ఎంఐ టీవీ 4ఏ కేవలం రూ .17,999 | Xiaomi Smarter Living 2020 Smart tvs launch | Sakshi
Sakshi News home page

ఎంఐ టీవీ 4ఏ కేవలం రూ .17,999

Published Tue, Sep 17 2019 4:56 PM | Last Updated on Tue, Sep 17 2019 5:14 PM

Xiaomi Smarter Living 2020 Smart tvs launch - Sakshi

సాక్షి, బెంగళూరు : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి విస్తృత శ్రేణి స్మార్ట్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. మంగళవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్ టీవీలు, కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్, వాటర్ ప్యూరిఫైయర్, మోషన్-యాక్టివేటెడ్ నైట్ లైట్‌ను లాంచ్‌ చేసింది. మార్కెట్లో అందుబాటులో వున్న ఉత్పత్తులకు పోటీ ధరల్లో వీటిని తీసుకువచ్చింది. 

‘స్మార్ట్ లివింగ్ 2020 థీమ్‌’ తో  నిర్వహిం​చిన ఒక ఈవెంట్‌లో తాజా ఉత్పత్తులను లాంచ్‌ చేసింది.  ప్రతిఒక్కరికీ 4 కె లేదా ప్రతి ఇంటిలో కనీసం పెద్ద స్మార్ట్‌టీవీ అనే ఆలోచనతో నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఎంఐ టీవీ 4 ఎక్స్ 65 అంగుళాల, 50 అంగుళాల,  43 అంగుళాల, 40 అంగుళాల పరిమాణాలలో ఇవి లభించనున్నాయి.  తొలి మూడుటీవీలు 4 కె హెచ్‌డిఆర్ ప్యానెల్ కలిగి ఉంటాయి. 

అతిపెద్ద 65 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 54,999
50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర   రూ. 29,999 
43 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర  రూ. 24,999

వీటిల్లో బడ్జెట్‌ ధరల్లో ఎంఐ టీవీ 4ఏ ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ .17,999. ఈ అన్ని టీవీలు సెప్టెంబర్ 29 నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి ఎంఐ .కామ్, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా విక్రయించబడతాయి. అయితే, ఫ్లాగ్‌షిప్ 65-అంగుళాల మోడల్ సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటుంది. 

ఎంఐ బ్యాండ్‌ 4 : ఈ స్మార్ట్‌టీవీలతో ఎంఐ  బ్యాండ్‌ 4 ను కూడా లాంచ్‌ చేసింది.  ఎంఐ బ్యాండ్‌ 3 ఫీచర్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ధర రూ.2299

వాటర్‌ ప్యూరిఫయర్‌
అయిదు అంచెల ప్యూరిఫికేషన్‌తో దీన్ని లాంచ్‌ చేసింది. ఎంఐ వాటర్ ప్యూరిఫైయర్ పీపీసీ, ఆర్‌ఓ, పీఏసీ పిఎసి ఫిల్టర్‌ల ద్వారా ఐదు-దశల శుద్దీకరణ ప్రక్రియ జరుగుతుందని షావోమి తెలిపింది.   నిల్వ చేసిన నీరు స్వచ్ఛంగా ఉందని నిర్ధారించుకోవడానికి యువి లైట్ అమర్చింది. అంతేకాదు ఇందులో రియల్ టైమ్ టీడీఎస్‌ పర్యవేక్షణ , ఫిల్టర్ లైఫ్ ట్రాకర్ కూడా ఉన్నాయి. ధర రూ. 11,999. 

నైట్‌ లైట్‌
ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్లైట్ 2ను విడుదల చేసింది. మనుషుల కదలికలను గుర్తించి స్వయంచాలకంగా ఇది వెలుగుతుంది. అలాగే గదిలో 15 సెకన్లపాటు కదలికలు లేకపోతే దానంతట అదే ఆఫ్‌ అయిపోతుంది. తద్వారా విద్యుత్‌ ఆదా అవుతుందని  కంపెనీ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement