TDP
-
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.ఈ నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్ భారీగా పడిపోతుంది.అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అహోబిలంలో ‘బీ ట్యాక్స్’!
ఆళ్లగడ్డ: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ‘బీ – ట్యాక్స్’ కోసం పచ్చముఠాలు అరాచకాలకు తెగబడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు లాడ్జీలు, సత్రాల నిర్వాహకులను కప్పం కట్టాలంటూ వేధిస్తున్నారు. ముడుపుల కోసం మూడు నెలలుగా అధికార యంత్రాంగంతో రకరకాలుగా బెదిరించినా దారికి రాకపోవడంతో అహోబిలంలో లాడ్జీలకు మంగళవారం తెల్లవారుజామున కరెంట్ తొలగించారు. ఇదంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ రెడ్‌బుక్ కుట్రలేనని స్థానికులు అంటున్నారు. బీ ట్యాక్స్ మాట్లాడుకోవాలంటూ.. అహోబిలం క్షేత్రం పరిధిలో సొంత పట్టా పొలాలు లేవు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాలుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అహోబిలంలో చిన్న, పెద్ద లాడ్జీలు, సత్రాలు కలిపి సుమారు 100 వరకు నిరి్మంచుకుని పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ‘బీ ట్యాక్స్’ వసూలు బాధ్యతను ‘వలస తమ్ముడు’ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. తొలుత పంచాయతీ సెక్రటరీ ద్వారా లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు ఇప్పించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తమకు ఇప్పుడు నోటీసులు ఏమిటని వారు తెల్లబోవడంతో ‘అన్న’ దగ్గరకు వెళ్లి బీ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. అయినా దారికి రాకపోవడంతో అధికారులతో సర్వే చేయించారు. అహోబిలంలో ఒక్కో లాడ్జీ నుంచి రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేయవచ్చని ‘బీ’ గ్యాంగ్ భావించింది. అయితే ఎంత బెదిరించినా దారికి రాకపోవడంతో లాడ్జీలకు కరెంట్ కట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనకు గురైన లైన్మెన్ సెలవుపై వెళ్లిపోగా అధికారులు ఆళ్లగడ్డ నుంచి ప్రైవేటు సిబ్బందిని రప్పించి మూడు నాలుగు లాడ్జీలకు కరెంట్ కట్ చేశారు. ఈలోగా తెల్లవారడం, స్థానికులు తిరగబడటంతో విద్యుత్ అధికారులు జారుకున్నారు. 20 ఏళ్లుగా మీటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా సక్రమంగా బిల్లులు కడుతుంటే కనెక్షన్లు ఎలా తొలగిస్తారంటూ లాడ్జీల నిర్వాహకులు విద్యుత్ అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ‘అహోబిలంలో అనుమతులు లేకుండా లాడ్జీలు నిర్మించుకున్నారని, విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలని పంచాయతీ సెక్రటరీ మాకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి డీఈఈ ఆదేశాలతో కట్ చేశాం’ అని ఏఈ వెంకటకృష్ణ చెప్పారు. -
హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్’గా వైఎస్సార్సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారుఆ బాధ్యత పార్టీపై ఉంది:రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారు.వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్ సిక్స్ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుంది.రైతుల్లో భరోసా కల్పించాలి:రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్ జగన్ నిర్ధేశించారు.పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. -
టీడీపీ మెడకు...వీరముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా అదే పారీ్టకి చెందిన నేతలు, సానుభూతిపరుల పేర్లు వినిపిస్తుండటం అధికార టీడీపీని కలవరపెడుతోంది. హత్యలో పాల్గొన్నది, మొదలు వ్యూహరచన చేసింది అందరూ ఆ పార్టీ వారేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది తమ పార్టీకి ఎక్కడ చెడ్డపేరు తెస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. హత్యకు గురైన వీరయ్య చౌదరి, పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన అనుమానితుడికి తెలుగుదేశం పార్టీ అధినాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు నగరంలోని ఎస్పీ కార్యాలయానికి, తాలూకా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న భవనంలో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. ముసుగులు ధరించిన నలుగురు యువకులు కేవలం మూడు నిముషాల్లోనే ఆయన శరీరంలోకి 53 కత్తి పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలు చేరుకున్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అమ్మనబ్రోలు చేరుకుని వీరయ్య చౌదరికి నివాళులర్పించారు. ఇంత దారుణానికి పాల్పడిన హంతకులు భూమి మీద ఉండడానికి అనర్హులని ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం చీమకుర్తి బైపాస్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక దాబా సమీపంలో హంతకులు వినియోగించిన స్కూటీ లభించింది. దీంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లయింది. కేసు కీలక మలుపు తిరిగింది. స్కూటీ ఆధారంగా చేసిన విచారణలో వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూటీ స్వా«దీనంతో లభించిన ఆధారాలతో నగరానికి చెందిన కొప్పోలు వాసి ప్రధాన పాత్రధారిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే రెండో వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకోవడంతో హత్యలో పాల్గొన్న మిగిలిన ముగ్గురూ జిల్లా వాసులుగానే గుర్తించారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లా టీడీపీ నేతల్లో కలకలం... వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ యువనేతకు ఆ పారీ్టలోని ముఖ్య నాయకులందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. స్థానిక నాయకులతో పాటు జిల్లాకు చెందిన కీలక ఎమ్మెల్యేలు, మంత్రులతో సదరు వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా నాయకులు తేలుకుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసు ఎటుపోయి ఎటు వస్తుందో, చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనని కలత చెందుతున్నారు. అలాగే ప్రచారంలో ఉన్న హవాలా వ్యాపారికి, రేషన్ బియ్యం డాన్‌కు సైతం టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయని ప్రచారం. అలాగే హత్యలో పాల్గొన్న ప్రధాన అనుమానితుడికి సైతం ఆ పారీ్టతో లింకులున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇరుకున పెడుతోంది.వీరయ్య కేసును ఏం చేస్తారు... వీరయ్య చౌదరి అంత్యక్రియలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితులు భూమి మీద ఉండేందుకు అర్హులు కారని చెప్పడం, నిందితులు ఎంతటి వారైనా ఒదిలిపెట్టేది లేదనడంతో ఈ కేసు గురించి ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీకి చెందిన నాయకుడు కావడం, హత్యలో ప్రధాన అనుమానితుడిగా పోలీస్ కస్టడీలో ఉన్న యువనేత కూడా టీడీపీకి చెందిన నాయకుడే కావడంతో ఇప్పుడీ కేసును ఏం చేస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు నిందితులను కఠినంగా శిక్షిస్తారా? లేక క్రమంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారా? అనే అంశాలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మిగతా వారు కూడా అధికార పారీ్టకి చెందిన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అధికార పార్టీ స్థానిక నాయకులతో, రాష్ట్రంలోని కీలక నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు కావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.డైలమాలో పోలీసులు...వీరయ్య కేసులో పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. హత్య జరిగి దాదాపు ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి హతుడు వీరయ్య చౌదరి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. మద్యం సిండికేట్, బియ్యం మాఫియా, భూ, ఆర్థిక వివాదాలున్నాయి. అయినా ఆయన టీడీపీ నాయకుడు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సంబంధాలు కలిగి ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు పోలీసులకు పలు సవాళ్లు విసురుతోంది. విచారణలో అనుమానితులంతా టీడీపీ నాయకులే కావడంతో పాటు వారికి జిల్లా టీడీపీ నాయకులతో, మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు సమాచారం. స్కూటీ లభించిన రోజు టీడీపీ మీడియా చానళ్లలో అధికార పార్టీ నేతల ప్రమేయాన్ని పేర్లతో సహా ప్రసారం చేశారు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు రోజుకో పేరు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసు మరకలను ఇతర పారీ్టలకు అంటగట్టేలా ఆ పత్రికల్లో కథనాలు వస్తుండటంతో కేసు పక్కదోవ పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి కూడా పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా ఇతర పారీ్టలకు చెందిన వారి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో ఫ్లెక్సీ వార్
-
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నేను టీడీపీ సానుభూతిపరుడిని.. పార్టీ కోసం ఎంతో పనిచేశా. అయినా భూ వివాదంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీఆర్వో మధు బెదిరించారు. అధికారిలా కాదు.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ ఓ డిప్యూటీ కలెక్టర్ వాపోయాడు. ఈమేరకు ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎమ్మార్వోగా, కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు.ప్రస్తుతం సెక్రటేరియేట్‌లో పని చేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్లు తెలిసింది. చేబ్రోలు మండలంలోని సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పీఆర్వో మధు సదరు డిప్యూటీ కలెక్టర్‌ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్ ఓ వ్యక్తితో ఫోన్లో వాపోయారు. మినిస్టరే డీల్ చేయమన్నారంటూ బెదిరించారు! ‘నేను ఐదేళ్లు తాడికొండ ఎమ్మార్వోగా, రెండేళ్లు పెదకాకాని, ఒకటిన్నరేళ్లు వినుకొండ ఎమ్మార్వోగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసక్కడ. నేను డిప్యూటీ కలెక్టర్ కాకపోయి ఉంటే.. టీడీపీ నాయకులు నన్ను ఎమ్మార్వోగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవారు. శ్రావణ్‌కుమార్ నా గురించి చెబుతారు. జీవీ ఆంజనేయులు నరసరావుపేట ఆర్డీవోగా నన్ను వేయాలని ఎన్నో సార్లు లోకేశ్‌ను అడిగారు. నన్ను ఎక్కడా.. ఎవరూ అగౌరవపరచలేదు. కానీ మధు(పెమ్మసాని పీఆర్వో) చాంబర్లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్‌గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను. కానీ మినిస్టరే డీల్ చేయమన్నారంటూ పదేపదే బెదిరించారు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను.నా హోదాకు గౌరవం ఇవ్వకపోగా.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులయ్యింది. కానీ డిప్యూటీ కలెక్టర్ ఆడియో తాజాగా వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి.. డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం లేదని.. అంతా ఆయనకు తెలిసే జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో టేపు కలకలం సృష్టించడంతో.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పలువురు రంగంలోకి దిగారు. పెమ్మసానికి తెలియకుండా జరిగి ఉంటుందని.. ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని.. ఈ విషయాలను మరెక్కడా బయటపెట్టవద్దని డిప్యూటీ కలెక్టర్‌ను కోరారు. ఆడియోలోని వాయిస్ తనది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
కూటమి ఎత్తు.. ప్రజాస్వామ్యం చిత్తు
అధికార పార్టీ నేతలు ప్రలోభాల వల విసిరారు. ఉద్యోగాలు ఎరవేశారు. మాట వినని వారి అంతుచూస్తామని బెదిరించారు. కుప్పం, మాచర్ల, తుని, పాలకొండ, విశాఖపట్నం, గుంటూరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అనైతిక మార్గాల్లో లొంగదీసుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్ ఉప ఎన్నికల్లో మాయా పాచికలనే కూటమి పార్టీలు నమ్ముకున్నాయి. బలం లేకున్నా.. బరిలోకి దిగాయి. మొదట భంగపడినా.. చివరకు మాయతోనే మోసగించాయి. శకునికి మించిన ఎత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పెత్తనం చెలాయించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలం లేకపోయినా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని లాక్కున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు, ఒకరికి మున్సిపల్ ఉద్యోగం ఎరవేసి లొంగదీసుకున్నారు. మరో ఇద్దరిని భయపెట్టి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి లాక్కుని చైర్పర్సన్ కుర్చీని దక్కించుకుని అనైతికంగా విజయం సాధించారు.కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉంటే.. అందులో 19 వార్డుల నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. టీడీపీకి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం బెదిరింపులకు తెరలేపారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ సుధీర్ రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరినా.. వైఎస్సార్సీపీకి 15 మంది కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి బలం ఉంది.బరితెగించి.. ఇబ్బందులకు గురిచేసి..టీడీపీ బరితెగింపునకు భయపడి 15 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లకు చెందిన భూములు లాక్కుంటామని బెదిరించగా.. మరికొందరిని కేసులు పెడుతామని హెచ్చరించినట్లు తెలిసింది. తమకు మద్దతు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ విప్ జారీ చేసినా అధికారపార్టీ నేతల ప్రలోభాలకు 8 మంది కౌన్సిలర్లు లొంగిపోయారు.ఇద్దరు కౌన్సిలర్లు మునస్వామి, తిలగవతి టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు పాల్గొనగా.. టీడీపీ బలపరచిన అభ్యర్థి సెల్వరాజ్‌కి 13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా.. విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్ ప్రకటించారు. పాలకొండలో.. అడ్డదారిలో..పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కోసం జరిగిన ఉప ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. మొత్తం 20 వార్డులు ఉండగా.. 17 వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 19, 2వ వార్డులకు చెందిన ఇద్దరు మాత్రమే ఎస్సీ సభ్యులు ఉండగా.. 19వ వార్డుకు చెందిన యందవ రాధాకుమారిని చైర్‌పర్సన్‌గా అప్పట్లో వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది.ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాధాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చివరకు 2వ వార్డుకు చెందిన ఎస్సీ సభ్యురాలు ఆకుల మల్లీశ్వరి ఉండగా.. ఆమెనే తదుపరి చైర్‌పర్సన్‌గా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ మాయోపాయంతో స్వతంత్ర అభ్యర్థినంటూ మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యుల మద్దతు అందించడంతో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ వెంటనే మల్లీశ్వరికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా వేసి పాలకొండ చైర్పర్సన్ పదవి తమదేనని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. మిగిలిన చోట్ల ఇలా..⇒ గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర (నాని) గెలుపొందారు. మార్చిలో అప్పటి మేయర్ కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 56 మంది సభ్యుల్లో కూటమి బలం కేవలం 11.. కాగా 18 మందిని చేర్చుకోవడంతో వారి బలం 29కి చేరింది. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఎక్స్–అఫిషియో సభ్యులు ఉండటంతో వారి బలం 34 అయ్యింది. వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది బలం ఉండగా.. ఇద్దరు సభ్యులు హాజరుకాకపోవడంతో 27 ఓట్లు వచ్చాయి. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా.. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో చైర్‌పర్సన్‌గా నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, డీపీఓ రవికుమార్ ప్రకటించారు.⇒ గ్రేటర్ విశాఖ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ప్రిసైడింగ్ అధికారి మయూరి అశోక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ⇒ మొత్తం మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి.. భయపెట్టి పలుదఫాలుగా 21 మంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుంది. వారి సాయంతో వైస్ చైర్‌పర్సన్‌గా మదార్ సాహెబ్‌ను గెలిపించుకుని విలువలకు పాతరేసింది.⇒ తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్పర్సన్–1గా టీడీపీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి, వైస్ చైర్పర్సన్–2గా సీపీఐకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ అరుణ ఎన్నికయ్యారు. అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఈ పదవులకు వైఎస్సార్సీపీ నుంచి ఎవరినీ పోటీకి దింపలేదు.కూటమి విజయం అనైతికం: ఎమ్మెల్సీ భరత్కుప్పం రూరల్: ‘కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అనైతికంగా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అప్రతిష్ట పాలైంది’ అని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ సీపీకి 18 మంది సభ్యుల బలముంది. అయినా ఓడిపోవాల్సిన దుస్థితి పట్టింది. అధికార పార్టీ నేతలు మా కౌన్సిలర్లను కూరగాయల్లా రూ.లక్షలకు లక్షలు పోసి కొన్నారు. అధికారం శాశ్వతం కాదు. హుందాతనం ముఖ్యం. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలా అనైతిక ఎన్నికలు జరుగుతుంటే.. ఇక రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది.ప్రజాస్వామ్యం ఖూనీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక సంస్థల పదవులను చేజిక్కించుకునేందుకు గజారుడు రాజకీయానికి పాల్పడిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పదవులను దక్కించుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రబాబు అరాచక పాలనను చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. కుప్పం, పాలకొండ, మాచర్ల, తుని, గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కంటే 2 స్థానాలు టీడీపీ అధికంగా గెలుచుకుంటే నాటి సీఎం వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ, జనసేన ఫ్లెక్సీల రగడ
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ, జనసేన ఫ్లెక్సీల రగడ తారస్థాయికి చేరింది. జనసైనికుల ఫ్లెక్సీలను పురపాలక సంఘ టౌన్‌ప్లానింగ్ అధికారి తొలగించడంతో జనసేన ఇన్చార్జ్ కోట వినుత భర్త చంద్రబాబు ఆధ్వర్యంలో స్థానిక బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద నిరసనకు దిగారు. తమ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తీశారని కమిషనర్‌ను నిలదీశారు. టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదని మండిపడ్డారు.గంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. అనంతరం వినుత కటౌట్‌ను శరవణ సూపర్ మార్కెట్ వద్ద ఉండగా దానిని తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పురపాలక సంఘ అధికారులు తొలగించకుంటే తామే తొలగిస్తామని అధికారులతో రచ్చకు దిగారు. మీడియా ప్రతినిధులపై దాడి శరవణ సూపర్‌మార్కెట్ సమీపంలో టీడీపీ నాయకులు జనసేన నాయకుల ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేస్తుండగా.. అక్కడ కవరేజీకి వచి్చన సాక్షి విలేకరి, మరో రిపోర్టర్‌పై టీడీపీ నాయకులు దాడికి దిగారు. అక్కడి నుంచి తప్పించుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్న విలేకరులపై స్టేషన్ బయట దాదాపు 30 మంది దాడికి తెగబడ్డారు. చివరకు రిపోర్టర్లు పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తి ఫిర్యాదు స్వీకరించాలని కోరారు. అయితే రిపోర్టర్లపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించారు. ఈ విషయంపై కొందరు డీఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ అర్ధరాత్రి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రిపోర్టర్లపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కదంతొక్కిన కోకో రైతులు
కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన కోకో రైతులు సోమవారం కదం తొక్కారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ మాట్లాడుతూ.. కోకో గింజలు కొనే కంపెనీలు రోజురోజుకూ ధరలు తగ్గిస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ నెల 3న జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈనెల 7న కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన వస్తుందని ఎదురు చూశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒప్పంద ప్రకటన చేయలేదని మండిపడ్డారు. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు కిలో కోకో గింజలను రూ.550కు కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి.. అమలు చేయలేదన్నారు. పైగా మరో రూ.50 ధర తగ్గించారని మండిపాడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750కు పైగా ఉందని.. రాష్ట్ర రైతులకు కూడా ఆ మేరకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లో మళ్లీ కంపెనీలతో సమావేశం నిర్వహించి.. ధరలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు ఉద్యాన శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు వై.కేశవరావు, కె.శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణ, పానుగంటి అచ్యుతరామయ్య పాల్గొన్నారు. -
సోలార్కు ‘ఆది’ రెడ్‌బుక్ పవర్!
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ‘ఆది’ మార్క్ రాజ్యాంగం నడుస్తోంది! స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అండతో ఓ సోలార్ కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించి చదును చేస్తున్నా, పేదల డీకేటీ భూముల్లో పాగా వేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కొండపాపాయపల్లి 224 సర్వే నంబర్లో 501.34 ఎకరాల పుల్లరి భూమి (పశువుల మేత)ని అక్రమంగా చదును చేసినా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన డీకేటీ పట్టా భూముల్లో సోలార్ ప్లాంటు పనులు చేపట్టి అడ్డుపడిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.యథేచ్ఛగా పుల్లరి భూముల్లో పనులు224 సర్వే నంబర్లో ఉన్న 501 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నా సీల్ (ఎస్ఏఈఎల్) కంపెనీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు చేస్తోంది. అధికార పార్టీ నాయకుల అండతో సోలార్ కంపెనీ ప్రతినిధులు రెచి్చపోతున్నారు. దీనిపై తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొండ కల్వటాల గ్రామంలో 2023లో ప్రభుత్వం డీకేటీ భూములను మంజూరు చేసింది. అందులో సోలార్ ప్యానెళ్ల నిర్మాణం కోసం యంత్రాలతో గుంతలు తవ్వి స్తంభాలు పాతుతున్నారు.గ్రామానికి చెందిన అక్కంరెడ్డి మధుసూదనరెడ్డి దీనిపై ప్రశి్నంచడంతో కంపెనీ ప్రతినిధులు బెదిరించి రూ.పది వేలు అపహరించినట్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుబ్బారావు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేపట్టకుండా మధుసూదన్‌రెడ్డిపై 308 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్షన్లు మోపారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచి్చనా సోలార్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అక్రమ కేసు.. సోలార్ కంపెనీ ప్రతినిధులు మాకు సమాచారం ఇవ్వకుండా, పరిహారం గురించి మాట్లాడకుండా పొలాల్లో ప్యానెల్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. పట్టా భూముల్లో పనులను అక్కంరెడ్డి మధుసూదన్‌రెడ్డి అడ్డుకోవడంతో సోలార్ కంపెనీ ప్రతినిధులు దొంగతనం ఆరోపణలు మోపారు. పోలీసులు విచారణ చేపట్టకుండానే అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. – సుజాత, డి.కల్వటాల, పెద్దముడియం మండలం ‘ఆది’ రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అధికారం ఉందని విచ్చలవిడిగా భూములను ఆక్రమించి సోలార్ కంపెనీతో పనులు చేయిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా పాపాయపల్లిలో 500 ఎకరాల భూమిని చదును చేశారు. దిగువ కల్వటాల గ్రామంలో పంట పొలాల్లో సోలార్ ప్యానెల్స్ పాతుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలిస్తున్నారు. సోలార్ కంపెనీ ప్రతినిధులు, రైతులతో సఖ్యతగా వ్యవహరించకుంటే కంపెనీ సాగదన్న విషయాన్ని గ్రహించాలి. – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ, జమ్మలమడుగు -
డొల్ల కంపెనీలతో డీల్!
సాక్షి, అమరావతి: ఊరూ పేరు లేని ఉర్సా కంపెనీకి టీడీపీ సర్కారు విశాఖలో రూ.3,000 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన భూములను ఎకరా 99 పైసలకే కేటాయించిన నేపథ్యంలో ఈ కుంభకోణం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. భూ కేటాయింపులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకపక్క కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములకు రూ.కోట్లలో వసూలు చేస్తూ... మరోపక్క తన బినామీలు, వందిమాగదులకు కారుచౌకగా సంతర్పణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత పది రోజులుగా ఉర్సా భూ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూటమి సర్కారుతోపాటు అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పేర్కొంటున్నారు.చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్టు ఉర్సాకు భూ కేటాయింపులు చట్ట విరుద్ధం: ప్రశాంత్ భూషణ్ ఓ ఘోస్ట్ కంపెనీకి చంద్రబాబు సర్కారు చట్ట విరుద్ధంగా 59.6 ఎకరాలను కేటాయించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కనీసం ఆఫీసు, ఎలాంటి ట్రాక్ రికార్డు లేని కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు. ఇలాంటి దొంగ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఉచితంగా భూమి ఇచ్చిందని, ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందమా? లేక ఉన్నతస్థాయి నాయకుల సంబంధమా? అని ప్రశ్నించారు.ఉర్సా ఎవరి క్లస్టర్?: తెలకపల్లి రవిఉర్సా క్లస్టర్‌కు భూ కేటాయింపులపై చాలా సందేహాలున్నాయని, అది ఎవరి క్లస్టర్ అన్నది తేలాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తన యూట్యూబ్ చానల్లో పేర్కొన్నారు. ‘రెండు నెలల కిందట ఏర్పాటైన ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్‌కు దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్‌తో పాటు ఐటీ, ఏపీఐఐసీ విభాగాలు, సోషల్ మీడియా వింగ్ స్పందించడం లేదు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. తెలంగాణ పత్రికలు ఈ విషయాన్ని ప్రముఖంగా ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం మీడియా మౌనంగా ఉండటం చాలా సందేహాస్పదంగా ఉంది. 2014–19లో కూడా టీడీపీ ప్రభుత్వం తన సన్నిహితులకు చాలా విలువైన భూములను ధారాదత్తం చేసింది’ అని పేర్కొన్నారు.అదే నిజమైతే కేటాయింపులు ఆపాలి: కె.నాగేశ్వరరావుఊరూ పేరులేని కంపెనీకి, లోకేశ్ బినామీలకు భూకేటాయింపులు చేశారన్న ఆరోపణలు నిజమైతే ఉర్సాకు భూ కేటాయింపులను తక్షణం ఆపాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ‘మా యూట్యూబ్ ఛానల్‌కు 99 పైసలకు విశాఖలో కనీసం ఒక ఎకరా ఇవ్వమని చెప్పండి. ఉర్సా.. టీసీఎస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తా. పది పైసలకు పది గుంటలు ఇచ్చినా యూట్యూబ్ చానల్‌ను విస్తరించి పెద్ద మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా.ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు భూములు విక్రయించడం ద్వారా హక్కులు వదులుకోకూడదు. ఫిబ్రవరిలో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ఉర్సాపై ఇంత దుమారం రేగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లోకేశ్ బినామీ కిలారు రాజేష్ సంస్థకు భూములు కేటాయించారంటున్నా ఎందుకు స్పందించడం లేదు?’అని తన యూ ట్యూబ్ చానల్లో పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసింది: MLC లేళ్ల అప్పిరెడ్డి
-
గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠం గెలిచేది YSRCPనే
-
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
సాక్షి, చిలకలూరిపేట: ఆస్తి కోసం సొంత అక్క, తల్లిపైనే టీడీపీ యువనాయకుడు కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తున్న ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిలకలూరిపేట పట్టణ పోలీసులను ఆశ్రయించినా నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు అనుంగ అనుచరుడు కావడంతో పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని పండరీపురానికి చెందిన టీడీపీ యువనాయకుడు చుండూరి ఉదయ్ వడ్డీ వ్యాపారం చేస్తాడు. రూ.3కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహారానికి సంబంధించి తల్లి, అక్క నాగలక్షి్మతో ఉదయ్‌కు వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అతని తల్లి నాగలక్ష్మికి డబ్బు చెల్లించాలని అడిగారు. దీనికి ఉదయ్ అంగీకరించకపోవడంతోపాటు తల్లి, అక్కను కిందపడేసి కాళ్లతో కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు నాగలక్ష్మి ఉదయ్ దాడికి పాల్పడిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తమ ప్రాణాలు కాపాడాలని సోషల్‌మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయంపై అర్బన్ సీఐ పి.రమేష్‌ను ఫోన్లో వివరణ కోరగా బాధితులు పోలీసు స్టేషన్‌కు వచి్చన మాట వాస్తవమేనని అయితే, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వ్యవహారం మాట్లాడి రాజీ చేసుకుంటామని వెళ్లిపోయారని వివరించారు. బాధితులు కేసు నమోదు చేయమంటే నమోదు చేస్తామని వివరించారు. -
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది. తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘బాబూ.. సూపర్ సిక్స్‌కు డబ్బుల్లేవ్.. లక్ష కోట్ల అమరావతి!’
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు. -
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. పల్లెనిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఓ మహిళ ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యే వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, సదరు ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానికురాలు రేవతి.. ఎమ్మెల్యే రవికుమార్‌ను నిలదీసింది. కూటమి పాలనను ఎండగట్టింది. ఈ సందర్బంగా బొమ్మాళి రేవతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతీ మహిళకు 15 వందల రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. గెలిచాక ఎందుకు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించింది. అలాగే, కొళాయిల్లో మంచినీరు రావడం లేదు. ఈ విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు వస్తున్నారు. అంతేకానీ, పేదల కోసం మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అయితే, కొద్దిరోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
బాబు మార్క్ పాలన.. సీఎం బంధువుకు దక్కలేదని టెండర్ రద్దు
సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్‌నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుట్ర బట్టబయలుడీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.అయినప్పటికీ ఈ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్ కంట్రోల్ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది. -
ఇలా చేస్తున్నావేంటి మండలి?.. తెలుగు తమ్ముళ్ల ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై అవనిగడ్డ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ దోపిడీని టీడీపీ నేతలు బయటపెట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బుద్ధప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ చల్లపల్లిలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు.మీ వల్ల నేను గెలవలేదని ఎమ్మెల్యే మమ్మల్ని పదే పదే అవమానిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఏ చిన్న పనిమీద వెళ్లినా అధికారులు మమ్మల్ని గౌరవించేవారు. మమ్మల్ని అవమానిస్తున్న ఎమ్మెల్యేతో ఎలా కలిసి పనిచేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించారు.ఇసుక, మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కార్యకర్త ఎవరైనా ట్రక్కు మట్టి సొంత పొలం నుంచి ఇంటికి తోలుకున్నా.. అధికారులను ఉసిగొల్పుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా గురించి పోస్టు పెట్టినందుకు కోడూరు మండల తెలుగు యువత నాయకుడిపై కేసు పెట్టించారని.. తక్షణమే అవనిగడ్డ నియోజవర్గానికి టీడీపీ ఇంఛార్జిని నియమించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమస్యలపై YSRCP నిలదీత
-
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో స్కీములు లేవు కానీ.. స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.అమరావతిలో జి+1 బిల్డింగ్లు కట్టేందుకు అధిక ధరలకు తన అనుంగులకు చంద్రబాబు కట్టబెట్టారు. వారి ద్వారా హైదరాబాద్‌లో ఒక బిల్డింగ్, మంగళగిరిలో పార్టీ కార్యాలయం కట్టించుకున్నారు. టెక్నాలజీ కంపెనీల పేరుతో చంద్రబాబు తన మనుషులకు భూములు దోచిపెడుతున్నాడు. ఊరూ పేరులేని ఉర్సా కంపెనీకి 3 వేల కోట్ల ఖరీదైన భూమిని కట్టబెట్టారు. ఏం అర్హత ఉందని... ఉర్సాకు 59.65 ఎకరాలు కేటాయించారు’’ అంటూ శివశంకర్‌రెడ్డి నిలదీశారు.2024 సెప్టెంబర్ 27వ తేదీన అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యింది. అక్టోబర్‌లో లోకేష్ పర్యటన తర్వాత పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓ కథ అల్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భారత దేశంలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉంది. పది లక్షల రూపాయల మూలధనం పెట్టుబడితో ఉర్సా కంపెనీ పెట్టారు. అరసెంటు భూమి కూడా కేటాయించే అర్హత కూడా ఉర్సాకు లేదు. ఆఫీస్ కూడా లేని ఉర్సాకు మూడువేల కోట్ల రూపాయలు భూములు కట్టబెడతారా?’ అంటూ శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.21st సెంచ్యూరీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పారిపోయిన వ్యక్తులు అబ్బూరి సతీష్. ఉర్సా కంపెనీ కేటాయింపులపై ఇంత రచ్చ నడుస్తుంటే ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరు?. ప్రభుత్వానికి బదులు ఉర్సా కంపెనీ ప్రతిధులు ఎలా సమాధానం చెబుతారు?. ప్రైవేట్ కంపెనీని టీడీపీ పార్టీ ఎందుకు భుజాన వేసుకుంటుంది?. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం దేనికి?. మూడు వేల కోట్ల రూపాయలు భూములు కేటాయింపులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్లాయి? ఈ వాటాల లెక్కలు తేలాల్సిందే’’ అని శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఉర్సాకు భూముల కేటాయింపు అతిపెద్ద కుంభకోణం. ఉర్సా భూ కుంభకోణం పై సీబిఐతో విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎండీసీ 9 వేల కోట్ల రుణంతీసుకున్నారు. రోడ్లను సైతం ప్రైవేట్ పరం చేస్తోంది. రాజధానిలో ప్రజల సొమ్ముతో చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని శివశంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్సెస్ జనసేన
-
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీ నేత అరెస్ట్
-
‘సత్రం’ భూములు కొట్టేయడానికి టీడీపీ నేతల ఆత్రం
సాక్షి, ప్రతినిధి, కాకినాడ: నాళంవారి సత్రం భూములను దొడ్డిదారిన కొట్టేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. వేలం లేకుండా దక్కించుకోవాలని శతవిధాలా యత్నిస్తున్నారు. రాజమహేంద్రవరం నాళం వారి సత్రానికి గోదావరి జిల్లాల్లో మంచి పేరు ఉంది. దీనికి రెండు జిల్లాల్లోనూ వందల ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం శృంగవృక్షంలో 268.64 ఎకరాల భూమి ఈ సత్రానికి ఉంది. ఈ భూములను వేలం నిర్వహించి మూడేళ్ల కాల పరిమితికి లీజుకు ఇస్తుంటారు. ప్రస్తుత లీజు కాలం ఈనెల 29తో ముగుస్తుంది. దీంతో ఈనెల 29న భూములకు వేలం నిర్వహించేందుకు సత్రం కార్యనిర్వహణాధికారి చందక దారబాబు కరపత్రాలు పంచిపెట్టారు. 10 ఎకరాలలోపు రూ.5 లక్షలు పూచీకత్తు, 10 ఎకరాలు దాటితే రూ.10 లక్షలు పూచీకత్తు చెల్లించాలని, హెచ్చుపాటదారు మొదటి సంవత్సరం లీజు సొమ్ము చెల్లించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వర్గీయులు వేలం లేకుండా భూములు దక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. ఈఓ దారబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వేలం నిర్వహించడం కుదరదని, తాము చెప్పే వారికి భూములు కట్టబెట్టాలని దేవస్థానం అధికారులకు యనమల హుకుం జారీ చేశారని సమాచారం.సారవంతమైన భూములురెండు పంటలు పండే సారవంతమైన భూములు కావడంతో వీటిపై టీడీపీ నేతల కన్ను పడింది. వాటిని ఏదో రకంగా దక్కించుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. తమ పార్టీ సానుభూతిపరులైన అరడజను మంది రైతులకు వేలంతో సంబంధం లేకుండా భూముల లీజు హక్కులు రాసిచ్చేయాలని అధికారులపై యనమల ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29న బహిరంగ వేలం జరుగుతుందా లేదా అనే సందిగ్థత నెలకొంది.ఒత్తిళ్లకు లొంగేది లేదు ఈ నెల 29న బహిరంగ వేలం నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి వేలం నోటీసులు గ్రామ పంచాయతీలో అతికించాం. కరపత్రాలు గ్రామంలో అందరికీ అందేటట్టు ఏర్పాటు చేశాం. ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదు. గతం కంటే హెచ్చుపాట రాకపోతే మళ్లీ వేలం నిర్వహిస్తాం. పాట దక్కించుకున్న వ్యక్తి మొదటి ఏడాది లీజు మొత్తం జమ చేస్తేనే భూములు అప్పగిస్తాం. – చందక దారబాబు, కార్యనిర్వహణాధికారి, నాళంవారి సత్రం, రాజమహేంద్రవరం -
అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. -
చెరువునే ‘ముద్దాడ’!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తమ్ముడు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారి! అన్న.. అసలే టీడీపీ నాయకుడు.. ఆపై అండగా అధికారం! ఇక ఆగడాలకు అడ్డేముంది? అచ్చెప్ప చెరువు... శోభనాద్రి చెరువు.. ఉప్పరవానిబంద చెరువు.. పాపమ్మ కోనేరు.. భూసమ్మ చెరువు, మంగళివాని చెరువు.. గాది బంద..! చేంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏమిటనుకుంటున్నారా..? ఇవేవో శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువుల పట్టిక కాదు!! సీఎం చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర సోదరుడు, టీడీపీ నేత శ్రీనివాసరావు వరుసబెట్టి చెరువులను కబ్జా చేసి కలిపేసుకోవటంపై గ్రామస్థులు గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో ముద్దాడ శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపారు. చెరువులను ఆక్రమించడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా గ్రామం సమీపంలో ఉన్న భూసప్ప కోనేరు వద్ద పశువుల తొట్టెలు నిరి్మస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.రక్షించండి.. ప్రభుత్వ చెరువులను రక్షించాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. ముద్దాడ శ్రీనివాసరావు సోదరుడు రవిచంద్ర ఉన్నతాధికారి కావడంతో యంత్రాంగం అడ్డు చెప్పలేక పోతోంది. చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. పేదలకో న్యాయం పెద్దలకో న్యాయం సరికాదు. – ధర్మాన అనిత, సర్పంచ్, సైరిగాంపేదలపై ఎందుకీ వివక్ష? నాకున్న 20 సెంట్లలో ఆక్రమణలు ఉన్నాయంటూ పొలంలో తవ్వకాలు జరిపి నా కడుపు కొట్టారు. అదే ముద్దాడ శ్రీనివాసరావు తన తమ్ముడి పేరు చెప్పి చాలా వరకూ చెరువులను ఆక్రమించాడు. పేదలపై ఎందుకీ వివక్ష? – ముద్దాడ సింహాచలం. రైతు, సైరిగాంనేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయలేదు. ఊరుగుండం చెరువులో ఆక్రమణలు తొలగించాం. ఆస్పత్రి ఎదురుగా అచ్చెప్ప కోనేరు అభివృద్ధి కోసం మట్టి వేశా. మా గ్రామస్తులు కొంత మంది నేను ఏదో చేస్తున్నానని ఊహించుకుని బురద జల్లుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే నిరూపించండి. – ముద్దాడ శ్రీనివాసరావు (రవిచంద్ర సోదరుడు), సైరిగాం గ్రామం నివేదిక ఇవ్వాలని ఆదేశించాం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాం. ఇప్పటికే నేను వెళ్లి పరిశీలించా. నివేదిక వచ్చాక ఆక్రమణలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జె.రామారావు, తహసీల్దార్, జలుమూరు. -
కేశినేని నానిపై పరువు నష్టం దావా.. టీడీపీ ఎంపీ చిన్నికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.‘‘విజయవాడ ప్రజలు నాకు పది ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి.. నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం. కానీ బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేని దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. నేను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తాను.. రాజీ పడను. సత్యం బెదిరింపులకు భయపడదు.. నేను కూడా భయపడను’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
బాలకృష్ణ ఇలాకాలో పెద్ద ప్లానే!
సాక్షి టాస్క్ ఫోర్స్: హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో హిందూపురంలో వచ్చే నెలలో అభినందన సభకు ఆయన పీఏలు ప్లాన్ చేశారు. ఇందుకోసం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. సుమారు 20 వేల మందితో సభను నిర్వహించాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అందిని కాడికి దోచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారీగా వసూళ్లకు ప్లాన్? బాలకృష్ణ అభినందన సభ కోసం అయ్యే ఖర్చుకు మించి భారీగా నగదు కూడబెట్టుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే పీఏలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం అన్ని అడ్డదారుల్లోనూ డబ్బు వెనుకేసుకునేలా పథకం రచించారంటున్నారు. జన సమీకరణ బాధ్యత టీడీపీ నేతలకే అప్పజెప్పుతున్నారు.టీడీపీ నేతలకు ఆఫర్లు ఊరకనే ఖర్చు అంటే టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తారేమో అన్న ఆలోచనతో పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపెడుతున్నారు. భూఆక్రమణలకు కూడా అవకాశం కలి్పస్తున్నారు. ఇసుక, మట్టి దందాలకు అడ్డు లేకుండా చేస్తున్నారని సమాచారం. వేలంలో అమ్మినట్లు పదవులను అమ్మకానికి పెట్టారంటున్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డు చైర్మెన్ పదవి టీడీపీ నేతకు ఇచ్చారన్న విమర్శలున్నాయి. మద్యం బెల్టు షాపులు నిర్వహించేందుకు కూడా సహకరిస్తున్నరని చెబుతున్నారు.ఆ నలుగురిపై భారం హిందూపురం పట్టణానికి చెందిన నలుగురు టీడీపీ ముఖ్య నేతలపై వసూళ్ల భారం వేశారని సమాచారం. వారు కూడా భారీ మొత్తంలో పీఏలకు నగదు అందించినట్లు తెలుస్తోంది. కొట్నూరు వద్ద మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణానికి పీఏలు ఒకే చెప్పడంతో అందుకోసం రూ. 20 లక్షలు సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే కార్యాలయానికి చెల్లించినట్లు సమాచారం. అందుకే మున్సిపల్ అధికారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే నెలవారీ మొత్తం, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల నుంచి మామూళ్లు, మట్టి, ఇసుక ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింట్లో సభ కోసం అంటూ అందినకాడికి దోచేయాలని పీఏలు ప్లాన్ చేసినట్లు తెలిసింది. మండల పరిషత్ నిధులకు ఎసరు!నియోజకవర్గంలోని మండల పరిషత్ నిధులను ఎమ్మెల్యే పీఏలు భారీగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. చేయని పనులకు లక్షల రూపాయలు ఒక్కో మండలం నుంచి డ్రా చేసినట్లు తెలిసింది. ఈ నగదు అంతా ఎమ్మెల్యే పీఏల ఖాతాలకు అక్రమంగా మళ్లించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ పనుల్లో కూడా చేసిన పనులకే లక్షలాది రూపాయలు బిల్లులు మంజూరు చేయించుకొని సభకు మళ్లిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు అందరూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వారే అయినా అభివృద్ధి పనులంటూ వారితో నిధులకు ఆమోదం తీసుకోవడం, ఆ నిధులను మళ్లించడం వంటివి గుట్టుగా కానిచ్చేశారని చెబుతున్నారు.ఖర్చు తక్కువ.. వసూళ్లు ఎక్కువబాలకృష్ణ అభినందన సభ కోసం 20 వేల మందిని జన సమీకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో అంతమంది జనాభా వస్తున్నారని చెప్తే ఖర్చులు కూడా భారీగా ఉంటాయని ఆయన దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని తెలిసింది. ఎంజీఎం గ్రౌండ్ కెపాసిటీ 6 నుంచి 7 వేల మందికి మిందని... మరి ఎలా 20 వేల మంది సభకు ఎలా తరలిస్తారన్న విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్యే చర్చ సాగుతోంది. 20 వేల మందితో సభ అంటూ ఖర్చు భారీగా ఉంటుందని జేబులు నింపుకునేందుకు ఎత్తువేశారని అంటున్నారు.వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకేనా?బాలకృష్ణ ఇలాకాలో పీఏల వసూళ్లు తారాస్థాయికి చేరాయి. ముగ్గురు పీఏల్లో ఒకరు వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకు చేరుస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా అవినీతికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. సహజ వనరులు, ప్రజల సొమ్మును స్థానిక సమస్యలకు వాడకకుండా పీఏలు సొంత జేబులు నింపుకోవడానికే వాడుతున్నారన్న విమర్శలున్నాయి. -
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సొంత నియోజకవర్గంలోనే వరుస షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే.. రద్దు చేసుకుని తిరుగుపయనం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విబేధాలు కూడా మరోసారి బయటపడ్డాయి.పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ గైర్హాజరయ్యారు. ఇక.. ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు పోయిందా?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఆధారాలుంటే మాత్రం పూర్తిస్థాయి విచారణ తరువాత అరెస్టులు జరిగాయి. అయినా కూడా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం.. అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టేది. దబాయింపులకు దిగేవారు. దుష్ప్రచారానికి తెర లేపారు.టీడీపీకి న్యాయవ్యవస్థపై ఉన్న పట్టు కూడా ఇందుకు ఉపకరించిందని విమర్శకుల అంచనా. మరి ఇప్పుడు? టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో అంతా వారి ఇష్టారాజ్యమే. గిట్టనివారిపై మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా తోచిన కేసులు పెట్టేస్తున్నారు. అదేమంటే.. రెడ్‌బుక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ పైశాచికత్వం ఎంతదాకా వెళ్లిందంటే.. పోలీసు అధికారులూ బలయ్యేంత స్థాయికి!. సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆధారాలతోపాటు పట్టుకోవడమే ఈయన చేసిన తప్పు. ఆ కక్షతోనే టీడీపీ తప్పుడు కేసులో అరెస్టుకు దిగిందని విశ్లేషకుల అంచనా.పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఈనాడులో ఒక కథనం వచ్చిన కొంత కాలానికే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామన్న ముసుగులో ఒక వర్గానికి కొమ్ము కాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే ఎంత ప్రమాదకరమో ఇదే ఉదాహరణ. ఫలానా వారిని ఇంకా అరెస్టు ఎందుకు చేయలేదంటూ.. సీఐడీ విచారణకు హాజరైన ఒక వైఎస్సార్సీపీ నేతను రెండు గంటలే ప్రశ్నించారని.. ఎల్లో మీడియా వార్తలు ఇస్తోందంటే.. పాలకపక్షానికి వీరికి మధ్య ఉన్న లోపాయకారి అవగాహన ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.మోసాలు చేస్తుందని స్పష్టంగా తెలిసిన ఒక నటి చేసిన ఆరోపణల ఆధారంగా సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట అని, ఐపీఎస్ వర్గాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అధికార వర్గాలు భావిస్తున్నా చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకు వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించ లేదు. తనను అరెస్టు చేస్తారని తెలిసినా ఆయన అందుకు సిద్దపడ్డారంటేనే తాను తప్పు చేయలేదన్న విశ్వాసం అన్నమాట. తాను టీడీపీకి లొంగిపోనని, జైలుకైనా వెళతానని ఆంజనేయులు మాదిరి ధైర్యంగా నిలబడ్డ అధికారి ఇటీవలి కాలంలో ఇంకొకరు లేరు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించింది. మోసకారి నటి కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టు అవ్వడం, బెయిల్‌పై బయటకు రావడం కూడా జరిగింది.డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసిన టైమింగ్ కూడా గమనించదగినదే. ఒక వైపు అమరావతిలో 44 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి, అర్ధ రూపాయికి కట్టబెట్టడంపై పలు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన ఉర్సా అనే కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూమి కేటాయించాలని తలపెట్టడం వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి రాగానే అరెస్టులు జరగడం కూడా గమనార్హం. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఒకవైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రయోగం, మరోవైపు చంద్రబాబు కుట్రలతో రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆయనను సైకో అని, మరొకటనీ, నీచమైన రీతిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, అరెస్టులు చూస్తే నైతిక పతనం ఎన్ని విధాలుగా ఉండవచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలకు బాధ్యులుగా జగన్ కూడా అప్పట్లో పలువురు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పాత్రపై పలు అభియోగాలు ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా. కానీ, ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇతర ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తేనే చాలా పెద్ద ఘోరం జరిగినట్లు ప్రచారం చేశారు. ఆయన ఏకంగా టీడీపీ కొమ్ము కాయడమే కాకుండా, రిటైరయ్యాక కుల సభలలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అరాచకపు పోస్టింగులు పెట్టినా టీడీపీ వారికి ఏమీ కాలేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ వారిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవచ్చు. కానీ, కేవలం వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు ఎందుకు వస్తున్నాయంటే అదే రెడ్ బుక్ పాలన అని అంటున్నారు. చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ ప్రముఖులపై గత ప్రభుత్వ టైమ్‌లో పై కేసులు పెట్టలేదా? అరెస్టులు చేయలేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ మొదట కేసు పెట్టింది. ఆ తర్వాత ఏపీ సీఐడీ కేసు తీసుకుంది. టీడీపీ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో కూడా అవినీతి డబ్బు వచ్చిందని సీఐడీ ఆధార సహితంగా ఆరోపించింది. దానికి ఇంతవరకు టీడీపీ కౌంటర్ చేయలేకపోయింది.మరికొన్ని కేసులు అయితే సీబీఐ దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని గత ప్రభుత్వం తెలిపినా, మేనేజ్ చేశారో, లేక మరే కారణమో తెలియదు కాని కేంద్రం అందుకు సిద్దపడలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం మనోభావాల పేరుతో, మరో పేరుతో, ఒక తరహా ఫిర్యాదును అనేక పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిందితులను వందల కిలోమీటర్లు తిప్పి వారిని అనారోగ్యం పాలు చేయడం వంటి ఘటనలు గమనిస్తే ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహారించడం లేదన్న భావన కలుగుతుంది. మరో వైపు కూటమి ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, భూదందాలు, పరిశ్రమల యజమానులను బెదిరించడం వంటి పలు సంఘటనలు జరుగుతున్నా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు.మోసకారి నటి కేసు కారణంగా ఏపీకి వచ్చే అవకాశం ఉన్న పరిశ్రమలు కూడా రాకుండా పోతున్నాయని చెబుతున్నా, ఏమాత్రం లెక్క పెట్టకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం దురదృష్టకరం. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలు తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. అయినా సర్కార్‌ను ఇంత అరాచకంగా నడుపుతున్నారంటే ప్రభుత్వం చంద్రబాబు కంట్రోల్లో లేదేమో అనిపిస్తుంది!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎందుకు లేవు? గతంలో జగన్ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్ నేరుగా బటన్ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్ కొట్టేలా పెంచిన కరెంట్ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్ అని గేమ్స్ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు కోవిడ్ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. -
కార్యకర్తలే తోలు తీస్తారు జాగ్రత్త.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
‘ఎకరా భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతారు?’
విశాఖ: కూటమి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోందని సీపీఎం తీవ్రంగా మండిపడింది. ఉర్సా సంస్థకు కటాయించే భూములను వెంటనే రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈరోజు’(గురువారం) ఉర్సా కంపెనీకి కేటాయించే భూముల్లో పర్యటించారు సీపీఎం నేతలు. దీనిలో భాగంగా మాట్లాడుతూ ‘ నకిలీ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయిస్తారా. కూటమి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనునాయులకు భూ కేటాయింపులు చేస్తున్నారు. ఎకరా భూమిని ఏ విధంగా 99 పైసలకు కట్టబెడతారు. 10 లక్షల అధీకృత పెట్టుబడి ఉన్న కంపెనీకి 3 వేల కోట్ల భూమి కేటాయింపు ఎలా చేస్తారు?, ఉర్సా ఒక టీడీపీ నాయకుడి బినామీ సంస్థగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని టీడీపీ ఎంపీ సోదరుడే స్వయంగా చెప్పారు. 60 ఎకరాల భూ కేటాయింపుపై విచారణ జరిపించాలి’ అని సీపీఎం డిమాండ్ చేసింది. -
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ఏపీ పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యం
-
రఘురామ కృష్ణంరాజు పై సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే చింతమనేని బాధితుడి ఆత్మహత్యాయత్నం
-
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్‌కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్‌తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్‌కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్‌తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్‌కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్‌లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్‌లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్‌కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్‌కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్‌లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్‌ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్‌కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్‌కుమార్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్‌కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్‌ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
జీవో నెంబర్-3పై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను ఖండించిన పుష్ప శ్రీవాణి
-
పేదల ఇళ్లు కూల్చుతారా? ఎమ్మెల్యే రఘురామ రాజుకి వార్నింగ్
-
నువ్వు రాజువి కాదు రాక్షసుడివి.. రఘురామ రాజుపై మండిపడ్డ మహిళలు
-
తండ్రి బాటలోనే లోకేశ్.. ఎంకరేజ్ చేస్తున్న పవన్!
ఏపీలో ప్రజాస్వామ్యం మూడు కుట్రలు, ఆరు ప్రలోభాలుగా పరిఢవిల్లుతోంది!. విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా?. పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా, ఎందుకు ఇంత కక్కుర్తి?. బహుశా కూటమి నేతలు, కార్యకర్తల అరాచకాలు త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, విశాఖలో తమ పెత్తనం సాగాలనో మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి.అయితే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ స్థానిక సంస్థల స్వతంత్రను దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్దతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ కూడా అదే బాటలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లకు విధేయుడుగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది ఉండడం లేదు.గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఎన్నికలలో కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి ఓపెన్ గానే అంగీకరించారు. కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలలో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తులలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను సాగించారు. అయినా కేవలం 11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కైవశం చేసుకున్నారు. మిగిలిన 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని ఓటు వేయడం సంచలనమైంది.ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ వైఎస్సార్సీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబు ఇచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైఎస్సార్సీపీకి ద్రోహం చేశామని కన్నీరు, మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లను ప్రలోభ పెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఛైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్‌లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు.ఉదాహరణకు గుంటూరు కమిషనర్, ఐఏఎస్ అధికారి మేయర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్‌ను పదవి నుంచి దించడానికి కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలకు లోను చేయడానికి యత్నించింది. కొంతమందిని విదేశీ యాత్రలకు పంపారు. టీడీపీ కూటమి దాష్టికాలకు తట్టుకోవడానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడకు వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక కార్పొరేటర్ వెల్లడించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో ముప్పై మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనేం విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబర పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశామని వారు బాధపడడం లేదు. ఈ వైఖరిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ .. కూటమి ఇలా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలం లేకపోయినా ఎలా పదవులలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన విధాన నిర్ణయం చేశారు. వేరే పార్టీవారు ఎవరైనా టీడీపీలోకి రావాలంటే పదవి వదలి పెట్టి రావాలని కండిషన్ పెట్టారు. ఆ సూత్రానికి చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. సొంత మామ ఎన్టీ రామారావును పార్టీ చీల్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన చంద్రబాబుకు ఇలాంటి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పెద్ద విషయమా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2014 టర్మ్‌లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు మూడు నగరపాలక సంస్థలలో వైఎస్సార్సీపీ గెలిస్తే, నెల్లూరు మేయర్‌ను టీడీపీలోకి లాగేసింది. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగానికి గండి కొట్టారు.జగన్ దీనికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలోకి వెళ్లారు. 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు తన పద్దతులను మార్చుకోలేదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శిస్తూ ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదే పనిచేయడం ఆయన ప్రత్యేకత. దీనిపై బీజేపీ లోక్ సభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యాక్తం చేస్తూ అరాచక పాలనకు ముగింపు పలికారని అన్నారు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న సంగతిని మాత్రం విస్మరించారు. ఆయన పేరుకు బీజేపీ తప్ప, ఒరిజినల్‌గా చంద్రబాబు సొంత మనిషిగానే అంతా పరిగణిస్తారు.టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబర పడుతుండవచ్చు. కానీ, ప్రజలలో మాత్రం ఏహ్య భావాన్ని మూట కట్టుకున్నారని చెప్పాలి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. స్థానిక సంస్థలలో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ, చంద్రబాబు అండ్ కో మాత్రం యథా ప్రకారం ఈ కుట్రలను కొనసాగిస్తున్నారు. 1995లో కుట్రతోనే అధికారంలోకి వచ్చి.. అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించలేమేమో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు. -
వరద రాజులు రెడ్డి సహాయం చేయడమంటే పాముకు పాలు పోసినట్లే
-
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్‌బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ట్రోల్స్ పై రోజా క్లారిటీ
-
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
-
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్‌లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
ఉర్సా వెనుక డీల్ ను బయటపెట్టిన మాజీ ఎంపీ కేశినేని నాని
-
YSRCP సోషల్ మీడియా కన్వీనర్ గోపిపై దాడి
-
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్‌ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్‌లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్‌లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్‌లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్‌లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్‌కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్‌లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్‌లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
కూటమి పాలనలో దళితులపై దాడులు
-
PSR ఆంజనేయులుని అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు
-
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి. ముస్లిం మహిళను మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి నుంచి దించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. కదిరి మున్సిపల్ ఛైర్పర్సన్ నజీమున్నీసాపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్ విప్ జారీ చేశారు. బలం లేకపోయినా కదిరి మునిసిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రలోభాలకు దిగుతోంది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, వైఎస్సార్సీపీ-30, టీడీపీ-5, ఇండిపెండెంట్ 1 కౌన్సిలర్లు ఉన్నారు. డబ్బు, బెదిరింపులతో 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ కొనుగోలు చేశారు.మడకశిర.. భగ్గుమన్న టీడీపీ నేతల మధ్య విభేదాలుమడకశిర నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఈరన్నల మధ్య వివాదం నెలకొంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైఖరిపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన కొడుకు డాక్టర్ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించారని.. చివరి నిమిషంలో బీ-ఫాం ఇవ్వలేదు.. అయినప్పటికీ ఎంఎస్ రాజు గెలుపు కోసం కృషి చేశాం.. మా వర్గానికి ఎంఎస్ రాజు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆరోపించారు. -
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025 -
ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/మంగళగిరి: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తట్టుకోలేక దాసరి బాబూరావు (60) అనే వృద్ధుడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో విజయవాడకు చెందిన బాబూరావుకు 9.57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గ్రావెల్ తవ్వుకుంటామని కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూరావు తెలిపారు.అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్‌ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తహసీల్దార్, మైనింగ్ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రితమే బాబూరావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పార్టీ కార్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.మరోవైపు తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తానని చింతమనేని ప్రభాకర్ నుంచి బాబూరావుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగడంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యే శరణ్యం ‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య -
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్లో చోటు కలి్పంచిన ఘనత జగన్‌ది అన్నారు. మాల, మాదిగలు కలిసే ఉన్నారు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్ జగన్ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న అణగారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్‌కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జనం మధ్య ఉందాం: సజ్జల సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు. -
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్‌కు చెప్పినా లాభం లేదని..
గుంటూరు,సాక్షి: మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. మట్టి మాఫియా వేధింపులతో మనస్తాపం చెంది బ్లేడుతో చేయి కోసుకున్నారు. అప్రమత్తమైన టీడీపీ పార్టీ సిబ్బంది బాబురావును అత్యవసర చికిత్స నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తమ భూముల్ని కబ్జా ప్రయత్నం జరుగుతోందని, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి భార్య మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి బాబురావు ఆత్మహత్యయత్నంపై ఆమె భార్య దాసరి దాసరి నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ‘మాకు దెందులూరి మండలం చల్ల చింతల పూడిలో పొలం ఉంది. మా పొలంలో జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులం అని బెదిరిస్తున్నారు. ఇదే విషయం గురించి చింతమనేనితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. మేం మట్టి మాఫియాని అడ్డుకోడానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. మట్టి మాఫియా గురించి అధికారులు అందరికీ ఫిర్యాదు చేశాం ఎవరూ పట్టించుకోవట్లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. పైగా మధ్యవర్తులు కలగజేసుకుని రూ.90లక్షలు తీసుకుని, రూ.2కోట్లు తీసుకురమ్మని మని అంటున్నారు. లేదా మీ పొలం మాకు అమ్ముతున్నట్లు సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు,ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. కనీసం మా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి కూడా మమల్ని రానివ్వట్లేదు. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంత్రి లోకేష్‌ను కలిసి మా బాధ చెప్పుకున్నాం. మట్టి మాఫియా చివరకు లోకేష్ మాటను కూడా లెక్క చేయలేదు.ఇంకా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని ఉదయం టీడీపీ కార్యాలయానికి వచ్చాం. మట్టి మాఫియా వేధింపులతో మనస్థాపం చెందిన నా భర్త చేయి కోసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పంచుకుతినేందుకే ఉర్సా కంపెనీకి 60ఎకరాలు ఇచ్చారు
-
పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు.. కానీ కార్యకర్తలు,జగన్ శాశ్వతం
-
YSR జిల్లాలో టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల అరాచకం
-
ఊరూపేరు లేని 'ఉర్సా'
సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! కేరాఫ్ అడ్రస్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్ నెంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్ రూమ్ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్ 27న ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్ తనయుడు కౌశిక్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్ నెంబర్లు లేవు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి. మరో డైరెక్టర్ సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్’ను మించిన స్కామ్..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్ గుర్తుకొస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. -
‘పీడీఎస్’లో.. కందిపప్పు కనుమరుగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) నుంచి ‘కందిపప్పు’ నెమ్మదిగా కనుమరుగు కానుంది. పేదలకు సబ్సిడీపై ఇచ్చే నిత్యావసరాలను ప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తోంది. అందుకే 10 నెలలుగా క్రమంగా కందిపప్పును తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలకు మాత్రమే కందిపప్పును సేకరిస్తోంది. టెండర్లకు మంగళం.. కొద్దికాలంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు కిలో రూ.180కిపైగా పలికింది. ఈ ధర చాలా కాలం పాటు కొనసాగడంతో సామాన్యులు కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో సబ్సిడీపై కందిపప్పును సరఫరా చేసి ఆదుకోవాల్సిన సమయంలోనూ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక రేట్లకు కోట్ చేస్తున్నారని మొత్తం పంపిణీకే మంగళం పాడేసింది. ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకు కందులు సరఫరా చేయాలంటూ కేంద్రానికి లేఖలు పేరిట డ్రామాకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దగ్గరే కందులు నిల్వలు లేనప్పుడు ఏకంగా ఏడాదికి సరిపడా నిల్వలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ లేఖల్లో కోరడంతోనే ప్రభుత్వ కుటిల నాటకం బయటపడింది. పేదలకు పంచేది కూడా ఆర్థిక భారమేనా? ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర తగ్గి కిలో రూ.120–130 పలుకుతోంది. ఇది హోల్ సేల్‌లో అయితే రూ.100–110లోపు ఉంటోంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై కందిపప్పు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం రేటు దిగివచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కు వినియోగదారులకు అందించాలి. అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో హోల్ సేల్‌లో కొనుగోలు చేసి ఇచ్చినా ప్రభుత్వంపై కిలోకు రూ.40–50 మించి భారం పడదు. ఇది సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ, పేదల జీవితాలను కూడా బడ్జెట్ కోణంలో చూస్తోన్న ప్రభుత్వం ఆ కాస్త మొత్తాన్ని కూడా ఆదా చేసుకునేందుకు పీడీఎస్‌లో కందిపప్పు ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కొత్తేమీ కాదు.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 93,000 టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు పంపిణీ గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దీన్ని పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 2 కిలోల కందిపప్పు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది. అంతే తప్ప ఆ ఒక్క ఏడాది కూడా సక్రమంగా కందిపప్పును అందించలేదు.సబ్సిడీ రేట్లు పెంచిన ఘనుడు బాబుగారే! ఆగస్ట్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50–120 మధ్యన రేట్లు పెంచి విక్రయించింది. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి, 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేసింది. 2018లో కందిపప్పుకు రూ.23 మాత్రమే రాయితీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కందిపప్పు రేటు ఎంత పెరిగినా కిలో రూ.67కే స్థిరంగా అందించింది. దీంతో వినియోగదారులకు భారీగా మేలు జరిగింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో కందిపప్పు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. -
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు.టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే..డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు?.గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్‌ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా?తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్‌లో పిటీషన్ వేయించారు. కోర్ట్‌లో కేసు పెండింగ్‌లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది.వైఎస్సార్సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు.స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్‌లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్‌లో ఎస్సీల్లో ఆర్ఓఆర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ?ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16 వేల పోస్ట్‌లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉండే టీచర్ పోస్ట్‌లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది.అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? జూన్‌లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్‌ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్‌లకు కేబినెట్లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్‌లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ?అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీవో మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్‌గా మారిపోతున్నాయి.ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్‌ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్‌నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.కేవలం 17 శాతం స్కూళ్లను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్లలో విద్యాబోధన కల్పించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది.ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా?చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లువ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్‌లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్‌లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.తాజా నోటిఫికేషన్లో వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళకల పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్‌లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు. వైఎస్ జగన్ అయిదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు.2018 డీఎస్సీ కింద వైఎస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్‌లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్‌లు ఇచ్చింది. 602 పోస్ట్‌లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్‌లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్‌ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.కేవలం పదివేల పోస్ట్‌లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్‌డే గిఫ్ట్‌లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైఎస్ జగన్‌పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. -
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలూరులో జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు పుట్టిన రోజులో భాగంగా మండుటెండలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. అయితే ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర సొమ్ముసిల్లి పడిపోయారు. అయితే హుటూహుటీనా ఆలూరు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. బోయ సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. -
కొలికపూడికి మరో షాక్.. తిరువూరులో రెండుగా చీలిన టీడీపీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ను పూర్తిగా పక్కన పెట్టేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తన నివాసం వద్ద చంద్రబాబు బర్త్ డే వేడుకలను కొలికపూడి శ్రీనివాస్ ఏర్పాటు చేయగా, ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్ శావల దేవదత్ ఫ్యాక్టరీ సెంటర్లో ఈ వేడుకల నిర్వహించారు.అయితే, ఎమ్మెల్యే కొలికపూడి నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. శావల దేవదత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.కాగా, ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడిని చంద్రబాబు.. ఘోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం గమనార్హం. చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి పలకరించినా అదేమీ బాబు పట్టించుకోలేదు.. కొలికపూడికి కరచాలనం కూడా చేయకుండానే వెళ్లిపోయారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు.ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా చంద్రబాబుకు నమస్కరించారు.. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు. -
కాటమరాజుకే శఠగోపం
ముంపు భూములు కానప్పటికీ అధికారులతో కుమ్మక్కయ్యారు. దేవుడి సొత్తుకే ఎసరు తెచ్చారు. వచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు.. కాటమరాజుకే శఠగోపం పెట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో టీడీపీ నాయకుడి అవినీతి ఇది. వేనూతల కాటంరాజు ఆలయ భూములను వెలుగొండ ప్రాజెక్టు ముంపులో ఉన్నట్లు చూపించి బినామీ పేర్లతో రూ.1.60 కోట్లు కాజేశాడు. పెద్దారవీడు మండలం గుండంచెర్ల గ్రామానికి సమీపంలో కాటంరాజు స్వామి, గంగాభవానీ ఆలయాలు సర్వే నంబర్లు 629, 630లలోని 7.39 ఎకరాల్లో వందల సంవత్సరాల కిందటి నుంచి ఉన్నాయి. ఇవి వెలిగొండ ప్రాజెక్టు మునక ప్రాంతంలో లేకున్నా గుండంచెర్ల గ్రామ టీడీపీ నాయకుడు ముంపు భూముల కింద చూపి ఆర్ఆర్ ప్యాకేజీ పొందారన్న ఆరోపణలున్నాయి. – యర్రగొండపాలెంమరో 50 ఎకరాలకూ ఎసరుదేవుడి మాన్యం ఒకవేళ ముంపులో ఉంటే ఆర్ఆర్ చట్టం కింద పరిహారం నిధులు దేవదాయ శాఖకు చెందాల్సి ఉంటుంది. కాగా, టీడీపీ నాయకుడు దేవుని మాన్యం మరో 50 ఎకరాల భూములను కూడా బినామీ పేర్లతో ఆర్ఆర్ ప్యాకేజీలో చేర్చి జేబులు నింపుకొన్నారు. తమ ప్రాంతం వారు కానప్పటికీ అర్థవీడు మండలం మావుటూరు తండాకు చెందిన 13 మంది పేర్లను ప్యాకేజీలో చేర్చి ఒక్కొక్కరికి రూ.12.50 లక్షల ప్రకారం ప్రభుత్వం నుంచి ఇప్పించాడు. ఈయనతో పాటు మరికొందరు.. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల ప్రకారం రూ.65 లక్షలు తీసుకున్నారు. వీరిలో జిల్లా భూ సేకరణ, రెవెన్యూ అధికారుల హస్తం ఉందని, ఈ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. అక్రమాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని స్పెషల్ కలెక్టర్‌కు కాటంరాజు ఆలయ పూజారి వినతిపత్రం ఇచ్చారు. స్వామి భూముల రికార్డులు తారుమారువేనూతల కాటమరాజు స్వామికి సంబంధించిన భూముల రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. సర్వే నంబరు 630లో 2.69 ఎకరాలు, సర్వే నంబర్ 629లో 4.70 ఎకరాలు ఆర్ఎస్ఆర్ రికార్డులో స్వామి పేరు ఉన్నాయి. 2016లో కలనూతల రెవెన్యూ పరిధిలో స్వామి, అమ్మవార్ల భూములను కాటమరాజు తండాకు చెందిన దేశావత్ ఆదెమ్మ, బిలావత్ బుజ్జమ్మల పేరు మీద రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేశారు. మామూళ్లకు ఆశపడి రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేశారు. గత ప్రభుత్వం దేవాలయానికి నిత్యం పూజలు జరిగే విధంగా, ప్రాజెక్టు మునకలో పోకుండా చర్యలు తీసుకుంది. – పాముల రుషికేశవ, ఆలయాల పూజారివాస్తవ లబ్ధిదారులకు నష్టపరిహారం చెందాలి వెలిగొండ ప్రాజెక్ట్ మునక ప్రాంతాల్లో ఉన్న వాస్తవ లబ్ధిదారులకు నష్టపరిహారం చెందేలా చర్యలు తీసుకోవాలి. కాటమరాజు, గంగా భవాని అమ్మవార్ల ఆలయాలతో పాటు భూములను కూడా బినామీ పేర్లతో ఆర్ఆర్ ప్యాకేజీ పొందారు. బినామీల స్థానంలో గుండంచెర్ల గ్రామంలోని ఉన్న 12 మంది చెంచులను అర్హులుగా చేర్చి నష్ట పరిహారం వారికి అందేలా చర్యలు తీసుకోవాలి. కన్నూతల గ్రామంలో ఉన్న 50 మంది చెంచులకు కూడా సాయం అందించాలి. బినామీ పేర్లతో ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన టీడీపీ నాయకులు, రెవెన్యూ, భూ సేకరణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 28వ తేదీ అర్జీ ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. – గాలి వెంకటరామిరెడ్డి, కార్యదర్శి, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సంఘం -
కప్పం కట్టలేం
సాక్షి, అమరావతి: యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా.. చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో రూ.9 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్‌ను కూటమి సర్కారు సినీ నటి కాదంబరి జత్వానినీ అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్‌పై కూటమి పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం చేపడితే తమకు కమీషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్ది అనుచరులు గూండాగిరీ చేశారు. ఆ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగి యంత్ర సామగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపర్చారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కొత్త పెట్టుబడులు తేవడం కంటే.. ఉన్న కంపెనీల్లో వాటాలు మామూళ్ల పైనే శ్రద్ధ..! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో అందినంత వసూళ్లు..! వసూళ్ల వేధింపులు భరించలేక యూనిట్లకు తాళాలు వేసుకుని పోతున్నవారు కొందరు.. ఏకంగా పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న మరికొందరు..! వెరసి కూటమి సర్కారు కప్పం దెబ్బకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏపీకో దండం అంటూ పారిపోతున్నారు.కేంద్రానికే మొరశ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.కోటిన్నర కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేం అని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. » మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. » చెప్పుకొంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూళ్ల కోసం బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.కొత్తవి రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకికొత్తగా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్ నుంచి ఉత్తి చేతులతో తిరిగొచి్చన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. గత ప్రభుత్వంలో వచి్చన ప్రాజెక్టులను వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేసేలా 2023 విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్లు బాబు, లోకేశ్ డప్పు కొంటుకుంటున్నారు. » గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.పది లక్షల కోట్లకుపైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కారు తమ ఖాతాలోకి వేసుకుంటోంది. కాకినాడ గ్రీన్కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటినీ తమ ఘనతగానే చెప్పుకొంటున్నారు. » వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టబడులకు ఒప్పించారు. అయితే, ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్‌తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్‌ను తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు.మరికొన్ని చిలక్కొట్టుళ్లు» రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు » తమ నియోజయోకవర్గం గుండా వెళ్లే గ్రానైట్ లారీలపై కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం » నంద్యాలలో పొగాకు గోదాంల దగ్గరనుంచి చికెన్ షాపుల వరకు కమీషన్లు » కప్పం కడితేనే గనులకు లీజ్ ఇస్తుండటంతో 50 శాతం పడిపోయిన ఆ శాఖ ఆదాయం » నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్ తయారు చేసే వాటర్‌బేస్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి » కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్ ట్యాక్స్ చెల్లింపుసిమెంట్ పరిశ్రమల్లో మరీ దారుణ పరిస్థితితాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూళ్లు, వాటాలు అంటూ దందాకు దిగారు. ముడి సరుకు, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.» తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు చానల్‌ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకు ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన సున్నపురాయి సరఫరాను కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. » రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. » నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకే చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అ్రల్టాటెక్ సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంది. » సిమెంటు సరఫరా దందాలో ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.» శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్ టెక్ రెడీమిక్స్ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. -
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు. మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
అక్రమ కేసే.. బాబు కుట్రే!
సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది. అబద్ధపు వాంగ్మూలాలే సిట్‌కు ఆధారం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్‌రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్‌రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.సిట్ ప్రశ్నలకు మిథున్ సమాధానాలివీ...అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది.. సిట్: అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా? మిథున్‌రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్ అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్ అధికారులు మౌనం వహించారు) సిట్: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ గ్రూప్‌నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు? మిథున్‌రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు) సిట్: రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా? మిథున్‌రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు) సిట్: రాజ్ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా? మిథున్‌రెడ్డి: రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. సిట్: మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు) మిథున్‌రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా వెల్లడించాను. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్‌రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు. -
పైసా తక్కువ రూపాయ్!
‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ధర్మ విజయం’.’’ నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట! (ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ చిత్రమిది)‘‘విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సి వస్తున్నది. ఇదీ మన పరిస్థితని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సమర్థించారు. అభివృద్ధికిబ్రాండ్ అంబాసిడర్‌నంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళికా సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈపరిణామం.’’ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట! (ఇదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రం)‘‘ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరూపేరూ లేని కంపెనీలు ఈ స్కీములో లైను కట్టాయి. ఐఎమ్జీ భారత్‌కు అయ్యలాంటి స్కెచ్.’’‘లూటీ’ కోసం కోటి విద్యలు’! (ఇది కొత్తపుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక)‘‘మద్యాన్ని ఏరులై పారిస్తే లోకకల్యాణార్థమట. దాన్ని నియంత్రిస్తే మహా పాతకమట!’’వినేవాడు వెర్రివాడైతే, చెప్పేవాడు... ... ! (ఇదీ ఆంధ్రప్రదేశ్ సమాచార స్రవంతి)రూపాయంటే నూరు పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే! ఆచరణకు నోచుకోకపోతే విలువుండదు. ఆచరణయోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆలిండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వేయాలి. మంచినీళ్లడిగితే మబ్బులవంక చూపెట్టి, ‘అదిగదిగో’ అన్న చందంగా కూటమి ప్రజాపాలన సాగుతున్నది. మరోపక్కన కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం య«థేచ్ఛగా జరుగుతున్నది.రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లలో తొమ్మిదివేల కోట్లు ‘మూల విరాట్టు’ హుండీలోకి చేరుకునేవిధంగా మంత్రాంగం నడిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ, ఖండించే సాహసం గానీ ప్రభుత్వం చేయ లేదు. చేయదు. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అనే ధోరణి. రాజధాని కాంట్రాక్టుల్లో ఈ లెక్కన ఇరవై రెండున్నర శాతం హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళికా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37 వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది.అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరిగిన, జరుగుతున్న భూభాగోత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55 వేల ఎక రాలకు తోడు మరో 45 వేల ఎకరాలతో అమరావతి పార్ట్–2ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులూ, తటస్థ రాజ కీయవేత్తలూ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు మూడింట రెండొంతులు. అక్కడ కోటీ ఇరవై లక్షలమంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి – తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది.రాజధాని నిర్మాణానికి సంబంధించి నిన్ననే ‘ఈనాడు’ పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అచ్చేసింది. సరికొత్త సచి వాలయ టవర్ల నిర్మాణం కోసం రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లను పిలిచిందట! ఇందులో ఐదు ఐకానిక్ టవర్లుంటాయని ఆ గ్రాఫిక్ బొమ్మను కూడా అచ్చేశారు. రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా వెయ్యి కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈమధ్యనే కట్టిన తెలంగాణా సెక్రటే రియట్‌కయిన ఖర్చు కూడా వెయ్యి కోట్ల లోపే! అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చయితే అంత ప్రయోజనం అను కున్నారేమో గాని ఐదు ఐకానిక్ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ‘ఈనాడు’ రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది.ఈ గ్రాండ్ సెక్రటేరియట్ నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుందట! దీనికోసం సీఆర్డీఏ అధికారులు రాయ గఢలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట! ఇక్కడ స్టీల్ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచిరాల్లి వర్క్‌షాపుల్లో ఫ్యాబ్రికేట్ చేయించాలని నిర్ణయించారట! ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు భగ్గుమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.విశాఖ ఉక్కు సంగతే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలను మోస గిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులనుఅందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్ తలూపింది. ‘పోలవరం ఆంధ్రుల జీవనాడి’ అని బాబు మాట్లాడు తూంటారు. ఇప్పుడా నాడి స్పందన కోల్పోయినట్టే! 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాల్వలకు పారుతాయి. ఇప్పుడా లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎమ్సీల నుంచి 115 టీఎమ్‌సీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అను సంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ‘గోదా వరి – బనకచర్ల అనుసంధానం’ అనే పాటను చంద్రబాబు పదేపదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోనివిధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్య మవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులైనా ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ‘సూపర్ సిక్స్’ హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘అభివృద్ధికి ఆరు మెట్లు’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళికా సంఘం బృందానికి కూడా తన ఆరు మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్టు ‘ఈనాడు’ రాసింది.‘ఆరు మెట్ల’ అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం – బనకచర్ల అనుసంధానాన్నే ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపో యింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు – తాగునీటి ప్రాజెక్టట! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన గణాంకాలనే తీసుకుందాము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30 లక్షల 74 వేల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది. 2019 ఆగస్టు 15 – 2025 మే మధ్యకాలంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అదనంగా 39 లక్షల 34 వేల గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి.మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36 వేల గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా?అభివృద్ధి మూడో మెట్టుగా పర్యాటక హబ్‌ల ఏర్పాటు, నాలుగో మెట్టుగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరాలుంటాయట! ఐదో మెట్టుగా నౌకా శ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు తదితరాలు. ఆరో మెట్టు – అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటకాభివృద్ధిపై ఆచరణే గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ వంటి ‘నేమ్ డ్రాపింగ్’ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే! మంత్రదండం చేతబూని ‘ఓపెన్ ససేమ్’ అనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు ఐదేళ్లు పట్టవచ్చు. పదేళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్టుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది. అనుయాయులు వీరతాళ్లు వేస్తారు.ఇక ఐదో మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలట! కేవలం ఐదేళ్ల పదవీకాలంలోనే నాలుగు నౌకాశ్రయాలను, పది ఫిషింగ్ హార్బర్లను, ఆరు ఫిష్ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నిటిని పూర్తిచేసిన జగన్మోహన్రెడ్డి ఆచరణ ఎక్కడ? ఇంకో ఇరవై రెండేళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడ? మిడిమిడి జ్ఞానపు, మీడియా జ్ఞానపు మేధావులంతా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరో అభివృద్ధి మెట్టుగా గ్రోత్‌సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది.ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటయితే మన నిరుద్యోగులకు ఉద్యోగా లొస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడంఆందోళన కలిగించే విషయం. టీసీఎస్‌కు భూకేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్‌లైన్‌లో ఇంకా చాలా ఉన్నాయట!కాంట్రాక్టుల్లో కమీషన్లు, భూకేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్ రూట్స్ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలా కుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనంలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడమనే కార్య క్రమాన్ని కూటమి సర్కార్ తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్ అంటే ఏమిటి? ఎటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది అనే మౌలికమైన ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి, అమ్మకందారులు లబ్ధిపొందేలా ప్రవా హాలను ప్రోత్సహించే పాలసీలో స్కామ్ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరూవాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, పది గజాలకో పర్మిట్ రూమ్‌తో మహమ్మారి విలయతాండవంచేసింది. జగన్ సర్కార్ మద్య నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది. కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదు. 43 వేల బెల్టు షాపులను ఎత్తేసింది. పర్మిట్ రూమ్‌లను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేట్ వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న: ‘మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తా’ అని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? ‘మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే’నని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? బుద్ధిజీవులే నిర్ణయించాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే -
‘ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో బాబు అమరావతి నిర్మాణాలు !’
సాక్షి, అనంతపురం: అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కానీ, సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అస్మదీయులకు దోచి పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు వేల కోట్లతో అమరావతిలో కట్టడాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో లక్ష ఎకరాల్లో లక్ష కోట్లతో నిర్మాణం అవివేకం. గన్నవరం ఉండగా అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు?. 10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్ర విభజన పాఠాలు చంద్రబాబు నేర్చుకోలేదు. అభివృద్ధి-అధికార వికేంద్రీకరణ అవసరం లేదా?. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కేంద్రం నుంచి గ్రాంట్ ఎందుకు సాధించడం లేదు?. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం లేదు. టీసీఎస్ పేరుతో 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే ఇవ్వడం ఏంటి? ఇది అనుమానాస్పదంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
సాక్షి, కడప: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చలేక ఇటు చంద్రబాబు.. అటు ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. తన సొంత మేనిఫెస్టో అంటూ ఎన్నికల్లో పోటీకి దిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నారు. తన నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు నిధులు ఇవ్వకపోవడంతో తాను ఇచ్చిన హామీల అమలు కోసం కొత్త రకం పన్నులు విధించేందుకు సిద్దమయ్యారు. పీ-4 మోడల్లో భాగంగా కప్పం ఇవ్వాలని హుకుం జారీ చేశారు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాజాగా.. కడపలో డాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడీ అయ్యారు. ప్రతీ ఒక్క వైద్యుడు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ఎమ్యెల్యే.. వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో, డాక్టర్లు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఆమెను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. అయితే, తమ వద్ద డబ్బులు వసూలు చేయడమేంటని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు డాక్టర్ల వంతు కాగా.. రానున్న కాలంలో మాధవి రెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తారోనని వణికిపోతున్నారు. -
టీడీపీ నేతల రౌడియిజం.. పార్టీ మారమని బెదిరింపులు
-
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025 -
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్ నిర్వహించాలని, ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు. -
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్‌రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకంవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్‌లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్‌ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్‌లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్‌బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. -
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్.. పేర్నినాని ఫైర్
-
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
సాక్షి, తిరుపతి: వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమే అంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. న్యాయం మా వైపు ఉంది. నాపై 100 కేసులు పెట్టినా భయపడను. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటా. మీ పాలనలో జరిగే అరాచకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుంది. దేవుడిని అడ్డుపెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు’’ అంటూ భూమన ధ్వజమెత్తారు.తప్పుడు కేసులు.. భూమన పోరాటాలను ఆపలేవు: ఎంపీ గురుమూర్తితిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, భూమన కరుణాకర్‌రెడ్డిపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 30 వేల మహిళలు కనిపించడం లేదని.. వాలంటీర్లు వ్యవస్థ వలనే జరిగిందని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తే మేము కేసు పెట్టలేదు. ఇవాళ వాస్తవంగా గోశాలలో జరిగిన గోవుల మృతిపై ప్రశ్నించిన భూమనపై కేసు నమోదు చేస్తారా..?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’ అని గురమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కూటమిలో ధిక్కార స్వరాలు
-
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది. -
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్ మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్2) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్‌కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్‌ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్ స్టార్’, ‘లెజెండ్’లను తెచ్చింది ఎవరు?పవర్ స్టార్, లెజెండ్.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్ మెడల్: ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది. -
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
సాక్షి, కృష్ణాజిల్లా: వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.గుడివాడలో రౌడీ రాజ్యం: పేర్ని నానివక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్‌కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్‌కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలిపదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్‌కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. -
Botsa: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు జంకుతున్నాయి
-
‘చెప్పేవి గొప్ప మాటలు.. చేసేది మాత్రం శూన్యం’
విశాఖ : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పెద్దలు చెప్పేవి గొప్ప మాటలని, చేసేది మాత్రం శూన్యమన్నారు బొత్స. ‘రాష్ట్ర ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు. పెట్టుబడులో రావాలంటే మేమే అని అంటారు. ప్రభుత్వ ఉద్దేశంలో పరిశ్రమలను ప్రోత్సాహించడం అంటే పొగపెట్టడమే. కడపలో యాష్ కోసం కూటమి నేతల గొడవలు ప్రజలు చూశారు. ఇదొక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇదే జరిగింది. ఎచ్చెర్ల లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద కూడా కూటమి నేతలు డబ్బులు వసూలు చేశారు. జిందాల్ పరిశ్రమపై కేసులు పెట్టి వేదిస్తే ఆ కంపెనీ గుజరాత్ కు వెళ్ళిపోయింది. పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి. విద్యుత్ చార్జీలు పెంచి ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతున్నారు. మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఒక్క టన్ను మిర్చి అయినా ప్రభుత్వం కొన్నదా?, రాష్ట్రంలో ఏ రైతుకి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారు..? , పొగాకు రైతులకు ఏమైనా మేలు చేశారా..? , ఒకవైపు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి.. మరోవైపు కార్మికులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు చేస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని జులుం చేస్తుంది. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్వాకం వలన రాబోయే తరానికి ముప్పు వాటిల్లుతుంది. ఇంత అప్పు గతంలో ఎప్పుడూ లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అప్పులు లేవు. ఏ శాఖలో కూడా జవాబుదారీ తనం లేదు.ఏ మంత్రి అయినా నా శాఖలో ఇంత కచ్చితత్వం ఉందని ఎవరైనా చెప్పగలరా..? , కొత్త పెన్షన్లు రాష్ట్రంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. పేద పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్ మెంట్ కూడా లేదు. విద్య, వైద్యం రాష్ట్రంలో లేవు. ఏ శాఖలో కూడా నిర్ధిష్టమైన విధానం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఈరోజుకి కూడా అలానే ఉంధి. ప్రభుత్వం అసలు ఆలోచన కూడా చెయ్యడం లేదు. సంవత్సరం సమయం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలి. ధీటుగా ఎదుర్కోవాలి అని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. ఏముందని.. ఏం చేశారని ధీటుగా ఎదుర్కొంటారు. పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్ అర్జీ దారులకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు’ అని బొత్స నిలదీశారు. -
వేణుగోపాల స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసిన కూటమి నేతలు
-
సత్తా లేకపోతే ఛాలెంజ్ ఎందుకు? పల్లా శ్రీనివాసరావుకు కౌంటర్
-
చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని.. ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించటం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పది నెలల్లోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దోచుకుంటుందని ధ్వజమెత్తారు.‘‘సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే పేరుతో కొత్తరకం దోపిడీ మొదలు పెట్టారు. ప్రతి యూనిట్‌కి రూ.40 పైసలు చొప్పున పెంచి దోచుకుంటున్నారు. రూ. 4 వేల కోట్లు ఈ కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారు. కరెంటు వాడుకునేది తక్కువ, బిల్లుల మోత ఎక్కువగా ఉంది. అదనపు ఛార్జీలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
‘జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి కుట్రలు’
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పారదర్శకత పాటించాలని వైఎస్సార్సీపీ బృందం కలెక్టర్‌ను కోరింది. కూటమి ప్రలోభాలతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. జీవీఎంసీ పరిసరాల్లోకి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో తప్ప ఇతరులకు అనుమతి ఇవొద్దని కలెక్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కోరారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం ఇచ్చిన నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ జరిగే సమయంలో మీడియాను అనుమతించాలని కలెక్టర్‌ను కోరాం. ఓటింగ్ రోజు సభ్యులను తప్ప మిగతా వారిని అనుమతించకూడదు. అవిశ్వాసం తీర్మానం వీగిపోడానికి కావాల్సిన బలం మాకు ఉంది’’ అని ఆయన చెప్పారు.‘‘విప్ జారీ చేసేందుకు మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయించారు. రేపు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ విప్ జారీ చేస్తారు. విప్ ప్రకారం మా సభ్యులు నడుచుకోవాలి. విప్‌కు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
Bhumana: భయం అనేది నా బ్లడ్ లోనే లేదు టీడీపీ ఎమ్మెల్యేలకు లైవ్ లో కౌంటర్
-
భూమనకు టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్.. ఏమన్నారంటే?
-
అధికారంలోకి వచ్చినా మతాల మధ్య చిచ్చు రాజేసేందుకు టిడిపి కుతంత్రం
-
మహిళలపై చేయి వేస్తే తోలు తీస్తామన్న పవన్ ఏం చేస్తున్నారు: బ్రహ్మనాయుడు
-
టీడీపీ గుంపుకు సింహంలా సమాధానం చెప్పిన ఎంపీ గురుమూర్తి
-
తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా
తిరుపతి,సాక్షి: తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా మరోసారి బట్టబయలైంది. గోశాలకు మరోసారి రమ్మని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నాని, సుధీర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తోక ముడిచారు. ఫోన్లో భూమనను రమ్మనమని అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మీడియా ముందు డ్రామా ఆడి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు భూమన బయల్దేరగా.. ఇంటి వద్దే ఆయనను పోలీసులు నిర్భందించారు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు గోశాల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది.ఎమ్మెల్యేల దారిలో పల్లామరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్ చేశారు. మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు సిద్ధమన్న భూమన. గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం. మీరు ఎక్కుడున్నారని పల్లాను భూమన ప్రశ్నించారు. ఈ క్రమంలో భూమన ఫోన్ కాల్‌ను పల్లా శ్రీనివాస్ కట్ చేశారు. -
టీడీపీ అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసిన భూమన
-
కూటమిలో ట్విస్ట్.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు. -
గంగపుత్రులకు తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది. పథకం అమలు కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ మేరకు స్పష్టం చేయడంతో ఇదెక్కడి న్యాయమంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి తమ హక్కు అని, దీన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలకు కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లూ.. ఆంక్షలు లేకుండా అమలు మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తోంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం పరిహారం ఇవ్వడం పరిపాటి. గతంలో రూ.4 వేలు ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐదేళ్ల పాటు 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల లబ్ధి చేకూర్చింది. వేట నిషేధ భృతి పొందిన వారికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేశారు. భృతి పొందితే సంక్షేమ పథకాలకు అనర్హులే తాము అధికారంలోకి వస్తే ఈ భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం తొలి ఏడాది అటకెక్కించేసింది. ఇటీవలే వేట నిషేధం అమలులోకి రాగా.. ఈ ఏడాదైనా ఇస్తారో లేదో అనే సందేహం మత్స్యకారుల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నెల 26న వేట నిషేధ భృతి జమ చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రెండ్రోజులు తిరక్కుండానే దాన్ని వాయిదా వేసి మే నెలలోనే అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ పథకం అమలు కోసం విధించిన నిబంధనలు మత్స్యకార కుటుంబాల పాలిట ఆశనిపాతంగా మారాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని, అంతేకాకుండా వేట నిషేధ భృతి పొందేవారు ఇతర డీబీటీ స్కీమ్స్ పొందేందుకు అనర్హులని మెమోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన డీబీటీ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ భృతి పొందే వారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్విద్యోన్నతితో పాటు ఎన్టీఆర్భరోసా పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులుగా తేల్చింది. 300 యూనిట్ల విద్యుత్ వాడినా అనర్హులే మరోవైపు వేట నిషేధ భృతి పొందేందుకు 60 ఏళ్ల పైబడిన వారు అనర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు. 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. వేట నిషేధ భృతి పొందే మత్స్యకార కుటుంబంలో ఏ ఒక్కరూ ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో వంటివి కూడా కలిగి ఉండకూడదు. ఏడాదిలో సగటున నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల్లో సొంత ఇంటిని కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగి అయి ఉండకూడదు. పూర్తిస్థాయి వేతనంతో సొసైటీలు, ఫెడరేషన్స్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయి ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ పెన్షన్‌దారుడు కుటుంబంలో ఉండకూడదు. ఇన్‌కం టాక్స్ పన్ను చెల్లింపుదారులు కూడా ఉండకూడదు.సంక్షేమ పథకాలకు అనర్హులనడం దారుణం వేట నిషేధ భృతిని తొలి ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందనుకుంటే మత్స్యకారుల నోట్లో మట్టికొట్టేలా నిబంధనలు విధించింది. గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతికి కోత పెట్టేలా ఆంక్షలు విధించింది. ఈ భృతి పొందేవారు ఇంకా అమలుకు నోచుకోని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చడం విడ్డూరంగా ఉంది. ఆంక్షలు సడలించకపోతే ఉద్యమం చేస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకారుల సంఘాల సమాఖ్య -
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
Bandaru Satyanarayana: విశాఖ కూటమిలో ప్రొటోకాల్ వివాదం
-
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్‌ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్‌లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న -
Malladi Vishnu: కూటమి హయాంలోనే తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి
-
వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ జగన్‌పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్‌పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
TDP కార్యకర్త మల్లేష్ పట్ల దురుసగా ప్రవర్తించిన MLA రమణపూర్తి పీఏ
-
వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం విగిపోతుందని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీచేస్తున్నాము. 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాము. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకు ఉంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి.మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ..‘మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్.. నాకు మేయర్‌గా వకాశం కల్పించారు. బీసీ జనరల్ అయిన సరే యాదవ మహిళకు మేయర్‌గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంతవరకు సమంజసం. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించలేదా?. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మేయర్‌పై అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం విగిపోయేందుకు కావల్సినంత బలం మాకు ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 58 మందికి విప్ జారీచేస్తున్నాము’ అని తెలిపారు. -
చిల్లర వేషాల గణేశా.. మక్కెలిరగ తంతా మల్లేశా!
‘గణపతి.. నేను మల్లేష్‌ను.. గ్రూపులో ఎగ్జిట్ ఎందుకు కొట్టావు.. నువ్వు ఎవడవు.. తీయడానికి....పోస్టులు పెడితే తీసేస్తావా... ఏ ఫొటోలు పెట్టాను.. ఎంపీ, మంత్రి, దాసునాయుడు ఫొటోలు పెట్టాను.. అంతమాత్రాన తీసేస్తావా? పార్టీ గ్రూపులో ఎలా తీస్తావ్. నన్ను తీయడానికి నువ్వెవడివి. పార్టీ కోసం పనిచేశాను. నీలా చిల్లర పనులు చేయిలేదు. టిఫిన్ కొట్టోళ్లు, చిల్లర వ్యాపారులు కడుపు కొట్టలేదు. – నరసన్నపేటకు చెందిన టీడీపీ నాయకుడు మల్లేష్ వాయిస్ ఇది..‘నేను అడ్మిన్‌ని గ్రూపులో ఫొటోలు ఇన్నేసి ఫొటోలు పెడితే ఎలా. అందుకే తీసేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తంతాను.. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో.. ఎమ్మెల్యే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచం రా.. ఒరే మల్లేసు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నరసన్న పేట వస్తే తంతా ను. పాతే స్తాను. బోకరువు నువ్వు.. ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచనురా.. ఏమి పీక్కోంటావో పీక్కో..నీకు అంత సీను లేదు. నువ్వు పార్టీకి అవసరం లేదు. నువ్వు అడగడానికి ఎవడివి. నరసన్నపేట రా.. రెండు కాళ్లు పట్టుకొని క్రిందకి తొక్కెస్తా.. బచ్చా గాడవు, నాఇష్టం.. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి వేషాలు వేయకు.. నరసన్నపేట రా తంతాను. ఎవడు అడుగుతాడు చూస్తాను..’ – నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి సంభాషణ ఇదిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ గణపతి, స్థానిక టీడీపీ నాయకుడు మల్లేష్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. వారి ‘వ్యవహారాలను’ వారే బయట పెట్టుకున్నారు. ఇందులో బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి ఒక అడుగు ముందుకేసి పాతేస్తాను.. తంతాను...అంటూ దర్పాన్ని చూపించగా, టిఫిన్ కొట్టులపై బ్రోకర్ పని చేశావ్. చిన్నోళ్ల కడుపుకొట్టడం... డబ్బులిచ్చినోళ్లకే పనులు చేశావు. నువ్వు చేసేదేంటి? అంటూ టీడీపీ నాయకుడు మల్లేష్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో చిచ్చు రేపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
చెట్లను కాదు.. మమ్మల్ని నరికేయండి!
గంగాధర నెల్లూరు: ‘చెట్లను నరకడం కంటే.. మమ్మల్ని నరికేయండి’ అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ కార్యకర్త ఆక్రోశం వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా.. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మామిడి, టేకు చెట్లను అన్యాయంగా నరికివేశారంటూ కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ వాపోయాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుప్పనపల్లికి చెందిన రైతు, వైఎస్సార్సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి వరత్తూరులో సర్వే నం.840లో మూడు ఎకరాల 30 సెంట్ల భూమి ఉంది.మూడేళ్ల క్రితం ఆ భూమిలో రూ.లక్షలు వెచ్చించి మామిడి, టేకు చెట్లను నాటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో.. స్థానిక టీడీపీ నాయకులు యువరాజురెడ్డి, గంగిరెడ్డి ఆ భూమిపై కన్నేశారు. దౌర్జన్యంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో 115 మామిడి, 50 టేకు చెట్లను నరికేశారు. ఈ దారుణంపై శంకర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కానిస్టేబుళ్లను పంపించి ప్రాథమిక విచారణ చేశారు. కానీ రెండు రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రైతుఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కృపాలక్ష్మి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నారాయణస్వామి మంగళవారం కుప్పనపల్లికి చేరుకుని శంకర్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం అండతో ఎంతటికైనా దిగజారుతారా? అని మండిపడ్డారు. ఈ సమస్యపై జిల్లా ఎస్పీకి పలుమార్లు ఫోన్ చేసినా.. కనీస స్పందన లేదని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
Nandigam Suresh: నా తల్లి,భార్యను కాలితో తన్ని.. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా..
-
సీమ రాజాకు YSRCP యువత హెచ్చరిక
-
టీడీపీ కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి,సాక్షి: సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీరాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజధానిలో వరద వస్తే మునిగే ఐనవోలు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు చూశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని వరద ప్రాంతం నుండి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.దళితులు,అంబేద్కర్ మీద వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ అది. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. టీడీపి కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా. ఇదేనా చంద్రబాబూ దళితుల మీద మీకు ఉన్న ప్రేమ? దళితుల మీద కక్షసాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయి. దళితుల గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారు’అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధపాతాళానికి దళితులను తొక్కేశారని.. వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు.‘‘అంబేద్కర్ అందరివాడే, కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదు?. సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు?. దళితులకు ఏ పథకం అందించకుండా వారి ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు?...బ్లాక్ క్యాట్ కమాండోల సెక్యూరిటీ లేకుండా దళితుల ఇళ్లకు వెళ్లగలరా?. దళితుల ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు వైఖరిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దళితులను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడితే చంద్రబాబు అతన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు?’ అంటూ టీజేఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత లోపిస్తుందంటూ కోర్టులో కేసు వేశారు. దళితులను తొలగించి అక్కడ చంద్రబాబు ఎలా ప్యాలెస్ కట్టుకుంటున్నారు?. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారిని చట్టసభలకు పంపించటానికి ఎందుకంత వివక్ష చూపుతున్నారు?. అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు. చంద్రబాబుని దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
బతికుంటే చాలు అన్న పరిస్థితి కి తెచ్చేసారు తిరుమల శ్రీవారి భక్తుల ఆవేదన
-
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్‌గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్‌కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
విశాఖ టీడీపీ నేత అల్సి అప్పలనారాయణ సంచలన ఆడియో
-
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్సార్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలుమరో వైపు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్లో దూషించిన టీడీపీ నేతలు.. అనంతరం దాడి చేశారు. -
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. వైఎస్సార్సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది. పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈనెల 13న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా అపచారాలు.. !కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పంది కొవ్వు కలిసిందంటూ..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తొక్కిసలాటలో భక్తుల మృతి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.మందు.. ఎగ్ బిర్యానీ⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది. ⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. -
పిఠాపురంలో ‘గ్లాస్’ మేట్స్ గలాటా
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో నిన్నటి వరకూ టీడీపీ, జనసేన నాయకులే కొట్టుకుంటూ రాగా...తాజాగా జనసేనలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. పిఠాపురంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి వివాదానికి తెర లేపారు.పిఠాపురం పట్టణం ఇందిరా నగర్ రజాలపేటలో ఇరువర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ‘పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్న మేమే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటామని, మీరు వెనకాల రావాలని’ ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డగించింది.‘మమ్మల్ని అడ్డుకోడానికి మీరెవరు? మీరు ఎప్పుడు వస్తే మాకేంటి? మేము పార్టీకి పని చేశాం. మేమూ నేతలమే.మేం వస్తాం, ఎవరడ్డుకుంటారో చూస్తాం’ అంటూ మరో వర్గం తిరగబడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలనూ సముదాయించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు చాలాసేపు ఫలించలేదు. ఈ గొడవను కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై జనసేన నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
ఒంగోలు,సాక్షి: ఒంగోలులో కూటమి నేతల బరితెగించారు. కేశవరాజు కుంటలో రూ.25 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.కేశవరాజు కుంటలో సుమారు 5 ఎకరాల 60 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంపై కూటమి నేతల కన్నుపడింది. అంతే రూ.25కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేశారు. ప్లాట్లుగా వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు.కూటమి నేతల భూకబ్జాపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ ఆందోళన చేశారు. టీడీపీ కబ్జాకి గురైన స్థలంలో నిరసన తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని కంచె తీసేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో కూటమి నేతల భూకబ్జాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. -
తన పాలనపై తానే విమర్శలు చేసుకున్న చంద్రబాబు
-
2014-19 మధ్య కాలంలో మీరు సంతోషంగా ఉన్నారా.. సంతోషంగా ఉన్నారా?
గుంటూరు,సాక్షి: అంబేద్కర్ జయంతి సభలో సీఎం చంద్రబాబు తడబడ్డారు. 2014-2019లో ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా? , ఉన్నాయా? అని నొక్కి నొక్కి సభ సాక్షిగా అడిగారు చంద్రబాబు. అది తన హయాం అనే విషయం మర్చిపోయిన చంద్రబాబు.. ఆ సమయంలో ఎవ్వరూ సంతోషంగా లేరనే విషయాన్ని ఆయన తన నోటి వెంటే పలికారు.రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. నా చరిత్రలో ఎప్పుడు చూడని రాజకీయం 2014-2019లో చూశానని అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అసలు విషయాన్ని ఆయన చెవిలో ఊదారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు సారీ సారీ అంటూ తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ ఘటనతో బాబు.. తన పరిపాలనలో జనం సంతోషంగా లేరన్న విషయం తనే ఒప్పేసుకున్నట్లయింది. కొన్నిసార్లు మనం చేసిన తప్పుల్ని ఎంత దాచుదామనుకున్నా అది ఏదొక సమయంలో నోరూ జారుతూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది అని జనం ఆ నోట ఈ నోట అనేసుకుంటున్నారనుకోండి. -
Rachamallu Siva Prasad: ఇక్కడ ఉన్నది రాచమల్లు నా ప్రాణం ఉన్నంతవరకు..
-
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
సాక్షి, అనంతపురం: ఏపీలో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదంలో చిక్కుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం విషయంలో జయరాం తనను మోసం చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..‘గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన బోలే యల్లప్ప ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. యల్లప్ప ఆత్మహత్యయత్నం చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కారణమని అన్నారు. ఎమ్మెల్యే జయరాం.. యల్లప్ప నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగాన్ని 8 లక్షలకు మరొకరికి ఇచ్చేశారు. ఈ కారణంగా ఉద్యోగం పోయిందనే ఆవేదనతో యల్లప్ప ఇలా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో జయరాం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. -
అప్రాధాన్య పోస్టులకు వెయిటింగ్ ఐఏఎస్‌లు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచిన పలువురు ఐఏఎస్ అధికారులపై రెడ్‌బుక్ చాప్టర్లో మరో కుట్ర అమలైంది! పోస్టింగ్‌లు ఇవ్వకుండా దాదాపు 11 నెలల పాటు వెయిటింగ్లో ఉంచిన ఆ ఉన్నతాధికారులను తాజాగా అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వు జారీ చేశారు.మరోవైపు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ పూర్తి అదనపు బాధ్యతలను కె.భాస్కర్‌కు, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ పూర్తి అదనపు బాధ్యతలను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి అప్పగించారు. కాగా అవసరం తీరిపోవడంతో సీనియర్ ఐఏఎస్ సిసోడియాపై బదిలీ వేటు పడింది. ప్రాధాన్యత లేని చేనేత, జౌళి శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఆయన్ను బదిలీ చేయడంతోపాటు ఇతర బాధ్యతల నుంచి కూడా తప్పించారు. -
నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు, చేతులు నరికేస్తాం
యలమంచిలి: బూతులు తిట్టడంలో టీడీపీ నేతలను మించిపోయారు.. కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఆదివారం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన తర్వాత జరిగిన సభలో మహిళల ఎదుటే వైఎస్సార్సీపీ నేతలపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై శ్రీనివాసవర్మ దూషణలకు దిగారు. ‘ఎర్రిపప్ప కారుమూరి తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు టీడీఆర్ నిధులు స్కామ్ చేశాడు... ఈ పిచ్చి నా..కొ.. త్వరలోనే జైలుకెళ్లి చిప్ప కూడు తింటాడు’ అంటూ అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్రిపప్ప కారుమూరి.. నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు చేతులు నరికేస్తాం.. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో..’ అంటూ ఇష్టానుసారం మాట్లాడారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా అవినీతికి మారుపేరని, మనుషుల రక్తం తాగేసేలా ఉంటారని శ్రీనివాసవర్మ తన నోటికి పనిచెప్పారు. -
పాత కుట్రకు మళ్లీ పదును!
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: 2019 ఎన్నికల ముందు 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ను పదునైన కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం భేటీ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అది కూడా అతడిని వెతుక్కుంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీనివాసరావు ఇంటికెళ్లి ఏబీ కలిశారు. స్వయంగా నిందితుడి ఇంటికెళ్లి కలవడం ద్వారా నాడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి అసలు కుట్రదారులెవరనే విషయాన్ని ఏబీ చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాటి తరహాలోనే మళ్లీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా కొత్త కుట్రలు పన్నుతున్నారని చర్చ జరుగుతోంది. నిందితుడు శ్రీనివాసరావును కలిసిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడం, నిందితుడిని కొనియాడటం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. నాడు కూడా ముందస్తు కుట్రలో భాగంగానే..వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబర్ 25న హత్యాహత్నం జరిగిన విషయం టీవీల్లో వచ్చిన వెంటనే.. స్థానిక టీడీపీ నేతలు వారికి ముందుగానే తెలిసినట్లు నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద వాలిపోయారు. మీడియా కంటే ముందుగానే అతడి ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు నడింపల్లి శ్రీనివాసరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్వరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌లు.. వారికి ముందే ఎవరో ‘బ్రీఫింగ్’ ఇచ్చినట్టు.. ‘నిందితుడు జగన్ అభిమాని’ అంటూ ఒకేపాట పాడారు. తాజాగా ఇప్పుడు నిందితుడు శ్రీనివాసరావు ఇంటికెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా అదే పాట పాడటం గమనార్హం. అప్పుడు కుట్ర అమల్లో భాగంగా టీడీపీ నేతలతో అలా మాట్లాడించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడు చంద్రబాబు తనను నామినేటెడ్ పదవిలో నియమించడంతో ఆయన రుణం తీర్చుకోవడానికి అన్నట్టు అవే పలుకులు పలకడం ద్వారా హత్యాయత్నం కుట్రలో భాగస్వాములు ఎవరో స్పష్టం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.అప్పట్లో డీజీపీ ఠాకూర్ కూడా అదే పాటనాడు వైఎస్ జగన్‌పైన హత్యాయత్నం జరిగిన అరగంట లోపే (అప్పటికి నిందితుడు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కస్టడీలో ఉన్నాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్ సైతం నమోదు కాలేదు. నిందితుడిని విచారించనూ లేదు) మధ్యాహ్నం 1.30 గంటలకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడి పేరు, ఊరును ప్రకటించడంతోపాటు అతడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు అని, వైఎస్ జగన్ అభిమాని అని ప్రకటించేశారు. పబ్లిసిటీ కోసమే జగన్‌పై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సీఐఎస్ఎఫ్ నుంచి నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోకముందే అంతా ముందుగానే తెలిసినట్టు.. పక్కా ప్రణాళిక ఉన్నట్టు నిందితుడి వివరాలను ఆర్పీ ఠాకూర్ ఎలా వెల్లడించగలిగారు? అసలు విచారణ నామమాత్రపు విచారణ కూడా లేకుండానే హత్యాయత్నం వెనక ఉద్దేశాన్ని ఎలా పసిగట్టగలిగారు? అనే ప్రశ్నలకు అప్పుడు ఠాకూర్ సమాధానం చెప్పలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే కుట్రను రచించి అమలు చేయడంలో డీజీపీగా ఆర్పీ ఠాకూర్ కీలక భాగస్వామి కాబట్టే ఆయనకు అన్ని విషయాలూ ముందుగానే తెలిశాయన్నది సుస్పష్టం. ఇక నాటి డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సైతం అదే విషయాన్ని వల్లె వేశారు.అంత ఆర్గనైజ్డ్గా అందరూ ఒకే విషయాన్ని ఎలా చెప్పారనే విషయం తేల్చే సమయంలో, కేసు కీలక దశకు చేరిన సందర్భంలో ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం నిందితుడి ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరపడం.. అప్పటి కుట్ర ఎవరి మార్గదర్శకత్వంలో జరిగిందో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదవీ విరమణ నాటి నుంచి కుట్రలే..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు.. గంగ.. చంద్రముఖిగా మారినట్టు పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తగా మారిపోయారు. తన కుల సంఘాల సమావేశాల్లోనూ వైఎస్ జగన్‌పై విషం చిమ్మారు. తానొక మాజీ ఐపీఎస్ అధికారిననే విషయం మరిచిపోయి ఒక సాధారణ టీడీపీ కార్యకర్తకంటే దిగువ స్థాయికి జారిపోయి సోషల్ మీడియాలోనూ అనేక తప్పుడు పోస్టులు పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ఏబీ వెంకటేశ్వరరావుకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు. అంతేకాకుండా ఏబీపై ఉన్న నిఘా పరికరాల కొనుగోలు కేసును కూడా పక్కనపెట్టారు. దీంతో చంద్రబాబు రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా ఏబీ వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోందని అంటున్నారు. ఇందులో భాగంగానే నాడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడిన నిందితుడు శ్రీనివాసరావును అతడి ఇంటికెళ్లి మరీ ఏబీ కలిశారని.. కొత్త కుట్రలకు తెరలేపుతున్నారనే చర్చ జరుగుతోంది. లేకపోతే జగన్ మీద హత్యాయత్నం కేసులో నిందితుడు ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన తర్వాత.. అమలాపురంలో ఏబీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి శ్రీనివాసరావు అని నిందితుడిని వెనకేసుకొచ్చారు. జగన్ అతడి జీవితాన్ని చిదిమేశారన్నారు. జగన్ రాష్ట్రానికి, ఆంధ్రులకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదకారి అని ఏబీ వ్యాఖ్యానించారు. జగన్ బాధితులు ఎందరో ఉన్నారన్నారు. తిరిగి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదన్నారు. జగన్ అక్రమాలు చేశారని.. ఆయన వల్ల బాధ పడుతున్న బాధితులకు తాను అండగా ఉంటానని ఏబీ అన్నారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టారని వ్యాఖ్యానించారు. -
నడిరోడ్డుపై తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
-
‘కూటమి విజయంలో బీజేపీదే కీలక పాత్ర.. టీడీపీ ఓవరాక్షన్ ఎక్కువైంది’
సాక్షి, అనంతపురం: ఏపీలో అధికార కూటమి పార్టీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ నేతల తీరుపై ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీనే కీలక పాత్ర పోషించింది. అలాంటి బీజేపీ నాయకులపై ఎందుకంత చిన్న చూపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో బీజేపీ నేతలకు కనీస గౌరవం లేదని అసహనం ప్రదర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ పాత్ర కీలకం. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలతో సమానంగా టీడీపీ, జనసేన శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి మీరెందుకు బీజేపీ నాయకులపై చిన్నచూపు చూస్తున్నారు?. తాడిపత్రి బీజేపీ నేతల సమస్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒకలా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే ఉంది. కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని అన్నారు. -
చంద్రబాబు మరో మహా ప్యాలెస్
సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్మనేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్..! వీటికితోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పున ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూడలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్నమాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూడలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు. -
రైల్వేకోడూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలోనే టీడీపీ నూతన కార్యాలయంపై దాడి జరిపి అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. దీంతో జాతీయ రహదారిపై మూడు గంటలపాటు గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి జనార్దన్‌రెడ్డి, టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టీడీపీ కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 2 గంటల తర్వాత పోలీసుల సమక్షంలో షట్టర్లు తెరిచి మంత్రిని, మిగిలిన వారిని బయటకు పంపించారు. ఇదీ నేపథ్యంటీడీపీ మాజీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు చాలాకాలంగా రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ టీడీపీ మనుగడను కాపాడారు. అయితే, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ముక్కా రూపానందరెడ్డికి చంద్రబాబు పార్టీ పగ్గాలు అప్పగించడంతో టీడీపీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. నూతన ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి తన ప్రాబల్యంతో చంద్రబాబును ఒప్పించి జనసేనకు కేటాయించిన సీటును తన వర్గీయుడు అరవ శ్రీధర్‌కు ఇప్పించుకున్నారు. అనంతరం వీరిద్దరు ఒంటెత్తు పోకడలతో టీడీపీ నేతలను దూరం పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానులు మంత్రి రాకను తెలుసుకుని అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేసి గందరగోళం సృష్టించారు. కాగా.. రైల్వేకోడూరు మాజీ టీడీపీ ఇన్చార్జి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ పార్టీ కార్యాలయం లోపల ఉన్న మంత్రిని కలిసి పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్ల నుంచి తాము పనిచేస్తున్నప్పటికీ చిన్నచూపు చూడటం సబబు కాదని తెలిపారు. అనంతరం మాజీ ఇన్చార్జి విశ్వనాథ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తిని రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జిగా నియమించినా పార్టీపై అభిమానంతో అధిష్టానం మాటల్ని నమ్మి ఇన్చార్జికి సహకరిస్తూ వచ్చామన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని, ఒంటెత్తు పోకడలు సరికాదన్నారు. ఈ ఘటనతో జిల్లా ఇన్చార్జి మంత్రి, టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించడం గమనార్హం. -
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్’ గైడ్‌లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
సాక్షి, గుంటూరు: రెడ్‌బుక్ రాజ్యాంగానికి డీఎస్పీ బలైపోయారు. పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టలేదని ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల మండలంలో జూలకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.ఈ కేసులో వైఎస్సార్సీపీ వారిని ఇరికించాలని ఓ ఉన్నతాధికారి ఆదేశించగా, ఆ తప్పు తాను చేయలేనని డీఎస్పీ జగదీష్ తోసిపుచ్చారు. దీంతో డీఎస్పీని హెడ్ క్వార్టర్ కు పిలిపించిన ఉన్నతాధికారి దూషించారు. పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలకే డీఎస్పీ జగదీష్‌ను బదిలీ చేశారు. డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై పోలీసులు నిప్పులు చెరుగుతున్నారు. -
మీడియాను తీసుకురండి వెళ్దాం.. టీడీపీకి భూమన సవాల్
-
తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన
-
TDP: వాట్సాప్ ద్వారా 520కి గాను 161 పౌర సేవలు ప్రారంభం
-
వాస్తవాలు తెలుసుకో లోకేష్: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని.. నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని. టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు’’ అని మేరుగు నాగార్జున మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ అందక 11 లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారెవరూ లోకేష్‌కి కనపడటం లేదా?. నారా లోకేష్ ట్విట్టర్ కింగ్‌గా మారిపోయారు. జగన్‌ని కంసుడు మామ అంటూ ట్వీట్ చేసిన లోకేష్.. వాస్తవాలు తెలుసుకోవాలి...త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున రిలీజ్ చేయాలి. ఇప్పటికే రూ.2,800 కోట్లు బకాయిలు పడ్డారు. మేము గట్టిగా ఆందోళనలు చేస్తే రూ.700 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థులు కూలి పనులకు వెళ్లే పరిస్థితిని తెచ్చారు. యూనివర్సిటీలను సైతం నిర్వీర్యం చేశారు. పేదల చదువులపై చంద్రబాబుకు మనసు లేదు’’ అని మేరుగు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉపాధి హామీ కూలికి కూటమి నేతలు వేధింపులు
-
సంచలన సర్వే.. బయట పడ్డ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల బండారం
-
దుర్మార్గం.. అక్రమం
సాక్షి, నెట్వర్క్: ‘ఒక సంఘటనను యథాతథంగా వాస్తవాలతో ప్రచురించడం తప్పా? నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా? హత్యను హత్య అని చెప్పినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా కేసు పెట్టించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికీ స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ఒక వార్త ఒకేలా లేదని చెబుతూ కేసు పెట్టడం హాస్యాస్పదం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కేసు పెట్టడం అంటే ముమ్మాటికీ కక్ష సాధింపే. తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలి’ అని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డీఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. బాపట్లలో నిరసన తెలిపి కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ నిరసన చేపట్టారు. మార్కాపురం ప్రెస్‌క్లబ్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు నెల్లూరులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెంలో కూడా జర్నలిస్టులు నిరసన తెలిపారు. ‘సీమ’ వ్యాప్తంగా కదం తొక్కిన జర్నలిస్టులుసాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసు నమోదును నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. అనంతపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, చిలమత్తూరు, పెనుకొండలో నిరసన తెలిపారు. కర్నూల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఇతర జర్నలిస్టు సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గంగాధరనెల్లూరు, తవణంపల్లె, పలమనేరులో ఆందోళనలు చేపట్టారు. చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కడపలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఉత్తరాంధ్రలో నిరసనలువిశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టులను కేసుల పేరుతో అణిచి వేయాలని చూస్తే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పార్వతీపురం ఐటీడీఎ పీవో, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రాలు అందజేశారు. తప్పుడు కేసు ఎత్తివేయాలి సాక్షి ఎడిటర్, ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత కోన సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర శాఖ కూడా సాక్షిపై కేసును తీవ్రంగా తప్పుపట్టింది. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసు పెట్టడాన్ని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డిలు కేసును తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు ప్రభుత్వ తీరును వేర్వేరు ప్రకటనల్లో తప్పుపట్టారు. -
ఎస్ బాస్‌లకే ‘రెడ్’ కార్పెట్!
‘రెడ్బుక్కే రూల్ బుక్...! కచ్చితంగా అమలు చేయడమే జిల్లా ఎస్పీల బాధ్యత..! టీడీపీ ప్రధానకార్యాలయంతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతలు సూచించిన ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులుపెట్టాల్సిందే..! వారిని తీవ్రంగా వేధించాల్సిందే..!’ - ముఖ్యనేత అల్టిమేటం...!‘ప్రభుత్వ పెద్దలు చెప్పింది అర్థమైంది కదా...! ఫాలో కావాల్సిందే...! లేదంటే చార్జ్‌మెమోలు ఇస్తాం.. చెప్పినట్లుగా నడుచుకోని ఎస్పీలను పక్కనబెడతాం.. డీఎస్పీలతో రెడ్‌బుక్ కేసులు ఫాలో అప్ చేయిస్తాం..!’ - పోలీస్ బాస్ హుకుం..! రెడ్‌బుక్ అరాచకాలతో పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ రెడ్‌బుక్ ఒత్తిళ్లతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఎస్పీలను ఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలను వాకబు చేస్తూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. - సాక్షి, అమరావతి నెల రోజులుగా కృష్ణకాంత్‌కు వేధింపులు..!రెడ్‌బుక్ కుట్రను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు, అక్రమ అరెస్టులో ఎస్పీ తమ అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19 మధ్య పెండింగ్‌లో ఉన్న పలు కేసులను తిరగదోడి రాజకీయ ప్రత్యర్థులపై ఐపీసీ సెక్షన్ 307 చేర్చి హత్యాయత్నం కింద కేసులు బనాయించాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతల ఒత్తిళ్లతో పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వాస్తవాలతో నిమిత్తం లేకుండా వివిధ కేసుల్లో సెక్షన్ 307 చేర్చేందుకు యత్నించారు. ఈ విషయం తెలియడంతో ఎస్పీ కృష్ణకాంత్ వారిని వారించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్ 307 చేర్చితే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని సహించలేని సోమిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించడంతో కృష్ణకాంత్‌ను డీజీపీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రెడ్‌బుక్ కేసులకు సంబంధించి చెప్పినట్లు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతరం రోజూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి పెంచడంతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు తక్షణం మెరుగైన చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయనకు హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. రెడ్‌బుక్‌ను కాదనే ఎస్పీలకు మెమోలుఅడ్డగోలుగా వ్యవహరించేందుకు వెనుకంజ వేసే ఎస్పీలను వెంటనే పక్కనబెట్టాలని డీజీపీని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. ఆయా జిల్లాల్లో టీడీపీ వీర విధేయ డీఎస్పీలను గుర్తించి వారితో రెడ్‌బుక్ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధ్థన్‌రెడ్డిపై అక్రమ కేసుతోపాటు ఇతర రెడ్‌బుక్ కేసుల దర్యాప్తును ఆయనే పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు బృందాల ఏర్పాటు, వివిధ ప్రాంతాలకు పంపించడం, జిల్లావ్యాప్తంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం తదితర వ్యవహారాలను డీఎస్పీ శ్రీనివాసే నిర్వర్తిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు మోడల్‌నే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీలకు డీజీపీ కార్యాలయం తేల్చి చెప్పినట్లు సమాచారం. రెడ్‌బుక్‌ను ఫాలో కాకుంటే ఎస్పీలకు చార్జ్ మెమోలు తప్పవని, ఆ తరువాత తాము ఎంపిక చేసిన డీఎస్పీలు ఆయా కేసులను పర్యవేక్షిస్తారని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐపీఎస్ అధికారులైన ఎస్పీలను అవమానించడమేనని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
అప్పు చేసి ఫీజులు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి.పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. రూ.30 వేలు ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. దయచేసి హాల్ టికెట్ ఇప్పించి పరీక్ష రాసేలా సాయం చేయగలరని ప్రార్థన..! – మంత్రి లోకేశ్‌కు ‘ఎక్స్’ ఖాతాలో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థన ఇదీ!! పిల్లల ఫీజుల విషయం రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్‌టికెట్ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరుకాక, కాలేజీకి వెళ్లలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకుని ఆత్మ విశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒకపక్క విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా.. కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళుతున్న దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.7,800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్ల చొప్పున హాస్టల్ ఖర్చుల కోసం అందచేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా రెండేళ్లలో రూ.7,800 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఫీజులకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా మండలి అధికారాలకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. క్వార్టర్‌కే దిక్కులేదు.. సెమిస్టర్ బాంబు..! గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలావరకు తగ్గింది. టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించటానికే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకపై సెమిస్టర్ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేట్ విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్ పీజీ రీయింబర్స్మెంట్ గాలికి.. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.3 వడ్డీకి రూ.20 వేలు అప్పు చేశా మా అమ్మాయి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు చేసి కాలేజీకి కట్టా. ప్రతి నెలా రూ.600 వడ్డీ కడుతున్నా. నా భర్త పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. – కె.కుమారి, ఇంటర్ విద్యార్థిని తల్లి, విజయవాడ అప్పు చేసి రూ.40 వేలకు పైగా కట్టాంతిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి రూ.40 వేలకు పైగా కాలేజీకి కట్టాం. నా భర్త మేస్త్రీ పని చేస్తారు. ఆయన కూలితోనే కుటుంబం గడవాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతో పెద్దబ్బాయిని ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇంకో అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. – ప్రభావతమ్మ, ఇంజినీరింగ్ విద్యార్థి తల్లి, తిరుపతి జగన్ హయాంలో ఆదుకున్నారిలా..జగనన్న విద్యా దీవెన: రూ.12,609.68 కోట్లు వసతి దీవెన : రూ.4,275.76 కోట్లు 2017-19 మధ్య టీడీపీ పెట్టిన బకాయిల చెల్లింపు: రూ.1,778 కోట్లు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.18,663.44 కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ - ఎంటీఎఫ్) విభాగం చెల్లింపులు(ఒక్కో విద్యార్థికి) ఐటీఐ రూ.10 వేలు పాలిటెక్నిక్ రూ.15 వేలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు రూ.20 వేలు (నోట్: వీలైనంత ఎక్కువ మందిని అర్హులుగా చేర్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలకు ఉండేది. 2019 - 24 మధ్య వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధి చేకూర్చారు) -
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదంటూ ఆమె ప్రశ్నించారు.‘‘ఒకడ్ని అరెస్టు చేసినట్టు చూపించి మహిళా ఉద్దారకుల్లాగ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు?. కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయటం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్టయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు కేసు పెట్టలేదు?’’ అంటూ శ్యామల ప్రశ్నలు గుప్పించారు.‘‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ స్టేజీల మీద స్కిట్లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా?. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఐ-టీడీపీ పేరుతో విష వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారు?’’ అని శ్యామల నిలదీశారు.‘‘నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వహనానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో పీ4 కాదు ఏ4 అమలవుతోంది. ఏ4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు’’ అంటూ శ్యామల వ్యాఖ్యానించారు. -
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
ఏలూరు జిల్లా: గతేడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా కాల గర్భంలో కలిపేసే యత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలని ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి మాత్రం డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు. ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే.. మరి చంద్రబాబేమో వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘అప్పులు పుట్టడం లేదు’’ అపి ప్రజలకు చెబుతున్నారు. అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయిపోయింది’ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజవర్గం అగిరపల్ల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ అప్పు తేవాలన్నా.. ఇచ్చేవాడులేడు.. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే.. డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు.. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు.అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అని ఒకవైపు జనం అనుకుంటుంటే, బాబు గారు మాత్రం తాను పథకాల్ని అమలు చేయలేనని పరోక్షంగా జనాలకు చెప్పేస్తున్నారు చంద్రబాబు.