Calf
-
పిక్కకు ఓ లెక్కుంది..! అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు..!
మనిషికి శరీరం పైభాగంలో అంటే రొమ్ములో ఒక గుండె ఉంటుంది. అదే రీతిలో రెండు కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... పిక్కలు. నిజానికి అవి అచ్చంగా గుండెలు కాకపోయినప్పటికీ గుండె చేసే పనినే పిక్కలూ కొంతవరకు చేస్తాయి. గుండె రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేసినట్టే సరిగ్గా పిక్క కూడా రక్తాన్ని పైకి పంప్ చేయడంతోపాటు పైకెళ్లాల్సిన రక్తం భూమ్యాకర్షణకు లోనై కిందికి వెళ్లకుండా అక్కడి కవాటాలు ఆపుతాయి. అందుకే ‘పిక్క’ను శరీరపు రెండో గుండెకాయగా కొందరు చెబుతుంటారు. గుండె చేసే పనిని పిక్కలు ఎలా చేస్తాయో చూద్దాం. పిక్కను పరిశీలనగా చూసినప్పుడు అది కూడా ఇంచుమించూ ‘హార్ట్ షేపు’లోనే కనిపిస్తుంది. గుండె తన పంపింగ్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంటే... కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వచ్చేలా చూస్తుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండె డ్యూటీలను పిక్క ఎలా చేస్తుందంటే... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడి రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే కండరాలు ఈ పనిలో కీలకంగా ఉంటాయి. ఈ కండరాలు క్రమబద్ధమైన రీతిలో స్పందిస్తూ... ముడుచుకోవడం (కాంట్రాక్ట్ కావడం), తెరచుకోవడం (రిలాక్స్‌కావడం)తో కాళ్లకు సరఫరా అయ్యే రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. రక్తం మళ్లీ కిందికి పడిపోకుండా వాల్వ్స్ (కవాటాల) సహాయంతో మూసుకు΄ోతూ పైవైపునకే ప్రవహించేలా చూస్తాయి. ఒకవేళ అలా పిక్కలు పనిచేయకపోతే రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అప్పటికీ ఈ రక్తంలోని ఆక్సిజన్‌ను కండరాలు వినియోగించుకున్నందున తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసటకు గురవుతాయి. పిక్క గుండెలా పనిచేయకపోతే... కాళ్ల చివరలకు రక్తసరఫరా తక్కువగా జరగడం వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం సరిగా జరగకపోవడం చెడు రక్తాన్ని తీసుకు΄ోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడంతో ఈ కింది పరిణామాలు జరగవచ్చు. అవి... ⇒ కాళ్లు అలసిపోవడం ⇒ కాళ్లూ, పాదాలలో వాపు ⇒ కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకపోవడం ⇒ కాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటం వేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరలు ఉబ్బి చర్మం నుంచి బయటకు కనిపించడం) ∙కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్). ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటే...? చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారిలో ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండే లెక్చరర్లు, టీచర్లు, కండక్టర్లు, ట్రాఫిక్ ΄ోలీసులు... మొ‘‘ వారిలో స్థూలకాయుల్లో గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలల్లో ఈ సమస్య కనిపించవచ్చు.సమస్యను అధిగమించడం కోసం... పాదాలను మడమ దగ్గర్నుంచి పైకీ కిందికీ (ఫ్లెక్స్ అండ్ పాయింట్) కదిలిస్తూ ఉండటం ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్) బరువును / ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం. కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమిపెట్టేలా ‘వీనస్ స్టాకింగ్స్’ వంటి తొడుగులను ధరించాలి. అప్పటికీ అలాగే కనిపిస్తుంటే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. --డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, సీనియర్ వాస్కులార్ అండ్ ఎండో వాస్కులార్ సర్జన్(చదవండి: డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్) -
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
అదిరే.. ఆవు దూడకు బాలసారె..
కాకినాడ రూరల్: కాకినాడ రమణయ్యపేటలో వైద్యుడు గౌరీశేఖర్ బుధవారం ఆవుదూడకు బాలసారె మహోత్సవాన్ని నిర్వహించారు. ఆయన భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు వైద్యులుగానే స్థిరపడ్డారు. అల్లుళ్లు కూడా వైద్యులే. ఇంటిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్న గౌరీశేఖర్‌కు చిన్నప్పటి నుంచి ఆవులంటే మక్కువ ఎక్కువ. ఇటీవల సుమారు రూ.50 వేలకు పుంగనూరు జాతి ఆవుదూడను కొన్నారు. దానికి మూడో నెల రావడంతో బుధవారం బంధుమిత్రులందరినీ పిలిచి బాలసారె వేడుకగా నిర్వహించారు. ఆవుదూడకు పట్టీలు అలంకరించి పూజలు అనంతరం ఊయలలో ఉంచి ఊపుతూ మంత్రోచ్చరణ చేయించి, ఆశీర్వచనలు ఇచ్చారు. అడబాల ట్రస్టు ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. -
ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు
నాదెండ్ల (చిలకలూరిపేట): 20 నెలల వయసున్న ఒంగోలు జాతి కోడె దూడ రూ.2 లక్షల ధర పలికింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన రైతు, చిలకలూరిపేట మునిసిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు దీనిని పెంచుతున్నారు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు బ్రీడింగ్ కేంద్రం వారు బ్రీడింగ్ నిమిత్తం ఈ ఒంగోలు వృషభ రాజాన్ని రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు. -
చూడటానికి పంది రూపు... కానీ అది దూడ
మాస్కో: ఈ మధ్యకాలంలో విచిత్రాతి విచిత్రంగా జంతువులకు, మనుష్యులకు రకరకాలుగా పిల్లలు పుట్టడం చూసే ఉంటాం. హార్మోనుల తేడాలతో రకరకాలుగా అవకారాలతోనో లేక మరో విధంగానో వింత వింత జననాలను చూసి ఉంటాం. కానీ ఇలా మరో జంతు రూపుతో విచిత్రంగా జన్మించటం అత్యంత అరుదుగా జరుగుతుంది. అచ్చం అలాంటి ఘటన రష్యాలో చోటు చేసుకుంది. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) వివరాల్లోకెళ్లితే...రష్యాలోని ఖాకాసియాలోని మట్కెచిక్ గ్రామంలో ఒక ఆవుకి పందులను పోలిన రూపంతో రెండు తలల దూడ జన్మించింది. అయితే ఈ నవజాత దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. అంతేకాదు పాపం దాని తల్లి కూడా కొద్ది రోజులకే చనిపోయింది. జన్యుపరమైన అసాధారణతల వల్ల ఈ విధంగా జరిగే అవగాశం ఉందిన రష్యా వెటర్నరీ మెడిసిన్ విభాగం పేర్కొంది. ఈ మేరకు వారసత్వంగా వచ్చే జన్యువుల్లోని మార్పుల వల్ల కానీ లేదా క్రాస్ బ్రీడింగ్ సమయంలోనూ ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లా పురా సిక్రౌడా గ్రామంలో ఓ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఆ గేదె ఎవరి సాయం లేకుండా జన్మినివ్వడమే కాకా ఆ దూడ కూడా ఆరోగ్యంగానే ఉంది. ఏది ఏమైన ఇలాంటి అరుదైన ఘటనల్లో పుట్టినవి ఆరోగ్యంగా ఉండటమే విశేషం. చాలామటుకు అవి చనిపోయే అవకాశాలే ఎక్కువ. (చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు -
రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు
భువనేశ్వర్: సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తర్వాత చిత్ర విచిత్ర ఘటనలు వైరల్‌గా మారిన వైనం చూస్తున్నాం. తాజాగా ఒడిశాలోని నబ్రంగ్పూర్ జిల్లా బిజాపుర గ్రామంలో వెలుగు చూసిన ఓ విశేషం స్థానికులనేగాక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు తలలు, మూడు కళ్లతో ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఘటన జరగడంతో స్థానికులు ఆ బుల్లి దూడను దుర్గామాత అవతారంగా కొలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: బెంగళూరులో 7గురు విద్యార్థులు అదృశ్యం..) మరోవైపు రెండు తలలు కలిగి ఉండటంతో తల్లి ఆవు నుంచి లేగదూడ పాలు తాగలేకపోతోందని వాటి యజమాని చెప్పారు. డబ్బాతో దానికి పాలు పడుతున్నామని తెలిపారు. People in the locality of Bijapara village have begun worshipping a two headed calf as #Durga Avatar After it was born with two heads and three eyes on the occasion of #Navratri to a farmer in Odisha's Nabrangpur District. #DurgaPuja @aajtak @IndiaToday pic.twitter.com/tz9i9mpJ0O — Suffian सूफ़ियान سفیان (@iamsuffian) October 12, 2021 (చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!) -
2 తలలు, 6 కాళ్ల దూడ
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని యాదవపురానికి చెందిన గోపాలకృష్ణకు చెందిన చూడి గేదె 10 నెలలు అవుతున్నా ఈనక పోవడంతో పశు వైద్యుడు శశికుమార్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు గేదె లోపల ఉన్న దూడ ఆకృతిలో తేడా ఉందని గుర్తించారు. పశువుకు శస్త్ర చికిత్స చేసి దూడను బయటికి తీశారు. దూడ 2 తలలు, 6 కాళ్లతో జన్మించి కొద్దిసేపటికే మృతి చెందింది. చదవండి: (కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం) -
వైరల్ వీడియో: ‘మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాం’
మనుషులకు, జంతువులకు ప్రధాన తేడా.. విచాక్షణా జ్ఞానం. జంతువులు ఆలోచించలేవు.. మనం ఆలోచించగల్గుతాం. అయితే ప్రస్తుతం లోకం తీరు చూస్తే ఈ వ్యాఖ్యలకు అర్థం మారినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఆలోచనల్లో స్వార్థం పెరుగుతుంది. కళ్లేదుటే సాటి మనిషి చావుబతుకుల్లో కొట్టుమిటాడుతన్న పట్టించుకునే తీరక, మానవత్వం కరువవుతున్నాయి. కానీ జంతువులు అలా కాదు.. తమ తోటి జీవికి కష్టం వచ్చిందని వాటికి తెలిస్తే చాలు.. కట్టకట్టుకుని వచ్చేస్తాయి. తమ సాటి ప్రాణిని కాపాడటానికి వాటికి తోచిన రీతిలో ప్రయత్నిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. మీ నుంచి మనుషులు ఎంతో నేర్చుకోవాలి. నిస్వార్థ ప్రేమకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. టర్కిష్ మహిళ ఫైజెన్ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ఏనుగు పిల్ల తల్లితో కలిసి నీటి కొలను దగ్గరకు వచ్చింది. పక్కనే మరో ఏనుగు కూడా ఉంది. అయితే ఉన్నట్లుండి పిల్ల ఏనుగు నీటిలో పడి పోతుంది. ఇది గమనించి తల్లి ఏనుగు బిడ్డను కాపాడటం కోసం ప్రయత్నిస్తుంది. ఈలోపు ఏనుగు పిల్ల పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన రెండు ఏనుగులు నీటిలోకి దిగి.. పిల్ల ఏనుగును ఒడ్డుకు చేర్చుతాయి. ఆ తర్వాత ఆ మూడు ఏనుగులు అక్కడ నుంచి వెళ్లిపోతాయి. (చదవండి: Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’) అయితే ఈ రెండు ఏనుగులు.. పిల్ల ఏనుగును కాపాడటం కోసం ప్రయత్నిస్తుండగా.. వాటి వెనకే ఉన్న మరో ఏనుగు ఈ దృశ్యాన్ని చూస్తుంది. అక్కడకు వెళ్లి.. వాటికి సాయం చేయాలని భావిస్తుంది. కానీ అక్కడ కంచెలాంటి నిర్మాణం అడ్డుగా ఉండటంతో రాలేక అక్కడే తచ్చాడుతుంటుంది. (చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో) Awwww amazing! 💓pic.twitter.com/F9pveOMEOR — Figen.. (@TheFigen) September 8, 2021 ఈ వీడియో చూసిన నెటిజనులు మీ తోటి ప్రాణిని కాపాడటం కోసం మీ ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. మీ నిస్వార్థ ప్రేమకు, మానవత్వానికి హ్యాట్సాఫ్.. మిమ్మల్ని చూసి మేం మనుషులం చాలా సిగ్గుపడాలి.. నేర్చుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’ -
గిన్నిస్ రికార్డుల్లోకి బుజ్జి ఆవు?
లేగ దూడ ఎంత ముద్దుగా ఉందో కదూ..! ఈ దూడ చూడటానికి చుట్టుపక్కల ఊర్లకు చెందిన వందల మంది వస్తున్నారట. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంతమంది ఎందుకు వస్తారనే కదా మీ అనుమానం. ఈ లేగ దూడ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న ఆవుగా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇది ఎంత ఎత్తు ఉందో తెలుసా 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు) మాత్రమే. పైగా 26 కిలోలు మాత్రమే ఉన్నట్లు దీని యజమానులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ వయసు 23 వారాలు. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.అయితే ఇప్పటివరకు అతి చిన్న ఆవుగా భారత్‌కు చెందిన మాణిక్యం (వేచూర్ జాతి) గిన్నిస్ రికార్డుల్లో ఉంది. మాణిక్యం 24 అంగుళాలు (31 సెంటీమీటర్లు) ఎత్తు ఉంటుంది. దీన్ని బట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కోడె దూడ ‘చింటూ’కు బర్త్‌డే
వెల్దుర్తి: సాధారణంగా చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా కోడె దూడకు జన్మదిన వేడుకలు నిర్వహించారు సిద్ధినగట్టు గ్రామ రైతు పెద్ద పుల్లయ్య. ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో ఉండే ఎద్దులు, ఆవులను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఏడాది క్రితం ఆవు కోడెదూడకు జన్మనిచ్చింది. దానికి చింటూ అని నామకరణం చేసి ఇంటిల్లపాది మురిపెంగా చూసుకునే వారు. జూలై 4 దాని జన్మదినం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులు కోడె దూడను అలంకరించారు. చుట్టు పక్కల వారిని పిలిచి..కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. -
లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల
-
లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల
యాంకర్ సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ.. తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌కు గురయిన సంగతి తెలిసిందే. లేగ దదూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో వర్గం మాత్రం సుమను సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని ట్రోలర్స్‌కు బుదులిచ్చారు. అయినప్పటికీ కొందరు సుమపై నెగిటివి మాత్రం ఆగలేదు. తాజాగా తనపై వస్తోన్న ట్రోల్స్‌పై సుమ స్పందించింది. అక్కడి పాలేరు వద్దకు వెళ్లి రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని అతను సమాధానమిచ్చాడు. అలాగే ఆవును పెంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ..గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు. ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తనపై వస్తోన్న నెగిటివికి చెక్ పెట్టారు. 'లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టడంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియాతో మీ అందరికి సమాధానం దొరికొందని ఆశిస్తున్నాను.. మనం ప్రకృతితో పాటు జంతు ప్రేమికులం కూడా..' అంటూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. చదవండి : మొదటిసారి సుమను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే! HBD Ajith : బైక్ మెకానిక్ నుంచి సూపర్ స్టార్‌గా.. -
మొదటిసారి సుమపై నెటిజన్ల ఫైర్.. కారణం ఏంటంటే!
సుమ కనకాల.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పుట్టి పెరిగింది కేరళలో అయినా టాలీవుడ్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. తన మాటలతో చిన్న నుంచి పెద్దల వరకు అందరిని ఆకట్టుకుంటున్నారు. సుమ వేసే పంచులు, మాటలతో షో ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరి అభిప్రాయం. ఇప్పటి వరకు తన కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ.. తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌కు గురయ్యారు. సుమపై కొందరు ఫైర్ అవుతూ.. క్రూరత్వం కనిపించలేదా అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తనకు సంబంధించిన కొన్ని విషయాలను సుమ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఆమెకు మూగజీవులు అంటే ఇంకా ఇష్టం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆవు, దూడతో సరదాగా గడిపిన వీడియోను పోస్టు చేసింది. ఇందులో రాముడు అంటూ ఆవు దూడను ప్రేమగా దగ్గరకు పిలుచుకుంటోంది. వీడియోలో దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి లాంటిది పెట్టారు. అయితే ఇది కొంతమంది నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి క్రూరత్వం మీకు కనిపించడం లేదా అని సుమపై ఫైర్ అవుతున్నారు. కానీ మరో వర్గం వారు.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని సుమకు అండగా నిలుస్తున్నారు. సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా? -
లేగదూడకు బారసాల
జగిత్యాల రూరల్: పాడిపశువుపై ఉన్న మమకారాన్ని సరికొత్తగా చాటుకున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన వొద్దిపర్తి సంజయ్. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన సంజయ్ పెంచుకుంటున్న ఆవు కొన్నిరోజుల క్రితం ఆడ దూడకు జన్మనిచి్చంది. ఆదివారానికి అది పుట్టి 21 రోజులు కావడంతో బంధువులు, స్నేహితులను ఆహ్వానించి లేగదూడకు బారసాల నిర్వహించారు. ఆ చిట్టి దూడకు బృందగా నామకరణం చేశారు. అనంతరం అతిథులకు విందు భోజనాలు పెట్టించారు. -
‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’
కోల్‌కతా: బిడ్డల కోసం తల్లి ఎంత సాహసానికైనా తెగిస్తుంది. వారు ప్రమాదంలో ఉన్నారంటే.. తన ప్రాణాలను పణంగా పెట్టి మరి బిడ్డలను కాపాడుకుంటుంది. అందుకే దేవతలు సైతం అమ్మ ప్రేమను అనుభవించడం కోసం మానవ జన్మ ఎత్తుతారని అంటుంటారు. మనుషుల్లోనే కాక జంతువుల్లో కూడా అమ్మప్రేమ కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బిడ్డ ప్రాణాలు కాపాడబోయి తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీవ పరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హా ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రసుత్తం ఈ స్టోరి తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. బెంగాల్ అటవీ ప్రాంతంలో ‘గంగ’ అనే ఏనుగు ఉండేది. కొద్ది రోజుల క్రితం అది తన మందతో కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. దీనిలో తన బిడ్డ కూడా ఉంది. గ్రామస్తులు తమ పొలాల్లోకి వచ్చిన ఏనుగుల మందను తరిమాడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఏనుగుల మందకు ఓ రైల్వే క్రాస్ లైన్ అడ్డు వచ్చింది. గంగ, దానితో పాటు వచ్చిన ఏనుగులు అన్ని రైల్వే లైన్‌ను దాటాయి. కానీ గంగ బిడ్డ మాత్రం పట్టాలపై చిక్కుకుపోయింది. ఎలా దాటాలో అర్థం కాక అలానే నిల్చుంది. ఇంతలో దూరంగా రైలు వస్తోన్న శబ్దం వినిపించింది. దాంతో బిడ్డను కాపాడ్డం కోసం గంగ పట్టాల మీదకు వెళ్లింది. బిడ్డను పట్టాలపై నుంచి బయటకు పంపింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన రైలు గంగను ఢీకొట్టింది. దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది. This is Ganga elephant, photographed by Avijan Saha in North Bengal. Chased from fields, her herd encountered a railway line. They crossed on time, except her little calf. She died protecting him from the incoming train. We say we will die for our families. Elephants actually do. https://t.co/Op7YFyPqHv pic.twitter.com/izEFOvsi6z — Neha Sinha (@nehaa_sinha) March 11, 2021 ఈ క్రమంలో నేహా సిన్హా గంగ దాని బిడ్డ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘‘కుటుంబం కోసం ప్రాణాలిస్తాం అని మనం చెప్తాం. కానీ ఏనుగుల చేసి చూపుతాయి. ఇక గంగ, దాని బిడ్డను కొద్ది రోజుల క్రితం అవిజాన్ సాహా అనే ఉత్తర బెంగాల్ వ్యక్తి ఫోటో తీశాడు. అదే ఇది. బిడ్డ కోసం తన ప్రాణాలు కోల్పోయింది గంగ’’ అంటూ ఫోటో ట్వీట్ చేసింది. ఇది చూసిన వారంతా.. ‘‘మా గుండె పగిలిపోయింది.. కన్నీరాగడం లేదు.. ఈ ఘటన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి ‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’ -
వైరల్: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు
ఓ సారి పులి నోటికి చిక్కాక ప్రాణాలతో బయటపడటం అంత వీజీ కాదు. అదృష్టం జిడ్డు పట్టుకున్నట్లు పట్టుకుంటే తప్ప. ఈ వార్తలోని ఆవుదూడకు కూడా అదృష్టం ప్రజల రూపంలో జిడ్డులాగ పట్టుకుంది. అందుకే పులి నోట్లోంచి తప్పించుకుని బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఎన్‌హెచ్ 7 పక్కన వెళుతున్న ఆవుదూడను అటవీ ప్రాంతంలోంచి వచ్చిన పులి నోట పట్టుకుంది. దాని మెడ భాగాన్ని కొరుకుతూ చంపటానికి ప్రయత్నించింది. ( ‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’ అయితే ఆ సమయంలో రోడ్డుకు అటువైపు ఉన్న జనం అదిచూసి అరవటం ప్రారంభించారు. దీంతో పులి భయపడి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ దూడ అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సరోశ్ ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ( పులితో వాకింగ్.. ఏనుగు పిల్ల స్టెప్పులు ) -
దూడకు పాలిచ్చిన శునకం
నిర్మల్ : కుక్కకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అనేలా రుజువు చేసింది నిర్మల్ జిల్లాలో ఓ శునకం.. సోన్ మండలం సిద్దిలకుంట గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి అనే రైతు ఇంటి సమీపంలోని పశువులశాలలో ఉన్న దూడ వద్దకు శునకం వచ్చి పాలిచ్చింది. దూడకు శునకం పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది. ఈ దృశ్యం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. -
గోవును చంపిన కేసులో ఇద్దరు అరెస్ట్
లక్నో : తమ పొలంలో గడ్డివేస్తుందని ఆవును కొట్టి చంపిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రాహుల్, రవిగా గుర్తించిన పోలీసులు వారిపై సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ పొలంలో ఉన్న ఓ దూడపై దాడిచేసి దాన్ని రక్షించడానికి వెళ్తే మాపై కూడా దాడి చేసిందని నిందితులు తెలిపారు. ఈ ప్రయత్నంలోనే దానిపై కర్రలతో కొట్టామని, ఆత్మ రక్షణలో భాగంగానే చేశాం తప్పా చంపడం మా ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. (హత్య చేసి, నెత్తురు తాగిన కిరాతకుడు ) గోవధ నివారణ చట్టం 2020 ప్రకారం గోవును వధించిన వారికి ఏడాది నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండవసారి నేరాలనికి పాల్పడితే శిక్షను రెట్టింపు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా అనధికారికంగా మాంసం విక్రయాలు జరిపిన నిందితులకు కూడా ఇదే శిక్ష విధిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. (యూపీ ఆర్డినెన్స్ నేపథ్యంలో ఎంఐఎం వ్యాఖ్యలు ) -
మూడు చెవులతో వింత లేగ దూడ
సాక్షి, నిర్మల్ : సాధారణంగా ఆవులకు రెండు చెవులు మాత్రమే వుంటాయి. కానీ పాక్పట్ల గ్రామం కేసరి గంగారెడ్డికి చెందిన ఓ ఆవు సోమవారం ఉదయం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు రెండు చెవులతో పాటు శిరస్సు పై భాగంలో మరో చెవు కూడా ఉండటంతో మూడు చెవులతో వింతగా పుట్టిన లేగదూడను చూడటానికి గ్రామస్తులు తరలివస్తున్నారు. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటివి జరగుతాయని మండల పశువైద్యాధికారి మహేష్ తెలిపారు. -
పోలీసును వెంబడిస్తున్న లేగదూడ!
బెంగళూరు : కర్నాటకలోని బ్యాప్పనహళ్లీ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ను వదిలి ఓ లేగదూడ ఉండలేకపోతోంది. తనను రక్షించి, తన ఆలనా పాలనా చూస్తున్న ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీని వదిలిపెట్టడం లేదు. మార్చి 30న అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న కారును బ్యాప్పనహళ్లీ పోలీస్‌స్టేషన్ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెనక సీటులో కవర్‌తో చుట్టి ఉన్న లేగదూడను గమనించారు. వదిలేసి ఉన్న లేగదూడ రోడ్డుపైన ఒక్కటే కనిపించడంతో తమతోపాటూ తీసుకువచ్చామని వారు పోలీసులకు తెలిపారు. అయితే విచారణలో వారు చెప్పింది నిజమని తేలింది. అదే రోజు రాత్రి లేగదూడని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా, ఇన్స్పెక్టర్ రఫీ దానికి ముద్దుగా బీమా అని పేరు పెట్టి, పూర్తి బాధ్యతలు తానే చూసుకుంటున్నారు. లేగదూడకు దానాగా రోజుకు 20 లీటర్ల పాలు, పప్పు ధాన్యాలను ఇన్స్పెక్టర్ రఫీనే దగ్గరుండి అందిస్తూ ఇంట్లో సభ్యుడిలా చూసుకుంటున్నారు. బ్యాప్పనహళ్లీ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వగానే బీమాని కూడా తనతోపాటే తీసుకెళతానని భావోద్వేగంతో రఫీ చెప్పారు. -
ఆవుదూడను చంపావ్.. ప్రాయశ్చిత్తంగా కూతుర్ని..!
భోపాల్: ప్రమాదవశాత్తు దూడ చావుకు కారణమైన ఓ వ్యక్తికి గ్రామపంచాయతీ పెద్దలు విచిత్రమైన శిక్ష విధించారు. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలని ఆ గ్రామపంచాయతీ పెద్దలు ఆదేశించారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వెంటనే సొంత కూతురుని వివాహం చేసుకుంటే పాపపరిహారం అవుతుందని సెలవిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా పతారియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా దూడ అడ్డం రాగా.. బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు దూడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడ మరణించింది. అయితే దూడ చనిపోవడానికి అతడే కారణమని పంచాయతీ పెద్దలు తీర్మానం చేసి పరిహారం చేసుకోవాలని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి యూపీ వెళ్లి గంగానదిలో స్నానం చేసి వచ్చి.. ఊరిలో వాళ్లందరికీ అన్నదానానికి సిద్ధమయ్యాడు. ఇది అంతా పట్టించుకోని పంచాయతీ పెద్దలు తన సొంత మైనర్ బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ విషయంపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయడంతో కొంత మంది అధికారులు పతారియా గ్రామానికి వచ్చారు. మైనర్‌కు పెళ్లి చేయడం నేరమని చెప్పినా పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ అమ్మాయి ఆధార్ కార్డు తెప్పించి చూసి ఆమె వయస్సు 14 సంవత్సరాలుగా నిర్ధారించి మైనర్‌కు పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులను, గ్రామపెద్దలను గట్టిగా హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీనిపై పతారియా పోలీస్ స్టేషన్ సీఐ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువని చెప్పారు. ఆవు దూడను చంపితే పరిహారం తప్పనిసరిని భావిస్తారని తెలిపారు. మరికొన్ని చోట్ల ఆవును గానీ, దూడను గానీ చంపితే.. కన్యాదానం చేస్తేనే ఆ పాపం పోతుందని నమ్ముతారన్నారు. అందుకే సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాల్సిందిగా తీర్పులు ఇస్తారని చెప్పారు. ఆ బిడ్డ చిన్న పాప అయినా సరే ఆచారాన్ని అమలు చేసి తీరుతారని.. వీటిని మార్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మూగ వేదనకు... స్పందించిన ‘ప్రజావాణి’
అనంతగిరి : మూగజీవాలకు వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఓ రైతు.. లేగ దూడను ఆటోలో తీసుకుని వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ధారూరు మండలం కేరెళ్లికి చెందిన రాములుకు చెందిన ఆవు ఆదివారం లేగదూడకు జన్మనిచ్చింది.పుట్టిన కొద్ది సేపటికే చెంగున ఎగరాల్సిన దూడ చతికిలబడి పేగులు బయటకు ఉండటంతో రైతు గుండె కదిలిపోయింది. వెంటనే పశు వైద్యాధికారులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. సోమవారం ఉదయం ఓ డాక్టర్ వచ్చి పరీక్షించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనితో కలత చెందిన రాములు మరికొందరి సాయంతో ట్రాలీ ఆటోలో దూడను తీసుకుని.. కలెక్టరేట్‌కు వచ్చాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పశు వైద్య జిల్లా అధికారులు దూడకు వికారాబాద్‌లోని పశువుల ఆస్పత్రికి తరలించి వైద్యం చేసి పంపించారు. -
దూడలపై శ్రద్ధే అభివృద్ధికి సోపానం
పాడి పరిశ్రమ రైతుకు లాభదాయకంగా ఉండాలంటే శాస్త్రీయ పద్ధతిలో దూడల పోషణపై శ్రద్ధ చూపక తప్పదు. నేటి పెయ్య దూడే రేపటి పాడి పశువు అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువ వ్యయ ప్రయాసలతో పాడి పశువులు కొనుగోలు చేసే బదులు, మేలు జాతి పెయ్య దూడలకు సరైన పోషణ అందించినట్లయితే చౌకగా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు. దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రారంభం కావాలి. ముఖ్యంగా ఆరు మాసాల చూడి నుంచి ఈనే వరకు అదనంగా దాణా ఇవ్వాలి. దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు తాగించినట్లయితే దూడకు నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 1 దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుంచి, నోటిలో నుంచి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి. 2 ఈనగానే తల్లి దూడ శరీరాన్ని నాకి శుభ్రం చేస్తుంది. అలా కాని పక్షంలో, శుభ్రమైన గోనె పట్టాతో లేదా వరి గడ్డితో శరీరంపై రుద్ది శుభ్రం చేయాలి. దూడకు జున్నుపాలు సమృద్ధిగా తాగించాలి: జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిను ‘ఎ’ ఎక్కువ పాళ్లలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ఆంటిబాడీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. జున్నుపాలు సమృద్ధిగా తాగిన దూడకు 6 నెలల వరకు వ్యాధినిరోధకశక్తి లభిస్తుంది. దూడ ఆరోగ్యంగా త్వరగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మరో ముఖ్య విషయమేమిటంటే.. దూడకు జున్నుపాలు ఈనిన పావుగంట లేదా అరగంట లోపలే అందివ్వాలి. ఈ సమయంలోనే జున్నుపాలలోని రోగనిరోధకశక్తిని కలిగించే ఆంటీబాడీస్ దూడ శరీరానికి పూర్తిగా అందుతాయి. ఆలస్యమైతే ఈ ఆంటీబాడీస్ వినియోగం పూర్తిగా తగ్గుతుంది. దూడకు ఆహారం: పాలు: దూడకు తన శరీర బరువులో పదోవంతు పాలు అవసరం. దూడ శరీరం 20 కిలోలుంటే, దానికి రోజుకు 2 లీటర్ల పాలు కావాలి. అదేవిధంగా దాని శరీర బరువును బట్టి మూడు నెలల వయస్సు వరకు సరాసరి రోజుకు 2 నుంచి 3 లీటర్ల పాలు తాగించాల్సిన అవసరం లేకుండా గడ్డి, దాణాతో పోషించవచ్చు. ఈ మూడు నెలల్లో సుమారు 240 లీటర్ల పాలు దూడకు అవసరం ఉంటుంది. ప్రత్యేక దాణా: దూడలకు త్వరగా జీర్ణమై, పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలు గల దాణాను, పాలతోపాటు రెండోనెల నుంచి తినటం అలవాటు చేయాలి. దూడల దాణాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పీచుపదార్థాలు ఉండాలి. దూడల దాణాను ఈ కింది దాణా దినుసులను ఆయా పాళ్లలో కలిపి రైతులు తయారు చేసుకోవచ్చు: (1) జొన్నలు, మొక్కజొన్నలు వంటి ధాన్యాలు 40 పాళ్లు (2) వేరుశనగ పిండి 30 పాళ్లు. (3) తవుడు 10 పాళ్లు (4) చేపల పొడి 7 పాళ్లు (5) బెల్లపు మడ్డి 10 పాళ్లు (6) ఖనిజ లవణాల మిశ్రమం 3 పాళ్లు. -
మనుషులే కాదు.. మేం కూడా స్పందిస్తాం
న్యూఢిల్లీ : మనుషులకు మాత్రమే స్పందించే గుణం ఉందనుకుంటాం. కానీ కొన్ని సార్లు జంతువులు కూడా మనుషుల్లానే స్పందిస్తాయి. విచారం, ప్రేమ, బాధ వంటి ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచిందో సంఘటన. మన ఆప్తులు చనిపోతే.. శోకించడం.. సంతాపం తెలపడం సహజం. కానీ జంతువులు కూడా ఇలానే ప్రవర్తిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోన్న ఈ వీడియోను చూస్తే నమ్మక తప్పదనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ ఏనుగు చనిపోయిన పిల్ల ఏనుగును తీసుకొని రోడ్డు మీదకు వచ్చింది. ఆ వెంటనే చిన్నాపెద్దా ఏనుగులు దాని వెనకే వచ్చాయి. అవి అన్ని చనిపోయిన పిల్ల ఏనుగు మృతదేహం చుట్టూ చేరి.. ఓ నిమిషం పాటు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత పిల్ల ఏనుగు మృతదేహాన్ని తిరిగి అడవిలోకి తీసుకెళ్లాయి. ఈ తతంగాన్నంతా ప్రవీణ్ కస్వాన్ అనే ఫారెస్ట్ అధికారి వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మనుషులకే కాదు జంతువులు కూడా శోకాన్ని ప్రకటిస్తాయి.. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటున్నారు నెటిజన్లు. This will move you !! Funeral procession of the weeping elephants carrying dead body of the child elephant. The family just don’t want to leave the baby. pic.twitter.com/KO4s4wCpl0 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 7, 2019 -
ఆవు దూడ వింత ప్రవర్తన
చెన్నై : ఓ ఆవు దూడ వింత ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారింది. ఇంట్లో మనిషిలాగే తిరుగుతూ, మనుషులతో కలిసి నిద్రపోతోంది. పైగా.. దిండు మీద తలపెట్టుకొని దర్జాగా నిద్రిస్తోంది. చిన్న పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలను కూడా తినేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వీరంగుప్పం గ్రామానికి చెందిన ఆనందన్, అమృత దంపతులు డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. వారి ఫాంలోని ఓ ఆవు 3 నెలల కిందట ఓ లేగ దూడకు జన్మనిచ్చింది. పుట్టిన నాటి నుంచి అది యజమాని కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తోంది. ఆనందన్ కుటుంబ సభ్యులు ఆ లేగ దూడను తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా పరిగణిస్తూ.. ముద్దుగా ‘వేలన్’ అని పిలుచుకుంటున్నారు. వేలన్ మనుషులతో కలిసి ఇంట్లోనే తిరుగుతోంది. ఆకలేసినప్పుడు మాత్రమే పాల కోసం తల్లి ఆవు వద్దకు వెళ్తోంది. మిగతా సమయాల్లో ఆనందన్ కుటుంబంతోనే ఉంటోంది. ఇంట్లో వారితో కలిసి చాపపై తలకింద దిండు పెట్టుకొని పడుకుంటోందని యజమాని తెలిపారు. అంతేకాగా.. పాటలు వింటూ సంగీతానికి తగ్గట్లు కాళ్లు కదుపుతోందట. వింత చేష్టలతో ఈ ఆవు దూడ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రేజీ దూడ వేలన్‌తో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. దీంతో ఈ ఆవు దూడకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.