
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పారదర్శకత పాటించాలని వైఎస్సార్‌సీపీ బృందం కలెక్టర్‌ను కోరింది. కూటమి ప్రలోభాలతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. జీవీఎంసీ పరిసరాల్లోకి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో తప్ప ఇతరులకు అనుమతి ఇవొద్దని కలెక్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం ఇచ్చిన నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ జరిగే సమయంలో మీడియాను అనుమతించాలని కలెక్టర్‌ను కోరాం. ఓటింగ్ రోజు సభ్యులను తప్ప మిగతా వారిని అనుమతించకూడదు. అవిశ్వాసం తీర్మానం వీగిపోడానికి కావాల్సిన బలం మాకు ఉంది’’ అని ఆయన చెప్పారు.
‘‘విప్ జారీ చేసేందుకు మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయించారు. రేపు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ విప్ జారీ చేస్తారు. విప్ ప్రకారం మా సభ్యులు నడుచుకోవాలి. విప్‌కు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.