హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్‌ను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందాన ఈ ఆఫర్లను ఆవిష్కరించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరెటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్లూటూత్ నెక్ బాండ్ లభించనున్నట్లు ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో అఖిల్ తెలిపారు.
32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 40 అంగుళాల టీవీ ఆఫర్ కూడా ఉందని పేర్కొన్నారు. రూ.8999కే స్మార్ట్ టీవీ, రూ16,500కే లాప్ టాప్స్ ఆఫర్ అమల్లో ఉందన్నారు. స్మార్ట్ మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్ బ్యాక్, జీరో వడ్డీ, వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు, 70 శాతం వరకూ అష్యూర్డ్ పే బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్‌లకు 6 నెలల ఉచిత సర్వీస్, పలు ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు అఖిల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment