ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి | Former Minister Kakani Govardhan Reddy Reaction On Illegal Cases | Sakshi
Sakshi News home page

ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి

Published Tue, Mar 25 2025 12:39 PM | Last Updated on Tue, Mar 25 2025 2:50 PM

Former Minister Kakani Govardhan Reddy Reaction On Illegal Cases

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి సర్కార్‌ రాజకీయ కక్ష వేధింపులకు దిగింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో భాగంగా ఆయనపై మరో అక్రమ కేసు నమోదైంది.

సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి సర్కార్‌ రాజకీయ కక్ష వేధింపులకు దిగింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో భాగంగా ఆయనపై మరో అక్రమ కేసు నమోదైంది. కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాటిపర్తిలో క్వార్జ్  అక్రమ రవాణా అభియోగాల నేపథ్యంలో కేసు నమోదైంది. కాకాణి లక్ష్యంగా కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.

అక్రమ కేసులపై కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక కేసు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే నా గళం విప్పుతున్నా. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారు. క్వార్జ్‌కి సంబంధించి మరో కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేనేమి తప్పు చేయలేదు’’ అని కాకాణి పేర్కొన్నారు.

‘‘ఉడత బెదిరింపులకు భయపడను. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను.  ఈ కేసు మీద కూడా వేస్తాను’’ అని కాకాణి తెలిపారు.

Kakani: ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ బెదిరింపులకు భయపడేది లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement