Thomson brand
-
భారత్‌కు థామ్సన్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న థామ్సన్.. భారత ల్యాప్టాప్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్‌లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్‌లో తయారైన స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో థామ్సన్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్ ప్లా్రస్టానిక్స్ భాగస్వామ్యంతో థామ్సన్ భారత్‌లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్ టీవీలతోపాటు వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్‌లో విక్రయిస్తోంది. టాప్–5లో భారత్.. అంతర్జాతీయంగా భారత్‌ను టాప్–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్‌ను ప్రమోట్ చేస్తున్న యూఎస్‌కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్ సేల్స్ డైరెక్టర్ సెబాస్టియన్ క్రాంబెజ్ తెలిపారు. ‘భారత్‌లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్‌లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంది. వారు భారత్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్ ప్లా్రస్టానిక్స్‌కు భారత్‌లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్ వెస్టింగ్‌హౌజ్ టీవీ, వైట్ వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. -
థాంప్సన్ నుంచి ఆండ్రాయిడ్ టీవీలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఫ్రెంచ్ కన్సూ్యమర్ దిగ్గజం థాంప్సన్... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్ హక్కుదారు ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్‌గా నిలిచామన్నారు. 43, 49, 55, 65 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలున్నాయని, వీటి ధర రూ. 29,999 నుంచి రూ. 59,999 వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని విక్రయిస్తామన్నారు. ప్రత్యేకతలు: ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్, డాల్బీ సౌండ్, 2.5 ర్యామ్, 16 జీబీ మెమరీ, 5000కు పైగా వివిధ ప్రీఇన్స్టాల్డ్ యాప్స్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ప్లే కోసం హాట్‌కీస్, 4కే 10హెచ్డీఆర్ డిస్ప్లే తదితరాలు. -
దక్షిణాదిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో కొడాక్, థామ్సన్ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్ ప్లాస్ట్రానిక్స్’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉన్నాయని సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 2 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తుందో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 9 లక్షల యూనిట్లపైనే. కొడాక్, థామ్సన్ బ్రాండ్లలో 2017–18లో 2.1 లక్షల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 లక్షల యూనిట్లకు చేరుతుంది. కొడాక్ బ్రాండ్‌లో 14 మోడళ్లున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేస్తాం. టీవీల విపణిలో సూపర్ ప్లాస్ట్రానిక్స్‌కు 4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2022 నాటికి వాటాను రెండింతలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్లైన్లో ప్రస్తుతం టాప్–2 ప్లేయర్‌గా ఉన్నాం’ అని వివరించారు. -
మార్కెట్లోకి థామ్సన్ స్మార్ట్ టీవీలు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కన్సూమర్ బ్రాండ్ ‘థామ్సన్’ తాజాగా మూడు స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. 43 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4కే, 40 అంగుళాల హెచ్డీ, 32 అంగుళాల హెచ్డీ రెడీ టీవీలు ఇందులో ఉన్నాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 18 అర్ధరాత్రి ప్రారంభమౌతుందని పేర్కొంది. 43 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీలో జీమెయిల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌ను డిపాల్ట్‌గా ఉంటాయని, ఈ టీవీ ఆండ్రాయిడ్ 4.4.4.0 ఓఎస్‌పై పనిచేస్తుందని వివరించింది. కాగా థామ్సన్ బ్రాండ్ టెక్నికలర్ కంపెనీది. ఇది భారత్‌లో ఎస్‌పీపీఎల్‌తో లైసెన్స్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. 43 అల్ట్రాహెచ్‌డీ 4కే– ధర రూ.27,999 కాగా... 40 ఫుల్హెచ్డీ ధర రూ.19,999. ఇక 32 హెచ్డీ రెడీ ధర రూ.13,499. -
మళ్ళీ దేశీయ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్
తొలుత ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా ఎల్ఈడీ టీవీల అమ్మకాలు - రూ. 300 కోట్లతో హైదరాబాద్‌లో తయారీ యూనిట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుమారు పదేళ్ల విరామం అనంతరం థామ్సన్ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం థామ్సన్ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే విధంగా రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ యూనిట్ నుంచి తయారైన ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మంగళవారం మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. వచ్చే మూడేళ్లలో ఈ యూనిట్‌పై రూ. 300 కోట్ల పెట్టుబడితో పాటు, మార్కెటింగ్ కోసం రూ. 50 కోట్లు వ్యయం చేయనున్నట్లు రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్ సీఈవో ఎ.గోపాలకృష్ణ తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ రేటు కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకే వీటిని అందించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరునెలల్లో టీవీల తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఏసీలను తయారు చేసి విక్రయించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడాదిలోగా 500 స్టోర్లను, ఆ తర్వాత 1,000 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏటా 10 శాతం వృద్ధితో ప్రస్తుతం రూ. 80,000 కోట్లుగా ఉన్న దేశీయ ఎలక్ట్రానిక్ కన్సూమర్ మార్కెట్లో మూడేళ్లలో 5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ పరిమాణం 2020 నాటికి రూ. 1.25 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కృష్ణ తెలిపారు. మొదటి ఏడాది రూ. 200 కోట్ల అమ్మకాలను జరుపుతామన్న ధీమా ను ఆయన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో అనుబంధ కంపెనీ థామ్సన్ ఇండియా పేరుతో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినా వ్యూహాత్మక వ్యాపార నిర్ణయంలో భాగంగా 2005లో వెనక్కి వెళ్ళినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ హబ్‌గా హైదరాబాద్ తమ ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘మేకిన్ తెలంగాణ’కు మంచి స్పందన లభిస్తోందని తారకరామారావు తెలిపారు. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయని, ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీ థామ్సన్ కూడా ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ. 350 కోట్లు వ్యయం చేయడం ద్వారా నేరుగా 500 మందికి పరోక్షంగా మూడు రెట్ల మందికి ఉపాధి లభించనుందన్నారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో హైదరాబాద్ ఎలక్ట్రానిక్ హబ్‌గా ఎదుగుతోందన్నారు.