అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: సీజేఐ | CJI On Karnataka Judge Remarks closed Suo Moto proceedings | Sakshi
Sakshi News home page

కోర్టులు అప్రమత్తంగా ఉండాలి.. జడ్జిలు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: సీజేఐ

Published Wed, Sep 25 2024 12:28 PM | Last Updated on Wed, Sep 25 2024 1:24 PM

CJI On Karnataka Judge Remarks closed Suo Moto proceedings

న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, న్యాయమూర్తులు పక్షపాత వ్యాఖ్యల జోలికి పోవొద్దని దేశ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. కర్ణాటక న్యాయమూర్తి అభ్యంతరకర వ్యాఖ్యల సుమోటో కేసు విచారణ ముగింపు సందర్భంగా బుధవారం సీజేఐ ఇలా మాట్లాడారు. 

‘‘భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదు. ఇది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. పైగా కోర్టులు అప్రమత్తంగా ఉండాలి. న్యాయమూర్తులు కేసుల విచారణ టైంలో ద్వేషపూరితంగా, కేవలం ఒక వర్గాన్ని ఉద్దేశించేలా పక్షపాత వ్యాఖ్యలు చేయొద్దు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. 

ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శ్రీషానంద విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, ఓ మహిళా న్యాయవాది పైనా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా ఈ వ్యవహారాన్ని తీసుకున్న సీజేఐ బెంచ్‌.. వేదవ్యాసాచార్‌ను మందలించారు. ఆ టైంలోనే.. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని ఆ టైంలో సీజేఐ బెంచ్‌ వ్యాఖ్యానించింది కూడా. 

ఇక.. సదరు జడ్జి బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఇవాళ సుమోటో ప్రొసీడింగ్స్‌ను విరమించుకుంది సీజేఐ ధర్మాసనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement