సాక్షి, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ కూటమి సమావేశాలకు హజరయ్యారు. కాగా, ఈ పర్యటన ముగించుకుని మోదీ.. రేపు(శనివారం) భారత్‌కు చేరుకోనున్నారు. అయితే, ఆయన తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ నేరుగా బెంగళూరు చేరుకోనున్నారు. ఈ క్రమంలో మోదీ.. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు చేరుకుని చంద్రయాన్-3 బృందాన్ని కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించి ముచ్చటించనున్నారు. అనంతరం, ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక, ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ బెంగళూరు వస్తున్న నేపథ్యంలో ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు కర్ణాటక బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. ప్రధాని రాక సందర్భంగా నగరంలో మెగా రోడ్ షో నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.అశోక తెలిపారు. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో 6,000 మందికి పైగా జనంతో పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలుకనున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment