ఆండ్రాయిడ్ టీవీతో సీఈఓ అవనీత్ సింగ్
న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఫ్రెంచ్ కన్సూ్యమర్ దిగ్గజం థాంప్సన్... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్ హక్కుదారు ఎస్‌పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్‌గా నిలిచామన్నారు. 43, 49, 55, 65 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలున్నాయని, వీటి ధర రూ. 29,999 నుంచి రూ. 59,999 వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని విక్రయిస్తామన్నారు.
ప్రత్యేకతలు: ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్, డాల్బీ సౌండ్, 2.5 ర్యామ్, 16 జీబీ మెమరీ, 5000కు పైగా వివిధ ప్రీఇన్‌స్టాల్డ్ యాప్స్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ప్లే కోసం హాట్‌కీస్, 4కే 10హెచ్‌డీఆర్ డిస్‌ప్లే తదితరాలు.
Comments
Please login to add a commentAdd a comment