ujjain
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగినా ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా మంచి స్టోరీ టెల్లర్. ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించింది. కృష్ణలీల అనే పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఫీచర్ ఫిల్మ్‌లో నికితా కూడా ఒక భాగం, త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఆమె మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమాని. ఆమె గంభీరమైన వ్యవహారశైలి, తెలివితేటలంటే నికితకు అత్యంత ఇష్టమట. ఆధునికతను స్వీకరించటం తోపాటు భారతీయ వారసత్వానికి కూడా ప్రాధాన్యతి ఇచ్చే వైఖరిలో ఐశ్వర్యకు సాటిలేరని అంటోంది నికితా. ప్రకాశవంతమైన స్త్రీకి ఉదాహారణ ఆమె అంటూ ఐశ్వర్వరాయ్పై ప్రశంసలు కురిపించింది. ఇక నికిత జంతు ప్రేమికురాలు కూడా. మన అభివృద్ధి తోపాటు మనపై ఆధారపడిన జీవుల సంరక్షణ బాధ్యత కూడా మనదే అనేది ఆమె నమ్మకం. ఆశయం వద్దకు వస్తే చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది ఆమె కోరిక. అలాగే జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి అడిగినప్పుడు..తానేనంటూ సగర్వంగా చెప్పుకుంది. ఎందుకంటే..వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా వచ్చానా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తనకు తన భవిష్యత్తుని అందంగా రూపుదిద్దుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతుంది. (చదవండి: బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్) -
పట్టపగలే రోడ్డు పక్కన మహిళపై అత్యాచారం
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): చెత్త సేకరించే మహిళను పెళ్లి పేరుతో నమ్మించి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై పట్టపగలే రోడ్డు పక్కన షెల్టర్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళ్లే వారు ఆ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారే తప్ప, అడ్డుకోలేదు. తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కోయ్లా పాఠక్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్ అనే వ్యక్తి చెత్త ఏరుకునే ఓ మహిళతో మాటలు కలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను సమీపంలోనే రోడ్డు పక్కన షెల్టర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. అయితే, రోడ్డు పక్కన వెళ్లే వారు అసాంఘిక కృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారే తప్ప, అడ్డుకోలేదు. పైపెచ్చు, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. వైరల్‌గా మారిన ఒక వీడియో పోలీసుల కంటబడింది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకాశ్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఇంట్లోనే ఉందని సీపీ చెప్పారు. -
Madhya Pradesh: ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’
ఉజ్జయిని: ‘నేను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు. నా ప్రియతమ సోదరీమణులకు ప్రధాన సేవకుడిని’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. వెంటనే అక్కడున్న ఆడపడుచులంతా ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’ అంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నేడు (సోమవారం) రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబమంతటి శ్రేయస్సును ఇంటి ఆడపడుచులు కోరుకుంటారని, వారు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో సోదరీమణులను ఎప్పటి నుంచో దేవతలుగా పూజిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా పలు పండుగలు నిలుస్తున్నాయని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎంకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సీఎం రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. -
భస్మహారతికి పోటెత్తిన భక్త జనం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం(నేడు) సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు.ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు ఉజ్జయినికి తరలివస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం రాకకు ముందే ఆలయ ప్రాంగణం అంతటా రంగులు వేశారు. ఈ మాసంలో ఆలయంలో నిర్వహించే మహాశివుని ఊరేగింపు వైభవంగా జరుగుతుంటుంది. దీనిని చూసేందుకు భక్తజనం అమితమైన ఆసక్తి చూపిస్తారు. Ujjain, MP: "Thousands of devotees are at Baba Mahakal's court, eager to catch a glimpse of him. This will continue from morning until evening," says Ashish (Priest) pic.twitter.com/sFW0U2Tquo— IANS (@ians_india) July 29, 2024 -
ఉజ్జయిని: షాపులపై ఓనరు పేరు తప్పనిసరి
భోపాల్: కన్వర్ యాత్ర దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
ఉజ్జయినిలో విచిత్ర పోటీ.. ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు!
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు ముఖాముఖీ తలపడటం విశేషం.ఉజ్జయిని నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్‌కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్‌లాల్, సురేష్, ఈశ్వర్‌లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి -
శ్రీరాముని రూపంలో మహాకాళేశ్వరుడు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి, వివిధ పూజలు చేశారు. హారతి అనంతరం మహాకాళేశ్వరునికి వెండి కిరీటం, రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి సమయాన మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళ్వేర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి, అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీ మహాకాళ్ నినాదాలతో మారుమోగిపోయాయి. -
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం
మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గర్భగుడిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. बहुत दुखद खबर उज्जैन के महाकाल मंदिर में भस्म आरती के दौरान लगी आग, कई लोग झुलसे ! ईश्वर से सभी के सकुशल होने की कामना करते है !🙄😥🙏#होलिकोत्सव#Ujjain #MahakaleshwarTemple pic.twitter.com/YuuEvpLYHm — Rajni (@RajniRajni2210) March 25, 2024 వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు. -
ఉజ్జయినిలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 29) శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (గురువారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి శివపంచాయతన పూజ, అభిషేకం జరిగింది. హారతి అనంతరం మహాకాళేశ్వరుని పూజ, అభిషేకం జరిగింది. 11 మంది బ్రాహ్మణులు ఈ పూజలను నిర్వహిస్తున్నారు. వీరు ఈ శివరాత్రి మహోత్సవాలలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహాకాళేశ్వర ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత, పార్కింగ్, ప్రసాద వితరణ తదితర సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మార్చి 8న జరిగే శివరాత్రి వేడుకల వరకూ ప్రతీరోజూ మహాశివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ శివ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే పండితులు ఉపవాసం పాటించనున్నారు. -
ఏ అవగాహనా లేదు!
గువాహటి: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్ ఈశాన్య పర్యాటకానికి గేట్వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు. పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు. ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. ‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్‌తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్ లేన్ హైవేలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి. విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్.ఎన్.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు. ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్‌లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?
భోపాల్: కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్ ప్రశ్నించారు. -
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్‌యాక్షన్‌కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
ఉజ్జయిని కేసులో వారిపై కూడా చట్టపరమైన చర్యలు: ఏఎస్పీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. శభాష్ పోలీస్.. ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్‌కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బాధ్యతారాహిత్యం.. సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరణశిక్ష విధించండి.. ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఇది కూడా చదవండి: గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ హత్య -
మనిషికేమైంది..?
ఉజ్జయిని: ఈ వారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు మన సమాజం ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ మానవత్వం ఉందా, కన్నుమూసిందా అన్న సందే హాన్ని రేకెత్తిస్తున్నాయి. ఉజ్జయిని నగర వీధుల్లో మొన్న సోమవారం ఉదయం ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా నెత్తురోడుతున్న పన్నెండేళ్ల బాలిక తనను కాపాడాలంటూ ఇల్లిల్లూ తిరిగి విన్నవించుకున్నా ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు. ఇలా రెండున్నర గంటలు గడిచి ఆమె స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా ఒక ఆశ్రమం నుంచి బయటికొస్తున్న యువకుడు గమనించి చొరవ తీసుకున్నాడు. తన పైపంచె తీసి కప్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలో తేలింది. బహుశా ఆ యువకుడు కూడా స్పందించకపోయి వుంటే రక్తస్రావంతో ఆమె మరణించేది కూడా. ఎందుకంటే అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఆమె అవయవాలను తీవ్రంగా గాయపరిచాడు. గర్భాశయానికైతే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది కూడా. దశాబ్దం క్రితం ఢిల్లీలో నిర్భయ అనుభవించిన నరక యాతననే ఈ బాలిక కూడా చవిచూసింది. తాను ఉజ్జయిని ఎలా చేరిందో చెప్పలేని స్థితిలో ఉంది. బాలిక తప్పిపోయిందని అంతక్రితం ఆమె తాత సాత్నాలో ఫిర్యాదు చేశాడంటున్నారు. ఉజ్జయినికి 720 కిలోమీటర్ల దూరంలోని సాత్నా నుంచి ఆ బాలికను తరలించిందెవరు అన్నది ఇంకా తేల్చాల్సి వుంది. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు మరో అయిదు గురిని అరెస్టు చేశారు. దేశ రాజధాని నగరంలో మంగళవారం జరిగిన ఉదంతం కూడా అమాను షమైనది. ప్రసాదం దొంగిలించాడన్న అనుమానంతో మతిస్థిమితం లేని ఒక ముస్లిం యువకుణ్ణి అందరూ ఏకమై కరెంటు స్తంభానికి కట్టి, తీవ్రంగా కొట్టి ప్రాణం తీశారు. ఒంటినిండా గాయాలతో తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడని శవపరీక్షలో తేలింది. ఈ ఉదంతంలో అరెస్టయిన ఏడు గురూ పాతికేళ్ల లోపువారే కాగా, అందులో ఒకడు మైనర్. ఈ రెండు ఉదంతాల్లోనూ సమాజం ప్రేక్షక పాత్ర వహించింది. బాధితులను ఆదుకోవాలన్న స్పృహ లేకుండా ప్రవర్తించింది. ఉజ్జయిని నగరానికి ఉజ్వల చరిత్ర వుంది. ఒకనాడది వైభవోపేతంగా వర్ధిల్లిన సాంస్కృతిక కేంద్రం. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుడి విశాల సామ్రాజ్యంలో భాగం. తన తండ్రి బిందుసారుడి కాలంలో అశోకుడు స్వయంగా పర్యవేక్షించిన ప్రాంతం. నాలుగో శతాబ్దంలో రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి రాజధాని. అది కాళిదాస మహాకవీంద్రుడు నడయాడిన నేల. అక్కడే శూద్రకుడు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వంటివారు వివిధ శాస్త్రాల్లో ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గడించారు. అంతటి గొప్ప చరిత్ర కలిగినచోట పట్టపగలు నగర వీధుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక బాలిక కాపాడమని అర్థిస్తే ఆడ, మగ అందరూ తలుపులేసుకున్నారంటే... పదో పరకో ఇచ్చి తమ అపరాధ భావనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారంటే ఎలాంటి వారికైనా మనసు వికలమవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలించటానికీ, కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పటానికీ ఎవరూ ముందుకు రాకపోవటం తరచు గమనిస్తూనే ఉంటాం. చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటామనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ ఇప్పటికీ అనేకులు వెనకడుగేయటం కనబడుతూనే ఉంటుంది. కానీ అర్ధనగ్న స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన బాలికకు వైద్య సాయం అందేలా చూడటం సంగతి అటుంచి కనీసం ఒంటిని కప్పుకోవటానికి బట్టలిచ్చేందుకు కూడా ఎవరూ సిద్ధపడకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమానవీయతకు సీసీ టీవీ కెమెరాలు సాక్ష్యంగా నిలిచాయి. సమాజం మొత్తాన్ని కాపలా కాయటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమన్నది వాస్తవం. లక్షల్లో జనాభా ఉండేచోట వందల్లో మాత్రమే రక్షకభటులుంటారు. అయితే ఉన్న ఆ కొద్దిమందీ కూడా కొన్ని సందర్భాల్లో నేరగాళ్లకు సాయపడుతున్నారనీ, రాజకీయ ప్రాపకం కోసం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండున్నర గంటలపాటు ఆ బాలిక ఎక్కడో మారుమూల పల్లెటూరులో కాదు... కేంద్రం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నగర వీధుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో సంచరిస్తున్నప్పుడు ఒక్క కానిస్టేబులైనా ఆమెను గమనించి ఆదుకోలేకపోవటం పోలీసుల పనితీరును పట్టిచూపిస్తోంది. ఇక గోవధ జరిగిందనో, జరగబోతున్నదనో అనుమానంతో కొందరు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి చంపుతున్న ఉదంతాల్లో నేరగాళ్లకు ప్రభుత్వాల ఆశీస్సులుంటున్న సంగతి బహిరంగ రహస్యం. కానీ సమాజం ఏమై పోతోంది? పట్టపగలు కళ్లెదుట జరుగుతున్న దురంతాలపై కూడా కనీస స్పందన కొరవడటం, సహానుభూతి వ్యక్తం కాకపోవటం ఏమిటి? ఎన్నికల్లో ఓటేయటంతోనే పౌరులుగా తమ బాధ్యత తీరిందని జనం అనుకుంటున్నారా? కుల మత చట్రాల్లో, రాజకీయ రొదలో కూరుకుపోయి మనుషు లుగా తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నారా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఆపత్సమయాల్లో మానవీయతను ప్రదర్శించటం, సహానుభూతి వ్యక్తపరచటం, బాధితులకు అండగా నిలవటం మనుషుల కనీస లక్షణాలని తెలుసుకోలేని సమాజం శవప్రాయమైనది. అలాంటిచోట ఎవరికీ రక్షణ ఉండదు. సమాజం సంఘటితంగా ఉన్నప్పుడే, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించు కున్నప్పుడే ఇలాంటి దురంతాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదీ చదవండి: అర్ధనగ్నంగా రక్తమోడుతూ -
ఉజ్జయిని కేసు: నిందితుడు తప్పించుకునే ప్రయత్నం
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. #WATCH | Ujjain minor rape case: Ujjain SP Sachin Sharma says, "There is an accused in the rape case. There is another auto driver against whom a case will be registered for not informing the police about the incident. When we were taking (the accused) for recreation of the crime… pic.twitter.com/6x3AggXxqq — ANI (@ANI) September 28, 2023 ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి -
ఉజ్జయిని హర్రర్.. ‘భయంతో నా వెనక దాక్కుంది, ఆమెకు మాటిచ్చాం’
అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈఘటనలో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్‌తోపాటు మరోముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనస్థితిలోని బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచి.. ఈ ఫుటీజీలో బాధితురాలు చెప్పులు లేకుండా సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచినట్లు తేలింది. అరెస్ట్‌చేసిన ఆటో డ్రైవర్‌ను రాకేష్‌గా గుర్తించారు. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఈ ఆటోనే ఎక్కిందని, ఆ సీసీటీవీ వీడియో కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఆటోలు రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆటోను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్ అయిన మిగతా ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లనే తేలింది. వీడియో బయటకు రావడంతో.. అణ్యంపుణ్యం తెలియని పన్నెండేళ్ల బాలిక నీచుల చేతిలో అఘాయిత్యానికి గురై ఉజ్జయిని కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నగర్ రోడ్డుపై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ సాయం కోరుతూ కనిపించిన వీడియో అందరినీ కంట తడి పెట్టించిన విషయం తెలిసిందే. చిన్నారికి వచ్చి కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేని దారుణమైన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం బయటకు రావడంతో ఈ దారుణం గురించి తెలిసింది. చదవండి: యువతిపై స్పా యజమాని దాడి.. రోడ్డుపై జుట్టు లాగి, దుస్తులు చింపి సిట్ ఏర్పాటు.. బాలికను చూసిన కొందరు పొమ్మంటూ సైగలు కూడా చేయడం కూడా వీడియో కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుటకు రాగా రాహుల్ శర్మ అనే పూజారి గమనించి ఆమెకు దుస్తులు అందించాడు. బాధితురాలు నిస్సహక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచ్చిందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని, ఆమె నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలిపారు. He is Acharya Rahul Sharma, a priest in an Ashram in Ujjain. When a 12-year-old rape victim, went door to door, semi-naked, asking for help & no one came to her rescue, she eventually reached an Ashram. Then, Acharya Rahul Sharma covered her with a towel & rushed her to the… pic.twitter.com/3KlCiLFy6t — Anshul Saxena (@AskAnshul) September 28, 2023 నా దుస్తులు ఇచ్చి, పోలీసులకు కాల్ చేశా: పూజారి ఉజ్జయిని అత్యాచార బాధితురాలిని రక్షంచిన పూజారి రాహుల్ శర్మ.. బాలిక ఎదుర్కొన్న భయానక స్థితిని వివరించాడు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర రక్తస్రావంతో అర్ధనగ్నంగా ఉన్న బాలికను గమనించినట్లు తెలిపారు. ఆమెకు తన బట్టలు ఇచ్చినట్లు చెప్పారు. రక్తం కారుతూ, కళ్ళు వాచిపోయాయి కనిపించాయని, ఏం మాట్లాడలేకపోయిందని పేర్కొన్నారు. వెంటనే డయల్ 100కి కాల్ చేసినట్లు తెలిపారు. మహంకాల్ పోలీసులు 20 నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భయంతో నా వెనక దాక్కుంది బాలిక తమతో ఏదో చెప్పిందుకు ప్రయత్నిస్తుంటే మాకు అర్థం కాలేదు. ఆమె పేరు, కుటుంబం గురించి ఆరా తీశాము. ఆమె సుక్షితంగా ఉందని, తనను జాగ్రత్తగా ఇంటి వద్దకు చేరుస్తామని భరోసా ఇచ్చాను. కానీ ఆమె చాలా భయపడుతూ కనిపించింది. బాలిక కేవలం మమ్మల్ని మాత్రమే నమ్మింది. వేరే వాళ్లు ఆమె వద్దకు వచ్చినప్పుడు భయపడి నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. చివరికి పోలీసులు వచ్చి ఆమెను తమతో తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు. -
అమానవీయం.. అత్యాచార బాధితురాలి పట్ల కర్కశంగా..
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంటా.. బయటా నిత్యం ఏదో ఒకచోట వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. దాడులు, వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై నేరాలూ తగ్గడం లేదు, దుర్మార్గుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగుచూసింది. మైనర్(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. అత్యాచార బాధితురాలు ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్ మీడియాలో కలవరం రేపుతున్నాయి. అర్థ నగ్నంగా, రక్తస్రావంతో బాలిక బాధపడుతూ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దారుణ ఘటన ఉజ్జయిని సమీపంలోని బాద్నగర్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. షాక్‌కు గురిచేస్తోన్న ఈ వీడియోలో 12 ఏళ్ల వయసున్న ఓ బాలిక ఒంటిపై ఓ క్లాత్‌తో వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. రోడ్డు మీద ప్రజలు ఆమెను చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేసేందుకు మాత్రం ముందుకు రాకపోవడం మరింత సిగ్గుచేటు. సహాయం కోసం ఓ వ్యక్తిని సంప్రదించగా అతను బాలికను వెళ్లిపోమ్మంటూ నెట్టేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చివరకి బాధితురాలు ఓ ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఓ పూజారి ఆమెను చూశారు. ఆమెపై టవల్ కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు జరిపిన పరీక్షల్లో బాలికపై త్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలుండంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. బాలిక ఎక్కడ అఘాయిత్యం జరిగిందో ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ జరిపి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి బాధితురాలి వివరాలు కూడా తెలియలేదని అయితే ఆమె మాటలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినట్లు తెలుస్తుందన్నారు. ఈ భయానక సంఘటన మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న ఘోరాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. 2019 నుంచి 2021 మధ్య మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అత్యధికంగా మహిళలు, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2021లో మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ అత్యాచార ఘటనలు (6,462) నమోదయ్యాయి. వాటిలో 50 శాతానికి పైగా నేరాలు మైనర్లపైనే జరిగాయి. అంటే సగటున రోజుకు 18 అత్యాచారాలునమోదవుతున్నాయి. -
ఏ నాయకుడు అయినా ఆ పుణ్యక్షేతంలో రాత్రిపూట ఉన్నారో అంతే..!
భారతదేశంలో పురాతన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని చాలా మహిమాన్వితమైనది. ఈ నగరం దేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్ర స్థానంగా అలరారుతుంది. మధ్యప్రదేశ్‌లో శిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఈ నగర సాంస్కృతిక వారసత్వం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉజ్జయిని నగరంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి రాత్రిపూట బస చేయలేదట. ఇంతవరకు అలా ఎవ్వరూ ఉండేందుకు సాహసం చేయలేదట. ఎందకలా? దాని వెనుక దాగిఉన్న రహస్యం ఏంటీ?.. నిజానికి ఈ ఉజ్జయినిని మహాభారత కాలంలో 'అవంతి' అని పిలిచేవారు. వేదాలు, పురాణాలతో సహ వివిధ పురాతన హిందూ గ్రంథాల్లో ఈ నగరం ప్రస్తావన ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ నగరం పేరు చెప్పగానే విక్రమాదిత్యుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయనే ఇక్కడకు నిత్యం వచ్చి 'హరసిద్ధ' మాతను పూజించేవాడు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ప్రధాన అధి దేవత 'బాబా మహాకల్'. ఉజ్జయిని సర్వోన్నత ప్రభువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ నగరంలోని అన్ని అధికారాలు ఆయనవే. అందువల్ల అక్కడ ఏ నాయకుడు ఉండకూడదు. అలాగే ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండటం కుదరదు. అందువల్ల ఏ నాయకుడు అక్కడ బస చేయరు. అది అక్కడ ఆచారం. దీన్ని అతక్రమించి ఉన్నవాళ్లందరూ విపత్కర పరిస్థితులు చూచిన దాఖాలాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఏ నాయకుడు ఆ సాహసం చేయకపోవడం విశేషం. నాయకులు ఈ ఆచారాన్ని అతిక్రమించకపోవడానికి మరో ప్రధాన కారణం రాజకీయ అంశం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండలి, అధికారంలో సాగాలంటే వారి ఆధరాభిమానాలు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ప్రజల మత విశ్వాసాలను గౌరవించక తప్పదు. ఆయా కారణాల రీత్యా కూడా నాయకులు దీనికి విరుద్ధంగా వెళ్లే సాహసం చేయలేదు. మరికొందరూ ఆ ఆచారానికి విరుద్ధంగా వెళ్లితే ఏమవుతుందన్న భయంతోనే.. మొత్తం మీద ఇంతవరకు ఏ నాయకుడు ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయలేదట. భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందో లేదో కానీ ఈ విషయం మాత్రం ఉజ్జయినీలో ఓ అంతుపట్టని మిస్టరీలా ఉంది. -
మహాకాల్ లోక్‌లో గాలివాన బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
-
మహాకాల్ లోక్‌లో బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
ఉజ్జయిని: హఠాత్తుగా మొదలైన ఈదురు గాలులు, ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో విధ్వంసం సృష్టించింది. అదే సమయంలో.. మహాకాళ్ లోక్ ఆలయ ప్రాంగణంలో పిడుగు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమందికి గాయాలు కాగా, అక్కడ ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్ష బీభత్సానికి ఉజ్జయిని అతలాకుతలం అయ్యింది. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడగా.. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వారాంతం కావడంతో.. ఆదివారం పాతిక వేల మందికి పైగా మహాకాళ్ లోక్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. భారీగా సందర్శకులు మహాకాళ్ లోక్కు రాగా.. ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసున్నారు. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాలుల ధాటికి ఆలయ కారిడార్‌లో ఏర్పాటు చేసిన సప్తరుషి విగ్రహాలు పక్కకు జరిగాయి. అందులో రెండు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ కారిడార్‌లో మొత్తం 155 విగ్రహాలు ఉండగా.. దెబ్బ తిన్న విగ్రహాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) చెబుతున్నారు.మహాకాల్ లోక్ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కిందటి ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అపూర్వం.. అమోఘం.. మహాకాళ్ లోక్ (ఫొటోలు) -
ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ను దర్శించుకున్న విరాట్ కోహ్లి
-
ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ గుడిలో విరాట్ కోహ్లి- అనుష్క శర్మ పూజలు (ఫొటోలు)
-
'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబైలోకి కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పంత్‌కు పలు సర్జరీలు నిర్వహించిన వైద్యులు అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడి ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగళవారం జరగనుంది. మ్యాచ్ కోసం టీమిండియా, కివీస్ జట్లు ఇప్పటికే ఇండోర్‌కు చేరుకున్నాయి. కాగా సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా పంత్ త్వరగా కోలుకోవాలంటూ మహాశివుడికి పూజలు నిర్వహించారు. అనంతరం శివ లింగానికి బాబా మహాకాల్ భస్మ హారతి అర్పించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ఏఎన్ఐ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. సూర్యకుమార్ మాట్లాడుతూ.. ''కారు ప్రమాదానికి గురైన పంత్ త్వరగా కోలుకోవాలని పరమ శివుడిని ప్రార్థించాం. ఆయన దీవెనలతో పంత్ కోలుకొని టీమిండియా జట్టులోకి తిరిగి రావడం మాకు చాలా ముఖ్యం. ఇక ఇప్పటికే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలిచాం.. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు. We prayed for the speedy recovery of Rishabh Pant. His comeback is very important to us. We have already won the series against New Zealand, looking forward to the final match against them: Cricketer Suryakumar Yadav pic.twitter.com/2yngbYZXfb — ANI (@ANI) January 23, 2023 చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' -
దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త
ఉజ్జయిని: టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో దుర్మార్గుడైన ఓ భర్త కట్టుకున్న భార్యను చపాతీ పీటతో కొట్టి కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఘటియా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(41) టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో భార్య(40)ను చపాతీ పీటతో కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విద్యుత్ షాక్‌కు గురైందని వైద్య సిబ్బందితో అబద్ధమాడాడు. కొద్ది సేపటి తర్వాత భార్య చనిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్టుమార్టంలో విషయం బయటపడగా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 83వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆయనతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్ ఈ పాదయాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇటీవలే రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. భర్త రాబర్ట్‌తో వాద్రాతో వచ్చి తొలిసారి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాలను కవర్ చేసి 1,209 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 11 గంటల వరకు 18.95% పోలింగ్ -
గడ్కరీ ఛాలెంజ్: హమ్మయ్యా.. 32 కేజీలు తగ్గాను
ఢిల్లీ: అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా?.. అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షరతు విధించడం.. అది ఛాలెంజ్‌గా తీసుకుని వర్కవుట్లు చేస్తూ బరువు తగ్గించుకునేందుకు యత్నించిన బీజేపీ ఎంపీ. ఆ ఎంపీ ఇప్పడు ఏకంగా 32 కేజీల బరువు తగ్గారట. పొద్దున్నే ఐదున్నరకు లేచి నడక. ఆపై రన్నింగ్, ఎక్సర్సైజ్లు, యోగాలతో కూడిన వర్కవుట్స్. ఆయుర్వేదిక్ డైట్ పాలో కావడం. ఆపై లైట్ బ్రేక్‌ఫాస్ట్. లంచ్, డిన్నర్‌లోకి సలాడ్, ఒక గిన్నెలో గ్రీన్ వెజిటెబుల్స్, మిశ్రమ తృణధాన్యాలలతో చేసిన ఒక రోటీ, క్యారట్ సూప్, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్.. ఇవి మాత్రమే తిని ఆయన తన బరువును ఏకంగా 30 కేజీలకు పైగా తగ్గించుకున్నారట. అలా ఎనిమిది నెలలకు పైగా ఇష్టాలను కట్టడి చేసుకుని.. కష్టం మీద బరువును నియోజకవర్గం కోసం తగ్గించుకున్నారాయన!. ఈ మేరకు సోమవారం ఉజ్జయిని ఎంపీ(మధ్యప్రదేశ్) అనిల్ ఫిరోజియా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తాను బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన గడ్కరీ.. ఫిరోజియాను అభినందించి ఇచ్చిన మాట ప్రకారం.. తొలి దశలో రూ.2,300 కోట్ల అభివృద్ది నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. గడ్కరీ స్ఫూర్తితో పాటు ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్ భారత్ పిలుపు తనను ఆకర్షించాయని చెప్తున్నారాయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఫిరోజియాగారికి ఒక షరతు. ఆ పని చేస్తేనే నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తా. ఒకప్పుడు నా బరువు 135 కేజీలు ఉండేది. అది ఫిరోజియాగారి కంటే ఎక్కువ. ఇప్పుడు నా బరువు 93 కేజీలు. నా పాత ఫొటోను కూడా ఆయనకు చూపించా. అందులో నన్ను గుర్తు పట్టడం కష్టమే. ఒక వేళ ఫిరోజియా గనుక బరువు తగ్గితే.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తా అని ప్రకటించారు. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 ఇదీ చదవండి: ప్లీజ్ సార్.. మా అమ్మను అరెస్ట్ చేయండి!! -
అపూర్వం.. అమోఘం.. ఉజ్జయిని మహాకాళ్ లోక్ (ఫొటోలు)
-
Mahakal: మహాకాళ్ లోకపు ప్రత్యేకతలు తెలుసా?
ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్ట ప్రత్యేకతతో కూడుకున్న జ్యోతిర్లింగం.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ప్రసిద్ధ శైవ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇదేనని చెప్తారు. ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు. అంతేకాదు.. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణం కొత్త సొగసులతో.. సరికొత్తగా ముస్తాబు అయ్యింది. రుద్రసాగరం సమీపాన ఉన్న శ్రీ మహా కాళేశ్వరాలయ కారిడార్ ఇవాళ(మంగళవారం) ప్రారంభం కాబోతోంది. మహాకాళ్ లోక్ పేరిట అభివృద్ధి చేసిన పనులను ఆవిష్కరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్తిక్ మేళా గ్రౌండ్లో ప్రజల సమక్షంలో ఆయన పాల్గొనున్నారు కూడా. పూజ తర్వాత ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేయనున్నారాయన. Har Har Mahadev! The newly built Mahakal Corridor in Ujjain. pic.twitter.com/dA4ZgeEejD — Y. Satya Kumar (సత్యకుమార్) (@satyakumar_y) October 8, 2022 ► మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ► ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. ► ఉజ్జయినిలో శివలింగాలు మూడుఅంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కంటే కింద మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటుంది. ► రెండు ఫేజ్‌లు మహాకాళ్ లోక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కారిడార్ కోసం రూ.856 కోట్లు కేటాయించారు. విశాలమైన కారిడార్‌లో శివతత్వం ఉట్టిపడే అలంకరణలతో పాటు సందర్శకులను ఆకర్షించేలా పలు నిర్మాణాలు చేపట్టారు. ► మొదటి ఫేజ్ నిర్మాణానికి రూ.316 కోట్లు ఖర్చు అయ్యింది. 900 మీటర్ల కంటే పొడవైన ఈ కారిడార్.. దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా గుర్తింపు దక్కించుకోబోతోంది. ► మహాకాళేశ్వర ఆలయం చుట్టూరా పాత రుద్రసాగర్ సరస్సు చుట్టూరా ఈ కారిడార్ విస్తరించి ఉండనుంది. Preview of Mahakal Corridor. Newly developed corridor at the Mahakaleshwar temple has been named Sree Mahakal Lok, & its design is inspired by Shiv Leela. Murals & statues portray various aspects of Lord Shiva. On Oct 11, PM @narendramodi Ji will inaugurate it.#ShriMahakalLok pic.twitter.com/uK0Tfyg7q6 — Shobha Karandlaje (@ShobhaBJP) October 9, 2022 ► ఈ కారిడార్‌కు రెండు భారీ నందీద్వారం, పినాకి ద్వారం ఉన్నాయి. ఈ రెండు గేట్వేస్లో తక్కువ దూరంలోనే కారిడార్ ప్రారంభంలో ఉంటాయి. ► ఇక ఈ కారిడార్‌కు మరో ప్రత్యేకత.. విశేష అలంకరణలతో కూడిన 108 స్తంభాలు. ఇసుక రాళ్లు, ఫౌంటైన్లు, శివ పురాణం నుండి కథలను వర్ణించే 50 కంటే ఎక్కువ కుడ్యచిత్రాలు ఉన్నాయి. ► కారిడార్ ప్రాజెక్ట్‌లో మిడ్-వే జోన్, పార్క్, కార్లు, బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్. పూలు, ఇతర వస్తువులు అమ్మే దుకాణాలు, సోలార్ లైటింగ్, యాత్రికుల సౌకర్యాల కేంద్రం, నీటి పైప్‌లైన్, మురుగునీటి లైన్ మొదలైనవి కూడా ఉన్నాయి. అలాగే, లైట్, సౌండ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశారు. ► ఇక రూ.310.22 కోట్లతో సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతున్నాయి. రుద్రసాగర్కు పునర్వైభవ పనులు ఇందులోనే సాగుతున్నాయి. A Golden era for Cultural rejuvenation under leadership of Hon'ble PM Shri @narendramodi Ji - Started with Kedarnath Shrine, then Kashi Vishwanath & now Ujjain #MahakalCorridor. Redevelopment of ancient temples for promoting religious tourism is a key priority of @BJP4India govt. pic.twitter.com/aYv4mVvlqm — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రెండో దశ అభివృద్ధి పనుల్లో.. ఆలయ తూర్పు, ఉత్తర ముఖాల విస్తరణ ఉంటుంది. ఉజ్జయిని నగరంలోని మహారాజ్‌వాడ, మహల్ గేట్, హరి ఫాటక్ వంతెన, రామ్‌ఘాట్ ముఖభాగం, బేగం బాగ్ రోడ్ వంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కూడా ఇందులో ఉంది. పురాణాల ప్రకారం.. ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివారాధనకే అంకితం అయ్యేవాడు. ఒకరోజు ఓ రైతు కొడుకు అయిన శ్రీకరుడు, రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి.. క్షిప్ర నదీ తీరంలో మహాశివుని కోసం ప్రార్థనలు చేస్తాడు. శివుడు తన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి చేరిన శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరిస్తాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి మరణ, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తాడనే నమ్మకం ఉంది. -
చిన్నారి సమాధానంతో ప్రధాని మోదీ నవ్వులు
వైరల్: ప్రధాని నరేంద్ర మోదీ పెదాలపై చిరునవ్వులు పూయించింది ఓ చిన్నారి. ఎంపీ అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా? అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కండిషన్ పెట్టడం.. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని వర్కవుట్లు చేసి బరువు తగ్గిన వ్యక్తి. ఉజ్జయిని(మధ్యప్రదేశ్) ఎంపీ అనిల్ ఫిరోజియా.. తన కుటుంబాన్ని తీసుకుని పార్లమెంట్‌కు వచ్చారు. ఆ సమయంలో ప్రధానిని కలిసింది ఆ కుటుంబం. అనిల్ కూతురు ఐదేళ్ల అహానా.. ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించింది. నేనెవరో తెలుసా? అని మోదీ ఆ చిన్నారిని ప్రశ్నించారు. అవును.. మీరు మోదీ. రోజూ మీరు టీవీలో కనిపిస్తారు అని చెప్పింది. నేనేం చేస్తానో తెలుసా? అని మోదీ మళ్లీ ప్రశ్నించగా.. మీరు లోక్ సభలో పని చేస్తారు అని సమాధానం ఇవ్వడంతో మోదీ నవ్వుల్లో మునిగిపోయారు. చివర్లో మోదీ, అహానాకు ఓ చాక్లెట్ కానుకగా ఇచ్చి పంపించారు. ఈ సరదా విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నారు ఎంపీ అనిల్. आज मेरी दोनों बालिकाएं छोटी बालिका अहाना और बड़ी बालिका प्रियांशी आदरणीय प्रधानमंत्री जी से प्रत्यक्ष मिल कर और उनका स्नेह पाकर बहुत आनंदित और अभीभूत है।@narendramodi @PMOIndia @BJP4India @BJP4MP pic.twitter.com/v5ULVP9KPU — Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022 ఇక యోగా, ఎక్సర్‌సైజులతో 21 కేజీల బరువు తగ్గిన అనిల్ ఫిరోజియా.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున 21 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని ఆశిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రధాని అనిల్‌ను అభినందిస్తూనే.. ఇంకాస్త బరువు తగ్గి ఫిట్‌గా ఉండడంటూ ప్రొత్సహించారు. ఇదిలా ఉంటే.. బరువు తగ్గాలంటూ ప్రధాని మోదీ ఈమధ్య ఇద్దరికి సూచించారు. रास्ते भी जिद्दी है मंजिलें भी जिद्दी है हौंसले भी जिद्दी है। pic.twitter.com/P0BMleuJus — Tejashwi Yadav (@yadavtejashwi) July 25, 2022 ఒకరు ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా, మరొకరు ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వి యాదవ్. 32 ఏళ్ల తేజస్వి.. ప్రధాని సూచన మేరకు రోజూ కష్టపడి వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు కూడా. ఇదీ చదవండి: సీఎం షిండేకు షాకిచ్చిన చిన్నారి! -
Lekhika Dagar: రేడియో జాకీ.. అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్.. ఎవరీమె?
చదువుకున్న వ్యక్తి గ్రామ పగ్గాలు చేపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతోంది 21 ఏళ్ల రేడియో జాకీ. శ్రోతల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటివెన్నో జాకీలు చెబుతారులే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే రేడియో జాకీ ‘లక్షికా దాగర్’ ప్రస్తుతం ఓ గ్రామానికి సర్పంచ్ అయ్యి, రాష్ట్రంలోనే ‘యంగెస్ట్’ సర్పంచ్‌గా నిలిచింది. యువత ఏదైనా అనుకుంటే సాధించగలరు అని చెప్పడానికి లక్షికానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్ పరిధిలోని చింతామన్ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయే లక్షికా దాగర్. మూడువేలకు పైగా జనాభా ఉన్న చింతామణ్కు ఇటీవల పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు కేటాయించబడింది. దీంతో ఎన్నికల్లో ఎనిమిది మంది పోటీపడ్డారు. వీరందరిలోకి చిన్నదైన లక్షికా 487 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ సీటుని దక్కించుకుంది. జూన్ 27న 22 ఏట అడుగుపెట్టడానికి ఒకరోజు ముందు లక్షికా సర్పంచ్‌గా ఎన్నికై మధ్యప్రదేశ్‌లోనే తొలి యంగ్ సర్పంచ్‌గా నిలిచింది. గ్రామంలో తొలిసారి చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అవ్వడంతో గ్రామస్థులంతా తెగ సంబరపడిపోతున్నారు. భరత్పూరి జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో రీజనల్ అధికారిగా పనిచేస్తోన్న దిలీప్ దాగర్ ముద్దుల కూతురు లక్షికా. ఇంట్లో అందరిలోకి చిన్నది. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతోపాటు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుచేస్తోంది. ఖాళీ సమయంలో రేడియో జాకీగా పనిచేస్తోన్న లక్షికకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవా దృక్పథం ఎక్కువ. ఎప్పుడూ గ్రామస్థులతో కలిసి మెలిసి తిరుగుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుండేది. ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తీర్చాలంటే అధికారం ఉండాలని భావించింది. సర్పంచ్‌గా ఉంటే గ్రామంలో ఎక్కువ మందికి సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసింది. చదువుకున్న అమ్మాయి కావడం, ఆమె మేనిఫెస్టో నచ్చడంతో గ్రామస్థులంతా లక్షికను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో ఆ గ్రామం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఆశిద్దాం. గ్రామాభివృద్ధే ముఖ్య ఉద్దేశ్యం ‘‘చదువుకున్న వారు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇందుకు గ్రామస్థుల సాయం తప్పక ఉండాలి. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న సమయంలో అనేక సమస్యలు నా ముందుకొచ్చాయి. తాగునీటి సమస్య, ట్యాప్‌లు ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం, మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం, వీధిలైట్ల మరమ్మతులు వంటివి సమస్యలు ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. అర్హులైన వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు అందడంలేదు. లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కూడా సరిగా అందడం లేదు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ఈ సమస్యలన్నింటినీ వీలైనంత వేగంగా పరిష్కరిస్తాను. అదేవిధంగా ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కూడా ప్రారంభిస్తాను. ఇవన్నీ ఒక్కోటి పరిష్కారమైతే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది’’. – లక్షికా దాగర్, మధ్యప్రదేశ్ యంగెస్ట్ సర్పంచ్ చదవండి: చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు -
అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా 9 మంది మృతి
-
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో తొక్కిసలాట
-
కరోనా: ‘టీకా వేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం’
భోపాల్: కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పలు రాష్ట్రాలు కరోనా వాక్సినేషన్ డ్రైవ్‌లను పటిష్టంగా నిర్వహిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రజలకు వ్యాకిన్ అందజేస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వాలు కోవిడ్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి వాక్సిన్ వేస్తున్నాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా పరిపాలన కార్యాయం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ టీకా వేయించుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జూలై నెల జీతం అందజేయబడుతుందని పేర్కోంది. ఈ మేరకు ఉజ్జయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జూలై 31 వరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే జూలై నెల జీతం పంపిణీ చేయబడదని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఇక కరోనా వాక్సిన్ వేయించుకున్నట్లు టీకా ధ్రువపత్రాలు అందజేయాలని తెలిపారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ నమోదు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆశీష్ సింగ్ వెల్లడించారు. జూన్ నెలకు జీతాల పంపిణీతో పాటు టీకా సర్టిఫికేట్లను సేకరించాలని, కరోనా బారిన పడకుండా ప్రభుత్వ ఉద్యోగులు టీకాలు వేసుకుంటున్న సమాచారాన్ని సేకరించాలని జిల్లా ట్రెజరీ అధికారిని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా కోవిడ్ వ్యాక్సిన్ చేసుకోనివారు కావటం గమనార్హం. చదవండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు -
వైరల్ వీడియో: వ్యాక్సిన్ సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడి
-
వ్యాక్సిన్ సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడి
భోపాల్: కరోనా వైరస్ నిరోధానికి తీసుకొచ్చిన వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఇంకా భయాందోళనలు.. అనుమానాలు తొలగడం లేదు. నిన్న ఉత్తరప్రదేశ్‌లో వ్యాక్సిన్‌కు భయపడి అందరూ సరయూ నదిలో దూకిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో ప్రజలు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు వచ్చిన వైద్య అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్‌పై గ్రామస్తులకు సోమవారం అవగాహన కల్పించేందుకు అధికారులు వచ్చారు. గ్రామంలోకి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యం వస్తుందనే భావనలో గ్రామస్తులు ఉన్నారు. దీంతో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులపై రాళ్లు, కర్రలు పట్టుకుని ఎదురుతిరిగారు. ప్రాణభయంతో వైద్య సిబ్బంది తలో దిక్కు పారిపోయారు. గ్రామస్తుల దాడిలో ఓ పంచాయతీ అధికారిణి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు బెదిరించి గ్రామం నుంచి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించారు. అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. అధికారులపై గ్రామస్తుల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
గ్యాంగ్‌స్టర్ దుబే హతం
-
గ్యాంగ్‌స్టర్ దుబే హతం
కాన్పూర్: పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, డీఎస్పీ సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే శుక్రవారం పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ అయిన తరువాత, దుబేను అక్కడి నుంచి యూపీలోని కాన్పూర్‌కు తీసుకువస్తుండగా, శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ శివార్లలోని భావుంటి వద్ద హైవేపై జనçపసంచారం లేని చోట దుబేను తీసుకువస్తున్న కారు బోల్తా పడింది. ఇదే అదనుగా ప్రమాదంలో గాయపడిన పోలీసు నుంచి పిస్టల్‌ను లాక్కొని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆ క్రమంలో తనను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. కారు బోల్తాపడిన ఘటనలో, తదనంతర ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు సహా 8 మంది పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ‘ప్రమాదం అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆయనను చుట్టుముట్టిన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ మాటలను వినకుండా, పోలీసులపై.. వారిని చంపే ఉద్దేశంతో దుబే కాల్పులు జరపడం ప్రారంభించాడు. దాంతో, స్వీయ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు’ అని వివరించారు. గాయపడిన దుబేను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే దుబే చనిపోయాడని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్బీ కమల్ మీడియాకు తెలపడం గమనార్హం. ఆయన మృతదేహంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, మూడు ఛాతీ భాగంలో, ఒకటి చేతిపై ఉందని వివరించారు. పోలీసుల్లో ఒకరికి భుజంపై, మరొకరికి చేతిపై బుల్లెట్ గాయాలున్నాయన్నారు. దుబేకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని చెప్పారు. మొత్తం ఆరుగురి ఎన్కౌంటర్ 8 మంది పోలీసుల మృతికి కారణమైన కాన్పూర్ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ప్రధాన నిందితుడైన వికాస్ దుబే సహా మొత్తం ఆరుగురు వేర్వేరుగా జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లలోనే హతమవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ పట్టణం లోని మహాకాళేశ్వరుడి ఆలయానికి గురువారం దుబే వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అక్కడే అరెస్ట్ చేసి అనంతరం, యూపీ పోలీసులకు అప్పగించారు. అక్కడి నంచి దుబేను కాన్పూర్‌కు తీసుకువస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొద్ది గంటల ముందే సుప్రీంలో కేసు వికాస్ దుబే ఎన్కౌంటర్ జరగడానికి కొన్ని గంటల ముందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దు బేను ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశముందని, అలా జరగకుండా అడ్డుకోవాలని కోరుతూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. చాప్టర్ క్లోజ్ యూపీ సివిల్ డిఫెన్స్ ఐజీ అమితాబ్ ఠాకూర్ ఈ ఎన్‌కౌంటర్‌ను ముందే ఊహించారు. ‘వికాస్ దుబే లొంగిపోయాడు. రేపు ఉదయం ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది.ఆ క్రమంలో పోలీసుల చేతిలో చనిపోయే అవకాశం కూడా ఉంది. దుబే చాప్టర్ క్లోజ్ అవుతుంది’ అని గురువారం ట్వీట్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలి గతవారం పోలీసు బృందంపై వికాస్ దుబే జరిపిన కాల్పుల ఘటన నుంచి నేటి దుబే ఎన్కౌంటర్ వరకు అన్ని ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ‘నేరస్తులు చనిపోయారు. కానీ ఇన్నాళ్లు వారిని కాపాడిన వారినేం చేస్తారు?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు. మొత్తం ఘటనకు సంబంధించి వాస్తవాలు బయటకురావాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ల నేర చరిత్ర యూపీలో కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే(56)కు 30 ఏళ్ల నేర చరిత్ర ఉంది. మొత్తం అతనిపై 62 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 5 హత్యలు, మరో ఎనిమిది హత్యాయత్నం కేసులు. వారం క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. 1990లో కాన్పూర్‌లో ఒకరిపై దాడి చేసిన కేసులో వికాస్ దుబే పేరు తొలిసారిగా వినిపించింది. ఆ తర్వాత రెండేళ్లకి కాన్పూర్ శివాలి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో దళిత యువకుడి హత్య కేసులో అతను నిందితుడు. ఈ ఘటన తర్వాత ఒక ముఠాను ఏర్పాటు చే సుకొని డాన్‌గా ఎదిగాడు. దోపిడీలు, దొంగతనాలు చేస్తూ రాజకీయాల్ని వాడుకున్నాడు. 1995–96లో బీఎస్పీలో చేరాడు. పోలీసు శాఖలో అతనికి సన్నిహితులు ఎక్కువ. ఎప్పుడైనా ప్రభుత్వం అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే వికాస్ దుబేకి ఉప్పందిపోయేది. అలా తన చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బీజేపీ నేత శుక్లా హత్యతో సంచలనం 2001లో ఆనాటి యూపీ సర్కార్‌లో సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత సంతోశ్ శుక్లాను పట్టపగలు అందరూ చూస్తుండగా పోలీస్‌స్టేషన్‌లోనే చంపడంతో వికాస్ దుబే పేరు వింటేనే అందరిలోనూ వణుకుపుట్టింది. ఆరు నెలల అనంతరం అతను లొంగిపోయాడు. కానీ, కేసు విచారణ సమయంలో పోలీసులే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో 2005లో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నాహాలు వికాస్ సొంతూరు బిక్రులో గత 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. వికాస్ దుబే ఎవరి పేరు చెబితే అతనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే కావాలని కలలుగన్నాడు. ఎలాగైనా చట్టసభల్లోకి వెళ్లడమే లక్ష్యమని పలుమార్లు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున కాన్పూర్ జిల్లా రణియా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తూనే బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించాడు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు అతని ప్రయత్నాలను సాగనీయలేదని తెలుస్తోంది. పోలీసుల అదుపులో భార్య, కుమారుడు వికాస్ దుబే తల్లిదండ్రులు రామ్‌కుమార్ దుబే, సరళాదేవి. తల్లి సరళాదేవి చాలా సంవత్సరాలుగా వికాస్ దుబేని దూరం పెట్టారు. తన చిన్న కుమారుడు దీపూతో కలిసి ఉంటున్నారు. వికాస్ పట్టుబడితే కాల్చి చంపేయమని బహిరంగంగానే చెప్పారు. వికాస్ దుబే భార్య రిచా స్థానిక రాజకీయాల్లో ఉన్నారు. ఘిమవూ పంచాయతీ సభ్యురాలిగా నెగ్గారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రెండో కుమారుడు షాను లక్నోలో తల్లితో కలిసి ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. వికాస్ భార్య, రెండో కొడుకు, వారింట్లో పనివాడిని పోలీసులు ఇప్పటికే నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది మంది పోలీసుల్ని చంపడానికి చేసిన కుట్రలో రిచా హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఉజ్జయిన్లో అరెస్ట్ చేసే సమయంలో ఎలాంటి ప్రతిఘటన చూపని దుబే, ఆ తరువాత కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నించారు. దుబేను తీసుకువెళ్తున్న పోలీస్ కాన్వాయ్‌ను ఫాలో అవుతున్న మీడియా వాహనాలను ఒక దగ్గర నిలిపేశారని, అక్కడికి కొద్ది దూరంలో, కాసేపటికే ఎన్కౌంటర్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఉజ్జయిన్ నుంచి బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగిన వాహనంలో కాకుండా, వేరే వాహనంలో దుబే కూర్చుని ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఈ అనుమానాలను యూపీ పోలీసులు కొట్టివేశారు. చెక్ చేయడం కోసమే మీడియాను ఆపి ఉండొచ్చని పేర్కొన్నారు. బిక్రు గ్రామంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇప్పటివరకు 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఆరుగురు ఎన్కౌంటర్లలో చనిపోయారని ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. -
వికాస్ దుబే అరెస్ట్
భోపాల్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ చేశారు. దుబే అనుచరులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ‘ఉజ్జయిన్‌లోని మహాకాల్ ఆలయానికి వికాస్ దుబే ఈ ఉదయం కార్లో వచ్చాడు. మొదట ఒక కానిస్టేబుల్ దుబేని గుర్తించాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఆ కానిస్టేబుల్ అప్రమత్తం చేశాడు. వారు దుబేను పక్కకు తీసుకెళ్లి, ప్రశ్నించి, అనంతరం అరెస్ట్ చేశారు’ అని మిశ్రా వివరించారు. అయితే, ఆలయ వర్గాలు మరోలా చెప్పాయి. ‘ఉదయం ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన దుబే.. రూ. 250 ల టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తరువాత దేవుడికి సమర్పించేందుకు ప్రసాదం కొనాలని దగ్గర్లోని షాపు వద్దకు వెళ్లాడు. దుబేను ఆ షాప్ ఓనర్ గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు’ అని ఆలయ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా, అక్కడ గుమికూడిన ప్రజలను చూస్తూ.. ‘నేను వికాస్ దుబే.. కాన్పూర్ వాలా’ అని గట్టిగా అరిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో, దుబేను పట్టుకుని ఉన్న కానిస్టేబుల్ దుబే తలపై గట్టిగా ఒక దెబ్బ వేసి.. నోర్మూసుకో అని గద్దించాడని వివరించారు. దుబేను తమ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. అరెస్ట్ తరువాత ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు. కాన్పూర్ నుంచి వచ్చిన పోలీసులకు మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్ దుబేను అప్పగించారు. ఇద్దరు అనుచరుల హతం రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో దుబే అనుచరులు ఇద్దరిని గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసులు హతమార్చారు. ఫరీదాబాద్‌లో బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన కార్తికేయను కాన్పూర్ తీసుకువెళ్తుండగా, పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని, పోలీసులపై కాల్పులు జరుపుతూ, పారిపోయేందుకు ప్రయత్నించాడని, దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో కార్తికేయ చనిపోయాడని ఏడీజీ ప్రశాంత్‡ తెలిపారు. ఎటావా వద్ద జరిగిన మరో ఎన్కౌంటర్లో దుబే అనుచరుడు, కాన్పూర్ కాల్పుల ఘటనలో నిందితుడు ప్రవీణ్ అలియాస్ బవువా చనిపోయాడని ఎటావా ఎస్పీ ఆకాశ్ ప్రకటించారు. ఎస్పీలో ఉన్నాడు తన కుమారుడు వికాస్ దుబే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో ఉన్నాడని ఆయన తల్లి సరళాదేవి తెలిపారు. అయితే, దీన్ని ఎస్పీ ఖండించింది. వికాస్ దుబే మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్ బయటపెడితే ఏ పార్టీకి చెందినవాడో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. సరిగ్గా వారం కిత్రం, శుక్రవారం రాత్రి దుబేను అరెస్ట్ చేసేందుకు కాన్పూర్‌లోని చాబీపుర్ ప్రాంతంలో ఉన్న బిక్రు గ్రామంలో ఉన్న ఆయన ఇంటికి పోలీసు బృందం వెళ్లింది. వారిపై దుబే, ఆయన అనుచరులు ఇంటిపై నుంచి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు చనిపోయారు. హత్యలు సహా దాదాపు 60 క్రిమినల్ కేసుల్లో దుబే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. వాటిలో 20 ఏళ్ల క్రితం ఒక బీజేపీ ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్లోనే చంపేసిన కేసు కూడా ఒకటి. అయితే, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. ఎన్కౌంటర్ తప్పించేందుకే.. దుబే లొంగిపోయాడని, దీనివెనుక మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. యూపీ పోలీసుల ఎన్కౌంటర్ నుంచి తప్పించేందుకే ఉజ్జయిన్లో దుబే దొరికిపోయేలా చేశారన్నారు. మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. -
‘తనిఖీ లేకుండా 700కిలోమీటర్లు ఎలా వెళ్లాడు’
లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటన తర్వాత పరారీలో ఉన్న వికాస్ దూబే దాదాపు 700కిలోమీటర్లు ప్రయాణించాడు. కారులో రోడ్డు మార్గం ద్వారా హరియాణాలోని ఫరిదాబాద్ చేరుకుని అక్కడ నుంచి రాజస్తాన్ కోటా మీదుగా ఉజ్జయిని ఆలయం చేరుకున్నాడు.(‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’) ఈ క్రమంలో వికాస్ దూబే అరెస్ట్‌పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. ‘ఎలాంటి తనిఖీ లేకుండా వికాస్ దూబే 700 కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. దారుణమైన ఎన్కౌంటర్ తర్వాత యూపీ ప్రభుత్వం వికాస్ దూబే గురించి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యింది. అందువల్లే అతను ఉజ్జయిని చేరుకోగలిగాడు. ఇది ప్రభుత్వ వైఫల్యాలనే కాక అతడికి గవర్నమెంట్‌తో కల సంబంధాలను సూచిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. వికాస్ దూబేని అరెస్ట్ చేశారా లేక అతడే లొంగిపోయాడా అనే దాని గురించి వివరణ ఇవ్వాల్సిందిగా సమాజ్‌వాద్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అతడికి సంబంధించిన కాల్ రికార్డ్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని కోరింది. మరో ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ‘మేం వికాస్ దూబేను అరెస్ట్ చేయలేదు.. అతడు ఉజ్జయినిలో లొంగిపోయాడు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లకుండా తిరుగుతూనే ఉన్నాడు. దీని గురించి దర్యాప్తు చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా మాత్రం వికాస్ దూబేను అరెస్ట్ చేశామని.. అతడు లొంగిపోలేదని స్పష్టం చేశాడు. బిట్టు, సురేష్ అనే ఇద్దరు అనుచరులతో కలిసి వికాస్ దూబే రాజస్తాన్ కోటా ద్వారా మధ్యప్రదేశ్‌లో ప్రవేశించాడని తెలిపారు. ఇందుకు గాను అతడు వికాస్ పాల్ అనే నకిలీ ఐడీని ఉపయోగించాడు అని తెలిపాడు. -
ఉజ్జయినిలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్
-
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్
భోపాల్: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడు "నేను వికాస్ దూబేను, కాన్పూర్ వాలా" అని గట్టిగా అరవడం గమనార్హం. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటివరకు అతని నలుగురి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్‌కు అత్యంత సన్నిహితుడు, అతని బాడీగార్డు అమర్ దూబేను పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. వికాస్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని పోలీసులు గురువారం హతమార్చారు. ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. (వికాస్ దూబేపై నగదు బహుమతి 5 లక్షలకు పెంపు) దీంతో ఇప్పటివరకు అతని ముగ్గురు అనుచరులు మరణించారు. ఇక హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ హోటల్లో వికాస్ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం రాగా వారు అక్కడికి చేరుకునేసరికి పరారయ్యాడు. తాజాగా అతడు నోయిడాలో ఓ ఆటోలో వెళ్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నోయిడాలో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. అనంతరం వికాస్ దూబే ఉజ్జయినిలో ప్రత్యక్షమయ్యాడని తెలుసుకున్న పోలీసులు ఈసారి అతడు పారిపోవడానికి వీలులేకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ముప్పేట దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. (వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్కౌంటర్!) -
నేను చనిపోలేదు..బతికే ఉన్నా : కరోనా పేషెంట్
భోపాల్ : డాక్టర్లు చేసిన పొరపాటుకు ఓ కరోనా పేషెంట్ స్వయంగా తాను బతికే ఉన్నా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కరోనావైరస్తో ఒకరు మృతి చెందితే..మరొకరి పేరును వైద్యులు ప్రకటించారు. తాను చనిపోయిన వార్తను తానే చదివి ఆశ్చర్యపోయాడు ఆ రోగి. చివరకు ఓ వీడియో రూపంతో తాను బతికే ఉన్నానని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని తెలియజేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరస్ కావడంతో వైద్యుల తమ పొరపాటును ఒప్పకుని క్షమాపణలు కోరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. (చదవండి : వధూవరులకు కరోనా, గ్రామానికి సీల్) వివరాలు.. భోపాల్‌లో 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జైన్ నరగానికి చెందిన ఓ 30 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఉజ్జెన్లోని ఆర్డీ గార్డి హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అదే ఆస్పత్రిలో చేరిన ఓ 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. అయితే వైద్యులు పొరపాటున మృతి చెందిన వ్యక్తి పేరుకు బదులు చికిత్స పొందుతున్న యువకుడి పేరును మరణించినట్లు ప్రకటించారు. మరుసటి రోజు చికిత్స పొందుతున్న యువకుడు పేపర్లలో తాను మృతి చెందినట్లు వచ్చిన వార్తను చదివి ఆశ్చర్యపోయాడు. తాను బతికే ఉన్నానని, ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరుతూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరస్ కావడంతో వైద్యాధికారులు స్పందించారు. విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వైద్యులను షోకాజ్ నోటీసులు పంపించారు. తమ పొరపాటును గ్రహించిన వైద్యులు.. వెంటనే అతని పేరుని రికార్టులో నుంచి తొలగించి మృతి చెందిన వృద్ధుని పేరును చేర్చారు. కాగా, మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,096కు చేరింది. ఇప్పటి వరకు 99 మంది మృతి చెందారు. -
ఐసీయూ గది తాళం దొరక్క ఆగిన ప్రాణం
ఇండోర్: ఆసుపత్రిలో ఐసీయూ గది తాళం చెవి దొరక్కపోవడంతో సకాలంలో చికిత్స అందక ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గురువారం ఉజ్జయిన్ జిల్లాకు చెందిన యాభై ఐదేళ్ల మహిళకు అధిక రక్తపోటుతోపాటు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మాధవ్ నగర్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కానీ ఆ ఆసుపత్రి కరోనా పరీక్షల కోసం నిర్దేశించినందున అంబులెన్సులో "ఆర్డీ గార్డీ మెడికల్ ఆసుపత్రి"కి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి అత్యవసర విభాగమైన ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) గదికి తాళం వేసి ఉంది. సరైన సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో లేరు. (రూ.1.90 లక్షలకే వెంటిలేటర్) మరోవైపు ఆమె పరిస్థితి క్షణక్షణానికి మరింత దిగజారుతుండటంతో ఐసీయూ గది తాళాన్ని పగలగొట్టారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన గురించి ఉజ్జయిని జిల్లా వైద్యాధికారి అనసూయ గాలి మాట్లాడుతూ.. "బాధితురాలు బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి తీసుకు వచ్చిన వెంటనే ముందుగా వైద్యులు ఆమె నుంచి కోవిడ్-19 నమూనాలను సేకరించారు. కానీ ఆ సమయంలో పరిస్థితి క్షీణించి మరణించింది. దీనిపై విచారణ జరుపుతున్నాం" అని పేర్కొన్నారు. కాగా ఈ మహిళతోపాటు మరో రోగికి సకాలంలో వెంటిలేటర్లు అందించక వారి చావుకు కారణమైన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించారు. (లాక్డౌన్: మహిళను కాల్చి చంపిన జవాను!) -
లాక్డౌన్: బయటికొస్తే కాల్చిపడేస్తా
ఉజ్జెయిన్: లాక్డౌన్ నేపథ్యంలో కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో వీరంగం సృష్టించిన పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి బయటకు వస్తే కాల్చి చంపుతానని మహిద్‌పూర్ స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్ఓ) సంజయ్ వర్మపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను పోలీసు లైన్‌ను అటాచ్ చేస్తూ ఉజ్జెయిన్ ఎస్పీ సచిన్ అతుల్కర్ ఆదేశించారు. ‘నా మాట విని మీరంతా ఇళ్లలోనే ఉండండి. నా మాటలు బేఖతరు చేసి బయటకు వస్తే కాల్చి చంపుతాం. నేను షార్ప్ షూటర్ని. తుపాకితో గురి చూసి కాల్చడానికి నాకు ఏడు సెక్షన్లకు మించి సమయం పట్టదు’ అంటూ తన పర్సనల్ మొబైల్ నంబర్ నుంచి వాట్సప్‌లో సంజయ్ వర్మ హెచ్చరించారు. షూటింగ్లో తాను రజత పతకం గెలుచుకున్నానని, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని స్థానికులను తీవ్రంగా హెచ్చరిస్తూ మరో మెసేజ్ పెట్టారు. అంతేకాదు తన సందేశాన్ని వాట్సప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేయాలని సూచించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనపై చర్య తీసుకున్నారు. ఇండోర్‌లో గురువారం 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందడంతో మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది. (క్షమాపణ చెప్పిన యూపీ పోలీసులు) -
ఉజ్జయినిలో ప్రియాంక ప్రత్యేక పూజలు
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ నేడు ఉజ్జయినిలో పర్యటించారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంటకు పైగా ప్రియాంక పూజలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. అనంతరం ఉజ్జయినిలో జరిగిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉజ్జయిని లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాబులాల్ మాలవ్యా బరిలో నిలిపింది. ఏడో విడతలో భాగంగా మే 19న ఉజ్జయినిలో పోలింగ్ జరగనుంది. -
‘నువ్వు జంధ్యం ధరిస్తావా.. నీ గోత్రమేంటి..?’
ఇండోర్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ‘మీరు జంధ్యం ధరించారా.. ధరిస్తే అది ఎలాంటిది.. మీ గోత్రమేంటి’ అంటూ రాహల్‌ని ప్రశ్నించారు. అయితే రాహుల్ ఆలయాలను సందర్శించడం ఇదే ప్రథమం కాదు. గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాహుల్ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ తాను శివ భక్తుడిని అని చెప్పుకున్న సంగతి తెలిసిందే. -
మైనర్ రేప్ కేసులో ఏడుగంటల్లోనే తీర్పు
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): మైనర్ బాలికను 14 ఏళ్ల పిల్లాడు రేప్ చేసిన కేసులో ఉజ్జయినిలోని జువైనల్ కోర్టు రికార్డుస్థాయిలో కేవలం ఏడుగంటల్లో తుది తీర్పు వెలువరించింది. నిందితుడిని దోషి గా తేల్చి అతనికి రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆగస్టు 15న రేప్ ఘటన చోటుచేసుకోగా కేసు నమోదు, దర్యాప్తు, నిందితుడి అరె స్టు, హాజరు, జువైనల్ కోర్టులో కేసు వాదోపవాదనలు ఇలా మొత్తం ప్రక్రియ అంతా కేవలం ఐదు రోజుల్లో పూర్తి అయ్యింది. కేసు డైరీని సోమవారం ఉదయం గం.10.45కు జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి తృప్తి పాండే ముం దు పోలీసులు సమర్పించగా సాయంత్రం ఆరుకల్లా తుది తీర్పు చెప్పేశారని ప్రభుత్వ న్యాయ వాది దీపేంద్ర మలూ మంగళవారం మీడియాకు చెప్పారు. సివనీ జిల్లాలోని ఘటియా గ్రామంలో మైనర్‌బాలుడి ఇంట్లో ఆడుకుంటున్న బాలికను ఆ పిల్లాడు రేప్ చేసి పారిపోయి రాజస్తాన్‌లోని బంధువుల ఇంట్లో దాక్కున్నాడు. రేప్ విషయం తెల్సి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉజ్జయిని ఎస్పీ సచిన్ అతుల్కర్ నేతృత్వంలోని బృందం ఆ పిల్లాడిని అరెస్టుచేశారు. -
ఆయనపై మనసు పారేసుకున్నా.. ఎలాగైనా కలుస్తా
ఉజ్జయిని: సినిమా స్టార్లు, క్రికెటర్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. తమకు ఇష్టమైన వారిని కలుసుకునేందుకు అభిమానులు ఎంత దూరమైనా వెళ్తుంటారు. అయితే పంజాబ్‌లోని హోషియార్పూర్ కు చెందిన ఓ యువతి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్‌ను చూసి ఫిదా అయింది. ఇక అంతే.. ఆ ఆఫీసర్‌ను కలుసుకోవాలని సదరు యువతి నానాతంటాలు పడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34).. మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఐపీఎస్ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన 27 ఏళ్ల యువతి ఆయనపై మనసు పారేసుకుంది. అంతే ఆయనను ఎలాగైనా కలవాలనుకుని మూడు రోజుల క్రితం ఉజ్జయిని వచ్చింది. అప్పటి నుంచి సచిన్‌ను చూడాలని ఎస్పీ కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జి రేఖా వర్మ యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అయితే తనకు అతుల్కర్ అంటే అభిమానమని, ఆయనను కలవాల్సిందేనని యువతి స్పష్టం చేయడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినా.. యువతి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇక చేసేదిమి లేక పంజాబ్‌కు పంపించేందుకు నగ్డా రైల్వేస్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. తనను రైలు ఎక్కిస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో.. చేసేదేమి లేక పోలీసులు ఆమెను వెనక్కు తీసుకువచ్చారు. ఆమె పిజ్జాలు సహా తనకు నచ్చిన ఆహారాన్ని డిమాండ్ చేస్తోందని, తాము ఓపికగా వాటిని అందిస్తున్నామని రేఖా వర్మ వెల్లడించారు. యువతి సైకాలజీలో పిజీ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ విషయంపై సచిన్ అతుల్కర్ స్పందించారు. ఓ అధికారిగా తాను ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రహ్మచారిగా ఉన్న అతుల్కర్, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధను చూపుతారు. రోజుకు 70 నిమిషాలు జిమ్ లో గడిపే ఆయన గతంలో పలు ఫిట్నెస్ అవార్డులనూ సొంతం చేసుకున్నారు. -
ఆలయం ముందు మహిళలపై వీరంగం
ఉజ్జయినీ : ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య నడిరోడ్డు మీద గొడవ జరిగింది. ఆలయం ముందు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళలపై దారుణంగా దాడి చేశాడు. ప్రత్యర్థి వ్యక్తిని కిందపడేసి కొట్టడమే కాదు.. అతనికి అండగా వచ్చిన మహిళలపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలోని ‘మహంకాళి’ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూల వ్యాపారుల మధ్య గొడవ ఎందుకు జరిగింది? వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్లు చూశాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రభావం ఆ యువకుడిపై కనిపిస్తోందని, మహిళలను కిరాతకంగా కొడుతున్నా.. చుట్టూ ఉన్నవారు వినోదం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
హర్దిక్ పటేల్‌పై ఇంకు దాడి
-
వెధవలను చేస్తున్నాడంటూ ఇంకు జల్లాడు
ఉజ్జయిని : పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఇంకుతో హర్దిక్‌పై దాడి చేశాడు. హఠాత్ పరిణామంతో యువనేత బిత్తర పోగా.. దాడి చేసిన వ్యక్తిని హర్దిక అనుచరులు చితకబాదారు. శనివారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దాడి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉజ్జయినిలో ఓ హెటల్ లో ప్రెస్ మీట్ కోసం హర్దిక్ బయలుదేరారు. అంతలో మిలింద్ గుజ్జర్ అనే వ్యక్తి దూసుకొచ్చి హర్దిక్‌పై ఇంకు పోసేశాడు. వెంటనే హర్దిక్ పక్కనున్న వ్యక్తులు మిలింద్‌ను కొట్టి.. ఆపై పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, పటీదార్, గుజ్జర్ తెగలను స్వప్రయోజనాల కోసం హర్దిక్ వెధవలను చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఇంక్ పోసినట్లు మిలింద్ వివరించాడు. అంతకు ముందు మిలింద్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ హర్దిక్ ఇంకు దాడి చేస్తానని ప్రకటించటం విశేషం. ఇక ఆ పరిణామాలను పట్టించుకోని హర్దిక్ తన ప్రెస్ మీట్‌ను కొనసాగించించాడు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. తాము అడ్డుకోబోమని.. ఆయన తరపున ప్రచారం కూడా చేస్తామని హర్దిక్ తెలిపారు. -
అమిత్ షా మేనల్లుడిలా నటించి..
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మేనల్లుడినని చెప్పుకుంటూ ఓ యువకుడు ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు. అతని బాధితల్లో ఎమ్మెల్యేలు చేరిపోతున్నారంటే ఆలోచించండి ఎంతటి తెలివైన దొంగో!. శాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న సమయంలో ల్యాప్ టాప్, పర్సు, వాచ్, మొబైల్, కొన్ని ఆభరాణలు కలిగి దాదాపు 11 లక్షల విలువజేసే వస్తువులను ఏ1 బోగీలో నుంచి ఎవరో దొంగిలించారంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు విరజ్ సింగ్ అని, పూణె నుంచి తాను వస్తున్నానని దారిలో బ్యాగ్ మిస్సయిందని సాయం చేయాలంటూ ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్ యాదవ్ కు ఫోన్ చేశాడు. దీనిపై స్పందించిన మోహన్ తన అసోసియేట్ ను శర్మను ఉజ్జయిని స్టేషన్ కు పంపారు. రైల్వే పైస్థాయి అధికారులకు ఫోన్ చేసి సత్వరమే సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. స్టేషన్ కు చేరుకున్న శర్మ విరజ్ ను మోహన్ యాదవ్ నివాసానికి తీసుకెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మేనల్లుడు కావడంతో ఆయన దగ్గర కావొచ్చనే ఉద్దేశంతో రోజంతా ఉజ్జయినిలోని ప్రదేశాలను విరజ్ కు మోహన్ తిప్పి చూపించారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరే ముందు శర్మ విరజ్ కు రూ.50 వేల నగదు, 15 వేల రూపాయల విలువైన మొబైల్, విమానం టిక్కెట్ ను ఏర్పాటుచేశారు. జీఆర్పీ పోలీసులు జరిపిన విచారణలో విరజ్ తాను రిజర్వ్ చేసిన సీటుగా పేర్కొన్నది అతనిది కాదని తేలింది. అంతేకాకుండా విరజ్ ఇచ్చిన మొబైల్ నంబర్ కూడా స్విచాఫ్ రావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. గత వారం రాజస్థాన్ లోని అబు రైల్వేస్టేషన్ లో ఇలాంటి సంఘటనే రైల్వే అధికారులకు ఎదురైంది. రాజస్థాన్ కు చెందిన జాల్నా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కూడా విరజ్ మాయలో పడి పెద్ద మొత్తంలో అతనికి ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ కేసుపై విచారణ చేపట్టిన అధికారులు విరజ్ భార్యను ప్రశ్నించగా దొంగతనం లాంటివేం జరుగలేదని పేర్కొంది. యువకుడు తనను మోసం చేయడంపై మాట్లాడిన మోహన్ యాదవ్.. యువకుడు మోసగాడని గుర్తించలేకపోయానని చెప్పారు. ఎమ్మెల్యే, జీఆర్పీ అధికారులు కూడా అతనో మోసగాడని గుర్తించలేకపోయారు. యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. -
ఉజైనీ
ఉజ్జయిని దక్షిణాభిముఖుడికి జై భూగర్భంలో కొలువుదీరిన పరమేశ్వరుడు భస్మహారతితో సంతుష్టుడయ్యే భవుడు జన్మజన్మల పాపాలను హరించే లోకనాయకుడు ఉజ్జయిని నగరాధీశుడు... మహాకాళేశ్వరుడు. ఉజ్జయిని నగరానికి చరిత్రలో ‘అవంతి’ అని పేరుండగా, చరిత్రకు పూర్వమే ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జాన్ అంటే ఉద్యానవనం. నేటికీ ఈ నగరం సుందర ప్రకృతి రామణీయకతకు మారుపేరుగా నిలుస్తోంది. ఆనాటి లెక్కల ప్రకారం ముఖ్య కాలమాన రేఖాంశం ఉజ్జయిని మీదుగా ఉండేది. అక్కడ వెలసిన మహాకాలుడే కాలానికి అధిపతిగా పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వదైన శివలింగం మహాకాళేశ్వరుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి - ఇద్దరూ కొలువున్న క్షేత్రం ఉజ్జయిని. ఈ పన్నెండు క్షేత్రాల్లోనూ శంకరుడు దక్షిణాభిముఖుడిగా కొలువై ఉన్న తీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ ఈ ప్రత్యేకత లేదు. దక్షిణాభిముఖంగా స్వయంభువై వెలసిన మహాకాళేశ్వర ఆరాధనలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ లింగానికి ప్రతీరోజు శిప్ర నదీ జలాలలతో అభిషేకం, ఆ తర్వాత చితాభస్మంతో అలంకరణ జరగడం విశేషంగా చెప్పుకోదగినవి. ఉజ్జయిని ఆలయం ఐదు అంతస్థులుగా, ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది. అందులో ఒక అంతస్థును భూమికి క్రింద అంటే నేలమాళిగగా కట్టారు. ఆ క్రింది అంతస్థులో స్వయంభువు అయిన మహాకాళేశ్వర లింగం ఉంటుంది. దానిపైన అంతస్థులో ఓంకారేశ్వర మహాదేవ లింగం, మూడవ అంతస్థులో నాగచంద్రేశ్వర లింగం ఉంటాయి. ఈ 3 శివలింగాలే కాకుండా ఇంకా అనాది కల్పేశ్వరుడు, త్రివిశ్తపేశ్వరుడు, చంద్రాదిత్యేశ్వరుడు, స్వప్నేశ్వరుడు వంటి అనేక శివలింగాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. తూర్పు, పశ్చిమ దిక్కులలో కార్తికేయ, వినాయకుల ఆలయాలు ఉన్నాయి. శివుడు దక్షిణ దిశగా తిరిగి వెలిశాడు కనుక, నందీశ్వరుడు దక్షిణ దిక్కులోనే దర్శనమిస్తాడు. ఈ ఉజ్జయిని మందిరాన్ని ఒక తాంత్రిక మందిరంగా భావిస్తారు. వర్ణనలకు అందని ఆలయం పురాణాల ప్రకారం ప్రజాపిత బ్రహ్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో చంద్రప్రద్యోతుడు ఆలయ నిర్వాహకునిగా కుమారసేనుని నియమించాడు. క్రీ.పూ 4వ శతాబ్ది నాటి ఉజ్జయిని నాణేలపైన ఈ మహాకాలుని చిత్రం ఉంటుంది. కాళిదాసు తన రఘువంశం, మేఘదూతం వంటి కావ్యాలలో ఈ మందిరం గురించి అద్భుతంగా చేసిన వర్ణనలు ఉన్నాయి. ఆ ఆలయ నిర్మాణ కౌశలం అలనాటి ఉత్తమస్థాయి వాస్తుకళకు అద్దం పడుతుంది. విక్రమార్కుడు ఈ నగరాన్నే తన రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. భర్తృహరి మహారాజు ఇక్కడే తన సుభాషితాలను లిఖించాడు. కాళిదాసు ఈ అమ్మవారి కటాక్షంతోనే మహాకవిగా మారాడు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇండోర్ పట్టణం నుంచి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్షిప్రానది గలగలలు, రుద్రాసాగర్ సరస్సుతో ఈ ప్రాంతం ప్రకృతి రామణీయకతకు మారుపేరులా ఉంటుంది. ఖగోళశాస్త్ర అధ్యయనాల కేంద్రంగానూ ఉజ్జయిని పేరుగాంచింది. విక్రమ్ విశ్వవిద్యాలయం, కాళిదాస్ అకాడమీ ఇక్కడ చెప్పుకోదగినవి. శివరాత్రి, మహాకుంభ, అర్ధ కుంభ మేళా వంటి ఉత్సవాలకు ఈ నగరం ప్రసిద్ధి గాంచింది. హర హర మహాకాళ పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు నిరంతరం శివార్చనలో ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. వీరు రోజు శివార్చనే ఊపిరిగా ఉన్నవారు. ఓ రోజు వీరంతా శివార్చనలో ఉండగా పర్వత శిఖరాలలో ఉన్న దూషణుడు అనే రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ నలుగురి వద్దకూ వచ్చాడు. కానీ వారు బెదరలేదు. శివార్చనను వీడలేదు. అంతలో దూషణుడు ఆ బ్రాహ్మణుల మీదకు కత్తి ఎత్తాడు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడు బూడిదరాశియై పడి ఉన్నాడు. ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు బెదరకుండా మహాకాళ రూపానికి స్త్రోతం చేశారనీ, భస్మహారతితో స్వామి ప్రసన్నుడు అయ్యాడనీ, వారి ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ రూపంలో వెలిశాడనీ కథనం. శిల్పాల సొగసు చూడతరమా! సరస్సు సమీపంలో గల ఈ దేవాలయం పైకి మూడు అంతస్థులుగా కనపడుతుంది. భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం... శిఖరం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. సాయంసంధ్యా సమయంలో ఈ మందిరం అత్యంత మనోహరంగా భాసిల్లుతుంది. ఇత్తడి దీపాలు భూగర్భగుడిలోకి పోయే మార్గాన్ని చూపిస్తాయి. ఇక్కడ పరమేశ్వరుడికి సమర్పించిన నైవేద్యం తిరిగి దేవతలందరికీ సమర్పించవచ్చని భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో ఒక చిత్రం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు ‘వర్షన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఈ తంతు కొనసాగతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే ‘శంఖుయంత్రం’ ఉందని పెద్దలు చెబుతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని అందుకే ఊదుతారని ప్రతీతి. మూడవ అంతస్థులో ఉన్న ‘నాగచంద్రేశ్వర’ విగ్రహం దర్శనానికి నాగపంచమి రోజున మాత్రమే తెరుస్తారు. మహాకాళేశ్వరుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకున్నవారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారని భక్తుల అపార నమ్మకం. చితాభస్మంతో అభిషేకం వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్న భూగర్భాలయంలో రెండు జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలంటారు. ఇక్కడే భస్మమందిరం ఉంది. ఆవులను లోపలికి తొలుకువచ్చి, వాటి పేడతో అక్కడే విభూతిని తయారుచేసి, ఆ విభూతితో స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారు. ఇక్కడ చేసే విభూతి అభిషేకాలు రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసి మూట కడతారు. ఆ మూటను శివలింగంపైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం ఆలయం అంతా భస్మంతో నిండిపోతుంది. ఆ సమయంలో శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను మోగిస్తారు. అప్పుడు అక్కడి అలౌకిక స్థితి గురించి మాటల్లో చెప్పలేం. రెండవ రకం అభిషేకం అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మంతో చేస్తారు. రోజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా ఈ భస్మహారతి (అస్థికల సమర్పణ) జరుగుతుంది. పది మంది నాగసాధువుల చేత జరిగే ఈ భస్మహారతి సయమంలో సాక్షాత్తూ కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మపూజ చేశాడంటారు. ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని ‘మహా శ్మశానం’ అని కూడా పిలుస్తుంటారు. భస్మహారతికి కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో, బారికేడ్ల వెనుక వరకే అనుమతిస్తారు. శిప్రానదిలో స్నానం, మహాకాళేశ్వరుని దర్శనం అకాలమృత్యువు నుంచి రక్షణ ఇస్తుందని, మరణానంతరం జీవనం ఉండదని భక్తుల అపారవిశ్వాసం. 12 ఏళ్ల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతోంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. - ఎన్.ఆర్ అమ్మలగన్న అమ్మ గర్కాళిక అజ్ఞానం, చీకటి, శత్రు భయాలను పోగొట్టడానికి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు మహాకాళి రూపంలో ఉజ్జయినిలో కొలువై ఉన్నారు. గర్కాళికగా పూజలందుకుంటున్నారు. మహాకవి కాళిదాసు నాలుకపై అమ్మవారు బీజాక్షరాలు రాసింది ఇక్కడే. గర్భగుడిలో లింగం అగ్రభాగాన ‘ఓంకారేశ్వర మహాదేవ’ అని ఉంటుంది. గణేష్, ఓంకారేశ్వర్ శివ, పార్వతి, షణ్ముఖుడు, నంది విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడి దేవాలయ సముదాయం క్రీ.శ.1234-35లో ముసల్మానులు దాడి చేసిన సందర్భంలో ధ్వంసం అయ్యింది. తర్వాత క్రీ.శ.1736లో శ్రీమంత్ పీష్వా బాజీరావు, ఛత్రపతి షాను మహారాజ్‌లు ఇప్పుడు ఉన్న నిర్మాణం చేశారు. ఆ తర్వాత శ్రీనాథ్ మహాడ్జి షిండే మహారాజ్‌చే అభివృద్ధి జరిగినట్టు చరిత్ర చెబుతోంది. గిరిజనుల నగలు ప్రత్యేకం ఉజ్జయిని నగర వీధులలో టవర్ చౌక్‌లో దొరికే ఆహారాన్ని పర్యాటకులు బాగా ఆస్వాదిస్తుంటారు. నోరూరించే స్థానిక వీధి ఆహారాలైన చాట్లు, పానీపూరి, బేల్‌పూరీ, నెయ్యితో మొక్కజొన్న అల్పాహారం పదార్థాలు ఇక్కడ ప్రత్యేకం. ఉజ్జయిని నగరం గిరిజనుల నగలు, వస్త్రాలు, వెదురు ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని టూరిజం వారు నగరంలో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి నగర పరిధిలో ఆటో రిక్షాలు, బస్సులు, టాంగాలు అందుబాటులో ఉంచారు. నగరంలో ప్రయాణించడానికి ఎక్కువ శాతం పర్యాటకులు షేర్ ఆటో రిక్షాల వైపే మొగ్గుచూతారు. ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఇండోర్ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం నుంచి ఉజ్జయిని కేవలం 55 కి.మీ దూరం.ఉజ్జయిని రైల్వేస్టేషన్‌తో భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలనూ అనుసంధానించారు. {పయాణికులు ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్, ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. ఇండోర్, భోపాల్, గ్వాలియర్ నుండి రోజువారీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ దగ్గర్లో హోటల్ వసతి సదుపాయాలున్నాయి. -
సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో సాధువుల ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉజ్జయినిలో జరిగిన సాధువుల సంఘం ఎన్నికల ఫలితాలు గురువారం ఉదయం వెలువడ్డాయి. దీంతో ఓడిపోయిన వర్గానికి చెందిన కొందరు మరో వర్గంపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 20 మంది వరకు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గాయపడిన సాధువులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. -
చాయ్‌వాలాగా మారిన సీఎం
ఉజ్జయిని: వెళ్లిన ప్రాంతాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి తగిన విధంగా ప్రవర్తిస్తుండటం, దుస్తులు ధరించడం రాజకీయ నేతలకు అలవాటే. ఉజ్జయినిలో జరుగుతోన్న మహా కుంభమేళాలోమధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే పనినిచేశారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా సిప్రా నదీ తీరంలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యాంప్ లను శుక్రవారం తెల్లవారుజామన సందర్శించిన ఆయన చాయ్ వాలా అవతారం ఎత్తారు. కెటిల్ చేతబట్టుకుని అక్కడున్న భక్త పరివారానికి చాయ్ పోసి సంతోషింపజేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఏప్రిల్ 22న మొదలై మే 21 వరకు కొనసాగే సింహస్థ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సిప్రా నదీ తీరంలో గురువారం భారీ వర్షం, ఈదురు గాలులు చోటుచేసుకోవడంతో గుడారాలు కూలి ఏడుగురు భక్తులు మృత్యువాతపడ్డారు. (చదవండి: కుంభమేళాలో అపశ్రుతి) -
అనుమానిత బ్యాగు కలకలం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఉజ్జెయిన్‌లోని నానాఖేడా ప్రాంతంలోని ఓ హోటల్లో అనుమానిత బ్యాగును సిబ్బంది గుర్తించారు. దాని దగ్గరకు వెళ్లేందుకు అంతాభయపడటంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి స్క్వాడ్ టీం చేరుకొని తనిఖీలు చేస్తోంది. -
మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
సింహస్థా కుంభమేళాకు హిజ్రా సాధువులు
భోపాల్: చదివేందుకు వింతగానే ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు జరగనున్న సింహస్థా కుంభమేళాలో దాదాపు పదివేల మంది హిజ్రా సాధువులు పాల్గొని, పవిత్ర స్నానాలాచరించనున్నారట. దేశం నలుమూలల నుంచే కాకుండా బ్యాంకాక్ వంటి దేశాల నుంచి కూడా హిజ్రా సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్నారని ఉజ్జయిన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రుషి అజయ్‌దాస్ వెల్లడించారు. ఈ కుంభమేళాలో ఇప్పటిదాకా 13 వర్గాలకు చెందిన సాధువులు మాత్రమే పాల్గొనేవారని, వారికోసం మాత్రమే శిబిరాలు ఏర్పాటు చేసేవారని, ఈసారి హిజ్రా సాధువులు కూడా పెద్దమొత్తంలో హాజరవుతుండడంతో 14వ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అజయ్‌దాస్ తెలిపారు. ఉజ్జయిన్‌లోని తన ఆశ్రమంలోనే హిజ్రా సాధువుల కోసం ఈ నెల 13 నుంచే శిబిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇదిలాఉండగా హిజ్రా సాధువుల విషయంలో మిగతా సాధువర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని పలువురు భావిస్తుండగా ఉజ్జయిన్ జిల్లా కలెక్టర్ మాత్రం.. అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు.