రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు | Calf Born With 2 Heads 3 Eyes In Odisha Locals Worshipped As Maa Durga Avatar Viral Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. క్యూ కట్టిన జనం

Published Tue, Oct 12 2021 5:23 PM | Last Updated on Tue, Oct 12 2021 5:50 PM

Calf Born With 2 Heads 3 Eyes In Odisha Locals Worshipped As Maa Durga Avatar Viral Video - Sakshi

భువనేశ్వర్‌: సోషల్‌ మీడియా ప్రాబల్యం పెరిగిన తర్వాత చిత్ర విచిత్ర ఘటనలు వైరల్‌గా మారిన వైనం చూస్తున్నాం. తాజాగా ఒడిశాలోని నబ్రంగ్‌పూర్‌ జిల్లా బిజాపుర గ్రామంలో వెలుగు చూసిన ఓ విశేషం స్థానికులనేగాక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

రెండు తలలు, మూడు కళ్లతో ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఘటన జరగడంతో స్థానికులు ఆ బుల్లి దూడను దుర్గామాత అవతారంగా కొలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
(చదవండి: బెంగళూరులో 7గురు విద్యార్థులు అదృశ్యం..)

మరోవైపు రెండు తలలు కలిగి ఉండటంతో తల్లి ఆవు నుంచి లేగదూడ పాలు తాగలేకపోతోందని వాటి యజమాని చెప్పారు. డబ్బాతో దానికి పాలు పడుతున్నామని తెలిపారు. 

(చదవండి: Viral Video: డ్యాన్స్‌ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement