ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ చుట్టూ వివాదాల పరంపరకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. తాజాగా.. సోమవారం అతివాద హిందూభావజాలంతో ఉన్న ఇద్దరు యువకులు తాజ్‌మహల్ దగ్గర శివచాలీసా పూజను మొదలు పెట్టారు.