వైరస్‌ వ్యాప్తికి వారే కారకులు? | Corona Is Expanding Due To Non Compliance With Regulations | Sakshi
Sakshi News home page

వైరస్‌ వ్యాప్తికి వారే కారకులు?

Published Sat, Jul 18 2020 8:02 AM | Last Updated on Sat, Jul 18 2020 11:48 AM

Corona Is Expanding Due To Non Compliance With Regulations - Sakshi

నిబంధనలు గాలికి..  

సాక్షి , బెంగళూరు: కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడంతో మహమ్మారి వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రమాదమని తెలిసినా.. కొందరు వైరస్‌ వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. అలాంటి నిర్లక్ష్యంతోనే బెంగళూరులో లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. క్వారంటైన్‌ నుంచి తప్పించుకునేందుకు చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేసి తప్పుడు చిరునామా ఇచ్చి.. అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికార యంత్రాంగానికి బురిడీ కొట్టించి వైరస్‌ ప్రబలడానికి కారణం అవుతున్నారు. దీంతో కర్ణాటకలో భారీగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీని ప్రభావమే ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరుతో పాటు మరో 12 జిల్లాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.  

రాష్ట్రానికి వచ్చే ఇతర ప్రాంతాల వారు 14 రోజులు హోం క్వారంటైన్‌ ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు నిర్లక్ష్యంతో క్వారంటైన్‌లో ఉండకుండా తప్పుడు వివరాలు ఇచ్చారు. ఆ విధంగా ఏకంగా 23 వేల మంది  వివరాలు తప్పుడుగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో తప్పుడు వివరాలతో నమోదు చేసుకున్నారు. ఆ చిరునామాలకు తనిఖీలకు వెళ్లగా అక్కడ ఆయా పేర్లతో ఎవరూ లేరని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారు ఎక్కడున్నారో తెలియక గాలింపు మొదలుపెట్టారు. చదవండి: వదంతులు నమ్మొద్దు.. లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు 

అధికారులకు సవాల్‌గా.. 
బెంగళూరు అర్బన్‌ జిల్లాలో గత ఆదివారం నాటికి 69,297 మంది హోమ్‌ క్వారంటైన్లో ఉన్నారు. వారిలో కేవలం 46,113 మంది మాత్రమే సరైన చిరునామా వివరాలు ఇచ్చారు. మిగతా 23,184 మంది తప్పుడు వివరాలు ఇచ్చారు. దీంతో వారిని వెతికి పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. వలంటీర్ల సాయంతో ప్రయత్నం చేసినా ఫలితం ఉండడం లేదు. బెంగళూరు లాక్‌డౌన్‌కు కూడా ప్రధాన కారణం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. చదవండి: ఇప్పుడు మ్యుటేషన్‌ మహా సులువు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement