
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీదారు రియల్‌మి ఇక స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్ టీవీలు క్యూ2 లో (ఏప్రిల్ నెలలో) విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌లో కూడా అవకాశం ఉందన్నారు. రియల్‌మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్‌నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : ఎంటర్‌టైన్‌మెంట్ కా సూపర్‌స్టార్, బడ్జెట్ ధరలో)
మరోవైపు రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ ఇప్పటికే తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో స్మార్ట్‌టీవీలకే సంబంధించినదే అని అందరూ ఖాయంగా భావిస్తున్నారు. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ కాప్షన్‌తో వచ్చిన టీజర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. రియల్‌మీ టీవీల పూర్తి ఫీచర్లును అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ ఈ స్మార్ట్‌టీవీలలో సౌండ్, పిక్చర్ క్వాలిటీలు అద్భుతంగా ఉండనున్నాయని అంచనా. అయితే రియల్‌మి టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్
What is this? pic.twitter.com/uFQBWYXBtv
— Francis Wang (@FrancisRealme) February 21, 2020
Comments
Please login to add a commentAdd a comment