సాక్షి, హైదరాబాద్: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేశారు. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వాసవి కన్‌స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు.
వేల కోట్లు పనులు చేస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవీ గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను, సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
చదవండి: (హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే)
Comments
Please login to add a commentAdd a comment