Flipkart Big Bachat Dhamaal Sale 2022: Huge Discounts On Smart TVs Details Inside - Sakshi
Sakshi News home page

Flipkart: ఏంటీ! రూ.75వేల టీవీని రూ.25వేల‌కే సొంతం చేసుకోవ‌చ్చా!!

Published Sat, Feb 5 2022 10:26 AM | Last Updated on Sun, Feb 6 2022 7:36 AM

Flipkart Big Bachat Dhamaal Sale Huge Discounts On Smarttvs - Sakshi

Flipkart Big Bachat Dhamaal Sale: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌  బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రూ.75వేల విలువైన టీవీని రూ.25ల‌కే అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రిబ్ర‌వ‌రి 3నుంచి ఫిబ్ర‌వ‌రి 5వ‌ర‌కు బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ పేరుతో సేల్ నిర్వ‌హిస్తుంది. ఈ సేల్‌లో ప‌లు టీవీల‌పై అదిరిపోయే ఆఫ‌ర్ల‌కే టీవీల‌ను అందిస్తున్న‌ట్లు అధికారికంగా తెలిపింది.  
 
ఈ సేల్ లో 'వీయూ' కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే అందుబాటులోకి తెచ్చింది. 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.75 వేలు ఉండ‌గా.. ఈ బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌లో 49శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తినిధులు తెలిపారు. దీంతో ఈ టీవీ ధ‌ర రూ.37,999 ఉండ‌గా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో  అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్‌తో మ‌రో రూ.1,900 త‌గ్గుతుంది. ఫలితంగా ఈ స్మార్ట్ టీవీ ధర రూ.36,099గా ఉంటుంది. అంతేకాదు ఈ హెచ్‌డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద  రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. త‌ద్వారా  కొనుగోలు దారులు ఈ స్మార్ట్ టీవీ రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవ‌చ్చు. 

వీయూ స్మార్ట్ టీవీ ఫీచర్లు

డిస్ ప్లే - ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 

రిజల్యూషన్ - 3,840 x 2,160 పిక్సెల్స్ 

అప్ గ్రేడ్ రేట్ - 60 హెచ్‌జెడ్‌ 

సౌండ్ స్పీకర్స్ -  30 డ‌బ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు. వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్  ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement