సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్10టీ పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంచింది. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇంతకుముందు తీసుకొచ్చిన వన్‌ప్లస్ ప్రో కంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. అలాగే తొలి వన్‌ఫ్లస్ 16 జీబీ స్మార్ట్‌ఫోన్. ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ను తొలగించిన తొలి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే..
(చదవండి: గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ కోత)
ధర,ఆఫర్, లభ్యత)
8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 49,999.
12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999.
16 జీబీ, 256 జీబీ ధర రూ.55,999.
అయితే ఐసీఐసీఐ, లేదా ఎస్బీఐ కార్డుల ద్వారా OnePlus 10T 5జీని కొనుగోలు చేస్తే, వినియోగదారులు రూ. 5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంటే 8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 44,999, 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌రూ. 49,999, 16 జీబీ, 256 జీబీ రూ. 50,999లకే సొంతం చేసుకోవచ్చు.
మూన్‌స్టోన్ బ్లాక్ , జేడ్ గ్రీన్ కలర్స్‌లో, మూడు స్టోరేజ్ ఆప్షన్‌లలో లభ్యం. OnePlus 10T ప్రీ బుకింగ్ షురూ అయ్యాయి. ఓపెన్ సేల్స్ ఆగస్టు 6న ప్రారంభం కానున్నాయి. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 10టీ 5జీ ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED ప్యానెల్
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS 12.1
50 + 8 + 2ఎంపీ ట్రిపుల్ వెనుక కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4800mAh బ్యాటరీ 150W ఛార్జింగ్
ఇదీ చదవండి: Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment