smart tvs
-
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.దుబాయ్‌లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్లో కూడా విస్తరించింది.కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
5వ తరగతి వరకు స్మార్ట్‌టీవీలతో పాఠాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం వారికి డిజిటల్ బోధనను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను అమర్చింది. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా.. ఇక ఇప్పుడు నాడు–నేడు కింద రెండో దశ స్కూళ్లలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ఏర్పాటు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు డిజిటలైజేషన్లో భాగంగా తరగతి గదుల్లో 28,014 స్మార్ట్ టీవీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 65 ఇంచులు గల స్మార్ట్ టీవీల కొనుగోలుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్స్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించాలని విద్యా శాఖ నిర్ణయించింది. వీటి కొనుగోలుకు రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అవుతుండటంతో నిబంధనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిíÙయల్ ప్రివ్యూకు పంపింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 9 వరకు సమర్పించడానికి గడువు విధించింది. అనంతరం జ్యుడిషియల్ ప్రివ్యూ సూచనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ల కోసం టెండర్లను ఆహ్వానించనుంది. లోపాలుంటే 24 గంటల్లోపే పరిష్కారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేసి వాటి ద్వారా బోధించనున్నారు. డిసెంబర్ నాటికల్లా వీటి ఏర్పాటు పూర్తి చేయనున్నారు. స్కూళ్లకు స్మార్ట్ టీవీలను తీసుకువచ్చి అమర్చిన నాటి నుంచి ఐదేళ్ల వారంటీ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన తరువాత నెల రోజుల్లోనే వాటి పనితీరులో లోపాలున్నా, సంతృప్తికరంగా పనిచేయకపోయినా వాటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంటుంది. అలాగే వాటిలో ఏమైనా లోపాలుంటే.. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ స్మార్ట్ టీవీ కొత్తది అమర్చాలంటే మూడు రోజుల్లోపే అమర్చాలనే నిబంధన విధించింది. అదేవిధంగా సేవల కోసం కాల్ సెంటర్ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్‌తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్‌తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్‌లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్‌టాప్ డిస్కౌంట్‌తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్ రూ.32,999కు ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్‌టాప్‌లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
స్మార్ట్‌గా మారిపోతున్నారు.. పాత వాటి స్థానంలో కొత్త ఉపకరణాలు
సాక్షి, అమరావతి: రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీతో స్మార్ట్ వస్తువుల వినియోగం పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, వాచీలే కాదు గృహోపకరణాలు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ డివైస్‌లు ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి. మార్కెట్లో స్మార్ట్ పరికరాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాన్ని అందించే ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పాత టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు స్థానంలో కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులు వచ్చి చేరుతున్నాయి. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక దాని ఆధారిత స్మార్ట్ పరికరాలకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారు. సౌకర్యంతో పాటు సులభంగా, తక్కువ సమయంలో పనులను ముగించడం, మరింత ఆనందంగా జీవించడానికి వీలుగా స్మార్ట్ పరికరాలు తోడ్పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. స్మార్ట్ పరికరాల వినియోగంపై టెచార్క్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా కనెక్టెడ్ కన్సూ్యమర్ రిపోర్ట్’ పలు అంశాలను వెల్లడించింది. 2023లో స్మార్ట్ పరికరాల కొనుగోలు మరింత పెరుగుతుందని పేర్కొంది. అయితే 5జీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ పరికరాల్లో వినియోగదారులు ఆశిస్తున్న సామర్థ్యం ఉండటం లేదని, ఈ పరికరాల్లో సామర్థ్యం మరింత ఉండాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందని టెచార్క్ వివరించింది. దాంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ఇతర పరికరాల వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన కూడా వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. సామాన్యుల్లో కూడా ఈ స్మార్ట్ పరికరాల కోసం రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. కొనుగోలుదారుల్లో 32 శాతానికి పైగా స్మార్ట్ పరికరాలవైపు వెళ్తున్నారు. అయితే ఈ స్మార్ట్ పరికరాల వినియోగంపై, బ్రాండ్లపై నమ్మకం వంటి అంశాల్లో ఇంకా చాలా మందిలో అవగాహన ఉండటం లేదని సర్వే పేర్కొంది. జీవన ప్రమాణాలను మారుస్తున్న వాటిలో స్మార్ట్ పరికరాల పాత్ర ఇలా... కంఫర్ట్ కన్వీనియన్స్ పరికరాలు: 69% సోషల్ రికగ్నిషన్– ప్రెస్టీజ్, స్టయిల్: 53% కనెక్టివిటీ ఆటోమేషన్: 53% టైమ్ సేవింగ్ ప్రొడక్ట్స్: 46% ఎనర్జీ మేనేజ్మెంటు: 19% సేఫ్టీ, సెక్యూరిటీ: 17% ఏ స్మార్ట్ వస్తువు ఎంత శాతం మంది వాడుతున్నారంటే.. వాచ్, ఫిట్నెస్ బ్యాండ్ 72 టీవీ 28 లైట్లు 82 ఏసీలు14 కెమెరాలు 48 వాషింగ్ మెషీన్ 12 -
Redmi : వావ్.. 32 అంగుళాల టీవీ కేవలం రూ.12 వేలు మాత్రమే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్‌లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్‌ని అందిస్తుంది. గతంలో రెడ్మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి. భారత్‌లో రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పైన పేర్కొన్నట్లుగా రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్‌తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్‌ల సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్‌లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్‌గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఏవీ ఇన్పుట్ సాకెట్లు, వైర్డు హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రెడ్మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్‌తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్ కోసం హాట్‌కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్లు, మ్యూట్ బటన్లు ఉన్నాయి. -
10వేలకే స్మార్ట్‌టీవీ, రెడ్మీ స్మార్ట్‌టీవీ 32 ఉచితంగా పొందే లక్ మీదే!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా, అధికారిక వెబ్సైట్ ప్రత్యేకమైన డీల్స్, ప్రమోషన్లను అందిస్తోంది. రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్, ఎక్స్చేంజ్ అవర్ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే అండ్ విన్ ఆఫర్ ద్వారా రెడ్మీ స్మార్ట్ టీవీ 32, రెడ్మి నోట్ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్ అందబాటులో ఉంటుంది.ఈ సేల్‌లో షావోమీ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ఇతర ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో కొన్ని షావోమీ, రెడ్మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో స్మార్ట్‌టీవీలనుకొనుగోలు చేయవచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీ 32 హెచ్డీ రెడీ రెడ్మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ రూ.10,999గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్‌లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై రూ.1,000 డిస్కౌంట్ లభ్యం. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్‌తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. -
లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్, డోంట్ మిస్!
హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్‌ను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందాన ఈ ఆఫర్లను ఆవిష్కరించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరెటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్లూటూత్ నెక్ బాండ్ లభించనున్నట్లు ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో అఖిల్ తెలిపారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 40 అంగుళాల టీవీ ఆఫర్ కూడా ఉందని పేర్కొన్నారు. రూ.8999కే స్మార్ట్ టీవీ, రూ16,500కే లాప్ టాప్స్ ఆఫర్ అమల్లో ఉందన్నారు. స్మార్ట్ మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్ బ్యాక్, జీరో వడ్డీ, వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు, 70 శాతం వరకూ అష్యూర్డ్ పే బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లకు 6 నెలల ఉచిత సర్వీస్, పలు ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు అఖిల్ వివరించారు. -
స్మార్ట్ టీవీల విక్రయాల్లో 38 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్మార్ట్ టీవీల షిప్మెంట్లు (విక్రయాలు/రవాణా) 38 శాతం పెరిగాయి. పండుగల సీజన్ కావడం, కొత్త ఉత్పత్తుల విడుదల, డిస్కౌంట్ ఆఫర్లు ఈ వృద్ధికి కలిసొచ్చినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా 40 శాతంగా ఉంటే, చైనా బ్రాండ్ల వాటా 38 శాతంగా ఉంది. ఇక స్థానిక బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా రెట్టింపై 22 శాతానికి చేరుకుంది. మొత్తం షిప్మెంట్లలో 32 నుంచి 42 అంగుళాల స్క్రీన్ టీవీల వాటా సగం మేర ఉంది. ఎల్ఈడీ డిస్ప్లేలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ వంటి అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్లు సైతం క్రమంగా వాటా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు క్యూఎల్ఈడీ స్క్రీన్లతో విడుదలకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్క్రీన్ తర్వాత కస్టమర్లు ఆడియోకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డాల్బీ ఆడియో ఫీచర్‌తో విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ టీవీల విక్రయాలు మొత్తం టీవీల్లో 93 శాతానికి చేరాయి. రూ.20వేల లోపు బడ్జెట్లో టీవీల విడుదలతో ఈ వాటా మరింత పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆన్లైన్ చానళ్ల ద్వారా విక్రయాలు 35 శాతం పెరిగాయి. అన్ని ఈ కామర్స్ సంస్థలు పండుగల సీజన్లో ఆఫర్లను ఇవ్వడం ఇందుకు దోహదం చేసినట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. మొదటి స్థానంలో షావోమీ షావోమీ స్మార్ట్ టీవీ మార్కెట్లో 11 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శామ్ సంగ్ 10 శాతం, ఎల్జీ 9 శాతం వాటాతో ఉన్నాయి. వన్ ప్లస్ వార్షికంగా చూస్తే 89 శాతం వృద్ధితో తన మార్కెట్ వాటాను 8.5 శాతానికి పెంచుకుంది. దేశీ బ్రాండ్ వూ వాటా సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. ఎంతో పోటీ ఉన్న స్మార్ట్ టీవీ మార్కెట్లోకి మరిన్ని భారత బ్రాండ్లు ప్రవేశిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. సెప్టెంబర్ క్వార్టర్లో వన్ ప్లస్, వూ, టీసీఎల్ బ్రాండ్లు స్మార్ట్ టీవీ మార్కె ట్లో వేగవంతమైన వృద్ధిని చూపించాయి. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్కు సంబంధించి కొత్త డేట్స్‌ను ప్రకటించింది. తొలి దశ ఆఫర్లు అక్టోబర్ 16తో ముగియడంతో వినియోగ దారుల కోసం తాజా తేదీలను వెల్లడించింది. తద్వారా తన కస్టమర్లలో దివాలీ జోష్ నింపింది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 19న తిరిగి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. తాజా సెకండ్ సేల్‌లో కూడా వివిధ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తదితరాలపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ అక్టోబర్ 18 అర్ధరాత్రి సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతోపాటు, ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇంకా పేటీఎం వాలెట్, యూపీఐ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్, రియల్మీ, పోకో, ఒప్పో, వివో, షావోమీ, మోటరోలా, గూగుల్, ఇన్ఫినిక్స్, మైక్రోమ్యాక్స్, లావా వంటిపై తగ్గింపు లభ్యం. ఇంకా గేమింగ్ ల్యాప్‌టాప్‌లు , పెన్ డ్రైవ్‌లు మరియు హార్డ్ డ్రైవ్‌లు వంటి డేటా స్టోరేజ్ పరికరాలపై కూడా తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్లు, కేసులు, స్క్రీన్ గార్డ్లు వంటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 4K అల్ట్రా HD స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు సహా,టీవీలు, ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. -
ఏంటీ! రూ.75వేల టీవీని రూ.25వేలకే సొంతం చేసుకోవచ్చా!!
Flipkart Big Bachat Dhamaal Sale: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.75వేల విలువైన టీవీని రూ.25లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రిబ్రవరి 3నుంచి ఫిబ్రవరి 5వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో పలు టీవీలపై అదిరిపోయే ఆఫర్లకే టీవీలను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ సేల్ లో 'వీయూ' కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే అందుబాటులోకి తెచ్చింది. 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.75 వేలు ఉండగా.. ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో 49శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఈ టీవీ ధర రూ.37,999 ఉండగా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్‌తో మరో రూ.1,900 తగ్గుతుంది. ఫలితంగా ఈ స్మార్ట్ టీవీ ధర రూ.36,099గా ఉంటుంది. అంతేకాదు ఈ హెచ్డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా కొనుగోలు దారులు ఈ స్మార్ట్ టీవీ రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవచ్చు. వీయూ స్మార్ట్ టీవీ ఫీచర్లు డిస్ ప్లే - ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రిజల్యూషన్ - 3,840 x 2,160 పిక్సెల్స్ అప్ గ్రేడ్ రేట్ - 60 హెచ్‌జెడ్ సౌండ్ స్పీకర్స్ - 30 డబ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు. వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్!
ఫ్లిప్‌కార్ట్ కొద్ది రోజుల క్రితమే 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సేల్‌తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ "బిగ్ బచత్ ధమాల్" సేల్‌ను ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిరహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్ దుస్తులు, టీవీలు, సౌందర్య ఉత్పత్తులు, హోమ్, కిచెన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రత్యేకంగా టీవీల మీద అందిస్తున్న ఆఫర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► ఎంఐ 4ఏ ప్రో: ఎంఐ 4ఏ ప్రో 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవి రూ.16,999 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టివి అసలు ధర రూ.19,999, అంటే మీరు ఈ స్మార్ట్ టివి మీద 15 శాతం తగ్గింపును పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా మీరు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ► సోనీ బ్రావియా: సోనీ బ్రావియా డబ్ల్యూ820 108 సెం.మీ(43 అంగుళాలు) టీవి అసలు ధర కంటే రూ.6 వేలు తక్కువ(రూ.28,999) ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.34,900గా ఉంది. అంటే మీరు ఈ స్మార్ట్ టీవి మీద 16 శాతం తగ్గింపు పొందవచ్చు. ► వన్ ప్లస్ వై సిరీస్: వన్ ప్లస్ వై సిరీస్ 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.27,999 నుంచి రూ.22,499కు తగ్గింది. ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలపై మీరు అదనంగా రూ.2000 తగ్గింపు పొందవచ్చు. ► వు ప్రీమియం: వు ప్రీమియం 139 సెం.మీ(55 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.75,000 నుంచి రూ.42,990కు తగ్గింది. ఈ స్మార్ట్ టివి మీద మీకు సుమారు 42 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎల్ జీ 108 సెం.మీ స్మార్ట్ టీవి, రియల్ మీ 108 సెం.మీ స్మార్ట్ టీవి మీద మంచి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం కంపెనీ షావొమీ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సరసమైన ధరలు, అద్భుత ఫీచర్ల స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలతో వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుని, భారత మార్కెట్లో టాప్ పొజిషన్లోకి దూసుకొచ్చిన షావోమి తన ఉత్పత్తులపై ధరలను 3-6 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్-సరఫరా మధ్య అంతరాయం పెరగడంతో విడిభాగాల ధరలు పెరుగుతూ వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో జూలై 1 నుంచి తమ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలను 3-6 శాతం పెంచిన ధరలు అమల్లో ఉంటాయని షావోమి ప్రకటించింది. షిప్పింగ్ చార్జీల భారం, కాంపోనేట్స్ కొరత కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం నుండి భారీ డిమాండ్-సరఫరా అసమతుల్యత నెలకొంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లలో (చిప్సెట్లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు. కాగా గ్లోబల్ మార్కెట్లో ప్యానెళ్ల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. సముద్ర సరుకు రవాణా ఛార్జీలూ కూడా పెరిగాయి. ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్‌లో బాగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ టీవల విభాగంలో ఇతర సంస్థలు కూడా ఈ నెలలో ధరలను 3-4 శాతం పెంచనున్నాయని అంచనా. చదవండి: Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్! -
త్వరపడండి: శాంసంగ్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..!
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో తన వినియోగదారుల కోసం అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ ఉత్పత్తులపై కొత్త శ్రేణి ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 20శాతం మేర క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్ టీవీలు: ఎంపిక చేసిన శాంసంగ్ చేసిన టీవీలకు కంపెనీ నుంచి ప్రీమియం సౌండ్బార్లను ఉచితంగా అందిస్తోంది. ఆఫర్ వ్యవధిలో 75-అంగుళాల అంతకంటే ఎక్కువ QLED టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు 99,990 రూపాయల విలువైన సౌండ్‌బార్ Q900T లేదా QLED TV మోడల్‌ను బట్టి 48,990 రూపాయల విలువైన Q800T సౌండ్‌బార్ లభిస్తుంది. వినియోగదారులు ఈ టీవీలను 36 నెలల ఈఎంఐ లభిస్తోంది.అంతేకాకుండా కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. శాంసంగ్ సౌండ్ డివైజ్స్: ఎంపిక చేయబడిన శాంసంగ్ సౌండ్ బార్స్‌పై 10శాతం వరుకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనుంది. శాంసంగ్ ఫ్రిజ్‌లు: సైడ్ బై సైడ్, కర్డ్ మాస్ట్రో, ఫ్రోస్ట్ ఫ్రీ, డైరక్ట్ కూల్ లాంటి శాంసంగ్ ఫ్రీజ్‌ల మోడళ్లను ఈఎంఐతో కొనుగోలు చేస్తే సుమారు 15శాతం వరకు క్యాష్‌బ్యాక్ కాకుండా డిజిటల్ కంప్రెసర్‌పై పది సంవత్సరాల వరకు వారంటీని ఇవ్వనుంది. మైక్రోవేవ్ ఓవెన్స్: శాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్స్ మ్యాగ్నెట్రాన్ పై 5 సంవత్సరాల వారంటీతో పాటు పది శాతం వరకు క్యాష్‌బ్యాక్, సెరమిక్ ఎనామిల్ కావిటీ మెడల్‌పై పది సంవత్సరాల వారంటీనీ ఇవ్వనుంది. చదవండి: మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్! -
స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!
దేశంలో మరోసారి టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. కొద్ది నెలల క్రితమే సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కారణంగా ఏప్రిల్ నెలలో టీవీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో ప్యానెల్స్ ఖర్చు పెరగడంతో ఎల్ఈడీ టెలివిజన్ల ధరలు ఈ నెలలో 3-4 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకవేల ధరలు పెంచితే గత మూడు నెలల్లో టీవీ ధరల పెంపు ఇది రెండవ సారి కానుంది. పానాసోనిక్, హైర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఎల్ఈడీ టెలివిజన్ల ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాయి. పానాసోనిక్ కమోడిటీ ధరల పెరుగుదలకు అనుగుణంగా "మేము 3 నుంచి 4 శాతం ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాము" అని భారతదేశం & దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. హైర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. "భారతదేశంలో ఎక్కువగా విక్రయించే 32 అంగుళాల ప్యానెల్ ధరలు, 42 అంగుళాల వంటి పెద్ద స్క్రీన్ సైజులు(వంటివి) ధరల పెరుగుదలపై తయారీదారులు ఆలోచించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. హైర్ కూడా జూన్ 20 నుంచి ధరలను 3 - 4 శాతం పెంచనున్నట్లు ప్రకటించాయి. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, యుఎస్ ఆధారిత బ్రాండ్ కొడాక్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్) రాబోయే రోజుల్లో రూ.1,000-2,000 పెంచనున్నట్లు తెలిపాయి. "అంతర్జాతీయ, దేశీయ సరుకు రవాణా ఛార్జీల ధరలు ఇప్పుడు(ఒక) ఆల్ టైమ్ గరిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్యానెల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అతని ప్రకారం, 40 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణాల గల టీవీ ఓపెన్ సెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 3 శాతం పెరిగాయి. చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం -
ఆండ్రాయిడ్ టీవీలో ఆపిల్ సినిమాలు
వెబ్‌డెస్క్ : ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ వినియోగదారులకు శుభవార్త ! ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ మీదే ఇకపై ఆపిల్ సినిమాలు చూసే అవకాశం వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై నడిచే టీవీల్లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను అందించేందుకు ఆపిల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 8 ఆపై వెర్షన్లతో నడుస్తున్న స్మార్ట్ టీవీలో ఆపిల్ టీవీ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్లే స్టోర్‌లో ఆపిల్ టీవీ యాప్ డౌన్లోడ్ ట్రెండ్ మొదలైంది. పరిధి పెంచుతోంది టెక్నాలజీలో దిగ్గజ సంస్థల్లో ఒకటి యాపిల్. కొత్తదనం, నాణ్యత, బ్రాండ్ వాల్యూ అనే పదాలకు పర్యాయ పదంగా ఆపిల్ నిలిచిపోయింది. అయితే ఆపిల్ సంస్థ అందించే అన్ని సేవలు, అప్లికేషన్లు కేవలం ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌పై పని చేసే మాక్‌పాడ్, ఐపాడ్, ఐఫోన్ తదితర ఆపిల్ డివైజ్‌లలోనే లభించేవి. దశబ్ధకాలం పాటు తన అప్లికేషన్లను ఇతర టెక్ ప్లాట్‌ఫారమ్‌లకు అందివ్వలేదు యాపిల్. అయితే గత కొంతకాలంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది ఆపిల్. అందులో భాగంగానే ఐఓఎస్‌కి సంబంధించిన ఆప్స్టోర్కి ఆవల అమెజాన్ ఫైర్ స్టిక్, ఎల్జీ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌లోనూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్యే ప్రధాన పోటీ. అయితే ఆ పోటీని పక్కన పెట్టి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను అందించేందుకు ఆపిల్ అంగీకరించింది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలకే పరిమితం చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఆపిల్ టీవీని అందివ్వడం లేదు. విస్తరించేందుకే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడిచే టీవీలనే ఎక్కువ సంస్థలు తయారు చేస్తున్నాయి. స్మార్ట్‌టీవీ మార్కెట్లో వీటిదే సింహభాగం. ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆపిల్ టీవీకి విస్త్రృతమైన మార్కెట్ కల్పించేందుకు ఆండ్రాయిడ్ ఓఎస్ బెటర్ ఛాయిస్‌గా ఆపిల్ భావించింది. ఇప్పటికే చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపిల్ టీవీలో ఉన్న కంటెంట్‌కి చందాదారులుగా మారుతున్నారు. -
ఇక టెలివిజనూ.. వైర్లెస్
ఇప్పటికే స్మార్ట్ఫోన్ల చార్జింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన వైర్లెస్ టెక్నాలజీ... ఇప్పుడు టెలివిజన్లకు విస్తరించనుంది. రష్యాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేబుల్‌కు బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఇది పనిచేయనుంది. రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీని సీఈఎస్ 2021లో ప్రదర్శించారు. కేబుల్స్‌కు బదులు వైఫై పద్ధతిలో విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని అందుకునే రిసెప్షన్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. (చదవండి: 5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!) విద్యుత్తు సాకెట్‌కు దూరంగా టీవీని ఏర్పాటు చేసుకోవడం అసాధ్యమైన ఈ నేపథ్యంలో రెజొనెన్స్ ఈ వైర్లెస్ టీవీని తీసుకొచ్చింది. వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును అందుకునే రిసీవర్. కాయిల్‌ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్‌మీటర్‌ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని కంపెనీ వివరించింది. కనీసం మీటర్ దూరం వరకూ విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది. రిసీవర్ కాయిల్‌ను టెలివిజన్ఫ్రేమ్లోకే చేరవచ్చని, ట్రాన్స్‌మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్ అడుగు భాగంలో కానీ.. గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఏడాది క్రితం సామ్సంగ్ కూడా ఇలాంటి వైర్లెస్ టీవీని తెచ్చే ప్రయత్నం చేసినా... తగిన టెక్నాలజీ లేదని తన ప్రయత్నాలను విరమించుకుంది. రెజొనెన్స్ తన టెక్నాలజీపై అమెరికాతో పాటు ఇండియా, యూరోపియన్ యూనియన్, కెనడా, దక్షిణ కొరియాల్లోనూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ టెక్నాలజీని టెలివిజన్లకు మాత్రమే కాకుండా... ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ ఉపకరణాలతోపాటు విద్యుత్తు వాహనాలకూ వాడొచ్చని కంపెనీ చెబుతోంది. -
అమెజాన్‌బేసిక్స్ నుంచి తొలిసారి స్మార్ట్ టీవీలు
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌బేసిక్స్ తొలిసారి దేశీయంగా స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 50-55 అంగుళాల పరిమాణంలో వీటిని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. రూ. 29,999 నుంచి ధరలు ప్రారంభంకానున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇవి ఫైర్‌టీవీ ఎడిషన్ టీవీలుకాగా.. 4కే హెచ్డీఆర్ లెడ్ డిస్ప్లేతో విడుదల చేసినట్లు తెలియజేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫార్మాట్లలో హెచ్డీఆర్, ఆడియో సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఇవి అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 4కే స్మార్ట్ టీవీ విభాగంలో ప్రాథమిక(ఎంట్రీ లెవెల్) విభాగంలోని షియోమీ, టీసీఎల్, వీయూ తదితర కంపెనీలతో ఇవి పోటీ పడనున్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల) ఇతర ఫీచర్స్ అమెజాన్‌బేసిక్స్ 50- 55 అంగుళాల పరిమాణంలో రెండు మోడళ్లను విడుదల చేసింది. ఇవి అల్ట్రాహెచ్‌డీ(3840+2160 పిక్సెల్) లెడ్ తెరలను కలిగి ఉంటాయి. డాల్బీ విజన్ ఫార్మాట్ వరకూ హెచ్డీఆర్ సపోర్ట్ ఉంటుంది. 20 డబ్ల్యూ రేటెడ్ స్పీకర్స్ ద్వారా డాల్బీ ఆట్మోస్ను కల్పించింది. క్వాడ్‌కోర్ ఆమ్లాజిక్ ప్రాసెసర్ కలిగిన వీటికి రెండు యూఎస్బీ, మూడు హెచ్డీఎంఐ పోర్టులను ఏర్పాటు చేసింది. అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. అమెజాన్ ఎకోసిస్టమ్‌కు సంబంధం లేకుండా సొంత సెట్‌టాప్ బాక్సును సైతం ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఫైర్ టీవీ స్టిక్ తరహాలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ తదితర సర్వీసులను యాప్స్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా మూవీస్, మ్యూజిక్ తదితరాలను సెట్ చేసుకోవచ్చు. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్) -
ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో టెక్లైఫ్- 5జీ లీడర్ విజన్‌తో దేశీయంగా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు రియల్మీ తాజాగా పేర్కొంది. ఇటీవల కాలంలో కంపెనీ స్మార్ట్ఫోన్లతోపాటు.. పూర్తిస్థాయి టెక్నాలజీ బ్రాండుగా ఆవిర్భవిస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలియజేశారు. విభిన్న స్మార్ట్ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలు, ఆడియో, వేరబుల్ ప్రొడక్టులను మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పారు. తద్వారా రియల్మీ టెక్లైఫ్ను నిర్మించుకుంటున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా 2021లో కంపెనీ నుంచి మరిన్ని కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. చదవండి: (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) X7 సిరీస్ ఫోన్లు రియల్మీ X7 బ్రాండుతో 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మాధవ్ వెల్లడించారు. వివిధ ధరలలో వీటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2021లో టెక్ లైఫ్‌స్టైల్ బ్రాండుగా వృద్ధి చేందే ప్రణాళకలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలువురికి దేశీయంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేశారు. రియల్మీ మాతృ సంస్థ చైనాకు చెందిన బీబీకే గ్రూప్‌కాగా.. 2020లో దేశీయంగా 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం విదితమే. గతేడాది 5 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయాలను అందుకోగా.. మే నెలలో స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెట్టినట్లు మాధవ్ వెల్లడించారు. ఈ బాటలో స్మార్ట్‌వాచీల విక్రయాలకూ తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ ) -
బిగ్ బిలియన్ డేస్ : రూ. 6 వేలకే టీవీ
సాక్షి, ముంబై : యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తక్కువ ధరలకే స్మార్టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అక్టోబర్ 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ ప్రస్తుతం హర్ బాత్ బాధి పేరిట మార్కెటింగ్ నిర్వహిస్తోంది. ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభం. (విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్) ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీ ఆఫర్లు ఆర్ 9 సిరీస్ కింద రెండు టీవీలు 24 హెచ్డీ బేసిక్ 5,999 రూపాయలు, 32 హెచ్డీ బేసిక్ ధర 8,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంటాయి. (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్) పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు 32 పాథ్ 0011 ధర - 10,999 రూపాయలు 32 పాథ్ 0011బీఎల్ ధర -11,499 రూపాయలు 40 పాథ్ 7777 ధర - 15,999 రూపాయలు 43 పాథ్ 0009ధర - 18,999 రూపాయలు 43 పాథ్ 4545 ధర -22,499 రూపాయలు 50 పాథ్1010 ధర -24,499 రూపాయలు 55 పాథ్ 5050 ధర - 28,999 రూపాయలు ఆథ్రో సిరీస్ థామ్సన్ టీవీ మోడల్స్ 43 ఆథ్రో 2000 - 22,499 రూపాయలు 50 ఆథ్రో 1212 - 27,499 రూపాయలు 55 ఆథ్రో 0101 - 30,999 రూపాయలు 65 ఆథ్రో 2020 - 45,999 రూపాయలు 75ఆథ్రో 2121 - 94,499 రూపాయలు సాధ్యమైనంతవరకు తమ వినియోగదారుడిని ఆనందపరిచేందుకే చూస్తున్నామనీ, ఈ సీజన్ లో 200,000 యూనిట్ల అమ్మకాన్ని అంచనా వేస్తున్నామని థామ్సన్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ భాగస్వామ్యంతో సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలను తీసుకొచ్చిన థామ్సన్ ప్రీమియం, బడ్జెట్ ధరల్లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) -
నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు
సాక్షి, ముంబై: బిగ్ బిలియన్ షాపింగ్ డేస్ సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నోకియా స్మార్ట్ టీవీలపై ఆఫర్లు అందిస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో నోకియాకొత్తగా ఆరు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తోంది. 32, 43, 50, 55 65 అంగుళాల స్మార్ట్ టీవీలను సరసమైన ధరలలో విక్రయిస్తుంది. అక్టోబర్ 16నుండి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు నోకియా స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేసినట్టు నోకియా ప్రకటించింది. నోకియా స్మార్ట్ టీవీల ధరలు 32 అంగుళాల టీవీ రూ .12,999 హెచ్డీ రెడీ 43 అంగుళాల టీవీ ధర రూ .22,999 ఫుల్ హెచ్డీ వేరియంట్ ధర రూ. 28,999 50 అంగుళాల టీవీ ధర రూ. 33,999 55 అంగుళాల ధర 39,999 రూపాయలు 65 అంగుళాల టీవీ ధర 59,999 రూపాయలు నోకియా బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా పూర్తిగా కొత్త స్మార్ట్ టీవీ శ్రేణికి విస్తరించడం తమ విజయానికి నిదర్శమని నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ మెహ్రోత్రా తెలిపారు. గత ఏడాది భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసినప్పటినుంచి తమ టీవీలకు స్పందన బావుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. పండుగ సీజన్ షాపింగ్‌ను ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు అందుబాటులో ధరల్లో నోకియా సహకారంతో వైవిధ్యమైన స్మార్ట్ టీవీలను అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ అయ్యర్ అన్నారు. నోకియా స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా స్పాటిఫై ఆఫర్లతో కలిసి లభిస్తాయి. ఈ నోకియా టీవీలు ఒన్కియో సౌండ్ ద్వారా ట్యూన్, సౌండ్‌బార్‌తో అమర్చబడి 6డీ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. ఆరు కొత్త నోకియా టీవీలు ఆండ్రాయిడ్ 9.0, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. -
బడ్జెట్ ధరల్లో శాంసంగ్ స్మార్ట్ టీవీలు
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 2020 క్రిస్టల్ 4కె యూహెచ్డీ టీవీ, అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీ లను విడుదల చేసింది. క్రిస్టల్ రేంజ్ టీవీలు 43, 50, 55, 65, 75 ఇంచ్ డిస్ప్లే సైజుల్లో అందుబాటులో ఉండగా. అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0టీవీలు 32, 43 ఇంచ్ డిస్ప్లే సైజుల్లో లభిస్తున్నాయి. క్రిస్టల్ 4కె యూహెచ్డీ టీవీల్లో 4కె రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. క్రిస్టల్ 4కె ప్రాసెసర్ అమర్చింది. దీంతో క్రిస్టల్ క్లియర్‌గా దృశ్యాలు కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. శాంసంగ్‌కు చెందిన బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్‌తోపాటు అమెజాన్ అలెక్సా అసిస్టెంట్‌ను జోడించింది. అలాగే ఈ టీవీలను పర్సనల్ కంప్యూటర్‌గా కూడా వాడువకోచ్చు. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఈరోస్ నౌ, సోనీ లివ్, వూట్ తదితర యాప్స్‌ను ఈ టీవీలలో ఇన్‌బిల్ట్‌గా అందిస్తోంది. ఈ టీవీలను కొనుగోలు చేసేవారికి శాంసంగ్ ఉచితంగా ఆఫీస్ 365 సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అలాగే 5జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో టీవీలను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం. ధరలు అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 32 ఇంచుల టీవీ ధర రూ.20,900గా ఉంది. 43 ఇంచుల టీవీ ధర రూ.41,900గా ఉంది. క్రిస్టల్ 4కె యూహెచ్డీ సిరీస్ 43 ఇంచుల టీవీ ధర 44,400 రూపాయలు 50 ఇంచుల టీవీ ధర 60,900 రూపాయలు 55 ఇంచుల టీవీ ధర 67,900 రూపాయలు 65 ఇంచుల టీవీ ధర 1,32,900 రూపాయలు 75 ఇంచుల టీవీ ధర 2,37,900 రూపాయలు -
వన్‌ప్లస్ కొత్త టీవీలు ఎంత సన్నగా ఉంటాయంటే..
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ తీసుకురానున్న టీవీలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా వన్‌ప్లస్ టీవీలు తదుపరి సిరీస్ వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా ఉండబోతున్నాయని వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు అంటేనే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కి పెట్టింది పేరు. మరి ఇక వన్‌ప్లస్ టీవీలు ఇంకెంత సన్నగా ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది. తమ రానున్న టీవీల్లో అల్ట్రా-సన్నని డిజైన్ ఉంటుందని, డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించినున్నట్లు సీఈఓ వెల్లడించారు. కేవలం 6.9 మి.మీ మందంతో తీసుకు రాబోతున్నామని ఆండ్రాయిడ్ సెంట్రల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఫ్లాగ్షిప్ క్యూ1 టెలివిజన్ కంటే తక్కువగా అందుబాటు ధరలో 20 వేల రూపాయలకు అందించనున్నామని చెప్పారు. ఈ కొత్త టెలివిజన్ సెట్లు జూలై 2 న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కొత్త స్మార్ట్ టీవీలో 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో సన్నని బెజెల్స్ ఫీచర్, కొత్తం సౌండ్ సిస్టం, స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో రొటేట్ అయ్యేలా రూపొందించామని తెలిపారు. సినిమాటిక్ డిస్ప్లే, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ యాప్ లాంటి ఫీచర్లను హైలైట్ చేస్తూ గత వారమే పీట్ లా ట్వీట్ చేశారు. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ధర, లభ్యత వన్‌ప్లస్ టీవీలు 32, 43-అంగుళాల వేరియంట్లలో విడుదల కానున్నాయి. ప్రారంభ ధర 20 వేల రూపాయలు. ప్రస్తుతం, కొత్త వన్‌ప్లస్ టీవీలు అమెజాన్ ఇండియాలో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు బీమా సంస్థ అకో నుండి రెండేళ్లపాటు వారంటీ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా 2019లో స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి ప్రవేశించిన వన్‌ప్లస్ క్యూ 1 సిరీస్ టీవీ ప్రారంభ ధర 69,900 రూపాయలు. With a 95% screen-to-body ratio, we're pushing the boundaries of your TV experience. Literally. #SmarterTV pic.twitter.com/gulLxbVvHE — Pete Lau (@PeteLau) June 24, 2020 -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్
సాక్షి, ముంబై : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ విక్రయాలను ప్రారంభించింది. నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వరకు స్పెషల్ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకాల్లో వివిధ ఉత్పత్తులపై 'అత్యల్ప ధరలను' అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, ఆపిల్ ఐ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే క్రెడిట్ , డెబిట్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో జతకట్టింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయన్ని కూడా అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇంకా ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్, బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్‌వాచ్‌లు తదితర ఉత్పత్తులపై కస్టమర్లు రాయితీలు, ఆఫర్లను పొందవచ్చు. సోనీ బ్రావియా 65 అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 63 శాతం తగ్గింపుతో 97,999 రూపాయలకే లభ్యం (ఎంఆర్పి 2,64,900 రూపాయలు). హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. పాత టీవీ మార్పిడి ద్వారా మరో 7,000 రూపాయలు తగ్గింపు. ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ 58,999కే లభ్యం. అసలు ధర 62,999 రూపాయలు. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే అదనపు తక్షణ తగ్గింపుగా 13,950 రూపాయలు. వివో జెడ్ 1 ఎక్స్ వివో జెడ్ 1 ఎక్స్ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) 16,990 రూపాయలు (ఎంఆర్పి 24,990 రూపాయలు) పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే అదనపు డిస్కౌంట్‌గా 13,950 రూపాయలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 3 ఏ ధర : 29,999 రూపాయలు. (ఎంఆర్పి రూ .39,999) శాంసంగ్ గెలాక్సీ ఏ80 (8జీబీ+128జీబీ స్టోరేజ్) రూ.30వేల తగ్గింపు ధరతో 21,999 రూపాయలకు లభ్యం సాన్సుయ్ 55 అంగుళాల 4 కె క్యూఎల్ఇడి స్మార్ట్ టీవీ ధర 42,999 రూపాయలు. (ఎంఆర్పి 72,590 రూపాయలు). పాత టీవీని మార్పిడి చేసినప్పుడు 7,000 రూపాయలు డిస్కౌంట్ కానన్ ఇఓఎస్ 3000 డి డిఎస్ఎల్ఆర్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 18,999 రూపాయలు. (ఎంఆర్పి 29,495 రూపాయలు) -
శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్
సాక్షి, ముంబై : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ల ద్వారా తమ సరికొత్త టీవీలు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వీటిల్లో ఫ్రేమ్ 2020 ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఆన్లైన్ స్మార్ట్ టీవీ శ్రేణి 4 కే యూహెచ్‌డి, ఎఫ్‌హెచ్‌డి , హెచ్డి రెడీ పేరుతో ఆవిష్కరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 'గెట్ మోర్ ఫ్రమ్ టీవీ' అంటూ, అమెజాన్‌లో 'వండర్టైన్ మెంట్' అంటూ ప్రచారం చేస్తోంది. ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి 48 గంటల్లో ప్రీ-పెయిడ్ (క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి) వినియోగదారులకు రూ.1500ల అదనపు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని శాంసంగ్ ప్రకటించింది. అలాగే అమెజాన్ వినియోగదారులకు ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ప్రీ-పెయిడ్ లావాదేవీలపై రూ .1000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. దీంతోపాటు సులభ ఈఎంఐ ఆప్షన్స్ కూడా లభ్యం. కొత్త ఎడిషన్ స్మార్ట్ టీవీలు యువ మిలీనియల్స్, ఆన్లైన్ కంటెంట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తీసుచ్చామని సంస్థ పేర్కొంది. ఆటో హాట్‌స్పాట్ టెక్నాలజీ, యుఎస్బి 3.0, శాంసంగ్ బిక్స్‌బైతో పాటు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను వీటిల్లో జోడించింది. ఆకర్షణీయమైన కంటెంట్, క్యాష్‌బ్యాక్ తమ వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో భాగస్వామ్యం కుదర్చుకున్నామని శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆన్లైన్ బిజినెస్ డైరెక్టర్ పియూష్ కున్నపల్లిల్ చెప్పారు. స్పెషాలిటీ ఏంటంటే.. ఈ టీవీలు పర్సనల్ కంప్యూటర్ మోడ్‌తో కూడా వస్తాయి, వినియోగదారులు తమ టీవీని పూర్తి స్థాయి పీసీగా వాడుకోవచ్చు. దీనితో వర్క్ ఫ్రం హోం వినియోగదారులకు సౌలభ్యం, పెద్ద స్క్రీన్ సౌలభ్యం కోసం ఇంటర్నెట్ లేకుండా వైర్‌లెస్‌గా ల్యాప్‌టాప్‌ను మిర్రర్ చేసుకోవచ్చు. లేదా రిమోట్‌గా వారి కార్యాలయ కంప్యూటర్ను యాక్సెస్ చేయవచ్చు. బహుళ లేయర్ల నాక్స్ ద్వారా భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కంపెనీ చెబుతోంది. ధరలు ఫ్రేమ్ 2020 టీవీ వరుసగా 50, 55, 65 అంగుళాల మూడు పరిమాణాల్లో ఫ్లిప్‌కార్ట్ లో లభ్యం. వీటి ధరలు రూ. 74,990, రూ. 84,990, రూ.139,990. 10 సంవత్సరాల స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ. ప్యానెల్ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ. ఆన్లైన్ స్మార్ట్ టీవీ మోడళ్లు 32 అంగుళాల నుండి ప్రారంభమై 65-అంగుళాల వరకు ఉంటాయి. 4 కె యుహెచ్‌డి టివిలు 43, 50, 55, 65 అంగుళాల నాలుగు పరిమాణాలలో లభ్యం. కొత్త ఎఫ్‌హెచ్‌డి, హెచ్డి రెడీ స్మార్ట్ టీవీలు 43, 32-అంగుళాలలో లభిస్తాయి. శాంసంగ్ 4 కె యుహెచ్‌డి స్మార్ట్ టీవీ (44) ధర రూ. 36,990 65 అంగుళాల వెర్షన్ టీవీ రూ .89,990 ఎఫ్‌హెచ్‌డి, హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ మోడళ్లు రూ.14,490 నుంచి ప్రారంభమవుతాయి. -
బడ్జెట్ ధరల్లో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో తన స్మార్ట్ టీవీ లైనప్‌ను విస్తరించడానికి సిద్దమవుతున్న వన్‌ప్లస్ కంపెనీ రెండు కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేయనుంది. జూలై 2న కొత్త టీవీలను తీసుకొస్తున్నామని వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా సోమవారం ట్వీట్ చేశారు. భారతీయ కస్టమర్లకోసం ప్రీమియం స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించబోతున్నామని ఆయన ప్రకటించారు. రూ. 69.900 ప్రారంభ ధరల్లో గత ఏడాది దేశంలో వన్‌ప్లస్ రెండు వేరియంట్లలో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో భారతీయ వినియోగదారులను ఆకర్షించాలనే యోచనలో ఉంది. వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీల ప్రత్యేకతలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర అనే హింట్ మాత్రం ఇచ్చారు సంస్థ సీఈవో. "బెస్ట్-ఇన్-క్లాస్ డిస్ప్లే" ప్యానెల్స్‌తో, వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో మిడ్ రేంజ్, ఎంట్రీ లెవల్ విభాగాల్లో ప్రీమియం అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ టీవీలు ఉండనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు కొత్త స్మార్ట్ టీవీలు సుమారు రూ. 15 వేల వద్ద ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు. తద్వారా బడ్జెట్ ధరల్లో టీవీలను తీసుకొస్తున్న వు, షావోమి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. (వన్‌ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు) It's official. We're making our premium smart TV experience more accessible to our Indian community. #SmarterTV pic.twitter.com/gc7WUcVIxJ — Pete Lau (@PeteLau) June 8, 2020