప్తు జరుపుతున్న ఎస్టీఎఫ్ గురువారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. సీబీఐకి తలకు మించిన భారం వ్యాపమ్ దర్యాప్తు సీబీఐకి పెద్ద పనే పెట్టనుంది. వందలాది వ్యాపమ్ కేసులను అధ్యయనం చేయడం, వేలాది నిందితులు, సాక్షులను విచారించడం, నివేదికల తయారీ భారీ కసరత్తు కాగా.. స్కామ్ మరణాల దర్యాప్తు, వాటి వెనక పెద్దల హస్తాలను వెలికి తీయడం మరో పెద్ద కార్యక్రమం. సిబ్బంది కొరతతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సీబీఐకి ఇది తలకు మించిన బరువే. అదీకాక ఇప్పటికే సీబీఐ ముందు 6,562 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతితో రాజ్‌నాథ్ భేటీ వ్యాపమ్ దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వాగతించారు. దీంతో తన హృదయంపై భారం దిగిందన్నారు. దర్యాప్తును త్వరగా ప్రారంభించి, నిజాలను ప్రజలకు వెల్లడి చేయాలని సీబీఐని కోరారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ తొలగింపునకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గవర్నర్ భవితవ్యంపైనే చర్చించినట్లు సమాచారం. మీ సాయం అక్కర్లేదు * ఎంపీ సీఎంతో జర్నలిస్టు అక్షయ్ కుటుంబం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అవసరం లేదని వ్యాపమ్ మృతుడు, జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబం తేల్చిచెప్పింది. తమను పరామర్శించేందుకు వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో.. అక్షయ్ మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపితే చాలంది. ‘ఇంట్లోంచి వెళ్లినప్పుడు నా కుమారుడు ఆరోగ్యంగా. ఇంతలోనే ఏం జరిగింది? ఎందుకు చనిపోయాడు? అని అక్షయ్ తల్లి నిలదీసింది. కొన్ని రోజుల క్రితం స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లిన అక్షయ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థిని నమ్రత కుటుంబసభ్యులను ఇంటర్వ్యూ చేసిన కాసేపటికే నురగలు కక్కుకుంటూ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ పాపం ఎవరిది? ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికి ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(పీఈబీ)’ అన్న పేరూ ఉంది. మధ్యప్రదేశ్‌లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించడం దీని బాధ్యతలు. 2007-2013: రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షనూ వదలకుండా.. చివరకు బ్యాంకు పరీక్షల్లో సైతం అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, నాయకులు, ప్రతి రంగంలోనూ ఈ స్కాం మాఫియాకు ప్రతినిధులున్నారు. 2008-2013: ఈ కాలంలో మెడికల్ కాలేజీల్లో 1,087 మంది అనర్హులైన విద్యార్థులు సీట్లు పొందారని, వేలాది మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా నిర్ధారించాయి. 2013: ఈ ప్రీ మెడికల్ టెస్ట్ స్కాంను ఇండోర్‌కు చెందిన ప్రజా వేగు డాక్టర్ ఆనంద్ రాయ్, గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిశ్ చతుర్వేది బయటపెట్టారు. * ఈ స్కాంలో గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. * హైకోర్టు ఆదేశాలతో సిట్, ఎస్టీఎఫ్ 2013లో దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటిదాకా ఈ స్కాంకు సంబంధించి దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు. * అయితే కేసు నిందితుల్లో ఒకరైన గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌తో సహా కేసుకు సంబంధం ఉన్న 46 మంది అసహజ, అనుమానాస్పద రీతిలో మరణించారు. * ఇటీవలి కొద్దిరోజుల్లో వరుస మరణాలు సంభవిస్తుండటంతో సీబీఐ దర్యాప్తుకు అన్నివైపుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. మోదీజీ జవాబివ్వండి! ‘నేను తినను.. ఎవరినీ తిననివ్వను’ అంటూ అవినీతిపై ఊదరగొట్టిన ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, రాజస్తాన్‌లో అవినీతిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. వ్యాపమ్‌పై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడంపై సీపీఐ సంతృప్తి వ్యక్తంచేసింది. స్కామ్‌లో నిందితుడిగా ఉన్న మధ్యప్రదేశ్ గవర్నర్‌ను తక్షణమే తొలగించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం పదవి నుంచి శివరాజ్ సింగ్ కూడా వైదొలగాలన్నారు. -
'వ్యాపమ్'పై సీబీఐ విచారణకు సిఫారసు
భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. ఈ కేసును విచారణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని చౌహాన్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయల వ్యాపమ్ కుంభకోణం మిస్టరీగా మారింది. ఈ కేసులో సాక్షులు, నిందితులు దాదాపు 48 మంది అనుమానస్పద స్థితిలో చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీబీఐ విచారణకు మొదట్లో నిరాకరించిన మధ్యప్రదేశ్ సీఎం చివరకు అంగీకరించారు. -
స్కాం మొత్తానికి సూత్రధారి ముఖ్యమంత్రే: కాంగ్రెస్
దేశం మొత్తాన్ని వరుస మరణాలతో వణికిస్తున్న 'వ్యాపమ్' స్కాంకు సూత్రధారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానేనని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయించాలని, సీఎం చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతేనే విచారణ సవ్యంగా సాగుతుందని, అందువల్ల ఆయన వెంటనే రాజీనామా చేసి స్వతంత్ర విచారణ వేయాలని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ పీసీసీ కూడా సీఎం రాజీనామాకు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కూడా వ్యాపం స్కాంలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తోందని, కానీ తమ పార్టీకి ఈ దర్యాప్తుపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఈ స్కాంతో సంబంధమున్న 43 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. -
అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు?
న్యూఢిల్లీ: బాదౌన్ హత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయంను బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ వెనకేసుకొచ్చారు. తండ్రీకొడుకులను ఆయన నిస్సహాయులుగా వర్ణించారు. అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు అంటూ ఎదురు ప్రశ్నించారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యాచారానికి పాల్పడతాడని సూత్రీకరించారు. గత నెల 27న ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం నిరాహార దీక్ష
రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా... భోపాల్: నిరసన, నిరాహార దీక్షలు చేపడుతున్న సీఎంల జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆపన్న హస్తం అందించలేదని ఆరోపిస్తూ రాజధాని భోపాల్‌లో తన సహచర మంత్రులతో కలిసి గురువారం ఆయన నాలుగు గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి మధ్యప్రదేశ్ రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తమ మంత్రివర్గం మొత్తం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించేందుకు కూడా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తుపాను, అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికే తాము రూ.2వేల కోట్లతో ఆదుకున్నామని, ఇది ఇంతటితో ఆగబోదని మరింత సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ. 7.42 కోట్లను కూడా రైతులకు అందించామని పేర్కొన్నారు. శాశ్వత జాతీయ విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో జరిపిన తన పర్యటనను సైతం విపక్ష కాంగ్రెస్ రాజకీయం చేసిందని విరుచుకుపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం దక్కేలా కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని సరళీకరించాలని ఈ సందర్భంగా కోరారు. -
మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్ ప్రమాణం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రామ్నరేష్యాదవ్ ఆయనతో ప్రమాణం చేయించారు. శివరాజ్‌సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్సింగ్, పార్టీ లోక్‌సభాపక్షనేత సుష్మాస్వరాజ్... అగ్రనేతలు అద్వానీ, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాజస్థాన్ సీఎం వసుంధరారాజే, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఇతర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.