సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఆర్‌ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్స్‌తోపాటు లాట్ మొబైల్స్, బిగ్‌సీ సంస్థల్లో ప్రారంభించిన సోదాలు శనివారం కూడా కొనసాగించారు. ఈ సంస్థల యజమానులు పెద్దఎత్తున నిధులను రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించినట్లు ఐటీ అధికారుల దాడుల్లో బయటపడ్డట్లు సమాచారం. దాడుల గురించి ఐటీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా రెండోరోజు కూడా ఈ సోదాలు కొనసాగించారు.
ఇక్కడ నుంచి వచ్చిన లాభాలను హానర్ రియల్ ఎస్టేట్ సంస్థలోకి నిధులు మళ్లించినట్లు చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడానికి ఈ విధంగా ఒకదానిలో నుంచి మరో సంస్థకు నిధులు మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల సమయంలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడమేకాక నిధుల మళ్లింపుపై అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment