
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కన్సూమర్ బ్రాండ్ ‘థామ్సన్’ తాజాగా మూడు స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 43 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4కే, 40 అంగుళాల హెచ్‌డీ, 32 అంగుళాల హెచ్‌డీ రెడీ టీవీలు ఇందులో ఉన్నాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 18 అర్ధరాత్రి ప్రారంభమౌతుందని పేర్కొంది.
43 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీలో జీమెయిల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌ను డిపాల్ట్‌గా ఉంటాయని, ఈ టీవీ ఆండ్రాయిడ్ 4.4.4.0 ఓఎస్‌పై పనిచేస్తుందని వివరించింది. కాగా థామ్సన్ బ్రాండ్ టెక్నికలర్ కంపెనీది. ఇది భారత్‌లో ఎస్‌పీపీఎల్‌తో లైసెన్స్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. 43 అల్ట్రాహెచ్‌డీ 4కే– ధర రూ.27,999 కాగా... 40 ఫుల్‌హెచ్‌డీ ధర రూ.19,999. ఇక 32 హెచ్‌డీ రెడీ ధర రూ.13,499.
Comments
Please login to add a commentAdd a comment