రూ.12,999కే స్మార్ట్ టీవీ..! | Amazon launches 32inch and 43-inch Fire TV Edition Smart TVs | Sakshi
Sakshi News home page

రూ.12,999కే స్మార్ట్ టీవీ..!

Published Wed, Dec 11 2019 1:07 PM | Last Updated on Wed, Dec 11 2019 1:18 PM

Amazon launches 32inch and 43-inch Fire TV Edition Smart TVs - Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ టీవీల సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టీవీ తయారీదారు ఒనిడాతో ఇటీవల జత కట్టిన అమెజాన్‌ తాజాగా ఒక స్మార్ట్‌టీవీని విడుదల చేసింది.  ‘ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్’పేరుతో పేరిట 1 కొత్త స్మార్ట్‌టీవీలను బడ్జెట్‌ ధరలో భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇండియాలో కొత్త ఒనిడీ టీవీలను లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందని అమెజాన్ డివైసెస్ ఇండియా హెడ్ పరాగ్ గుప్తా వెల్లడించారు. తమ ఫైర్ టీవీ ఎడిషన్ అద్భుతమైన చిత్ర నాణ్యత, డాల్బీ డిజిటల్ ప్లస్, టీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్‌తోపాటు వినియోగదారులు తమకు ఇష్టమైన అన్ని కంటెంట్‌లను ఒకే చోట ఆనందించ వచ్చన్నారు. 

ఫైర్ టీవీ స్టిక్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఈ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా అమర్చింది.  32, 43 అంగుళాల (ఫుల్‌ హెచ్‌డీ ఇంచుల డిస్‌ప్లే) సైజులలో ఇవి వినియోగదారులకు లభ్యంకానున్నాయి.  డిసెంబర్ 20 నుంచి అమెజాన్‌లో లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ తదితర స్ట్రీమింగ్ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.  ఇంకా 3 హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, 1 యుఎస్‌బి పోర్ట్ ఒక ఇయర్‌ఫోన్ పోర్ట్‌లను జోడించింది. డీటీహెచ్ లేదా కేబుల్ సెట్-టాప్ బాక్స్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, సౌండ్‌బార్లు,  హోమ్ థియేటర్ సిస్టమ్‌లకు అనుసంధానించవచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్‌తోపాటు టీవీల రంగంలో కూడా దూసుకు పోతున్న చైనా సంస్థ షావోమితోపాటు, నోకియా, అలాగే బడ్జెట్‌ధరల్లో స్మార్ట్‌టీవీలను అందుబాటులో ఉంచిన మోటరోలా, టీసీఎల్‌ లాంటి కంపెనీలకు  ఇవి  గట్టి పోటీ ఇవ్వనున్నాయి. 

ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ స్మార్ట్ టీవీ ధరలు
32 అంగుళాల మోడల్‌ ప్రారంభ ధర  రూ .12,999
43 అంగుళాల మోడల్‌ ప్రారంభ ధర  రూ .21,999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement