మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 29) శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
నేటి (గురువారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి శివపంచాయతన పూజ, అభిషేకం జరిగింది. హారతి అనంతరం మహాకాళేశ్వరుని పూజ, అభిషేకం జరిగింది. 11 మంది బ్రాహ్మణులు ఈ పూజలను నిర్వహిస్తున్నారు. వీరు ఈ శివరాత్రి మహోత్సవాలలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహాకాళేశ్వర ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత, పార్కింగ్, ప్రసాద వితరణ తదితర సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
మార్చి 8న జరిగే శివరాత్రి వేడుకల వరకూ ప్రతీరోజూ మహాశివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ శివ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే పండితులు ఉపవాసం పాటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment