![JVC Launches 6 New Smart LED TVs in India, Prices Start at Rs. 7,499 - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/14/smart-tv.jpg.webp?itok=G4pqu-Ge)
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జేవీసీ ఇండియన్ మార్కెట్లో మరో ఆరు కొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.7499 నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 39 అంగుళాల మధ్య టీవీల స్క్రీన్ సైజ్ ఉండేలా ఈ స్మార్ట్‌ఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులో ఉంటాయి. జేవీసీ 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.11,999గా ఉంది. ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.
అతితక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన జేవీసీ కొత్త ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీలు, షావోమి, థామ్సన్, మార్క్ లాంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టీవీల్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్, 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ , స్మార్ట్ రిమోట్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment