సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రముఖ షాపింగ్ మాల్ ఆర్‌ఎస్ బ్రదర్స్‌కు సంబంధించిన ఆస్తులు, ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపాయి. నగరంలోని ఆరు చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన ఆఫీసులతోపాటు వారి ఇళ్లలో కూడా సోదాలు చేశారు. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్ సహా పలు చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్‌ఎస్ బ్రదర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. వాసవి అనే సంస్థతో పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. అలాగే కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా ఆర్‌ఎస్ బ్రదర్స్ జోక్యం తదితర ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఆర్ఎస్ బ్రదర్స్ తోపాటు పాటు హానర్స్, సుమధుర ,వాసవి రియల్ ఏస్టేట్ సంస్థల ఆస్తులు, సంబంధిత వ్యక్తుల ఇళ్లపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment