బెంగళూరులో.. ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ విషాదం! | - | Sakshi
Sakshi News home page

బెంగళూరులో.. ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ విషాదం!

Jun 26 2024 12:16 AM | Updated on Jun 26 2024 1:01 PM

గుండెపోటుతో ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ మృతి

గుండెపోటుతో ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ మృతి

బెంగళూరులో కన్నుమూసిన పిండిప్రోలు వాసి

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన ఇద్దరు

ఖమ్మం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఊడుగుల కృష్ణమూర్తి(44) బెంగళూరులోని హిందుస్తాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పిండిప్రోలుకు చెందిన ఊడుగుల వెంకయ్య – మాణిక్యమ్మ మూడో కుమారుడు కృష్ణమూర్తి ఇరవై ఏళ్ల క్రితం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లో ఇంజనీర్‌గా చేరి డిప్యూటీ మేనేజర్‌ స్థాయికి ఎదిగాడు.

ఇటీవలే సొంత గ్రామంలో జరిగిన గ్రామ దేవత వేడుకకు కూడా హాజరయ్యాడు. ఈనెల 22న బెంగళూరులోని నివాసంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఆ సమయాన భార్య శిరీష, పిల్లలు ఖమ్మంలో ఉండడంతో కృష్ణమూర్తి మృతి విషయం రెండు రోజుల తర్వాత స్నేహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బెంగళూరు వెళ్లారు. కాగా, కృష్ణమూర్తి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

గంటల వ్యవధిలోనే తల్లీ కుమారుడు...
ముదిగొండ: గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రఘునాధపాలెం మండలం చిమ్మపూడికి చెందిన కణతల శేషగిరి(36) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతిచెందాడు. కుటుంబ, ఆర్థిక స మస్యల కారణంగా చిమ్మపూడికి చెందిన తల్లీ,కుమారుడు కణతాల నర్సమ్మ(55), శేషగిరి(36) ముదిగొండ మండలం సువర్ణాపురం శివారులో ఈనెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.

వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం నర్సమ్మ మృతి చెందింది. అలాగే, ఆమె కుమారుడు శేషగిరి అర్థరాత్రి దాటాక మృతి చెందగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదిగొండ ఎస్‌ఐ గజ్జెల నరేష్‌ తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement