భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజ్‌మహల్‌లో సందడి చేశారు. భర్త జారేద్ కుష్నర్‌తో కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన కట్టడాన్ని వీక్షించారు. 2017లో ఇవాంక తొలిసారిగా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. తాజాగా తన తండ్రి ట్రంప్ భారత పర్యటనలో ఆమె కూడా భాగస్వామ్యమయ్యారు..