Lot mobiles
-
లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్, డోంట్ మిస్!
హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్‌ను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందాన ఈ ఆఫర్లను ఆవిష్కరించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరెటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్లూటూత్ నెక్ బాండ్ లభించనున్నట్లు ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో అఖిల్ తెలిపారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 40 అంగుళాల టీవీ ఆఫర్ కూడా ఉందని పేర్కొన్నారు. రూ.8999కే స్మార్ట్ టీవీ, రూ16,500కే లాప్ టాప్స్ ఆఫర్ అమల్లో ఉందన్నారు. స్మార్ట్ మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్ బ్యాక్, జీరో వడ్డీ, వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు, 70 శాతం వరకూ అష్యూర్డ్ పే బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లకు 6 నెలల ఉచిత సర్వీస్, పలు ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు అఖిల్ వివరించారు. -
రెండోరోజూ ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్స్‌తోపాటు లాట్ మొబైల్స్, బిగ్‌సీ సంస్థల్లో ప్రారంభించిన సోదాలు శనివారం కూడా కొనసాగించారు. ఈ సంస్థల యజమానులు పెద్దఎత్తున నిధులను రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించినట్లు ఐటీ అధికారుల దాడుల్లో బయటపడ్డట్లు సమాచారం. దాడుల గురించి ఐటీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా రెండోరోజు కూడా ఈ సోదాలు కొనసాగించారు. ఇక్కడ నుంచి వచ్చిన లాభాలను హానర్ రియల్ ఎస్టేట్ సంస్థలోకి నిధులు మళ్లించినట్లు చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడానికి ఈ విధంగా ఒకదానిలో నుంచి మరో సంస్థకు నిధులు మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల సమయంలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడమేకాక నిధుల మళ్లింపుపై అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. -
లాట్ మొబైల్స్‌లో ఒప్పో ఎఫ్11 ప్రో విడుదల
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మొబైల్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ‘లాట్ మొబైల్స్’లో ఒప్పో ఎఫ్11 ప్రో మొబైల్ విడుదల కార్యక్రమం జరిగింది. శుక్రవారం కూకట్పల్లి బాలాజీనగర్‌లోని లాట్ మొబైల్స్ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లాట్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ నటి పూజ హెగ్డే ‘ఒప్పో ఎఫ్11 ప్రో’ను ఆవిష్కరించి, మార్కెట్లోకి విడుదల చేశారు. లాట్ స్టోర్స్‌లో ముందుగా ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారిలో కొందరు కస్టమర్లకు ఈ సందర్భంగా మొబైల్స్‌ను అందించారు. ఒప్పో ఎఫ్11 ప్రోను విడుదల చేయడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లాట్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తమ లాట్ షోరూమ్‌లలో సంచలన మోడల్ ఒప్పో ఎఫ్11ప్రో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. ప్రత్యేకతలు... ఈ ఫోన్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నందున అత్యంత స్పష్టతతో హెచ్డీ ఫోటోలను తీసుకోవచ్చని, ఈ ఫోన్ ధర రూ.24,990గా తెలిపారు. లాట్ మొబైల్స్‌లో ఒప్పో ఎఫ్11 ప్రోను బుక్ చేసుకుంటే కస్టమర్లకు పూర్తి స్థాయి యాసిడెంటల్ డ్యామేజీ ప్రొటెక్షన్ కవరేజీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5 శాతం క్యాష్ బ్యాక్, ప్రత్యేకమైన బహుమతి ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. -
లాట్ మొబైల్స్ డిస్కౌంట్ ఆఫర్స్
ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ రిటైల్ సంస్థ ‘లాట్ మొబైల్స్’ తాజాగా బ్లాక్‌బస్టర్ డీల్స్ పేరిట పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు ఈ ఆఫర్లలో భాగంగా మొబైల్ కొనుగోలుపై టీవీలు, టవర్ ఫ్యాన్లు, రైస్కుక్కర్లను ఉచితంగా పొందొచ్చని కంపెనీ తెలిపింది. అలాగే మొబైల్స్‌పై 55 శాతం వరకు, బ్రాండెడ్ యాక్ససరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని, 0 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొంది. బ్లాక్‌బస్టర్ డీల్స్‌లో భాగంగా 1 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.2,999లకు, 2 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.4,999లకు, 3 జీబీ ఫోన్‌ను రూ.5,999లకు, 4 జీబీ ఫోన్‌ను 8,999లకు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. -
అమరావతిలో అందాల రాక్షసి
అందాల రాకాసిగా కుర్రోళ్ల గుండెల్లో కొలువుదీరావు. భలే భలే మగాడివోయ్ అంటూ రంజింపజేశావు. అయోధ్య నుంచి వచ్చినా ఆంధ్రుల మతి చెడగొట్టావు..అంతులేని ‘లావణ్య’ం నీది.. అంటూ శుక్రవారం విజయవాడలో యువత హీరోయిన్ లావణ్య త్రిపాఠికి అభిమాన నీరాజనం పలికారు. లబ్బీపేట(విజయవాడతూర్పు) : భలే భలే..భలే భలే మగాడివోయ్..అంటూ యువతరాన్ని తన ‘లావణ్య’ంతో మత్తెక్తించిన అందాల రాకాసి నవ్యాంధ్రలో సందడి చేసింది. తమ అభిమాన నటి నగరానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారు. బెంజిసర్కిల్ సమీపంలో లాట్ మొబైల్ 161వ షోరూమ్‌ను హీరోయిన్ లావణ్యత్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ అభిమానులు తనను ఇంతగా ఆదరించడం సంతోషించదగిన విషయంగా పేర్కొన్నారు. లాట్ మొబైల్స్‌లో విభిన్న రకాల మోడళ్లతో పాటు ప్రజల కోసం వివిధ ఆఫర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. లాట్ మొబైల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.రావేష్ తమీరా మాట్లాడుతూ తమ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా లక్కీ డ్రా ఏర్పాటు చేశామని, నాలు వారాల పాటు డ్రా తీసి గెలుపొందిన వారికి టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్‌లు బముమతులుగా అందజేయనున్నట్లు తెలిపారు. -
లాట్ మొబైల్స్‌లోనూ రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్స్’ తాజాగా రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఇందుకోసం షావోమి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ‘లాట్ మొబైల్స్’ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లాట్ షోరూమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా రెడ్మి నోట్–4లో 13 ఎంపీ రియర్ కెమెరా, 5.5 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. -
లాట్ మొబైల్స్ ఉగాది స్మార్ట్ ఆఫర్లు
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ ‘లాట్ మొబైల్స్’ తాజాగా ఉగాదిని పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై ధర తగ్గింపు, రూ.4,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తే హెడ్సెట్ సహా 8 జీబీ మెమరీ కార్డ్, వివో వీ1 మ్యాక్స్ కొనుగోలుపై ఉచిత 5.1 హోమ్ థియేటర్ వంటి తదితర ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అన్ని లాట్ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
లాట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్స్
హైదరాబాద్: ప్రముఖ మల్టీ బ్రాండ్ స్మార్ట్ మొబైల్ రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్స్’ తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు ‘స్మార్ట్ ఫీస్ట్ సేల్’ పేరుతో పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ ఫీస్ట్ సేల్ ఆఫర్లో భాగంగా రూ.31,000ల విలువ గల మెగా కాంబో ఆఫర్‌ను రూ.13,000లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇంటెక్స్ ఆక్వా టర్బో 4జీ, ఐఫోన్ 6ఎస్, లెనొవొ ఏ5000, శాంసంగ్ గ్యాలక్సీ ఏ5, ఇంటెక్స్ వై2 పవర్, మైక్రోమ్యాక్స్ బోల్ట్ క్యూ335 వంటి తదితర మొబైల్ హ్యాండ్సెట్స్ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్, పవర్ బ్యాంక్, హెడ్సెట్, ఐఫోన్ 4ఎస్, మెమరీ కార్డులు, సెల్ఫీ స్టిక్, ఇంటె క్స్ డీవీడీ ప్లేయర్ వంటి తదితర వాటిని ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు ప్రతి కొనుగోలుపై ఒక కచ్చితమైన బహుమతి పొందొచ్చని తెలిపింది. -
లాట్లో భారీ లూటీ..
తిరుపతి: తిరుపతి ఓ సెల్‌ఫోన్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక తిలక్ రోడ్డు మున్సిపల్ ఆఫీసు జంక్షన్ వద్ద ఉన్న లాట్ మొబైల్స్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే గమనించిన దుండగులు దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి రూ.8.50 లక్షల విలువైన సెల్ఫోన్లను దోచుకెళ్లారు. సోమవారం ఉదయం గమనించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ భారీ చోరీ జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్6 సంబరాల్లో అల్లు అర్జున్: లాట్
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రిటైల్ రంగంలో ఉన్న లాట్ మొబైల్స్... శుక్రవారం విశాఖపట్నంలోని షోరూంలో శాంసంగ్ ఎస్6, ఎస్6 ఎడ్జ్ సంబరాలు ఘనంగా జరిపింది. ఈ సందర్భంగా సినీ నటుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఎస్6, ఎస్6 ఎడ్జ్ ఫోన్లను వినియోగదారులు అందుకున్నారు. ఇప్పటి వరకు తాను ఎండార్స్ చేసిన బ్రాండ్లలో లాట్ ప్రత్యేకమైందని ఈ సందర్భంగా అల్లు అర్జున్ చెప్పారు. మూడేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 105 షోరూంలను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని లాట్ ప్రతినిధి చెప్పారు. అన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై మొబైల్స్ కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. -
లాట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్లు
హైదరాబాద్: మల్టీబ్రాండ్ స్మార్ట్ఫోన్లు విక్రయించే మొబైల్ రిటైల్ చెయిన్ లాట్ మొబైల్స్ సంక్రాంతి సందర్బంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ప్రముఖ హీరో రాణా, హీరోయిన్ తాప్సీలు ఆవిష్కరించిన సంక్రాంతి ఆఫర్లు స్మార్ట్ఫోన్లపైనే కాకుండా, ఫీచర్ ఫోన్లపైనా అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఐఫోన్ 4 ఎస్, ఎల్జీ జీ3 మొబైళ్ల కొనుగోలుపై రూ.10,000 ఆదా చేసుకోవచ్చని, నోకియా లూమియా 1320 కొంటే మరో నోకియా లూమియా ఫోన్ ఉచితమని, శామ్సంగ్ గెలాక్సీ ఎస్4 కొంటే మరో శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితమని, రూ.10,000 విలువున్న మైక్రోమ్యాక్స్ డూడుల్3 కొంటే మైక్రోమ్యాక్స్ పీ280 ట్యాబ్ ఉచితమని, ఈ ఆఫర్ ద్వారా రూ.4,000 ఆదా చేసుకోవచ్చని వివరించింది. రూ.2,000 కే 2 మొబైళ్లు కొనుగోళ్లు చేయవచ్చని, రూ.1,000 విలువ గల ఆ మెమెరీ కార్డులు అందిస్తామని వివరించింది. ఒక సెల్కాన్ మొబైల్ కొంటే 2 ఫీచర్ ఫోన్లు ఉచితమని, సోనీ ఎక్స్‌పీరియా సీ3 మొబైల్ కొనుగోలుపై రూ.5,000 ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. ప్రతి కొనుగోలుపై ఒక ఖచ్చితమైన బహుమతి పొందవచ్చని లాట్ తెలిపింది. -
లాట్ మొబైల్ 101వ స్టోర్ విజయవాడలో
ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ సోమవారం విజయవాడలో తన 101వ స్టోర్‌ను ప్రారంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఈ స్టోర్‌ను ప్రారంభించారు. విజయవాడలో సంస్థకు ఇది ఆరవ స్టోర్. పండుగ ఆఫర్లు... దీపావళిని పురస్కరించుకుని సంస్థ ‘‘లాట్ స్మార్ట్ ఫెస్ట్’ పేరుతో పలు ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్స్6, 6 ప్లస్ కొనుగోళ్లపై రూ.8,000 విలువైన ప్రయోజనాలు- ఒక మొబైల్ కొంటే 2 నుంచి 4 వరకూ మొబైల్స్ ఉచితం- మొబైల్ కొంటే మెమెరీ కార్డ్, పవర్ బ్యాంక్ ఉచితం- రూ.4,999కే రెండు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు- రూ.9,999 స్మార్ట్ మొబైల్ కొంటే రూ.8,000 విలువచేసే ట్యాబ్లెట్ ఉచితం- రూ.6,999 స్మార్ట్ మొబైల్ కొంటే రూ.5,000 ట్యాబ్లెట్ ఉచితం- రూ.2,000కే 3జీ మొబైల్ వంటి ఆఫర్లు ఇందులో ఉన్నాయి. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై మొబైల్స్ కొనుగోళ్లు చేయవచ్చని, ప్రతి కొనుగోలుపై ఒక ఖచ్చిత బహుమతి పొందవచ్చని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. లాట్ మొబైల్స్ షోరూమ్‌లన్నింటినీ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని, అన్ని బ్రాండెడ్ మొబైల్స్ డెమోలు, అత్యాధునిక యాక్సెసరీలను అందుబాటులో ఉంచామన్నారు. -
లాట్ మొబైల్స్ స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి సందర్భంగా స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్‌ను ప్రకటించింది. 50% అస్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్లో లాట్ కస్టమర్లు 6 నెలలలోపు ఎప్పుడైనా తమ ఫోన్ కొన్న ధరలో 50% ధరతో ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఫోన్‌ను కొనుక్కోవచ్చు. 15 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌ను సైతం లాట్ మొబైల్స్ ప్రవేశపెట్టింది. ఫోన్ నచ్చకపోతే కొన్న తేదీ నుండి 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి వేరే బ్రాండ్ మొబైల్‌ను తీసుకోవచ్చు. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై 2 సంవత్సరాల ఎక్స్టెండెడ్ నేషనల్ వారెంటీ అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఫోన్లపై డిస్కౌంట్, స్మార్ట్ ఫెస్ట్‌లో ప్రతి కొనుగోలుపై ఖచ్చిత బహుమతి ఉంది. డిసెంబరుకల్లా మరో 25 షోరూంలను తెరుస్తున్నట్టు లాట్ ప్రతినిధి వెల్లడించారు. -
రోజుకొకరు లక్షాధికారి
మళ్లీ వచ్చిన ‘సాక్షి’ పండుగ సంబరాలు సనత్‌నగర్: ఏటేటా ఇంటింటా సిరుల పంటను కురిపించే ‘సాక్షి’ పండుగ సంబరాలు మళ్లీ వచ్చేశాయి. రోజుకొకరిని లక్షాధికారిని చేస్తూ దసరా పండుగ ఆనందాన్ని ముందస్తుగానే ఇంటికి తెచ్చే ఈ సంబరాలు ఆదివారం అమీర్‌పేట్ లాట్ మొబైల్స్‌లో ఆరంభమయ్యాయి. లాట్ మొబైల్స్ ఏజీఎం(సేల్స్) రాజేశ్ నల్లారి డ్రా తీశారు. ఇందులో వరుణ్ మోటార్స్‌లో వెగనార్ కారును కొనుగోలు చేసిన ఎ. సుధీర్ లక్ష రూపాయల బంపర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. దీంతో పాటు మొదటి, రెండు బహుమతులు (మ్యూజిక్ సిస్టమ్, వెట్ గ్రైండర్), మూడు కన్సొలేషన్ బహుమతుల (సెల్కాన్ మొబైల్స్)కు డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. షాపింగ్ చేయండి... రూ. లక్ష గెలుచుకోండి.. ఈ నెల 22 వరకు సాక్షిలో ప్రకటించిన షోరూంలలో షాపింగ్ చేసేవారు ఈ సంబరాల్లో పాల్గొనవచ్చు. ప్రతిరోజూ బంపర్‌ప్రైజ్ కింద లక్ష రూపాయలతో పాటు మరో ఐదుగురికి బహుమతులు అందిస్తాం అని ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ జనరల్ మేనేజర్ రమణ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో లాట్ మొబైల్స్ రీజనల్ సేల్స్ మేనేజర్ వినయ్, బిగ్ ఎఫ్ఎం ఆర్జే శేఖర్ బాషా, ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ ఏజీఎం వినోద్ మాదాసులు పాల్గొన్నారు. ఎదురుచూస్తున్నారు.. ‘సాక్షి’ పండుగ సంబరాలు మళ్లీ ఎప్పుడొస్తాయా? అని కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. గతంలో బహుమతులు గెలిచిన వారి ద్వారా ఈ సంబరాలు ప్రతిఒక్కరి మనసును గెలుచుకున్నాయి. ఈ సంబరాలు అటు కస్టమర్లను లక్షాధికారి చేయడంతో పాటు ఇటు వ్యాపారపరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మున్ముందు కూడా ‘సాక్షి’ చేపట్టే కార్యక్రమాల్లో ఇదేవిధమైన భాగస్వామిగా నిలుస్తామని సగర్వంగా చెబుతున్నా. - రాజేశ్ నల్లారి, లాట్ మొబైల్స్ ఏజీఎం (సేల్స్) -
లాట్ మొబైల్స్ 100వ షోరూమ్
ప్రారంభించిన అల్లు అర్జున్ యానివర్సరీ సేల్ ఆఫర్లు, బ్రాండెడ్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్ తాజాగా తమ 100వ షోరూమ్ ‘స్మార్ట్ లాంజ్’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నటుడు అల్లు అర్జున్ శనివారం దీన్ని ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీలతో లాట్ మొబైల్స్ 2012లో ప్రభంజనంలా దూసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో 50వ స్టోర్‌ని, ఏడాది తిరగ్గానే ఈ ఆగస్టులో వందో స్టోర్‌ని ప్రారంభించడం సంస్థ శరవేగంగా వృద్ధి చెందుతున్న తీరుకు నిదర్శనమన్నారు. మొదటి సేల్ కింద షోరూమ్‌లో రూ. 7.8 లక్షలు విలువ చేసే వర్చ్యు ఫోన్‌ని కొనుగోలు చేసిన కస్టమర్‌కి అల్లు అర్జున్ మొబైల్‌ని అందజేశారు. ఆఫర్లు.. వార్షికోత్సవాలను పురస్కరించుకుని లాట్ మొబైల్స్ పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. 15 రోజుల ట్రయల్ ఆఫర్ కింద.. కొనుగోలు చేసిన మొబైల్ నచ్చకపోతే 15 రోజుల్లో అంతే విలువ చేసే మరో మోడల్‌తో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. ఇక, బ్రాండెడ్ మొబైల్స్‌పై 66% దాకా డిస్కౌంటు, ఒక మొబైల్ కొంటే 2 మొబైల్స్ ఉచితం, ఎంపిక చేసిన మొబైల్స్‌పై రూ. 3,000 విలువైన బహుమతులు వంటివి ఇందులో ఉన్నాయి. స్టోర్ ప్రత్యేకతలివీ.. రెండు అంతస్తుల్లో సుమారు 3,000 చ.అ.ల విస్తీర్ణంలో స్టోర్‌ని లాట్ మొబైల్ ఏర్పాటు చేసింది. కస్టమర్లు వివిధ ఫోన్లను పోల్చి చూసుకుని తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఇందులో ప్రత్యేకంగా టచ్ ఇంటర్ఫేస్ అందుబాటులో ఉం టుంది. ట్యాబ్స్ కోసం ప్రత్యేక జోన్, సోనీ ఆగ్యుమెంటెడ్ గేమింగ్ జోన్ వంటివి దీనిలో ఉన్నాయి. అలాగే పాటలు డౌన్లోడ్ చేసుకునేందుకు మ్యూజిక్ జూక్ బాక్స్, కస్టమర్లు తమకు నచ్చిన ఫొటోలను తమ మొబైల్స్ బ్యాక్ ప్యానెల్స్‌పై ప్రింట్ చేసుకునేందుకు వీలుగా ఇన్‌స్టా ప్రింట్ వంటి వివిధ సర్వీసులు ఈ లాంజ్‌లో అందుబాటులో ఉంటాయి. -
లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్
హైదరాబాద్: లాట్ మొబైల్స్‌లో లేటెస్ట్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఆకర్షణీయమైన ఆఫర్లతో కేవలం రూ.500కే ఎస్5ను బుక్‌చేసుకునే సదుపాయాన్ని లాట్ మొబైల్స్ కల్పిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా ఎస్5ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేసుకునేవారికి 15% క్యాష్ బ్యాక్, ఇతర క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై బుక్ చేసుకునేవారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్లను లాట్ మొబైల్స్ అందజేస్తోంది. వీటితోపాటు లాట్ మొబైల్స్‌లో ఎస్5 కొన్నవారికి 1 సంవత్సరం అదనపు వారంటీతో కలిపి మొత్తం రెండేళ్ల ఉచిత వారంటీ అందుబాటులో ఉంటుంది. -
లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు లాట్ మొబైల్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11న తమ సంస్థ హైదరాబాద్‌లో 15 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనున్నదని, వీటిని తమ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ ప్రారంభిస్తారని పేర్కొంది. దీంతో హైదరాబాద్‌లో తమ మొత్తం మొబైల్ షోరూమ్‌ల సంఖ్య 50కు చేరుతుందని, ఇవన్నీ ప్రత్యేక లైవ్ ఎక్స్పీరియన్స్ షోరూమ్‌లుగా వినియోగదారులకు సేవలందిస్తాయని వివరించింది. తమ షోరూమ్‌ల్లో అన్ని రకాల బ్రాండ్స్, మొబైల్ ఫోన్స్‌ను అన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ లేకుండా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ప్రతి మొబైల్ కొనుగోలుపై బీమా, విక్రయానంతర సేవలు అందిస్తున్నామని, లాట్ మొబైల్స్‌లో ఒక లక్షకు పైగా ఆప్స్ డౌన్లోడ్ చేసుకునే వీలుందని కంపెనీ వివరించింది. సీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మండవ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు, పబ్లిక్ రంగంలోని విత్తన కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఐ) నూతన ప్రెసిడెంట్‌గా నూజివీడు సీడ్స్ సీఎండీ మండవ ప్రభాకరరావు నియమితులయ్యారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అసోసియేషన్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు ఆయనను ఎంపిక చేశారు. 2013-15 కాలానికి ఆయనీ పదవిలో కొనసాగుతారు. విత్తన పరిశ్రమ ఎదుర్కొంటున్న నియంత్రణపరమైన సమస్యలపై పనిచేస్తానని ఈ సందర్భంగా ప్రభాకరరావు తెలిపారు. ఎన్ఎస్ఏఐలో 238 విత్తన కంపెనీలకు సభ్యత్వం ఉంది.