సాక్షి, అమరావతి: రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీతో స్మార్ట్ వస్తువుల వినియోగం పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, వాచీలే కాదు గృహోపకరణాలు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ డివైస్‌లు ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి. మార్కెట్‌లో స్మార్ట్ పరికరాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాన్ని అందించే ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పాత టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు స్థానంలో కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులు వచ్చి చేరుతున్నాయి.
5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక దాని ఆధారిత స్మార్ట్ పరికరాలకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారు. సౌకర్యంతో పాటు సులభంగా, తక్కువ సమయంలో పనులను ముగించడం, మరింత ఆనందంగా జీవించడానికి వీలుగా స్మార్ట్ పరికరాలు తోడ్పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. స్మార్ట్ పరికరాల వినియోగంపై టెచార్క్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా కనెక్టెడ్ కన్సూ్యమర్ రిపోర్ట్’ పలు అంశాలను వెల్లడించింది. 2023లో స్మార్ట్ పరికరాల కొనుగోలు మరింత పెరుగుతుందని పేర్కొంది.
అయితే 5జీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ పరికరాల్లో వినియోగదారులు ఆశిస్తున్న సామర్థ్యం ఉండటం లేదని, ఈ పరికరాల్లో సామర్థ్యం మరింత ఉండాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందని టెచార్క్ వివరించింది. దాంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ఇతర పరికరాల వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన కూడా వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. సామాన్యుల్లో కూడా ఈ స్మార్ట్ పరికరాల కోసం రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. కొనుగోలుదారుల్లో 32 శాతానికి పైగా స్మార్ట్ పరికరాలవైపు వెళ్తున్నారు. అయితే ఈ స్మార్ట్ పరికరాల వినియోగంపై, బ్రాండ్‌లపై నమ్మకం వంటి అంశాల్లో ఇంకా చాలా మందిలో అవగాహన ఉండటం లేదని సర్వే పేర్కొంది.
జీవన ప్రమాణాలను మారుస్తున్న వాటిలో స్మార్ట్ పరికరాల పాత్ర ఇలా...
కంఫర్ట్ కన్వీనియన్స్ పరికరాలు: 69%
సోషల్ రికగ్నిషన్– ప్రెస్టీజ్, స్టయిల్: 53%
కనెక్టివిటీ ఆటోమేషన్: 53%
టైమ్ సేవింగ్ ప్రొడక్ట్స్: 46%
ఎనర్జీ మేనేజ్‌మెంటు: 19%
సేఫ్టీ, సెక్యూరిటీ: 17%
ఏ స్మార్ట్ వస్తువు ఎంత శాతం మంది వాడుతున్నారంటే..
వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్ 72
టీవీ 28
లైట్లు 82
ఏసీలు14
కెమెరాలు 48
వాషింగ్ మెషీన్ 12
Comments
Please login to add a commentAdd a comment