
బెంగళూరు : బెళగావి జిల్లాలో వింత దూడ జన్మించింది. జిల్లాలోని చిక్కోడి తాలూకా డొంబరకొప్ప గ్రామానికి చెందిన రైతు శివరుద్రప్పకు చెందిన ఓ గేదెకు శనివారం మూడు కళ్లు, రెండు నోర్లు, రెండు ముక్కులు ఉన్న దూడ జన్మించింది. రెండు నోర్లలో రెండు నాలుకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ దూడ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. జన్యు సంబంధలోపం కారణంగానే ఈ దూడ ఈ విధంగా జన్మించినట్లు పశువైద్యాధికారి పేర్కొన్నారు. ఇలాంటి జీవులు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం చాలా తక్కువని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment