
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో తన స్మార్ట్ టీవీ లైనప్‌ను విస్తరించడానికి సిద్దమవుతున్న వన్‌ప్లస్ కంపెనీ రెండు కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేయనుంది. జూలై 2న కొత్త టీవీలను తీసుకొస్తున్నామని వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా సోమవారం ట్వీట్ చేశారు. భారతీయ కస్టమర్లకోసం ప్రీమియం స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించబోతున్నామని ఆయన ప్రకటించారు. రూ. 69.900 ప్రారంభ ధరల్లో గత ఏడాది దేశంలో వన్‌ప్లస్ రెండు వేరియంట్‌లలో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో భారతీయ వినియోగదారులను ఆకర్షించాలనే యోచనలో ఉంది.
వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీల ప్రత్యేకతలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర అనే హింట్ మాత్రం ఇచ్చారు సంస్థ సీఈవో. "బెస్ట్-ఇన్-క్లాస్ డిస్‌ప్లే" ప్యానెల్స్‌తో, వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో మిడ్ రేంజ్, ఎంట్రీ లెవల్ విభాగాల్లో ప్రీమియం అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ టీవీలు ఉండనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు కొత్త స్మార్ట్ టీవీలు సుమారు రూ. 15 వేల వద్ద ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు. తద్వారా బడ్జెట్ ధరల్లో టీవీలను తీసుకొస్తున్న వు, షావోమి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. (వన్‌ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు)
It's official. We're making our premium smart TV experience more accessible to our Indian community. #SmarterTV pic.twitter.com/gc7WUcVIxJ
— Pete Lau (@PeteLau) June 8, 2020