Navratri Utsav
-
దసరా సంబరాల్లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున (ఫొటోలు)
-
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి.. హోటళ్లు కిటకిట
సిమ్లా: ప్రస్తుతం దేశంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా నేపధ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వ్యాపారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది.పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుండి పర్యాటకులు హిమాచల్ చేరుకుంటారు. దీంతో ఇక్కడి హోటళ్లలోని గదులు 80 శాతం వరకూ నిండిపోయాయని తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ నరేన్ సహాయ్ మీడియాతో మాట్లాడుతూ పండుగగ సీజన్ ప్రారంభమైందని,అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లాంగ్ వీకెండ్ రాబోతోందని, ఈ సందర్భంగా పర్యాటకులు హిమాచల్‌కు అధిక సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం, బెంగాలీ పర్యాటకులు వస్తున్నారని, దీపావళి సమయంలో గుజరాతీ పర్యాటకులు సిమ్లాను సందర్శిస్తారన్నారు.నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని హోటల్ వ్యాపారి ప్రిన్స్ కుక్రేజా మీడియాకు తెలిపారు. వారాంతాల్లో గదుల బుకింగ్స్ కూడా జరుగుతున్నాయన్నారు. గత వారాంతంతో పోలిస్తే, ఈ వారాంతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శించేందుకు రానున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ నుండి పర్యాటకులు హిమాచల్‌కు తరలివస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
కేరళలో దేవీ నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సమంత.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో పయనిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. బాలీవుడ్లో సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసిన సమంత మరోసారి అమ్మవారికి పూజలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో నవరాత్రుల సందర్భంగా పూజలో పాల్గొంది. దేవి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.కాగా.. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో సమంత పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య- సమంత విడాకులను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టాలీవుడ్ ప్రముఖులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే నాగార్జునపై మంత్రిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఉజ్జయినిలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 29) శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (గురువారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి శివపంచాయతన పూజ, అభిషేకం జరిగింది. హారతి అనంతరం మహాకాళేశ్వరుని పూజ, అభిషేకం జరిగింది. 11 మంది బ్రాహ్మణులు ఈ పూజలను నిర్వహిస్తున్నారు. వీరు ఈ శివరాత్రి మహోత్సవాలలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహాకాళేశ్వర ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత, పార్కింగ్, ప్రసాద వితరణ తదితర సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మార్చి 8న జరిగే శివరాత్రి వేడుకల వరకూ ప్రతీరోజూ మహాశివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ శివ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే పండితులు ఉపవాసం పాటించనున్నారు. -
నీటిలో గర్భా నృత్యం.. నివ్వెరపోతున్న జనం!
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల గర్బా, దాండియా నృత్యాల కోలాహలం కనిపిస్తోంది. ఈ సంప్రదాయ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే నీటిలో గార్బా నృత్యం చేస్తున్న ఓ డ్యాన్సర్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో నీటిలో మునిగి గర్బా నృత్యం చేస్తున్న ఒక యువకుడిని చూడవచ్చు. ఇది వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ నృత్యం చేస్తున్న కళాకారుని పేరు జైదీప్ గోహిల్. తన ఇన్స్టాగ్రామ్ బయోలో తాను భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున నృత్యం చేసే వ్యక్తినని పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కళాకారుడని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
మహిషాసురమర్థినిగా మీనాక్షి అమ్మవారు
మధురై: కదంబ వన రాణి మీనాక్షి అమ్మవారు తమిళనాడులోని మధురైలో కొలువై ఉన్నారు. ప్రస్తుతం మీనాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మీనాక్షి దేవాలయం పాండ్య దేవాలయాలలో ప్రముఖమైనదిగా వెలుగొందుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మధుర మీనాక్షి సుందరేశ్వర్ ఆలయానికి మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మీనాక్షి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా శమీ మందిరం రెండవ ప్రాకారంలో ఘనమైన అలంకారం చేశారు. నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు మహిషాసురమర్థిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మూలస్థాన గర్భగుడిలోని మీనాక్షి అమ్మవారికి అభిషేకం, అలంకరణలు నిర్వహించి కల్పపూజ, సహస్రనామ పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు #madurai | மதுரை மீனாட்சி அம்மன் கோவிலில் நவராத்திரி 8-வது நாள் விழாவை முன்னிட்டு மகிஷாசுரமர்த்தினி அலங்காரத்தில் எழுந்தருளி அருள்பாலித்தார்.#spiritual | @SRajaJourno | @k_for_krish | @imanojprabakar | @JSKGopi @LKGPONNU @kasaayam | #மீனாட்சியம்மன் @LPRABHAKARANPR3 @abplive pic.twitter.com/8EwLquBYV3 — arunchinna (@arunreporter92) October 22, 2023 -
నవరాత్రుల్లో విషాదం
దేశవ్యాప్తంగా ప్రస్తుతం దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా జరుగుతుండటం విశేషం. నవరాత్రులలో గుజరాత్లో నిర్వహించే గర్బా నృత్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో యువతతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికలపై దాండియా ఆడుతున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాత్లో జరుగుతున్న వేడుకల్లో గుండెపోటు కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. గడచిన 24 గంటల్లో గర్బా నృత్యం చేస్తూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రులలో ఇప్పటివరకూ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి అత్యవసర అంబులెన్స్‌లకు 521 కాల్స్ వచ్చాయి. నవరాత్రి వేడుకల్లో గుజరాత్లో ఒక్కసారిగా గుండెపోటు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువత గుండెపోటుకు గురవుతోంది. రాజ్‌కోట్‌లో 28 ఏళ్ల యువకుడు గర్బా నృత్యం చేస్తూ, గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాయరోడ్డులోని ఓ బిల్డర్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు ఆ బిల్డర్ ప్రాణాలను కాపాడలేకపోయారు. అహ్మదాబాద్‌లోని హతీజన్లో గర్బా నృత్యం చేస్తున్న సమయంలో ఒక యువకుడు మృతిచెందాడు. ద్వారక, గ్రేటర్ అంబాలా, రాంనగర్లో ముగ్గురు యువకులు హఠాన్మరణం చెందారు. సూరత్‌లోనూ గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో కన్నుమూశారు. వడోదరలోని హర్ని ప్రాంతంలో గర్బా ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దభోయ్‌లో కూడా 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. నవ్సారిలో ఒక యువకుడు గర్బా నృత్యంలో పాల్గొన్న అనంతరం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అమ్రేలి, జామ్‌నగర్‌లో ఇద్దరు చొప్పున, ద్వారకలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. అమ్రేలికి చెందిన దినేష్ షియాల్ (23) నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో మృతి చెందాడు. నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్న యువతలో గుండెపోటు సమస్య పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇది కూడా చదవండి: పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి? -
బుల్లెట్ ఎక్కాలే తల్వార్ తిప్పాలే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక మహిళ గాల్లో తల్వార్ ఊపుతూ బుల్లెట్‌పై వీరవిహారం చేసింది. మరో మహిళ టాప్‌లెస్ జీప్‌ను ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తల్వార్‌ను గాలిలో ఝుళిపించింది. ఒక మహిళ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే మరొక మహిళ వెనుక సీటులో నిల్చొని గాల్లో తల్వార్‌తో విన్యాసాలు చేసింది. ఆ రాత్రి దుర్గామాత మండపం సమీపంలో మహిళలు చేసిన రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ‘ఆహా ఓహో’ అని అబ్బురపడితే మరికొందరు ‘ఇలాంటి సాహసాలు తగవు’ అని ఖండించారు. -
దుర్గామాతకు పానీపూరీల అలంకరణ.. ఎక్కడంటే?
కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది. ఈసారి నగర దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండపం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది. బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపం క్లిప్‌ను షేర్ చేశారు. ఇది కూడా చదవండి: కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు Kolkata's Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy — Harsh Goenka (@hvgoenka) October 16, 2023 -
ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో...తెలుసా ?
-
విశాఖ శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి పూజలు
-
Dussehra: నవదుర్గా అవతార రహస్యాలు.. ఏమిటీ దసరా? ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి
‘అమ్మ’ అంటే ఆత్మీయతకు ఆలవాలం. ఎందుకంటే, తనలోంచి మరొక ప్రాణిని సృజించగల శక్తి అమ్మకే ఉంది. ‘జగన్మాత’ అంటే జగత్తుకే తల్లి. ‘మా అమ్మ’ అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. జగజ్జనని అంటే అన్ని లోకాలకూ అమ్మ. అందుకే భారతీయ ఆధ్యాత్మికత అమ్మకు ఎంతో విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అమ్మకు తన బిడ్డలంటే ఎంతో వాత్సల్యం. అంతటి వాత్సల్యమూర్తి అయిన అమ్మ కూడా తన బిడ్డలు చెడ్డవారిగా తయారవడాన్ని, లోక కంటకులుగా మారడాన్ని సహించలేదు. వారిలోని దానవత్వాన్ని దునుమాడటానికి ఏమాత్రం వెనుకాడదు. ముందు మంచిగా చెబుతుంది. వినకపోతే ఆయుధాన్ని ధరిస్తుంది, బెదిరిస్తుంది. అప్పటికీ తీరు మార్చుకోక పోతే రౌద్రమూర్తిగా మారి సంహరిస్తుంది. వేల ఏళ్ల కిందట జరిగింది అదే. లోక కంటకులుగా మారిన దుష్టరాక్షసులను అమ్మ వెంటాడి, వేటాడి మరీ సంహరించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్న ఉత్సవాలే దసరా మహోత్సవాలు. ఈ సృష్టి యావత్తూ మంచి–చెడు శక్తులతో నిండి ఉంది. మానవాళిని పీడించే చెడు శక్తులను లోకరక్షణ చేసే దైవశక్తులు నిర్మూలిస్తాయి. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మ నుంచే లభిస్తాయి. అయితే తాను అందించిన శక్తి సరిపోకపోతే తానే శక్తి స్వరూపిణిగా మారి, దానవత్వాన్ని దునుమాడుతుంది. ఉగ్రరూపిణిగా ఉన్న అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గడ్డం పట్టుకుని బతిమాలుతారు. అప్పటికీ దిగిరాకపోతే పాదాల మీద పడి పూజిస్తారు. అమ్మకు ఇష్టమైనవన్నీ ఆమె పాదాల ముందు ఉంచి అమ్మ ప్రేమను, అనుగ్రహాన్ని అందుకుంటారు. ‘అమ్మ’ అనే శబ్దం తరతమ భేదాలతో దాదాపు అన్ని భాషల్లోనూ గొప్పగా ధ్వనిస్తుంది. బిడ్డలోని లోపాలను పట్టించుకోకుండా అక్కున చేర్చుకునే అమృతమూర్తి అమ్మ. లోకంలో తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూస్తారు తల్లులు. అయితే, తల్లి లేని వారిక్కూడా జగజ్జనని ఆ ప్రేమను అందిస్తుంది. అమ్మవారిది దివ్యానుగ్రహం. అది అందుకోగలిగిన వారిదే అదృష్టం. భారతీయుల గొప్పదనం తల్లిని దేవతగా ఆరాధించడం. తల్లి ఆరాధన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జగన్మాతను ‘బతుకమ్మ’ పేరుతో ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగను చాలా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో మహిళల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ పండుగలో ఆటపాటలతోపాటు నైవేద్యాలది కూడా పెద్దపీట. ఆ అలంకరణలలోని ఆంతర్యం మాయావులైన రాక్షసులు అమ్మవారి కళ్లు కప్పేటందుకు రకరకాల వేషాలు వేశారు. వారి ఆట కట్టించేందుకు అమ్మవారు కూడా రోజుకో వేషం ధరించి తొమ్మిది రోజులు– రేయింబవళ్లూ మహాసంగ్రామం చేసింది. అందుకు ప్రతీకగానే నేటికీ భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో రోజుకో రూపంలో అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజించుకుని పరవశిస్తారు. పదోరోజున విజయోత్సాహ వేడుకలు జరుపుకుంటారు. విశిష్ట ఆరాధకులు తొమ్మిది మంది బాలికలను పూజించి, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. పూజలు, ఆరాధనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోల్‌కతా, కర్ణాటక వంటి ప్రదేశాల్లో దసరా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మైసూరు కూడా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి. ఏమిటీ దసరా? ‘దశహరా’అనే సంస్కృత పదం వికృత రూపంలోకి మారి ‘దసరా’ అయ్యింది. దశహరా అంటే పది జన్మల పాపాలను, పదిరకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం. దుర్గాదేవి కూడా తన భక్తుల జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది కాబట్టి ఈ దేవిని స్మరిస్తూ చేసే ఉత్సవాలు దసరా ఉత్సవాలయ్యాయి. ఇక శబ్దార్థపరంగా చూస్తే ‘ద’ అంటే దానవులను, ‘సరా’ అంటే దూరం చేయునది–రాక్షసులను సంహరించి, ప్రజలకు సుఖశాంతులు అందించింది కాబట్టి ఆ ఆనందంతో దసరా వేడుకలు జరుపుకుంటున్నాం. నవరాత్రి వైశిష్ట్యం దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. అందుకనే వీటిని నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవ కాలమే నవరాత్రులు. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. రాత్రి శబ్దానికి పరమేశ్వరి అని, నవ అనే శబ్దానికి పరమేశ్వరుడనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీపరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం. నవదుర్గా అవతార రహస్యాలు నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం – అమ్మ వారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక్క అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారం చేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గ’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి. జమ్మి బంగారమే!(Jammi Chettu- Health Benefits) ఈ పండగ సమయంలో అన్నిటికన్న ముఖ్యమైంది ముళ్ళకంపలాంటి ... కొండవాలుల్లో పెరిగే శమీవృక్షపూజ. దానికి కారణం రామరావణ యుద్ధానికి ముందు రాముడు, అరణ్యవాసాన తమ ఆయుధాలను మూటకట్టి ఈ చెట్టుపై ఉంచి పాండవులు ఈ చెట్టును పూజించడం వలన ఇది విజయమిచ్చే పూజనీయ వృక్షమైంది. ఈ చెట్టుబెరడుతో చేసే కషాయం దగ్గు, ఉబ్బసం వ్యాధులను నిరోధించి ఆరోగ్యాన్ని తద్వారా శుభాల్నిస్తుంది. అధిక జీర్ణశక్తిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి చెట్టు ఎలా పనిచేస్తుందో, ఈ చెట్టు గొప్పతనమేంటో తెలియచెప్పటానికి, తెలుసుకోవటానికి జమ్మి ఆకులను పెద్దలకిచ్చి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటారు పిల్లలు. జమ్మి ఆకును తెలంగాణ ప్రాంతంలో బంగారమని పిలుస్తారు. ఈ పండుగ నాడు పెద్దలకు, పూజ్యులకు, ఆత్మీయులకు ఈ జమ్మి బంగారాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. దసరాకు ఇది మామూలే! దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్థును మామూళ్ళు అడగటం, వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటు పోసి నూతనవస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే. విజయాలకు కారకమైన దశమి విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యింది. శ్రీరాముడు రావణ సంహారం చేసింది కూడా విజయ దశమినాడే. అందుకే ఈ దసరా పర్వదినాన రామ్‌లీలా ఆడటం ఆనవాయితీ. అదేవిధంగా షిరిడీ సాయిబాబా సమాధి చెందింది కూడా దసరా నాడే. నిజానికి దశ, హర అంటే పది చెడు లక్షణాలను తొలగించుకోవడం అని అర్థం. మనిషిలో పది దుర్గుణాలే అధర్మం వైçపు నడిపిస్తున్నాయి. ఆ చెడుగుణాలపై విజయం కోసమే దసరా పండుగ చేసుకుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానుష, అహంకారాది లక్షణాలు మనుషులను దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తాయి. అవి ఇతరులకు హానిచేస్తాయి. వీటిపై విజయం సాధించడం మన ప్రథమ కర్తవ్యం. అందుకు అవకాశం కలిగిస్తూ విజయదశమి వేడుకలు జరిపించుకుంటున్న జగజ్జననికి జయము... జయము... దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు విజయ దశమినాడు రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీ కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణానదిలో హంసవాహనంపై నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి గుర్తుగా నదిలో మూడుసార్లు హంసవాహనాన్ని (తెప్పను) తిప్పుతారు. కన్నుల పండువగా సాగే ఈ తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. -డీవీఆర్ భాస్కర్ ఫొటోల సహకారం: షేక్ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి -
వీడియో: స్పెషల్ అట్రాక్షన్.. క్లాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన మహిళా ఎంపీ
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్లో సైతం అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అయితే, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్‌లోని నదియా జిల్లాలో దుర్గా పూజ ఉత్సవాల్లో మహాపంచమి వేడుకల సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డ్యాన్స్ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను టీఎంసీ ఎంపీ.. ఆమె ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీడియోకు లవ్లీ మూవ్మెంట్స్ ఫ్రమ్ మహాపంచమీ వేడుకలు అన్ని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియోలో బెంగాలీ జానపద గీతానికి టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర చేసిన డ్యాన్స్ స్టెప్స్ అందరినీ అలరించాయి. మహాపంచమి వేడుకల సందర్భంగా పాటను ఆలపిస్తూ చేసిన డ్యాన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Lovely moments from Mahapanchami celebrations in Nadia pic.twitter.com/y0mkbhGGiC — Mahua Moitra (@MahuaMoitra) September 30, 2022 -
Fashion: ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ.. కలంకారీ ప్రింట్లున్న బ్లౌజ్ సరైన ఎంపిక!
అమ్మవారి అలంకరణ రోజుకొక హంగుగా దర్శనమిస్తుంది. అమ్మవారి రూపంగా భావించే మహిళలూ ఈ వేడుకల్లో తమ ఆహార్యమూ అదిరిపోవాలనుకుంటారు. దాండియా ఆటపాటల్లో పాల్గొనడానికి ప్రతిరోజూ ప్రత్యేకమైన దుస్తుల ఎంపిక తప్పనిసరి అనుకుంటారు. అయితే, డ్రెస్ ఎంపిక కుదరడం లేదు అనుకున్నవారికి మనవైన కలంకారీ ప్రింట్లు ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నిరకాల చీర కట్టుకు సరైన ఎంపిక అవుతుంది. రూపాన్ని కళగా మార్చేస్తుంది. ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ ఏ మెటీరియల్ అయినా.. రంగులు భిన్నమైనా.. ఒక్క కలంకారీ బ్లౌజ్ తీరైన కళను తీసుకువస్తుంది. దీనికి సిల్వర్ జ్యువెలరీ సరైన ఎంపిక అవుతుంది. సాధారణ మోడల్ లేదా మోడర్న్ కట్, లాంగ్ జాకెట్ అయినా.. డిజైన్ల ఎంపికలో కలంకారీకి సాటి లేదన్నది ఈ వేడుకలో కనిపిస్తుంటుంది. కళగా ఉండాలనుకునేవారు కలంకారీ ధరిస్తే చాలు నవరాత్రుల్లో నవ్యంగా వెలిగిపోతారు. -
దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం
దేవీ శరన్నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తోంది. వేడుకల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గను, వరంగల్ భద్రకాళిదేవిని శ్రీలలితాత్రిపుర సుందరిగా అలంకరించారు. – జోగుళాంబ శక్తిపీఠం(గద్వాల జిల్లా)/ హనుమకొండ కల్చరల్/ బాసర(ముథోల్) దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. రూ.5,55,55,555.55(5 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల 55 పైసలు)ల కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్‌నగర్ -
గార్బా డ్యాన్స్‌తో అదరగొట్టిన ఎంపీ సుప్రియా సూలే.. వీడియో వైరల్
దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయ, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్ర ఇందాపూర్‌లోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి బుధవారం గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని చొగడా పాటకు ఆమె ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: తల్లి గర్భంలోనే రుచుల మక్కువ) కాగా, గుజరాత్ ప్రాంతంలో గార్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంగా ఉన్నాయి. దేవి నవరాత్రుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో సైతం వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలాఉండగా.. ముంబైలోని ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లో బుధవారం యువతీయువకులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న గార్బా నృత్యానికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్‌గా మారాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవ వేడుకలకు ముంబై ప్రసిద్ధి అని క్యాప్షన్ జత చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి) -
Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొండపై ‘శరన్నవ’ సంబరం కొనసాగుతోంది. ఒకవైపు భక్తుల కోలాహలం, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో కృష్ణా తీరం పులకిస్తోంది. దసరా ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. నాలుగు గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రార్చనలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అనధికార వీఐపీల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టి.కె. రాణా క్యూలైన్లను పలు మార్లు పరిశీలించి, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్లు లేకుండా దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించవద్దని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవ ఏర్పాట్లు అద్భుతం: స్పీకర్ తమ్మినేని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. అనంతరం మీడియాతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లు, టికెట్ల జారీ పక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండపై టికెట్లు విక్రయిస్తున్న తీరును పరిశీలించడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. టికెట్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని, రూ. 300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ మార్గాలలోనే అమ్మవారి దర్శనానికి పంపాలన్నారు. మహా మండపం మీదుగా కొండపైకి ఎవరూ రాకుండా కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పాస్ లేకుండా కార్లను కొండపైకి ఎందుకు అనుమతిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బంది లేకుండా దర్శనం: మంత్రి కొట్టు భక్తుల రద్దీ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వినాయకుడి గుడి, రథం సెంటర్, టోల్గేట్, ఓం టర్నింగ్ వద్ద మంత్రి క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వినాయకుడి నుంచి కొండపైకి చేరుకునేందుకు 30 నిమిషాలు పడుతుందని పలువురు భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్ల కౌంటర్లలో ఆన్లైన్ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, 60 వేల లడ్డూలను విక్రయించామన్నారు. ఈవో భ్రమరాంబ, స్పెషల్ ఆఫీసర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నయనమనోహరం నగరోత్సవం వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల నగరోత్సవం నయనమనోహరంగా జరిగింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం సమీపంలో ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, వేదపండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. తొలుత ఈవో భ్రమరాంబ కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
అద్దమే ఆభరణం: నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగేందుకు! ధర వంద నుంచి..
Navratri Special Jewellery: దాండియా నృత్యాల్లో మెరుపులు.. దారపు పోగుల అల్లికలో రంగుల హంగులు.. గోటాపట్టీ బ్యాంగిల్స్‌లో అద్దాలు అమరికలు.. వెండితీగల జిలుగుల్లో వెన్నెల చంద్రికలు .. నవరాత్రుల్లో అలంకరణకు ప్రత్యేకంగా నిలిచే ఆభరణాల మాలికలివి.. నవరాత్రి రోజులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. అలాగే, అతివలు కూడా అంతే అందంగా తమను తాము అలంకరించుకుంటారు. ఎరుపు, పసుపు, పచ్చలతో కాంతిమంతంగా ఉండే రంగు దుస్తులను ఎంచుకుంటారు. వీటితో పాటు అందరిలో వేడకకు తగినట్టుగా ప్రత్యేకంగా కనిపించాలంటే ఎంపిక చేసుకునే ఆభరణాల్లో స్పెషాలిటీ ఉండాలి. నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగిపోవడానికి అద్దాలతో అమర్చిన థ్రెడ్ బ్యాంగిల్స్, సిల్వర్‌తో కూర్చిన ఆఫ్ఘనీ సెట్స్, గోటాపట్టీతో చేసిన మిర్రర్ వర్క్ ఆభరణాలు సరైన ఎంపిక జాబితాలో ఉన్నాయి. వంద రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఆభరణాలను అన్ని వయసుల వారూ ధరించవచ్చు. అభిరుచిని బట్టి డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. చదవండి: Sreeleela: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్ ధర 68 వేలు! స్పెషాలిటీ ఏమిటి? Evening Sandals: ఈవెనింగ్ శాండల్స్.. నడకలో రాజసం.. పార్టీవేర్ ఫుట్‌వేర్! -
మొదలైన నవరాత్రి సంబురాలు (ఫొటోలు)
-
Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో పర్యావరణం పారా హుషార్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల వీలును బట్టి మూడు, అయిదు, ఏడు, తొమ్మిది రోజుల్లో వినాయక నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో నగరంలో పలు జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, ఇతర రసాయనాలతో చేసిన ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల భారీగా జలాశయాలకు కాలుష్య ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సే న్‌సాగర్ సహా నగరంలోని పలు చెరువుల్లో నిమజ్జనం చేయనుండడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల నీటిలో చేరి పర్యావరణ హననం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికారక రసాయనాలు, మూలకాలివే.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. హానికారక మూలకాలు: కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. జలాశయాల కాలుష్యంతో అనర్థాలు.. ►ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. ►చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. జలాల్లో అరుదుగా పెరిగే వక్షజాతులు అంతర్థానమవుతాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయాల ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. ప్రత్యామ్నాయాలివీ.. ►రంగులు, రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన గంట వ్యవధిలోనే తొలగించాలి. నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకి పూలు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథిన్ కవర్లను పడవేయరాదు. పీఓపీ విగ్రహాల సంఖ్యను ఏటా తగ్గించాలి. మట్టి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. -
రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..!
కరోనా మహమ్మారి ఇళ్ల కొనుగోలు దారుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో అఫార్డబుల్ హౌస్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడే వారు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. లెక్క ఎక్కువైనా పర్లేదు..లగ్జరీ మాత్రం మిస్ అవ్వకూడదనేలా ఆలోచిస్తున్నారని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే తెలిపింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా పలు బ్యాంకులు హోం లోన్లపై వడ్డిరేట్లతో పాటు స్టాంప్ డ్యూటీ రుసుము తగ్గించడంతో భారీ ఎత్తున ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. ముఖ్యంగా లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్లో వందల కోట్ల బిజినెస్ జరిగినట్లు మరో సర్వే సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బులతో కలల పొదరిల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు.అలాంటి పొదరిల్లును ముంబై మహా నగరంలో ఎంతమంది సొంతం చేసుకున్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ చేసింది. ఈ స్టడీలో దసరా నవరాత్రి సందర్భంగా ముంబైలో ప్రతి రోజు 400కి పైగా అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే హోంలోన్లను ఆఫర్ చేయడంతో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో రియల్టీ ఎక్స్పర్ట్స్ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సుమారు 3,205 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన స్టడీలో పేర్కొంది. ఇక ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దసరా పండుగ మధ్య కాలంలో ప్రతి రోజు 219 నుంచి 260 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్పష్టం చేసింది. ఆగస్ట్ నెలకంటే అక్టోబర్ 13 వరకు ఇళ్ల సేల్స్ 17శాతం పెరిగాయి. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో 4,052 యూనిట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ నిర్ధారించింది. దివాళీ ఫెస్టివల్ లో సైతం సేల్స్ పెరగొచ్చు ఈ సందర్భంగా ది గార్డియన్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ జాయింట్ డైరెక్టర్ రామ్ నాయక్ మాట్లాడుతూ..గత 8 రోజుల్లోనే రూ12,00కోట్ల విలువైన అపార్ట్మెంట్లను అమ్మినట్లు తెలిపారు. వాటిలో సుమారు రూ.750కోట్ల విలువైన లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్ మెంట్లు ఉన్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా ఇళ్ల సేల్స్ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం, దీపావళికి ఇళ్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల సేల్స్ పెరుగుతాయని రామ్ నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆ పెట్రోల్ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!!
పెట్రోల్, డీజిల్ ఈ రోజుల్లో చాలా ఖరీదైనవి. ప్రతిఒక్కరూ.. ఆచి తూచి జాగ్రత్తగా వాడుతున్నారు. మరి ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే మీరేం చేస్తారు? వెంటనే రెక్కలు కట్టుకునిమరీ అక్కడ వాలిపోతారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెట్రోల్ బంక్ ఓనర్ ఏకంగా మూడు రోజులపాటు వచ్చిన కస్టమర్లందరికీ ఫ్రీ పెట్రోల్ ఇచ్చాడు. తమ ఇంట ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! బేతుల్ జిల్లాకి చెందిన దీపక్ సైనాని అనే వ్యక్తి, తన చెల్లెలికి అక్టోబర్ 9న ఆడపిల్ల పుట్టింది. మేనకోడలు పుట్టిన సంబరంలో దీపక్ సైనాని పెట్రోల్ బంకుకు వచ్చిన కష్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు. దసరా నవరాత్రుల వేళ అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్ కొన్నవారికి 10 శాతం పెట్రోల్ ఫ్రీగా అందించానని స్థానిక మీడియాలు వెల్లడించాడు. కాగా గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానుంటుతున్న విషయం తెలిసిందే! ఇటువంటి సమయంలో మూడురోజుల పాటు వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందించడంతో దీపక్ సైనాని వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా ఆడపిల్ల పుడితే వెంటనే ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించే ఈ రోజుల్లో, ఇంత విలువైన బహుమతి మేకోడలికి అందించిన అతని ఉన్నతమనసును చాటిచెబుతోంది. చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..? -
రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు
భువనేశ్వర్: సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తర్వాత చిత్ర విచిత్ర ఘటనలు వైరల్‌గా మారిన వైనం చూస్తున్నాం. తాజాగా ఒడిశాలోని నబ్రంగ్పూర్ జిల్లా బిజాపుర గ్రామంలో వెలుగు చూసిన ఓ విశేషం స్థానికులనేగాక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు తలలు, మూడు కళ్లతో ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఘటన జరగడంతో స్థానికులు ఆ బుల్లి దూడను దుర్గామాత అవతారంగా కొలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: బెంగళూరులో 7గురు విద్యార్థులు అదృశ్యం..) మరోవైపు రెండు తలలు కలిగి ఉండటంతో తల్లి ఆవు నుంచి లేగదూడ పాలు తాగలేకపోతోందని వాటి యజమాని చెప్పారు. డబ్బాతో దానికి పాలు పడుతున్నామని తెలిపారు. People in the locality of Bijapara village have begun worshipping a two headed calf as #Durga Avatar After it was born with two heads and three eyes on the occasion of #Navratri to a farmer in Odisha's Nabrangpur District. #DurgaPuja @aajtak @IndiaToday pic.twitter.com/tz9i9mpJ0O — Suffian सूफ़ियान سفیان (@iamsuffian) October 12, 2021 (చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!) -
Navratri Special 2021: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ..
దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక వంటకాలతో మీ ఇంటి అథిదులకు మరింత దగ్గరవ్వండి. పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ మీ కోసం.. పనీర్ సమోసా కావలసినవి: ►మైదా పిండి – పావు కిలో ►పనీర్ తురుము – 2 కప్పులు ►వాము – అర టీ స్పూన్ ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►క్యాబేజీ, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, ►సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ ►పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ విధానం ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, పనీర్ తురుము, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరమరాల వడ కావలసిన పదార్ధాలు ►మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి) ►పెరుగు – 3 టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – పావు కప్పు ►మైదా పిండి – పావు కప్పు ►అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున ►తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్‌కి ►కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ►ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! -
హోమ్ క్రియేషన్స్: వేడుకగా పండగ కాంతులు
మహమ్మారి కారణంగా పండగల సమయాలను కుటుంబసభ్యులు మరింత సన్నిహితంగా జరుపుకోవడం పెరిగింది. అందుకు తగినట్టుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ కళ ఉట్టిపడేలా ఇంటి అలంకరణ పట్ల శ్రద్ధ తీసుకోవడమూ పెరిగింది. సాధారణ జీవనశైలి పట్ల సానుకూలంగా వ్యవహరించడం ఎలాగో అందరికీ అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ కొత్త జీవనశైలిలో కొత్త ఉత్సాహాన్ని, హుషారును నింపడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. అతి అర్భాటాలకు పోకుండా ఆనందాల ప్యాకేజీతో ఇంటిని ఎలా అలంకరించాలో చూద్దాం.. కొత్త–పాతల సమతుల్యత సంప్రదాయ వేడుకల సమయాల్లో ఇల్లు నిన్న–నేడులను సమతుల్యం చేసేదిగా ఉండాలి. నిన్నటి తరం హుందాతనం, నేటి తరపు ఆలోచనలను కళ్లకు కట్టినట్టుగా ఉండాలి. దూరంగా ఉన్నవారికి వీడియోలు, ఫొటోల ద్వారా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఇలాంటప్పుడు మీరు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అలంకరణ అంతే వేడుకగా ఉండాలి. అందుకు, ఇంటి లోపల ఏదైనా ఒక గోడ లేదా తలుపు భాగాన్ని పూలతో, దీప కాంతుల వెలుగులతో అలంకరించుకోవాలి. అలంకరణలో శిల్పకళా స్పర్శ మండపాలు, తోరణాలు పూజా అలంకరణలో ప్రధానంగా ఉంటాయి కాబట్టి పండగలు తమదైన సౌందర్యంతో వెలిగిపోతాయి. వాటికి జతగా మనవైన పసుపు, ఎరుపు ఇంద్రధనుస్సు రంగుల టేబుల్ క్లాత్‌లు, పాతవైన చెక్క, రాతి శిల్పాలు, సంప్రదాయ వాల్ ఆర్ట్, మనవైన అల్లికలు అలంకరణలో మరింత అందాన్ని తీసుకువస్తాయి. మనదైన కళ అలంకరణలో ఒక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచి తెలియజేసేలా స్టేట్మెంట్ యాక్సెసరీస్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఇండోర్ ప్లాంట్లు, రాగి, ఇత్తడి వంటి మెటాలిక్ వస్తువుల ఎంపిక, అలంకరణలో ఈ స్పష్టత సులువుగా తెలిసిపోతుంది. ఫ్లవర్ పవర్ ఇత్తడి చెంబులు, బిందెలు వంటి నిన్నటి తరం వాడుకున్న వస్తువులను తాజా పూలతో అలంకరించి, ఒక చెక్క ట్రే లేదా టేబుల్ మీద ఉంచండి. ఈ అలంకరణ ఆ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. పూల మొక్కలతో అలంకరించాలనుకుంటే మిగతా ఫర్నిషింగ్ రంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్నీ గాఢమైన రంగులవి కాకుండా లేత రంగులు ఉండేలా ఎంపిక చేయాలి. మొత్తం పూలతో కాకుండా తీగలు, ఆకుల మేళవింపుతోనూ అందాన్ని తీసుకురావచ్చు. సువాసనలతో నింపేయచ్చు గంధం, మల్లె లేదా ఇతర సువాసనలు నింపేలా గదుల అలంకరణలో జాగ్రత్త తీసుకోవాలి. తాజా పువ్వులతో పాటు తమ ప్రత్యేకత తెలిసేలా లైటింగ్, ఫ్లోర్ ల్యాంప్స్, హ్యాంగింగ్ లైట్స్, సువాసన గల కొవ్వొత్తుల కలయికతోనూ ఇంటికి, కంటికీ కళను తీసుకురావచ్చు. హస్తకళాకృతులు గృహాలంకరణలో ఎన్ని ఖరీదైన వస్తువులను తెచ్చినా, మరెన్ని హంగులు అమర్చినా మన చేత్తో తయారుచేసిన కొన్ని వస్తువులనైనా అలంకరణలో ఉపయోగిస్తే ఆ ఆనందమే వేరు. ప్రమిదల కూర్పు, గంటల సంఖ్య, పువ్వుల మాలలు, చెక్క ఫ్రేమ్స్.. పండగల సౌందర్యాన్ని మరింతగా పెంచుతాయి. శానిటైజింగ్ పాయింట్లు మహమ్మారి కాలం కాబట్టి మనవైన జాగ్రత్తలు తప్పనిసరి అనేది ఇంటిల్లిపాదికి గుర్తుచేయాలి. అందుకు, శానిటైజర్లు, మాస్కులు ఉన్న సెటప్‌ను తప్పక ఓ వైపు చేసి ఉంచాలి. ఈ జాగ్రత్తలు మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో అందరి పట్ల తీసుకున్న శ్రద్ధ స్పష్టమవుతుంది. ఇంటి అలంకరణతో పాటు పండగల వేళ మిమ్మల్ని మీరు అలంకరించుకుంటేనే సంబరం మరింత కళగా వెలిగిపోతుందనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. -
Navratri Special: ఉడిపి హయగ్రీవ మద్ది, ధార్వాడ్ పేడా స్వీట్స్ ఎలా తయారుచేయాలంటే..
దసరా నవరాత్రులు సందర్భంగా మీ అతిధులను ఈ వెరైటీ స్వీట్లతో ఆహ్వానించండి.. ఉడిపి హయగ్రీవ మద్ది కావల్సిన పదార్థాలు: ►పచ్చిశనగపప్పు – రెండు కప్పులు ►నీళ్లు – ఆరు కప్పులు ►బెల్లం – రెండు కప్పులు ►లవంగాలు – ఎనిమిది ►నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు ►జీడి పలుకులు – ఇరవైధార్వాడ్ పేడా, ఉడిపి హయగ్రీవ మద్ది ►కిస్మిస్ – నాలుగు టేబుల్ స్పూన్లు ►యాలకుల పొడి – అరటేబుల్ స్పూన ►పచ్చికొబ్బరి తురుము – కప్పు తయారీ విధానం.. ►ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి ఆరు కప్పుల నీళ్లుపోసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తరువాత నీటిని వేరు చేసి శనగపప్పుని పక్కనబెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి శనగపప్పు, బెల్లం, లవంగాలు వేసి కలపాలి. సన్నని మంటమీద బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ►స్టవ్ మీద మరో పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కిన తరువాత జీడిపప్పు కిస్మిస్లను దోరగా వేయించాలి. ►శనగపప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలిపి ఐదునిమిషాలు మగ్గనిస్తే హయగ్రీవ మద్ది రెడీ. ధార్వాడ్ పేడా కావల్సిన పదార్థాలు: ►పాలు – 4 లీటర్లు ►నిమ్మరసం – నాలుగు టేబుల్ స్పూన్లు ►నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు ►పంచదార – 12 టేబుల్ స్పూన్లు ►యాలకులపొడి – అరటేబుల్ స్పూను. తయారీ విధానం.. ►ముందుగా పాలను మీడియం మంట మీద కాయాలి. తరువాత నిమ్మరసం వేసి తిప్పితే పాలు విరిగినట్టుగా మారి నీళ్లు వేరుపడతాయి. ►నీటిని వంపేసి పన్నీర్ మిశ్రమాన్ని గుడ్డలో వేసి సాధారణ నీళ్లుపోసి వడగట్టాలి. ►పన్నీర్ మిశ్రమాన్ని సన్నని మంట మీద తేమ పోయేంత వరకు వేయించి, తరువాత నెయ్యి, టేబుల్ స్పూను పాలు, పంచదార వేసి తిప్పుతూ ఉండాలి. అడుగంటినట్టుగా ►అనిపిస్తే మధ్యలో టేబుల్ స్పూను పాలను వేసి కలుపుతూ ఉండాలి. ►పంచదార కరిగేంతవరకు సన్నని మంట మీద వేయించి, పన్నీర్ బ్రౌన్ కలర్లోకి మారాక దించేసి చల్లారాక, పొడిచేసుకోవాలి. ►ఇప్పుడు బాణలిలో ఈ పొడిని వేసి మూడు టేబుల్ స్పూన్ల పాలు పోసి ముదురు బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి, యాలకులపొడి దించేయాలి. చల్లారాక, మిశ్రమాన్ని సిలిండర్ ఆకారంలో చుట్టుకుని పంచదార అద్దితే ధార్వాడ్ పేడా రెడీ. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
Navratri Special: నోరురించే స్వీట్స్ పనియారం, ఆలూకా హల్వా తయారీ విధానం ఇలా..
దసరా పండగ వేళ.. రొటీన్‌కు కాస్త భిన్నంగా సరికొత్త, ఘుమఘుమలాడే వంటకాలను బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్లకు రుచి చూపిద్దాం... స్వీట్ పనియారం కావల్సిన పదార్థాలు: ►గోధుమ పిండి – కప్పు ►అరటిపళ్లు – రెండు ►బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►బెల్లం – అరకప్పు ►నీళ్లు – అరకప్పు ►యాలకులపొడి – అరటీస్పూను ►నెయ్యి – టీస్పూను తయారీ విధానం.. ►అరకప్పు నీటిని వేడి చేసి, దానిలో బెల్లం వేసి కరిగించి పక్కనబెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో రెండు అరటిపళ్లను తొక్కతీసి గుజ్జులా చేసుకోవాలి. ►ఇప్పుడు అరటిపండు గుజ్జులో బెల్లం సిరప్‌ను వడగట్టి పోయాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి తురుము, యాలకుల పొడి, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా, ►దోశ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవచ్చు. ►ఇప్పుడు పొంగనాలు లేదా ఇడ్లీ పాత్రకు కొద్దిగా నెయ్యిరాసి, పిండి మిశ్రమాన్ని వేసి, మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించిన తరువాత, మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికిస్తే స్వీట్ పనియారం రెడీ. ఆలూ కా హల్వా కావల్సిన పదార్థాలు: ►ఉడికించి తొక్కతీసిన బంగాళ దుంపలు – ఆరు (తురుముకోవాలి) ►నెయ్యి – అరకప్పు ►పాలు – కప్పు ►పంచదార పొడి – ఒకటిన్నర కప్పు ►యాలకుల పొడి – టీ స్పూను ►డ్రైఫూట్స్ పలుకులు – అరకప్పు తయారీ విధానం.. ►స్టవ్ మీద మందపాటి బాణలిని పెట్టి, వేడెక్కిన తరువాత కొద్దిగా నెయ్యి వేసి బంగాళ దుంపల తురుము వేసి దోరగా వేయించాలి. ►తురుము వేగాక పాలు, పంచదార పొడి వేసి కలపాలి. ►పంచదార పొడి పూర్తిగా కరిగిన తరువాత, మిగతా నెయ్యి వేసి తిప్పుతుండాలి. ►నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించి, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ పలుకులు వేస్తే పొటాటో హల్వా రెడీ. చదవండి: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. -
పేటీఎం నుంచి నవరాత్రి గోల్డ్ ఆఫర్
దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఫెస్టివల్ ఆఫర్‌ని ప్రకటించింది పేటీఎం సంస్థ. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా రూ.10,001 విలువైన బంగారాన్ని గెలుపొందే అవకాశం కల్పిస్తోంది. నవరాత్రి గోల్డ్ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుంది. బుక్ చేసుకుంటే చాలు ఈ ఫెస్టివల్ ఆఫర్‌ను పొందాలంటే గ్యాస్ బుకింగ్ సమయంలో పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ నుంచి చెల్లింపు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. క్యాష్‌బ్యాక్ పాయింట్లు పేటీఎం డిజిటల్ గోల్డ్ తో పాటుగా ప్రతీ బుకింగ్ పై యూజర్లు రూ 1,000 విలువైన క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన గిఫ్ట్ వోచర్ల కూడా రిడీమ్ చేసుకోవచ్చు రోజుకి ఐదుగురు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ వరకు సిలిండర్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఫీచర్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతోపాటు రీఫిల్స్ కు సంబంధించి ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్స్ పొందే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నవరాత్రి ఫెస్టివ్ సీజన్లో భాగంగా ప్రతి రోజూ ఐదుగురిని ఎంపిక చేసి రూ.10,001 విలువైన బంగారాన్ని అందిస్తామని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. చదవండి : షో స్టాపర్స్ బ్యూటీ హంట్ -
‘చంద్రయాన్’ పై ప్రేమతో ఓ యువతి..
సూరత్ : దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలతో సందడి వాతావరణం మొదలైంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. పిండి వంటలు, భజనలు, పూజలుతో పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్ యువతులు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటున్నారు. దేశ భక్తి పరిమళించేలా శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. వివరాలు.. సూరత్ లోని మహిళలంతా పండుగ సందర్భంగా అక్కడి మహిళలంతా టాటూలు వేసుకుంటున్నారు. ఒకరేమో చంద్రయాన్ 2 అని వేసుకుంటే, ఇంకొకరేమో మరో మహిళ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. మరొకరేమో ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ.. ఈ మధ్యనే అమలైన ట్రాఫిక్ నిబంధనలను పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పు లేదని ఆ యువతులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూ ఫోటోలు వైరల్‌గా మారాయి. -
శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
-
దసరా వేడుకలపై ఉగ్ర పంజా..?
కోల్‌కతా : దసరా వేడుకల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా మంటపాలపై ఉగ్రమూకలు దాడులతో విరుచుకుపడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురి, కూచ్‌బెహర్, అలీపుర్దూర్, సిలిగురి ప్రాంతాల్లో దాడులకు బంగ్లాదేశ్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. నలుగురు జేఎంబీ ఉగ్రవాదులు దుర్గా పూజ సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారని, అలీపుర్దూర్, జల్పాయిగురి, సిలిగురిల్లో భీకర దాడులను చేపట్టాలన్నది వీరి లక్ష్యమని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఇద్దరు జేఎంబీ ఉగ్రవాదులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లా దిన్హత ప్రాంతంలో ఉన్నారని, రెండ్రోజుల్లో మరో ఇద్దరు భారత భూభాగంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. నేపాల్ నుంచి జేఎంబీ ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలను సేకరించారని నివేదిక అంచనా వేసింది. గతంలో 2014లో బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో దుర్గా పూజ వేడుకల్లో జరిగిన పేలుడుతో రాష్ట్రంలో జేఎంబీ స్లీపర్ సెల్స్ చురుకుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. -
సర్వం శక్తిమయం
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసినదే. లోక కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన సందర్భంగా దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కూడా తెలిసినదే. విజయదశమికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు రావణుడిని వధించినది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజేనని కూడా పురాణగాథలు ఉన్నాయి. అందుకే విజయదశమి రోజున రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పన్నెండేళ్ల అరణ్యవాసం తర్వాత విరాటరాజు కొలువులో పాండవులు ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలోనే ద్రౌపదిని వేధించిన కీచకుడిని భీముడు హతమారుస్తాడు. కీచకుడి మరణవార్త విన్న దుర్యోధనుడు పాండవులు విరాటరాజు వద్ద తలదాచుకుని ఉంటారని తలచి, విరాట రాజ్యంపై దండెత్తాడు. అప్పటికి అజ్ఞాతవాసం గడువు తీరిపోతుంది. కౌరవులు ఉత్తర గోగ్రహణానికి పాల్పడినప్పుడు ఉత్తరకుమారుడి సారథిగా బృహన్నల వేషంలో వెళ్లిన అర్జునుడు, కౌరవసేనను చూసి భీతిల్లిన ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పి, జమ్మిచెట్టుపై దాచి ఉంచి ఆయుధాలను బయటకు తీస్తాడు. జమ్మిచెట్టు మీద నుంచి విజయుడనే పేరు గల అర్జునుడు ఆయుధాలను తీసిన రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి కావడంతో, ఈ రోజుకు విజయ దశమిగా పేరు వచ్చిందనే గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. విజయదశమి రోజున భారతదేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. దసరా రోజున దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు. దుర్గా ఆలయాలతో పాటు అన్ని శక్తి ఆలయాల్లోనూ శక్తి స్వరూపాలుగా తలచే గ్రామదేవతల ఆలయాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ వేడుకలు దశమి నాటితో పూర్తవుతాయి. సనాతన సంప్రదాయంలో శాక్తేయం ప్రత్యేక మతంగా ఉండేది. కొన్నిచోట్ల జంతుబలుల వంటి పద్ధతులపై ఆంక్షలు ఉన్నా, దసరా వేడుకలు చాలావరకు శాక్తేయ పద్ధతుల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవిని నవరూపాలలో ఆరాధిస్తారు. దుర్గాదేవికి గల ఈ తొమ్మిది రూపాలనే నవదుర్గలని అంటారు. ఇదేకాకుండా, అమ్మవారిని దశమహావిద్య రూపాల్లోనూ ఆరాధిస్తారు. నవదుర్గలు నవదుర్గల పేర్లు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు దుర్గా దేవిని ఈ రూపాలలో పూజిస్తారు. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయినీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిద్ధిదాప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా దుర్గాదేవికి గల ఈ తొమ్మిది నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పినట్లు ప్రతీతి. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని కొందరు నవదుర్గలను కులదైవంగా ఆరాధిస్తారు. చండీ సప్తశతిలో అమ్మవారికి మరో తొమ్మిది పేర్లు ప్రస్తావించి ఉన్నాయి. అవి: మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. అయితే, ఈ నామాలను నవదుర్గలుగా వ్యవహరించలేదు. నవదుర్గల ప్రాచీన ఆలయం మొదట గోవాలోని రేడి ప్రాంతంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన పోర్చుగీసువారు ఆలయ వ్యవహారాల్లో దాష్టీకం చలాయించడంతో పదిహేడో శతాబ్దిలో ఆ ఆలయంలోని దేవీ దేవతా మూర్తులన్నింటినీ మహారాష్ట్రలోని వెంగుర్లకు తరలించి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. శాక్తేయం చరిత్ర వేదాలలో ఎక్కడా అమ్మవారి ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. అయితే, సింధూలోయ నాగరికత కాలంలోనే ఆదిశక్తి ఆరాధన వాడుకలో ఉన్నట్లు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. సింధూలోయ నాగరికతకు చెందిన ప్రజలు శివుడిని పశుపతిగా, లింగమూర్తిగా ఆరాధించేవారు. ఆదిశక్తిని జగజ్జననిగా, లోకమాతగా ఆరాధించేవారు. ఉపనిషత్తులలో ‘ఉమ’ పేరిట అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో ఆదిశక్తిని ‘మహామాయ’గా ప్రస్తావించడం కనిపిస్తుంది. లలితా సహస్రనామం, చండీ సప్తశతి వంటి అమ్మవారి స్తోత్రాలు దాదాపు మహాభారత కాలం నాటివని చరిత్రకారుల అంచనా. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోనిది. క్రీస్తుశకం మూడో శతాబ్దం నాటికి భారత ఉపఖండంలో శాక్తేయ మతం బాగా వ్యాప్తిలో ఉండేది. త్రిపురా ఉపనిషత్తును శాక్తేయ సంప్రదాయంలోని తాంత్రిక విధి విధానాలకు మూలంగా భావిస్తారు. పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు త్రిపురా ఉపనిషత్తుకు భాష్యాన్ని రాశాడు. దేవీభాగవతం, కాళికా పురాణం వంటి ఉపపురాణాల్లో అమ్మవారి గాథలు విపులంగా ఉంటాయి. దేవీభాగవతంలోని సప్తమ స్కందాన్ని ‘దేవీగీత’గా పరిగణిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తానేనని, సరస్వతి లక్ష్మి పార్వతులు తానేనని, సూర్యచంద్రులు, నక్షత్రాలు తానేనని... సమస్త చరాచర సృష్టి తానేనని అమ్మవారు స్వయంగా వెల్లడించినట్లుగా దేవీభాగవతం చెబుతోంది. దేవీ తత్వాన్ని శ్లాఘిస్తూ, ఆదిపరాశక్తిని స్తుతిస్తూ అద్వైత మత వ్యవస్థాపకుడు ఆదిశంకరాచార్యులు ‘సౌందర్య లహరి’ని రచించారు. ‘సౌందర్యలహరి’ని శ్రీవిద్యా రహస్యాలను బోధించే మంత్రంగా, తంత్రంగా, దేవీ సౌందర్యాన్ని కీర్తించే స్తోత్రంగా, అద్భుత ఛందోవిన్యాసంతో రచించిన కావ్యంగా పరిగణిస్తారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికి కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఆదిశక్తిని ప్రధాన దైవంగా లలితా త్రిపురసుందరి రూపంలో ఆరాధించే ‘శ్రీకుల’ సంప్రదాయం ఉంది. శాక్తేయంలో ఇదొక ప్రధాన సంప్రదాయం. ఈ సంప్రదాయం పాటించేవారు శ్రీవిద్య ఆరాధన సాగిస్తుంటారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి శాక్తేయం దక్షిణాదికి కూడా విస్తరించింది. దక్షిణాదిలో కూడా ఎక్కువగా శ్రీకుల సంప్రదాయమే పాటిస్తారు. శాక్తేయంలో మరో ప్రధాన సంప్రదాయమైన ‘కాళీకుల’ సంప్రదాయం నేపాల్‌తో పాటు ఉత్తర భారత, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. కాళీకుల సంప్రదాయానికి చెందిన వారు ఎక్కువగా కాళి, చండి, దుర్గ రూపాల్లో ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఆదిశక్తి రూపాలైన దశమహావిద్యల ఆరాధన, సాధన కొనసాగిస్తుంటారు. దసరా నవరాత్రుల వంటి ప్రత్యేకమైన పర్వదినాలలో అమ్మవారికి తాంత్రిక పద్ధతుల్లో కోళ్లు, మేకలు, దున్నపోతులు వంటి జంతువులను బలి ఇస్తారు. నేపాల్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో నవరాత్రి వేడుకల్లో జంతుబలులు జరుగుతాయి. దశ మహావిద్యల ప్రశస్తి ఆదిశక్తికి గల పదిరూపాలను దశ మహావిద్యలుగా భావిస్తారు. శాక్తేయ సంప్రదాయం పాటించేవారు ఈ విద్యలను సాధన చేస్తారు. గురుముఖత మంత్రోపదేశం పొంది, నియమబద్ధంగా వీటిని సాధన చేయడం వల్ల ఇహపరాలలో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. దశ మహావిద్యలలో మొదటిది కాళి. ఏళ్ల తరబడి యోగసాధనలో సాధించలేని ఫలితాలను కాళీ సాధనతో శీఘ్రంగానే సాధించవచ్చని ప్రతీతి. కవి కాళిదాసు కాళీ సాధనతోనే గొప్ప విద్యావంతుడయ్యాడంటారు. రెండో విద్య తార. తారా ఉపాసకులలో వశిష్ట మహర్షి ప్రసిద్ధుడు. మూడవది ఛిన్నమస్త. హిరణ్యకశిపుడు వంటివారు ఛిన్నమస్త సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాలుగవది షోడశి. షోడశి ఆరాధన జ్ఞానసంపద, ఐశ్వర్య సంపద కలిగిస్తుందని ప్రతీతి. ఐదవది భువనేశ్వరి. భువనేశ్వరీ సాధన మానసిక స్థైర్యాన్ని, శాంతిని, ఐహిక ఆముష్మిక ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరవది త్రిపుర భైరవి. ఈ విద్య సాధన ద్వారా ఇహపర సౌఖ్యాలను పొందవచ్చని అంటారు. ఏడవది ధూమావతి. ధూమావతి సాధనతో దారిద్య్రబాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఎనిమిదవది బగళాముఖి. శత్రుబాధ తొలగడానికి బగళాముఖిని ఆరాధిస్తారు. పరశురాముడు బగళాముఖి సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది మాతంగి. మాతంగి సాధనతో సమస్త మనోభీష్టాలూ నెరవేరుతాయని నమ్ముతారు. పదవది కమల. భృగు మహర్షి పూజించడం వల్ల ఈ దేవతను భార్గవి అని కూడా అంటారు. కమలా సాధన వల్ల సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. దశ మహావిద్యల ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కాళీ ఆరాధన వల్ల శని గ్రహదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. గురుగ్రహ దోషం ఉన్నవారు తారా ఆరాధన చేయడం వల్ల ఫలితం పొందవచ్చు. షోడశి ఆరాధనతో బుధగ్రహ దోషాలు సమసిపోతాయి. చంద్రగ్రహ దోషం నుంచి ఉపశమనానికి భువనేశ్వరిని ఆరాధించాలి. రాహు దోష విమోచన కోసం ఛిన్నమస్తను, కేతు దోష పరిష్కారం కోసం ధూమావతిని ఆరాధించాలి. బగళాముఖి ఆరాధన వల్ల కుజదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. జాతకంలో రవిగ్రహం బలహీనంగా ఉంటే మాతంగిని ఆరాధించాలి. శుక్రగ్రహ దోషాల నుంచి ఉపశమనానికి కమలను ఆరాధించాలి. ఇక జన్మలగ్నమే దోషభూయిష్టంగా ఉంటే భైరవిని ఆరాధించడం ద్వారా ఫలితం ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. గ్రహదోషాలకు ఇతరేతర ఉపశమన పద్ధతులు ఎన్ని ఉన్నా, వాటితో పోల్చుకుంటే దశ మహావిద్యల సాధన వల్ల శీఘ్ర ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇతర మతాలపై ప్రభావం దేవీ ఆరాధన ప్రధానమైన శాక్తేయం ఇతర మతాలను కూడా ప్రభావితం చేసింది. బౌద్ధ, జైన మతాలలో శాక్తేయ తాంత్రిక పద్ధతులు కనిపిస్తాయి. ముఖ్యంగా బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందిన వారు తాంత్రిక పద్ధతుల్లో ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. సనాతన మతాలైన శైవ, వైష్ణవాలపైన కూడా శాక్తేయం గణనీయమైన ప్రభావం చూపింది. శక్తి రూపాలైన మాతృకలను బౌద్ధులు పూజించేవారు. బౌద్ధ మాతృక కుడ్యశిల్పాలు ఎల్లోరా గుహలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవి క్రీస్తుశకం ఆరు–ఏడు శతాబ్దాల మధ్యకాలం నాటివని చరిత్రకారుల అంచనా. ఈ గుహలలోనే దుర్గాదేవి సహా ఇతర దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. జైనులు శక్తిరూపాలైన విద్యాదేవతలను, శాసనదేవతలను పూజించేవారు. ఇక సిక్కుల దశమగ్రంథంలో గురు గోవింద్‌సింగ్ చాలా శాక్తేయ దేవతలను ప్రస్తావించారు. వీటిలో చండీ ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు దశ మహావిద్యల ఆలయాలు దశ మహావిద్యలకు దేశంలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం...కోల్‌కతాలోని కాళీ ఆలయాలు ప్రసిద్ధమైనవి. వీటిలో ఒకటి కాళీఘాట్ ఆలయం, మరొకటి దక్షిణకాళి ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరువలోనే కాళీ ఆలయం కూడా ఉంది. భువనేశ్వర్‌లో రక్షకాళీ ఆలయం, కటక్‌లో మహానది ఒడ్డున కాళీ ఆలయం, వరంగల్‌లోని భద్రకాళి ఆలయం ప్రసిద్ధి పొందినవే. పశ్చిమబెంగాల్లో బీర్భూమ్ జిల్లాలోని తారాపీuŠ‡ పట్టణంలో తారాదేవి ఆలయం ఉంది. హిమాచల్ రాజధాని సిమ్లాలోను, అదే రాష్ట్రంలోని నాలాగఢ్‌లోను, భవన్లోను, బహిదా బాఘ్‌లోను కూడా తారా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అల్మోరా జిల్లా ఉడాల్‌కోట్‌లోను, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ తారాదేవికి ఆలయాలు ఉన్నాయి.బెంగళూరులోని కెంపపుర ప్రాంతంలోను, చెన్నైలోని భారతీదాసన్ కాలనీలోను భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. లక్నోలోని అదిల్‌నగర్ ప్రాంతంలోను, విశాఖపట్నం జిల్లా యాతపాలెం గ్రామంలోనూ భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోను, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయానికి చేరువలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గాంవ్‌లో కూడా పాతాళభైరవి ఆలయాలు ఉన్నాయి. ఒడిశాలోని బౌ«ద్ పట్టణంలో భైరవి ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం పట్టణంలో లింగభైరవి ఆలయం ఉంది. అస్సాంలో గువాహటిలోని సుప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి చేరువలోనే ఛిన్నమస్త ఆలయం ఉంది.పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్, బంకురా పట్టణాలతో పాటు జార్ఖండ్‌లోని రాజ్రప్పలో ఛిన్నమస్తాదేవి ఆలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరులోను, ఉడిపిలోనూ ధూమావతి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని కాసర్గోడ్ జిల్లా పాలడుక్క గ్రామంలో కూడా ధూమావతి ఆలయం ఉంది.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాప్పకుళంలో బగళాముఖి ఆలయం ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ జిల్లా నల్ఖేడా గ్రామంలోను, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సమేలి గ్రామంలోను, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోను, పంజాబ్‌లోని లూధియానాలోను, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లోనూ బగళాముఖి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాంగూరులోను, మధ్యప్రదేశ్‌లోని ఝబువా పట్టణంలోను మాతంగీదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాం జిల్లా చిక్కలదిన్ని గ్రామంలోను, మహారాష్ట్రలోని థానే జిల్లా దండిపడా గ్రామంలోను, తమిళనాడులోని తిరువారూరులో త్యాగరాజ ఆలయానికి చేరువలోను కమలాదేవి ఆలయాలు ఉన్నాయి. -
అన్నం పరమాన్నం
నవరాత్రి పండుగ అంటే తొమ్మిదిరోజుల పాటు శక్తిని ఆరాధించడం. నవ అనే పదానికి తొమ్మిది అని అర్థం. తొమ్మిది రాత్రులు ఆ తల్లిని పూజించి పదో రోజు విజయ దశమి రోజున వేడుకగా, భక్తిశ్రద్ధలతో ఆచరించడం. మన అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, మనసును ఆధ్యాత్మికత వైపుకు మళ్లించమని, భగవంతుని ముందు దీపం వెలిగించి ఆ తల్లిని ప్రార్థించడం ఈ పండుగ ప్రాధాన్యత. 1. గుడాన్నప్రీత మానసా: ఈపండుగలో గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. అందుకే లలితా సహస్రంలో గుడాన్నప్రీత మానసా అని అర్చిస్తారు. 2. స్నిగ్ధౌదన ప్రియా: స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెలుపు స్వచ్ఛతకు, పరిశుభ్రతకు, నిర్మలమైన అంతరంగానికి మారుపేరు. మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే చేసే పనులు అంత స్వచ్ఛంగా ఉంటాయని పండితులు చెబుతారు. పని పట్ల నిబద్ధత, భక్తిభావం కలిగి ఉండాలని, అమ్మవారిలాగే మనం ఆచరించే కర్మలు స్వచ్ఛంగా ఉండాలని ఈ ప్రసాదం సూచిస్తుంది. అందుకే స్నిగ్ధౌదన ప్రియా అని ఆ తల్లిని అర్చిస్తారు. 3. పాయసాన్నప్రియా: పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు ఇతరులకు మధురంగా అనిపించాలి. మధురపదార్థం జిహ్వను తాకగానే మనసు ఆనంద తరంగాలలో డోలలూగుతుంది. మధురమైన సంభాషణలు పలికితే ఇతరుల మనసులు కూడా ఆనందసాగరంలో తేలియాడుతాయి. అందువల్లే ఆ తల్లి పాయసాన్నప్రియా నామం ద్వారా తియ్యని మాటలను పలుకమని బోధిస్తోంది. 4. మధుప్రీతా: మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేనె సకల వ్యాధులకు నివారణోపాయం. తేనెను స్వీకరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంతరార్థంతో ఆ తల్లిని మధుప్రీతా అని అర్చిస్తాం. 5. దద్ధ్యన్నాసక్త హృదయా: దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. పాలను కాచి, తోడు వేస్తే కాని పెరుగు లభించదు. పెరుగుకు అన్నం జోడించి తయారుచేసేదే దద్ధ్యోదనం. కార్యంలో విజయం సులువుగా లభించదని, లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల, దీక్ష అవసరమని ఈ నైవేద్యం ద్వారా ఆ తల్లి చెబుతోంది. ఎంతో కొంత శ్రమకోర్చితేనే పెరుగు లభిస్తుంది. కాని సాధించిన తర్వాత లభించే రుచి వర్ణనాతీతం అని ఈ మంత్రం తెలియచేస్తోంది. 6. ముద్గౌదనాసక్త హృదయా: ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. నిత్యం గుప్పెడు పెసలు తింటే ఆరోగ్యం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈ పదార్థాలను తిని ఆరోగ్యంగా జీవించమని ఆ తల్లి చెబుతోంది. అందుకే ఆమెను ముద్గౌదనాసక్త హృదయా అని ఆరాధిస్తున్నాం 7. హరిద్రాన్నైక రసికా: హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం. పసుపు శుభానికి సూచిక. సర్వ సూక్ష్మజీవులను హరించే శక్తి కలిగి ఉన్న పదార్థం. పసుపుతో తయారయిన అన్నం కడుపులోని అనారోగ్యాలను దూరం చేస్తుందని అంతరార్థం. ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న + ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. 8. సర్వౌదనప్రీతచిత్తా: సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. ఆశ్వీయుజ మాసంలో వరి పంట ఇంటికి చేరుతుంది. కాయగూరలు తాజాగా ఉంటాయి. కొత్తబియ్యం, కొత్త బెల్లం, ఆవు పాడి... వీటితో ఈ తొమ్మిదినాళ్లు తొమ్మిది రకాల నైవేద్యాలను నివేదన చేస్తారు. లలితా సహస్రంలో నైవేద్యాలు లలితా సహస్రంలో చెప్పిన ఈ నైవేద్యాలన్నీ అతి సులువుగా జీర్ణమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నవరాత్రులలో చాలామంది ఏకభుక్తం ఉంటారు. ఆ ఒక్కపూట కూడా సులువుగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే స్వీకరిస్తారు. అలా ఆ తల్లిని తొమ్మిది రోజులు ధ్యానించి, తేలికపాటి నైవేద్యాలను ఆ శక్తికి నివేదించి, స్వీకరించి ఆరోగ్యాన్ని వరంగా పొందాలన్నదే ఈ నామాల పరమార్థం అని పండితులు చెబుతున్నారు. -
ఉపవాసం చేసే వారికోసం ప్రత్యేక ఆహారం
న్యూఢిల్లీ: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న రైలు ప్రయాణికుల కోసం ‘వ్రత్ కా ఖానా’ పేరిట కొత్త మెనూ సిద్ధంచేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్(ఐఆర్సీటీసీ) తెలిపింది. సాత్వికాహారం అయిన సగ్గుబియ్యం, సైంధవ లవణం, కూరగాయాలతో తయారుచేసిన ఆహారపదార్ధాలను రైల్వే మెనూలో అక్టోబర్ 10 నుంచి 18వ తేదీవరకు రైళ్లలో అందిస్తామని ఐఆర్సీటీసీ వెల్లడించింది. రైళ్లో భోజనం కోసం ఉపవాస దీక్షలో ఉన్న వారు ఇబ్బందిపడకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అని తెలిపింది. సగ్గుబియ్యం కిచిడి, లస్సీ, తాలి, ఫ్రూట్ చాట్స్‌లనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. జర్నీ మొదలవడానికి రెండు గంటలముందుగా పీఎన్ఆర్ నంబర్ సాయంతో కొత్త మెనూలోని ఆయా ఆహారపదార్ధాలను ఠీఠీఠీ.్ఛఛ్చ్టి్ఛటజీnజ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn ద్వారా ఆర్డర్ చేయొచ్చని తెలిపింది. -
దాండియా.. దిల్ దియా
-
నవరాత్రి ఉత్సవాల్లో భక్తి కాదు రక్తి
-
ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియో పోస్ట్ చేశారు. శరన్నవరాత్రిలోని తొలి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారికి చెందిన వీడియో పోస్ట్ చేశారు. దీంతోపాటు మణిపూర్ వాసులకు ‘మేరా చారేన్ హుబా’ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై స్పెషల్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ మొదలైంది. కంపెనీలన్నీ వరుసబెట్టి తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలైతే ఏకంగా భారీ భారీ డిస్కౌంట్లతో మెగా సేల్స్‌కు తెరలేపాయి. తాజాగా స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా 'నవ్రాత్ర స్పెషల్ ఆఫర్' ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తన గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై ధరను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరను 4వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.57,900 ఉన్న గెలాక్సీ ఎస్8, 53,990 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 64,900 రూపాయలున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ఇక 60,990 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకైతే మరో 4000 రూపాయలను అదనంగా క్యాష్‌బ్యాక్ కింద అందిస్తుంది. అంటే మొత్తంగా 8వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు తెలిసింది. అయితే ఈ తగ్గించిన ధరలు ఇంకా కంపెనీ సొంత ఆన్లైన్ స్టోర్‌లో అప్డేట్ కాకపోవడం గమనార్హం. ఈ ఫోన్లు ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ అయిన తర్వాత చేపట్టిన ఈ కోత, అత్యంత ముఖ్యమైన ధర తగ్గింపుగా కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్ వేరియంట్‌కు రెండు భిన్నమైన విధానాల్లో ధరల తగ్గింపు శాంసంగ్ చేపట్టింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై కేవలం రూ.1000 ధర మాత్రమే తగ్గించి, 64,900 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరల తగ్గింపు ఫెస్టివ్ సీజన్‌కు కాస్త ముందుగా కంపెనీ చేపట్టింది. అంతేకాక త్వరలోనే శాంసంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ నోట్ 8 మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ గతవారమే భారత్‌లో విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్21 నుంచి సరుకు రవాణా అవుతోంది. గెలాక్సీ నోట్ 8 ధర 67,900 రూపాయలు. -
జియో కస్టమర్లకు దసరా సంబరాలు
ముంబై: సంచలన రిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ నవరాత్రికి కస్టమర్లను మురిపించనుంది. జియో వినియోగదారులు తన మొదటి ఫీచర్‌ఫోన్‌తో ఈ ఏడాది దసరా సంబరాలను జరుపుకునేలా ప్లాన్ చేసింది. ప్రీ బుకింగ్ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మరోగుడ్ న్యూస్ ఏమిటంటే. త్వరలోనే కొత్త ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో ఫోన్ కోసం ఆగస్టు 24 న ముందస్తు బుకింగ్ మొదలుకాగా కేవలం మూడు గంల్లోనే సుమారు 60 లక్షల యూనిట్ల జయో ఫీచర్ ఫోన్లు బుక్ అయ్యాయి. దీంతో బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే వినియోగదారుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ పునఃప్రారంభించనుందని, ఈ సమాచారాన్ని కస్టమర్లకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ప్రాధాన్యత ఆధారంగా వీటిని అందించనుంది. కాగా జూలై 21, 2017 న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
శ్రీశైలంలో ముగిసిన ఉత్సవాలు
దక్షిణ కాశీగా పిలుచుకునే శ్రీశైల క్షేత్రంలో మంగళవారంతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శరన్నవరాత్రులు ముగియటంతో దసరా పర్వదినాన భ్రమరాంబికా దేవి భక్తులకు నిజాలంకరణతో దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా అమ్మవార్లు నంది వాహనం పై ఆలయ ప్రదక్షిణ చేస్తారు. -
అమ్మవు నీవే... అఖిల జగాలకు!
దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రతీక దసరా. స్త్రీశక్తి విజయానికి నిలువెత్తు నిదర్శనం దసరా. దేశవ్యాప్తంగా ఊరూవాడా ఏకమై ఉమ్మడిగా జరుపుకొనే వేడుక దసరా. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని జనమంతా భక్తితో ఆరాధించే పండుగ దసరా. దుర్గతులను దూరం చేసే దుర్గమ్మను నవరాత్రులలో పూజించే వేడుక దసరా. మన దేశంలో నలుమూలలా దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోల్‌కతా, మైసూరు వంటి నగరాలలో దసరా నవరాత్రి వేడుకలు అమిత వైభవంగా జరుగుతాయి. దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో తాత్కాలికంగా వెలిసే దుర్గామాత మంటపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతాయి. శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు ప్రత్యేకపూజలతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. దసరా వేడుకలు భారత్‌కు మాత్రమే కాదు, పొరుగునే ఉన్న నేపాల్, శ్రీలంకలలో కూడా దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. తొలిసారిగా చైనా సందడి కోల్‌కతా దసరా వేడుకలపై ఈసారి చైనా ఆసక్తి ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని చైనా కాన్సులేట్ అధికారులు, సిబ్బంది ‘ఇంపాక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. చైనా ప్రతినిధులు అధికారికంగా దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. ‘ఇంపాక్ట్’ ప్రతినిధులతో కలసి చైనా కాన్సులేట్ అధికారులు కోల్‌కతా నగరంలో వెలసిన దుర్గామాత మంటపాలను నవరాత్రులలో పంచమి నాటి నుంచి... అంటే అక్టోబర్ 6 నుంచి సందర్శించనున్నారు. భద్రత, అలంకరణ వంటి వివిధ అంశాల్లో మేటిగా నిలిచిన పది ఉత్తమ మంటపాల ఫలితాలను దసరా ముందు రోజు ప్రకటించనున్నారు. ఉత్తమ మంటపాల నిర్వాహకులకు ఎలాంటి నగదు బహుమతులు చెల్లించరు గాని, వారికి ఉచితంగా చైనాను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు కోల్‌కతాలోని చైనా కాన్సుల్ జనరల్ మా ఝాన్వు ప్రకటించారు. మైసూరులో మహారాజ వైభోగంగా... మైసూరులో దసరా వేడుకలు మహారాజ వైభోగంగా జరుగుతాయి. ఏనుగుల ఊరేగింపు, ఊరేగింపులో జానపద కళాకారుల ప్రదర్శనల సందడిని చూసి తీరాల్సిందే. మైసూరులో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించే సంప్రదాయం పదిహేనో శతాబ్దిలో విజయనగర రాజుల కాలం నుంచే మొదలైంది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక వడయార్ రాజ వంశీకులు దసరా వేడుకలకు పునర్వైభవం తీసుకొచ్చారు. వడయార్ రాజులు పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో ఈ వేడుకలను శ్రీరంగపట్నంలో నిర్వహించేవారు. మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో 1805 సంవత్సరం నుంచి మైసూరులో దసరా వేడుకల నిర్వహణ ప్రారంభమైంది. నవరాత్రుల సందర్భంగా చాముండీ హిల్స్ ప్రాంతంలోని మైసూరు ప్యాలెస్‌లో వడయార్ రాజులు దర్బార్ నిర్వహించే ఆనవాయితీ కూడా అప్పటి నుంచే మొదలైంది. ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. నవరాత్రులలో మైసూరు ప్యాలెస్ విద్యుద్దీపకాంతులతో ధగధగలాడుతూ దేదీప్యమానంగా మెరిసిపోతుంది. నవరాత్రుల సందర్భంగా వడయార్ రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన స్వర్ణమంటపంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున మైసూరు ప్యాలెస్ నుంచి ఏనుగులతో సకల రాజ లాంఛనాలతో జరిగే దసరా ఊరేగింపులో లక్షలాది మంది జనం ఉత్సాహంగా పాల్గొంటారు. ఊరేగింపును తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలి వస్తారు. ఈ ఊరేగింపు మైసూరు వీధుల గుండా సాగి, పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసే ‘బన్నిమంటపం’ వరకు సాగుతుంది. జమ్మిని కన్నడంలో ‘బన్ని’ అంటారు అందుకే ఈ మంటపాన్ని ‘బన్నిమంటపం’ అంటారు. ఏనుగులతో భారీ స్థాయిలో సాగే ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని అప్పట్లో బ్రిటిషర్లు ‘జంబో సవారీ’అనేవారు. ఇప్పటికీ ఆ పేరే వాడుకలో ఉంది. పదవ చామరాజ వడయార్ హయాంలో 1880 నుంచి నవరాత్రుల సందర్భంగా దసరా ప్రదర్శన ఏర్పాటు చేసే ఆనవాయితీ మొదలైంది. ప్రస్తుతం దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాజవంశీకులు నిర్వహిస్తూ వస్తున్నా, 1981 నుంచి ప్రదర్శన బాధ్యతలను మాత్రం కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీ నిర్వహిస్తూ వస్తోంది. దసరా నవరాత్రి వేడుకల్లో మైసూరులోని ఆడిటోరియమ్స్ అన్నీ సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక నవరాత్రుల సందర్భంగా జరిగే కుస్తీపోటీలు మైసూరు వేడుకలకే ప్రత్యేక ఆకర్షణ. మైసూరుతో పాటు కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరి, గోకర్ణలోని భద్రకర్ణిక, బప్పనాడులో దుర్గాపరమేశ్వరి, కడియాలిలోని మహిష మర్దిని వంటి శక్తి ఆలయాల్లోనూ దసరా వేడుకలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. శివమొగ్గలోనైతే దసరా వేడుకలు దాదాపు మైసూరు వేడుకలనే తలపిస్తాయి. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ చలనచిత్రోత్సవాలను కూడా నిర్వహించడం విశేషం. నలుదిశలా నవరాత్రులు దసరా వేడుకలు అనగానే చప్పున స్ఫురించే పేర్లు కోల్‌కతా, మైసూరే అయినా మన దేశంలో నలుదిశలా దసరా నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ముఖ్యంగా శక్తి ఆరాధన ఎక్కువగా ఉండే తూర్పు, ఉత్తర భారత ప్రాంతాల్లో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోవాలంటే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. దసరా రోజున కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవికి, ఆలంపురంలోని జోగులాంబా దేవికి కూడా ఘనంగా నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. తెలంగాణలో జరిగే నవరాత్రి వేడుకలకు బతుకమ్మ సంబరాలు మరింత వన్నె తెస్తాయి. రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, కొలువుదీర్చి మహిళలంతా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తెలంగాణలో వయసులో చిన్నవారు పెద్దల చేతికి జమ్మి ఆకులను ఇచ్చి, వారి ఆశీస్సులు అందుకుంటారు. ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా దసరా వేడుకల కోలాహలం కనిపిస్తుంది. నగరాల్లోను, పట్టణాల్లోను అడుగడుగునా దేవీ మంటపాలు దర్శనమిస్తాయి. కటక్‌లో చండీ, జాజ్పూర్లో బిరజా, పూరీలో బిమలా, గంజాం జిల్లాలోని తరాతరిణి తదితర శక్తి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. తమిళనాడు, కేరళలలో దసరా నవరాత్రులలోని తొమ్మిదోరోజు సరస్వతీ పూజ చేస్తారు. విజయ దశమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువుల్లో రాణిస్తారనే నమ్మకం ఆ రాష్ట్రాల్లో ఉంది. కొట్టాయంలోని సరస్వతీ ఆలయంలో విజయదశమి నాడు వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌కు చేరువలో ఉండే జార్ఖండ్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా దసరా వేడుకలు దాదాపు ఇదే తీరులో జరుగుతాయి. అసోంలోని కామాక్షీ శక్తిపీఠంలో జరిగే నవరాత్రి వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలో తునికాకు చెట్లను పూజిస్తారు. తెలంగాణలో పెద్దలకు జమ్మి ఆకులిచ్చి ఆశీస్సులు పొందే ఆచారం ఉన్నట్లే, మహారాష్ట్రలో పెద్దలకు తునికాకులు ఇచ్చి, ఆశీస్సులు పొందే ఆచారం ఉంది. ఉత్తరాదిలో రైతుల పండుగ దసరా నవరాత్రులను ఉత్తరాదిలో వ్యవసాయదారుల పండుగగా జరుపుకొంటారు. నవరాత్రుల తొలిరోజున స్థానికంగా పండే గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల విత్తులను మట్టికుండీలో నాటుతారు. దసరా నాటికి విత్తనాలు మొలకలెత్తుతాయి. మొలకలతో ఉన్న కుండీలను దసరా రోజున నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బీహార్ ప్రాంతాల్లో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావ్ ప్రాంతంలో రంగస్థల సంప్రదాయాల ప్రకారం ‘రామ్‌లీలా’ వేడుకను ప్రదర్శిస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో దసరా వేడుకలు కొంత విలక్షణంగా జరుగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో విజయదశమి నాటితో నవరాత్రి వేడుకలకు ముగింపు పలికితే, కులు ప్రాంతంలో మాత్రం విజయదశమి నాటి నుంచే ఈ వేడుకలు మొదలై వారం రోజుల పాటు జరుగుతాయి. రావణుడిని రాముడు విజయదశమి రోజున సంహరించడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఊరూరా కూడళ్లలో భారీ పరిమాణంలో తయారు చేసే రావణ, కుంభకర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మలను తగులబెడతారు. బీహార్‌లోని మైథిలీ ప్రజలు నవదుర్గా పూజలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మహాలయ అమావాస్యకు ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఊరూరా దుర్గాదేవి మంటపాలతో పాటు రకరకాల ప్రదర్శనలు ఏర్పాటవుతాయి. గుజరాత్లో దసరా నవరాత్రి వేడుకల్లో దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే దసరా నవరాత్రి వేడుకల్లో భిన్నసంస్కృతులు ప్రతిఫలిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో దసరా వేడుకల నిర్వహణలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ, ప్రతిచోటా ఈ సందర్భంగా ఆయుధపూజలు నిర్వహిస్తారు. ఇళ్లలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో వాడుకునే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు. విదేశాల్లో విజయదశమి భారత్‌లోనే కాకుండా చాలా ఇతర దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పొరుగునే ఉన్న నేపాల్‌లోని శక్తి క్షేత్రాల్లో అత్యంత సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలను నిర్వహిస్తారు. దసరాను నేపాలీలు ‘దసైన్’గా పిలుచుకుంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ భారతీయులు జకార్తా, టాంగెరాంగ్లలో నిర్మించిన దుర్గాదేవి ఆలయాల్లో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మలేసియా, సింగపూర్లలో బెంగాలీ సంఘాలు ఈ సందర్భంగా దుర్గాదేవి పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు పలుచోట్ల నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా పద్మానదిలో పడవ పందేలను కూడా నిర్వహిస్తారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ బెంగాలీలు, అస్సామీలు దాదాపు యాభయ్యేళ్లుగా అక్కడ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు కొన్ని దశాబ్దాలుగా దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలోని భారతీయులు 2004 నుంచి షాంఘై నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించారు. శరన్నవరాత్రుల పుట్టుపూర్వోత్తరాలు దసరా నవరాత్రులను శరదృతువు ప్రారంభంలో వచ్చే ఆశ్వియుజమాసంలో జరుపుకోవడం వల్ల వీటిని శరన్నవరాత్రులని కూడా అంటారు. నిజానికి దుర్గాదేవిని చైత్రమాసం ప్రారంభంలో వచ్చే వసంత నవరాత్రుల్లో ఆరాధించడమే సరైన పద్ధతి అని, ఆశ్వియుజంలో ఈ దుర్గాదేవిని పూజించడమంటే, అకాలంలో అమ్మవారిని మేల్కొల్పడమేనని బెంగాలీల్లో కొందరు నమ్ముతారు. దీనినే వారు ‘అకాల్ బోధొన్’ అంటారు. రామాయణ కాలానికి ముందు వసంత నవరాత్రులలోనే అమ్మవారిని ఆరాధించేవారట. రావణుడితో యుద్ధం జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరాముడు ఆశ్వియుజ మాసంలో చండీహోమాన్ని నిర్వహించి, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొంది రావణుడిని సంహరించాడని ప్రతీతి. అప్పటి నుంచే శరన్నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం మొదలైందని చెబుతారు. ఇక చరిత్రను పరిశీలిస్తే, దుర్గాదేవి ఆరాధన మధ్యయుగాల నాటికే దేశం నలుమూలలా జరుపుకొనేవారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరశురామేశ్వర ఆలయంలో లభించిన క్రీస్తుశకం ఆరోశతాబ్ది నాటి శిల్పం ద్వారా అప్పట్లోనే దుర్గాదేవి నవరాత్రులు వైభవోపేతంగా జరిగేవని తెలుస్తోంది. అప్పట్లో పలు శివాలయాల్లో దేవీ నవరాత్రులు జరిగేవి. తొలినాళ్లలో ఈ వేడుకలు ఆలయాలకు, రాజప్రాసాదాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కాలక్రమంలో సామాన్యులు సామూహికంగా ఊరూరా దసరా నవరాత్రులను జరుపుకోవడం మొదలైంది. కవర్‌స్టోరీ: పన్యాల జగన్నాథదాసు -
రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం. దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. నివేదన: కట్టెపొంగలి, దద్యోదనం శ్లోకం: దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా! భావం: వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను స్ఫటికమాలను ధరించి జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ! అర్చన, సందర్శన ఫలమ్: ఉన్నతవిద్య, విశేషజ్ఞాన సంపదలు చేకూరతాయి. - దేశపతి అనంత శర్మ -
ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శనివారం నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. 'పవిత్ర నవరాత్రి ప్రారంభమైన సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు' అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. దుర్గామాతను ఆరాధిస్తూ ఈ నవరాత్రి పండుగను జరుపుకుంటారు. नवरात्रि की हार्दिक शुभकामनाएं। My greetings to everyone as the auspicious Navratri commences. — Narendra Modi (@narendramodi) October 1, 2016 -
గణపతీ.. ఇదేమి దుస్థితి
నిమజ్జనానికి నీరు కరువు మూడేళ్లుగా ఇదే పరిస్థితి గంగమ్మ కోసం గ్రామస్తుల ఎదురుచూపు ఈ వి‘చిత్రం’ చూశారా..! ఈ విగ్రహాలను చూస్తుంటే వినాయక చవితి ఉత్సవాల కోసం తయారు చేసి అమ్మకం కోసం పెట్టినట్టు కనిపిస్తోంది కదూ.. కానీ ఇది నిజం కాదు. ఇవి ఇప్పటికే నవరాత్రుల పాటు పూజలందుకున్న విగ్రహాలే. లింగాల ఘణపురం మండల కేంద్రంలోని చెరువులో నీళ్లు లేక ఇలా మట్టిలోనే వదిలేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా ఇక్కడ మాత్రం చుక్కనీరు పడలేదు. ఈ ఒక్క ఏడాదే కాదు.. గత మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎటూ చూసిన కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో సైతం ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వీధివీధినా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను ఇలా చెరువులో వదిలేసిన భక్తులు గంగమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. -
మట్టి విగ్రహాలను పూజించాలని ఇంటింటా ప్రచారం
నంగునూరు:వినాయకుని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారం నిర్వహిస్తూ తండా విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా మట్టి విగ్రహాలను తయారు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. బద్దిపడగ మధిర జేపి తండా పాఠశాల హెచ్ఎం సంగు రామకృష్ణ సూచనల మేరకు స్కూల్ విద్యార్థులు ఏటా మట్టి వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తూ అక్కడే ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది. తాజాగా పాఠశాల విద్యార్థులు బానోత్ అరుణ్, మాలోత్ రాంచరణ్, లౌడ్య చరణ్, బుక్యా అంజలి, బానోత్ అరుణ చెరువులో నుంచి మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో సోమవారం మట్టి వినాయకుని విగ్రహాన్ని నెలకొల్పి నవరాత్రులు ముగియగానే నిమజ్జనం చేస్తామన్నారు. రంగురంగుల విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి చెరువులో నిమజ్జనం చేయడం వలన నీరంతా కలుషితం కావడమే కాక, మట్టితో చెరువు పూడుకుపోతుందన్నారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
రాజన్న సన్నిధిలో నవరాత్రోత్సవాలు ప్రారంభం
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఈ నెల 15న శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజ అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామి వార్లకు పుణ్యహావచనం, రుత్విక్‌హరణం, పంచోపనిషత్, మహాభిషేకం నిర్వహించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి త్రిరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తుల రథోత్సవం ఉంటుంది. రాజన్న సన్నిధిలో జరిగే రాములోరి పెళ్లికి వేలాది మంది శివపార్వతులు తరలివచ్చి రాజన్నను కల్యాణమాడటం ఇక్కడి విశేషం. -
శ్రీశైలంలో వైభవంగా ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
-
దేశ దేశాల్లో దసరా
దుర్గాదేవిని ఆరాధించే దసరా పండుగ భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. హిందువుల జనాభా గణనీయంగా ఉండే నేపాల్, భూటాన్, మారిషస్, మలేసియా, ఇండోనేసియా, కంబోడియా వంటి దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఏటా ఘనంగా జరుగుతాయి. మన పొరుగునే ఉన్న నేపాల్‌లోనైతే దసరా నవరాత్రులే అతిపెద్ద వేడుకలు. నేపాల్‌లో ఈ వేడుకలను ‘దశైన్’ అంటారు. నవరాత్రి వేడుకలను నేపాలీలు దాదాపు మనలానే జరుపుకుంటారు. అయితే, వారికి కొన్ని విలక్షణమైనా ఆచారాలూ ఉన్నాయి. చివరి రోజైన దశమి నాడు వయసులో చిన్నవాళ్లంతా తప్పనిసరిగా పెద్దలను కలుసుకుంటారు. పెద్దలు వారి నుదుట తిలకం దిద్ది, ‘ఝమరా’ (ఒకరకం గరిక) ఆకులను వారి చేతికి ఇచ్చి, ఆశీస్సులు అందజేస్తారు. ఈ ఆకులనే చెవిలో ధరిస్తారు. నేపాల్‌లోని శక్తి ఆలయాల్లో నవరాత్రుల సందర్భంగా తాంత్రిక పూజలూ, జంతుబలులూ జరుగుతాయి. నేపాల్‌తో పోల్చుకుంటే, భూటాన్‌లో హిందువుల సంఖ్య తక్కువే అయినా, అక్కడ కూడా దసరా నవరాత్రులు ఘనంగానే జరుగుతాయి. ఈ వేడుకల్లో అన్ని వర్గాల వారు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొంటారు. మారిషస్, మలేసియా, కంబోడియా దేశాలలోనూ అక్కడి హిందువులు దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకొంటారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, పాటల పోటీలు వంటివి కూడా ఏర్పాటవుతాయి. ఇండోనేసియాలోని బాలి దీవిలో ఆలయాలన్నీ నవరాత్రి వేడుకల్లో భక్తుల సందడితో కళకళలాడుతాయి. ఈ ఇరుగు పొరుగు దేశాల్లోనే కాదు, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి సుదూర పాశ్చాత్య దేశాల్లోనూ అక్కడ స్థిరపడ్డ హిందువులు నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. -
సూర్యప్రభపై సప్తగిరీశుడు
-
దేదీప్యమానం
తిరుమల: ఏడుకొండల వెంకన్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నా యి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య భాస్కరునిపై తిరునామాల వేంకటనాథుడు బద్రీనారాయణుడి రూపంలో స్వర్ణకాంతులీనుతూ భక్తుల ను కటాక్షించారు. తర్వాత సాయంత్ర వేళలో ఆలయంలో వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో చల్లటి చలిగాలులతో కూడిన మంగళధ్వనుల, పండితుల వేద ఘోషలో చల్లనయ్య నవనీత చోరుడి రూపంలో శ్వేత వర్ణ కలువ పువ్వుల అలంకరణలో భక్తలోకానికి తన దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు వాహన సేవల్లో భక్తుల సందడి తగ్గింది. బుధవారం స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. ఇక వాహన సేవల్లో కళాకారులు, వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళాకారులు అభినయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంతోపాటు ఫల, పుష్పప్రదర్శనాలోని పుష్ప, విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి స్వర్ణ రథోత్సవానికి సర్వం సిద్ధం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి బంగారు రథోత్సవానికి టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగా తేరును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టీటీడీ చీఫ్ ఇంజినీరు చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో తొలుత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఆలయ ఇంజినీర్లు రథచక్రాలను పరీక్షించి అన్నీ సవ్యంగా ఉన్నాయని తేల్చారు. రేపటి చక్రస్నానం కోసం ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నీటిని వందశాతం క్లోరినేషన్ చేశారు. ప్రత్యేకంగా ఇనుప చైన్‌లింక్ కంచెలు నిర్మించారు. వరాహస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వారుకు పుణ్యస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక చక్రస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని అర్చకులు, అధికారులు తెలిపారు. -
ఏలురులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
నవరాత్రి ఉత్సవాల్లో కరిష్మాకపూర్ ప్రత్యేక ఆకర్షణ
-
వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
-
నవరాత్రి వేడుకల్లో నయా జోష్
-
స్త్రీ..అమ్మకు రూపం అమ్మవారికి ప్రతిరూపం
-
నవరాత్రి సంబరాలు
-
4గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దుర్గగుడిలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది రూ. 1000 పలికిన టికెట్ ధర ఈ ఏడాది రూ. 3000కు చేరుకుంది. అయినా భక్తుల స్పందన ఏమాత్రం తగ్గలేదు. దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అలంకారాల రోజుల్లో కుంకుమార్చన పూజలు ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజల కోసం ఆలయ కమిటీ జారీ చేసి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టికెట్ల అమ్మకం ప్రారంభించిన నాలుగు గంటల లోపే నాలుగు రోజుల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూలా నక్షత్రం రోజు టికెట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లు అయిపోయాయని అధికారులు చెబుతుండటంతో సాధారణ యాత్రికులు విస్మయం చెందుతున్నారు. ఉన్న టిక్కెట్లన్నీ ఆలయానికి చెందిన వారు, వివిధ శాఖల అధికారులు సిఫార్సు చేయించిన వారికే ఆలయ సిబ్బంది విక్రయించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
సింపోలో నవరాత్రి ఉత్సవ్’
-
నగరానికి ఉత్సవశోభ..!
సాక్షి ముంబై: నగరంతోపాటు శివారు ప్రాంతాలు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ముంబై, ఠాణేలో వివిధ సంప్రదాయాల్లో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా.. గుజరాతీయులు ప్రత్యేక పూజల తోపాటు దాండియా ఆటలు ఆడుతూ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు బతుకమ్మ పాటలతో మార్మోగుతున్నాయి. ఇలా ఎవరి సంప్రదాయానికి అనుగుణంగా వారు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటుండడంతో ప్రతి పల్లె, పట్టణం, నగరంలో ఉత్సవశోభ కనిపిస్తోంది. తెలుగువారి బతుకమ్మ... దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు వేడుకలను వేదికలుగా చేసుకుంటున్నారు. దసరాకు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు వారు జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ వేడుకల్లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. రంగురంగుల పూలను పేర్చి, రూపొందించిన బతుకమ్మలను ఇంటిముందున్న వాకిట్లో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ మహిళలు తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ ఆడతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని భారీఎత్తున జరుపుకుంటారు. బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజలు తమ పరిసరాల్లో బతుకమ్మ పండుగలను జరుపుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో చివరి రోజు మాత్రమే బతుకమ్మలను ఆడుతున్నప్పటికీ వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మను ఆడుతున్నారు. కిటకిటలాడుతున్న దేవీమాత ఆలయాలు... దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్ష్మీదేవి తదితర దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం ముందునుంచే ఆలయాయాలను విద్యుత్ దీపాలతోపాటు రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాచీనమైన ఆలయాలున్నాయి. వీటిలో శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. వీటిలో ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహా లక్ష్మి, నాందేడ్ జిల్లా మావూర్లోని రేణుకా దేవీమాతా, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవీమాతా ఆలయాలున్నాయి. ఇక ముంబైలోని మహాలక్ష్మి, ముంబ్రాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి తదితర ఆలయాలు కూడా నవరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఈ ఆలయాలన్నీ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తొమ్మిదిరోజులపాటు భారీ ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా భద్రతతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు పూర్తిచేశారు. -
నవరాత్రుల్లో...వెలుగుపూల కోలాటం
దేశమంతా ఎదురుచూసే నవరాత్రి సంబరాలు నేటి నుంచే మొదలు. ఈ తొమ్మిది రాత్రులను అత్యంత వైభవంగా మార్చేసి, శక్తిస్వరూపిణి అయిన దుర్గామాతను నృత్యోల్లాసాలతో కొలవడానికి స్త్రీలతో పాటూ పురుషులూ పోటీపడుతుంటారు. ఈ సందర్భంగా గర్బా, దాండియా నృత్యాలుపత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే వీటికి మరింత వన్నెలద్దుతున్నవి వస్త్రాలంకరణలే! గుజరాతీల సంప్రదాయ వైభవం తెలుగురాష్ట్రాలలోనూ సందడి చేయడంతో ఇక్కడా గర్బా, దాండియా నృత్యాల ఆనందహేల ప్రతి మదిని తట్టి లేపుతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగుల్లో మరింత దేదీప్యమానంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయే స్త్రీ, పురుషులు ఈ తొమ్మిది రాత్రులకు కొత్త భాష్యం చెప్పనున్నారు. దాండియా, గ ర్బా నృత్యాలలో సందడి చేయడానికి మీ వేషధారణను సరికొత్తగా మార్చుకునే సమయం ఇదే! గర్బా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ‘గర్భ’, ‘దీపం’ అనే సంస్కృత పదాల నుంచి ఈ పేరు పుట్టింది. గర్బా పాటలలో శ్రీకృష్ణుడి లీలను కీర్తిస్తూ, తొమ్మిది మంది దేవతామూర్తులను కొలిచే ప్రక్రియ కనపడుతుంది. ఈ నృత్యం మొట్టమొదట శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రాణీ రుక్మిణీ దేవి ద్వారకలో నవరాత్రి ఉత్సవాల సందర్భం గా చేసిందని అంటారు. అతివలు వలయాకా రంగా చేరి చేతులతో చప్పట్లు తడుతూ తిరుగు తారు. దీనిని దేవతకు ఇచ్చే హారతిగా భావిస్తారు. కోలాటం కర్రలతో స్త్రీ, పురుషులిరువురూ ఆడేది దాండియా! మహిళల అలంకరణ గర్బా, దాండియా నృత్యానికి మహిళలు రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరిస్తారు. దీంట్లో ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ.. వంటి కాంతిమంతమైన రంగు దుస్తులను ఎంచుకుంటారు. పూసలు, పెద్ద పెద్ద అద్దాలు, గవ్వలను ఉపయోగిస్తూ చేసిన ఎంబ్రాయిడరీ అంచులతో ఈ దుస్తులను ఆక ర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇది పూర్తిగా గుజరాతీ సంప్రదాయ కట్టు. దీంతో పాటూ సంప్రదాయ ఆభరణాలైన మెరిసే గాజులు, జుంకాలు, రెండు-మూడు హారాలు, నడుము పట్టీలు, కాళ్లకు గజ్జెలు.. మేని అలంకరణకు ఉపయోగిస్తారు. నవరాత్రులలో మీ అలంకరణ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వీటన్నింటి ఎంపిక అవసరం. ప్రయోగం ఎంత సంప్రదాయ దుస్తులైనా మీదైన ప్రత్యేకత మీరు ధరించే దుస్తుల్లో కనబరచాలి. ఇందుకు ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ అస్మితా మార్వా, అనితా అరోరా, రాహుల్ మిశ్రా.. వంటి వారి డిజైన్స్‌తో మీ దుస్తుల్లోనూ వైవిధ్యం తీసుకురావచ్చు. కాటన్ ప్రధానం దాండియా ఆటలో చెమట అధికంగా పడుతుంది. ఇలాంటప్పుడు చెమటను పీల్చుకునే దుస్తులు సరైన ఎంపిక. మగవారి ముస్తాబు జీన్స్, టీ షర్ట్స్‌తో విసుగెత్తిపోయిన వారు దాండియా రాత్రులను మరచిపోలేరు. దీనికి కారణం మగవారి వేషధారణ ఎంతో వైవిధ్యంగా, సంప్రదాయబద్ధంగా ఉండటమే! దాండియా ఆటలో మగవారు ‘కెడియు’ అనే సంప్రదాయ దుస్తులను దరిస్తారు. చిన్న కుర్తా, కుచ్చుల బాటమ్, తలపై పెట్టుకునే టోపీ (టర్బన్)తో ప్రత్యేకంగా కనిపిస్తారు. బాందీనీ ప్రింట్ కుర్తాకి అద్దాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. షేర్వాణీ ‘కెడియా’ ధరించ డానికి ఇబ్బంది పడేవారు వదులుగా ఉండే పైజమా, లాల్చీ/ ధోతీ, షేర్వాణీ ధరించవచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేసిన షేర్వాణీ దాండియాను శోభాయమానం చేస్తుంది. రాజ్‌పుత్ కుర్తా కూడా ఈ వేడుకలో వైవిధ్యం కనబరచడంతో పాటు సంప్రదాయపు కళను ఉట్టిపడేలా చేస్తుంది. మేకప్ ఎంత అలంకరణ అయినా బాగుంటుందని అతిగా మేకప్ చేసుకోకూడదు. దాండియా నృత్యంలో పట్టే చెమట వల్ల మేకప్ ముఖమంతా అలుక్కుపోయే ఆస్కారమూ ఉంటుంది. అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకని పెద్దగా మేకప్ లేకుండా కళ్లకు మస్కారా, ఐ షాడో తీర్చిదిద్దుకుంటే చాలు. నుదుటన ఆకట్టుకునే బిందీ, చుబుకం పైన చిన్న కాటుక చుక్కలే వీటికి సింగారం. బరువు తగ్గచ్చు క్రమం తప్పకుండా చేసే యోగా, జిమ్,వ్యాయామాలు విసుగు పుట్టిస్తాయి. అదే దాండియా మనోల్లాసాన్ని కలిగిస్తుంది. నవరాత్రు లకు ముందు నెల రోజుల ముందుగా దాండియా సాధన చేయడం వల్ల దాదాపు 4 కేజీల బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. గర్బా డ్యాన్స్ వల్ల శరీర మంతా కదులుతుంది. భావోద్వేగా లను అదుపు చేసుకోగలుగుతాం. గంట సేపు చేసే ఈ నృత్యం వల్ల సుమారు 500-700 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. నడుము పై భాగం, పిరుదులు, పాదాలకు మంచి వ్యాయామం అవుతుంది. మనసు, శరీరం ఉత్తేజం పొందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయగీతాల మధురిమలను దాండియా నృత్యం గర్తుచేస్తుంటుంది. ఓ వైపు నృత్యం, సంగీతంతో ఆధ్యాత్మికత ఊపిరిపోసుకుంటుంది. మరోవైపు ఎటు చూసినా ఆనందం తాండవం చేస్తుంది. ఇలాంటి అపురూప సమయాలను పూర్తిగా ఆస్వాదించడానికీ.. శరీరానికి, మనసుకు కొత్త ఉల్లాసాన్ని అందించడానికి ఇప్పుడే సిద్ధం కండి. దాండియా అడుగులు వేయడానికి కోలాటం కర్రలు చేత పట్టండి. సంగీతానికి అనుగుణంగా పాదాలు కదపండి. లయబద్ధమైన నృత్యంలో దుస్తుల మెరుపులలో మైమరచిపోండి. - నిర్మలారెడ్డి -
దండియా మస్తీ
శరద్కాంతులు రాకముందే సిటీలో నవరాత్రి సంబురాలు మొదలయ్యాయి. దాండియా ఆటలతో పడుచుల పాటలు పోటీపడ్డాయి. గార్బాడ్యాన్స్తో ఘాగ్రా, చోలీ డిజైనింగ్స్‌లో మెరిసిన మగువలు సందడి చేశారు. ‘ప్రీ నవరాత్రి వార్మప్’ సందర్భంగా శుక్రవారం ఎ లా లిబర్టీ బంకెట్ హాల్లో కళ్లు చెదిరే నృత్యంతో అదరహో అనిపించారు. సంజయ్‌లీలా భన్సాలీ రామ్‌లీలా మూవీలోని ఓ పాటకు బొమ్మ తుపాకులు చేతపట్టి యువతులు డ్యాన్స్ చేశారు. కొరియోగ్రాఫర్ మీనా మెహతా, శశి నహతా నిర్వహించిన ఈ కార్యక్రమం ఫ్యాషన్ రంగులద్దుకున్న సంప్రదాయ హంగులను ఏకకాలంలో కళ్లముందుంచింది. -
రికార్డులకెక్కనున్న గాజుల గణపయ్య
రాజమండ్రి కల్చరల్ : పుష్కరాల రేవు వద్ద రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ నవరాత్రి వేడుకలు ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు 2009లో ఈ ఉత్స వాలను ప్రాంభించారు. అప్పటి నుంచి ఏటా వైభవోపేతంగా కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ పందిట్లో నిలబెట్టిన గాజుల గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుం టోంది. సుమారు నాలుగు లక్షల గాజులను ఈ విగ్రహానికి ఉపయోగించారు. ఈ విగ్రహం ప్రపంచ రికార్డులలో నమోదు కానున్నదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు, కమిటీ ప్రతినిధి జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నా రు. వివిధ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు ఇప్పటికే ఈ విగ్రహం రూపకల్పనకు సం బం ధించిన వివరాలు నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గణపతిని సాధారణంగా పురుషరూపంలో పూజిస్తారని అయితే స్త్రీ మూర్తిగా గణేశుని ఆరాధించే సంప్రదాయం కూడా ఉందని ఆ మె అన్నారు. ముద్గల పురాణం, విష్ణుపురాణం, స్కాంద. మత్స్య పురాణాలలో గణపతి స్త్రీరూపం ప్రస్తావన ఉందన్నారు. గణేశ్వరి, వినాయకి, గణేంద్రి ఇత్యాది నామాలతో స్త్రీమూర్తిగా గణపతిని పూజిస్తారని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలోను, కాశీ క్షేత్రంలోను స్త్రీరూప గణపతి ఆలయాలు ఉన్నాయన్నారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులతో కలసి గాజుల గణపతి సన్నిధిలో అయ్యప్ప పడిపూజ, గణపతి పూజలను ఘనంగా నిర్వహించారు. కాగా గణపతి విగ్రహంలో ఉపయోగించిన గాజులను ఆదివారం భక్తులకు పంపిణీ చేస్తామని చెప్పారు. -
ప్రతి పోలీసూ త్యాగధనుడే!
=నిత్యం కుటుంబాలకు దూరం =వెంటాడుతున్న అనారోగ్యం =అనేక మందిలో కనిపించని కృత జ్ఞత =నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సాక్షి,సిటీబ్యూరో: శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులే అత్యంత కీలకం. ఒక్కరోజు పోలీసు అనే వ్యక్తి లేకుంటే ఊహించడం చాలాకష్టం. అలాంటి పోలీసులు విధినిర్వహణలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే అయినా ప్రజ లకు సంబంధించి విధి కావడంతో ఎప్పుడు,ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి. అయితే పోలీసుల పరిస్థితి జంటకమిషరేట్లలో ఏంటో తెలుసా..? అరకొర సిబ్బంది, వేళాపాళా లేని విధులు, నిత్యం తన వారికి దూరంగా.. అనారోగ్యాలకు దగ్గరగా, పండుగలు, పబ్బాలు రోడ్లమీదే. అక్టోబర్ 21..పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఏడాదికాలంలో విధినిర్వహణలో ప్రాణాలు అర్పించి త్యాగధనులుగా మారిన అధికారులు, సిబ్బందిని స్మరించుకోవడం కోసం దీన్ని నిర్వహిస్తారు. కేవలం వీరు మాత్రమే కాదు...వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పనిచేసే ప్రతి పోలీసు త్యాగధనుడే. సర్వకాల సర్వావస్థల్లోనూ : నగరం మొత్తం ఆదమరిచి నిద్రిస్తున్న రాత్రివేళ కాపుకాయడానికి ప్రతిరాత్రీ 1400 మంది పోలీసులు మేల్కొనే ఉంటారు. గస్తీ తిరుగుతూ నగరాన్ని కంటికిరెప్పలా కాపాడుతుంటారు. పండుగలు, పబ్బాలు వచ్చిన సందర్భంలో నగరం దాదాపు సగంఖాళీ అవుతుంది. అదే సమయంలో నగర పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది మొత్తం ‘స్టాండ్టూ’లో ఉంటూ... కుటుంబాన్ని వదిలి విధినిర్వహణ కోసం 24 గంటలు పోలీసుస్టేషన్‌కే అంకితం అవుతారు. ఇటీవల పరిస్థితులే తీసుకుంటే జూలై నుంచి నేటివరకు కంటి నిండా నిద్రపోయిన పోలీసు అంటూ లేరు. రంజాన్ మాసం,గణేష్ ఉత్సవాలు, నిరసనలు, దసరా నవరాత్రులు ఇలా వరుసపెట్టి బందోబస్తులతో కమిషనరేట్ పరిధిలోని ప్రతిఅధికారి విధుల్లోనే ఉన్నారు. ఇది కేవలం మచ్చుతునక మాత్రమే. ఇక ట్రాఫిక్ పోలీసులు విధుల గురించి తెలియని వారుండరు. వెంటాడే అనారోగ్యం : పోలీసులకు విధి నిర్వహణలో ఎదురయ్యే మరో పెను ఉపద్రవం అనారోగ్యం. వేళాపాళాలేని విధులు..కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండిలేని దుస్థితి వెరసి అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోం ది. రాష్ట్రంలో ఏటా అనారోగ్యానికిలోనై ప్రాణాలు వదులుతున్న వారిలో కిందిస్థాయి వారే ఎక్కువ. రాష్ట్రం మొత్తమ్మీద ఏటా 500మంది సిబ్బంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక రోగులుగా మారి చికిత్సలు చేయించుకుంటూ నరకం అనుభవిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ట్రాఫిక్ పోలీసులకు ఇక శ్వాసకోస వ్యాధులు అధికం. ఆ స్థాయి గుర్తింపు శూన్యం : అనునిత్యం విధులకే అంకితమవుతూ మన కోసం, జనం కోసం కాపుకాస్తున్న పోలీసు త్యాగాలకు సరైన గుర్తింపు మాత్రం లభించట్లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. ‘జీవితంలో కనీసం ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే...కనీసం ఒక్కసారైనా వారి వద్దకు వెళ్లిన వారికే పోలీసులంటే సదాభిప్రాయం ఉంటోంది’ అనేక అంతర్జాతీయ సర్వేలు చెప్పిన వాస్తవమిది. అయితే సమాజంలో దాదాపు 60 శాతం మందికి వారి జీవితంలో ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గడిచిపోతోంది. మరోపక్క పోలీసుస్టేషన్లకు వస్తున్న వారు సైతం ‘అధికారభాష’, ప్రవర్తనా తీరుతో ఉన్న సదాభిప్రాయాన్ని కోల్పోతున్నారు. వీటన్నింటికీ మించి పోలీసు విభాగంలో చోటు చేసుకునే చిన్నచిన్న తప్పులు, అపశ్రుతులు వల్ల వారు సమాజానికి మరితం దూరమవుతున్నారు. ‘అదుపు’ తప్పుతున్నారు : ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న మన పోలీసులు అనేక సందర్భాల్లో ‘అదుపు’ తప్పుతున్నారు. సహనాన్ని కోల్పోయి ఉన్నతాధికారులపై తిరగబడటం, దాడులు చేయడం జరుగుతోంది. ఈ ఒత్తిడికితోడు నిత్యం కుటుంబానికి దూరంగా ఉండటం, వారిని నిర్లక్ష్యం చేయడంతో కొన్ని చిన్నచిన్న కుటుంబసమస్యలను తట్టుకునే మానసిక పరిపక్వతను కోల్పోతున్నారు. -
పోరాడి మరీ సాధించుకున్నారు
దేశంలో దసరా నవరాత్రులు సందడిగా, ఘనంగా జరిగే ప్రాంతాల్లో కోల్‌కతా కూడా ముఖ్యమైనది. అక్కడ కొలువైన కాళీమాతకు ప్రతియేటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కోల్‌కతాలోని ప్రతివీధిలోనూ మంటపాలు ఏర్పాటు చేసి కాళీమాత ప్రతిమలను పెట్టుకొని పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయంలోని కాళీమాతకు తోడు వీధుల్లోని కాళీ మాత మంటపాలు కోల్‌కతాకు కొత్త కాంతిని తీసుకు వస్తాయి. ఆ మహానగరంలో భిన్నమైన వర్గాల ప్రజలు తమకు చేతనైంత స్థాయిలో, ఇష్టమైనట్టుగా నవరాత్రుల వేడుకలను జరుపుకొంటారు. ఇది ఎన్నో యేళ్లుగా జరుగుతున్న ప్రక్రియే. ఈ మంటపాల విషయంలో ప్రభుత్వం, పోలీసులు కూడా సహకారాన్ని అందిస్తుంటారు. అయితే నవరాత్రి వేడుకల నిర్వహణ విషయంలో అందరికీ సహకారం అందించే పోలీసులు సోనాగంజ్ ప్రాంతంలోని కొంతమంది మహిళలు నవరాత్రి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుకున్న విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చారు. అనుమతిని ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీనికి వారు చెప్పిన కారణం ఒక్కటే.. ‘మీరంతా సెక్స్‌వర్కర్లు. అందుకే అనుమతిని ఇవ్వడం లేదు...’ అవును.. సోనాగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న ఆ మహిళలంతా సెక్స్‌వర్కర్లే. కోల్‌కతాలో ప్రసిద్ధి పొందిన రెడ్‌లైట్ ఏరియా ’సోనాగంజ్’. అక్కడ పడుపువృత్తిలో ఉన్న మహిళలు నవరాత్రి మంటపాన్ని ఏర్పరుచుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై దుర్బర్ మహిళా సమన్యాయ సమితి(డీఎమ్ఎస్సీ) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి ఇవ్వకపోవడం గురించి పోలీసు శాఖను ప్రతివాదులుగా చేర్చి వారు న్యాయపోరాటం చేసి మరీ, అనుమతిని సాధించుకొన్నారు. ఈ సందర్భంగా కోర్టు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి వారిలోని అనర్హత ఏమిటో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది. అయితే ఎటువంటి సమాధానం లేదు వారిదగ్గర. దాంతో, తానే చొరవ తీసుకుని, నవరాత్రి మంటపాలు ఏర్పాటు చేయడం గురించి మార్గదర్శకాలను పరిశీలించి సెక్స్ వర్కర్లు ఏర్పాటు చేయదలిచిన మండ పానికి అనుమతి మంజూరు చేసింది. ఈ విధంగా దుర్గమ్మను కొలవడానికి సోనాగంజ్ మహిళలు అనుమతి సాధించుకొన్నారు. -
నవరాత్రి ఉత్సవాలు మొదలు
సాక్షి, ముంబై: ఆరతి క్రీడా మండలి ఆధ్వర్యంలో వర్లిలో శనివారం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బీడీడీచాల్స్లో మండపం ఏర్పా టు చేసి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా దాండియా రాజ్, భజనలు, పిల్లలకు డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, అలాగే మహిళల కోసం పసుపు కుంకుమ కార్యక్రమం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఏడు గంటలకు 56 రకాల వంటకాలతో అమ్మ వారికి నైవేద్యం సమర్పించి, మహా హారతి ఇస్తారు. అదేవిధం గా 11న సాయంత్రం నాలుగు గంటలకు హవనం, శ్రీ సత్యనారాయణ మహాపూజ, అతిథులకు సన్మా నం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12న అన్నదానం, 13న దసరా స్నేహసమ్మేళనం, దేవి నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని మండలి ప్రతి నిధి శ్రీనివాస్ జక్కని వివరించారు. తొమ్మిది రోజు ల పాటు జరుపుకునే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. షోలాపూర్‌లో షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్‌లో శనివారందేవీ నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భారీ ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహాలను 423 మండపాలలో ప్రతిష్ఠించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు ఏర్పాటుచేశారు. పట్టణవాసులు తమ ఆరాధ్య దైవంగా భావించే రూపాభవానీ మాత ఆలయంలో వేకువజామునే వివిధ ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవి దర్శనం కోసం భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. నేడు సభ భివండీ, న్యూస్‌లైన్: అఖిల పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి హాలులో ఆదివారం సభ జరగనుంది. నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో స్థానికులు తగు సూచనలు అందించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందువల్ల స్థానికులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని అఖిల పద్మశాలి సమాజ్ కార్యదర్శి దాసి అంబాదాస్ కోరారు. ఈ నెల 12న సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు. సప్తశృంగి ఆలయానికి అదనపు బస్సులు నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం నాసిక్‌కు 60 కిలోమీటర్ల దూరంలోగల సప్తశృంగి ఆలయానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) శనివారం నుంచి 300 అదనపు బస్సులను నడుపుతోంది. ఇవి రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల నుంచి బయల్దేరతాయి. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి పాటిల్ తెలియజేశారు. -
ఉస్మానాబాద్‌లో తొక్కిసలాట: భక్తుడు మృతి
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు శనివారం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా దేవాలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో తీవ్ర తొక్కిలసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒకరు మరణించారు. ఆ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దేవాలయ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నవరాత్రుల సందర్భంగా దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన అధికారులు, సిబ్బంది సరైన చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సర్వాంగ సుందరంగా ‘చతుఃశృంగి’
పుణే: నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్థానిక సేనాపతి బాపట్ రోడ్డులోని చతుఃశృంగి ఆలయాన్ని యాజమాన్యం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. దీంతోపాటు ఫౌంటెయిన్లు, లాన్లు, పాలరాత్రి విగ్రహాలను కూడా ఏర్పాటుచేయనుంది. ఈ పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. దీంతో వారి భద్రత కోసం క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, ప్రత్యేకంగా ఓ రేడియో స్టేషన్, నిరంతరం సమాచారం అందించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. భద్రత, పరిశుభ్రత, వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ సముదాయాన్ని తీర్చిదిద్దుతోంది. అంతేకాకుండా మెట్ల పక్కన స్టీల్‌తో తయారుచేసిన రెయిలింగ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని చతుశృంగి దేవస్థానం ట్రస్టు సభ్యుడు నంద్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 18వ తేదీదాకా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా హారతి, వేదమంత్ర పఠనం, భజనలు జరుగుతాయన్నారు. అమ్మవారికి రెండు మహా పూజలు నిర్వహించనున్నామన్నారు. తొలి పూజ ఐదో తేదీన, రెండో పూజ 13వ తేదీన జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయాన్ని 24 గంటలపాటు తెరిచి ఉంచుతామన్నారు. విజయదశమి సందర్భంగా నవచండి యజ్ఞం కూడా నిర్వహించనున్నామన్నారు. తొలిరోజు అమ్మవారిని మహాపల్లకీలో ఊరేగిస్తామన్నారు. ఊరేగింపు జరుగుతున్నంతసేపు హెలికాప్టర్ నుంచి అమ్మవారి పల్లకీపై పూలవర్షం కురిపిస్తామన్నారు. మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఈ ఊరేగింపు ఘనంగా జరుగుతుందన్నారు. ఈ పల్లకీని 20 కిలోల వెండితో తయారు చేయించామన్నారు. పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 200 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తించనున్నారన్నారు. వీరే కాకుండా 50 మంది వలంటీర్లు, 25 మంది సెక్యూరిటీ గార్డులు, మరో 25 మంది హోం గార్డులు ఆలయ సముదాయం పరిసరాల్లో తిరుగుతూ అందరిపైనా కన్నేసి ఉంచుతారన్నారు. ప్రతి ఏడాది ఇక్కడికొచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కాగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక రేడియో స్టేషన్ ఈ ఏడాది ఉత్సవాల్లో ఆకర్షణగా నిలవనుందన్నారు. రేడియో జాకీలు భక్తులకు తగు సూచనలు ఇస్తుంటారన్నారు. దీంతోపాటు భక్తిగీతాలను కూడా వినిపిస్తారన్నారు. -
మహాలక్ష్మి ఆలయానికి భారీ భద్రత
సాక్షి, ముంబై: నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని నగరంలోని మహాలక్ష్మి ఆలయంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులపాటు సాగుతాయి. దీంతో నిత్యం లక్షలాది మంది భక్తులు బంగారు మహాలక్ష్మిని దర్శించుకునేందుకు వస్తుంటారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన ఏర్పాట్లను స్థానిక గావ్‌దేవి పోలీసులు చూసుకుంటారని ఆలయ కమిటీ పదాధికారి శరద్చంద్ర పాధ్యే చెప్పారు. ‘సముద్ర తీరానికి అనుకొని ఉన్న ఈ ఆలయం ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉంది. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉత్సవాల సమయంలో భక్తులు, ఆలయానికి మరింత భద్రత కల్పించాల్సి వస్తుంద’ని ఆయన అన్నారు. ఏర్పాట్లలో భాగంగా మందిరం ఆవరణ మొదలుకుని హాజీ అలీ జంక్షన్, క్యాడ్బరీ జంక్షన్ వరకు 50 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. లలితా పంచమి, అష్టమి, సెలవు రోజుల్లో ఆలయానికి దాదాపు రెండు లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చే అవకాముంది. వీరి సౌకర్యార్థం మందిరాన్ని ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. గావ్‌దేవి పోలీసులు, కానిస్టేబుళ్లు, స్టేట్ రిజర్వ్డ్ పోలీసులు, బీఎంసీకి చెందిన 25 మంది భద్రతా సిబ్బంది, హోంగార్డులు భద్రత విధులను పర్యవేక్షిస్తారన్నారు. భక్తులకు మార్గదర్శనం చేసేందుకు వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. మందిరం బయట అందుబాటులో ఉంచనున్న అంబులెన్స్‌లో వైద్య బృందం ఉంటుందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు పూజా సాహిత్యం మినహా ఇతర వస్తువులు వెంట తేకూడదని పాధ్యే చెప్పారు. ప్లాస్టిక్ సంచులు, పెద్ద బ్యాగులు వెంట తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. క్యూలో నిలబడిన భక్తులు ఎండ, వర్షం నుంచి తట్టుకునేందుకు క్యాడ్బరీ జంక్షన్ వరకు టెంట్లు, మండపం ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, ఉచితంగా చెప్పులు భద్రపర్చే స్టాండ్లు తదితర సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ‘నవరాత్రుల్లో తొలిరోజైన శనివారం ఉదయం 5.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 హారతి, హవనం కార్యక్రమాలుంటాయి. ఆఖరి రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్ణాహుతి అనంతరం అర్చన, హారతి ఇచ్చి విజయదశమి వేడుకలు నిర్వహిస్తామ’ని పాధ్యే పేర్కొన్నారు.