తొలిసారి భారత పర్యటనకు వచ్చిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి తాజ్‌మహల్ పరిసరాల్లో అడుగుపెట్టిన ట్రంప్.. తొలుత సందర్శకుల పుస్తకంలో(విజిటర్ బుక్)లో సంతకం చేశారు. ప్రపంచ వింతగా ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్ విశేషాలను గైడ్ వివరిస్తుండగా.. ట్రంప్ దంపతులు ఆసక్తిగా ఆలకించారు. సంధ్యాసమయంలో చేతిలో చెయ్యి వేసుకుని పచ్చటి లాన్‌లో నడుచుకుంటూ మహత్తర కట్టడాన్ని చేరుకున్నారు. ఫొటోలకు పోజులిస్తూ.. ‘ప్రేమచిహ్నం’ అందాలను వీక్షిస్తూ.. ఆహ్లాదంగా గడిపారు.