bengalore
-
వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..
బెంగళూరు: మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాల తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. మైనర్లకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. భార్యను ఆమెను ఎత్తుకుని పరుగు తీశాడు. దీంతో, అక్కడున్న వారు.. ఆమెను కిడ్నాప్ చేశారని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం..తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించి.. కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29)తో వివాహం జరిపించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవలే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. అనంతరం, సదరు బాలిక తన స్వగ్రామానికి వచ్చేసింది. ఈ క్రమంలో అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది."என்னை விடுங்க.." உயிரை வெறுத்து கதறிய சிறுமி.. குண்டுக்கட்டாக தூக்கி சென்ற இளைஞர் - ஷாக்கிங் வீடியோ#childmarriage #hosur #thanthitv pic.twitter.com/lheSh1UjZ8— Thanthi TV (@ThanthiTV) March 6, 2025అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాలని పేరెంట్స్.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు. దీంతో, భర్త మాదేష్, అతడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటి వచ్చారు. బలవంతంగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొందరు ఆమెకు కిడ్నాప్ చేస్తున్నారని అనుకున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక, బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. -
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ప్రారంభం
-
భారత్ లో చైనా వైరస్.. HMPV కలకలం
-
బెంగళూరులో ఇద్దరి చిన్నారులకు పాజిటివ్..!
-
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డీ కుమార్తె వివాహనికి హాజరైన వైఎస్ జగన్ దంపతులు
-
రన్నింగ్ కారును తన్నుతున్న పోకిరీలు
-
బెంగళూరులో.. ఏరోనాటికల్ ఇంజనీర్ విషాదం!
ఖమ్మం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఊడుగుల కృష్ణమూర్తి(44) బెంగళూరులోని హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పిండిప్రోలుకు చెందిన ఊడుగుల వెంకయ్య – మాణిక్యమ్మ మూడో కుమారుడు కృష్ణమూర్తి ఇరవై ఏళ్ల క్రితం బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఇంజనీర్‌గా చేరి డిప్యూటీ మేనేజర్ స్థాయికి ఎదిగాడు.ఇటీవలే సొంత గ్రామంలో జరిగిన గ్రామ దేవత వేడుకకు కూడా హాజరయ్యాడు. ఈనెల 22న బెంగళూరులోని నివాసంలో బాత్రూమ్కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఆ సమయాన భార్య శిరీష, పిల్లలు ఖమ్మంలో ఉండడంతో కృష్ణమూర్తి మృతి విషయం రెండు రోజుల తర్వాత స్నేహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బెంగళూరు వెళ్లారు. కాగా, కృష్ణమూర్తి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.గంటల వ్యవధిలోనే తల్లీ కుమారుడు...ముదిగొండ: గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రఘునాధపాలెం మండలం చిమ్మపూడికి చెందిన కణతల శేషగిరి(36) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతిచెందాడు. కుటుంబ, ఆర్థిక స మస్యల కారణంగా చిమ్మపూడికి చెందిన తల్లీ,కుమారుడు కణతాల నర్సమ్మ(55), శేషగిరి(36) ముదిగొండ మండలం సువర్ణాపురం శివారులో ఈనెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం నర్సమ్మ మృతి చెందింది. అలాగే, ఆమె కుమారుడు శేషగిరి అర్థరాత్రి దాటాక మృతి చెందగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదిగొండ ఎస్ఐ గజ్జెల నరేష్ తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
అమెజాన్ పార్సిల్ లో పాము కలకలం
-
చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే కన్నుమూత
భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ హెగ్డే మూడు దశాబ్దాలకు పైగా (1978 నుండి 2014) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేశారు.ఈ సమయంలో అంతరిక్ష సంస్థ నిర్వహించిన అనేక చారిత్రాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ముఖ్యమైనది 2008లో చేపట్టిన చంద్రయాన్-1. ఇది చంద్రునిపై నీటి అణువులను గుర్తించింది. శ్రీనివాస్ హెగ్డే పదవీ విరమణ అనంతరం బెంగళూరుకు చెందిన స్టార్టప్ టీమ్ ఇండస్‌లో చేరారు. -
పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీకి బెయిల్
బెంగళూరు: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీకి బెంగళూరు లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం స్పెషల్ మెజిస్ట్రేట్ కేఎన్ శివకుమార్ రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేశారు. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2019-2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రతీ పనిలోనూ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కేశవ్ ప్రసాద్.. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం న్యాయమూర్తి ఎదుట రాహుల్‌గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత ఈ కేసు విచారణను జులై 30వ తేధీకి వాయిదా వేసింది. -
బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధంలేదు: సినీ నటి హేమ
-
రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు..
-
ఐపీఎల్ అంత బోరింగ్‌గా ఉందా..!? అమ్మడు పనికి నెటిజన్లు షాక్!
బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దర్శమిన్చిన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు స్వయంగా స్టేడియంలో కూచుని చూడటమంటే చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్లు దొరకడం చాలా గగనం కూడా. అయితే టికెట్ కొనుక్కుని మరీ మ్యాచ్‌ను చూడటం మానేసిన ఒక అమ్మడు తీరిగ్గా అమెరికన్ పాపులర్ షో చూస్తూ కూచోవడం కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్బంగా ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ "ఈ అమ్మాయి ఐపిఎల్ మ్యాచ్‌లో ‘ఫ్రెండ్స్’ చూస్తోందంటే నమ్మలేకపోతున్నాను" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశాడు. అంతే ఇది లక్షల వ్యూస్, లైక్స్‌తో చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ సంవత్సరం ఐపీఎల్ అస్సలు ఆసక్తికరంగా లేదు, బోరింగ్‌గా కనీసం నా సర్కిల్లో కూడా ఆసక్తికరంగా లేదు’’ ఒకరు, ‘‘ఇందులో నమ్మలేకపోవడానికేమీ లేదు.. చిన్న స్వామి స్టేడియం అంతే.. ఆ అమ్మాయిని నిందించి లాభం లేదు’’ అని మరొకరు "మ్యాచ్ తప్పనిసరిగా బోరింగ్‌గా ఉందేమో బ్రో’’, ‘‘ఆర్సీబీ ఫ్యాన్ అందుకే’’ ఇలా రక రకాల కమెంట్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని మూట గట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. Can’t believe this girl is watching Friends during an IPL match 😭 pic.twitter.com/fgL14lPGyC — Deepak Kumaar (@immunewolf_) April 2, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22నప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్ అనగానే లైవ్‌లో మ్యాచ్‌ను, అభిమాన ఆటగాళ్లను చూడాలనే ఉత్సాహం, థ్రిల్ కోసం స్టేడియం టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. టికెట్లు దక్కని వారు, స్థోమత లేని క్రికెట్ అభిమానులు టెలివిజన్ స్క్రీన్లకు అతుక్కుపోతారు.అన్నట్టు మ్యాచ్ సందర్బంగా కెమెరా మెన్లు పనితీరును మెచ్చుకోవాల్సిందే. మ్యాచ్‌లోని అద్భుత క్షణాలను మాత్రమే కాదు, గ్యాలరీలో చోటు చేసుకునే దృశ్యాలను క్యాప్చర్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటారు. అందమైన అమ్మాయిలు వారి చేష్టలు, సెలబ్రిటీ హావభావాలు, తదితర దృశ్యాలు టీవీల ముందు కూర్చున్నవారికి మంచి కాలక్షేపం. -
నేనూ ట్రోల్స్‌కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్‌కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
ముంబైలోనూ నీటి కష్టాలు.. నీటి సరఫరా 15 శాతం కట్?
దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చుక్క నీటి కోసం జనం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ముంబైలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తాజాగా నీటి సరఫరాను ఐదు శాతంమ మేరకు తగ్గించింది. ఈరోజు (మార్చి 19) ముంబైలో నీటి కోత 15 శాతం మేరకు ఉంటుందని ప్రకటించింది. దీంతో ముంబైవాసులలో ఆందోళన పెరిగింది. నిర్వహణ పనుల కారణంగా నీటి సరఫరాను తగ్గించినట్లు బీఎంసీ పేర్కొంది. పౌర సంఘం తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని పైస్ డ్యామ్‌లో నీటి కొరత కారణంగా నగరం అంతటా అదనపు నీటి కోత విధించారు. తాజాగా బీఎంసీ ఒక ప్రకటనలో మహానగరానికి 60 కి.మీ దూరంలో ఉన్న డ్యామ్‌కు భట్సా రిజర్వాయర్ నుండి నీరు వచ్చిన తర్వాత నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని తెలిపింది. ఇదిలావుండగా ఆసియాలోని అతిపెద్ద ప్లాంట్లలో ఒకటైన భాండూప్‌లోని వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్‌లో క్లీనింగ్ కారణంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు ముంబైలో ఐదు శాతం నీటి కోతను బీఎంసీ ప్రకటించింది. డ్యామ్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున గతంలో పది శాతం నీటిని తగ్గించాలని ప్రతిపాదించింది. కాగా కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే బెంగళూరులో 14 వేల బోర్‌వెల్స్‌లో 6,900 ఎండిపోయాయి. దీంతో పాటు చెరువులన్నీ కూడా దాదాపు అడుగంటిపోయాయి. -
Rameshwaram Cafe Bomb Blast: యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్ కాల్
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నుంచి ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సినీ ఫక్కీలో తృటిలో తప్పించుకున్నాడు. శుక్రవారం(మార్చ్ 1)మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు జరిగిన సమయంలో బిహార్‌కు చెందిన టెకీ కుమార్ అలంకృత్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ చేస్తున్నాడు. పేలుడు జరడానికి కొద్ది క్షణాల ముందు అలంకృత్‌కు అతడి తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడటం కోసం అలంకృత్ కేఫ్ బయటికి వచ్చాడు. ఇంతలో కేఫ్ లోపల పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. ఘటన తర్వాత అలంకృత్ మాట్లాడుతూ‘నేను లంచ్ కోసం కేఫ్‌కు వచ్చాను. ఇడ్లీ తినడం పూర్తి చేసి దోశ తినడం స్టార్ట్ చేద్దామనుకునే లోపు మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని బయటికి వెళ్లాను. ఇంతలో పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలిందేమో అని మొదట అనుకున్నాను. ఎలా ఉన్నావు. తిన్నావా.. లేదా అని అడగడానికి మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మ నుంచి ఫోన్ రాకపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదు’అని అలంకృత్ చెప్పాడు. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌లో కీలకంగా ఏఐ -
బెంగళూరులో అదృశ్యమైన బాలుడు హైదరాబాద్ లో ప్రత్యక్షం
-
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
-
మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు!
ఐటీ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్ మీడియా ప్లాట్ఫారం రెడ్డిట్‌లో షేర్ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన స్నేహితురాలు కళాశాలకు రోజూ బస్సులో వెళతారని, అయితే ఆమె సోమవారం (నవంబర్ 20) మెట్రోలో ప్రయాణించారన్నారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లోని మెట్రోలో జనం ఎక్కువగా ఉన్నారని, దీంతో తోపులాటలు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత, నా స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించింది. ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. అతను ఆమెను అసభ్యంతా తాకడంతోపాటు గోర్లతో ఆమెను గుచ్చాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అయినా తోటి ప్రయాణికులెవరూ పట్టించుకోలేదు. ఇంతలో అతను పారిపోయాడని ఆ ఫ్రెండ్ పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు యూజర్స్ స్పందిస్తూ , తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఒక యూజర్ తాను మెట్రోలోనే పనిచేస్తున్నానని, మెట్రో అంతటా సీసీటీవీ నిఘాలో ఉన్నందున చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారన్నారు. ఈ వేధింపుల విషయమై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా అతను సహాయం అందిస్తాడని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు -
ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు
‘‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ ‘బొమ్మరిల్లు’ హాసిని చెప్పిన ఈ డైలాగ్.. కప్పు కాఫీ తాగుతూ, నాలుగు మాటలు మాట్లాడుకోవడంలోని మజాని తెలియజేస్తుంది. చాలామందికి పొద్దున్నే సూర్యుని కన్నా ముందుగా కాఫీ కనిపిస్తుంది. దానిని ఆస్వాదించిన తరువాతనే వారి దినచర్య మొదలవుతుంది. ఏది ఏమైనా కాఫీ సేవనం మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల బెంగళూరులో జరిగిన 5వ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ (డబ్ల్యుసీసీ) ఘుమఘుమలు ప్రపంచాన్నంతటినీ తాకాయి. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు బెంగళూరులోని ప్రసిద్ధ బెంగళూరు ప్యాలెస్‌లో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కాఫీ పరిశ్రమల సహకారంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ (ఐసీఓ)ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సును ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమావేశాలు, స్కిల్ బిల్డింగ్ వర్క్‌షాప్‌లు, స్టార్టప్ సమ్మిట్లు నిర్వహించారు. అలాగే పలు రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహమతులు, అవార్డులు అందజేశారు. ప్రపంచ కాఫీ సమ్మేళనంలో 2400 మంది ప్రతినిధులు, 128 మంది స్పీకర్లు, 208 మంది ఎగ్జిబిటర్లు, 10 వేల మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రస్తుతం 60 దేశాల్లో కాఫీని పండిస్తుండగా, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారీ కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఇదికూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? -
హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బెంగళూరు టెక్ హబ్‌గా అవతరించింది, అయితే భాగ్యనగరం (హైదరాబాద్) ఇప్పుడిప్పుడే వేగంగా ఈ దిశవైపు పరుగులు పెడుతోంది. కాగా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఖర్చులు తక్కువగా ఉంటాయని ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత నెలకు రూ. 40,000 ఆదా చేస్తున్నట్లు, దీంతో చాలా హ్యాప్పీగా గడుపుతున్నట్లు పోస్ట్ చేసాడు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు నిజమే అని అతని మాటలతో ఏకీభవించగా.. మరి కొందరు ఇదెలా సాధ్యం, ఇది నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Moved from Bangalore to #Hyderabad Saved 40k per month expenses. One family can live peacefully with that money. 💰 Not seeing any a point of living alone when my values match with my family’s. — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 కొంతమంది బెంగళూరులో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడున్నారు, ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా రెంట్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి రూ. 40వేలు ఎలా ఆదా చేస్తున్నావని ఒక నెటిజన్ అడగగా దానికి రిప్లై ఇస్తూ రెంట్, మెయింటెనెన్స్, వాటర్, కరెంట్ బిల్ అని వెల్లడించాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! బెంగళూరులో అయినా.. హైదరాబాద్‌లో అయినా ఉన్న ప్రాంతన్ని బట్టి ఇంటి అద్దె ఉంటుంది. ఇక నిత్యావసరాలు, ప్రయాణ చార్జీలు ఇలా తీసుకుంటే ఎక్కడైనా దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Rent + maintenance + water, electric bills + food — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 -
1985లో టెన్త్.. 2023లో పీయూసీ.. విద్యాదాహాన్ని తీర్చుకుంటున్న ఆటోడ్రైవర్
బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఇటీవల ఎక్స్(ట్విట్టర్)లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ట్వీట్ చేశారు. ఆటో డ్రైవర్ భాస్కర్‌తో తనకు ఎదురైన అద్భుత అనుభవాన్ని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. భాస్కర్ ఇటీవలే తన ప్రీ- యూనివర్శిటీ(పీయూసీ) పరీక్ష రాశారని తెలిపారు. నిధి తన పోస్టులో ఆటో డ్రైవర్ భాస్కర్ 1985లో స్కూలు మానివేసినప్పటి నుంచి ఉన్నత విద్య చదవాలనే తపనతో ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఒక ఫొటోతో పాటు నిధి అగర్వాల్ ఇలా రాశారు ‘ఈరోజు ఓలాక్యాబ్స్ ఆటో ద్వారా భాస్కర్ పరిచయం అయ్యారు. ఈ రోజే ఆయన పీయీసీ పరీక్షలోని ఆంగ్ల ప్రశ్నాపత్రం రాశారు. భాస్కర్ 1985లో 10వ తరగతి పాసయ్యాక ఈ ఏడాది పీయూసీ పరీక్ష రాశారు. భాస్కర్ పిల్లలు స్కూలులో చదువుతున్నారు. భాస్కర్‌కు చదువుపై ఉన్న శ్రద్ధ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది’ అని రాశారు. నిధి అగర్వాల్ అందించిన ఈ పోస్టు ఇంటర్నెట్లో సందడి చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ పోస్టుకు 1,500కు మించిన వీక్షణలు దక్కాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఇటువంటి అనేక కథలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! "Introducing Baskar ji, my @Olacabs auto companion today. He faced his English paper today, he is writing PUC exams this year after cleaning 10th in 1985. Father of two, with kids in 3rd and 6th grade. His enduring smile was truly motivating! @peakbengaluru pic.twitter.com/5R21YtdomZ — Nidhi Agarwal (@Ngarwalnidhi) August 26, 2023 -
ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో మార్పులు..
సాక్షి, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ కూటమి సమావేశాలకు హజరయ్యారు. కాగా, ఈ పర్యటన ముగించుకుని మోదీ.. రేపు(శనివారం) భారత్‌కు చేరుకోనున్నారు. అయితే, ఆయన తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ నేరుగా బెంగళూరు చేరుకోనున్నారు. ఈ క్రమంలో మోదీ.. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు చేరుకుని చంద్రయాన్-3 బృందాన్ని కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించి ముచ్చటించనున్నారు. అనంతరం, ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక, ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ బెంగళూరు వస్తున్న నేపథ్యంలో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కర్ణాటక బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. ప్రధాని రాక సందర్భంగా నగరంలో మెగా రోడ్ షో నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.అశోక తెలిపారు. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో 6,000 మందికి పైగా జనంతో పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలుకనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం!
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ర్యాపిడోలో రైడ్ బుక్ చేశాడు. కొంతసేపటికి ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మోటార్‌సైకిల్‌పై రావడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎంతో ఆనందపడిపోయాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకున్న అతను కంగుతిన్నాడు. నిషిత్ పటేల్ తన ర్యాపిడో రైడ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుబెర్నెట్స్ మీట్అప్కు వెళ్లేందుకు అతను ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ర్యాపిడో డ్రైవర్ హై ఎండ్ మోటార్ సైకిల్‌పై రావడంతోపాటు, అతనొక నూతన టెక్నాలజీని రూపొందించే ఇంజినీర్ అని తెలిసేరికి అతను కంగుతిన్నాడు. పైగా అతను తాను పనిచేస్తున్న కుబెర్నెట్స్ క్లస్టర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిసే సరికి నిషిత్ పటేల్ షాకయ్యాడు. ఈ పోస్టుకు 6 వేలకు పైగా వ్యూస్ దక్కడంతో పాటు యూజర్స్ నుంచి లెక్కకుమించిన కామెంట్స్ వస్తున్నాయి. ఒక యూజర్ ‘మీరు అతని సైడ్ బిజినెస్ టర్నోవర్ ఎంతో అడగాల్సింది’ అని నిషిత్‌ను అడగగా, ‘అవును ఆ తరువాత నా మదిలో అదే ప్రశ్న వచ్చిందని’ నిషిత్ తెలిపారు. మరో యూజర్ ‘అయితే ఏమైంది? అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యాధికులు ఎన్నో ఏళ్లుగా ఓలా, ఉబర్, ర్యాపిడోలను నడుపుతున్నారు’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట! You won't believe the crazy @peakbengaluru moment I had today! On my way to a Kubernetes meetup, my Rapido captain pulled up on a Royal Enfield Hunter. Turns out he's a DevOps engineer at a company managing enterprise Kubernetes clusters. Just another day in India's tech capital — Nishit Patel (@nishit130) August 5, 2023 -
స్వీట్ పాప్‌కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే..
ఈ రోజుల్లో హోమ్ డెలివరీ సర్వీస్ అందిస్తున్న పలు ప్రైవేట్ కంపెనీలు క్రియేటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఇవి ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి కోవలోకే వచ్చే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు చెందిన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి డెలివరీ అయిన వస్తువులలో తాను ఆర్డర్ చేయని ఒక వస్తువు రావడంతో ఆమె కంగుతింది. పౌషాలీ సాహు అనే మహిళకు ఆమె ఆర్డర్ చేసిన క్యారమెల్ పాప్‌కార్న్‌తో పాటు సదరు ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఒక కాకరరాయ వచ్చింది. కాకరకాయను ఆర్డర్ చేయకుండానే, దానిని పంపడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనితో పాటు ఆమెకు ఒక పెద్ద నోట్ కూడా వచ్చింది. ఆమె స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ‘స్విగ్గీలో తాను ఆర్డర్ చేసిన కారమెల్ పాప్‌కార్న్ ప్యాకెట్‌తో పాటు ఒక కాకరకాయ వచ్చింది’ అని పేర్కొంది. దీనిని విచిత్రమైన ఫ్రెండ్షిప్ క్యాంపెయిన్‌గా స్విగ్గీ పేర్కొంది. సాహూ తన ట్విట్టర్ ఖాతాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నోట్‌తోపాటు కాకరకాయ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ లెటర్లో ఒక కవితతో పాటు ఒక లైఫ్ లెసన్ కూడా ఉంది. ‘ఒక్కోసారి మనం వేటినైతే దూరం పెడుతుంటామో అవే మనకు అత్యంత అవసరమైనవి అవుతుంటాయి.. కాకర మాదిరిగా’ అని దానిలో రాసివుంది. అలాగే నిజమైన స్నేహితులు మనం చెడుదారిలో వెళ్లకుండా చూస్తారని, ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారని, అయితే మంచి చేసే స్నేహితుల మాటలు ఒక్కోసారి చేదుగా ఉంటాయని’ దానిలో రాసివుంది. ‘ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మీరు కాకరతో సంబరాలు జరుపుకోండి. ఎందుకంటే అలాంటివారే మంచి స్నేహితులు’ అని స్విగ్గీ పేర్కొంది. ఈ పోస్టును చూసిన యూజర్లు ఇది అద్భుతమైన క్యాంపెయిన్ అని పేర్కొంటున్నారు. ఒక యూజర్ ‘నిజమైన స్నేహితులెప్పుడూ చేదుగానే ఉంటారని’ వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్! The weirdest #FriendshipDay campaign ever! 😀 #Swiggy sent me a bitter gourd with the caramel popcorn packets I ordered yesterday.. pic.twitter.com/dc3I9Q1ItO — Paushali Sahu 🎶 (@PaushaliSahu) August 7, 2023 -
ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి
-
బెంగళూరులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
Karnataka: బెంగళూరులో 144 సెక్షన్
బెంగళూరు: కర్ణాటకలో రేపు(శనివారం) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు గెలుపు తమదంటే తమదేనని తెగేసి చెబుతున్నాయి. అటు జేడీఎస్ మాత్రం కీరోల్ మాదేనంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎన్నికల్లో ఫలితాల్లో సందర్భానుసారం, కర్ణాటకకు ఎవరితో మంచి జరుగుతుందో బేరీజు వేసుకుని మద్దతు ప్రకటిస్తామని జేడీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించన్నట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపుపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితాలపై కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది. Karnataka Assembly Elections 2023 LIVE Updates: Sec 144 imposed in Bengaluru, liquor sale banned https://t.co/oCoxBnE9Pd Ramesh rightly observed that Modi is responsible for Karnataka, TN, Kerala, AP, Telangana losses. South India will be renamed as Islamic Republic of India — Nationalist (@JagdeepakSharma) May 12, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్ -
బెంగళూరులో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రోడ్ షో
-
కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలేష్ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యూజిక్ కన్సర్ట్‌లో పాట పాడుతున్న ఆయనపై ఇద్దరు యువకులు బాటిల్‌తో దాడి చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం బెంగళూరులో హంపీ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకలను నిర్వహించారు. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆయన పాటలు పాడుతుండగా ఇద్దరు యువకులు ఆగ్రహంతో ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ కైలాష్కు సమీపంలో పడటంతో ప్రమాదం తప్పింది. బాటిల్ తనవైపు పడినప్పటికి కైలేష్ ఖేర్ అదేది పట్టించుకోకుండ తన ప్రదర్శను కొనసాగించారు. అనంతరం స్టేజ్‌పై ఉన్న సెక్యూరిటీ ఆ బాటిల్‌ను తీసేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన మొత్తం హిందీ పాటలే పాడుతున్నారని, కన్నడ పాట పాడటం లేదనే ఆగ్రహంతోనే బాటిల్ విసిరినట్లు సదరు యువకులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్ -
నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి బెంగుళూరుకు తారకరత్న..
కుప్పం/కుప్పం రూరల్ (చిత్తూరు జిల్లా) : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో ఆదిలోనే అపశ్రుతి చోటుచేసుకుంది. లోకేశ్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు మనుమడు తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు. శుక్రవారం ఉదయం 11.10 గంటలకు కుప్పం మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలో బాబునగర్ వద్ద ఉన్న మసీదుకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 12 గంటల సమయంలో మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు తోసుకొని మీద పడటంతో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. నిలదొక్కుకోలేక సొమ్మసిల్లి కింద పడిపోవటంతో కార్యకర్తలు హుటాహుటిన పట్టణంలోని కేసీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో పీఈఎస్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, రక్తనాళాలు 90 శాతం మూసుకుపోవటంతో తారకరత్న స్పృహ కోల్పోయాడన్నారు. ప్రాణాపాయం లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తారకరత్నను ఆస్పత్రికి తరలించగానే మరోవైపు లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. తారకరత్న వెంట వెళ్లకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించడంపై పార్టీలోని పలువురు నేతలు విస్మయం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుడు, బావ అయిన ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసినా, లోకేశ్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని, ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని వారు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా, తారకరత్నకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, వారినెవరినీ బయటకు పంపడం లేదని.. బయటి నుంచి కూడా ఎవరినీ ఆస్పత్రి లోపలకు అనుమతించడం లేదని సిబ్బంది కుటుంబీకులు వాపోతున్నారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని టీడీపీ శ్రేణులే గుసగుసలు పోతుండటం గమనార్హం. నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరుకు.. ఆస్పత్రిలో తారకరత్నకు వైద్యం అందించిన వైద్యులు.. బెంగళూరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రి మెడికల్ రిపోర్ట్ సమర్పిస్తే తప్పకుండా సహకరిస్తామని ఎస్పీ వారికి తెలిపారు. అంతలో తొలి రోజు పాద యాత్ర ముగించుకున్న లోకేశ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మామ బాలకృష్ణతో మాట్లాడారు. ఆ తర్వాత తారకరత్నను బెంగళూరుకు తరలించడం లేదని, బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు ఇక్కడే చికిత్స అందిస్తారని పార్టీ శ్రేణులకు వారు సమాచారం ఇచ్చారు. లోకేశ్ వెళ్లగానే నిర్ణయం మారిపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యపో యారు. బెంగళూరుకు తీసుకెళ్లుంటే మరింత మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేదని, ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 9.30 గంటలకు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక(9) పీఈఎస్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు తారకరత్న బావమరిదితో బాలకృష్ణ, లోకేశ్, మరికొందరు మాట్లాడాకే.. తారకరత్నకు ఇక్కడే వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు. తారకరత్న కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఇక్కడే వైద్యం కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే నాటకీయపరిణామాల మధ్య అర్థరాత్రి సమ యంలో తారకరత్నను మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలించారు. -
ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ఓ పెళ్లికూతురు వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె తన కారును రోడ్డుపైనే వదిలిపెట్టి మెట్రోలో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. సరిగ్గా మూహూర్తం టైంకు అక్కడకు వెళ్లింది. ఎంచక్కా అనుకున్న సమయానికి మనువాడింది. ఒంటినిండా నగలు, మేకప్‌తో పెళ్లికుతూరు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం చూపరులను ఆకర్షించింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం సహజమే. ఈ పెళ్లికుతూరు కారు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఎంతసేపైనా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఓ వైపు ముహూర్తం టైం దగ్గరపడుతోంది. దీంతో ఆమె తెలివిగా ఆలోచించి కారు నుంచి దిగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు వెళ్లింది. ఎంచక్కా మెట్రో రైలులో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. ముహూర్తం టైంకు పెళ్లి చేసుకుంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H — Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023 ఈమె మెట్రోలో ప్రయాణించిన వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆమెను కొనియాడారు. ఈ పెళ్లి కూతురు చాలా స్మార్ట్ అని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ ఉంటుందని తెలుసు కదా.. టైంకి పెళ్లిమండపానికి చేరుకునేలా కాస్త ముందే బయల్దేరవచ్చు కదా.. పంచువాలిటీ లేదా? అని వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్.. అసెంబ్లీలో లంచం డబ్బు.. నోట్ల కట్టలతో ఆప్ ఎమ్మెల్యే ఆరోపణలు.. -
ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా
నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యాదగిరి ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా శేరిలింగంపల్లికి చేరుకున్నాడు. ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా చేరాడు. భార్య అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలో పనికి కుదిరింది. యాదగిరి నెలకు రూ.15 వేలు వేతనం, భార్యకు ఒక్కో ఫ్లాట్ నుంచి రూ.2,500 చొప్పున పది ఫ్లాట్ల నుంచి రూ.25 వేలు వస్తున్నాయి. ఇంటి యజమానులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలను ఉదయం, సాయంత్రం బయట తిప్పినందుకు రూ.5 వేలు, వారి వ్యక్తిగత వాహనాలను శుభ్రం చేసినందుకు నెలకు రూ.500–700 చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా ఈ జంట సగటున రూ.50 వేలకుపైగా సంపాదిస్తోంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంటుగా మారిన ఒకప్పటి నిరుద్యోగి ప్రస్తుతం నెలకు రూ.లక్షకుపైగా సంపాదిస్తుండటం విశేషం. సాక్షి, రంగారెడ్డిజిల్లా: సగటు వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైని మించిపోయింది. ముంబై వాసి వార్షికాదాయం రూ.6.43 లక్షలు ఉండగా, ఈ జిల్లా సగటు వ్యక్తి ఆదాయం రూ.6.59 లక్షలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్‌డీపీఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, అహ్మదాబాద్, కోయంబత్తూరు, ఎర్నాకులం ఉన్నాయి. హైదరాబాద్ రూ.3.51 లక్షలు, మేడ్చల్ రూ.2.40 లక్షలు, వికారాబాద్ రూ.1.32 లక్షలుగా నమోదయ్యాయి. ఉపాధి అవకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు హైదరాబాద్ నగరంతో జిల్లా మిళితమై ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ 158.50 కిలోమీటర్ల పొడవు ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ విశాలమైన భూములు ఉండటం, తక్కువ వేతనాలకే కావాల్సిన మానవ వనరులు లభిస్తుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ప్రతిష్టాత్మాక గూగుల్, యాపిల్, ఫేస్బుక్, ట్విట్టర్, అమేజాన్, మహేంద్ర, ఇతర టెక్‌సంస్థలు కేంద్ర కార్యాలయాలు తెరిచాయి. సుమారు ఏడు లక్షల మంది ప్రత్యక్షంగా, మరో పది లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరి నెలసరి వేతనాలు రూ.లక్షల్లో ఉండడంతో తమ ఆదాయాన్ని ఇళ్లు, భూములు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు ఆకుకూరలు, కాయగూరలు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన రైతులు రాత్రికి రా త్రే కోటిశ్వరుల జాబితాలో చేరిపోయారు. చేతి నిండా డబ్బు ఉండటంతో ఖర్చుకు వెనకాడటం లేదు. నివాసయోగ్యమైన ప్రాంతం ఢిల్లీ, ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాలు జీవనయోగ్యమైన జాబితాలో ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటు సమశీతోష్ణ పరంగానే కాకుండా అటు సురక్షితం కావడంతో కీలకమైన రక్షణ, ఎయిర్‌ఫోర్స్, మిలట్రీ శిక్షణ కేంద్రాలు, పరిశోధక కేంద్రాలు కొలువుదీరాయి. ప్రభుత్వం సిటిజన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పోలీస్ కంట్రోల్ టవర్లను నిర్మించి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ చీమచిటుక్కుమన్నా ఇట్టే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త పారిశ్రామికవాడలు, టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీ వంటి అంశాలు కూడా జిల్లావాసుల సగటు ఆదాయం పెరుగుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!) -
ఇంటివాడైన టాలీవుడ్ హీరో నాగశౌర్య
-
విషాదం: నర్సు ఆత్మహత్య.. కారణం అదేనా..?
యశవంతపుర: వయసు మీదపడుతున్నా ఆమెకు పెళ్లి కావడం లేదు. జీవితంలో నీకు పెళ్లి కాదంటూ ఆట పట్టించారు. దీంతో మనస్థాపానికి గురైన ఓ నర్సు.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గిరినగర్‌లో సుమిత్ర (32) అనే యువతి నివాసం ఉంటోంది. స్థానిక ప్రశాంత్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పెళ్లి వయసు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. కానీ, చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. దీంతో, సుమిత్ర తీవ్ర ఆవేదనకు గురైంది. తర్వాత యథావిధిగానే ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వర్క్‌పై ఫోకస్ పెట్టింది. కాగా, తన స్నేహితులు, ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సహోద్యోగులు.. పెళ్లి విషయంలో ఆట పట్టించేవారు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనోవేదనకు గురైంది. గురువారం రాత్రి గదికి తాళం వేసుకొని ఉరి వేసుకుంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా శవమై కనిపించింది. సమాచారం అందుకున్న గిరినగర పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి తానేకారణమంటూ అందులో సుమిత్ర రాసినట్లు గుర్తించారు. మృతదేహానికి కిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో దారుణం.. మహిళను మెయింటెనెన్స్ రూమ్‌లోకి లాక్కెళ్లి.. -
భార్యతో భర్త రిలేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: ఎలాంటి భావనాత్మక సంబంధం లేకుండా, భార్య అంటే డబ్బును అందించే ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానమని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దుచేసి మహిళ ఆకాంక్ష మేరకు విడాకులను మంజూరు చేసింది. వ్యాపారాలని డబ్బు కోసం ఒత్తిళ్లు వివరాలు... బెంగళూరులో 1991లో వివాహమైన దంపతులకు 2001లో ఆడపిల్ల పుట్టింది. వ్యాపారం నిర్వహిస్తున్న భర్త అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. ఈ సమయంలో భార్య ఉపాధి కోసం బ్యాంకు ఉద్యోగంలో చేరింది. 2008లో భర్త దుబాయిలో సెలూన్ తెరుస్తానంటే రూ.60 లక్షలు ఇచ్చింది. కానీ అక్కడ కూడా నష్టాలు రావడంతో భర్త మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. నిత్యం డబ్బు కావాలని పీడిస్తుండడంతో తట్టుకోలేక ఆమె విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. భర్త ధోరణిపై జడ్జిల ఆగ్రహం మంగళవారం ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ అలోక్ ఆరాదే, జేఎం.ఖాజీల ధర్మాసనం విచారించింది. భార్యతో ఆ భర్త ఎలాంటి అనుబంధం లేకుండా యాంత్రికంగా భర్త పాత్ర పోషిస్తున్నాడని, ఆమెను కేవలం డబ్బులు ఇచ్చే ఏటీఎంగా వాడుకుంటున్నాడని జడ్జిలు పేర్కొన్నారు. భర్త ప్రవర్తనతో భార్య మానసికంగా కుంగిపోయిందని ఇది మానసిక వేధింపులతో సమానమని స్పష్టం చేశారు. కానీ ఫ్యామిలీ కోర్టు ఈ అంశాలను పరిగణించడంలో విఫలమైందన్నారు. కేసును కూడా సక్రమంగా విచారించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. భార్య వాదనను పరిగణించిన హైకోర్టు ఆమెకు విడాకులు మంజూరుచేసింది. -
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్డమ్. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! కన్నడలో హీరోయిన్గా 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు రూట్ కెనాల్ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
సోషల్ మీడియాలో అశ్లీల కామెంట్స్, పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. కన్నడ నటి అయిన రమ్య అభిమన్యు మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది. చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు ప్రస్తుతం సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో రమ్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతడిని అరెస్టు చేయాలని ఆమె బెంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్ 10) విడుదలైంది. నిన్న ప్రివ్యూ చూసిన రమ్య సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ అశ్లీలమైన కామెంట్ చేశాడు. దీంతో రమ్య ప్రీతమ్ ప్రీన్స్ తరచూ తనని ట్రోల్ చేస్తున్నాడని, అతడి అరెస్టు చేయాలని కోరుతూ గురువారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతమ్ ప్రిన్స్ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దిశగా విచారిస్తున్నారు. #Charlie777 is an emotional film that teaches us humans so caught up in our grand position in the chain of being the importance of love & the joie de vivre we need to embrace. Thank you @rakshitshetty @Kiranraj61 for this warm-hearted tearjerker. https://t.co/wzygIxkMFx — Divya Spandana/Ramya (@divyaspandana) June 7, 2022 -
బెంగళూరు కంటే హైదరాబాద్‌లో వీటికి డిమాండ్ ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లుగానే కరోనా తర్వాత కో–వర్కింగ్ స్పేస్ శరవేగంగా కోలుకుంది. బహుళ జాతి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌ను కొనసాగిస్తుండటం, మధ్య స్థాయి కంపెనీలు హైబ్రిడ్ విధానంలో పని చేస్తుండటంతో కో–వర్కింగ్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.41 కోట్ల చ.అ. నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో 13 శాతం వాటా (44.3 లక్షల చ.అ.) కో–వర్కింగ్ స్పేస్ విభాగానిదే. 2020–21 ఆర్థిక సంవత్సరంలో టాప్–7 నగరాల్లో 2.13 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో కో–వర్కింగ్ స్పేస్ 5 శాతం వాటాను కలిగి ఉందని అనరాక్ రిపోర్ట్ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధి రేటు నమోదయింది. అన్ని కార్యాలయాల విభాగాలలో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావటం గమనార్హం. క్షీణించిన ఐటీ, ఈ–కామర్స్.. ఆశ్చర్యకరంగా 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఐటీఈఎస్, ఈ–కామర్స్ రంగాల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు క్షీణించాయి. 2021 ఆర్ధికంతో పోలిస్తే తయారీ, పారిశ్రామిక రంగాలు అత్యధికంగా ఏటా 4 శాతం నికర లావాదేవీల వృద్ధిని నమోదు చేయగా.. ఐటీ, ఈ–కామర్స్ రంగాలు మాత్రం వరుసగా 8 శాతం, 6 శాతం మేర క్షీణించాయి. పెద్ద స్థలాలకే గిరాకీ.. 2022 ఫైనాన్షియల్ ఇయర్లో నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. లక్ష చ.అ. కంటే ఎక్కువ స్పేస్ లావాదేవీలు 2021 ఆర్ధిక సంవత్సరంలో 47 శాతం వాటా కలిగి ఉండగా.. 2022 ఆర్థికం నాటికి 50 శాతానికి పెరిగాయి. అలాగే మధ్య స్థాయి ఆఫీస్ స్పేస్ లావాదేవీలు స్వల్పంగా 1 శాతం మేర వృద్ధి చెందగా.. చిన్న స్థాయి ఒప్పందాలు మాత్రం ఏకంగా 4 శాతం క్షీణించాయి. కొత్త సప్లయ్‌లో దక్షిణాది టాప్.. 2022 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5.12 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. ఇందులో 58 శాతం అంటే 2.98 కోట్ల చ.అ. వాటా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై దక్షిణాది నగరాలే కలిగి ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం వృద్ధి. సగటున టాప్ 7 నగరాలలో కార్యాలయాల అద్దెలు చ.అ.కు రూ.76గా ఉంది. అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్‌గా ముంబై నిలిచింది. ఇక్కడ చ.అ. ధర రూ.126గా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఎన్సీఆర్ నగరాలలో చ.అ.కు రూ.78గా ఉంది. కొత్తగా ఆఫీస్ స్పేస్ నిర్మాణాలు పూర్తి కావటంతో టాప్ 7 నగరాల్లో ఖాళీ స్థాయిలు 1 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా 28.5 శాతంతో అత్యధిక ఆఫీస్ స్పేస్ వేకెన్సీ ఉన్న నగరంగా ఎన్సీఆర్ నిలిచింది. ఆ తర్వాత 23.5 శాతంతో కోల్‌కతా, 15.75 శాతం వేకెన్సీతో ముంబై నిలిచాయి. బెంగళూరును మించి హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కొత్త రికార్డ్లను సృష్టిస్తోంది. బెంగళూరులో కంటే మన నగరంలోనే అత్యధికంగా కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. 2022 ఆర్ధిక సంవత్సరంలో గార్డెన్ సిటీలో 76 లక్షల చ.అ. నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. హైదరాబాద్‌లో 78.5 లక్షల చ.అ. ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యాయి. 2022 ఫైనాన్షియల్ ఇయర్‌లోని మొత్తం ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో హైదరాబాద్ వాటా 23 శాతంగా ఉంది. అయితే కొత్త సపయ్లో మాత్రం బెంగళూరు ముందుంది. ఇక్కడ కొత్తగా 1.45 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా కాగా.. మన నగరంలో 1.18 కోట్ల చ.అ.లకు పరిమితమైంది. డిమాండ్ ఎందుకంటే? – అనూజ్ పూరీ, చైర్మన్, అనరాక్ గ్రూప్ కరోనా సమయంలో దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైబ్రిడ్ వర్క్ మోడల్ బలమైన కొత్త శక్తిగా ఆవిర్భవించింది. వ్యాపారులు, ఉద్యోగులకు కార్యకలాపాలను సజావుగా కొనసాగించే సౌకర్యవంతమైన ప్రదేశాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆఫీస్ లేఅవుట్‌ను మార్చే ఇతర ఎంపికలు లేదా హబ్ అండ్ స్పోక్ మోడల్‌తో పోలిస్తే హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను స్వీకరించడానికి కో–వర్కింగ్ స్పేస్ అత్యంత ప్రాధాన్య ఎంపికగా మారిపోయాయి. చదవండి: రియల్టీ అంటే ఇళ్లు ఒక్కటే కాదు.. ఇవి కూడా -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుల్లితెర నటి..
యశవంతపుర (కర్ణాటక): రోడ్డు గుంతల వల్ల బుల్లితెర నటి గాయపడింది. ఈ సంఘటన ఆదివారం (మే 8) బెంగళూరులో చోటుచేసుకుంది. టీవీ నటి సునేత్రా పండిట్ ఎన్ఆర్ కాలనీ 9వ రోడ్డులో స్కూటర్‌పై వెళ్తూ హంప్స్ వద్ద గుంతల్లో ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడింది. ఆమె తల, చేతికి గాయాలు తగిలాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు నటి సునేత్రా పండిట్‌ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా నటికి వైద్యులు సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. బీబీఎంపీ అధికారులు తక్షణం గుంతల రోడ్లను సరిచేయాలని స్థానికులు కోరారు. సునేత్ర పండిట్ ప్రముఖ సీరియల్ 'సిల్లి లిల్లి'తో పాపులర్ అయింది. చదవండి: సంచలనాల 'లాకప్' షో విన్నర్ గెలుచుకుంది ఎంతో తెలుసా ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం
బనశంకరి: ఎస్ఐ పోస్టుల కుంభకోణంలో ఎన్వీ సునీల్‌కుమార్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్ట్‌చేసి బెంగళూరుకు తీసుకువచ్చింది. ముఖ్య నిందితుడు రుద్రేగౌడ పాటిల్ ద్వారా బ్లూ టూత్‌లో సమాధానాలు విని సునీల్ పరీక్ష రాశాడు. దివ్యా హగరగి ఆధీనంలో ఉన్న కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్లో అతడు పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. డీకేతో నిందితురాలి ఫోటో ఎస్ఐ స్కాంలో పరారీలో ఉన్న నిందితురాలు దివ్యా హగరగి కేపీసీసీ అద్యక్షుడు డీకే.శివకుమార్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఆమె బీజేపీ నాయకురాలని, ఆమె ఇంటికి హోంమంత్రి జ్ఞానేంద్ర వెళ్లి సన్మానం పొందారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా, ఈ ఫోటోలు రావడం విశేషం. గెస్ట్ లెక్చరర్ విచారణ మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మైసూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్ సౌమ్యను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం ఒకటవ ఏసీఎంఎం కోర్టులో ఆమెను హాజరుపరిచారు. గతనెల 14 తేదీన భూగోళ శాస్త్రం పరీక్ష రోజున ఉదయమే పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన సౌమ్య మొబైల్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటోలు తీసుకుని లీక్ చేసింది. ఆమె వద్ద ఉన్న ప్రశ్నలు క్రమపద్ధతిలో లేనట్లు తెలిసింది. ఆమె మొబైల్‌ను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేదానిపై విచారణ సాగుతోంది. పేపర్ లీక్ స్కాంలో మైసూరు వర్సిటీలో జాగ్రఫీ గెస్ట్ లెక్చరర్ సౌమ్యా పైన కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ శివప్ప మంగళవారం తెలిపారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. (చదవండి: హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్) -
రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్‌కి దారి తీసిన స్టార్టప్ కంపెనీ!
దినదినాభివృద్ధి చెందుతున్న ఓ స్టార్టప్ కంపెనీకి వచ్చిన ఇబ్బందులు ఇద్దరు రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్‌కి దారి తీశాయి. వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూనే ఆసక్తికర పోటీకి తెరలేపారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా పేరొందిన బెంగళూరు సిటీ అనేక స్టార్టప్ కంపెనీలకు పుట్టిల్లు కూడా. హౌసింగ్ డాట్ కామ్, ఖాతాబుక్ స్టార్టప్‌లను ఇక్కడే ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా చొచ్చుకుపోతున్నారు ఆ కంపెనీ సీఈవో రవీశ్ నరేశ్. అయితే ఇటీవల బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయల కొరతపై ఆయన ట్విట్టర్ వేదికగా గళం విప్పారు. బెంగళూరులోని కోరమంగళ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను పన్నులుగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. ఐనప్పటికీ ఈ స్టార్లప్‌లు ఉన్న ఏరియా అంతా గతుకుల రోడ్లు, కరెంటు కోతలు, అరకొర నీటి సరఫరా వంటి సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నాయి. బెంగళూరు కంటే రూరల్ ఏరియాల్లోనే సౌకర్యాలు బాగున్నాయంటూ ట్వీట్ చేశాడు. రవీశ్ నరేశ్ ట్వీట్‌కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరు వెంటనే హైదరాబాద్‌కి రండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ తెలిపారు. Pack your bags & move to Hyderabad! We have better physical infrastructure & equally good social infrastructure. Our airport is 1 of the best & getting in & out of city is a breeze More importantly our Govt’s focus is on 3 i Mantra; innovation, infrastructure & inclusive growth https://t.co/RPVALrl0QB — KTR (@KTRTRS) March 31, 2022 కేటీఆర్ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అయితే కర్నాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ కూడా ఈ జాబితాలో చేరారు. మై ఫ్రెండ్ కేటీఆర్.. నీ ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నాను. 2023 చివరికల్లా కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అలా జరిగిన మరుక్షణమే బెంగళూరు సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ శివకుమార్ బదులిచ్చారు. శివకుమార్ ట్వీట్‌పై కేటీఆర్ కూడా అదే స్థాయిలో స్పందించారు.. శివకుమార్ అన్న కర్నాటకలో రాజకీయాలు ఎలా ఉన్నాయో నాకు సరిగా తెలియదు. ఎవరో గెలుస్తారో చెప్పలేం. కానీ మీ ఛాలెంజ్‌ని నేను స్వీకరిస్తున్నాను. బెంగళూరు, హైదరాబాద్ సిటీలో అభివృద్ధిలో పోటీ పడాలి. మన యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాలి. మన ఫోకస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి అంశాలపై ఉండాలి కానీ హలాల్, హిజాబ్ లాంటి విషయాలపై కాదంటూ కేటీఆర్ తెలిపారు. Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍 Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT — KTR (@KTRTRS) April 4, 2022 చదవండి: ఇండియన్లంటే అంతే.. ఎక్కడా తగ్గేదేలే అంటున్న ఆనంద్ మహీంద్రా! -
నేచర్ లవర్స్‌కి గుడ్‌న్యూస్! కబిని, కూర్గ్‌లకు హెలికాప్టర్ సర్వీసులు
Helicopter Ride From Bangalore To Coorg: హెలికాప్టర్ సేవల సంస్థ బ్లేడ్ ఇండియా కొత్తగా బెంగళూరు–కూర్గ్, బెంగళూరు–కబిని రూట్లలో సర్వీసులను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సుమారు 6–7 గంటల సమయం పడుతుంది. కర్ణాటకలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలకు చేరుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సంస్థ ఎండీ అమిత్ దత్తా తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సమయమంతా ప్రయాణంలో వృధా కాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుని, అక్కడ సరదాగా గడిపేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. అమెరికాకు చెందిన బ్లేడ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ, దేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ హంచ్ వెంచర్స్ కలిసి 2019లో బ్లేడ్ ఇండియాను ప్రారంభించాయి. వారాంతాల్లో ప్రైవేట్ చార్టర్ సేవలు అందించడం ద్వారా 2020 డిసెంబర్లో బ్లేడ్ ఇండియా.. కర్ణాటక రాష్ట్రంలో సర్వీసులు మొదలుపెట్టింది. దేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్‌గా కూర్గ్ ప్రకృతి అందాలకు కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక కబిని టైగర్ రిజర్వ్ ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కబిని ఫారెస్ట్‌లో కనిపించే బ్లాక్ చీతాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. చదవండి: ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..! -
ఆనంద్ మహీంద్రా నోట.. అరకు లోయ మాట.. కారణాలు ఇవే
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇండస్ట్రియలిస్టు. సమాకాలిన అంశాలపై వెంటనే స్పందించే మనసున్న మనిషి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి మరింత వెలుగులోకి తీసుకువచ్చే పనిలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ప్రయత్నాల్లో మరో అధ్యాయం మన అరుకు కాఫీ ప్రయాణం కాఫీ అంటే ఎక్కువ మందికి అస్సాం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత కర్నాటకలోని కూర్గ్ లోయ మదిలో మెదులుతుంది. కానీ మరిచిపోలేని రుచిని అందివ్వడంలో క్షణాల్లో మనసుని శరీరాన్ని ఉత్తేజపరడంలో ఆ రెండింటికి సరిసాటి మన అరుకు కాఫీ. విశాఖ ఏజెన్సీలో అరుకు లోయల్లో ఆదివాసీలు పండించే ఈ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అందువల్లే ఇక్కడ పండిన పంట పండదినట్టే విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఆన్లైన్లో అత్యధిక ధరకు అమ్ముడైపోతుంది. అరకు కాఫీని ఒక్కసారి రుచి చూసిన వారు కాఫీ అంటే ఇదే అంటారు. అందుకు మరో ఉదాహారణ మన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. ఐన్‌స్టీన్ ట్వీట్‌తో భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆద్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటోను కాఫీ తాగుతున్నట్టుగా కప్‌పై ముద్రించిన గిఫ్ ఫైల్ని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అందులో ఐన్‌స్టీన్ కాఫీ తాగుతూ హుషారుగా ఉంటారు. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ సింగర్ జేమ్స్బ్రౌన్ల హుషారుగా మారడానికి కారణం... అతను కచ్చితంగా బెంగళూరులో ఉన్న అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే కారణం అని అర్థం వచ్చేలా కామెంట్ రాశారు. James BrownStein? He must be at the Araku Café Bengaluru… pic.twitter.com/q7wtG5k1DT — anand mahindra (@anandmahindra) December 8, 2021 ఏంటీ అరకు ఆనంద్ మహీంద్రా నోట అరుకు కాఫీ గురించిన ప్రస్తావన వచ్చే సరికి నెటిజన్లు ఈ కాఫీ స్టోర్ ప్రత్యేకత గురించి ఆరా తీస్తున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అరకు కేఫ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అత్యున్నత ప్రమాణాలతో అద్భుతమైన కాఫీ తాగేందుకు అక్కడ అరకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు తోటల్లో ఆదివాసీలు సంప్రదాయ పద్దతిలో పండించే కాఫీనే ఇక్కడ ఉపయోగిస్తుంటారు. కాఫీ ఫిలాసఫీ గతంలో సైతం అరకు కాఫీకి ప్రచారం చేసి పెట్టారు ఆనంద్ మహీంద్రా. ప్రపంచ కాఫీ దినోత్సం రోజున ఆనంద్మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ అరకు కాఫీ తోటల ప్రత్యేకతను తెలియజేస్తూ అక్టోబరు 1న ట్వీట్ చేసింది. దాన్ని ఆనంద్మహీంద్రా రీ ట్వీట్ చేస్తూ ఇది కప్ కాఫీ కంటే ఎక్కువ...ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. More than just a cup of coffee…it’s a philosophy of life… @arakucoffeein @naandi_india https://t.co/UfAH5RtIjF — anand mahindra (@anandmahindra) October 1, 2021 లక్షమందికి ఆధారం అరకు వ్యాలీలో సుమారు లక్ష మంది ఆదివాసీలు కాఫీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మూడు కోట్లకు పైగా కాఫీ మొక్కలు పెంచుతున్నారు. వీరికి కాఫీ తోటల సాగులో ఆధునిక పద్దతులు తెలపడంతో పాటు మార్కెటింగ్‌లో సాయం చేస్తోంది ఆనంద్మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ సంస్థ. దీంతో అమెజాన్‌తో పాటు అనేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అరకు కాఫీ లభిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్లా ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించడం, సాయం చేస్తూ సాన పట్టడం ఆనంద్ మహీంద్రా ప్రత్యేకత. అదే పద్దతిలో అరకు కాఫీకి అండగా ఉన్నారు ఆనంద్ మహీంద్రా. కేవలం సాయం చేసి చేతులు దులుపుకోకుండా రెగ్యులర్‌గా ప్రమోట్ చేస్తూ ఎళ్ల వేళలా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ మాదిరి క్రమం తప్పకుండా ప్రచారం చేస్తున్నారు. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి: పల్లెలో ఆటో నడిపిన సీఈవో.. ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆనంద్ మహీంద్రాకు సలహా -
వచ్చెనెల ఎన్నారై గ్లోబల్ మీట్.. ఎక్కడంటే?
ప్రవాస భారతీయుల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చే లక్ష్యంతో ఇండో అరబ్ కాన్ఫడరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. డిసెంబరు 4న కర్నాటకలోని బెంగళూరు వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్ ఎన్నారై మీట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రి రామ్‌థాస్ అథవాలే, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైలతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గతేడాది ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల పరిస్థితులు చక్కబడుతుండటంతో ఈ గ్లోబల్ మీట్‌కి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎజెండా - వివిధ దేశాల్లో వర్క్ పర్మిట్లు, వీసాలు పొందడంలో ఎన్నారైలు పడుతున్న ఇబ్బందులు - స్వదేశానికి తిరిగొచ్చిన ఎన్నారైలకు గృహనిర్మాణాలు, పునరావాసం కల్పించడం - భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన - క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న ఎన్నారైల సన్మాన కార్యక్రమం 40 ఏళ్లుగా 1980లో కేరళలోని కోజికోడ్ కేంద్రంగా ఏర్పాటైన ఐఏసీసీ అసోసియేషన్.. 2014లో ఛారిటబుల్ ట్రస్ట్‌గా మారింది. ఈ అసోసియేషన్‌కు భారత్‌లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు యూఎస్, యూకే, అరబ్ దేశాల్లో శాఖలున్నాయి. ఈ అసోసియేషన్ స్ఫూర్తితోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఎన్నారై సంక్షేమ సంఘాలు పని చేస్తున్నాయి. -
బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోనూ అప్‌గ్రాడ్ సెంటర్
ఆన్లైన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తోన్న అప్‌గ్రాడ్ సంస్థ హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ని ఏర్పాటు చేసింది. బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఇండిక్యూబ్ పెర్ల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలో ఐటీ సంస్థలు కొలువైన గచ్చిబౌలిలో ఇండిక్యూబ్ పెరల్ బిల్డింగ్‌లో 170 సీట్లతో సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో క్లాస్ రూమ్స్‌తో పాటు జిమ్, మల్టీ క్యూజిన్, గేమింగ్ జోన్, కేఫ్ టేరియా, కొలబరేషన్ స్పేస్, ఈవెంట్ వెన్యూ, బ్రేక్ అవుట్ ఏరియా, విజిటర్స్ లాంజ్ లాంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఎడ్యుటెక్ ఇండస్ట్రీలో మంచి గ్రోత్ కనిపిస్తుండటంతో గ్లోబల్ కంపెనీగా ఎదిగేందుకు అప్‌గ్రాడ్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇంటర్నేషన్ స్టాండర్డ్స్‌తో ఉన్నత విద్య కోర్సులను ఎక్కువగా ప్రవేశపెడుతోంది. దీనికి తగ్గ సిబ్బందిని హైర్ చేసుకుంటోంది. బిగ్‌డేటా విభాగంలో హైదరాబాద్‌పై అప్‌గ్రాడ్ ఫోకస్ చేసింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఒకేసారి సెంటర్ల్లు ఓపెన్ చేసింది అప్‌గ్రాడ్ సంస్థ. బెంగళూరు సెంటర్లో 830 సీట్లు ఉండగా హైదరాబాద్ సెంటర్లో 170 సీట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సెంటర్లను మరింతగా విస్తరించే యోచనలో ఉంది అప్‌గ్రాడ్. -
ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు..
కోవిడ్ ఆంక్షలు సడలించి ఇండియా అమెరికాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతి ఇచ్చిన శుభసందర్భంగా ఇరు దేశాల మధ్య నాన్‌స్టాప్ విమానాలు షురూ అయ్యాయి. అమెరికా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ఇప్పటికే సర్వీసులు ప్రారంభించింది. మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు సన్నహకాలు చేస్తోంది. దుబాయ్ మీదుగా ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు ఎప్పటి నుంచో బాగానే ఉన్నాయి. దీనికి తోడు ఐటీ విప్లవం వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మండలం నుంచి కనీసం నలుగురైదురగు అమెరికాలో నివసించే పరిస్థితి నెలకొంది. అయితే ఇండియా నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు చాలా తక్కువ. చాలా వరకు దుబాయ్, యూఏఈ లేదా యూరప్ వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా యూఎస్ వెళ్తుంటారు. 2012లో రద్దు అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 2007లో షికాగో నుంచి న్యూఢిల్లీకి నాన్‌స్టాప్ ఫ్లైట్లను ప్రారంభించింది. అయితే ఐదేళ్ల తర్వాత ఆ సంస్థ షికాగో - న్యూఢిల్లీ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొత్తానికే విమాన సర్వీసులు రద్దు చేశారు. న్యూయ్యార్క్ టూ ఢిల్లీ గడిచిన పదేళ్లలో ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు పెరిగాయి. అనేక కుటుంబాలు ఎన్నారైలుగా అమెరికాలో ఉంటున్నారు. ఇండియాలో సైతం ఎయిర్‌లైన్స్ మార్కెట్ రోజురోజుకి పుంజుకుంటోంది. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ మార్కెట్లో వాటా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించింది. గత అక్టోబరులో ఈ విమానం ప్రారంభం కావాల్సి ఉండగా నవంబరుకు వాయిదా పడింది. తొలి విమానం గత శనివారం (2021 నవంబరు 13)న ఢిల్లీకి చేరుకుంది. వీకెండ్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంది. బెంగళూరుకి రెండో విమాన సర్వీసును అమెరికాలోని సియాటెల్ నుంచి బెంగళూరు మధ్య మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది అమెరికన్ ఎయిర్‌లైన్స్. ఆ తర్వాత న్యూయార్గ్ - ముంబై, శాన్ఫ్రాన్సిస్కో- బెంగళూరుల మధ్య మరో రెండు సర్వీసులు ప్రారంభించాలనే యోచనలో ఉంది. బోయింగ్ 777 నాన్‌స్టాప్ సర్వీసులకు బోయింగ్ 777 విమానాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 304 మంది ప్రయాణం చేయవచ్చు. ఎకానమీ 216, ప్రీమియం ఎకానమీ 28, బిజినెస్ క్లాస్ 52, ఫస్ట్‌క్లాస్ 8 సీట్ల వంతున అందుబాటులో ఉన్నాయి. భారతీయ అభిరచులకు తగ్గట్టు ఫుడ్, ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. ఇండిగోతో జట్టు అమెరిక్ ఎయిర్లైన్స ఇండియాలో ఇండిగోతో జట్టు కట్టింది. నాన్‌స్టాప్ ఫ్లైట్ల ద్వారా ఇండియా చేరుకున్న ప్రయాణికులు దేశీయంగా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా ఇండిగో ఏర్పాటు చేస్తుంది. అమెరిక్ ఎయిర్‌లైన్స్ టిక్కెట్ కలిగిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో లాంజ్‌లను వినియోగించుకోవచ్చు. ఇదే తరహాలో మరికొన్ని సౌలభ్యాలు అందిస్తున్నారు. చదవండి:ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు -
తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..
-
హైదరాబాద్‌కు ‘ప్లగ్ అండ్ ప్లే’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల వేదికగా పేరొందిన ‘ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ సెంటర్’అతిత్వరలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ‘యాంబిషన్ ఇండియా–2021’సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కె.తారకరామారావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందంతో ‘ప్లగ్ అండ్ ప్లే’ప్రతినిధులు భేటీ అయ్యారు. డిసెంబర్ తొలివారంలో తమ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సయీద్ అమీది మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తారని ఈ భేటీ అనంతరం వారు ప్రకటించారు. మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయ సాంకేతికత, ఆరోగ్యం, ట్రావెల్, ఫిన్‌టెక్ తదితర రంగాలపై ‘ప్లగ్ అండ్ ప్లే’ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా తొలుత మొబిలిటీ, ఐఓటి, విద్యుత్, మౌలిక వసతుల వాతావరణంపై దృష్టి పెట్టి తర్వాతి దశలో ఫిన్‌టెక్, జీవ ఔషధ, ఆరోగ్య రంగాలకు కార్యకలాపాలు విస్తరిస్తామని సంస్థ ప్రకటించింది. ఐఓటీ, స్మార్ట్ సిటీస్ రంగంలో ఇంక్యుబేషన్ జర్మనీలోని ‘స్టార్టప్ ఆటోబాన్’తరహాలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆవిష్కరణల కేంద్రాన్ని (ఇంక్యుబేషన్ సెంటర్) కూడా నూతన సాంకేతిక భాగస్వామ్యాలకు చిరునామాగా రికార్డు సమయంలో పీఎన్పీ (ప్లగ్ అండ్ ప్లే) తీర్చిదిద్దనుంది. మొబిలిటీ రంగంలో పేరొందిన సంస్థలు, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో ‘స్టార్టప్ ఆటోబాన్’అతితక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇదే తరహాలో సియాటిల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్రయాంగ్యుల్ ల్యాబ్స్’ అనే సంస్థ భాగస్వామ్యం తో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే టెక్నాలజీ సెం టర్ ఐఓటీ, స్మార్ట్ సిటీస్ రంగాల్లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను పీఅండ్‌పీ నడపనుంది. స్టార్టప్‌లు, కార్పొరేట్ పెట్టుబడిదారులకు భారత్‌లో అతిపెద్ద, అత్యుత్తమ టెక్నాలజీ సెంటర్‌ను నిర్మించడమే తమ లక్ష్యంగా ఉంటుందని ïకేటీఆర్‌తో భేటీ అనంతరం పీఅండ్‌పీ ప్రతినిధి బృందం వెల్లడించింది. పీఅండ్‌పీ బృందం భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మ కూరి పాల్గొన్నారు. ‘ప్లగ్ అండ్ ప్లే’ నెట్వర్క్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 వేలకుపైగా స్టార్టప్‌లు, 530కిపైగా సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. 1,500కుపైగా యాక్టివ్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులతో ఇప్పటివరకు వెంచర్ ఫండింగ్‌లో 9 బిలియన్ డాలర్లకుపైగా రాబట్టింది. భారతీయ సంస్థలకు పీఅండ్‌పీ ముఖద్వారం: కేటీఆర్ ప్రముఖ సంస్థలతో కలసి భారతీయ స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ప్లగ్ అండ్ ప్లే (పీఅండ్‌పీ) ముఖద్వారంగా పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారతీయ స్టార్టప్‌లు అభివృద్ధి చేసే ఆవిష్కరణలు, సాంకేతికతను అంతర్జాతీయంగా బదిలీ చేసేందుకు పీఅండ్‌పీ రాక దోహదం చేస్తుందన్నారు. తమ నెట్వర్క్ పరిధిలోని వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు భారతీయ స్టార్టప్‌లను పీఎన్పీ పరిచయం చేస్తుందన్నారు. ఇప్పటికే భారత్‌లో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ను కలిగి ఉన్న తెలంగాణకు పీఅండ్‌పీ రాక మరింత ఊతమిస్తుందన్నారు. మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలు అత్యంత కీలకమని, ఇ ప్పటికే ఈ రంగంలో పలు అంతర్జాతీయ సంస్థల తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందా లు కుదుర్చుకుందన్నారు. హెల్త్‌కేర్, ఐఓటీ, ఎన ర్జీ, ఫిన్‌టెక్ వంటి రంగాల్లో పురోగతి సాధిస్తున్న తెలంగాణకు పీఅండ్‌పీ రాక మరింతగా ఉపయోగపడుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! హైదరాబాద్ యాపిల్ క్యాంపస్‌లో జాబ్ ఆఫర్స్
కరోనా సంక్షోభం తర్వాత కార్పొరేట్ ప్రపంచం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దాదాపు ఏడాదిన్నరగా నియమకాలు చేపట్టిన సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ సంస్థ బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త తెలిపింది. యాపిల్ సంస్థకు చెందిన డెవలపింగ్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది. దీంతో పాటు బెంగళూరులో కూడా యాపిల్‌కి కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (డేటా ప్లాట్ఫార్మ్) ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్లు యాపిల్ కెరీర్ పోర్టల్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు ఇప్పటికే ఇదే క్వాలిఫికేషన్ మీద వివిధ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉండి మార్పు కోరుకునేవారికి ఇదో సువర్ణ అవకాశం. దాదాపు ఏడాది తర్వాత తిరిగి యాపిల్‌లో ఫుల్, పార్ట్‌టైం ప్రతిపాదికన ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఎంపికైన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. -
Crypto Currency: గజిబిజి గందరగోళం.. ఉద్యోగాలు బోలెడు!
క్రిప్టో కరెన్సీ... ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం.ఇన్వెస్టర్లు క్రమంగా కొత్త తరహా ఆర్థిక వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. అయితే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పది వేల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇండియాలో కేవలం క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పుంజుకుంటాయని దీని వల్ల దేశవ్యాప్తంగా పది వేల వరకు నూతన ఉద్యోగాలు సృష్టించడతాయని ప్రముఖ నియామకాల సంస్థ జెనో పేర్కొంది. ప్రస్తుతానికి ఇండియాలో క్రిప్టో కరెన్సీలో పెద్దగా ఉద్యోగాలు లేవని, కానీ భవిష్యత్తు అలా ఉండబోదంటూ తెలిపింది. యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు సైతం క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాయని తెలిపింది. ఇక్కడే ఎక్కువ క్రిప్టో కరెన్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో గుర్‌గ్రామ్, బెంగళూరు, ముంబైలు ప్రధాన కేంద్రాలుగా మారుతాయంటూ జోనో సంస్థ అభిప్రాయపడింది. దేశంలో క్రిప్టో కరెన్సీలో వచ్చే ఉద్యోగాల్లో 60 శాతానికి పైగా జాబ్స్ ఈ మూడు నగరాల పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది. నైపుణ్యం తప్పనిసరి క్రిప్టో కరెన్సీలో రంగంలో భారీ వేతనంతో ఉద్యోగం పొందాలంటే సాధారణ మెలకువలు సరిపోవడని జెనో తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిర్వాహణకు అవసరమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, రిపిల్ ఎక్స్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించింది. క్రిప్టో కరెన్సీ కోడ్లను ఉపయోగిస్తూ గజిబిజిగా గందరగోళంగా ఓ సమాచారాన్ని క్షేమంగా, రహస్యంగా చేర్చడం లేదా భద్రపరచాడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. అదే పద్దతిలో క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2009లో తొలి క్రిప్టో కరెన్సీగా బిట్ కాయిన్ రాగా ఆ తర్వాత వందల కొద్ది బిట్కాయిల్లు చలామనిలోకి వచ్చాయి. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, బ్యాంకులకు ఆవల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. చదవండి: క్రిప్టో.. కొలువుల మైనింగ్! -
దొంగ బంగారు చైన్ ముక్క మింగేశాడు కానీ..
సాక్షి, బెంగళూరు : ‘‘తొండి మొదలుమ్ ద్రిక్షక్షియుమ్’’ మళయాల సినిమాలో హీరో ఫాహద్ ఫజిల్( ఓ దొంగ) బస్‌లో బంగారు గొలుసు కొట్టేసి, దొరక్కుండా ఉండటానికి దాన్ని మింగేస్తాడు. అచ్చం అలాంటిదే కాకున్నా.. ఓ దొంగ చైన్ ముక్కను మింగేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఎంటీ స్ట్రీట్‌కు చెందిన హేమ అనే మహిళ దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు స్నాచర్లు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొడానికి యత్నించారు. ఆమె కేకలు వేస్తూ చైన్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో చైన్‌లోని ఓ భాగం దొంగ చేతిలో చిక్కింది. స్థానికులు అక్కడికి చేరుకుని ఓ స్నాచర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఇదే సమయంలో గొలుసు ముక్కను దొంగ మింగేశాడు. పోలీసుల విచారణలో తన వద్ద గొలుసు లేదని చెప్పడంతో పోలీసులు అనుమానంతో నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో స్కానింగ్ చేయించారు. కడుపులో బంగారుచైన్ ముక్క కనిపించింది. పోలీసులు కక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. చదవండి : అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం.. త్వరలో హైదరాబాద్‌లో
సాక్క్షి, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు త్వరలో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఆటో ఛార్జీలకే కారు తరహా సౌకర్యాలను అనుభవిస్తూ ప్రయాణం చేయవచ్చు. బజాజ్ ఆటో, ఉబర్ సంస్థలు కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తేనున్నాయి. క్వాడ్రి సైకిల్ బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రిసైకిల్ని రూపొందించింది. పేరు క్వాడ్రి సైకిల్ అని పిలచుకున్నా ఇది సైకిల్లా కాదు చూడటానికి కారులా ఉంటుంది. నాలుగు చక్రాలతో ప్రయాణం చేస్తుంది. అయితే కారుతో పోల్చుకున్నప్పుడు ఇంజన్ సామర్థ్యం , ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అదే ఆటోతో పోల్చినప్పుడు భద్రతతో పాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఎక్కువగా ఇస్తుంది. క్యూట్ క్వాడ్రిసైకిల్ని బజాజ్ ఆటో క్యూట్ పేరుతో రూపొందించి చాలా కాలమే అయినా ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురాలేదు. కేరళా, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రయోగాత్మకంగా ఈ మోడళ్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉబర్‌తో జత కట్టి బెంగళకూరు నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సేవల్లోకి వచ్చింది. ఆటో ఛార్జీలకే కారు తరహా ప్రయాణం అందిస్తున్న ఈ బిజినెస్ మోడల్ బెంగళూరులో సక్సెస్ అయ్యింది. పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఈ కారులో ప్రయాణించిన కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి బజాజ్ ఆటో, ఉబర్లు. లక్ష మందికి పైగా ఈ క్యూట్ క్వాడ్రి సైకిల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. దీంతో మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు రెండు కంపెనీలు రెడీ అయ్యాయి. త్వరలో హైదరాబాద్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ రోడ్లపై క్యూట్ పరుగులు పెట్టనుంది. ఉబర్ సంస్థ ఆధ్వర్యంలో క్యూట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. దీనికి సంబంధించి క్యూట్ యూనిట్ల తయారీని పెంచే పనిలో ఉంది బజాజ్. -
కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ శాసనసభాపక్ష కొత్త సారథిగా మంగళవారం ఎన్నికైన బసవరాజ బొమ్మై(61) బుధవారం కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. బుధవారం ఉదయం బెంగళూరు రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్.. బసవరాజ చేత సీఎంగా ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మై దేవుని మీద ప్రమాణంచేసి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ప్రమాణస్వీకారోత్సవం కేవలం మూడు నిమిషాల్లోనే ముగిసింది. తాజా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణంచేసిన రోజున ‘రైతు ప్రభుత్వం’కు సూచికగా ఆకుపచ్చ శాలువా ధరించారు. బొమ్మై మాత్రం కాషాయ రంగు శాలువాను ధరించారు. పార్టీ పెద్దల సూచన మేరకు ఒకే విడతలో పూర్తిస్థాయిలో త్వరలోనే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తానని కొత్త సీఎం బసవరాజ వెల్లడించారు. ప్రమాణోత్సవానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు శివాజీనగర: కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణం చేసిన బసవరాజకు ప్రధాని మోదీ శుభాభినందనలు తెలిపారు. ‘సుదీర్ఘమైన శాసన, పరిపాలనా అనుభవం బొమ్మై సొంతం’అని మోదీ ట్వీట్ చేశారు. ‘కర్ణాటక అభివృద్ధిలో మాజీ సీఎం యడియూరప్ప సేవలు అపారమైనవి. దశాబ్దాలుగా కృషి చేసి కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను తయారు చేయడంలో ఆయన అపార శ్రమ దాగి ఉంది’అని యడియూరప్పను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బసవరాజ్ బొమ్మై ప్రస్థానం: ► బసవరాజ్ బొమ్మయ్ జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ► 1995లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► 1996-97 వరకు అప్పటి సీఎంగా ఉన్న జేహెచ్ పటేల్ వద్ద రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన బొమ్మయ్ ► 1998,2008 ధారవాడ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక ► 2007లో ధారవాడ నుంచి 232 కిలోమీటర్లు రైతుల కోసం పాదయాత్ర ► 2008లో బీజేపీలో చేరిన బసవరాజ్ బొమ్మయ్ ► 2008లో షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 జూన్ 7 - 2013 మే 13 వరకు జలవనరుల మంత్రిగా విధులు ► 2019 సెప్టెంబర్ 27 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకు సహకార మంత్రిగా విధులు ► 2019 ఆగస్టు 26 నుంచి 2021 జులై 26 వరకు.. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన బసవరాజ్ బొమ్మయ్ ► వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిన బసవరాజు బొమ్మయ్ ► మెకానికల్ ఇంజనీర్, పారిశ్రామికవేత్తగా బసవరాజు బొమ్మయ్‌కు గుర్తింపు -
చాక్లెట్ అనుకుని గణేశ్ విగ్రహాన్ని మింగేసింది..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): చాక్లెట్ అనుకుందో ఏమో ఓ చిన్నారి చిన్నపాటి గణేశ్ విగ్రహాన్ని మింగేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది. వెంటనే తమ మూడేళ్ల చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్సరే తీసి పొట్టలో లోహపు విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఎండోస్కోపి ద్వారా చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటికి తీశారు. తల్లిని తరిమేసిన కసాయి మండ్య: ఆస్తి కోసం తన రెండో కుమారుడు దౌర్జన్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని కేఆర్ పేట తాలూకా ఆనేగోళ గ్రామానికి చెందిన కమలమ్మ మీడియా ముందు మొరపెట్టుకుంది. తన భర్త బతికుండగా రెండో కుమారుడు మంజునాథ్‌కు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని రాసిచ్చాడని, అయినా ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ఇవ్వాలని దౌర్జన్యం చేసి తనను గెంటేశాడని బోరున విలపించింది. -
భర్త అడ్డు తొలగించుకోవాలని.. ప్రియుడుకి రూ.15 లక్షల సుపారి
సాక్షి, యశవంతపుర: భర్తను హత్య చేయడానికి పథకం వేసిన భార్య రూపతో పాటు మరో ఇద్దరిని మాదనాయకనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రూప, గిరీశ్‌లకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇటీవల రూప ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. అక్కడ కుమార్ జైన్ అనే వ్యక్తితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. రూప సంగతి తెలిసిన భర్త పనికి వెళ్లవద్దంటూ కట్టడి చేశాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రూప, ప్రియుడు రూ.15 లక్షలకు సుపారి ఇచ్చారు. నలుగురు దుండగులు మాదనాయకనహళ్లిలో మంకీ క్యాప్ ధరించి తిరుగుతుండగా పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించగా సుపారి విషయం బయటపడింది. రూప, కుమార్‌జైన్ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
అనుమానం.. భార్య ముక్కు కొరికేసిన భర్త..
బెంగళూరు : మద్యం మత్తులో భార్య ముక్కు కొరికేశాడు ఓ తాగుబోతు భర్త. భార్య మీద ఉన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెళగావి జిల్లా దొడ్డవాడ గ్రామానికి చెందిన ఉమేశ్, గీత భార్యా భర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఉమేశ్ భార్యతో తరుచూ గొడవపడేవాడు. దీంతో గీత ధారవాడ తాలూకా, అమ్మినబావిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న అతడు అత్తారింటికి వెళ్లాడు. గత ఆరు నెలలనుంచి అత్తారింట్లోనే ఉంటున్నాడు. అక్కడ కూడా ఇద్దరూ తరుచూ గొడవ పడేవారు. శనివారం కూడా ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది. ఆ గొడవ తారాస్థాయికి చేరింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఉమేశ్, భార్య గీత ముక్కును కొరికేశాడు. నొప్పి భరించలేక ఆమె కేకలు వేయటంతో పొరిగిళ్లవాళ్లు అక్కడికి వచ్చారు. దీంతో ఉమేశ్ అక్కడినుంచి పరారయ్యాడు. ముక్కునుంచి రక్తం కారుతున్న ఆమెను హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఉమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కరోనాకు మరో వ్యాక్సిన్, ఇది అన్నిటికంటే స్పెషల్!
బెంగళూరు: గది ఉష్ణోగ్రత వద్ద పని చేసే తొలి కరోనా వ్యాక్సిన్ ఇండియాలో రూపు దిద్దుకుంటోంది. ఇండియన్ ఇన్స్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. బెంగళూరు వేదికగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రయోగ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఐఐఎస్ చెబుతోంది. ఎలుకల్లో ప్రయోగాలు ఐఐఎస్ బెంగళూరులో మాలిక్యూలర్ బయో ఫిజిక్స్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు విరుగుడుగా పని చేసే మాలిక్యూల్‌ని కనుగొన్నారు. ఈ మాలిక్యూల్‌తో ఎలుకల్లో ప్రయోగాలు జరపగా యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కంటే ఎనిమిదిరెట్లు అధికంగా యాంటీబాడీలు ఎలుకల్లో తయారయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మనుషుల్లో త్వరలోనే ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు అన్నీ శీతల ఉష్ణోగ్రతల్లోనే పని చేసేవిగా తయారయ్యాయి. కరోనాకు తొలి వ్యాక్సిన్‌గా వచ్చిన ఫైజర్ అయితే ఏకంగా మైనస్ 71 సెల్సియస్ డిగ్రీల దగ్గర నిల్వ చేయాల్సి ఉంది. ఇక కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీలు 8 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. దీంతో వ్యాక్సిన్ల నిల్వ, సరఫరా ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతోంది. కానీ ఐఐఎస్ బెంగళూరు రూపొందించిన వ్యాక్సిన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద కూడా బాగా పని చేస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సులువు అవుతుందంటున్నారు సైంటిస్టులు. -
ఫేస్బుక్ లైవ్‌లో కొవిడ్ మృతుల అంత్యక్రియలు..
బెంగళూరు: కరోనా ఎంతో మంది జీవితాలను అతలాకుతులం చేసింది. కనీసం కటుంబసభ్యలు కూడా కరోనాతో మరణించిన వారి కడచూపుకు కూడా నోచుకోలేక పోయారు. కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మనోహర్ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి కరోనాతో మరణించాడు. అతని మృతదేహన్ని సుందాలోని ఇండియన్ క్రిస్టియన్ స్మశానవాటికలో అంత్యక్రియలకు తీసుకు వచ్చారు. క్వారంటైన్లో ఉన్న అతని కుటంబసభ్యలు, మలేషియాలో ఉన్న బంధువులు కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అతని అంత్యక్రియలను స్నేహితులు ఏర్పాటు చేసిన ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించారు. ఈ సంఘటన అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరు నగరంలో కరోనాతో ప్రియమైన వారిని కోల్పోయిన చాలా కుటుంబాలు అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఎందుకంటే వాళ్లు కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఉన్నారు. వారు అంత్యక్రియలను చూడడానికి వాట్సాప్, ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లైవ్ స్ట్రీమ్ చేయడానికి స్నేహితులు, వాలంటీర్లు పైన ఆధారపడుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను కూడా సాయం తీసుకుంటున్నారు. కమ్మనహళ్లికి చెందిన ఓ మహిళ విక్టోరియా ఆసుపత్రిలో కరోనాతో మరణించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ చేయాలని ఆమె బంధువులు కోరుకున్నారు. టాబ్లెట్ ఉపయోగించి ఫేస్బుక్ లైవ్ ద్వారా చేశామని.. ఇండియన్ క్రిస్టియన్ స్మశానవాటికలో ఒక కెమెరామెన్ చెప్పారు. విదేశాలలో ఉన్న బంధవులు లైవ్ స్ట్రీమింగ్ అంత్యక్రియల కోసం అనేక అభ్యర్థనలు మాకు అందుతున్నాయి అని అన్నాడు. (చదవండి:సెకండ్ వేవ్: ఆగని మృత్యుఘోష..కొత్తగా 2,67,334 పాజిటివ్ కేసులు) -
Lockdown: 2 వారాలు ఇల్లే భద్రం.. సహకరించండి ప్లీజ్!
సాక్షి, బెంగళూరు: కర్ఫ్యూ, లాక్డౌన్ ఆంక్షలను అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 596 మంది కరోనా కాటుకు విగతజీవులయ్యారు. కొత్తగా 39,305 మందికి పాజిటివ్ రాగా, 32,188 మంది కోలుకున్నారు. గత నాలుగురోజులతో పోలిస్తే పాజిటివ్‌లు తగ్గినా, మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 19,73,683 కి చేరగా, అందులో 13,83,285 మంది కోలుకున్నారు. 19,372 మంది ప్రాణాలు విడిచారు. 5,71,006 మంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. బెంగళూరులో 16,747.. సిలికాన్ సిటీ బెంగళూరులో తాజాగా 16,747 కేసులు, 14,289 డిశ్చార్జిలు, 374 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో ఇప్పటివరకు 9,67,640 మందికి కరోనా సోకగా, అందులో 6,06,754 మంది కోలుకున్నారు. మరో 8,431 మంది కన్నుమూశారు. నగరంలో ప్రస్తుతం 3,52,454 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలవారీగా తాజా మరణాలు.. బెంగళూరులో 374, బళ్లారిలో 26, హాసన్‌లో 22, భాగల్‌కోటెలో 15, తుమకూరులో 15, హావేరిలో 12, శివమొగ్గలో 11, ఉత్తర కన్నడలో 11, కొడగులో 9, ధారవాడలో 8, కోలారులో 8 మంది చొప్పున కన్నుమూశారు. 80,823 మందికి టీకా.. కొత్తగా 1,24,110 శాంపిళ్లు పరీక్షించారు. మొత్తంటెస్టులు 2,71,42,330 కి చేరాయి. మరో 80,823 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. మొత్తం టీకాలు 1,06,08,539 కి పెరిగింది. అనేక నగరాల్లో టీకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. దావణగెరెలో అయితే తోపులాటలు కూడా జరగడంతో పోలీసులు అదుపుచేశారు. మంగళూరుకు నౌకలో 54 టన్నుల ఆక్సిజన్ సోమవారం చేరుకుంది. కువైట్, ఖతార్‌ల నుంచి ఇది వచ్చింది. పటిష్ట లాక్డౌన్ వల్ల బెంగళూరులో వచ్చే వారంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ తర్వాత రెండో ఉధృతి శాంతిస్తుందని జోస్యం చెప్పారు. 2 వారాలు ఇల్లే భద్రం సాక్షి, బెంగళూరు: ప్రాణాలను హరించివేస్తున్న కరోనా రక్కసిని ఎలాగైనా కట్టడి చేయాలని రాష్ట్రంలో రెండోదఫా విధించిన సంపూర్ణ లాక్డౌన్ సోమవారం ఉదయం నుంచి ఆరంభమైంది. ఇకనుంచి రెండువారాల పాటు జన జీవితానికి రోజుకు 4 గంటలే విరామం. మిగతా 20 గంటలూ ఇళ్లకే పరిమితం కావాలి. అతిక్రమిస్తే లాఠీ, సీజ్‌లు.. తొలిరోజు నిబంధనల ప్రకారం నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతించారు. ఆ తర్వాత రోడ్డెక్కిన వారిపై పోలీసులు లాఠీలను ఝళిపించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 10 గంటలు దాటినా పని లేకుండా బయటకు వచ్చినవారిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వాహనాలను జప్తు చేశారు. వ్యాపారులకూ జరిమానా వేశారు. పలుచోట్ల ప్రజలు వాగ్వాదానికి దిగారు. పాస్ ఉన్నా ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. బెంగళూరులోని చిన్నమ్మ సర్కిల్, మహంతేశ్నగర్ ఓవర్ బ్రిడ్జి, అశోక్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో బంద్.. లాక్డౌన్ 2.ఓ కారణంగా జిల్లాల మధ్య సరిహద్దుల దాటేవారిని పోలీసులు అనుమతించలేదు. వలసకార్మికులు, దూర ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించారు. లాక్డౌన్ భయంతో వలస కార్మికులు సామాన్లు నెత్తిన పెట్టుకుని స్వస్థలాలకు బయలుదేరిన దృశ్యాలు బెంగళూరులో సాధారణమయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో విరామ సమయంలోనూ బైకిస్టులను బయటకు రానివ్వలేదు. సహకరించండి ప్లీజ్: సీఎం రాష్ట్రంలో కరోనా వైరస్ జెడ్ స్పీడుతో దూసుకెళ్తోంది, నివారణ కోసం లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించాలని సీఎం బీఎస్ యడియూరప్ప ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ప్రజల సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. చదవండి: కరోనా కల్లోలం: ఖాళీ అవుతున్న బెంగళూరు! -
థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’
బెంగళూరు: హౌస్‌ఫుల్ బోర్డులు మనం ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కర్నాటకలో మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున కేసులు.. మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 217 మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో మరణాలు భారీగా చోటుచేసుకుంటుండడంతో శ్మశానాలన్నీ నిండుకుంటున్నాయి. మృతదేహాలు భారీగా చేరుకుంటుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో శ్మశాన వాటిక నిర్వాహకులు వాటికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. ఖననం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ ఉండడం లేదు. దీంతో బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డులు తగిలేస్తున్నాయి. చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డు తగిలేసింది. శ్మశానంలో రోజుకు 20కి పైగా కరోనాతో మరణించిన మృతదేహాలు వస్తుండడంతో ఈ మేరకు శ్మశాన వాటిక నిర్వాహకులు బోర్డు పెట్టేశారు. బెంగళూరులో 13 విద్యుత్ దహన వాటికలు ఉండగా అవి నిరంతరం బిజీగా ఉంటున్నాయి. శ్మశానాల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ)కి 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వాటిలో అంత్యక్రియల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వం అంత్యక్రియలపై ఆలోచన చేసింది. మృతుల కుటుంబీకులే తమ సొంత ప్లాట్లు, ఫామ్‌హౌస్, పొలాలు ఉంటే అక్కడే ఖననం.. లేదా అంత్యక్రియలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం కర్నాటకలో కరోనా కేసులు 16 లక్షలు దాటాయి. కొత్తగా 37,733 కేసులు నమోదు కాగా, మరణాలు 217 సంభవించాయి. ఇవి అధికారికంగా ప్రకటించినవే. అనధికారికంగా ఎన్నో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం -
బెంగళూరులో ఆక్సిజన్ కొరత: 24 మంది మృతి
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ పేషెంట్లు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా కర్ణాటకలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతి చెందారు. చామరాజనగర్‌లో ఉన్న కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన కోవిడ్ బాధితులంతా ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతోనే వారు మరణించారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పించినట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మృతి చెందిన వారి పోస్టుమార్టం నివేదికలు వస్తే బయటపడతాయని అన్నారు. కాగా మృతి చెందిన రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, అదీకాక వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఆర్.రవి వెల్లడించారు. వారు కచ్చితంగా ఆక్సిజన్ కొరతతో మరణించారా లేదా అన్న అంశం తేలాల్సి ఉందన్నారు. ఈ విషాద ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. చామరాజనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Corona Cases in India: కరోనా విస్ఫోటం -
గుడిలో నా పెళ్లి సర్.. మమ్మల్ని వదిలేయండి!
సాక్షి, బెంగళూరు: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నిమిషాల్లో విహహం చేసుకోబోయే ఓ వరుడు విచిత్రమైన సంఘటన ఎదుర్కొన్నాడు. మాగడి రోడ్డులో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కల్యాణ మండపానికి తన స్నేహితుడి బైక్‌పై బయలుదేరాడు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారాంతపు కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలియదా అంటూ వారిని ప్రశ్నించారు. బైక్ వెనక కూర్చున్న వరుడు స్పందిస్తూ.. నేను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నాను సర్. సమయానికి ఏ వాహనం లేకపోవడంతో నా స్నేహితుడితో బైక్‌పై కల్యాణ మండపానికి వెళ్లుతున్నట్లు తెలిపాడు. తప్పించుకోవడానికి ఏ వంకా దొరకలేదా బాబు! పెళ్లంటూ ఎందుకు అబద్దం చెబుతున్నావని పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో పెళ్లి కొడుకు తన జేబులో ఉన్న శుభలేఖను తీసి చూపించాడు. అప్పటికీ పోలీసులకు నమ్మకం కలగలేదు. కల్యాణ మండపంలో పెళ్లి చేసుకుందామని భావించగా అక్కడ అనుమతి దొరకలేదని దీంతో స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు పోలీసులకు వివరించాడు. ఇప్పటికే వధువు, ఆమె కుటుంబ సభ్యులు, తమ తల్లిదండ్రులు, బంధువులు గుడికి చేరుకున్నారని తెలిపాడు. ముహూర్తానికి సమయం మించిపోతోందని తనను విడిచిపెట్టాలని పోలీసులకు కోరుకున్నాడు. ఆ యువకుడు చెప్పింది నిజమని పోలీసులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వివాహానికి పది నిమిషాల టైం పెట్టుకుని ఇప్పుడా వెళ్లేది అంటూ ఆ యువకుడి పెళ్లికి ముందస్తు శుభాకాంక్షలు చెప్పి వారిని వదిలిపెట్టారు. చదవండి: ఆ ట్యాంకర్ రాకుంటే...వందకు పైగా ప్రాణాలు గాల్లో కలిసేవి -
సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు
బెంగళూరు: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు సినిమా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలతో పాటు 8 మంది ఈవెంట్ మేనేజర్ల పాత్ర ఉందని సమాచారం. ఇప్పటికే సినిమా హీరో తనీశ్‌ని బెంగళూరు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. తనీశ్‌తో పాటు హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త సందీప్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఈవెంట్ మేనేజర్ కలహరెడ్డితోపాటు, రతన్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సందీప్ రెడ్డి, తనిశ్ స్టేట్మెంట్ మేరకు నాలుగు కేసులను నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసులో సందీప్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కలహర్ రెడ్డితో కలిసి సందీప్ బెంగళూరు వెళ్లాడు. అక్కడ నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో కలహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నాడు. 2019లో శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎమ్మెల్యేతో పాటు పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఆ పార్టీలోనే కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి, శ్రీను రెడ్డి, నటుడు తనీశ్ కలిసి పాల్గొన్నారు. మూడు రోజులపాటు శంకర్ రౌడీ శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేసినట్లు సందీప్ వివరించాడు. దీంతో పాటు అక్కడ ఇరానీ గర్ల్స్‌తో కలిసి డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మందు, విందు, చిందులతో మూడు రోజుల పాటు హంగామా చేశామని చెప్పారు. అయితే హైదరాబాద్‌కు వచ్చే సమయంలో శంకర్ గౌడ్ నుంచి రతన్ రెడ్డి కోకెన్ తీసుకుని వచ్చాడని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహిస్తున్న 8 మంది పాత్ర ఉందని విచారణలో తేలింది. పలు పబ్బుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల పాత్ర ఉందని చెప్పిన సందీప్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. నగరంలోని పలు పబ్బుల్లో డ్రగ్స్ బిజినెస్‌పై కూడా ప్రదీప్ సమాచారం ఇచ్చాడంట. అయితే శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో ఆ మూడు రోజుల పాటు ఒక ఎమ్మెల్యే పాల్గొన్నట్టు సమాచారం. ఇరానీ అమ్మాయిలతో కలిసి ఆయన కూడా డ్యాన్స్‌లు చేశాడని తెలిసింది. రాజశేఖర్, విక్కీ మల్హోత్ర డేనియల్, మస్తాన్ చంద్‌తో కలిసి పార్టీని ఎంజాయ్ చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించారు. రెండుసార్లు పంపిచినా హాజరు కాకపోడంతో తాజా నోటీస్‌కు స్పందించకుంటే కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు. -
కాళ్లపారాణి ఆరకముందే..
బనశంకరి : కారు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నెలమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కమడ్నూరు గ్రామం దారందకుక్కు నివాసి గోపిక్ భార్య ధనూష (23) మృతురాలు. గోపిక్– ధనూషకు ఫిబ్రవరి 21న పెళ్లయింది. బంధువులతో కలిసి బెంగళూరులో బంధువుల ఇంటికి మారుతి వ్యాగనార్ కారులో బయలుదేరారు. శనివారం వేకువజామున బెంగళూరు సమీపంలోని నెలమంగల వద్ద వీరి కారును కోళ్ల లారీ ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జుకాగా ధనూష తీవ్రగాయాలతో చనిపోయింది. భర్త గోపిక్ , బంధువులు శుభలక్ష్మీ, రూపా వేణుగోపాల్‌కు తీవ్రగాయాలు తగిలాయి. నెలమంగల పోలీసులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొత్త జంటకు ప్రమాదంలో విషాదం నెలకొంది. -
వైరల్: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్
బెంగళూరు : చేప కడుపులో పేపర్లతో కూడిన 10 కేజీల(10 కేజీలకు సరిపోయే) ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. గత సోమవారం మంగళూరు, అట్టవర్లోని చేపల మార్కెట్లోని ఓ షాపులో ఓ వ్యక్తి రీఫ్ కోడ్ చేపను కోస్తున్నాడు. ఈ నేపథ్యంలో దాని కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ ఉండటం గుర్తించి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. దీంతో అతను దాన్ని వీడియో తీసి, ఆన్లైన్లో షేర్ చేద్దామని నిశ్చయించుకున్నాడు. పనివాడు వ్యక్తి చేప కడుపు కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌ను బయటకు తీశాడు. అనంతరం దాన్ని ఓపెన్ చేసి చూడగా కొన్ని పేపర్లు బయటపడ్డాయి. అది 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్‌గా వారు గుర్తించారు. దీనిపై షాపు యజమాని మాట్లాడుతూ.. ‘‘నేనిలాంటిది చూడటం ఇదే ప్రథమం. మనుషులు ఇలాగే ప్లాస్టిక్‌ను సముద్రాలలో పడేయటం వల్ల చేపల సంతానోత్పత్తి బాగా దెబ్బ తింటుంది. చేపలు తినే వాటిపై చాలా శ్రద్ధ వహిస్తాయి. అయితే సముద్రపు తీర ప్రాంతాలు ఎక్కువగా ప్లాస్టిక్‌తో నిండి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 40-50 శాతం చేపల వలలు ప్లాస్టిక్‌ను పట్టుకుంటున్నాయి. కానీ, ఈ సంఘటనలో ప్లాస్టిక్ తిన్న చేపను వలలు బంధించాయి. చేపలు మామూలుగా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను తింటుంటాయి. అవి వాటి శరీరాన్ని విషమయం చేస్తున్నాయి. చాలా వరకు ప్లాస్టిక్ చెత్త కాలువలు, నదుల ద్వారా సముద్రాల్లో కలుస్తోంది. ఆ చెత్తను సముద్రాల్లో కలవకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. చదవండి, చదివించండి : వ్వావ్! 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్ లడ్డూలు.. -
బెంగళూరులో మైదుకూరు విద్యార్థి ఆత్మహత్య!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థి మోక్షజ్ఞ రెడ్డి (20) కాలేజీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై బెంగళూరు వర్తూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు.. యువకుడు మైదుకూరు పట్టణవాసి. వర్తూరు సమీపంలోని గుంజూరులో ఉన్న ప్రైవేటు కాలేజీలో బీబీఏ చదువుతున్నాడు. శనివారం నుంచి తల్లిదండ్రులకు ఆ యువకుడు ఫోన్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బెంగళూరులో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. వారు వెంటనే హాస్టల్ గది వద్దకు వెళ్లి తలుపు తీయగా మోక్షజ్ఞ ఉరివేసుకుని కనిపించాడు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం వైదేహి ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుని మరణంపై అనుమానం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి నిజానిజాలు బయటికి తీయాలని డిమాండ్ చేశారు. చదవండి: పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి బైక్‌పై లిఫ్ట్ అడిగి.. ఆపై దోపిడీ -
హైదరాబాద్‌లో ఎందుకిలా?
సాక్షి, సిటీబ్యూరో: అడుగు జాగా ఖాళీ వదలకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవంతులతో ఐటీజోన్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణానికి సంబంధించి..ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నిబంధన నగరంలో కాగితాలకే పరిమితమౌతోంది. ఒక ఎకరం స్థలంలో నిర్మించే వాణిజ్య భవనం కేవలం 2.5 లక్షల చదరపు అడుగులకు మించరాదన్నదే ఈ ఎఫ్ఎస్ఐ నిబంధన. కానీ ఐటీ జోన్, ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో ఎకరం జాగాలో సుమారు 10–15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవంతులే అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలోని ఐటీ జోన్లో ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ అత్యధికంగా ఉన్నట్లు తాజాగా కుష్మన్ వేక్ఫీల్డ్ అనే సంస్థ చేపట్టిన అధ్యయనంలో స్పష్టమైంది. ఫ్లోర్‌స్పేస్ అధికమైతే కష్టాలివే.. భారీ విస్తీర్ణంలో నిర్మించిన బహుళ వాణిజ్య భవంతుల్లో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి రావడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు వేలాదిగా ప్రధాన రహదారులను ముంచెత్తుతుండడంతో గ్రిడ్లాక్ అయి ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఖాళీ వదలకుండా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భవంతుల కారణంగా సిటీ కాంక్రీట్ మహారణ్యంగా మారుతోంది. వర్షాకాలంలో వర్షపునీరు ఇంకే దారులు లేక వరదనీరు ప్రధాన రహదారులపైకి పోటెత్తుతోంది. వర్షపునీరు ఇంకేందుకు ఖాళీ ప్రదేశాలు లేకపోవడంతో భూగర్భజలమట్టాలు పడిపోతున్నాయి. భారీ భవనాల చుట్టూ గ్రీన్‌బెల్ట్ అవసరమైనంత మేర లేకపోవడం, వాహనాలు వదిలే పొగ, దుమ్ము, ధూళి కాలుష్యం పెరిగి వాయు నాణ్యత తగ్గి సిటీజనులు అనారోగ్యం పాలవుతున్నారు. కాంక్రీట్ భవంతులు, అద్దాల మేడలతో అతినీలలోహిత వికిరణ తీవ్రత పెరుగుతోంది. భూతాపం వాతావరణంలో కలిసే పరిస్థితి లేక అధిక వేడిమితో జనం విలవిల్లాడుతున్నారు. ఇతర మెట్రో నగరాల్లో ఇలా.. దేశరాజధాని ఢిల్లీలో ఎకరం స్థలంలో కేవలం 1.23 లక్షల చదరపు అడుగుల భవనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతకు మించి నిర్మాణాలు చేపడితే ఢిల్లీ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. వాణిజ్య రాజధాని ముంబాయి సిటీలో 2.55 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది. బెంగళూరులో కేవలం 2.5 లక్షల చదరపు అడుగులు మాత్రమే. చెన్నై సిటీలో 3.25 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది. పూణేలో కేవలం 2 లక్షల చదరపు అడుగుల భవనాలకే పర్మిషన్లు ఇస్తున్నారు. గ్రేటర్ సిటీలో ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ నిబంధనల అమలు చేయడంలేదు. దీంతో ఎకరం జాగాలో ఏకంగా 10–15 లక్షల చదరపు అడుగుల మేర భారీ బహుళ అంతస్తుల భవంతులను నిర్మిస్తున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టమైంది. -
యువతి- జొమాటో డెలివరీ బాయ్ వివాదంలో ట్విస్టు!
బెంగళూరు: మహిళా కస్టమర్- ఫుడ్ డెలివరీ బాయ్ వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్ లీగల్ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు మేం సహకరిస్తున్నాం. హితేషతో మేం కాంటాక్ట్‌లో ఉన్నాం. తన వైద్య ఖర్చులు భరిస్తున్నాం. అదే విధంగా కామరాజ్‌తో కూడా టచ్లోఉన్నాం. ఇద్దరూ తమ తమ వాదనలతో ముందుకు వచ్చారు. నిజం ఏమిటన్నది తెలుసుకోవడమే మా మొదటి ప్రాధాన్యం. అప్పటి వరకు ఇద్దరికి కావాల్సిన సహాయం అందిస్తాం’’ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక కస్టమర్‌పై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కామరాజ్, గత 26 నెలలుగా తమ సంస్థతో కలిసి పనిచేస్తున్నారన్న గోయల్.. ‘‘అతడు ఇప్పటి వరకు 5 వేల ఫుడ్ డెలివరీలు చేశాడు. తన సేవలకు గానూ 4.75/5 రేటింగ్ పొందాడు. నిజం నిర్ధారణ అయ్యేంత వరకు తనకు మద్దతుగా ఉంటాం’’ అని స్పష్టం చేశారు. జొమాటోలో భోజనం ఆర్డర్ చేసిన బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ హితేషా చంద్రానీ, ఫుడ్ డెలివరీ బాయ్ తనపై పిడి గుద్దులు కురిపించాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎందుకు ఆలస్యం చేశారని అడిగినందుకు, రక్తం వచ్చేలా తనపై దాడి చేశాడంటూ ఆమె విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో డెలివరీ బాయ్ కామరాజ్, జొమాటోపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. గాయాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది! ఈ నేపథ్యంలో కామరాజ్ గురువారం న్యూస్ మినిట్తో మాట్లాడుతూ.. ‘‘ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను. అంతేకాదు ట్రాఫిక్‌జాం వల్ల ఆలస్యమైందని, అందుకు నన్ను క్షమించమని కోరాను కూడా. కానీ ఆమె ఫుడ్ తీసుకునేందుకు నిరాకరించారు. ఎలాగోలా ఒప్పించాను. అంతలోనే ఆమె ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు నాకు సమాచారం అందింది. దీంతో ఫుడ్ ప్యాకెట్ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాను. కానీ, నేను ఎంతగా అడిగినా తను సరిగా స్పందించలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టారు. నన్ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్ I want to chime in about the incident that happened in Bengaluru a few days ago. @zomato pic.twitter.com/8mM9prpMsx — Deepinder Goyal (@deepigoyal) March 12, 2021 -
డెత్‌నోట్ రాసి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
బనశంకరి: కాలేజీ భవనం పై నుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. కె. జయంత్‌రెడ్డి (22) ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి. ఇతను బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీఐటీ) అనే ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రెండో ఏడాది విద్యార్థి. సోమవారం గత ఏడాది పెండింగ్ ఉన్న పరీక్ష రాయడానికి కాలేజీకి వచ్చాడు. ఫీజు బకాయిల్ని చెల్లించాలని కాలేజీ సిబ్బంది జయంత్‌రెడ్డిని నిలదీసినట్లు సమాచారం. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు అతను డెత్‌నోట్ రాసి కాలేజీ భవనం 7వ అంతస్తుపైకి వెళ్లి అక్కడ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థుల ఆందోళన ఈ ఆత్మహత్యతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ పాఠాలు అర్థం కావడం లేదని, ఇలాంటి సమయంలో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. చదువుల్లో ఎంతో ప్రతిభావంతుడైన జయంత్‌రెడ్డి ఆత్మహత్యకు పాలకమండలి నిర్వాకమే కారణమని ఆరోపించారు. పరీక్షలను బహిష్కరించి ధర్నాకు దిగారు. విశ్వేశ్వరపురం పోలీసులు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకుని జయంత్‌రెడ్డి మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డెత్‌నోట్‌ను స్వా«దీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అటు ఫీజుల సమస్య, ఇటు చదువులో వెనుకబాటుతో ఒత్తిడి గురై భవనంపై నుంచి దూకి ఉంటాడని అనుమానిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం ఏమీ స్పందించలేదు. జయంత్ స్వస్థలం బెంగళూరు రూరల్‌లోని దొడ్డబళ్లాపుర పట్టణమని, తండ్రి రైతు అని తెలిసింది. చదవండి: యువకుడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి.. -
డబ్బులు డ్రా చేసినా.. అకౌంట్ ఏదో తెలియదు
బెంగళూరు : ఏటీఎం మెషిన్లో సైబర్ డివైజ్‌ను అమర్చి లక్షలాది రూపాయలు నగదు డ్రా చేసే విదేశీ సైబర్ దొంగల గ్యాంగ్ ఐటీ సిటీలో ప్రవేశించింది. బ్యాంకు అధికారులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఏటీఎం మెషిన్ పాస్‌వర్డ్‌ను దొంగిలించి క్రెడిట్, డెబిట్‌కార్డ్స్ డేటా తస్కరించి ఏటీఎం కేంద్రాల్లో నగదు దోచేస్తున్నారు. రూ.17 లక్షలు డ్రా జనవరి 10వ తేదీన డాక్టర్ శివరామకారంతనగర ఎస్బీఐ శాఖ ఏటీఎంలో పరికరం అమర్చి రూ.17.71 లక్షల నగదు డ్రాచేశారు. ఈ కేసులో స్పెయిన్ దేశానికి చెందిన సేపీ అనే మహిళను సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. విచారణలో ఈమె నుంచి ఎంతో ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొరియా నుంచి ఒక పరికరాన్ని తెప్పించి ఏటీఎంకు అనుసంధానం చేస్తారు. దాని ద్వారా ఏటీఎంలో ఉన్న నగదును ఎంతైనా డ్రా చేసుకోవచ్చునని చెప్పింది. ఆమెకు సహకరించిన ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏ అకౌంటో తెలియదు కొడిగేహళ్లి ఎస్బీఐ ఏటీఎం మెషిన్లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 14 సార్లు రూ.10 వేల మేర మొత్తం రూ.1.40 లక్షల నగదు డ్రా చేశారు. ఏ బ్యాంక్ అకౌంట్‌దారు ఈ నగదును తీశారనేది రికార్డులో నమోదు కాలేదని ఎస్బీఐ అధికారులు వైట్‌ఫీల్డ్ సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సంపిగేహళ్లి పోలీసులు స్పెయిన్ యువతి నుంచి రూ.17 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఈమె అనుచరుల ఆచూకీ ఇంకా కనిపెట్టలేదు. రూ.78 లక్షలు డ్రా రాజాజీనగర పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఏటీఎంలో 2020 నవంబరు నుంచి 2021 జనవరి 30 వరకు గుర్తుతెలియని వ్యక్తులు రూ.78 లక్షలు డ్రాచేశారు. ఏ అకౌంట్ నుంచి నగదు డ్రా చేశారనేది తెలియరాలేదు. బ్యాంకు అధికారులు ఎంత తనిఖీ చేసినా క్లూ దొరకలేదు. -
నాసా ముందడుగు.. ల్యాండైన ‘పెర్సి’
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ముందడుగు వేసింది. నాసా ‘పర్సవరన్స్’ రోవర్ ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అరుణ గ్రహంపై ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంకేతాలను కాలిఫోర్నియాలోని నాసాజెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి పంపించింది. ఇది అంగారక గ్రహంపై ఉన్న రాళ్లు, మట్టిని సేకరించనుంది. కాగా..మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’నిలిచింది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’నాసా పంపిన అతిపెద్ద, అత్యాధునిక రోవర్. రోవర్ ప్రత్యేకతలు.. ఇది ప్లుటోనియం ఇంధనాన్ని కలిగి ఉండి, కారు సైజులో ఉంటుంది. ఇది అరుణ గ్రహంపై నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో సంచరించనుంది. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కీలక బాధ్యతలు నిర్వహించిన భారత మహిళ.. ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహించారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహించారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరించారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే. -
తిరిగొచ్చిన మృతుడు.. విచిత్ర ఘటన
సాక్షి, బెంగళురు: చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు. మంగళూరు సమీపంలో గడార్డి గ్రామ నివాసి శ్రీనివాస దేవాడిగ (60) గత నెల 26వ తేదీన అదృశ్యమయ్యాడు. దీనిపై అతని పిల్లలు బెళ్తంగడి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ అని ఫిర్యాదు చేశారు. ఈ నెల 3వ తేదీ సమీప గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం కుళ్లిపోయి కనబడింది. శ్రీనివాసదే అయి ఉండవచ్చునని నిర్ధారించి కుటుంబసభ్యులకు అప్పగించగా వారు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం ఉత్తరక్రియల్లో ఉండగా శ్రీనివాస నడుచుకుంటూ ఇంటికి చేరుకోవడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు సంభ్రమానికి లోనయ్యారు. తాను చనిపోలేదని ఆయన చెప్పాడు. మద్యం అలవాటు ఉన్న శ్రీనివాస సోదరుని ఇంట్లో తలదాచుకున్నట్లు చెప్పాడు. కాగా, చెరువులో లభించిన మృతదేహం ఎవరిదనేది పోలీసులకు సవాల్‌గా మారింది. -
సంగీత దర్శకుడిని మోసం చేసిన నిర్మాత
సాక్షి, బెంగళూరు : సినీ నిర్మాత శ్రీధర్ అలియాస్ హరిప్రసాద్ స్థలం పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సంగీత దర్శకుడు ప్రవీణ్‌రావ్‌కు స్థలం ఇప్పిస్తామని రూ.94 లక్షలు స్వాహా చేసినట్లు బెంగళూరు గిరినగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే మాదిరి అనేకమంది సినీ రంగంలో స్నేహితులను అతడు మోసగించినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్ల కిందట రాష్ట్ర హౌసింగ్ బోర్డులో ప్రవీణ్‌రావ్‌కు 4 ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి నగదు, చెక్‌రూపంలో మొత్తం రూ.94 లక్షలు తీసుకుని ముఖం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
జత ఎద్దుల ధర రికార్డు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మాలూరు తాలూకా తేర్నహళ్లి గ్రామంలో శ్రీ సఫళాంబ దేవి జాతరలో ఆదివారం పశువుల విక్రయాలు జోరుగా సాగాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎద్దులతో తరలివచ్చారు. బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకా రెడ్డిహళ్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డికి చెందిన జత ఎద్దులు 10 లక్షల రూపాయలకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించాయి. -
కోలుకుంటున్న శశికళ
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత తమిళనాడు సీఎం జయలలిత ప్రియ స్నేహితురాలు వీకే శశికళ నటరాజన్ కోలుకుంటున్నట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్వాస సాధారణ స్థితికి వచ్చిందని, అయినప్పటికీ ఆక్సిజన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు. జ్వరం, కోవిడ్ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. ఆదివారం స్వల్పంగా ఆహారం తీసుకుని ఐసీయూలో వాకింగ్ చేశారని వైద్యులు తెలిపారు. చదవండి: శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక -
ఆ ‘ఐఫోన్ల’ కంపెనీలో అక్రమాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం శివారులో ఐఫోన్లను తయారు చేసే ‘విస్ట్రాన్ ఫెసిలిటీ’లో డిసెంబర్ 12వ తేదీ రాత్రి, నైట్ షిప్టులో పని చేస్తోన్న దాదాపు రెండు వేల మంది కార్మికులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయాలను ధ్వంసం చేయడంతోపాటు వేలాది ఐఫోన్లు, లాప్ టాప్‌లను కార్మికులు ఎత్తుకెళ్లారు. వారిలో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విధ్వంసంలో కంపెనీకి ఏడు మిలియన్ డాలర్ల నష్టం(దాదాపు 51 కోట్ల, 54 లక్షల రూపాయలు) వాటిల్లినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు శివారులోని ఆ నర్సాపుర ప్లాంట్‌లో గత కొన్ని నెలలుగా వేతనాలు అతి తక్కువగా ఇస్తుండడంతో కార్మికులకు కడుపు మండి ఒక్కసారిగా కంపెనీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ప్రభుత్వ బృందానికి అనేక చీకటి విషయాలు వెలుగు చూశాయి. ఐఫోన్ల ఉత్పత్తి కోసం తైవాక్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి కంపెనీలో అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలో 10,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి ఎక్కువ జీతాలిస్తామని చెప్పి తక్కువ జీతాలు ఇస్తూ వచ్చారు. అప్పటి వరకు 8 గంటల షిప్టుల్లో పని చేసిన ఉద్యోగులకు గత అక్టోబర్ నెల నుంచి 12 గంటల షిప్టులు వేశారు. త్వరలోనే హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచుతామంటూ ఇంతకాలం కార్మికులను బుజ్జగిస్తూ వచ్చారు. ‘అదనంగా పెంచిన నాలుగు గంటలకు ఓటీ ఇస్తారా, లేదా? హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచి 12 గంటలు పని చేయించుకోవాలనుకుంటున్నారా?’ అన్న ఆలోచన, ఆందోళన ఉద్యోగుల్లో పెరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యువేట్లకు నెలకు 21 వేల రూపాయలు ఇస్తామని విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే వారికి నెలకు 16 వేల రూపాయలే ఇస్తున్నట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. కార్మిక శాఖ నుంచి అనుమతి లేదు కంపెనీ 12 గంటల షిప్టు గురించి కర్ణాటక కార్మిక శాఖకు తెలియజేయలేదు. మహిళా కార్మికుల అదనపు పని గంటల విషయంలో ముందుగా కర్ణాటక కార్మిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి, అదీ తీసుకోలేదు. కాంట్రాక్టు కార్మికులు, హైజ్ కీపింగ్ స్టాఫ్‌తో అదనపు గంటలు పని చేయించుకోవడంతోపాటు వారి అటెండెన్స్‌ను సక్రమంగా నమోదు చేయాల్సిన కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా తప్పుడు విధానంతో తగ్గించింది. ఉద్యోగుల విధ్వంసం నేపథ్యంలో కంపెనీని సందర్శించాక ప్రభుత్వ దర్యాప్తు బృందానికి కంపెనీ యాజమాన్యం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఉద్యోగుల వేతనాల్లో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. భారత్‌లో వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ను ఉద్యోగంలో తీసివేసినట్లు పేర్కొంది. ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించేందుకు హాట్‌లైన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. విస్ట్రాన్ కంపెనీ నర్సాపురలో 43 ఎకరాల్లో మూడువేల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీని నిర్మించింది. రెండో తరానికి చెందిన ఐఫోన్ ఎసీఈ మోడల్‌తోపాటు నాలుగు మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో విక్రయించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫ్యాక్టరీ విస్తరణ కోసం 1300 కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. ప్రస్తుతం పదివేల మంది ఉద్యోగుల్లో రెండు వేల మంది మాత్రమే కంపెనీ ‘రోల్స్’లో పని చేస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నారు. రానున్న కాలంలో ఉద్యోగుల సంఖ్యను 20 వేలకు పెంచుతామని కంపెనీ యాజమాన్యం ఇది వరకే ప్రకటించింది. అయితే ఈ విధ్వంస సంఘటన నేపథ్యంలో కంపెనీ విస్తరణ ఆలస్యం అవుతుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కార్మికుల ఆత్మహత్యలు అమెరికాకు చెందిన ఐఫోన్ల దిగ్గజ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఉత్పత్తి కాంట్రాక్టులిచ్చింది. అలా కాంట్రాక్టు తీసుకున్న పలు కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడడమే కాకుండా, వారి ప్రాణాలు తీస్తున్నా, వాటిని అరికట్టేందుకు అమెరికా కంపెనీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాదు. చైనాలోని షెన్జెన్ నగరంలో ఐఫోన్ల కాంట్రాక్టు తీసుకున్న నైట్‌లైన్ కంపెనీలో 18, 24 గంటల షిప్టులను తట్టుకోలేక 2012, ఏప్రిల్ నెలలో 18 మంది కార్మికులు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవడానికి ఆ కంపెనీ ఇనుప వలలను ఏర్పాటు చేయడం మరీ చిత్రం. జెంగ్జౌ నగరంలోని ఐఫోన్లను ఉత్పత్తి చేసే ఫాక్స్‌కాన్ కంపెనీలో 2018, జనవరి ముగ్గురు కార్మికులు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. -
రోహిత్ శర్మకు లైన్ క్లియర్
బెంగళూరు : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో హిట్‌మ్యాన్ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) కాగా ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ సఫలం కావడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా రోహిత్ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. కాగా మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆసీస్- భారత్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17నుంచి జరగనుంది.(చదవండి : అందుకే హార్దిక్‌ను వద్దనుకున్నాం: కోహ్లి) -
200 ఫోన్లకు నగ్న చిత్రాలను పంపి...
బెంగళూరు : ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్రదుర్గ ప్రాంతంలోని చల్లకెరేకు చెందిన రామక్రిష్ణ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇలా దాదాపు 200 మందికి నగ్న చిత్రాలను పంపించాడు. వీరిలో 120 మంది మహిళలు కూడా ఉన్నారు. చల్లకెరేకు చెందిన చాలా మంది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. ( అదృష్ట దేవతమీదేనంటూ వల ) అయితే రామక్రిష్ణ తన ఫోన్ స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో అతడ్ని కనుక్కోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. శుక్రవారం అతడు ఫోన్ ఆన్ చేయటంతో ట్రేసింగ్ ద్వారా ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. ఫోన్ రింగ్ అయిన నెంబర్లకు మాత్రమే ఫొటోలు పంపుతానని చెప్పాడు. చాలా మంది మహిళలను వారి నగ్న చిత్రాలు పంపమంటూ వేధించానని తెలిపాడు. -
మొండెం మధ్యప్రదేశ్‌లో.. తల బెంగళూరులో..
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైలు పట్టాలపై లభించిన మొండెం తాలూకూ తల బెంగళూరులో దర్శనమిచ్చింది. రైలు ఇంజన్లో ఇరుక్కున్న తల దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు రైల్వే స్టేషన్లో చిక్కింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అక్టోబర్ 3వ తేదీన మధ్యప్రదేశ్, బెతుల్ రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మొండెం లభించింది. అయితే తల, మరి కొన్ని ఇతర భాగాలు కనిపించకపోవటంతో అతడి ఆచూకీ తెలుసుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న రైలు ఇంజన్‌కు చిక్కుకుని ఉన్న తలను బెంగళూరు రైల్వే స్టేషన్ సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ( ‘అవి రక్తపు మరకలు కాదు పెయింట్’ ) తలను ఫొటో తీసి విచారణ చేయగా.. తల లేని మొండెం ఒకటి మధ్యప్రదేశ్, బతుల్ రైల్వే స్టేషన్లో దొరికినట్లు బెంగళూరు పోలీసులకు తెలియవచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేయగా సదరు విడి భాగాలు బతుల్‌కు చెందిన 28 ఏళ్ల రవి మర్కామ్‌కు చెందినవిగా తేలింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు అతడి తల మీదనుంచి వెళ్లటం కారణంగా అతడు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. -
హార్మోనికాతో మ్యూజిక్ అల్లాడించేసింది
బెంగళూరు : మనకు నచ్చిన పని చేసినపుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ పనిలో గొప్ప స్థాయిలకు చేరుకోగలుగుతాం లేదా అద్భుతమైన నైపుణ్యత సాధిస్తాం. అలవాటుగా నేర్చుకున్నదైనా.. ఓ ఆశయంగా మలుచుకున్నదైనా మనలో ప్రతిభ ఉన్నపుడు జనం జేజేలు కొట్టక తప్పదు. ప్రస్తుతం ఇంటర్నెట్ పుణ్యమా అని కళాకారుల ప్రతిభకు తక్కువ సమయంలో గుర్తింపు దక్కుతోంది. తాజాగా హిరోనికా(మౌత్ ఆర్గాన్) వాయిస్తూ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిందో యువతి. ( ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!) బెంగళూరుకు చెందిన ఆకాంక్ష శెట్టి అనే యువతి చాలా నైపుణ్యంతో ‘బీట్‌బాక్స్’.. నోటితో డప్పులాంటి చప్పుళ్లు చేస్తూ మరో వైపు హార్మోనికా వాయిస్తూ లయబద్ధంగా సంగీతాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాంక్ష స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. ( వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది ) View this post on Instagram Here I am with the fuller version of my previous video!! With the different variations of Harmonica! I hope you guys like it!! Do let me know in the comment section!! Share it ❤️🌻 Show some love 🥰 @bbxindia_official @mtvhustle @globalfemalebeatbox ❤️🌻 #beatboxer #beatboxing #mtv #mtvhustle #globalfemalebeatbox #harmonica #artistsoninstagram #bangalore #unstoppable #bossbabe A post shared by A POWERFUL BAD-ASS WOMAN! 🇮🇳🧿 (@akankshashettyy) on Sep 9, 2020 at 3:54am PDT -
డర్టీ పిక్చర్‌కు కటకటాలే
బెంగళూరు : అశ్లీల ఫోటోలు, వీడియోలను సేకరించి ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ పైశాచికానందం పొందే వికృత కాముకుల ఆట కట్టించేందుకు రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలు గట్టి చర్యలు తీసుకోబోతున్నాయి. అలా అప్లోడ్ చేసేవారు ఏ మూల ఉన్నా సాంకేతిక ఆధారాలతో గుర్తించి కటకటాల వెనక్కు పంపనున్నారు. పోర్న్‌తో పదుల సమస్యలు దేశంలో పోర్న్ వెబ్సైట్ల వీక్షణం నిషేధించినప్పటికీ చాటుమాటుగా చూస్తున్నవారి సంఖ్య తక్కువేం కాదు. కరోనా లాక్డౌన్ సమయంలో మరింతగా పెరిగినట్లు పలు సర్వేలు కూడా హెచ్చరించాయి. మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడులకు ఇటువంటి వెబ్సైట్లు కూడా కారణమవుతున్నాయని ప్రభుత్వాలు, ఎన్జీవోలు ఎప్పటినుంచో వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చిన్నారులపై దౌర్జన్యాల నియంత్రణ విభాగం (ఎన్సీఎంఇసీ)ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం, గూగుల్‌తో పోలీసులు, సీసీబీ సంప్రదింపుల్లో ఉంటూ వికృత కాముకులను పసిగడతారు. ( ముగ్గురు పూజారుల దారుణ హత్య ) ఇటీవలి కేసులు బెంగళూరులో ఇంటర్నెట్లో బాలల అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్న ఉడుపికి చెందిన సౌరవ్శెట్టి అనే యువకుడిని సైబర్ క్రైంపోలీసులు ఇటీవల ఇదే రీతిలో చేశారు. బెంగళూరు చామరాజపేటే రౌడీ మంజునాథ్ అలియాస్ కోడి మంజు కూడా ఒక అశ్లీల చిత్రాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చెయ్యగా, పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐడీ సైబర్ విభాగ డీవైఎస్పీ కేఎన్.యశవంత్‌కుమార్ తెలిపారు. నిందితులు దొరికిపోతారు ఇలా సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేస్తే గూగుల్ తన సాంకేతిక పరిజ్ఞానంతో అలాంటి వారి సమాచారం సేకరించి కేంద్ర హోంశాఖ కు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వ బృందాలు, గూగుల్ ఇచ్చే ఐపీ అడ్రస్ వివరాలు ఆధారంగా దుండగుల చిరునామా, మొబైల్ నంబర్ ఆచూకీ కనిపెట్టి రాష్ట్రాల సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా దుండగులు ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తారు. -
ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్టయిన శాండల్‌వుడ్ నటీమణి సంజనా గల్రానిని బుధవారం 10 గంటల సమయంలో సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి తీసుకురాగా, మహిళా సీఐ అంజుమాల బృందం సంజనాను విచారించారు. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. నిందితుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో పాటు వివిధ కోణాల ద్వారా సేకరించిన వివరాలపై సంజనాను విచారించారు. 34 మంది పెద్ద పెద్ద వ్యక్తుల పుత్రుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలుసుకొంటున్నారు. బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. మంగళూరు, యలహంక, కమ్మనహళ్లిలో జరిగిన హై–ఫై పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఆరా తీస్తున్నారు. సంజనా, రాగిణి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇతర నిందితులు వీరేన్ ఖన్నా, రాహుల్ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన పట్టుబట్టగా అధికారులు ఒప్పుకోలేదు. ( ఫోన్లో మెసేజ్‌లను తొలగించిన నటి ) సంజన కంట నీరు నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాని కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. బెంగళూరు డైరీ సర్కిల్లోని మహిళా సాంత్వన కేంద్రంలో వీరిద్దరినీ ఉంచారు. మంగళవారం రాత్రి వీరికి ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిని కేటాయించారు. ఇద్దరి మధ్య మాటలు లేకుండా గడిపారు. ఆ చివర, ఈ చివర బెడ్లను ఇద్దరికీ కేటాయించగా, మధ్యలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. తనకు రాత్రి భోజనం వద్దని చెప్పిన సంజనా ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు తెలిసింది. రాగిణి, సంజనకు కేపీఎల్‌లో విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి మాటలు లేవు. మహిళలే దొరికారా? డ్రగ్స్ దందాలో రాగిణి, సంజనా పేర్లను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మరో నటీమణి పారూల్ యాదవ్ ఆక్రోశించారు. వారికి మద్దతుగా ఆమె గళమెత్తారు. దేశంలో డ్రగ్స్‌ను సేవిస్తున్నదీ, అమ్ముతున్నదీ ముగ్గురు (రియా చక్రవర్తి, రాగిణి, సంజనా) మాత్రమేనా, ఇంక ఎవరూ ఈ దందాలో లేరా? అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ సిబ్బంది, క్రీడాకారులు, నటులు డ్రగ్స్ వ్యవహారంలో లేరా? అని ఆమె సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటీమణుల పేర్లు
బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారం నానాటికీ విస్తరిస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రముఖ అందాల నటి రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రాగిణి పేరు ప్రచారంలోకి రావడంతో వారిద్దరికీ నోటీసులు పంపారు. అయితే రాగిణి హాజరు కాలేదు. రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని సమాచారం సేకరిస్తున్నారు. మరింత విచారణ కోసం కోర్టు అనుమతితో కస్టడీకీ తీసుకోవాలని నిర్ణయించారు. రాగిణికి శుక్రవారం హాజరు కావాలని మళ్లీ నోటీసులు పంపారు. బుధవారం రాత్రి నోటీసు ఇవ్వటానికీ పోలీసులు యలహంకలోని రాగిణి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేక పోవటంతో వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆమె ముఖం చాటేస్తుండడంతో పోలీసుల్లో అనుమానం పెరిగింది. అయితే రాగిణి తన న్యాయవాది ద్వారా సీసీబీ అఫీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల హాజరు కాలేదని ఆమె ట్విట్టర్లో తెలిపారు. సంజన ఆప్తుడు అరెస్ట్ నటి సంజన ఆప్తుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని శాండల్‌వుడ్‌లో నటీనటులు ఆందోళనకు గురవుతున్నారు. రాహుల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు. రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు సంజన తెలిపారు. ( ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా... ) బాలీవుడ్‌తో సంబంధాలు : ప్రశాంత్ శాండల్‌వుడ్ డ్రగ్స్ మాఫియాకు బాలీవుడ్‌తో సంబంధాలున్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఆరోపించడంతో ముడి మరింత బిగుసుకుంది. బాలీవుడ్‌తో సంబంధాలున్న ఇంతియాజ్ ఖాత్రిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ప్రశాంత సంబరగి గురువారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ఇంతియాజ్ ఖాత్రితో బాలీవుడ్ నటీనటులు, నిర్మాతలకు మంచి సంబధాలున్నాయి. అతని పుట్టినరోజుకు సినీరంగ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇటీవల బెంగళూరులో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు అతడు కూడా హాజరయ్యాడు అని చెప్పారు. నటీమణులు రాగిణి, సంజనలపై కూడా సంబరగి డ్రగ్స్ ఆరోపణలు చేశారు. -
ఇష్టం లేని పెళ్లి.. ప్రియురాలితో కలిసి
బెంగళూరు : తాను ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతితో పెద్దలు వివాహం చేయడంతో యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో చోటు చేసుకొంది. వివరాల మేరకు... క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లి సమీపంలోని కే. కొత్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సురేష్(24), బొమ్మరసనపల్లి గ్రామానికి చెందిన బాలరాజ్ కూతురు భవాని(18)లు ఏడాదిగా ప్రేమించుకొన్నారు. అయితే సురేష్ కుటుంబ సభ్యులు వీరి ప్రేమపై అయిష్టత వ్యక్తం చేస్తూ నాలుగు నెలల క్రితం సురేష్‌కు వేరే మహిళతో పెళ్లి చేశారు. ( ఇంట్లో చొరబడి ఎవర్నీ వదల్లేదు ) ఇష్టం లేని పెళ్లి జరగడంతో సురేష్ రెండు రోజుల క్రితం తన ప్రేయసితో కలిసి ఇల్లు వదిలి వెళ్లి హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని కుందారపల్లి వద్ద పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భవానీ మంగళవారం మృతి చెందింది. సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం కోలారుకు తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై క్రిష్ణగిరి తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!
బెంగళూరు : గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న శాండల్‌వుడ్‌కు చెందిన నటులు, సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా ఎన్సిబీ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. డ్రగ్స్‌కు కోడ్ పేర్లను పెట్టి తాను సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తన నుంచి ఏయే నటీ నటులు డ్రగ్స్‌ను కొనేదీ వివరించారు. సుమారు 30 మంది వరకు సినిమా రంగానికి చెందిన వ్యక్తుల పేర్లను ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్సీబీ అధికారులు వారికి నోటీసులను అందించాలని నిర్ణయించారు. ఎవరీ అనికా? నిందితురాలు పేరు అనికా అయితే అనికా డి, బిమని అనే రెండు మూడు పేర్లను పెట్టుకొని బెంగళూరులో మత్తు దందాను నడపుతున్నట్లు విచారణలో బయట పడింది. సోషల్ మీడియాలో బిమని అనే పేరుతో చలామణి అయ్యేది. ఆమె తమిళనాడు సేలంకు చెందినవారు కాగా ఆమెకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. తమిళనాడులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును మధ్యలో వదిలేసింది. ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చింది. ఉద్యోగం దొరక్క, డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో వివరించింది. ముంబై డ్రగ్స్ డీలర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి పెద్దమొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినప్పుడు సినిమా రంగ ప్రముఖుల బండారం బయటపడింది. ( ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా...) లంకేశ్ విచారణ ద్వారా 15 మందికి తాఖీదులు? డ్రగ్స్ దందాపై సోమవారం దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఇచ్చిన సమాచారం మేరకు సినిమా రంగానికి చెందిన మరో 15 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. సినీ రంగంలో డ్రగ్స్ తీసుకొనేవారి పేర్లను లంకేశ్ సీసీబీ పోలీసులకు అందజేశారు. బెంగళూరులో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై డ్రగ్స్ విషయంపై చర్చించారు. ఈ 15 మంది సినీ ప్రముఖులు ఎవరనేది ఇప్పుడు శాండల్‌వుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. కరోనా వచ్చాక నేరాల వృద్ధి: కమిషనర్ డ్రగ్స్ వ్యవహారం అధికంగా నడుస్తున్న ఉప్పారపేట, బసవేశ్వరనగర, చంద్రాలేఔట్ ప్రాంతాల పోలీసుస్టేషన్లను నగరపోలీస్ కమిషనర్ కమల్‌పంథ్ మంగళవారం తనిఖీ చేశారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కరోనా వచ్చిన తరువాత బెంగళూరు నగరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు. -
పొద్దుపొద్దున్నే ఛేజింగ్, కాల్పులు
బెంగళూరు : ఐటీ సిటీలో నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్తున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నారు. సినిమాలో మాదిరిగా ఛేజింగ్, కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్, పంజాబ్‌కు చెందిన దొంగలు సుభాష్ (30), సంజయ్ (31)లు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటోడ్రైవర్ సమాచారంతో సోమవారం తెల్లవారుజామున 5:45 సమయంలో రాజాజీనగర పోలీసుస్టేషన్ పరిధిలోని పాత పోలీసుస్టేషన్ సర్కిల్లో మహిళ నడిచివెళ్తుండగా ఇద్దరు దొంగలు గొలుసు తెంచుకుని పరారయ్యారు. ఇది చూసిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే పోలీసు కంట్రోల్ రూంకి సమాచారమిచ్చాడు. సీఐ వెంకటేశ్ జీపులో, శ్రీరాంపుర ఎస్ఐ వినోద్‌నాయక్ బైకు మీద వారి వెంట పడ్డారు. మహలక్ష్మీ లేఔట్ వద్ద ఎస్సై బైక్ నుంచి కిందపడ్డాడు. అయినప్పటికీ సీఐ వెంకటేశ్, ఎస్ఐ వినోద్ నాయక్‌లు దొంగల వెంటపడి లొంగిపోవాలని హెచ్చరించారు. ( మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..) దొంగల ఎదురుదాడి దుండగులు వినకుండా ఎదురుదాడి చేయడంతో ఎస్ఐ వినోద్‌నాయక్ పిస్టల్‌తో కాల్పులు జరపడంతో దుండగులకు తూటాలు తగిలి కిందపడిపోయారు. దొంగల దాడిలో ఇద్దరు పోలీసులు కూడా క్షతగాత్రులయ్యారు. అందరినీ ఆస్పత్రికి తరలించారు. దుండగులపై సంజయనగర, కామాక్షిపాళ్య, మాగడిరోడ్డు, బాగలకుంటె పీఎస్‌లలో పలు కేసులున్నట్లు తెలిపారు. -
కొడుకు పేరిట కొరియర్: తండ్రికి షాక్!
బెంగళూరు : కుమారుడి పేరిట వచ్చిన కొరియర్ బాక్స్‌లో ఉన్నది గంజాయని తెలిసి షాక్ తిన్నాడో తండ్రి. పిల్లాడి జీవితం పాడవకూడదన్న ఆలోచనతో పోలీసులను ఆశ్రయించి, గంజాయి పంపిన వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు, సదాశివనగర్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పిల్లాడి పేరిట ఓ కొరియర్ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకుని తెరిచి చూశాడు. దాంట్లో గోధుమ రంగులో ఉన్న పొడి కనిపించింది. అనుమానం వచ్చిన ఆ వ్యాపార వేత్త వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాడు. అనంతరం సదరు స్నేహితుడికి ఆ పొడిని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపాడు. ( కన్నింగ్ కపుల్: పూజారులే టార్గెట్ ) ఆ వ్యక్తి దాన్ని గంజాయి పొడిగా గుర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన వ్యాపారవేత్త వెంటనే సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ పార్శిల్ ఎమ్జీ రోడ్‌నుంచి వచ్చిందని గుర్తించారు. ఆ వ్యాపార వేత్త కొరియర్ ఆఫీసుకు వెళ్లి కొరియర్ పంపిన వ్యక్తి వివరాలు అడగగా వారు నిరాకరించారు. దీంతో ఈ నెల 21న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పార్శిల్ పంపిన ధీరజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు-నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన శ్యాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వృత్తిరీత్యా డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన రాక్‌లైన్ దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు. (చదవండి: సీనియర్ నటికి కరోనా పాజిటివ్!) సమలతకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్యకాలంలో సుమలతను కలిసినందున ఆయనకు కూడా కరోనా వచ్చి ఉండొచ్చని అందరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ వెంకటేష్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం రాక్‌లైన్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ రాజవీర మడకారి నాయక అనే పిరియాడికల్ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను ఆయన కన్నడలో రీమేక్ చేశారు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ ‘లింగా’ సినిమాను ఆయనే నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో ఆయన మైసూర్ ఎస్పీగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాతో హీరో తండ్రి మృతి) -
ఇస్రో ట్వీట్: ఇదేంటో తెలుసా!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇప్పటికీ విజయవంతం పనిచేస్తోంది. అంతరిక్షంలో అరుదైన చిత్రాన్ని తాజాగా ‘మామ్’ తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహం రహస్య చంద్రుడిగా వ్యవహరించే ‘ఫోబోస్’ అరుదైన ఫొటోను మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) సంగ్రహించింది. అంగారక గ్రహం నుంచి 7,200 కి.మీ. ఫోబోస్ నుంచి 4,200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు ఎంసీసీ ఈ ఫొటో తీసిందని ఇస్రో వెల్లడించింది. ‘ఈ ఫోటో ప్రాదేశిక రిజల్యూషన్ 210 ఎం. ఇది 6 ఎంసీసీ ఫ్రేమ్‌ల నుంచి ఉత్పత్తి చేయబడిన మిశ్రమ చిత్రం. రంగు సరిదిద్దబడింద’ని ఇస్రో తెలిపింది. అంగార గ్రహానికి అతి సన్నిహితంగా, పెద్దగా ఉన్న చంద్రుడిగా పిలవబడే ఫోబోస్.. కార్బోనేషియస్ కొండ్రైట్లతో నిండివుంటుందని వెల్లడించింది. 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. (టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు) -
కరోనా అని తెలిస్తే జనాలు భయపడతారని..
బెంగళూరు: కరోనా పాడుగాను.. ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ.. జనాలను ఆగమాగం చేస్తోంది. కనీసం కడసారి చూపు కూడా దక్కనివ్వడం లేదు. కోట్లకు అధిపతి అయిన కాటికి వెళ్లేటప్పుడు నా అనుకునే నలుగురు మనుషులు వెంట రాలేని పరిస్థితులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రతి రోజు కరోనా మృతులకు సంబంధించి గుండె కలుక్కుమనే వార్త ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా బెంగళూరులో ఇలాంటి అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది. కరోనా పాటిజివ్‌గా తేలిన ఓ వ్యక్తి గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలి మరణించాడు. అంబులెన్స్ వచ్చేవరకు దాదాపు మూడు గంటల పాటు ఆ మృతదేహాం అలా రోడ్డు మీదనే ఉంది. ఎవరు అక్కడికి వెళ్లలేదు. వివరాలు.. దక్షిణ బెంగళూరుకు చెందిన ఓ 64 వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో శుక్రవారం అతడికి గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేశాడు. పరిస్థితి వివరించి.. తమ ఇంటి దగ్గరకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. అంబులెన్స్ కోసం రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గ మధ్యలోనే గుండెపోటుతో రోడ్డు మీదే కుప్పకూలాడు. అలా మూడు గంటల పాటు ఆ వృద్ధుడి మృతదేహం రోడ్డు మీదనే ఉంది. ఆ తర్వాత అంబులెన్స్ అక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లింది. దీని గురించి మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘కరోనా అని తెలిస్తే... ఇరుగుపొరుగు వారు భయపడతారనే ఉద్దేశంతో నా భర్త ఎవరి సాయం తీసుకోలేదు. అంబులెన్స్‌కు కాల్ చేసి రమ్మని చెప్పాడు. రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు. (కాన్పూ కష్టమే!) ఈ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బృహన్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ)పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు. కమ్యూనికేషన్ లోపం వల్ల అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఆలస్యమయ్యిందని తెలిపారు. అదికాక ఆ రోజు సాయంత్రం వర్షాల వల్ల మరింత ఆలస్యం అయ్యిందన్నారు. కానీ ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతవారం కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ 50 ఏళ్ల వ్యక్తికి చికిత్స ఇవ్వడానికి దాదాపు 50 ఆస్పత్రులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతడికి ఇంటిలోనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. (సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కరోనా తీవ్రరూపం ) -
కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు ఐసోలేషన్‌కి!
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ గొర్రెల కాపరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతని వద్ద ఉన్న సుమారు 50 గొర్రెలు, మేకలను ఐసోలేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గొల్లరహట్టి తాలూకాలోని గోడెకెరె గ్రామంలో చోటుచేసుకుంది. కాపరికి చెందిన మేకలు, గొర్రెలు శ్వాసకోశ సమస్య కలిగి ఉన్నాయని గమనించిన గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పశుసంవర్ధక శాఖలోని ఓ అధికారి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు) అదే విధంగా గోడెకెరె గ్రామ ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న కరోనా భయాందోళనలపై సమగ్రంగా విచారణ జరపాలని కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి, తుముకూరు జిల్లా కమిషనర్ కె. రాకేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజల విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు. గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవాలని పశుసంవర్ధక విభాగాన్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించి.. మేకలు ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అని పిలువబడే పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్(పీపీఆర్)తో బాధపడుతున్నాయని తెలిపారు. ఇక జంతువుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఇక మేకలు, గొర్రెలు కరోనాకు గురి కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ ఇతర జంతువులకు కూడా వ్యాప్తిస్తుందని గొర్రెలు, మేకలను నిర్భంధించినట్లు అధికారులు తెలిపారు.(తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్) -
బెంగళూరు ప్రజలకు సీఎం వార్నింగ్
బెంగళూరు: రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బెంగళూరు వాసులను గురువారం హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదా మరోసారి లాక్డౌన్ విధించమంటారా? అని ప్రజలపై ఆసహనం వ్యక్తం చేశారు. తిరిగి లాక్డౌన్ విధించకుండా ఉండాలంటే తప్పసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. (‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’) But we are also thinking about the number of cases which is increasing in Bengaluru. I urge people to maintain social distancing and sanitisation if Bengalurians don't want one more seal down: Karnataka Chief Minister BS Yediyurappa https://t.co/K5TXkA9UIG — ANI (@ANI) June 25, 2020 కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు అధికారులతో యడియూరప్ప సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలో బెంగళూరు కూడా ఒకటి. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 418 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894కు చేరింది. 2,71,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!) -
‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం యడ్యూరప్ప సర్కారు మరోసారి లాక్డౌన్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులోని ఐదు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం ఐదు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని.. బెంగళూరు మొత్తం 20 రోజుల పాటు లాక్డౌన్ విధించాలి అని ఆయన ప్రభుత్వాన్నికోరారు. లాక్డౌన్ అమలులో కఠినంగా వ్యవహరించకపోతే.. బెంగళూరు మరో బ్రెజిల్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవి అని కుమారస్వామి వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుత సమయంలో కార్మికులకు నిత్యావసర సరుకులతోపాటు, రూ.5వేల ఇవ్వాలని కుమారస్వామి కర్ణాటక సర్కారును విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వారికి ఏమాత్రం సరిపోదన్నారు. కార్మికులకు అవసరమైన సాయాన్ని వెంటనే అందించాలని కుమారస్వామి కోరారు. -
పబ్లిక్‌గా మూత్రం పోయోద్దన్నందుకు..
బెంగళూరు : బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయోద్దన్నందుకు ఓ మహిళపై దాడికి తెగబడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు కాదుబీసనహల్లి రెసిడెంట్‌కు చెందిన ఓ మహిళ ఈ నెల 10న పని మీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఆరుగురు మందు తాగుతూ ఉన్నారు. ఆమె వారిని అక్కడ మందు తాగొద్దని హెచ్చరించింది. అయితే వారు ఆమె మాటలను లెక్క చేయలేదు. దీంతో ఆమె వారి ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని స్థానిక రెసిడెంట్స్ అసోషియేషన్ గ్రూపులో షేర్ చేసింది. ‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా జయరామ్ నాయుడు అనే వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. ఆమె అతడ్ని ప్రశ్నించగా ఆగ్రహించిన అతడు ఆమెపై దాడి చేశాడు. ఆమె జట్టుపట్టుకుని కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భార్యను తనకు కాకుండా చేశాడన్న కసితో..
సాక్షి, బెంగళూరు : తన భార్యను తనకు కాకుండా చేశాడన్న కసితో కర్ణాటకలో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్యను తీసుకెళ్లిపోయిన వ్యక్తిని దారుణంగా చంపి, రక్తం తాగాడు. ఈ కేసులో తబ్రేజ్, నిజామ్, అలీ అండు అనే ముగ్గురు నిందితులను డీజే హళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ భార్యను సుభాన్ అనే వ్యక్తి లోబర్చుకుని తమకూరుకు తీసుకెళ్లి అక్కడ నివాసం ఉంటున్నాడు. దీంతో సుభాన్‌ను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించాడు తబ్రేజ్. మే నెలలో పై ముగ్గురు నిందితులు తుమకూరులోని సుభాన్ అపహరించి బెంగళూరుకు తీసుకొచ్చారు. చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి డీజేహళ్లి పోలీసుస్టేషన్ వద్ద పడేశారు. ( మాజీ ప్రేయసి ప్రియుడితో ఉండగా..) దర్యాప్తులో దారుణ నిజాలు మొదట పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. తబ్రేజ్ భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు. తబ్రేజ్‌తో కలిసి ఉండలేనని ఆమె పోలీసుల ముందు చేప్పేసింది. తను సుభాన్‌తో కలిసి ఉండడం వల్ల తబ్రేజ్ హత్య చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితులతో కలిసి సుభాన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తబ్రేజ్ పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. తన భార్య తీసుకేళ్లిన సుభాన్‌ను హత్య చేయటమేకాదు, అతడి రక్తం కూడా తాగినట్లు తబ్రేజ్ వెల్లడించడంతో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. తబ్రేజ్‌తో పాటు అతడి స్నేహితులు నిజామ్, అలీ అండులను అరెస్ట్ చేశారు. తన భార్యను తనకు కాకుండా చేశాడన్న కసితో రక్తం తాగినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తబ్రేజ్‌పై బెంగళూరులో జేబు దొంగగా అనేక కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. -
మాజీ ప్రేయసి ప్రియుడితో ఉండగా..
సాక్షి, బెంగళూరు : తనను వదిలేసిందని మాజీ ప్రేయసిపై ఓ యువకుడు దాడిచేసిన సంఘటన నెలమంగల సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... 21 సంవత్సరాల యువతి.. బబిత్ అనే యువకునితో 4 ఏళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఇటీవలే భిన్నాభిప్రాయాలు వచ్చి దూరంగా ఉంది. తరువాత యువతికి రాహుల్ అనే మరో యువకుడు పరిచయమై ప్రేమలో పడింది. ఈ క్రమంలో యువతి కొత్త ప్రియుడి ఇంట్లో ఉండగా హఠాత్తుగా అక్కడకు వచ్చిన మాజీ ప్రియుడు యువతిపై హెల్మెట్‌తో తీవ్రంగా కొట్టాడు. ( నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్) యాక్సిడెంట్ అని తప్పుడు సమాచారం యువతి రక్తగాయాలతో సృహతప్పి పడిపోగా యువతి ఇంటికి ఫోన్ చేసి మీ కుమార్తెకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. యువతిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తరువాత జరిగింది యాక్సిడెంట్ కాదు, దాడి అని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమె కొత్త, పాత ప్రియుడు ఇద్దరూ స్నేహితులని, కొత్త ప్రియుడు సమాచారం ఇవ్వడంతోనే మాజీ ప్రియుడు వచ్చి దాడి చేశాడని తెలిసింది. అదీకాక ముగ్గురూ ఒకే కాలనీ వాసులు. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదుచేసుకుని బబిత్, రాహుల్ ఇద్దరినీ అరెస్టు చేశారు. -
పీపీఈ కిట్లతో డ్యాన్స్ చేశారు
బెంగళూరు: దేశంలో కరోనా వ్యాప్తి బయటపడిన నాటి నుంచి పోలీసులు, వైద్యులు ఇళ్లకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమను తాము ఉత్సాహపర్చుకోవడం కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు ఓ నూతన మార్గాన్ని కనుగొన్నారు. పాత పాటలకు డ్యాన్స్ చేయడం, సహోద్యోగుల కోసం వంట చేయడం, మహిళలకు మెహందీ పోటీలు, పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తూ తమను తాము ఉత్సాహపర్చుకోవడమే కాక మిగతవారికి సంతోషాన్ని కల్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు ముగ్గురు.. 1960 నాటి హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో వైద్యులు ‘లిఖే జో ఖాత్ తుజే’ పాటకు డ్యాన్స్ చేశారు. వీరంతా గత వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అస్మా బాను మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ధైర్యం నింపడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల కోసం మెహందీ.. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నాము. విజేతలకు బహుమతులు కూడా ఇస్తాము. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, క్యారమ్ బోర్డులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక నేను డాక్టర్ బాలాజీ పైతో కలిసి మాకు కేటాయించిన గదిలో ఆహారాన్ని వండి ఇతర సిబ్బంది అందజేస్తున్నాం’ అని తెలిపారు -
కేజీఎఫ్ గనుల్లో పసిడిని మించిన లోహం
సాక్షి, బెంగళూరు : కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కోలారు జిల్లా ప్రజలకు తీపి కబురు అందిస్తుందని లోక్‌సభ సభ్యుడు ఎస్.మునిస్వామి తెలిపారు. మంగళవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిజిఎంఎల్ పునరుజ్జీవనానికి సంబంధించి గని కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు. ఆ సమయంలో ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి బిజిఎంఎల్‌ను సందర్శించి బంగారు నిక్షేపాల నమూనాలను ల్యాబొరేటరికి పంపిన సమయంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో ఈ గనులను పునః ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని తెలిపారు. 2022లో రైల్వే వర్క్‌షాప్ బిజిఎంఎల్‌కు చెందిన 12600 ఎకరాల ప్రాంతాన్ని ఎస్ఇజెడ్గా ప్రకటించడానికి 1000 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సోలార్ ఉపకరణాల తయారీకి ఇప్పటికే సర్వే ప్రారంభించిందని ఎంపీ తెలిపారు. శ్రీనివాసపురంలో రూ.485 కోట్ల వ్యయంతో రైల్వే వర్క్‌షాపును 2022 లోగా ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని రైల్వే అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతానికి కృష్ణా నది నీటిని అందించే పథకానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలోగా దీనిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి నాగేష్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రవి కుమార్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బి పి వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు. పల్లాడియం అంటే ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన ఇది వెండి రంగులో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతకే కరుగుతుంది. ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున అరుదైన లోహంగా గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా ప్రపంచ డిమాండుకు సరిపోవడం లేదు. దీని గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే ఎక్కువే. -
తల్లిదండ్రుల కోసం కిడ్నీ అమ్మాలనుకుంది కానీ..
బెంగళూరు : తల్లిదండ్రుల కోసం కిడ్నీ అమ్ముదామనుకున్న ఓ మహిళను మోసం చేశాడో సైబర్ నేరగాడు. కోటి రూపాయలకు కిడ్నీ కొంటానంటూ లక్షలు దోచేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు మూదలపాళ్యాకు చెందిన ఓ మహిళ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ఓ యాడ్ చూసిందామె. కిడ్నీ దానం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆ యాడ్‌లో ఉంది. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడదామని భావించిన ఆమె కిడ్నీ దానం చేయటానికి నిర్ణయించుకుంది. యాడ్‌లో ఉన్న నెంబర్‌కు మెసేజ్ చేసింది. అనంతరం వారితో ఫోన్లో మాట్లాడగా.. హదాఫాంగ్గా తనను తాను పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి, చట్టబద్ధంగా కిడ్నీ దానం చేయాలంటే కిడ్నీ డోనర్ కార్డు ఉండాలని చెప్పాడు. ( బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం ) టాక్స్ ఐడెంటిఫికేషన్ ఫీజు, పోలీసు అనుమతులకోసం కొంత డబ్బు తన ఖాతాలో జమచేయాల్సిందిగా కోరాడు. సదరు మహిళ తన వద్ద ఉన్న నగలను కుదువ పెట్టి అతడు అడిగిన రూ.3 లక్షలు ఖాతాలో జమచేసింది. అయితే డబ్బు అతడి ఖాతాలో జమ అయిన తర్వాతి నుంచి స్పందించటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు అతడి ఖాతాలో డిపాజిట్ అయిన వెంటనే విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ( మరో మన్మథుడు.. మహిళలే టార్గెట్ ) -
కరోనా: కర్ణాటక కీలక నిర్ణయం
సాక్షి, బెంగుళూరు: దేశవ్యాప్తంగా కరోన వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్ బారినపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవారు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అందుకే ఆ రాష్ట్రాలను నుంచి కర్టాటకకు వచ్చేవారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరస్ నెగటివ్ వచ్చిన వారికి కూడా హోం క్వారంటైన్ విధించనున్నుట్లు పేర్కొంది. ఇక తక్కువ వైరస్ వ్యాప్తి ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారు విధిగా 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌ను పాటించాలని కోరింది. (కరోనా : మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి) గర్భిణి స్త్రీలు, పదేళ్ల లోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. ఇక బిజినెస్ కార్యకలాపాల కోసం తమ రాష్ట్రానికి వచ్చే వారు ఐసీఎంఆర్ గుర్తించిన కరోనా ల్యాబ్ నుంచి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకొని నెగటివ్ అని తెలిన తర్వతే రావాలని పేర్కొంది. రాష్ట్రానికి రావడనికి తీసుకున్న రిపోర్టు రెండు రోజలు మాత్రమే పని చేస్తుందని అంతలోపే కర్ణాటకకు రావాలని చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101 చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 69,597 ఉండగా, 51,783 మంది పలు కోవిడ్ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
లాక్డౌన్: నెల రోజులు.. డ్యాన్స్ చేసిన డాక్టర్లు!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నెల గడిచిపోయింది. ఈ లాక్డౌన్లో అందరూ ఇంటికే పరిమితమ్వగా వైద్యులు, నర్సులతో పాటు ఇతర ఆరోగ్య సిబ్బంది మాత్రం నిరంతరం మహమ్మారితో పోరాడుతున్నారు. అదే విధంగా కరోనా సంక్షోభం నుంచి ప్రజలకు కాస్తా ఊరటనిచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది యువ డాక్టర్లు ఒకటిగా చేరి అందరిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. లాక్డౌన్ విధించి నెలరోజులు గడిచిన సందర్భంగా వారంతా డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫారెల్ విలియమ్స్ ఫేమస్ ‘హ్యాపీ.. హ్యాపీ’ సాంగ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది డాక్టర్లు ఒక్కటిగా చేరి డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ‘దీ సాంగ్ ఆఫ్ హోప్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడమే కాకుండా ప్రజలను మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అవగాహన కల్పించేందుకు వారు చేసిన ఈ వినూత్న ప్రయాత్నాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. (భారీ ఊరట : వారి నుంచి వైరస్ సోకదు..) ఇక కరోనా మహమ్మారి వంటి సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం కూడా. కాగా ఈ క్రమంలో దేశంలోని ముంబై, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారికి రాష్ట్రాలకు చెందిన 60 మంది యువ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాహుల్ కెడియా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మీ మొహంలో నవ్వు తెప్పించడానిక దేశంలో డాక్టర్లంతా ఒక్కటిగా చేరారు.అంతేగాక ఈ యువ డాక్టర్లంతా ప్రపంచలోని మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాడానికి ఇలా వినూత్న ప్రయత్నం చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా దేశవ్యాప్తంగా 27000 లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 800లకు పైగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
అమృతహల్లి పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్
-
దిగ్విజయ్, శివకుమార్ అరెస్ట్!
బెంగళూరు : మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంపై వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రమాడ హోటల్లో తలదాచుకున్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హోటల్ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్ హోటల్ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్, శివకుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలను అమృతహల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ( రిసార్టు రాజకీయాలకు కేరాఫ్ కర్ణాటక ) అంతకు క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిని. ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేశారు. వాళ్లు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఫోన్లను లాక్కున్నారు. పోలీసులు కూడా నన్ను వారితో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ, వాళ్లను వెనక్కు రానీయటంలేదు. వారి కుటుంబసభ్యుల దగ్గరినుంచి సందేశాలు వస్తున్నాయి. నేను ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడాను. వారిని నిర్భందంలో ఉంచారని చెప్పారు. సెల్ఫోన్లు దొంగలించారట! ప్రతి రూము దగ్గర పోలీసు బందోబస్తు ఉంది. ప్రతి నిమిషం వారి వెన్నంటే ఉంటున్నార’’ని చెప్పారు. ( బలపరీక్షపై వైఖరేంటి? ) -
నుజ్జు నుజ్జైన కార్లు.. బీతావహం
బెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రెండు కార్లు ఢీకొట్టుకున్న ఘటనలో 13మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తుంకూరు జిల్లా కొణిగల్ తాళూకా బెంగళూరు- మంగళూరు హైవేపై గురువారం రాత్రి 12.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళుతున్న బ్రీజా కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పల్టీ కొట్టి, ఎదురుగా ధర్మస్థలం నుంచి బెంగళూరు వెళుతున్న చెవర్లెట్ కారును ఢీకొట్టింది. దీంతో బ్రీజా కారులో ఉన్న ముగ్గురు యువకులు, చెవర్‌లెట్‌లో ప్రయాణిస్తున్న 10మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వన్‌వే రోడ్డు కావటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినపుడు బ్రీజాలో 10మంది, చెవర్‌లెట్‌లో 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెవర్‌లెట్‌లో ప్రయాణిస్తున్న వారిని తమిళనాడు వాస్తవ్యులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాద ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. -
వేడి వేడి ఐస్ క్రీం దోసేయ్!.. ఫాల్తూ ఐటమ్స్..
జ్వరం వచ్చినపుడు ఇడ్లీని చక్కెరతో తినమని అమ్మ సలహా ఇస్తే.. కాంబినేషన్ నచ్చక తినడానికి తెగ ఇబ్బంది పడిపోయేవాళ్లం. కానీ, ఇడ్లీని, దోశను తియ్యగా వేడి వేడి ఐస్ క్రీంతో తినాల్సి వస్తే! ఆ ఆలోచనే వింతగా ఉంది కదూ. ఆ వింత ఆలోచనే ఓ టిఫిన్ సెంటర్‌ను కంట్రీ ఫేమస్ చేసేసింది. అందరిలా ఆలోచిస్తే మనకు పక్కోడికి తేడా ఏముంటుంది అనుకున్నాడు బెంగళూరులోని ఓ టిఫిన్ సెంటర్ యాజమాని. అందుకే కొత్తగా ఆలోచించాడు. దోశ, ఇడ్లీ, వడలను చట్నీ, సాంబార్‌తోనే ఎందుకు తినాలి.. ఐస్ క్రీమ్‌తో తింటేపోలా.. అన్న ఆలోచనే తన వ్యాపారాన్ని మూడు ఐస్‌క్రీం ఇడ్లీలు.. ఆరు ఐస్‌క్రీం దోశల్లా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం ఆ టిఫిన్ సెంటర్ మెను సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆ టిఫిన్ సెంటర్ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర దృష్టిలో పడింది. వారి సృజనాత్మకతకు ఆయన ఫిదా అయిపోయాడు. ఐస్‌క్రీం ఇడ్లీ ‘‘నేను ఐస్ క్రీం దోసకు ఫ్యాన్‌ను కాను. అయినప్పటికి వారి సృజనాత్మకతకు ఫిదా అయ్యాను. దేశంలోని వీధి వర్తకులు తరిగిపోని సృజనాత్మకత గనులు. మా కంపెనీలో ప్రాడక్ట్ డిజైన్ విభాగంలో పనిచేసే వారిని ప్రతిరోజూ వీధి వర్తకులను కలిసి, స్ఫూర్తి పొందమని చెబుతా’ అంటూ టిఫిన్ సెంటర్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఉంచి ట్వీట్ చేశారు. అయితే టిఫిన్ సెంటర్ ఐడియా అద్భుతం అంటూ కొంతమంది వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. మరికొందరు ఇదేం బాలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ‘ ఫాల్తూ ఐటమ్స్.. ముందు ఎమ్ అండ్ ఎమ్ మీద దృష్టి పెట్టండి’ అంటూ ఓ నెటిజన్ మహీంద్రపై మండిపడ్డాడు. -
‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ
-
‘పాక్ జిందాబాద్’.. తగిన శిక్ష పడుతుంది!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిరసన కార్యక్రమంలో.. ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన అమూల్య అనే యువతిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ క్రమంలో 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ క్రమంలో అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. దీంతో కంగుతిన్న నిర్వాహకులు ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించినా.. అమూల్య నినాదాలు కొనసాగించింది. ఈ నేపథ్యంలో అమూల్య తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ విషయం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ.. అమూల్యకు బెయిలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆమె తండ్రి సైతం తనను రక్షించేందుకు సిద్ధంగా లేనని చెప్పారన్నారు. ఆయన మాటల ద్వారా అమూల్యకు నక్సల్స్‌తో సంబంధం ఉందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తనకు తప్పకుండా తగిన శిక్ష పడుతుందని తెలిపారు. ఇక అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా.. శ్రీరామ్ సేన, హిందూ జాగృతి సమితిసభ్యులు ఆందోళన చేపట్టారు. అమూల్య క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.(సీఏఏ నిరసనల్లో ‘పాక్ జిందాబాద్’ నినాదాలు) ఇదిలా ఉండగా.. అమూల్య ఇంటిపై కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా అమూల్య వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇక అమూల్యను చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. -
మహిళతో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన!
బెంగుళూరు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే మహిళ చెయ్యి పట్టుకుని వికృతంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ(కేఎస్ఆర్టీసీ) బస్సులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని పుత్తూరు డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించే ఓ ప్రబుద్ధుడు ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. మధ్యాహ్న సమయం కావడం.. బస్సులో ఎవరూ లేకపోవడంతో కండక్టర్ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె పక్క సీట్లోకి వెళ్లి మెల్లగా మాటలు కలిపాడు. తర్వాత చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. సదరు మహిళ కండక్టర్‌ను వారించే ప్రయత్నం చేసిన ఈ ప్రబుద్ధుడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని సదరు మహిళ అతగాడు చేస్తున్న వికృత చేష్టలను తన మొబైల్ ఫోన్లో బంధించింది. బస్సు హసన్‌కు చేరుకోగానే బస్సు దిగిన ఆ మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు కేఎస్ఆర్టీసీ అధికారులకు పంపించింది. వెంటనే ఈ ఘటనపై సంస్థ యాజమాన్యం స్పందించి దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలు ఇప్పటిదాకా క్యాబ్‌లు, ఆటోలకే పరిమితం కాగా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో అది కూడా బస్సు కండక్టర్ ఈ దారుణానికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం
-
ఇంటి సమీపంలోనే.. మాజీ వీసీ దారుణ హత్య
సాక్షి, బెంగళూరు : బెంగళూరు అలయన్స్ వర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ అయ్యప్ప దొరె(53)ను దుండగులు దారణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆర్టీనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. విజయపుర జిల్లాకు చెందిన ఆయన ఆర్టీ నగరలో 17ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అనేకల్ సమీపంలోని అలయన్స్ వర్శిటీలో ఎనిమిదేళ్లపాటు వైస్ చాన్సలర్స్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో అయ్యప్ప ఇంటికి 50 మీటర్ల దూరంలో కాపు కాచిన దుండగులు అయనను అడ్డగించి మారాణాయుధాలతో విచక్షణరహితంగా నరికి చంపారు. కాగా వాకింగ్‌కు వెళ్లిన అయ్యప్ప ఎంతసేపటికీ ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య భావన, కుటుంబసభ్యులు వెదకటం ప్రారంభించగా.. హెచ్ఎంటీ గ్రౌండ్ వద్ద రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆర్టీ నగర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కళాశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నిందితుల అచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ పార్టీని ప్రారంభించిన అయ్యప్పదొరె అయ్యప్పదొరె ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించి ముద్దేబీహళ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అంతేగాకుండా భూ వివాదానికి సంబంధించి అలయన్స్ వర్శిటీపై అయన కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. కాగా లింగాయత్‌లకులకు ప్రత్యేక ధర్మం కావాలని అయ్యప్ప పోరాటం చేశారు. అదే విధంగా శివరామ కారంత డినోటీపీకేషన్ కేసుకు సంబంధించి గతంలో సీఎంగా యడియూరప్ప ఉన్నప్పడు అయనపై ఏసీబీకీ ఫిర్యాదు చేశారు. ఇవేకాకుండా అనేక అంశాలపై కూడా అయన పోరాటం చేశారు. ఇక డీసీపీ శశికుమార్... అయప్పదొరె భార్య భవన నుంచి కొంత సమాచారం సేకరించారు. భూ వివాదానికి సంబంధించి కోర్టులో నడుస్తున్న కేసు వివరాలు తెలుసుకున్నారు. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు అయ్యప్ప హత్య కేసును విచారిస్తున్నారు. -
అమ్మో మెట్రో : ప్రాణాలు అరచేతుల్లో..
బెంగుళూరు : మెట్రో స్టేషన్లో ప్రయాణీకులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్లో పిల్లర్ పెచ్చు ఊడిపోయి ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరులోని ఓ మెట్రో స్టేషన్లో ప్రయాణికులకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. వివరాల్లోకి వెళితే..నలుగురు ప్రయాణికులు స్టేషన్‌లోని ఆటోమెటిక్ ఫేర్ కలేక్షన్ గేటు వద్దకు రాగానే వారికి కొద్ది అడుగుల దూరంలో ఫాల్స్ సీలింగ్ నుంచి రెండు ప్యానల్లు ఊడిపడటంతో ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బెంగళూరులోని ‘నమ్మా మెట్రోస్ నేషనల్ కాలేజీ’ దగ్గరి మెట్రో స్టేషన్లో సెప్టెంబర్ 30న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ సైడ్ వాల్స్ లీకై గోడల నుంచి స్లాబ్‌లు పడిపోయిన ఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు కదిలేటప్పుడు వచ్చే శబ్దానికి, వైబ్రేషన్స్‌కి ఇటుకలు వదులై పడిపోయింటాయని, అలాగే 70 సెంటీమీటర్ల మేర ఎతైన గోడలకు ప్లాస్టింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని.. త్వరలోనే గోడలకు ప్లాస్టింగ్ చేస్తామని బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్(బీఎమ్ఆర్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌సేత్ పేర్కొన్నారు. Watch: Four passengers had a narrow escape after a false ceiling at National College metro station in Bengaluru came crashing down on Monday around 6 p.m., the incident came to light on Wednesday. @IndianExpress pic.twitter.com/gtNVmt2c0a — EXPRESS Bengaluru (@IEBengaluru) October 3, 2019 -
తీహార్ జైలుకు శివకుమార్
సాక్షి, బెంగళూరు : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను గురువారం అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్, శివకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఒక గంటా 40 నిమిషాలపాటు వారి వాదోపవాదాలు కొనసాగాయి. అనంతరం జడ్జి విచారణను శనివారానికి వాయిదా వేశారు. శివకుమార్ ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు నిర్ధారించడంతో రాం మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం గది పక్కనే ఆయనకు గది కేటాయించారు. -
యూకో బ్యాంకు వద్ద భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని యుకో బ్యాంక్ శాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజి రోడ్, ఫరా టవర్స్‌లో ఉన్న బ్యాంకు కార్యాలయంలో బుధవారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం తీవ్ర ఆందోళనకుదారి తీసింది. షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యూకో బ్యాంకు ఆఫీసునుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఇదే భవంలోనే పలు కోచింగ్ సెంటర్లు ఉండటంతో చాలా మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంతో తీవ్ర భయాందోళనలో పక్క భవనం నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. బార్టన్ సెంటర్ పక్కనే ఉన్న భవనం మొదటి అంతస్తులోని కేబుల్ గదిలో మంటలు చెలరేగాయి. ఇవి పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు భవనంపైనుంచి దూకడానికి ప్రయత్నిచారు. అయితే భవనం మెయింటెనెన్స్ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. భయపడొద్దని, ఆందోళన చెందుతున్నవారికి చెప్పాం, ఫైర్ సిలిండర్ల సాయంతో మంటలను ఆర్పివేసి, ప్రజలను రక్షించామని సిబ్బంది అలీ తెలిపారు. అనంతరం ఫైర్ ఇంజిన్లు వచ్చి పరిస్థితిని మరింత చక్కదిద్దాయని చెప్పారు. ప్రాథమిక సమాచారం ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. -
సినీ ఫక్కీలో కిడ్నాప్
సాక్షి, బెంగళూరు : ముగ్గురు స్నేహితులు..ఒక కిడ్నాప్...మూడు కోట్లు డిమాండు...కట్ చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితులు...అచ్చం క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తుంది ఈ స్టోరీ. ఐజీపీ శరత్చంద్ర మంగళవారం నెలమంగలలో పాత్రికేయుల సమావేశంలో అందించిన వివరాల మేరకు... యలహంక ఉపనగర్‌లోని మాత కాలనీ నివాసి, వ్యాపారవేత్త ఎం సిద్ధరాజు గత నెల ఆగస్టు 26న ట్యూషన్‌కు వెళ్లిన తన కుమారుడు హేమంత్ (16)ను, హేమంత్ కారు డ్రైవర్ కేశవరెడ్డిని అపరిచితులు కిడ్నాప్ చేసారని, రూ. 3 కోట్లు డిమాండు చేస్తున్నారని రాజానుకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడే జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రవి డీ చెన్నన్ననవర్ ఈ కేసుని సవాలుగా తీసుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకోవడంతోపాటు కిడ్నాప్‌కుగురైన ఇద్దరినీ క్షేమంగా తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులు 35 మంది గల దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు సిద్ధరాజును ఫోన్లో కాంటాక్టు చేసిన ప్రతీసారీ వారి లొకేషన్‌ను ట్రేస్ చేస్తూ వెళ్లారు. ట్రాప్‌లో భాగంగా మూడు కోట్లలో మొదట ఒకటిన్నర కోటి ఇస్తామని నమ్మించారు. కనకపుర రోడ్డులోని నైస్‌రోడ్డు జంక్షన్ వద్ద ఒక చోట డబ్బు ఉంచామని నిందితులకు చెప్పారు. ఈ మాటలు నమ్మిన నవీన్ అనే నిందితుడు మంగళవారం తెల్లవారుజామున డబ్బులు తీసుకోవడానికి రాగా పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు డ్య్రాగర్‌తో అనేకల్ సబ్ఇన్స్పెక్టర్ హేమంత్‌కుమార్‌పై దాడిచేసి గాయపరిచాడు. దీంతో ఎస్ఐ హేమంత్‌కుమార్ వెంటనే ఆత్మరక్షణ కోసం నిందితుడి కాలికి షూట్ చేసారు. పట్టుబడ్డ నిందితుడిని విచారించిన పోలీసులు మిగతా నిందితుల ఆచూకీ గంటల్లోనే కనిపెట్టారు. నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పీఎస్ పరిధిలోని జనప్రియ టౌన్íÙప్ వద్ద ఉన్న నీలగిరి తోపులో దాక్కున్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో నిందితులు తాము కిడ్నాప్ చేసిన హేమంత్, కేశవరెడ్డిలను కత్తితో పొడుస్తామని చంపేస్తామని బెదిరించారు. ఈక్రమంలో కానిస్టేబుల్ మధుకుమార్‌పై నిందితులు డ్య్రాగర్‌తో దాడిచేసి గాయపరిచారు. దీంతో మాదనాయకనహళ్లి సీఐ సత్యనారాయణ నిందితులపై కాల్పులు జరిపారు. కిడ్నాప్‌నకు గురైన ఇద్దరినీ రక్షించిన పోలీసులు గాయపడ్డ నిందితులను ఆస్పత్రికి తరలించారు. -
ఎంఐ టీవీ 4ఏ కేవలం రూ .17,999
సాక్షి, బెంగళూరు : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి విస్తృత శ్రేణి స్మార్ట్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. మంగళవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బడ్జెట్ ధరల్లో స్మార్ట్ టీవీలు, కొత్త ఫిట్నెస్ ట్రాకర్, వాటర్ ప్యూరిఫైయర్, మోషన్-యాక్టివేటెడ్ నైట్ లైట్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో అందుబాటులో వున్న ఉత్పత్తులకు పోటీ ధరల్లో వీటిని తీసుకువచ్చింది. ‘స్మార్ట్ లివింగ్ 2020 థీమ్’ తో నిర్వహించిన ఒక ఈవెంట్లో తాజా ఉత్పత్తులను లాంచ్ చేసింది. ప్రతిఒక్కరికీ 4 కె లేదా ప్రతి ఇంటిలో కనీసం పెద్ద స్మార్ట్‌టీవీ అనే ఆలోచనతో నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఎంఐ టీవీ 4 ఎక్స్ 65 అంగుళాల, 50 అంగుళాల, 43 అంగుళాల, 40 అంగుళాల పరిమాణాలలో ఇవి లభించనున్నాయి. తొలి మూడుటీవీలు 4 కె హెచ్‌డిఆర్ ప్యానెల్ కలిగి ఉంటాయి. అతిపెద్ద 65 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 54,999 50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 29,999 43 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 24,999 వీటిల్లో బడ్జెట్ ధరల్లో ఎంఐ టీవీ 4ఏ ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ .17,999. ఈ అన్ని టీవీలు సెప్టెంబర్ 29 నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి ఎంఐ .కామ్, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా విక్రయించబడతాయి. అయితే, ఫ్లాగ్షిప్ 65-అంగుళాల మోడల్ సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటుంది. ఎంఐ బ్యాండ్ 4 : ఈ స్మార్ట్‌టీవీలతో ఎంఐ బ్యాండ్ 4 ను కూడా లాంచ్ చేసింది. ఎంఐ బ్యాండ్ 3 ఫీచర్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ధర రూ.2299 వాటర్ ప్యూరిఫయర్ అయిదు అంచెల ప్యూరిఫికేషన్‌తో దీన్ని లాంచ్ చేసింది. ఎంఐ వాటర్ ప్యూరిఫైయర్ పీపీసీ, ఆర్ఓ, పీఏసీ పిఎసి ఫిల్టర్ల ద్వారా ఐదు-దశల శుద్దీకరణ ప్రక్రియ జరుగుతుందని షావోమి తెలిపింది. నిల్వ చేసిన నీరు స్వచ్ఛంగా ఉందని నిర్ధారించుకోవడానికి యువి లైట్ అమర్చింది. అంతేకాదు ఇందులో రియల్ టైమ్ టీడీఎస్ పర్యవేక్షణ , ఫిల్టర్ లైఫ్ ట్రాకర్ కూడా ఉన్నాయి. ధర రూ. 11,999. నైట్ లైట్ ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్లైట్ 2ను విడుదల చేసింది. మనుషుల కదలికలను గుర్తించి స్వయంచాలకంగా ఇది వెలుగుతుంది. అలాగే గదిలో 15 సెకన్లపాటు కదలికలు లేకపోతే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. తద్వారా విద్యుత్ ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. -
ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న
సాక్షి, బెంగళూరు : నటి సోనుగౌడ సీఎం యడియూరప్పకు సవాల్ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్ ఫోన్ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ ప్రశ్నించారు. గతంలో మత్స్య కన్య వేషంలో ఉన్న ఫోటోను కూడా వేశారు. ఇటీవల కళాకారుడు బాదల్ నంజుండస్వామి గగనయాత్ర అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్–2 ఫొటోలను కూడా జత చేశారు. -
మానవత్వానికి మాయని మచ్చ
సాక్షి, బెంగళూరు : కన్నకూతురు మృతి చెందిన విషయాన్ని కూడా తెలుపకుండా మానవత్వాన్ని మరిచిన ఆర్టీసీ అధికారులు ఓ కండక్టర్‌ను విధులకు పంపిన ఉదంతం కొప్పళ జిల్లా గంగావతిలో వెలుగు చూసింది. బాగలకోటె జిల్లా రాంపుర గ్రామ నివాసి అయిన మంజునాథ్ గంగావతి టూ కొల్హాపుర బస్సు కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని కుమార్తె కవిత(11) బుధవారం ఉదయం మృతి చెందింది. 10 గంటల సమయంలో బస్ డిపో అధికారులకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అయితే ఆ సమాచారాన్ని తండ్రి మంజునాథ్‌కు తెలపకుండా అధికారులు యథాప్రకారం విధులకు పంపించారు. అదే రోజు రాత్రికి ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చిన మంజునాథ్‌కు అప్పుడు తన కూతురు మృతి గురించి తెలిసింది. మరుసటి రోజు ఉదయం విధులకు రావాలని బస్సు డిపో అధికారులు మంజునాథ్‌కు సూచించారు. ఇదే విషయంపై శుక్రవారం కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది కలిసికట్టుగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కూతురును చివరి చూపు కూడా చూడలేని ఆ తండ్రి రోదన పలువురి హృదయాలను ద్రవింప చేసింది. కాగా మంజునాథ్ కుమార్తె చనిపోయిన విషయం ఆలస్యంగా తెలిసిందని, తనకు విషయం తెలిసిన వెంటనే మంజునాథ్‌ను ఇంటికి పంపానని డిపో మేనేజర్ ఎస్.ఆర్.సొన్నద్ సమాధానమిచ్చారు. -
ఫేస్బుక్ పరిచయం...మహిళ ఇంటికొచ్చి..
సాక్షి, బెంగళూరు : తన మాట వినలేదన్న కోపంతో.. ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ఇంటికి వచ్చి హత్య చేస్తానని బెదిరించాడో వ్యక్తి. ఈ ఘటన హోసూరు జిల్లాలోని క్రిష్ణగిరిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన మహిళకు(26)కు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా సేలం జిల్లా సత్యమంగలం ప్రాంతానికి చెందిన మోహన్‌కుమార్(32)తో పరిచయమేర్పడింది. మోహన్‌కు పెళ్లయినా భార్యతో విభేదాలొచ్చి విడిపోయాడు. కాగా, సదరు మహిళకు పిల్లలు లేరనే విషయం తెలుసుకొన్న మోహన్‌కుమార్.. తమ గ్రామం వద్ద ఉన్న ఓ ఆలయానికొస్తే పరిష్కారం దొరకుతుందని ఆమెను మభ్య పెట్టాడు. ఆమె మోహన్‌కుమార్ చెప్పిన చోటికి రాకపోవడంతో సోమవారం క్రిష్ణగిరి వచ్చాడు. ఆమె ఇంటికెళ్లి తనతో రావాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేస్తానని బెదిరించాడు. ఘటనపై బాధితురాలు క్రిష్ణగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోహన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
కాటేసిన కట్నపిశాచి
సాక్షి, బెంగళూరు : భర్త పెడుతున్న వరకట్న వేధింపులు తాళలేక ముగ్గురు చిన్నారులతో సహా ఓ మహిళ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రాయచూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల మేరకు.. దేవదుర్గ తాలూకాకు చెందిన నసీమా (28), ముగ్గురు చిన్నారి కొడుకులు మహ్మద్ హనీఫ్(5), అయాన్ (3), రిగాన్ (1)లతో కలిసి కొత్తదొడ్డి వద్ద నారాయణపుర కుడి కాలువలో దూకి తనువు చాలించింది. అదనంగా కట్నం తీసుకుని రావాలంటూ ప్రతి రోజు భర్త చిత్ర హింసలకు గురిచేస్తుండడంతో జీవితం మీద విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. దేవదుర్గ తాలూకా దేవతగల్‌కు చెందిన నసీమాకు ఏడేళ్ల క్రితం సిరివార తాలూకా అత్తనూరుకు చెందిన మహ్మద్ మహబూబ్తో వివాహమైంది. ఇతడు చిన్నకారు రైతు. అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులు ప్రతి రోజు ఇంటిలో భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం తేవాలంటూ నసీమాను హింసించేవారు. ఇలాగే వేధించి మంగళవారం రాత్రి నసీమా, ముగ్గురు పిల్లలను ఇంటి నుంచి బయటికి తోసివేశారు. ఈ బాధలు భరించలేక దేవతగల్ నుంచి కొత్తదొడ్డి వద్దకు చేరుకుని అక్కడ నారాయణపుర ప్రధాన కుడి కాలువలోకి దూకింది. బుధవారం ఉదయం కాలువలో మృతదేహాలను గమనించిన కొందరు సిరివార పోలీసులకు సమాచారం అందించగా వచ్చి పరిశీలించారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. భర్త, అత్తమామలే హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. -
తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..
మండ్య : తల్లి అస్థికలు నదిలో కలుపుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం శ్రీరంగపట్టణ సమీపంలోని గంజాం కావేరి నది సంగమంలో చోటు చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన శ్రీకాంత్(45) తల్లి మూడు రోజుల క్రితం మృతి చెందింది.దీంతో తల్లి అస్థికలను నదిలో నిమజ్జనం చేయడానికి గంజాం సమీపంలోని కావేరి నది సంగమానికి వచ్చాడు. ఈ క్రమంలో అస్థికలు నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్ కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రీకాంత్ కోసం గాలించగా శ్రీరంగపట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న మహదేవపుర సమీపంలోని ఓ చెక్‌డ్యామ్‌లో మృతదేహం లభించింది. శ్రీరంగపట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బుల్లెట్ దిగితే గాని మాట వినరు!
సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. గత ఆరునెలల్లో 20 మంది రౌడీషీటర్లకు పోలీసులు తుటా రుచి చూపించారు. 2018లో 30 మంది రౌడీషీటర్లపై పోలీసులు కాల్పులకు పాల్పడగా, గత ఆరునెలల్లో 20 మంది రౌడీషీటర్లపై కాల్పులు జరిపి పోలీసులు తమదైన శైలిలో హెచ్చరించారు. ప్రస్తుతం బెంగళూరు నగరాన్ని హడలెత్తిస్తున్న దారిదోపిడీలు, మోబైల్ చోరీలు, చైన్‌స్నాచింగ్ కేసులు హెచ్చుమీరుతున్నాయి. ఇటువంటి నేరాలు అరికట్టడానికి పోలీసులు పరేడ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కూడా వారిలో మార్పు కనిపించలేదు. గంజాయి మత్తులో దాడులకు దిగుతున్నారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్‌గా అలోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లను ఆయ విభాగాల్లోకి పిలిపించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. బెంగళూరు నగరాన్ని హడలెత్తిస్తున్న రౌడీషీటర్ లక్ష్మణను పట్టపగలే ప్రత్యర్థులు హత్యకు పాల్పడ్డారు. మూడు సుపారీగ్యాంగ్స్ ఏకమై పక్కాపథకంతో రౌడీషీటర్ లక్ష్మణను అంతమొందించారు. ఈ కేసుకు సంబంధించి మార్చిలో ఆకాష్ అలియాస్ మలేరియా, క్యాట్‌రాజా, హేమంత్‌కుమార్‌పై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఒకే కేసులో ముగ్గురు నేరగాళ్లపై కాల్పులకు దిగడం గత పదేళ్లులో ఇదే మొదటిసారి. అనంతరం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో నిందితులపై కోకాయాక్టు అమలు చేశారు. ఇటీవల వయ్యాలికావెల్‌లో అమాయకుడైన ఎలక్ట్రీషియన్ గణేశ్‌ను 2019 జూన్ 17న హత్యకు పాల్పడిన శ్రీనివాస్‌పై పోలీసులు కాల్పులకు పాల్పడి అరెస్ట్ చేశారు. జూన్ 20న సీసీబీ పోలీసులు శివాజీనగర రౌడీషీటర్ పప్పు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. 1980లో బెంగళూరులో ఘరానా నేరగాడిగా ఉన్న కోళిఫయాజ్ కుమారుడే పప్పు. ఇతను దోపీడీలు, దొంగతనాలు, చోరీలతో బెంగళూరు నగర పోలీసులకు పెద్ద సవాల్‌గా మారాడు. జనవరి 7న కేజీ.హళ్లి పోలీసులు తబ్రేజ్‌ఖాన్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఇతని 12 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 5 న సీసీబీ పోలీసులు రౌడీషీటర్ స్లంభరత్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. మార్చి 26న సూలదేవనహళ్లి పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్న దేవరాజు, చం ద్రశేఖర్‌లపై కాల్పులుజరిపి అరెస్ట్ చేశారు. మార్చి 28 నందినీ లేఔట్ పోలీసులు రౌడీషీటర్ లగ్గెరె మునిరాజు కాల్పులు జరిపారు. మార్చి 30న కుమారస్వామి లేఔట్ పోలీసులు దుండగుడు రాజేంద్ర కాల్పులు, ఇతను ఏటీఎం సెక్యూరిటీ గార్డును హత్య కేసులో నిందితుడు. ఏప్రిల్ 28న కాటన్‌పేటే పోలీసులు దోపిడీదొంగ బడిస్సాకు చెందిన మన్సూర్‌ఖాన్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. జూన్ 15 తూర్పు విభాగం పోలీసులు పలు దోపిడీ కేసుల్లో నిందితుడు నమ్‌రాజ్‌బసాకత్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. జూన్ 23న బ్యాటరాయనపుర పోలీసులు దోపిడీదారుడు గోవింద్ అలియాస్ రాహుల్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. జూన్ 24 బాణసవాడి పోలీసులు రౌడీ అశోక్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఇతను నగరంలో పలు ప్రాంతాల్లో దోపిడీలు చేశాడు. -
అత్యాచార ఆరోపణలు.. బుల్లితెర నటుడు అరెస్ట్
యశవంతపుర : ఓ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బుల్లితెర నటుడు తేజస్గౌడ అలియాస్ అభిగౌడను చిక్కబళ్లాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. తాను 2012లో చిక్కబళ్లాపురం సమీపంలోని ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా అభిగౌడ పరిచయమయ్యాడని, తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడని, పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి అత్యాచారానికి పాల్ప పాల్పడిన్నట్లు నటి చిక్కబళ్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 డిసెంబర్లో మరోమారు వంచించి అత్యాచారానికి పాల్పడగా తాను గర్భం దాల్చానని, ఈ విషయాన్ని అభిగౌడ వద్ద ప్రస్తావిస్తే నీవు ఎవరితో సంబంధం పెట్టుకోన్నావో అంట గర్భశ్రా వం చేయించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇ ప్పుడు మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో వాలని ప్రయత్నాల్లో ఉన్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీ సులు అభిగౌడను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
అత్యాచారం కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి, బెంగళూరు : దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికీ సంబంధించి ఐదు మంది నిందితులను మంగళూరు జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పుత్తూరు తాలూకా బజత్తూరు గ్రామానికి చెందిన గురునందన్ అలియాస్ రాధాకృష్ణ, ఆర్యాపు గ్రామం పిలిగుండకు చెందిన సునీల్ అలియాస్ కాంతప్పగౌడ, బంట్వాళ తాలూకా పెర్నె గ్రామానికీ చెందిన ప్రజ్వల్ అలియాస్ నాగేశ్ నాయక్, కిషన్ అలియాస్ సదాశివ, బరిమారు గ్రామానికి చెందిన బల్య ప్రఖ్యాత్ అలియాస్ సుబ్బణ్ణశెట్టిలను అరెస్ట్ చేసినట్లు దక్షిణ కన్నడ ఎస్పీ బీఎం లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఇటీవల పుత్తూరుకు చెందిన విద్యార్థిపై వీరు సామూహిక అత్యచారానికీ పాల్పడిన్నట్లు అయన వివరించారు. వీరిపై పుత్తూరు మహిళ పోలీసుస్టేషన్లో కేసు నమోదైయింది. -
నాడు పూట గడవదు..నేడు కోటీశ్వరుడు
సాక్షి, బెంగళూరు : ఇది సినిమా కథలో మాదిరిగానే ఉంటుంది. పల్లెలో పొట్టకూటికోసం కష్టపడిన వ్యక్తి నగరానికి చేరి అనతికాలంలోనే కోట్లకు అధిపతి అవుతుంటాడు. వేలాది కోట్ల ఐఎంఏ గ్రూప్ కుంభకోణం కేసులో అరెస్టయిన అయిన బీబీఎంపీ నామినేటెడ్ కార్పొరేటర్ ముజాహిదీన్ వెనుక ఆసక్తికరమైన చరిత్ర వెలుగులోకి వస్తోంది. ఈయన గతంలో పూట గడవడానికి భద్రావతిలో కర్చీఫ్‌లు అమ్ముకుని జీవించేవాడని ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్ఐటీ) అధికారుల విచారణలో వెలుగుచూసింది. అలాంటి ముజాహిదీన్ 2001–02లో నగరానికి వచ్చి ఫ్రేజర్ టౌన్ వద్ద సెప్పింగ్ రోడ్డులో టీ దుకాణం ప్రారంభించాడు. దుకాణానికి వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిచయం చేసుకొని తానూ అందులో అడుగుపెట్టాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు విస్తరించడంతో రాజకీయ నాయకుల పరిచయాలు పెంచుకొన్నాడు. అలా 2010 బీబీఎంపీ ఎన్నికల్లో జేడీఎస్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ కార్పొరేటర్ షకీల్ అహమ్మద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఐఎంఏ అధినేత మన్సూర్ఖాన్తో పరిచయాలను పెంచుకొన్నాడు. అతనికి పరిచయం ఉన్న పెద్ద పెద్ద నాయకులు, వ్యాపారుల ద్వారా ఐఎంఏలో పెద్దమొత్తాల్లో డిపాజిట్లు చేయించినట్లు సిట్ తనిఖీల్లో ద్వారా తెలిసింది. భూకబ్జాలు, రౌడీషీట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో మోసాలు, బలవంతపు వసూళ్లు, భూ కబ్జా కేసులు ఇతనిపై నమోదయ్యాయి. దీంతో పులకేశీనగర పోలీసు స్టేషన్లో ముజాహిదీన్‌పై రౌడీషీట్ తెరిచారు. పేదల భూములను కబ్జా చేసిన కేసులో బాణసవాడి, హెణ్ణూరు, భారతీనగర, శివాజీనగర, పులికేశీనగర పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. పోలీసు స్టేషన్లో తుపాకీ చూపించి పోలీసులను బెదరించి జైలుకు సైతం వెళ్లివచ్చాడు. ఆ తరువాత ఎలాగో కేసుల నుంచి బయటపడ్డాడు, ఇటీవల అతనిపై రౌడీషీట్‌ను కూడా తొలగించారు. ముజాహిదీన్ కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడని, 100 బ్యాంకుల ఖాతాలు కలిగిఉన్నట్లు బయటపడింది. మన్సూర్ఖాన్ పరారైన ముందు రోజు జూన్ 6 నుంచి 8 వరకు ఇతడు మన్సూర్‌తో పాటు ఇద్దరు మంత్రులతో 27 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ముజాహిదీన్ వ్యవహారాలపై సిట్ కూపీ లాగుతోంది. -
నాగుపామును వెంటాడి.. అరగంట పోరాడి..
బెంగళూరు : మనం ఎంతో ప్రేమతో పెంచుకునే కుక్కలు మనం వాటిని నమ్మితే అవి మన పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో మనకు తెలుసు. అలాంటి కుక్కలు నాగుపాము తమ యజమాని ఇంటిలోకి వెళ్లడాన్ని అడ్డుకోవడంతో పాటు దానిని వెంటాడి చంపిన సంఘటన విజయపుర సమీపంలో చోటు చేసుకుంది. విజయపురకు అతి సమీపంలో ఉన్న రైతు కృష్ణప్ప తోటలోనే ఇంటిని నిర్మించుకుని ఉన్నాడు. అయితే గురువారం సాయంత్రం ఒక నాగుపాము తోటలో ఉన్న రైతు కృష్ణప్ప ఇంటిలోకి వెళ్లడానికి యత్నిస్తున్న సమయంలో తోటలో ఉన్న మూడు కుక్కలు పామును ఇంటిలోకి వెళ్లకుండా కట్టడి చేశాయి. కుక్కల అరుపులు విన్న యజమాని కృష్ణప్ప అక్కడికి చేరుకుని విషయం గుర్తించాడు. అప్పటికే పామును కుక్కలు చంపేశాయి. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ... తమ తోట చుట్టు పక్కల చాలా విష సర్పాలు ఉన్నాయని, వాటి భయంతోనే తాము మూడు కుక్కలు పెంచుతున్నామని చెప్పారు. దాదాపు అరగంట పాటు పామును కుక్కలు కదలకుండా అడ్డుకుని, ఆ తరువాత దాడి చేసి చంపాయని తెలిపారు. -
ప్రేమించిన యువతి మరో పెళ్లి చేసుకుంటోందని...
సాక్షి, బెంగళూరు : తను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందని సదరు యువతిని హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన సెల్వ మారత్తహళ్లిలో ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వివరాలు... రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. యువతి ఇక్కడి ఓ గదిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపారు. ఈ నేపథ్యంలో సెల్వ తననే పెళ్లి చేసుకోవాలని యువతిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చిన సెల్వ యువతిని హత్య చేసి కిటికి గుండా పారిపోయాడు. ఆదివారం పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇంటికి వచ్చి చూడగా విషయం బయటపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారా లు సేకరించారు. అనంతరం సెల్వను అదుపు లోకి తీసుకుని విచారణ చేయడంతో హత్య చే సినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. -
ఆస్తి కోసం భార్యను సజీవంగా..
బెంగళూరు : ఆస్తి వివాదం నేపథ్యంలో భార్యకు నిప్పంటించి హత్య చేసిన భర్త అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చన్నాపుర గ్రామంలో చోటుచేసుకుంది. నారాయణప్ప (65) తన భార్య లక్ష్మమ్మ(60) ను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. మొదటి నుండి జులాయిగా తిరుగుతూ సంసారాన్ని పట్టించుకోని నారాయణప్ప వంశపారంపర్యంగా వస్తున్న భూమిని విక్రయించాలని ప్రయత్నించగా భార్య, పిల్లలు వ్యతిరేకించారు. అయితే నారాయణప్ప భూమిని ఒక్కడే విక్రయించి వచ్చిన డబ్బులతో ఒకటిన్నర ఏడాదిగా ఇంటికి రాకుండా బయటే తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో లక్ష్మమ్మ సలహా మేరకు పిల్లలు తమ సంతకాలు లేకుండానే ఆస్తి విక్రయించాడని అమ్మిన నారాయణప్ప, కొనుగోలు చేసిన వ్యక్తిపై కోర్టులో కేసు వేశారు. కేసు వేయడానికి పిల్లలను లక్ష్మమ్మ ప్రోత్సహించిందని భావించిన నారాయణప్ప గత నెల రోజులుగా గ్రామంలోనే తిరుగుతూ లక్ష్మమ్మను నిప్పంటించి హత్య చేస్తానని చెప్పుకుంటూ తిరిగినట్లు సమాచారం. అనుకున్నట్టుగానే ఆదివారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న లక్ష్మమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ రామ్ నివాస్ సెపట్ గ్రా మాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హీరో కాదు.. పోలీసే
బెంగళూరు : బనశంకరి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అర్జున్ దేహధారుడ్యంపై బెంగళూరు దక్షిణ డీసీపీ అణ్ణామలై ప్రశంసించారు. విరామ సమయంలో జిమ్‌లో వెళ్లి భారీగా కసరత్తులు చేస్తుంటారు అర్జున్. ఒత్తిడితో కూడుకున్న విధుల్లోనూ శ్రద్ధ వహించి సిక్స్ ప్యాక్ దేహదారుడ్యం పెంచిన అర్జున్ ప్రతి పోలీస్‌కు ఆదర్శమని అణ్ణామలై తెలిపారు. ఆటగాడైన అర్జున్ 2014లో కబడ్డీ ఆడుతుండగా కాలు విరిగింది. దీంతో శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది ఈ నేపత్యంలో క్రీడల్లో పాల్గొనడం సాధ్యం కాక జిమ్‌కు వెళ్లి ధారుడ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. అర్జున్ గురించి తెలిసన డీసీపీ అణ్ణామలై ప్రోత్సహించారు. ఇప్పుడు అర్జున్ సిక్స్‌ప్యాక్ ఫోటో వైరల్ అవుతోంది. -
అటవీ ప్రాంతంలో దారుణం.. మహిళ తలపై..
క్రిష్ణగిరి : సూళగిరి అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహంపై బండరాళ్లు వేసి ఉడాయించారు. ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సూళగిరి తాలూకా మేలుమలై సమీపంలోని బాలకొండరాయనదుర్గం వద్ద మహిళ హత్యకు గురైనట్లు తెలుసుకున్న స్థానికులు సూళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం డీఎస్పీ మీనాక్షి, పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. హతురాలి ముఖం కనిపించకుండా కొండపై ఉన్న నీటి గుంతలోకి వేసి తలపై బండరాళ్లు వేసి ఉండగా వాటిని తొలగించారు. మృతదేహాన్ని పక్కకు తీసి పరిశీలించగా ఆమె వయస్సు 25నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని అంచనాకు వచ్చారు. తలపై బలమైన గాయాలుండటంతో రాళ్లతోమోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరనేది తెలియరాలేదు. ఎడమచేతిపై పచ్చబొట్టు ఉండగా వేలికి ఉంగరం ఉంది. ధరించిన దుస్తులను బట్టి మృతురాలు విద్యావంతురాలు అని తెలుస్తోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుంగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారా? లేక ఇతర కారణాలతో హత్యకు గురైందా? అనేది దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
దారుణం: అకృత్యాన్ని కళ్లారా చూసిందని..
బెంగళూరు : ఓ కామాంధుడు చేసిన నీచమైన పనిని కళ్లప్పగించి చూడటమే ఆ పసికందుకు మరణశాసనమైంది. ఓ బాలికపై జరిపిన అత్యాచారాన్ని ఎక్కడబయట పెడుతుందోననే భయంతో కర్కోటకుడిగామారిన కామాంధుడు పసికందును పెట్రోల్ పోసి అంతమొందించాడు. ఈ ఉదంతం తాలూకాలోని హల్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని అరళేరి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని హుల్కూరు గ్రామానికి చెందిన మునిరాజుకు వివాహమైంది. ఇతనికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్య 7 నెలల గర్భిణి. మునిరాజు గార పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మైనర్ బాలికపై కన్ను వేశాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే పడుకొని ఉన్న నాలుగేళ్ల వయసున్న బాలిక ఈ ఉదంతాన్ని కళ్లారా చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందోనని భావించిన మునిరాజు ఆ బాలిక నోరు మూసి అక్కడి నుంచి తీసుకెళ్లి చంపి మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. చిన్నారి వేద కనిపించక పోవడంతో పోషకులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో మునిరాజు సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాప్ అని సమాధానం వచ్చింది. దీంతో గాలింపు చేపట్టి శనివారం నిందితుడు మునిరాజును అరెస్ట్ చేశారు. -
ఆ హీరోలు నా ఇంటి పిల్లలు: సుమలత అంబరీశ్
బెంగళూరు : ‘నేను మీ ఊరికి చెందిన హుచ్చేగౌడ కుటుంబం కోడలిని, అంబరీశ్ ధర్మపత్నిని, అభిషేక్‌కు తల్లిని. మండ్య జిల్లా మహిళగా జిల్లాకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి సుమలత అనే నేను మండ్య గౌడను కాదా’అని సుమలత అంబరీశ్ ప్రశ్నించారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బుధవారం నామినేషన్ సమర్పించారు. అనంతరం బహిరంగ సభలో ఆవేశంగా ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. ‘అంబరీశ్ మరణం అనంతరం నాలుగు నెలలు ఇంటికే పరిమితమయ్యా. అంబరీశ్ మృతితో కలత చెందిన నాకు అభిమానులు ముఖ్యంగా మండ్య జిల్లా ప్రజలు కొండంత ధైర్యన్నిచ్చారు. ఇంతమంది అభిమానులు, నేతలు, కార్యకర్తల ప్రేమాభిమానాలు కాదనలేక కేవలం వారి కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్నా. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. చివరి క్షణం వరకు అంబరీశ్ కాంగ్రెస్ నేతగానే ఉన్నారు. ఆ కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ తలుపు తట్టాం. అయితే పొత్తు నెపంతో కాంగ్రెస్ టికెట్ తిరస్కరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నా’ అని ప్రకటించారు. దర్శన్, యశ్‌లు మా ఇంటి పిల్లలు శాండల్ఉడ్ హీరోలైన దర్శన్,యశ్‌లతో తమకు చాలా కాలంగా అనుబంధం ఉందని ఇద్దరు హీరోలు మా ఇంటి పిల్లలని సుమలత అన్నారు. వారిద్దరూ తమను తల్లితండ్రుల్లా భావిస్తారని ఈ ఉద్దేశంతోనే దర్శన్,యశ్‌లు తమ తరపున ప్రచారం చేయడానికి ఆసక్తి చూపారని, అందులో తప్పేంటని ప్రశ్నించారు.తమ తరపున ప్రచారం చేయడానికి ముందుకు వచ్చిన దర్శన్,యశ్‌లపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుండడం తమను ఎంతగానో బాధిస్తోందన్నారు. తమకు అధికార దాహం లేదని ఒకవేళ అధికారమే పరమావధిగా పెట్టుకొని ఉంటే ఎమ్మెల్యే,మంత్రి పదవికి అంగీకరించేవాళ్లమని సుమలత అన్నారు. విమర్శలకు భయపడం: యశ్, దర్శన్ తమపై వస్తున్న విమర్శలు,బెదిరింపుల గురించి తాము పట్టించుకోమంటూ హీరో యశ్ తెలిపారు. మేమేమి పాకిస్తాన్ నుంచి రాలేదు, ఇక్కడే పుట్టాం, కావేరి నది నీళ్లు తాగి పెరిగామని అన్నారు. అంబరీశ్ ఇంటి పిల్లలుగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నామని, అటువంటిది సుమలత అంబరీశ్ తరపున ప్రచారం చేయడం తమ కర్తవ్యమన్నారు. మండ్య జిల్లా ప్రజల గురించి, కన్నడ చిత్ర పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు.. విమర్శలకు భయపడబోమని, ఎన్ని విమర్శలు,బెదిరింపులు వచ్చిన తగ్గేది లేదంటే హీరో దర్శన్ స్పష్టం చేశారు. ఎందుకమ్మా రాజకీయాలు అన్నా: అభిషేక్ జిల్లా ప్రజలపై ప్రేమతో తల్లి సుమలత ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారని తనయుడు అభిషేక్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళితే ప్రత్యర్థుల దూషణలను అవసరమా అంటూ తమ తల్లిని ప్రశ్నించానన్నారు. అయితే ఇన్నేళ్ల పాటు మన కుటుంబాన్ని ఆదరించిన అభిమానులు, మండ్య జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తనతో చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటైంది. చాముండేశ్వరికి పూజలు మైసూరు : లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి సు మలత అంబరీశ్ బుధవారం నామినేషన్‌కు ముందు చాముండిబెట్టపైనున్న చాముండేశ్వరిదేవి ముందు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అంబరీశ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి నామినేషన్ పత్రాలను అమ్మవారి ముందుంచి పూజలు నిర్వహించేవారని తెలిపారు. తానూ అదే విధంగా పూజలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల గురించి తమకు ఏమాత్రం భయం లేదని నాకు తోడుగా అభిమానులు,మండ్య జిల్లా ప్రజలు ఉన్నారని అన్నారు. -
9 ఏళ్ల బాలుడు విక్రమార్కుడిలా..
-
వైరల్ : భళారా.. బాలుడా!
బెంగళూరు : ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆటంకం ఎదురైతే నిరాశ చెందుతాం. ఆ నిరాశలో మనం చేయాల్సిన పనిని విరమించుకుంటాం. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో.. ఆటంకం ఎదురైనా వెనకడుగు వేయవద్దని, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని అప్పుడే అనుకున్న పని పూర్తవుతుందని బోధిస్తోంది. బెంగళూరు చిక్కోడి తాలుకా కేరూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. గుర్రాల రేస్‌లో పాల్గొన్న ఓ 9 ఏళ్ల బాలుడు పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించాడు. ఆ కుర్రాడి విజయానికి ఆ అశ్వం కూడా సహకరించింది. అయితే ఈ రేస్ జరుగుతుండగా.. తన అశ్వాన్ని వేగంగా పరుగెత్తించిన ఆ బాలుడు.. మధ్యలో గుర్రంతో సహా కిందపడ్డాడు. ఆ బాలుడు కిందపడ్డా ఆ అశ్వం రేస్‌లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పరుగెత్తింది. ఇక ఆ బాలుడు కూడా బైక్ సాయంతో సినిమాటిక్ తరహాలో అశ్వాన్ని అందుకోని రేస్‌లో విజయం సాధించాడు. ఈ వీడియోకు ముగ్ధులైన నెటిజన్లు భళారా.. బాలుడా.. ఓ స్పూర్తివంతమైన వీడియో అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి : ఈ పిల్ల ఎలుగుబంటిని చూసి చాలా నేర్చుకోవాలి! -
మూడు కళ్లు, రెండు నోర్లు.. రెండు నాలుకలు
బెంగళూరు : బెళగావి జిల్లాలో వింత దూడ జన్మించింది. జిల్లాలోని చిక్కోడి తాలూకా డొంబరకొప్ప గ్రామానికి చెందిన రైతు శివరుద్రప్పకు చెందిన ఓ గేదెకు శనివారం మూడు కళ్లు, రెండు నోర్లు, రెండు ముక్కులు ఉన్న దూడ జన్మించింది. రెండు నోర్లలో రెండు నాలుకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ దూడ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. జన్యు సంబంధలోపం కారణంగానే ఈ దూడ ఈ విధంగా జన్మించినట్లు పశువైద్యాధికారి పేర్కొన్నారు. ఇలాంటి జీవులు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం చాలా తక్కువని తెలిపారు. -
నటుడి హత్యకు కుట్ర..స్పందించిన టాప్ హీరో
యశవంతపుర : తనపై అనవసరంగా అసత్య ప్రచారం చేయటం మానుకోవాలని కేజీఎఫ్ హీరో యశ్ మాధ్యమాలకు విన్నవించారు. ఓ కన్నడ నటుడిని హత్య చేయటానికి సుపారీ ఇచ్చినట్లు శనివారం వివిధ మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీంతో యశ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై ఎవరికి ద్వేషం లేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరని యశ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై సీసీబీ అడిషనల్ కమిషనర్ అలోక్‌కుమార్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. హోం మంత్రి ఎంబీ పాటిల్‌తో కూడా మాట్లాడినట్లు యశ్ విలేకరులకు వివరించారు. తనపై సుపారీ ఇచ్చే పరిస్థితులు ఏ కళాకారులకు కన్నడ సినీ పరిశ్రమలో లేదని, అనవసరంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తానంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని యశ్ స్పష్టం చేశారు. ఇటీవల నటుడిని హత్య చేయటానికి ప్లాన్ వేసిన నలుగురు నిందితులను ఆరు నెలల క్రితం శేషాద్రిపురం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 7న ఏసీపీ బలరాజ్ నేతృత్వంలో సీసీబీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హత్యకు గురైన లక్ష్మణ శిష్యుడు స్లం భరత్ ఓ నటుడిని హత్య చేయటానికి సుపారి తీసుకున్నట్లు గతంలో ప్రచారం చేసినట్లు తెలిసింది. -
ఘోరం: పిల్లాడిని సిగరెట్‌తో కాల్చి చంపిన తండ్రి
బెంగళూరు : పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యులకు చూపించి మందులు వాడతారు. కానీ దీనికి భిన్నంగా ఓ తండ్రి భూతవైద్యుని సలహాతో తన మూడేళ్ల కొడుకు ఒంటిపై విచక్షణా రహితంగా సిగరెట్లతో కాల్చడంతో చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘోరం కోలారు జిల్లా మాలూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మారుతి కాలనీకి చెందిన హరీష్, రేణుక దంపతులకు పృథ్వి (3) అనే కుమారుడున్నాడు. బెంగళూరుకు చెందిన వీరు ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడ నివసిస్తున్నారు. హరీష్ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారంరోజులగా సిగరెట్లతో వాతలు చిన్నారి పృథ్వి అంత చురుగ్గా ఉండేవాడు కాదు. ఇటీవల ఒక భూతవైద్యుని వద్దకు తీసుకెళ్లగా, వాతలు పెట్టాలని సూచించాడు. దాంతో వారంరోజుల నుంచి సిగరెట్‌తో వాతలు పెడుతున్నారు. మంగళవారం ఒక గుడికి తీసుకెళ్లి అక్కడ స్నానం చేయించగా, వాతలు పుండ్లుగా మారడంతో తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో బాలుడిని పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఘటనపై బాలుని తాత నంజుండప్ప పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి హరీష్ , రేణుకా దంపతులను అరెస్టు చేశారు. తల్లిదండ్రులిద్దరూ ప్రతి విషయంలో సైకోల మాదిరిగానే ప్రవర్తించేవారని స్థానికులు తెలిపారు. -
యడ్యూరప్పకు బెయిల్
సాక్షి బెంగళూరు: ‘ఆపరేషన్ కమల’లో భాగంగా ఆడియో కేసుకు సంబంధించి రాయచూరు జిల్లాలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు షరతులతో కూడిన మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి యడ్యూరప్పతో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసులో ఉన్న మిగతా వారికి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనెగౌడ కందకూరు తనయుడు శరణేగౌడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచూరు జిల్లా దేవదుర్గ పోలీస్‌స్టేషన్‌లో యడ్యూరప్పపై కేసు నమోదైంది. కలబుర్గి హైకోర్టు బెంచి పరిధిలోకి దేవదుర్గ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఫలితంగా కలబుర్గి హైకోర్టు బెంచికి అర్జీ ఇవ్వనున్నారు. కాగా అవినీతి నిరోధక చట్టం ప్రకారం దేవదుర్గ పోలీస్ స్టేషన్లో యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. రూ.లక్ష విలువ చేసే బాండు, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. సాక్షులను ప్రభావితం చేయకూడదు. కోర్టు అనుమతి లేనిదే పరిధి దాటి వెళ్లకూడదని తదితర షరతులతో సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. -
త్రికోణ ప్రేమే ప్రాణం తీసిందా?
బెంగళూరు : బైక్‌పై ఇంటికి వెళ్తున్న కార్మికుడిని దుండగులు అడ్డగించి దారుణంగా హత్య చేసిన ఘటన మైకో లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.... పుట్టేనహళ్లి లక్ష్మీలేఔట్ నివాసి యూసూఫ్ (25) వెల్డింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం అర్ధరాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లి పార్టీ ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో మైకోలేఔట్ బీలేకహళ్లి వద్ద దుండగులు అడ్డుకుని చాకుతో పొడిచి దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. హతుడు యూసూఫ్‌తో మరో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. త్రికోణ ప్రేమే హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గకు చెందిన యూసూఫ్ ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో జైలుకెళ్లి జామీనుపై విడుదలయ్యాడు. అనంతరం ఇతడి తల్లిదండ్రులు బెంగళూరు నగరానికి తీసుకువచ్చి వెల్డింగ్ పనిలో పెట్టారు. కానీ అతడి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. విధులు నిర్వహించే దుకాణంలో గొడవపడి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్ ఇతడిపై కేసు నమోదైంది. మైకో లేఔట్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
లేడీ రౌడీషీటర్ ఆగడాలు.. మహిళను ఎత్తుకెళ్లి..
బెంగళూరు : కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉన్న లేడీ రౌడీషీటర్ యశస్విని అమాయకులపై దౌర్జన్యాలను తిరిగి ప్రారంభించింది. ఆరు నెలల క్రితం చెన్నమ్మన కెరె అచ్చుకట్టు ప్రాంతంలో గ్యాంగు ఏర్పాటు చేసుకొని రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో సీకే అచ్చుకట్టు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దీంతో కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న యశస్విని ఉత్తర విభాగానికి మకాం మార్చింది. అయితే పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉత్తర విభాగంలోని పలు ప్రాంతాల్లో రౌడీయిజం చేస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బాగలకుంటె ప్రాంతానికి చెందిన లలిత అనే ఓ మహిళ యశస్వినిపై గంగమ్మనగుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో తుదివిచారణ జరుగనున్న నేపథ్యంలో లలితను కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరో ఎనిమిది మంది మహిళా రౌడీలతో కలసి గురువారం ఇంటికి వెళుతున్న లలితను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రగాయాల పాలైన లలితను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లలిత ఫిర్యాదుతో యశస్వినిపై కేసు నమోదు చేసుకున్న గంగమ్మనగుడి పోలీసులు యశస్విని కోసం గాలిస్తున్నారు. యశస్వినిపై గంగమ్మనగుడితో పాటు బాగలకుంటె, ఆర్ఎంసీ యార్డు పోలీస్స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈమె ఆగడాలు శ్రుతి మించడంతో గూండాచట్టం అమలుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
పోటీ చేస్తే.. అక్కడి నుంచే: సుమలత అంబరీశ్
రాజకీయాల్లోకి వస్తారా?, రారా?, ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా? అయితే ఎక్కడి నుంచి? ఇలా తలెత్తిన అనేక ప్రశ్నలకు సుమలత అంబరీశ్ సమాధానం ఇచ్చారు. తమ రాజకీయ ప్రవేశం మండ్య నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుందని ఆమె తేటతెల్లం చేశారు. దీంతో మండ్య రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశముంది. బెంగళూరు: సమయం వస్తే మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సుమలత అంబరీశ్ తెలిపారు. ఆదివారం కుమారుడు అభిషేక్‌తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామి కి పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబరీశ్ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు. అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు. తల్లి నిర్ణయానికి అభిషేక్ మద్దతు తాను నటించిన కొత్త చిత్రం అమర్ టీజర్‌ను ఈ నెల 14న విడుదల కానున్నట్లు సుమలత అంబరీశ్ కుమారుడు అభిషేక్ తెలిపారు. మొదటి చిత్రం అమర్‌తో పాటు మున్ముందు నటించే ప్రతీ చిత్రంలో కూడా తమ తండ్రి అంబరీశ్ తప్పకుండా ఉంటారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని తల్లి సుమలత తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని రాజకీయాల్లో మాత్రమే కాకుండా తమ చిత్రాల విషయంలో కూడా తల్లి సుమలత నిర్ణయాలు,ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖులు పాల్గొన్నారు. -
పిల్లల చేతికి తుపాకీ
బెంగళూరు : పట్టణంలోని కొంగాడియప్ప కాలేజ్ రోడ్డులో ఉన్న నేషనల్ ప్రైడ్ స్కూల్ నిర్వాహకులు పిల్లలకు పోలీస్‌స్టేషన్‌ను ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఆదివారం 50 పైగా పసి పిల్లలను (ఎల్కేజీ, యూకేజీ) ఇక్కడి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. ఈ క్రమంలో డీవైఎస్పీ మోహన్ కుమార్ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ... కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన రివాల్వర్‌ను తెప్పించి అందులో మ్యాగజిన్ తీసేసి వట్టి రివాల్వర్‌ను ఒక పాప చేతికివ్వగా, ఆ రివాల్వర్‌ను స్కూల్ సిబ్బంది అక్కడున్న పిల్లలందరికీ చేతికిచ్చి తాకించారు. ఈ వీడియో కాస్త పాఠశాల సిబ్బంది ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడంతో డీవైఎస్పీపై కామెంట్ల రూపంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పసి పిల్లల చేతికి రివాల్వర్ ఇవ్వడమేంటని, వారి చేతుల్లో ఆయుధాలు పెడితే మనసులపై ఎటువంటి ప్రభావం పడుతుందనే ఆలోచన లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రౌడీషీట్ తెరిచారని మనస్తాపంతో..
బెంగళూరు : పోలీసులు రౌడీషీట్ తెరవడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం చేళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తకోటవాండ్ల పల్లిలో చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం రాజువాండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఇళ్లు మంజూరు విషయమై లక్ష్మీ నారాయణతో పాటు మారెప్పరెడ్డి, రెడ్డెప్ప, ఈశ్వరరెడ్డిలు నల్లగుట్టపల్లి గ్రాపం పీడీఓ శ్రీనివాస్‌పై దాడి చేశారు. అందుకు సంబంధించి శ్రీనివాస్ చేళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేరే ప్రాంతంలో తలదాచుకున్నారు. అయితే చేళూరు పోలీసులు నలుగురు వ్యక్తులను రౌడీషీటర్లుగా ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు రావడంతో నెల రోజుల క్రితం చేళూరు పోలీసుస్టేషన్‌కు వచ్చిన మారెప్పరెడ్డి రౌడీషీట్ తెరవడంతో గ్రామంలో తమ పరువు, మర్యాదలు భంగం వాటిల్లుతోందని రౌడీషీట్ ఉపసంహరించుకోవాలంటూ ప్రాధేయపడ్డారు. అందుకు సంబంధించి గురువారం కూడా చేళూరు ఎస్ఐని కలవగా బాగేపల్లి తహశీల్దార్ వద్దకు వెళ్లాలంటూ సూచించడంతో మనస్తాపం చెందిన మారెప్పరెడ్డి ఇంటికి వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
నలుగురిని బలిగొన్న పాత మిద్దె
బెంగళూరు: ఆదమరచి నిద్రిస్తున్నవారిపై సొంత ఇల్లే కక్ష గట్టిందా అన్నట్లు విరుచుకుపడడంతో నాలుగు నిండుప్రాణాలు గాలిలో కలిశాయి. అందరికీ పక్కా ఇళ్లని ప్రభుత్వాలు ఊదరగొట్టడమే కానీ కట్టించడం లేదనే పాపాన్ని ఈ ఘోరం ఎండగట్టింది. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా రామజోగిహళ్లి గ్రామంలో ఘోర విషాదం సంభవించింది. రాత్రి నిద్రించినవారు నిద్రలోనే కన్నుమూశారు. మట్టి మిద్దె పైకప్పు కూలి తల్లి, ముగ్గురు పిల్లలు మరణించారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగింది. మృతురాలు నాగరత్నమ్మ(30), ఆమె కుమార్తెలు కోమల(2), యశస్విని (5), కుమారుడు తీర్థవర్ధన్ (6) ఘటన స్థలంలోనే మృతి చెందారు. భర్త చంద్రశేఖర్, అతని చెల్లెలి కుమార్తె దేవికకు తీవ్ర గాయాలై ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ వ్యవసాయ కూలి. రాత్రి అందరూ భోజనం చేసి ఇంట్లోనే నిద్రించారు. ఇల్లు పాతది కావడం, మట్టి బరువు తట్టుకోలేక పైకప్పు తడికలు, కలప తీర్లు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. పెద్ద శబ్ధానికి చుట్టు పక్కల వారు వచ్చి మట్టిని చేతులతోనే పక్కకు తీసి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. తల్లి, బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యా రు.మృతి చెందిన చిన్నారులను గ్రామస్తులు చూసి విలపించారు. -
విలాసాల కోసం దోపిడీలు
బెంగళూరు : విలాసవంతమైన జీవనానికి చోరీలు, దోపిడీల బాట పట్టిన నలుగురు కటకటాల పాలయ్యారు. దేవనహళ్లికి చెందిన సలీం, గోవిందపుర వాసి మహ్మద్‌షఫీ, నెలమంగళ నివాసి ఇమ్రాన్‌పాష, హాసన్ జిల్లా ఆలూరుకు చెందిన లోకేశ్ అలియాస్ కెంచలోకిలను పీణ్య పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.7లక్షల విలువైన 229 గ్రాముల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఒకరు రాడ్‌తో తలుపులు తొలగిస్తుండగా మరొకరు బయట కాపలా ఉంటారు. మిగతా ఇద్దరు లోపలకు చొరబడి చోరీలకు పాల్పడేవారని విచారణలో వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లేవారిని అడ్డగించి దోపిడీలకు పాల్పడేవారని తెలిపారు. జనవరి 18న పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ లేఔట్ పార్క్ వద్ద నాగేశ్ అనే వ్యక్తికి చెందిన బైక్‌ను నిందితులు చోరీ చేశారన్నారు. నిందితుడు లోకేశ్ హత్య కేసులో జైలుకెళ్లి జామీన్‌పై విడుదలై వచ్చి చోరీలబాట పట్టాడని పోలీసులు తెలిపారు. -
అర్ధరాత్రి2.2
శివమొగ్గ: బెంగళూరుకు భూకంపభయం ఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, శివమొగ్గ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక 1.33 గంటల సమయంలో భూకంపం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. జిల్లాలోని తీర్థహళ్లి, హొసనగర తాలూకాలో ఉన్న పశ్చిమఘట్ట అటవీ ప్రాంతం పరిధిలో ఉన్న గ్రామాల్లో భూమి కంపించడంతో ప్రçజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 2.2 తీవ్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు మూడు సెకన్లు ప్రకంపనలు ప్రకంపనలు వస్తుండడంతో నిద్రలో ఉన్న ప్రజలు మేలుకుని ఏమైందోననుకుంటూ తలోదిక్కుకు పరుగులూ పెట్టినట్లు తెలిపారు. తీర్థహళ్ళి, హోసనగర తాలుకాల్లొ సరిహద్దులోని గ్రామాల్లో రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించింది. తీర్థహళ్ళి తాలుకాలోని గాడరగెద్దె, హురుళి, మేరగహళ్ళి, హనస, తీర్థహళ్ళి తాలుకాలోని వారాహి, జలాశయం చుట్టు పక్కలున్న కోరనకుంటెతో పాటు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని గ్రామాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగినట్లు వెల్లడి కాలేదు. -
సండే బజార్లో కొనద్దురో !
బెంగళూరు : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు నగర ప్రజలు చవకగా వస్తాయని బెంగళూరు నగరంలోని సండే బజార్లో కొనుగోలు చేస్తున్న సెల్ఫోన్లు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే బ్రాండెడ్ మొబైళ్లు లభిస్తాయన్న ఆశతో సండేబజార్‌లో మొబైళ్లు కొనుగోలు చేసిన వారు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైన్‌స్నాచింగ్‌లతో పాటు మొబైళ్ల చోరీలపై కూడా రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ, దోపిడీ ఘటనల్లో దోచుకున్న మొబైళ్లను దొంగలు సండేబజార్‌లో మొబైల్ దుకాణాలకు విక్రయిస్తుండడాన్ని పసిగట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం సండేబజార్‌లోని మొబైళ్ల దుకాణాలపై మెరుపుదాడులు చేసి వందల సంఖ్యలో మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల యజమానుల వెల్లడించిన సమాచారంతో దుకాణాలకు మొబైళ్లు విక్రయించిన నిందితులు, దుకాణాల నుంచి మొబైళ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. రెండు ముఠాలు రెండు ముఠాలు సండేబజార్‌లోని దుకాణాలకు మొబైళ్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. అందులో ఒక ముఠా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను, పాదచారులను మారణాయుధాలతో బెదిరించి ఖరీదైన మొబైళ్లు దోచుకొని సండేబజార్‌లో విక్రయిస్తారు. రెండవ ముఠా పాదచారులను నుంచి మొబైళ్లు లాక్కెళ్లడం అదేవిధంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, చిత్రమందిరాలు, మార్కెట్లు తదితర రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైళ్లు చోరీ చేసి సండేబజార్‌లో విక్రయిస్తారు. కాగా రెండు ముఠాల్లోని సభ్యులు పాతికేళ్లలోపు యువకులే ఉంటుండడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడే యువకులు చోరీల బాటపడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.. నకిలీ పత్రాలు సృష్టించి చోరీ చేసిన మొబైళ్లను నిందితులు అతితక్కువ ధరలకు సండేబజార్‌లోని దుకాణాలకు విక్రయిస్తారు. అనంతరం దుకాణాల యజమానులు మొబైళ్లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తుండగా మరికొంత మంది ఐఎంఈఐ నంబర్లు మార్చి విక్రయిస్తున్నారు. ఈ రెండు విధానాల్లో కాకుండా మరికొంతమంది ఫోన్లలోని విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకుంటారు. కొనుగోలు చేసిన వ్యక్తుల కోసం వేట... దుకాణాల నుంచి వందల సంఖ్యలో మొబైళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మొబైళ్లు విక్రయించిన నిందితులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు కూడా చెప్పాలంటూ దుకాణాల యజమానులకు నోటీసులు అందించారు. దీంతో పాటు ఇప్పటివరకు ఐఈఎంఐ నంబర్లు మార్చేసి విక్రయించిన మొబైళ్ల సమాచారం కూడా అందించాలంటూ నోటీసులు సూచించారు. దీంతో తక్కువ ధరలకే బ్రాండెడ్ మొబైళ్లు వస్తున్నాయంటూ ఎగబడి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. తక్కువ ధరలకే మొబైళ్లు వస్తున్నాయనే ఆశతో ప్రజలు ఎవరు కూడా సండేబజార్‌లో మొబైళ్లు కొనుగోలు చేయరాదంటూ పోలీసులు సూచిస్తున్నారు. ప్రత్యేక వెబ్సైట్... చోరీ, దోపిడీ ఘటనల్లో పోగొట్టుకున్న మొబైల్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ తదితర వస్తువులను తిరిగి పొందడానికి పోలీసులు ‘ఈ లాస్ట్ అండ్ ఫౌండ్’ పేరుతో ప్రత్యేక మొబైల్యాప్ రూపొందించారు.ఈ యాప్ ద్వారా స్టేషన్‌కు వెళ్లకుండానే తాము పోగొట్టుకున్న వస్తువుల వివరాలను యాప్‌లో పొందుపరచి ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 300 వస్తువులు వాటి యజమానులకు అప్పగించినట్లు పోలీసులు తెలుపుతున్నారు. -
జంక్ ఫుడ్.. ఆరోగ్యం ఫట్
సాక్షి, బెంగళూరు: నేటి ఆధునిక జీవనశైలితో పా టు జంక్‌ఫుడ్ కూడా ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించింది. వద్దు వద్దని వైద్యులు ఎంత హెచ్చరిస్తున్నా ఎంతో మంది వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. జంక్ ఫుడ్ వల్ల అనారోగ్యం బారిన పడేవారిలో పెద్దలే కాకుండా చిన్నపిల్లలూ ఉంటున్నారు. జంక్‌ఫుడ్ వల్ల బాలల్లో ఎనీమియా (రక్తహీనత), ఐరన్ లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 40 శాతం మందికి ఎనీమియా నగరానికి చెందిన ప్రైవేటు ఆరోగ్యసంస్థ నిర్వహించిన సర్వేలో కూడా జంక్ ఫుడ్ వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు తేలింది. పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, చిప్స్, డోనట్స్ తదితరాలు ఎక్కువగా తినే చిన్నపిల్లల్లోని రక్త నమూనాలను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. బెంగళూరులోని సుమారు 0– 20 ఏళ్లలోపు వ యసున్న వారిలో దాదాపు 40 శాతం మందిని ఎనీమియా పీడిస్తోంది. 0–10 ఏళ్ల లోపు చిన్నారుల్లో 35 శాతం మందికి, 10–20 ఏళ్ల లోపు పిల్లల్లో 41 శాతం మందికి రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం చాలా తక్కువస్థాయిలో ఉంది. తింటే.. ఐరన్ లోపమే ఎక్కువమంది పిల్లల్లో ఐరన్ లోపం వల్ల, మరికొందరిలో జన్యుపరంగా ఎనీమియా వస్తున్నట్లు సర్వేలో గుర్తించారు. అలాగే అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలను ఎముక మజ్జ ఉత్పత్తి చేయకపోవడం ఇతర ముఖ్య కారణం. వీటన్నింటికి జంక్/ ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడడమే కారణమని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సర్వేలో మొత్తం 5,124 మంది చిన్నారుల రక్త నమూనాలను సేకరించగా 2,063 మంది హిమోగ్లోబిన్ స్థాయిలు అసాధారణంగా ఉన్నట్లు తేలింది. జంక్ ఫుడ్‌లో అధికంగా వాడే ఉప్పు, చక్కెర, నూనెలు, కొవ్వుల వల్ల కేవలం ఎనీమియా మాత్రమే కాకుండా ఊబకాయం, స్థూలకాయం కూడా సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. -
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు