realestate
-
చెన్నైలో ప్రధాన కార్యాలయం అమ్మిన కాగ్నిజెంట్.. ధర ఎంతంటే..
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్ (ఓఎంఆర్) ఒక్కియం తొరైపాక్కంలో ఉన్న 13.68 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీని రూ.612 కోట్లకు విక్రయించింది. నీలాంకరై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వారం ప్రారంభంలో ఈ అమ్మకం లావాదేవీలు నమోదయ్యాయి. తొరైపాక్కం కాంప్లెక్స్‌లో సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న కాగ్నిజెంట్ ఇండియా ప్రధాన కార్యాలయం లెగసీ ఇక ముగిసినట్లు తెలుస్తుంది.చెన్నైలో కాగ్నిజెంట్ మొదటి పూర్తి యాజమాన్యంలోని క్యాంపస్‌గా ఉన్న ఈ ప్రాపర్టీకి గణమైన చరిత్ర ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకులు లక్ష్మీ నారాయణన్, చంద్రశేఖరన్‌లకు గతంలో ఈ ఆఫీస్ ఆపరేషనల్ బేస్‌గా పనిచేసింది. ఒకప్పుడు కాగ్నిజెంట్ రిమోట్ కార్యకలాపాలకు ఇది ఎంతో తోడ్పడింది. అయితే ప్రస్తుతం అమ్మిన దాదాపు 15 ఎకరాల్లోని నాలుగు లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలంతో కూడిన ఈ కార్యాలయానికి సుమారు రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని గత ఏడాది సెప్టెంబరులో ఒక నివేదిక తెలిపింది.ఎంఈపీజెడ్, షోలింగనల్లూరు, సిరుసేరిలోని మూడు సొంత భవనాల్లో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ విక్రయం జరిగింది. ఈ లావాదేవీని సులభతరం చేయడానికి అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజరీ సంస్థ జేఎల్‌ఎల్‌ను నియమించి గత ఏడాది ఆగస్టులో కంపెనీ ఈ ప్రాపర్టీని మార్కెట్లోకి తెచ్చింది. స్థానిక డెవలపర్లు బాశ్యామ్ గ్రూప్, కాసాగ్రాండ్ సహా పలువురు కొనుగోలుదారులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ బగామానే గ్రూప్ విజయవంతమైన బిడ్డర్‌గా లిస్ట్ అయింది.ఇదీ చదవండి: శామ్సంగ్ కో-సీఈఓ కన్నుమూతఈ ప్రాపర్టీ విక్రయం ద్వారా స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజుల కోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.55.08 కోట్లు సమకూరాయి. ఈ లావాదేవీని 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాపర్టీ అప్పగింతకు ముందుగా అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు మూడు నెలల సమయం పట్టినప్పటికీ కాగ్నిజెంట్ డిసెంబర్ చివరి నాటికే క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇదిలాఉండగా, రామానుజన్ ఐటీ పార్క్, డీఎల్ఎఫ్, ఆర్ఏ పురంలోని సెయింట్ మేరీస్ రోడ్డులోని కార్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా చెన్నై అంతటా లీజుకు తీసుకున్న స్థలాలను కూడా కంపెనీ ఖాళీ చేస్తోంది. -
గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలు
గృహ రుణాలు 2024 సెప్టెంబర్ నాటికి రూ.33.53 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ప్రకటించింది. ఏడాది కాలంలో 14 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. ఇందులో మధ్యాదాయ వర్గాలు (ఎంఐజీ) తీసుకున్నవే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో హౌసింగ్ రంగంలో ధోరణులు, పురోగతిపై ఎన్‌హెచ్‌బీ ఒక నివేదిక విడుదల చేసింది. రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలు ఉన్నట్లు తెలిపింది.‘2024 సెప్టెంబర్ నాటికి వ్యవస్థ వ్యాప్తంగా బాకీ ఉన్న వ్యక్తిగత గృహ రుణాల విలువలో తక్కువ ఆదాయ విభాగానికి (ఎల్ఐజీ) సంబంధించి 39 శాతం ఉంటే, ఎంఐజీ విభాగానికి 44 శాతంగా ఉన్నాయి. మరో 17 శాతం అధిక ఆదాయ వర్గాలు (హెచ్ఐజీ) చెల్లించాల్సినవి’ అని ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.9.07 లక్షల కోట్ల వ్యక్తిగత గృహ రుణాలు మంజూరు కాగా, 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో రూ.4.10 లక్షల కోట్లు జారీ అయినట్టు పేర్కొంది. బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజన 2.0పై చేసిన ప్రకటన, పట్టణీకరణ, డిజిటైజేషన్‌తో గృహ రంగానికి భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. హెచ్ఎఫ్సీలు కీలక పాత్రగృహ కొనుగోలుదారుల విస్తృతమైన అవసరాలను తీర్చడంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) కీలక పాత్ర పోషించినట్టు ఎన్‌హెచ్‌బీ తెలిపింది. అర్హతల ప్రమాణాల్లో వెసులుబాట్లు, బలమైన కస్టమర్ సేవలు, మెరుగైన డాక్యుమెంటేషన్, తక్కువ సమయంలో ప్రాసెస్ చేయడం వంటివి హెచ్‌ఎఫ్‌సీలను మెరుగైన స్థానంలో నిలబెట్టాయని పేర్కొంది. సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకూ గృహ రుణాలను విస్తరించేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు కృషి చేస్తున్నాయంటూ.. బ్యాంక్‌లు–హెచ్ఎఫ్సీల కోలెండింగ్ ఈ దిశగా తీసుకున్న చర్యగా ప్రస్తావించింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్ప్రాంతీయ అసమానతలుహౌసింగ్ రంగం బలమైన వృద్ధిని చూపించినప్పటికీ.. రుణాల మంజూరులో ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాలు హెచ్ఎఫ్సీలకు పెద్ద సవాలుగా ఎన్‌హెచ్‌బీ పేర్కొంది. ‘దక్షిణాది, పశ్చిమాది, ఉత్తరాది రాష్ట్రాల్లోనే అధిక శాతం గృహ రుణాలు మంజూరవుతున్నాయి. అదే సమయంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుణాల జారీ తక్కువగా ఉంటోంది’ అని నివేదిక వివరించింది. ఈశాన్య ప్రాంతంలో హెచ్ఎఫ్సీల శాఖల విస్తరణ తక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. ఈ తారతమ్యాల తగ్గింపునకు చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. -
ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్‌లో అక్టోబర్ నెలలో ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదించింది. మొత్తం 5,894 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నమోదైనట్లు పేర్కొంది. వాటి విలువ సమారు రూ.3,617 కోట్లు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారంహైదరాబాద్‌లో అక్టోబర్ 2024లో మొత్తం రూ.3,617 కోట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14%, ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 28% వృద్ధి కనబరిచింది.అక్టోబర్‌లో మొత్తం 5,894 యూనిట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది ఏడాదివారీగా 2%, నెలవారీగా 20% పెరుగుదల నమోదు చేసింది.సెప్టెంబర్ 17-అక్టోబర్ 2, 2024 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!హైదరాబాద్‌లో రూ.50 లక్షల లోపు విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల రూ .ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల అమ్మకాలు పెరుగుతున్నాయి.ప్రీమియం ఇళ్ల విక్రయాల వాటా అక్టోబర్ 2024లో 10% నుంచి 14%కి పెరిగింది. రూ.కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరిగాయి.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ జరిగిన మొత్తం ఇళ్ల సంఖ్య 65,280. ఇది ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరుగుదలను నమోదు చేసింది.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రూ.40,078 కోట్ల విలువై ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 32 శాతం అధికం. -
ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!
సొంతిల్లు సామాన్యుడి కల.. కొందరికి అది పరువు మర్యాద.. ఇంకొందరికి తలకు మించిన భారం. కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు బంధువుల ఇంటికి వెళితే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావని అడుగుతారు. పిల్లల పెళ్లిల్లు చేసినవారు వెళితే ‘అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా ఇల్లు తీసుకోండి’ అంటారు. సరపడా డబ్బు ఉండి సమాజంలో మరింత గౌరవం కోసం ఇల్లు తీసుకునే వారు కొందరైతే.. సమాజానికి భయపడి పక్కవారికి ఎక్కడ లోకువవుతామోనని ఇల్లు కొనేవారు కొందరు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పుచేసి ఇల్లు కొంటారు. అయితే చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్నవారు ఇల్లు తీసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.సాధారణంగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్ తీసుకుంటారు. వచ్చే జీతంలో సగానికిపైగా ఈఎంఐలకు పోతుంది. కాబట్టి, ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ముందుగా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండాలి.ప్రతినెల వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి.మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి.పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి.ఉద్యోగం చేస్తూంటే ఏదైనా అనివార్య కారణాలతో జాబ్ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు.ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.ఇదీ చదవండి: కంటెంట్ తొలగించకపోతే అరెస్టు తప్పదు!కుటుంబం అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగి మనం చనిపోతే ఈఎంఐలు, అప్పులని ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తారు. కాబట్టి మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి. మనకు ఏదైనా జరిగితే మొత్తం డబ్బును చెల్లించేలా ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. -
ఎక్స్‌యూవీ700 ఫీచర్స్.. ఫ్రీమియం హోసింగ్! ఇదే టార్గెట్
రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'మహీంద్రా లైఫ్‌స్పేస్' తనను తాను ప్రీమియం హౌసింగ్ కంపెనీగా రీబ్రాండ్ చేసుకోవాలని.. ముంబై, పూణె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ కుమార్ సిన్హా అన్నారు.అమిత్ కుమార్ సిన్హా.. మహీంద్రా కార్లను గురించి ప్రస్తావిస్తూ, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన బ్రాండ్ (మహీంద్రా) కార్ల మాదిరిగానే గృహాలను కూడా ఫ్రీమియం సౌకర్యాలతో అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని పేర్కొన్నారు.మహీంద్రా XUV700 కారును ఉపయోగించే వినియోగదారుడు ఎంత అనుభూతి పొందుతాడో.. తప్పకుండా మహీంద్రా లైఫ్‌స్పేస్ గృహాలు కూడా అంత అనుభూతిని అందించేలా రూపొందిస్తామని అమిత్ అన్నారు. మా ప్రాజెక్ట్ నిర్మించే గృహాలు.. ఉత్తమమైన స్థలంలో, పచ్చదనం, కావలసిన సౌకర్యాలను అందిస్తాయని అన్నారు.మహీంద్రా లైఫ్‌స్పేస్ ముంబై, పూణె, బెంగళూరులలో తన ఉనికిని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాయి. దీనికోసం కంపెనీ ఏకంగా రూ. 45000 కోట్లను వెచ్చిస్తోంది. అంతే కాకుండా 2028నాటికి రూ. 8000 కోట్ల నుంచి రూ. 10000 కోట్ల మధ్య ప్రీ-సేల్స్ సాధించడం కంపెనీ లక్ష్యం అని అమిత్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. -
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్ స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్‌లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్‌లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్‌ను కలిగి ఉంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’గూగుల్ తన ఉత్పత్తులను భారత్‌లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ మూడు రోజుల్లోనే గురుగ్రామ్‌లో రూ.5,590 కోట్ల విలువైన 795 లగ్జరీ ఫ్లాట్లు విక్రయించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లో 'డీఎల్ఎఫ్ ప్రివానా వెస్ట్' అనే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా లగ్జరీ ఫ్లాట్లను నిర్మించారు.ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే మొత్తం 795 ఫ్లాట్లు విక్రయించారు. వాటి విలువ రూ.5,590 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 116 ఎకరాల డీఎల్ఎఫ్ టౌన్షిప్లో భాగంగా 12.57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో ప్రివానా సౌత్‌లో నిర్మించిన 1,113 ఫ్లాట్లను మూడురోజుల్లో విక్రయించి రూ.7,200 కోట్లు సమకూర్చుకుంది.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుడీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడుతూ..ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఎక్కువగా ఎన్ఆర్ఐలే కొనుగోలు చేసినట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. కొవిడ్ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రంహోం కల్చర్‌కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు ముంబైలో ఆఫీస్ స్థలం డిమాండ్ 90 శాతం ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 6 శాతం తగ్గి 1.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు -
హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..
నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో రెండు పడక గదుల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర సుమారు రూ.5 వేలు పలుకుతోంది. ఇది బేస్ ధర మాత్రమే. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదికి రూ.70 లక్షల వరకు అవుతుంది. కారు పార్కింగ్, క్లబ్ హౌస్ సభ్యత్వం, గ్యాస్, ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో పది లక్షల వరకు తీసుకుంటున్నారు. 5 శాతం జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్ఫర్ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్ కోసం మరో రూ.పది లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.కోటి పెడితే రెండు పడకల ఫ్లాట్ మాత్రమే వస్తోంది. మరింత విశాలంగా మూడు పడకల గది కావాలన్నా.. పై అంతస్తుల్లో ఉండాలంటే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, తూర్పు, ఉత్తరం వైపు ఫ్లాట్ కావాలన్నా... చెరువు వైపు, గార్డెన్ వైపు ఉన్న బాల్కనీ కావాలన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. వీటితో పాటూ మూడు పడకల ఫ్లాట్ కావాలంటే కోటిన్నర అవుతోంది. ఇదంతా ఐటీ కారిడార్ బయటనే. ఐటీ కారిడార్‌లో అయితే రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగానే జనవరిలో కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. వెయ్యి నుంచి రెండువేల లోపు విస్తీర్ణం కలిగిన వాటి రిజిస్ట్రేషన్లు 71 శాతం జరిగాయి. కొందరు బిల్డర్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల లోపల ఉండే రెండు పడకల గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అఫర్డబుల్ హౌసింగ్ కింద వీటిని పరిగణిస్తారు. జీఎస్టీ 1 శాతమే ఉంటుంది. ఈ తరహా ఇళ్లు రూ.50 లక్షల ధరల్లో వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ విస్తీర్ణంలో కట్టడం లేదు. 2023 జనవరిలో వీటి రిజిస్ట్రేషన్లు 17 శాతం జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో 14 శాతానికి పడిపోయాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ -
హైదరాబాద్‌లో 3 పడకల ఇళ్లకే గిరాకీ.. ఏ ధరకు కొంటున్నారో తెలుసా..
మానవుల జీవనప్రమాణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు నివసించేందుకు ఇళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి రెండు పడక గదుల ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు. దాంతో నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. ఇప్పుడు మాత్రం ధర అధికమైనా సరే మూడు పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటివి ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ-అనరాక్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్ల కొనుగోలుదారుల్లో సగానికి పైగా 3 బీహెచ్‌కే (మూడు పడక గదులు, హాలు, వంటగది) ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. ఏడాది క్రితం 3బీహెచ్‌కే ఇల్లు/ఫ్లాట్ కొనుగోలుకు 42% మందే ఆసక్తి చూపించడం గమనార్హం. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటే ముంబయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2బీహెచ్‌కే వైపే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 1బీహెచ్‌కే ఇళ్లపై ఆసక్తి తగ్గినా, ముంబయి, పుణెలో వీటికి గిరాకీ ఉందని తెలిసింది. పెరిగిన సగటు విస్తీర్ణం పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో, వాటి నిర్మాణాలూ అధికంగానే ఉంటున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సగటు ఫ్లాటు విస్తీర్ణం 11% పెరిగిందన్నారు. 2022లో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1,175 చదరపు అడుగులు ఉండగా, 2023లో 1,300 అడుగులకు చేరుకుందన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. భారీగా అమ్మకాలు.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022తో పోలిస్తే గత ఏడాది ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు 2023లో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణాన్ని డెవలపర్లు ప్రారంభించారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా రూ.45-90 లక్షల ఇల్లు/ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు రూ.90లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది. -
వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..
