ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌బేసిక్స్ తొలిసారి దేశీయంగా స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 50-55 అంగుళాల పరిమాణంలో వీటిని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. రూ. 29,999 నుంచి ధరలు ప్రారంభంకానున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇవి ఫైర్‌టీవీ ఎడిషన్ టీవీలుకాగా.. 4కే హెచ్‌డీఆర్ లెడ్ డిస్‌ప్లేతో విడుదల చేసినట్లు తెలియజేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫార్మాట్లలో హెచ్‌డీఆర్, ఆడియో సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఇవి అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 4కే స్మార్ట్ టీవీ విభాగంలో ప్రాథమిక(ఎంట్రీ లెవెల్) విభాగంలోని షియోమీ, టీసీఎల్, వీయూ తదితర కంపెనీలతో ఇవి పోటీ పడనున్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల)
ఇతర ఫీచర్స్
అమెజాన్‌బేసిక్స్ 50- 55 అంగుళాల పరిమాణంలో రెండు మోడళ్లను విడుదల చేసింది. ఇవి అల్ట్రాహెచ్‌డీ(3840+2160 పిక్సెల్) లెడ్ తెరలను కలిగి ఉంటాయి. డాల్బీ విజన్ ఫార్మాట్ వరకూ హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంటుంది. 20 డబ్ల్యూ రేటెడ్ స్పీకర్స్ ద్వారా డాల్బీ ఆట్మోస్‌ను కల్పించింది. క్వాడ్‌కోర్ ఆమ్లాజిక్ ప్రాసెసర్ కలిగిన వీటికి రెండు యూఎస్‌బీ, మూడు హెచ్డీఎంఐ పోర్టులను ఏర్పాటు చేసింది. అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. అమెజాన్ ఎకోసిస్టమ్‌కు సంబంధం లేకుండా సొంత సెట్‌టాప్ బాక్సును సైతం ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఫైర్ టీవీ స్టిక్ తరహాలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ తదితర సర్వీసులను యాప్స్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా మూవీస్, మ్యూజిక్ తదితరాలను సెట్ చేసుకోవచ్చు. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్)
Comments
Please login to add a commentAdd a comment