సాక్షి, బెంగుళూరు: దేశవ్యాప్తంగా కరోన వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్ బారినపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవారు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అందుకే ఆ రాష్ట్రాలను నుంచి కర్టాటకకు వచ్చేవారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరస్ నెగటివ్ వచ్చిన వారికి కూడా హోం క్వారంటైన్ విధించనున్నుట్లు పేర్కొంది. ఇక తక్కువ వైరస్ వ్యాప్తి ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారు విధిగా 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌ను పాటించాలని కోరింది. (కరోనా : మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి)
గర్భిణి స్త్రీలు, పదేళ్ల లోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. ఇక బిజినెస్ కార్యకలాపాల కోసం తమ రాష్ట్రానికి వచ్చే వారు ఐసీఎంఆర్ గుర్తించిన కరోనా ల్యాబ్ నుంచి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకొని నెగటివ్ అని తెలిన తర్వతే రావాలని పేర్కొంది. రాష్ట్రానికి రావడనికి తీసుకున్న రిపోర్టు రెండు రోజలు మాత్రమే పని చేస్తుందని అంతలోపే కర్ణాటకకు రావాలని చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101 చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 69,597 ఉండగా, 51,783 మంది పలు కోవిడ్ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment