RS Brothers
-
రెండోరోజూ ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్స్‌తోపాటు లాట్ మొబైల్స్, బిగ్‌సీ సంస్థల్లో ప్రారంభించిన సోదాలు శనివారం కూడా కొనసాగించారు. ఈ సంస్థల యజమానులు పెద్దఎత్తున నిధులను రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించినట్లు ఐటీ అధికారుల దాడుల్లో బయటపడ్డట్లు సమాచారం. దాడుల గురించి ఐటీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా రెండోరోజు కూడా ఈ సోదాలు కొనసాగించారు. ఇక్కడ నుంచి వచ్చిన లాభాలను హానర్ రియల్ ఎస్టేట్ సంస్థలోకి నిధులు మళ్లించినట్లు చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడానికి ఈ విధంగా ఒకదానిలో నుంచి మరో సంస్థకు నిధులు మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల సమయంలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడమేకాక నిధుల మళ్లింపుపై అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. -
Hyderabad: ఆర్ఎస్ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ: ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రముఖ షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్‌కు సంబంధించిన ఆస్తులు, ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపాయి. నగరంలోని ఆరు చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన ఆఫీసులతోపాటు వారి ఇళ్లలో కూడా సోదాలు చేశారు. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్ సహా పలు చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ఎస్ బ్రదర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. వాసవి అనే సంస్థతో పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. అలాగే కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా ఆర్ఎస్ బ్రదర్స్ జోక్యం తదితర ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఆర్ఎస్ బ్రదర్స్ తోపాటు పాటు హానర్స్, సుమధుర ,వాసవి రియల్ ఏస్టేట్ సంస్థల ఆస్తులు, సంబంధిత వ్యక్తుల ఇళ్లపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
హైదరాబాద్ లో ఆరుచోట్ల ఐటీ సోదాలు
-
ఆర్ఎస్ బ్రదర్స్‌లో నభా నటేష్
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఆర్పీరోడ్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్‌లో సినీ నటి నభా నటేష్ సందడి చేసింది. ఆధునికీకరించిన షో రూమ్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ.. ఆర్ఎస్ బ్రదర్స్‌లోని కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని, సకుటుంబంగా షాపింగ్ చేసేలా దుస్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంది. షోరూం డైరెక్టర్లు పి. వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, సత్యనారాయణ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లతో, అందమైన దుస్తులను అందిస్తున్నామన్నారు. -
అబిడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం
-
ఆర్ఎస్ బ్రదర్స్‌లో అగ్నిప్రమాదం.. భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో దాదాపు నాలుగు గంటల పాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కోఠికి వెళ్లే వాహనాలను మోంజాయి మార్కెట్ మీదుగా దారి మళ్లించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అదృష్టవశాత్తూ అర్థరాత్రి వేళ ప్రమాదం జరగటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. చుట్టుపక్కల ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణపు యాజమాన్యం తెలిపింది. -
హైదరాబాద్ అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
-
ఆర్ఎస్ బ్రదర్స్ గోదాంలో భారీ ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సనత్‌నగర్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం సమాచారం అందుకుని సంఘటనాస్థలికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదం వల్ల గోదాంలో ఉన్న సరుకు మొత్తం కాలి బూడిద అయింది. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. -
'ఆర్ఎస్ బ్రదర్స్' లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్డుపై ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాయి. అయితే నష్టం ఏమేరకు ఉండొచ్చు, ప్రమాదం ఎలా సంభవించిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
కొత్తపేట్‌లో సినీనటి రాశీకన్నా సందడి
సాక్షి,సిటీబ్యూరో: ప్రముఖ వస్త్రాల షోరూమ్ ఆర్.ఎస్.బ్రదర్స్ 12వ షోరూమ్‌ను శుక్రవారం కొత్తపేట్‌లో ప్రముఖ సినీనటి రాశీకన్నా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం సకుటుంబ వస్త్ర ప్రపంచంగా కొనియాడారు. రిటెయిల్ రంగంలో ఆర్.ఎస్.బ్రదర్స్ ఒక సంచలనమన్నారు. ఈ షోరూమ్‌లో ఉన్న డిజైన్లు,వివిధ రకాల వస్త్రాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయన్నారు. కోఠిలో ఒక షోరూమ్‌తో ప్రారంభమైన కాగా ఆర్.ఎస్.బ్రదర్స్ ప్రస్తానం నేడు 12 షోరూమ్‌లకు చేరుకుందన్నారు. పురుషులు,మహిళలు,చిన్నారులకు నెం.1 షాపింగ్ మాల్ ఇదేనన్నారు. దశలవారీగా తెలంగాణా,ఏపీలోని ప్రముఖ నగరాల్లో ఆర్.ఎస్.బ్రదర్స్ షోరూమ్‌లను తెరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్.ఎస్.బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు సురేష్ సీమా, స్పందన, అభినవ్, రాకేష్, కేశవ్‌లు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో నెం.1 షాపింగ్ మాల్స్‌ను ఆర్.ఎస్.బ్రదర్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత 25 ఏళ్లుగా వినియోగదారులకు సకుటుంబ, సపరివార, ఆధునిక వస్త్రాలను సరసమైన ధరల్లో అందజేస్తున్నామన్నారు. -
ఆర్ఎస్ బ్రదర్స్ భారీ విస్తరణ
- 2016కల్లా దక్షిణాది రాష్ట్రాలకు - దుబాయ్, యూఎస్లకూ ఔట్లెట్లు - పీఈ ఫండ్ స్వీకరించే ఆలోచన - ఆర్ఎస్ గ్రూప్ ఎండీ వెంకటేశ్వర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్త్రాలు, బంగారు ఆభరణాల రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ భారీగా విస్తరిస్తోంది. ఈ ఏడాది మరో 3 స్టోర్లను ప్రారంభిస్తోంది. 2016లో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అడుగు పెట్టనుంది. ఆర్ఎస్ గ్రూప్ ఇప్పటికే హైదరాబాద్, విజయవాడలో 13 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలు సంస్థ పరిశీలనలో ఉన్నాయి. దుబాయ్, యూఎస్, సింగపూర్, మలేషియాల్లోనూ స్టోర్లను ప్రారంభించాలన్న ప్రణాళిక ఉందని గ్రూప్ ఎండీ పి.వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 1999లో ఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైందని, కోట్లాది మందికి చేరువయ్యామని చెప్పారు. వినియోగదార్లకు మరింత దగ్గరయ్యేందుకే విస్తరణ బాట పట్టామన్నారు. టర్నోవర్ రూ. 1,000 కోట్లు.. గ్రూప్ టర్నోవర్ 2013-14లో వస్త్రాల విక్రయాల నుంచి రూ. 480 కోట్లు, బంగారు ఆభరణాల వ్యాపారం ద్వారా రూ. 300 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ రూ. 900 కోట్లుగా అంచనా వేస్తోంది. 2015-16లో రూ. 1,000 కోట్లను దాటాలన్నదే తమ లక్ష్యమని గ్రూప్ డెరైక్టర్ ఎస్.రాజమౌళి వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు విస్తీర్ణాన్నిబట్టి రూ. 50 కోట్ల దాకా వ్యయం అవుతుందని చెప్పారు. విస్తరణలో భాగంగా అవసరమైతే ప్రైవేట్ ఈక్విటీ ద్వారా రూ.200 కోట్లు సమీకరించే అవకాశమూ ఉందన్నారు. ముంబైకి చెందిన పీఈ సంస్థలు తమతో సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న మెన్స్‌వేర్ రిటైల్ ఔట్లెట్ ‘స్టేటస్’ బ్రాండ్‌తో రెండేళ్లలో 10 ఔట్లెట్లను తెరవాలని సంస్థ నిర్ణయించింది. త్వరలో ఆన్‌లైన్‌లోనూ.. గ్రూప్ బోర్డులోకి రెండవతరం వచ్చి చేరింది. ఆన్‌లైన్‌నూ వేదికగా చేసుకొని సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నది యువ డెరైక్టర్ల ఆలోచన. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థ స్టోర్లకు నెలకు 6 లక్షల మంది కస్టమర్లు అడుగు పెడుతున్నారు. సీజన్లో ఈ సంఖ్య రెండింతలపైమాటే. వీరిలో 60 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. వీరే తమ విజయానికి కారణమని సంస్థ చెబుతోంది. కస్టమర్ సగటున చేసే కొనుగోళ్లు 2010లో రూ.1,700 ఉంటే, ఇప్పుడది రూ.2,500లకు చేరిందని కంపెనీ తెలిపింది. వినియోగదార్ల కొనుగోలు సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని వివరించింది.