Shiv
-
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
ఉజ్జయినిలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 29) శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (గురువారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి శివపంచాయతన పూజ, అభిషేకం జరిగింది. హారతి అనంతరం మహాకాళేశ్వరుని పూజ, అభిషేకం జరిగింది. 11 మంది బ్రాహ్మణులు ఈ పూజలను నిర్వహిస్తున్నారు. వీరు ఈ శివరాత్రి మహోత్సవాలలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహాకాళేశ్వర ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత, పార్కింగ్, ప్రసాద వితరణ తదితర సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మార్చి 8న జరిగే శివరాత్రి వేడుకల వరకూ ప్రతీరోజూ మహాశివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ శివ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే పండితులు ఉపవాసం పాటించనున్నారు. -
తాజ్‌మహల్ దగ్గర శివపూజ
-
తాజ్‌మహల్ దగ్గర శివపూజ
ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ చుట్టూ వివాదాల పరంపరకు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. తాజాగా.. సోమవారం అతివాద హిందూభావజాలంతో ఉన్న ఇద్దరు యువకులు తాజ్‌మహల్ దగ్గర శివచాలీసా పూజను మొదలు పెట్టారు. అంతేకాక తాజ్‌మహల్ అనేది మొదట శివాలయం అని వారు పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రదేశం వద్ద శివారాధన చేయడంతో అక్కడ కొద్దిసేపు.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివారాధన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసలు ప్రయత్నించారు. ఈ సమయంలో వారు.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాజ్ దగ్గర శివారాధన చేస్తున్న యువకులను రాష్ట్రీయ స్వాభిమాన్ దళ్ (ఆర్ఎస్డీ), హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ)కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చివరగా సీఐఎస్ఎఫ్ బలగాలు.. వారిని అదుపులోకి తీసుకుని.. స్థానికి పోలీసులకు అప్పంగించారు. రాతపూర్వకంగా క్షమాపణ కోరడంతో.. వారిని పోలీసులు తరువాత విడుదల చేయడం జరిగింది. -
పాకిస్తాన్ శాశ్వత శవాసనానికి అర్హురాలు!
యోగా కార్యక్రమంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తేవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రశంసలు కురిపించింది. అయితే శరీరంలోని రుగ్మతలను తొలగించే యోగా.. ప్రజలు బాధపడుతున్న అధిక ద్రవ్యోల్బణం, అవినీతి నొప్పులు తగ్గించడానికి పనికిరాదని, యోగాలోని శవాసనానికి పాకిస్తాన్ శాశ్వత అర్హురాలంటూ శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ప్రపంచానికే సెంటర్ స్టేజ్ గా యోగాను తీసుకురావడంతోపాటు, 130 దేశాల్లో యోగా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి మెచ్చుకోదగ్గ విషయం అని శివసేన ప్రశంసించింది. యోగా ద్వారా 130 దేశాలు నడుం వంచాయని, మోడీ కృషితో అన్ని దేశాలనూ నేలపై పడుకొనేట్లు చేయగలిగారని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అటువంటి యోగాసనానికి శాశ్వత అర్హురాలంటూ శివసేన చురక వేసింది. అలా జరగాలంటే కేవలం ఆయుధాలతోనే సాధ్యమౌతుందంటూ విమర్శలు చేసింది. శవంలా నేలపై పడుకొనే యోగాసనమైన 'శవాసనం' యోగాలో ప్రముఖమైనది. ఆ ఆసనంలాగానే పాకిస్తాన్ ను చేయాలని శివసేన తన పార్టీ పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో పేర్కొంది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న కొన్ని రాష్ట్రాలు మోదీ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాయని, అయితే యోగా కూడ సైన్సేనని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రధాని ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా మతపరమైన, ధార్మిక కార్యక్రమం కాదని, ఇండియాలోనే కాక ఇతర దేశాల్లోనూ లక్షలమంది వివిధ ఆసనాల్లో రెండవ ప్రపంచ యోగాదినాన్ని ఘనంగా జరుపుకున్నారని శివసేన తెలిపింది. అయితే భారత్ లో అవినీతి రూపు మాపేందుకు తాము చేపడుతున్న చర్యలపై దోహాలో ప్రధాని మోదీ వివరించిన తీరును తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించిన శివసేన, విదేశీ గడ్డపై భారత్ పటిష్టను మంటగలపొద్దని సూచించింది.