![Karnataka MLA Annadani Dances In Coronavirus Quarantine Center - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/16/mla.jpg.webp?itok=ZeP40wdF)
సాక్షి, మండ్య: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఉల్లాసం నింపడానికి డాక్టర్లు, నర్సులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ రోగుల్లో ఉల్లాసం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని ఆడి పాడారు.
మండ్య పట్టణంలోని రవాణా సంస్థ శిక్షణ కేంద్రం క్వారంటైన్ కేంద్రంలో కోవిడ్ రోగుల కోసం సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వేదిక మీద సరదాగా చిందులేశారు. స్వతహాగా జానపద గాయకుడు, కళాకారుడు అయిన అన్నదాని మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగులు ఉల్లాసంగా ఉండాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment