భారత్ బ్రహ్మాండమైన దేశమని... ఈ రెండు రోజుల పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత ప్రజలు గతంలో కంటే ఇప్పుడు తమను మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారనుకుంటున్నానని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ ప్రధానులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని... వారు కోరితే కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నామని... భారత్‌కు మరిన్ని ఆయుధాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.