చాయ్వాలాగా మారిన సీఎం
ఉజ్జయిని: వెళ్లిన ప్రాంతాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి తగిన విధంగా ప్రవర్తిస్తుండటం, దుస్తులు ధరించడం రాజకీయ నేతలకు అలవాటే. ఉజ్జయినిలో జరుగుతోన్న మహా కుంభమేళాలోమధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే పనినిచేశారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా సిప్రా నదీ తీరంలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యాంప్ లను శుక్రవారం తెల్లవారుజామన సందర్శించిన ఆయన చాయ్ వాలా అవతారం ఎత్తారు.
కెటిల్ చేతబట్టుకుని అక్కడున్న భక్త పరివారానికి చాయ్ పోసి సంతోషింపజేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఏప్రిల్ 22న మొదలై మే 21 వరకు కొనసాగే సింహస్థ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సిప్రా నదీ తీరంలో గురువారం భారీ వర్షం, ఈదురు గాలులు చోటుచేసుకోవడంతో గుడారాలు కూలి ఏడుగురు భక్తులు మృత్యువాతపడ్డారు.
(చదవండి: కుంభమేళాలో అపశ్రుతి)