Consumer Reports
-
సూపర్ మార్కెట్ల తిండి...
ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్‌మయం.. మనం తీసుకొనే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే రెడీమేడ్ ఆహారంతోపాటు ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రయోగశాలలో క్షుణ్నంగా పరీక్షించింది. ఆహార తయారీ సమయంలోనే అందులో ప్లాస్టిక్ కలుస్తున్నట్లు గుర్తించింది... ► ఫాస్ట్ఫుడ్స్తోపాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫ్తాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్‌ను ఉపయోగిస్తుంటారు. పోలార్ సెల్ట్జెర్ కంపెనీ తయారు చేసిన రాస్బెర్రీ లైమ్ అనే పండ్ల రసంలో ప్లాస్టిక్ లేదని తేలింది. ► తాము పరీక్షించిన వాటిలో 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్–ఏ(బీపీఏ) అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలిందని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రకటించింది. కానీ, 2009 నాటితో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఈ కెమికల్ పరిమాణం తక్కువే ఉన్నట్లు వెల్లడించింది. ► ఆహారంలో ఫ్తాలేట్స్ స్థాయి ఎంతవరకు ఉంటే క్షేమం అనేదానిపై సైంటిస్టులు ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. అవి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. ► ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి. ► ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ► చీరియోస్, గెర్బర్ బేబీ ఫుడ్, యోప్లాయిట్ యోగర్ట్‌తోపాటు వెండీస్, బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల బర్గర్లు, చికెన్ నగ్గెట్స్, ఫ్రైలలో ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ► ఆహారంలో ప్లాస్టిక్‌ల నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని, నిబంధనలను కఠినతరం చేయాలని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రతినిధి జేమ్స్ రోజర్స్ సూచించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్మార్ట్‌గా మారిపోతున్నారు.. పాత వాటి స్థానంలో కొత్త ఉపకరణాలు
సాక్షి, అమరావతి: రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీతో స్మార్ట్ వస్తువుల వినియోగం పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, వాచీలే కాదు గృహోపకరణాలు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ డివైస్‌లు ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి. మార్కెట్లో స్మార్ట్ పరికరాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాన్ని అందించే ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పాత టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు స్థానంలో కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులు వచ్చి చేరుతున్నాయి. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక దాని ఆధారిత స్మార్ట్ పరికరాలకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారు. సౌకర్యంతో పాటు సులభంగా, తక్కువ సమయంలో పనులను ముగించడం, మరింత ఆనందంగా జీవించడానికి వీలుగా స్మార్ట్ పరికరాలు తోడ్పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. స్మార్ట్ పరికరాల వినియోగంపై టెచార్క్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా కనెక్టెడ్ కన్సూ్యమర్ రిపోర్ట్’ పలు అంశాలను వెల్లడించింది. 2023లో స్మార్ట్ పరికరాల కొనుగోలు మరింత పెరుగుతుందని పేర్కొంది. అయితే 5జీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ పరికరాల్లో వినియోగదారులు ఆశిస్తున్న సామర్థ్యం ఉండటం లేదని, ఈ పరికరాల్లో సామర్థ్యం మరింత ఉండాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందని టెచార్క్ వివరించింది. దాంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ఇతర పరికరాల వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన కూడా వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. సామాన్యుల్లో కూడా ఈ స్మార్ట్ పరికరాల కోసం రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. కొనుగోలుదారుల్లో 32 శాతానికి పైగా స్మార్ట్ పరికరాలవైపు వెళ్తున్నారు. అయితే ఈ స్మార్ట్ పరికరాల వినియోగంపై, బ్రాండ్లపై నమ్మకం వంటి అంశాల్లో ఇంకా చాలా మందిలో అవగాహన ఉండటం లేదని సర్వే పేర్కొంది. జీవన ప్రమాణాలను మారుస్తున్న వాటిలో స్మార్ట్ పరికరాల పాత్ర ఇలా... కంఫర్ట్ కన్వీనియన్స్ పరికరాలు: 69% సోషల్ రికగ్నిషన్– ప్రెస్టీజ్, స్టయిల్: 53% కనెక్టివిటీ ఆటోమేషన్: 53% టైమ్ సేవింగ్ ప్రొడక్ట్స్: 46% ఎనర్జీ మేనేజ్మెంటు: 19% సేఫ్టీ, సెక్యూరిటీ: 17% ఏ స్మార్ట్ వస్తువు ఎంత శాతం మంది వాడుతున్నారంటే.. వాచ్, ఫిట్నెస్ బ్యాండ్ 72 టీవీ 28 లైట్లు 82 ఏసీలు14 కెమెరాలు 48 వాషింగ్ మెషీన్ 12 -
ఐఫోన్ కంటే అవే చాలా బెస్ట్
గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్‌లను మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్లకు కిల్లర్ గా వచ్చిన ఈ ఫోన్లు అన్నమాట నిలబెట్టుకుంటున్నాయి. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లు బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా వినియోగదారుల మన్ననలను పొందుతున్నాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లే బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా దూసుకుపోతున్నట్టు వినియోగదారుల రిపోర్టులలో వెల్లడైంది. ఎంతో ఆకర్షణీయంగా, ప్రకాశవంతమైన డిస్ ప్లేతో శాంసంగ్ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల డివైజ్ లు ఉన్నాయని కన్జ్యూమర్ రిపోర్టులు కొనియాడుతున్నాయి. మంచి బ్యాటరీ సామర్థ్యం, అద్భుతమైన కెమెరాలంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ కొంచెం ఎక్కువగా బ్యాటరీపై దృష్టిసారించింది. మళ్లీ అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎంతో జాగ్రత్త వహించింది. ఒకవేళ ఈ ఫోన్ పూల్ లో పడిపోయినా ప్రమాదమేమి ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. వాటర్ రెసిస్టెన్స్, మంచి కెమెరాలు, అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో శాంసంగ్ కొత్త ఫోన్లు మార్కెట్లో దూసుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ కన్జ్యూమర్ రిపోర్టులలో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ టాప్-రేటు సొంతంచేసుకున్న స్మార్ట్ ఫోన్ గా కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఐఫోన్ 7 ప్లస్ ఐదు రేటును సంపాదించుకుంది. ఐఫోన్ 7 ప్లస్ కంటే గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్లే ముందంజలో నిలిచాయి. ఒకవేళ వీటిని అధిగమించాలంటే ఆపిల్, ఐఫోన్ 8ను వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా తీసుకురావాల్సి ఉంది. ఎస్8, ఎస్8 ప్లస్ ప్రత్యేకతలు... గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ రెండు స్మార్ట్ఫోన్లలోనూ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇన్విజిబుల్ హోమ్ బటన్, 1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయి. అయితే ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లుంటే ఎస్8 ప్లస్‌లో మాత్రం 6.2 అంగుళాల స్క్రీన్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అమర్చింది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. విక్రయాల్లో ఎస్ 8 దూకుడు ప్రదర్శించడంతో రెండో త్రైమాసికంలో గణనీయమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
45 లక్షల స్మార్ట్ ఫోన్లు మాయం.. కొట్టేశారు!
లాస్ ఎంజెలెస్: వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 45 లక్షల (4.5 మిలియన్) స్మార్ట్ ఫోన్లు యూఎస్ వినియోగదారుల నుంచి చోరికి గురవ్వడమో..పోగొట్టుకోవడమో జరిగిందని తాజా నివేదికలో వెల్లడించారు. గతం సంవత్సరం 28 లక్షల స్మార్ట్ పోన్ల కంటే ప్రస్తుత సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తాజా కన్యూమర్ రిపోర్ట్ తెలిపింది. ప్రతి ఏటా ఈ సంఖ్య రెండింతలవుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2012 లో 16 లక్షలు, 2013లో 31 లక్షలుగా నివేదికలో వెల్లడించారు. ఫోన్ లో డేటా తొలగింపు, సాఫ్ట్ వేర్ ఇన్స్ స్టాలేషన్ చేయడం, ఇతర కారణాల వల్ల 34 శాతం మంది వినియోగ దారులు చోరికి గురైన స్మార్ట్ ఫోన్లను తీసుకోవడానికి ఉత్సాహం చూపలేదని సర్వేలో వెల్లడైంది. నాలుగంకెల పాస్ వర్గ్ ను వినియోగదారులు పెట్టుకోవాలని కన్యూమర్ రిపోర్ట్స్ సూచించింది. వినియోగదారులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని సర్వేలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లలో పొందుపరిచిన వ్యకిగత సమాచారంలో ముఖ్యంగా ఫోటోలు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా కోసం ఈ-మెయిల్ అకౌంట్లు, షాపింగ్, బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయని నివేదికలో వెల్లడైంది.