ఇంకా వేసవికాలం పూర్తిగా రానేలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం దాదాపు 12 నుంచి సాయంత్రం 4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. దాంతో బయట పనులకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అలా అని ఇంట్లో ఉందామంటే కూడా వేడి తాళలేకపోతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు కదా.. దాన్ని భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చల్లదనాన్ని ఇచ్చే పెయింట్లు.. దాదాపు అన్ని ఇళ్లు నిర్మాణానికి కాంక్రీటే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దాంతో ఆ ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్‌ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన కిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్స్ వరకు వినియోగించవచ్చు. దీనివల్ల భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ షీట్స్‌తో రక్షణ.. బస్తీల్లో బిల్డింగ్‌లతోపాటు చాలావరకు రేకుల ఇళ్లు ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించారు. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు. సోలార్ ప్లేట్లతో.. ఇంటిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ అవసరాలకు వాడుకునేలా సోలార్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్‌కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు. ఇదీ చదవండి.. కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! మొక్కలను పెంచడంతో.. ఇంటిపైన ఖాళీ స్థలంలో మొక్కలను పెంచవచ్చు. దాంతో వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. రకరకాల పూలు, అలంకరణ మొక్కలు, కూరగాయలు పెంచుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వాటర్ లీకేజీలు లేకుండా వాటర్‌ఫ్రూపింగ్ చేయించాలి. ఇంటి చుట్టూ మొక్కలు, నీడనిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. -
ఐటీ సిటీలో డబుల్ ట్యాక్స్.. ఇంటి అద్దెలు మరింత పెరుగుతాయా?
బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది. కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ.. ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది. బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. -
ఔటర్ చుట్టూ టౌన్ షిప్ లు..మళ్లీ పరుగులు పెట్టనున్న రియలెస్టేట్
-
హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రోజు రోజుకు రెంట్లు పెంచేస్తుండడంతో అద్దెకట్టేవారికి ఆర్థికభారం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు Work from Home వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు. కొవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కామ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికలోని వివరాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు 15-20 శాతం మేర అధిమయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలిపింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు హౌసింగ్.కామ్ నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్‌తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. 'కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రాపర్టీల కొనుగోలు, అద్దెల డిమాండ్ అధికమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి.' అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్ ఎస్టేట్‌లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్‌లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్‌సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు. మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి. మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్ వేయండి. స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి. -
నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..!
ఉండటానికి సొంతిల్లు ఉన్నా స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ పెరిగింది. హైటెక్‌సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ భవనాల స్థాయిలో గృహాలకు అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో రియల్ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్‌గా ఉన్న మాదాపూర్‌లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య రెంట్లు ఉన్నాయి. స్థలానికి ప్రత్యామ్నాయంగా.. సొంతిల్లు ఉంటే భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా భావించి గతంలో స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలతో ఇల్లు కొంటే వార్షికంగా 4 శాతం రూ.40 వేలు అద్దె వస్తుందని లెక్కకడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం. ఇదీ చదవండి: చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే.. ఎప్పటి నుంచో ఉన్నదే.. అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు. -
2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా..
సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..? క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు. -
ఖరీదైన భవనం కొనుగోలు చేసిన సీఈఓ.. ధర ఎంతంటే..?
భారత్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1,446 కోట్లు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని హైడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబెర్కాన్వే హౌస్‌ను పూనావాలా కొనుగోలు చేశారు. ఈ భవనం 1920 నాటిది. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్‌కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి అదర్ పూనావాలా దీన్ని కొనుగోలు చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. లండన్‌లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. లండన్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డుల్లో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్‌కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్‌కు చెందిన ఓ కీలక పదవిలోని వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్హౌజ్గా వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ లండన్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాఅజిజ్కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు(రూ.2100 కోట్లు)కు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్’గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పునావాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హనోవర్లాడ్జ్ (రూ.1180 కోట్లు) నిలిచింది. -
దానికదే పగుళ్లు పూడ్చుకునే కాంక్రీటు..!
భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..! ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్‌తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా భవనాల డిజైన్‌లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్ మల్టిపుల్’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్, కిచెన్.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్ మల్టిపుల్ బావుంటుంది. ఎఫెక్టివ్ మల్టిపుల్ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్ వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్‌లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్‌లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్‌కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్‌ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్‌లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్‌కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజె క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంపై 111 జీవో ఎత్తివేత ప్రభావం గట్టిగానే పడనుంది. చదరపు అడుగు (చ.అ.) రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కస్టమర్లు పునరాలోచనలో పడ్డారు. ఎక్కువ ధర పెట్టి అపార్ట్మెంట్లలో కొనుగోలు చేసే బదులు అదే ధరకు 111 జీవో పరిధిలోని గ్రామాలలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనుగోలు చేయవచ్చనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హైరైజ్, లగ్జరీ ప్రాజెక్ట్‌లలో విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమంలో 50 వేల యూనిట్లు.. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పశ్చిమ హైదరాబాద్ కీలకమైనది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల కారణంగా ఈ ప్రాంతాలలో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఏటా హైదరాబాద్‌లోని రియల్టీ క్రయవిక్రయాలలో వెస్ట్ హైదరాబాద్ వాటా 60 శాతం ఉంటుంది. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటివి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో సుమారు 10 కోట్ల చ.అ.లలో నివాస సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో రద్దుతో ఆయా ప్రాజెక్ట్‌ల డెవలపర్లు డోలాయమానంలో పడ్డారు. ప్రీలాంచ్ నిర్మాణాలకు బ్రేక్.. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ వంటి వెస్ట్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో డెవలపర్లు ప్రీలాంచ్లో విక్రయాలు చేశారు. ధర తక్కువకు వస్తుంది కదా అని కొనుగోలుదారులూ ఎగిరి గంతేసి బిల్డర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్‌లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. గత 3–4 నెలలుగా మార్కెట్ ప్రతికూలంగా మారడంతో లగ్జరీ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. విక్రయాలు లేకపోవటం, నిధుల లేమి కారణంగా చాలా వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నెమ్మదించాయి. తాజాగా 111 జీవో రద్దు ప్రకటించిన నాటి నుంచే పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రీలాంచ్లోని పలువురు కస్టమర్లు డెవలపర్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డెవలపర్లను కోరుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి తెలిపారు. స్పష్టత వచ్చేదాక స్తబ్ధుగానే.. జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చిన జీవో 111ను ప్రభుత్వం ఎత్తేసి 69 జీవో తీసుకొచ్చినా స్థానిక భూ యజమానులు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వెంటనే భూములు అమ్మడానికి ఆసక్తి చూపడంలేదు. నగరానికి అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో మునుముందు భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ జోన్, బఫర్ జోన్లు చేస్తామని ప్రకటించింది. దీంతో ఏయే ప్రాంతాలు గ్రీన్ జోన్లో ఉంటాయి? ఏ ప్రాంతాలు బఫర్ జోన్లో ఉంటాయనే విషయంలో స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు భూములు ఎందుకు అమ్ముకోవాలని రైతులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అవసరాల కోసం కొందరు రైతులు భూములు అమ్మకానికి పెట్టినా గతం కంటే ఎక్కువ ధరలే చెబుతున్నారు. జీవో 69 విధివిధానాలను మాత్రం ఖరారు చేయలేదు. భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై స్పష్టత వస్తే ఇక్కడి భూములకు మరింత గిరాకీ ఉంటుంది. ప్రభావిత ప్రాంతాలివే.. కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, ఖానామెట్, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ వంటి 111 జీవో పరిధిలోని 10 కి.మీ. క్యాచ్మెంట్ ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండున్నర దశాబ్ధాల కలను ప్రభుత్వం సాకారం చేసింది. 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులోకి వస్తుంది. ఆహ్వానించదగ్గ పరిణామమే.. కానీ, ఆ ఫలాలు నిజంగా స్థానిక రైతులకు అందుతాయా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిర్మాణ నిబంధనల సాకు చూపి ఇప్పటికే 60 శాతానికి పైగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో జీవో రద్దు ఫలాలు ఎవరికి దక్కుతాయనేది సుస్పష్టం. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం -
చిట్ వద్దు, ఫైనాన్స్ వద్దు.. జాగా కొంటే.. అదే ముద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: కోవిడ్ తదనంతర పరిణామాలతో ప్రజలు నగదు నిల్వలకు వెనుకంజ వేస్తున్నారు. నగదు నిల్వల కంటే చర, స్థిరాస్తులపై పెట్టుబడికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏదో ఆరోగ్యం, విద్య వంటి అత్యవసరాలకు తప్పించి నగదు తమ వద్ద ఉంచుకోవాలనే ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపన్నుల నుంచి ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు ఎవరిని కదిపినా ఇదే మాట చెబుతున్నారు. ఇంతవరకు కొంతమంది నాలుగు లక్షల రూపాయలు కూడబెడితే చాలు రూ.2 వడ్డీకి అప్పు ఇచ్చి నెలనెలా వచ్చే సొమ్ముతో కాలక్షేపం చేసేవారు. కోవిడ్ సమయంలో సంభవించిన మరణాలు, అనంతరం పెరుగుతున్న హఠాన్మరణాలతో వడ్డీ మాట దేవుడెరుగు.. కనీసం అసలు కూడా తిరిగి రావడం లేదని వారంతా గగ్గోలు పెడుతున్నారు. అభద్రతతో ఆందోళన దీనికితోడు మార్గదర్శి వంటి చిట్‌ఫండ్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు, కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ప్రజల నుంచి కోట్లు డిపాజిట్లు సేకరించి నిధులు తమ అవసరాలకు మళ్లిస్తున్నాయి. కొన్ని బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ పరిణామాలతో డబ్బులు దాచుకున్న వారిలో కూడా అభద్రతాభావం వచ్చేసింది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని నగదు నిల్వ పెంచుకోవడం కంటే భూములు, ఇళ్ల కొనుగోలు మేలు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్థిరాస్తులు కూడబెట్టుకుంటే ఏ క్షణాన అవసరం వచ్చినా బ్యాంకుల్లో కుదవ పెట్టుకుని అప్పటికప్పుడు సొమ్ము తెచ్చుకోవచ్చుననే ఒక భరోసా ఇందుకు ప్రధాన కారణం. అప్పులు ఇచ్చి అసలు కోసం పోలీసు స్టేషన్లు, ప్రైవేటు సెటిల్మెంట్ల కోసం తిరగడం కంటే భూములు, ప్లాట్లు, ఇళ్లు కొనుక్కుని పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని భావిస్తున్నారు. రెండు మూడేళ్లకే రేట్ల పెరుగుదల నాలుగు డబ్బులు వెనకేసుకునేవారి ఆలోచనలు మారడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూములు, ప్లాట్లు క్రయ, విక్రయాలు పెరుగుతున్నాయి. ఏటా రిజిస్ట్రేషన్లు కూడా రెట్టింపవుతున్నాయి. బడా బాబులు భారీగా భూములు కొనుగోలు చేస్తుంటే, ఎగువ ..దిగువ మధ్య తరగతి వర్గాలు కుటుంబ పోషణ పోగా మిగుల్చుకున్న కొద్దిపాటి సొమ్ముతో 100, 150 గజాలు కొనుగోలు చేస్తున్నారు. గజం రూ.15వేలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాల రేట్లు రెండు, మూడేళ్లకే పెరిగిపోతున్నాయి. దీంతో ఇది లాభార్జనగా ఉంటుందని మధ్యతరగతి వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఇలా కొనుగోలు చేసిన స్థలాలు భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలకు కలసి వస్తాయని వారు చెబుతున్నారు. సరళతరంగా బ్యాంకుల్లో వస్తున్న రుణాలు తీసుకుని మరీ స్థలాలు కొనుగోలు చేస్తున్న వారూ లేకపోలేదు. బడాబాబులు, కాంట్రాక్టర్లు, అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు సైతం రికవరీ చేసి స్థలాలపై పెట్టుబడి పెడుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత.. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం సహా రామచంద్రపురం, మండపేట, తుని, సామర్లకోట వంటి పట్టణాల పరిసర ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల క్రయ, విక్రయాలు ఇటీవల రెట్టింపయ్యాయి. హాట్‌కేక్‌లుగా అమ్ముడు పోయే ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలుకు నాడు జిల్లా నలుమూలల నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. పునర్విభజన తరువాత కాకినాడతో పాటు అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రాలయ్యాయి. ఇప్పుడు వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల భూములు రియల్ ఎస్టేట్లుగా ఎక్కువ రూపాంతరం చెందుతున్నాయి. అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో స్థలాల విలువ రెట్టింపు అయింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్లు కోనసీమ కేంద్రం అమలాపురానికి ఆనుకుని ఎర్రవంతెన, కామనగరువు, ఈదరపల్లి, పేరూరు, భట్నవిల్లి, బండార్లంక, రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు నుంచి తొర్రేడు, మధురపూడి విమానాశ్రయం రోడ్డు నుంచి గాడాల, లాలాచెరువు నుంచి దివాన్‌చెరువు, జాతీయ రహదారి నుంచి శ్రీరామపురం రోడ్డు, రాజవోలు, సంపత్‌నగర్ వరకు నివాసప్రాంతాలుగా విస్తరిస్తున్నాయి. కాకినాడకు ఆనుకుని మేడలైన్, చీడిగ, కొవ్వాడ, తూరంగి, పెనుగుదురు, సర్పవరం, గైగోలుపాడు, ఏపీఎస్పీ, అచ్చంపేట వాకలపూడి వరకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల విభజన జరుగుతుందనే ముందుచూపుతో గడచిన రెండేళ్లుగా జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఐదారు కిలోమీటర్ల వరకు భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. పట్టణానికి సమీపాన నాలుగైదు కిలోమీటర్ల వరకు ఖాళీగా ఉన్న పంట భూములు రియల్ ఎస్టేట్లుగా మారి నివాసప్రాంతాలు అవుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఆదాయ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిజిస్ట్రేషన్, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజులు ఆదాయం 2018–19 1,48,213 541.74 కోట్లు 2019–20 1,91,191 592. 07 కోట్లు 2020–21 1,67,095 638.21 కోట్లు 2021–22 2,44,695 907.16 కోట్లు 2022–23 2,66,233 886.88 కోట్లు భవిష్యత్తుకు భరోసాగా భూములపై పెట్టుబడి భూములు, స్థలాలు, ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టడమంటే అన్ని వర్గాల ప్రజలు భరోసాగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తరువాత పరిణామాలతో ప్రజల ఆలోచనా విధానం మారింది. భూములపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో వాటి విలువ పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదనే నమ్మకం ఏర్పడింది. దీంతో స్థిరాస్థులపైనే ఎక్కువగా డబ్బు పెడుతున్నారు. – ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కాకినాడ. కొనుగోలు భద్రతనిస్తోంది భూమి కొనుగోలు కుటుంబానికి భద్రతనిస్తుంది. గతంలో బ్యాంకులో భద్రపరుచుకోవడం, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం చేసేవారు. కొన్ని సొసైటీలు రాత్రికి రాత్రే ఎత్తివేయడం, వడ్డీకి తీసుకునేవారు తిరిగి ఇచ్చే విషయంలో ఏర్పడే సమస్యలతో విసుగెత్తిపోయారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న భూమి రేట్లను దృష్టిలో పెట్టుకుని భూములు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. – జాడ అప్పలరాజు, దస్తావేజు లేఖరి, కాకినాడ విలువ పెరుగుతుందనే కొన్నాను రెక్కల కష్టం మీద కుటుంబం నెట్టుకొస్తున్నాను. కూడబెట్టిన కొద్దిపాటి సొమ్మును భూమిపై పెట్టడం మంచిదనుకున్నాను. మున్ముందు ఆ భూమి విలువ పెరుగుతుందని 100 గజాల స్థలాన్ని కొన్నాను. ఎక్కడైనా బ్యాంకులో వేద్దామన్నా నమ్మకం కుదరడం లేదు. ఇవన్నీ ఆలోచించే పెట్టిన సొమ్ముకు భరోసాతోపాటు, ధరలు కూడా పెరుగుతాయని జాగా కొనుక్కున్నాను. – డి.రమేష్, ఇంద్రపాలెం, కాకినాడ -
రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ: భారత్‌లో జనవరి–మార్చిలో ఎనమిది ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం స్థిర డిమాండ్‌ను నమోదు చేసిందని రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ‘2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో గృహాల విక్రయాలు 1 శాతం ఎగసి 79,126 యూనిట్లు నమోదయ్యాయి. గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో 19 శాతం పెరిగి 8,300 యూనిట్లు, చెన్నై 8 శాతం వృద్ధితో 3,650 యూనిట్లుగా ఉంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కార్యాలయాల స్థూల లీజింగ్ 5 శాతం దూసుకెళ్లి 1.13 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 46 శాతం క్షీణించి 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఎనమిది నగరాల్లో గృహాల ధరలు 1–7 శాతం అధికం అయ్యాయి. బెంగళూరులో 7 శాతం, ముంబై 6, హైదరాబాద్, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. ఆఫీసుల అద్దె 2–9 శాతం హెచ్చింది. కోల్‌కతలో 9 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 5 శాతం దూసుకెళ్లాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2023లో ఆఫీస్ మార్కెట్ సానుకూలంగా అడుగు పెట్టడానికి సహాయపడింది. 2023 మొదటి త్రైమాసికంలో అమ్మకాల స్థాయి నిలకడగా ఉన్నందున పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల నేపథ్యంలో గృహాల మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. కొన్ని నెలలుగా గృహ కొనుగోలుదార్ల కొనుగోలు సామర్థ్యం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ సొంత ఇంటి ఆవశ్యకత డిమాండ్‌ను పెంచుతూనే ఉంది. మధ్య, ప్రీమియం గృహ విభాగాలు ఈ నగరాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఏడాది కూడా పరిమాణం పెంచుతాయని ఆశించవచ్చు’ అని వివరించింది. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్, వందల కోట్లలో పెట్టుబడులు
సింగపూర్‌కు చెందిన ప్రముఖ డైవర్సిఫైడ్ రియల్ఎస్టేట్ సంస్థ క్యాప్టాల్యాండ్ (CapitaLand) వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టుంది. పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్‌లో రూ.1200కోట్లతో డేటా సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా క్యాప్టాల్యాండ్ తన భవిష్యత్ కార్యచరణ వివరించింది. . రానున్న 5 - 7 సంవత్సరాల్లో పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కింద రూ.5వేల కోట్లు, డేటా సెంటర్, ఆఫీస్ స్పేప్రాజెక్ట్ కింద మొత్తంగా రూ.6,200కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా క్యాప్టాల్యాండ్ యాజమాన్యం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. Very Happy to announce that @CapitaLand is investing in a Data Center in Hyderabad with a capacity of 36 MW and an investment ₹1200 Crores scheduled to be developed and deployed by the end of 2024 MoU signed today for the same#HappeningHyderabad pic.twitter.com/mEOohSWRQs — KTR (@KTRTRS) December 6, 2022 -
రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా
రుణాల ఎగవేతలో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. మొత్తం మీద పాతిక్కి పైగా కంపెనీలు తాము జారీ చేసిన బాండ్లకు చెల్లింపులు చేయకుండా చేతులెత్తేసినట్లు సమాచారం. మరి కొన్ని కంపెనీలు అనుకున్న షెడ్యూల్ సమయానికి ఇవ్వకుండా నాన్చి ఆలస్యంగా చెల్లింపులు చేశాయి. దీంతో వినియోగదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. షాంఘైకి చెందిన షిమో గ్రూప్ రియల్ కంపెనీ బిలియన్ డాలర్ల విలువ జేసే బాండ్లకు వడ్డీయే కాదు అసలు కూడా ఎగ్గొట్టింది. (చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?) చైనాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన షిమోయే ఇలా ఎగ్గొడితే ఇక చిన్నా చితకా రియల్ కంపెనీల సంగతేంటి? అని ఆర్ధిక రంగ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీకు 5.5 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ అప్పులూ ఉన్నాయి. ఎవర్ గ్రాండే సంక్షోభం వెలుగులోకి వచ్చిన తర్వాత జింగ్ పింగ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆంక్షలను కఠిన తరం చేయడంతో చాలా రియల్ కంపెనీలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. జిన్ పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వాయు వేగంతో పెరిగిపోయింది. ఏకంగా 600 శాతం మేరకు పెరిగిపోయింది. దీనికి కారణం మితిమీరిన ప్రమోషన్లే. ఆకర్షణీయమైన వెంచర్లను ప్లాన్ చేస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆశ్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో అప్పులు సమీకరిస్తోన్న రియల్ వ్యాపారులు తమ ఇళ్లు అమ్ముడు పోక తమకు రావల్సిన డబ్బులు చేతికి రాక పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్దాక్షిణ్యంగా బోర్డులు తిప్పేస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ పెట్టుబడి దారులూ నష్టపోవలసి వస్తోంది. నిజానికి 1998 వరకు చైనాలో ఇళ్ల విక్రయాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. అప్పట్లో మూడింట ఒక వంతు మాత్రమే నగరాల్లో ఉండేవారు. ఆ తర్వాత నిబంధనలు సరళీకృతం చేయడంతో నగరీకరణ వేగం పుంజుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న సంక్షోభం చైనా పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎందుకంటే రియల్ వ్యాపారం ఢమాల్ మంటే అది చైనా ఆర్ధిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. (ఇంకా ఉంది..పడిపోతున్న ప్రాపర్టీ మార్కెట్‌ను రక్షించే ప్రయత్నాల్లో "బిల్డ్, పాజ్.. డిమాలిష్..రిపీట్ " విధానాన్ని అవలంబించిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వరస కథనాలు ) -
Hyderabad: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేశారు. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వాసవి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవీ గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను, సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. చదవండి: (హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే) -
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు.. రియల్ ఎస్టేట్‌పై తగ్గిన ఆసక్తి!
న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. నైట్ ఫ్రాంక్ ఇండియా, నారెడ్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ సూచీ క్యూ2లో 62 పాయింట్లకు పరిమితమైంది. జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ1) ఇది 68గా నమోదైంది. డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలపై సర్వే ప్రాతిపదికన ఈ సూచీలో స్కోరు ఉంటుంది. 50కి ఎగువన ఉంటే సెంటిమెంటు ఆశావహంగా ఉన్నట్లు, సరిగ్గా 50 ఉంటే యథాతథంగా లేదా తటస్థంగా ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే నిరాశ ధోరణిలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది మే, జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గిందని వివరించాయి. వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత, భవిష్యత్ సూచీలు రెండూ 50కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు వచ్చే ఆరు నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్ ఫ్రాంక్–నారెడ్కో నివేదికలో పేర్కొన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్‌లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ♦రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లు గత 8–10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు. ♦కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3–4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. -
కరోనాలోనూ 'రియల్' దూకుడు! రూ.65,000 కోట్లకు రియల్టీ!
కోల్‌కతా: రియల్ ఎస్టేట్ పరిశ్రమ 2024 నాటికి రూ.65,000 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2025 నాటికి దేశ జీడీపీలో రియల్టీ పరిశ్రమ వాటా 13 శాతానికి చేరుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2019లో రూ.12,000 కోట్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనాకు సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ.. 2022లో మార్కెట్ సానుకూలంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ ఆధారిత ఎకోసిస్టమ్ ఉన్న కార్యాలయ వసతులకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. డెవలపర్లు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, డిజిటల్ చానల్స్ ద్వారా వినియోగదారులను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. భారత రిటైల్ పరిశ్రమ 2021–2030 మధ్య 9 శాతం చొప్పున వృద్ది చెంది 2026 నాటికి 1400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. భారతీయులు ఆన్లైన్ రిటైల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని, 2024 నాటికి దేశ ఈ కామర్స్ పరిశ్రమ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. వేర్ హౌసింగ్ (గోదాములు) రియల్ ఎస్టేట్ ఇక మీదటా వృద్ధిని చూస్తుందని, ఈ కామర్స్ విస్తరణ కలసి వస్తుందని.. ఈ విభాగంలో లావాదేవీలు 20 శాతం వృద్ధిని చూస్తాయని పేర్కొంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశ ఫైనాన్షియల్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తుంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. చదవండి👉హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
ఎగబడి కొంటున్న జనం! హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు యమ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాత్రికి రాత్రే పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలను కొనలేరని స్థిరాస్తి నిపుణులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏవీ పట్టించుకోకుండా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటూ మార్కెట్ విలువలను కూడా పెంచేసింది. ఫలితంగా గత నెలలో నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మధ్య తరగతి గృహాల మార్కెట్‌గా పేరొందిన హైదరాబాద్ రియల్టీపై రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయం గట్టి దెబ్బే వేసింది. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్మెంట్లపై రిజిస్ట్రేషన్ చార్జీల పెరుగుదల ఎక్కువ ప్రభావం చూపించింది. గత నెలలో ఈ కేటగిరీ కేవలం 844 అపార్ట్మెంట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే గతేడాది ఫిబ్రవరిలో ఈ విభాగంలో 2,888 ఫ్లాట్లు అమ్ముడుపోవటం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో నగరంలోని గృహ విక్రయాలలో రూ.25 లక్షలలోపు ధర ఉన్న అపార్ట్మెంట్ల వాటా 42% కాగా.. ఈ ఏడాది ఫిబ్ర వరి నాటికిది 16%కి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో చూస్తే ఈ విభాగం విక్రయాల వాటా 32 శాతంగా ఉంది. క్షీణత రెండోసారి: 2022 ఫిబ్రవరిలో నగరంలో రూ.2,722 కోట్ల విలువ చేసే 5,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇందులో 52 శాతం యూనిట్లు రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్నవే. కాగా.. ఈ ఏడాది జనవరిలో రూ.2,695 కోట్ల విలువ చేసే 5,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 6,877 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 25 శాతం తగ్గాయి. సేల్స్‌లో క్షీణత నమోదవటం 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇది రెండోసారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు డిమాండ్: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అపార్ట్మెంట్ విక్రయాలలో హైదరాబాద్ వాటా 20 శాతం ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 10 శాతానికి క్షీణించింది. మేడ్చల్–మల్కాజ్గిరి వాటా 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డి వాటా 37 శాతం నుంచి 43 శాతానికి, సంగారెడ్డి వాటా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి. "రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల విక్రయాలు గతేడాది ఫిబ్రవరిలో 34 శాతం ఉండగా.. ఇప్పుడవి 52 శాతానికి వృద్ధి చెందాయి. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 7 శాతం నుంచి 9 శాతానికి, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ విక్రయాలు 7 శాతం నుంచి 9 శాతానికి" పెరిగాయి. 16 శాతం డౌన్: గతేడాది ఫిబ్రవరిలోని గృహ విక్రయాలలో 1,000 చ.అ.లోపు విస్తీర్ణం ఉండే మధ్యతరగతి అపార్ట్మెంట్ల వాటా 19% ఉండగా.. ఇప్పుడవి 16 శాతానికి పడిపోయాయి. గత నెలలోని అమ్మకాలలో 74 శాతం అపార్ట్మెంట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలున్నవే. 2021 ఫిబ్రవరిలో వీటి వాటా 70%గా ఉంది. అలాగే 2,000 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన గృహాలు కూడా 10% నుంచి 11%కి వృద్ధి చెందాయి. చదవండి: దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్ -
మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!!
ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. మీరు కోరుకున్న విధంగా ఈ సంవత్సరంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 3.85 లక్షల గృహ నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం..2020లో 2.14 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. 2021 ప్రథమార్ధంలో సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాదిలో మొదటి ఏడు నగరాల్లో దాదాపు 2.78 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని తేలింది. ►2021లో పూర్తి చేసిన మొత్తం ఇళ్లలో గరిష్టంగా ఎన్‌సిఆర్‌లో దాదాపు పూర్తయ్యాయి. గతేడాది ఎన్సీపీఆర్లో 86,590 యూనిట్లు ఉండగా..2020లో 47,160యూనిట్లు పూర్తయ్యాయి. అంటే గతేడాది ఇళ్ల నిర్మాణం 2020 కంటే దాదాపు 84% ఎక్కువ. ►ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో సుమారుగా. 2021లో 70,490 యూనిట్లు పూర్తికాగా 2020లో 54,720 యూనిట్లు పూర్తయ్యాయి. ►పూణెలో సుమారు. 2021లో 46,090 యూనిట్లు పూర్తికాగా 2020లో 40,840 యూనిట్లు పూర్తయ్యాయి. ►బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఇళ్లనిర్మాణాలు సమానంగా ఉన్నాయి. 2021లో 63,870 యూనిట్లు పూర్తికాగా 2020లో 59,730 యూనిట్లు పూర్తయ్యాయి ►కోల్‌కతాలో 2020లో 11,920 పూర్తి కాగా 2021లో 11,620 యూనిట్లు పూర్తయ్యాయి. పరిశోధన ఫలితాలపై అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. “2022లో టాప్ 7 నగరాల్లో 3.85 లక్షల యూనిట్లను పూర్తి చేయాలని డేటా సూచిస్తుందని అన్నారు. చాలా నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని, థర్డ్ వేవ్ ప్రభావం రియాల్టీమీద చాలా తక్కువగా ఉందని పూరి చెప్పారు. దీంతో 2022లో ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. డెవలపర్లు కొత్త వాటిని ప్రారంభించే ముందు గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
ముంబై: బ్లూచిప్ స్టాక్స్‌తో పోలిస్తే రియల్టీ డెవలపర్లు తక్కువ రిటర్నులతోనే నెట్టుకొస్తున్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. అందుబాటు ధరల హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు మాత్రమే స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్‌కు వెళ్లగలవని అభిప్రాయపడ్డారు. ఆశించిన స్థాయిలో అమ్మకాల పరిమాణాన్ని సాధించగలగడం దీనికి కారణమని తెలియజేశారు. డీఎల్ఎఫ్, మాక్రో డెవలపర్స్ తదితర కొద్ది సంస్థలు మాత్రమే లిస్టింగ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ షేరును తీసుకుంటే ఒకప్పుడు రూ.1,300 ధర నుంచి రూ.80కు పడిపోవడాన్ని ప్రస్తావించారు. ఇది రియల్టీ విభాగంలోని రిస్కులను వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశ పేరుతో ఇటీవల విమానయాన కంపెనీ ఏర్పాటుకు తెరతీసిన ఝున్‌ఝున్‌వాలా.. రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్టాక్ మార్కెట్, తదితర బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఆధారపడలేం తాను రియల్టీ డెవలపర్‌ను అయి ఉంటే కంపెనీని లిస్టింగ్ చేయబోనంటూ రాకేష్ వ్యాఖ్యానించారు. అనిశ్చితులతో కూడిన బిజినెస్ కావడమే దీనికి కారణమని తెలియజేశారు. రియల్ఎస్టేట్ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో రాకేష్ ప్రసంగించారు. బ్లూచిప్ స్టాక్స్ 18–25 శాతం లాభాలను అందిస్తున్న సమయంలో 6–7 శాతం రిటర్నులకు పరిమితమయ్యే రియల్టీని లిస్టింగ్ చేయడంలోని ఔచిత్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)లు, కమర్షియల్ రియల్టీ పట్ల ఇన్వెస్టర్లు ఆశావహం(బుల్లిష్)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ సర్వీసులు, ఫార్మా తదితర రంగాలు వీటికి దన్నునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో పెట్టుబడులు గతంలో ఐదు రియల్టీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసినట్లు రాకేష్ వెల్లడించారు. తద్వారా లాభాలు ఆర్జించినట్లు తెలియజేశారు. ఇల్లు కొనుగోలుకి ఆసక్తి పెరుగుతున్నదని, ఇకపై రియల్టీ రంగానికి ఆశావహ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. తాను కూడా 2006లో ఇంటి కొనుగోలు కోసం క్రిసిల్ షేర్ల విక్రయం ద్వారా రూ.20 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే ఈ వాటాను విక్రయించకుంటే ఈరోజు మరో రూ.1,000 కోట్ల సంపదను ఆర్జించేవాడినని తెలియజేశారు. కాగా.. ఆకాశ పేరుతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. పలు యూరోపియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు దెబ్బతిన్న సమయంలో ప్రారంభమైన ర్యాన్ ఎయిర్ తొలి రోజునుంచే లాభాలు ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా రాకేష్ ప్రస్తావించారు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించినట్లే ఆకాశ సంస్థను విజయవంతం చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
కొనుగోలుదారులకు భారీ షాక్!! పెరగనున్న ఇళ్ల ధరలు..రీజనేంటి?ఎవరికి దెబ్బ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు..కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది. 2021 జూలై నుంచి డిసెంబర్ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్ వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో వడ్డీ రేట్లు పెరగడం కొనుగోళ్ల వ్యయాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తం అయింది. ఇంటి యజమానులు కావాలన్న ధోరణిలోనూ పెరగుదల కనిపించింది. 63 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ 2021 ద్వితీయ ఆరు నెలల్లో 40% నుంచి 27 శాతానికి తగ్గింది. 32% మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుపడింది!!వందల కోట్ల పెట్టుబడులు షురూ!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రియల్టీ రంగ కంపెనీ డీబీ రియల్టీలో ఇన్వెస్ట్ చేయనున్నారు. భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేర్ ఇన్వెస్ట్మెంట్స్ సైతం కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నారు. రుణరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు వీలుగా వారంట్ల జారీ ద్వారా రూ.1,575 కోట్లు సమీకరించనున్నట్లు డీబీ రియల్టీ వెల్లడించింది. ప్రమోటర్ గ్రూప్‌సహా ఇతర ఇన్వెస్టర్లకు దశలవారీగా ఈక్విటీ షేర్లుగా మార్పిడయ్యే 12.7 కోట్ల వారంట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇటీవలే డీబీ రియల్టీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనకు స్వస్తి నేపథ్యంలో రాకేష్ కుటుంబ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. -
కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు.. కోరుతుందేంటి?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు పెట్టుకుంది. స్థిరాస్తి రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడంతో పాటూ సులభతర ఆర్థిక లభ్యత, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివి ప్రకటించి దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి చేదోడుగా నిలవాలని పరిశ్రమ వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. నివాస విభాగంలో డిమాండ్‌ను పెంచాలంటే పలు కీలక ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి. అందులోని పలు కీలకాంశాలు.. అఫర్డబుల్ హౌసింగ్ ధరలలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆస్తి పరిమాణం, ధర, కొనుగోలుదారుల ఆదాయం ఆధారంగా అందుబాటు గృహాల నిర్వచనాన్ని కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ నిర్వచించింది. నాన్-మెట్రోపాలిటన్ సిటీలు, నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ 90 చ.మీ. వరకు కార్పెట్ ఏరియాతో ఉండాలి. ప్రధాన నగరాల్లో అయితే 60 చ.మీ. కార్పెట్ ఏరియా. ఈ రెండింటికీ ధర రూ.45 లక్షల లోపు ఉండాలి. రానున్న బడ్జెట్లో ఈ విభాగాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది కస్టమర్లు ఈ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే నగరాల వారీగా ధరల పరిమితులను సవరించాల్సిన అవసరం ఉంది. 90, 60 చ.మీ. కార్పెట్ ఏరియా యూనిట్ల పరిమాణం బాగానే ఉన్నప్పటికీ.. ధర రూ.45 లక్షలు అనేది చాలా నగరాలలో ఆచరణయోగ్యంగా లేవు. ఉదాహరణకు ముంబైలో రూ.45 లక్షల బడ్జెట్ అనేది చాలా తక్కువ అందుకే దీన్ని రూ.85 లక్షలకు పెంచాలి. ఇతర నగరాల్లో రూ.60-65 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. ధరల సవరణతో ఎక్కువ గృహాలు అఫర్డబులిటీ కిందకి వస్తాయి. దీంతో కొనుగోలుదారులు 1 శాతం జీఎస్టీ, ప్రభుత్వ రాయితీలు, వడ్డీ చెల్లింపులతో కలిపి మొత్తం రూ.3.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు వంటి బహుళ ప్రయోజనాలను పొందుతారు. పెద్ద మొత్తంలో అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించేందుకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను కేటాయించాలి. భారీ పరిశ్రమల శాఖ, రైల్వేలు, పోర్ట్ ట్రస్ట్‌లు మొదలైన వాటి పరిధిలోకి వచ్చే నగరాల్లోని కొన్ని భూములను సంబంధిత ప్రభుత్వ సంస్థలు విడుదల చేయాలి. తక్కువ ధరతో భూమి లభ్యత పెరిగితే ప్రాపర్టీ ధరలను నియంత్రించవచ్చు. గత బడ్జెట్లో అందించిన అఫర్డబుల్, అద్దె గృహాల రుణాలపై రూ.1.5 లక్షల అదనపు మినహాయింపు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. దీన్ని మరో ఏడాది పాటు పొడిగించాలి. దీంతో ఈ విభాగంలో సరఫరా పెరుగుతుంది. అనరాక్ నివేదిక ప్రకారం గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలోని మొత్తం గృహాల సరఫరాలో 26 శాతం అఫర్డబుల్ హౌసింగ్లే ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ రేట్లపై రూ.2 లక్షల పన్ను రాయితీని రూ.5 లక్షలకు పెంచాలి. పన్ను రేట్లలో కోత లేదా సవరించిన పన్ను శ్లాబ్‌ల ద్వారా వ్యక్తిగత పన్ను ఉపశమనం ప్రకటించాలి. ప్రత్యేకించి సెక్షన్ 80సీ(ఏడాదికి రూ.1.5 లక్షలకు) కింద తగ్గింపు పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. రానున్న బడ్జెట్లో ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు!) -
దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్
సామాన్యుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనే కోరిక రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ ప్రాపర్టీ సంస్థ అనరాక్ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం గతేడాది మనదేశానికి చెందిన 7 ప్రధాన నగరాల్లో 71 శాతం ఇళ్ల అమ్మకాలు జరగ్గా..మొత్తం 2,36,530 యూనిట్ల ఇళ్ల సేల్స్ జరిగాయని తెలిపింది. 2019లో 2,61,358 యూనిట్లు, 2020లో 1,38,350 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు అనరాక్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పండగ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అనరాక్ డేటా ప్రకారం..ఫెస్టివల్ సీజన్, పలు బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీరేట్లు తగ్గిస్తూ భారీ ఆఫర్లు ప్రకటించాయి. అప్పటికే సొంతింటి కోసం దాచుకున్న డబ్బులు, బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో.. ఔత్సాహికులు భారీ ఎత్తున ఇళ్లను కొనుగోలు చేశారు. దీంతో నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 2020 కంటే 2021లో 39శాతం ఇళ్లు భారీ ఎత్తున అమ్ముడయ్యాయి. అనరాక్ వార్షిక డేటా ►అనరాక్ వార్షిక డేటా ప్రకారం..ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 2021లో 72 శాతం పెరిగి 76,400 యూనిట్లకు చేరాయి,అంతకుముందు సంవత్సరంలో 44,320 యూనిట్లు ఉన్నాయి. ►హైదరాబాద్‌లో విక్రయాలు 2020లో 8,560 యూనిట్ల నుంచి దాదాపు 3రెట్లు పెరిగి 25,410 యూనిట్లకు చేరుకున్నాయి. ►ఢిల్లీ-ఎన్సీఆర్లో అమ్మకాలు 2020లో 23,210 యూనిట్ల నుండి 2021లో 73శాతం పెరిగి 40,050 యూనిట్లకు చేరుకున్నాయి. ►పుణేలో ఇళ్ల అమ్మకాలు 2020లో 23,460 యూనిట్ల నుండి 2021లో 53శాతం పెరిగి 35,980 యూనిట్లకు పెరిగాయి. ►బెంగళూరులో 2020లో 24,910 యూనిట్ల నుండి 2021లో 33,080 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. ►చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 2020లో 6,740 యూనిట్ల నుంచి 2021లో 86శాతం పెరిగి 12,530 యూనిట్లకు చేరుకున్నాయి. ►కోల్‌కతాలో 2020లో 7,150 యూనిట్ల నుంచి 2021లో 13,080 యూనిట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ..2022లో ఇళ్ల అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్,సప్లై చైన్ సమస్యలు ప్రాపర్టీ ధరలు 5-8 శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: హాట్ కేకుల్లా..! హైదరాబాద్‌లో ఎక్కువగా ఇళ్లు అమ్ముడవుతున్న ప్రాంతాలివే! -
భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు, కారణం అదేనా..!
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్యమైన కార్మికుల వ్యయం పెరిగిన నేపథ్యంలో దాని ప్రభావం రియల్టీ మార్కెట్లపై పడనుంది. సమీప భవిష్యత్తులో ప్రాపర్టీ ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని డెవలపర్ల సంఘాలు తెలిపాయి. నిర్మాణ సామాగ్రిపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించి ఉపశమనాన్ని కలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ప్రాపర్టీల ధరలు 10–20 శాతం పెరిగాయని ట్రెహాన్ డెవలపర్స్ ఎండీ సరన్షా ట్రెహాన్ తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పటికీ.. డెవలపర్లు డిమాండ్‌ను కొనసాగించడం కోసం ప్రాపర్టీ ధరలను తక్కువ స్థాయిలోనే కొనసాగించారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. చదవండి: ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే -
మద్యం మత్తులో రియల్ ఎస్టేట్ ఉద్యోగి దారుణ హత్య
సాక్షి,అల్లిపురం (విశాఖ దక్షిణ): రియల్ ఎస్టేట్ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య స్వల్వ వాగ్వాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రెడ్డి గోపాలకృష్ణ (26) తిరుమల రియల్ ఎస్టేట్ సంస్థలో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బీచ్‌రోడ్డులో గోకుల్‌పార్కు ఎదురుగా గల ప్రతిమ ప్యారడైజ్ అపార్టుమెంట్లో మరో ఇంజినీర్‌తో కలిసి ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం భవాని హోటల్ యజమాని బ్రహ్మయ్య చౌదరి, మరో ఇద్దరితో కలిసి అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఐదుగురు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో తన ప్లాట్‌కు మద్యం తాగి రావొద్దని గతంలో బ్రహ్మయ్య చౌదరితో గోపాలకృష్ణ అన్న మాటలు ప్రస్తావనకు వచ్చి వాగ్వాదం చోటుచేసుకుంది. స్నేహితులు వారించే ప్రయత్నం చేసినా వారు వినుకోలేదు. మద్యం మత్తులో ఉన్న బ్రహ్మయ్య చౌదరి వంటగదిలో ఉన్న చాకు తీసుకువచ్చి గోపాలకృష్ణ కడుపు భాగంలో పొడిచేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బ్రహ్మయ్యచౌదరి అక్కడ నుంచి పరారయ్యాడు. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రాత్రి 7.30 గంటలకు మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, ఎస్ఐ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకుని పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటున్న అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. బ్రహ్మయ్యచౌదరితో వచ్చిన ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలకు లోనైన జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకి సురక్షా గ్రూప్‌నకు లైన్ క్లియరైంది. రుణదాతలు, గృహ కొనుగోలుదారుల నుంచి సురక్షా బిడ్‌కు అనుమతి లభించింది. దీంతో ఫ్లాట్లను కొనుగోలు చేసినా సొంతం చేసుకునేందుకు వీలులేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జేపీ ఇన్ఫ్రా వివిధ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టింది. వీటికి సంబంధించి 20,000 మందికిపైగా గృహ కొనుగోలుదారులు ఫ్లాట్ల కోసం వేచిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10 రోజులుగా.. జేపీ ఇన్ఫ్రా టేకోవర్‌కు అటు పీఎస్‌యూ దిగ్గజం ఎన్బీసీసీ, ఇటు సురక్షా గ్రూప్ వేసిన బిడ్స్‌పై 10 రోజులపాటు వోటింగ్ ప్రాసెస్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సురక్షా గ్రూప్ బిడ్‌కు 98.66 శాతం మద్దతు లభించినట్లు తాజాగా రిజల్యూషన్ అధికారి అనుజ్ జైన్ వెల్లడించారు. ఎన్బీసీసీకి 98.54 శాతం వోట్లు లభించినట్లు తెలియజేశారు. వెరసి అతిస్వల్ప మార్జిన్‌తో సురక్షా గ్రూప్ ముందంజ వేసినట్లు వివరించారు. చదవండి : ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
Coronavirus: ఇంటి కల మారింది
సాక్షి, అమరావతి: సొంతింటి కలలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఇప్పటివరకు ఎంతోకొంత స్థలం.. అందులో ఓ చిన్న ఇల్లు చాలనుకున్నవారంతా ఇప్పుడు పెద్ద కలలు కంటున్నారు. మారుతున్న పరిస్థితులతో వర్క్ ఫ్రమ్ హోంలు, ఆన్లైన్ క్లాసులకు అనుగుణంగా యువత పెద్ద ఇళ్ల వైపు ‘లుక్’ వేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు అద్దె ఇళ్లల్లో ఉన్న వాళ్లు కూడా కరోనా దెబ్బకు సొంతిల్లు ఉండాలన్న నిర్ణయానికి వస్తున్నారు. ముఖ్యంగా సిటీ మధ్య ప్రాంతంలో కంటే కూడా శివారు ప్రాంతాల్లోని ఇళ్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం నో బ్రోకర్ డాట్‌కామ్ సర్వేలో వెల్లడయ్యింది. వర్క్ ఫ్రమ్ హోం ట్రెండ్ నడుస్తుండటంతో.. దూరంతో సంబంధం లేకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండి, రణగొణధ్వనులకు దూరంగా ఉండే విశాల వాతావరణంలోని ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని 59 శాతం మంది బిల్డర్లు పేర్కొన్నారు. ఇంకో అదనపు గది కావాలి.. కరోనా దెబ్బకు.. సొంతిల్లు కొనుగోళ్లకు 1990 తర్వాత పుట్టిన వాళ్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, బడ్జెట్ ఎక్కువ అయినా సువిశాలమైన ఇంటి కోసం వీరు ఎదురు చూస్తున్నారని బిల్డర్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటిని కొనేవారు పిల్లలకు స్టడీ రూం, పెద్దవాళ్లకు ఆఫీసు రూం ప్రత్యేకంగా కావాలని అడుగుతున్నారని క్రెడాయ్ ఏపీ చాప్టర్ మాజీ అధ్యక్షుడు చిగురుపాటి సుధాకర్ తెలిపారు. గతంలో రెండు బెడ్రూంలు కావాలనుకునే వారు.. ఇప్పుడు మూడు బెడ్రూమ్లకు, మూడు బెడ్ రూమ్‌లు తీసుకునే వారు నాలుగు బెడ్రూమ్లకేసి చూస్తున్నారు. సగటు డిమాండ్ చూస్తే గతంతో పోలిస్తే 200 చదరపు అడుగులు అదనంగా తీసుకోవడానికి వీరు వెనుకాడటం లేదు. అలాగే బాల్కనీలు, గార్డెన్లు.. విశాలంగా, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న వాటికి డిమాండ్ అధికంగా ఉందని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన దంటు బాలాజీ అనే బిల్డర్ పేర్కొన్నారు. లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకునేవారు వ్యాయామాలు చేయడానికి ప్రత్యేక వర్కౌట్ గదులు కావాలని కోరుతున్నారని చెప్పారు. ప్రస్తుతం మారిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు బిల్డర్లు తెలిపారు. కరోనాతో అద్దె ఇంటి కంటే సొంతింటి వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, లాక్డౌన్ సమయంలో కూడా వస్తున్న ఎంక్వైరీలే ఇందుకు నిదర్శనమని సుధాకర్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు.. గతంతో పోలిస్తే తక్కువ రేటుకే లభిస్తుండటంతో లాక్డౌన్ ఆంక్షలు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుదన్న ఆశాభావాన్ని బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు. -
పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు అతిపెద్ద పట్టణాల్లో ఇళ్ల ధరలు ఒక శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ తెలిపింది. ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చినందున 2021 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏడు ప్రధాన పట్టణాల్లో చదరపు అడుగు సగటు ధర రూ.5,599 నుంచి రూ.6,660కు పెరిగింది. 2020 మొదటి మూడు నెలల్లో ధరలతో పోల్చి ఈ వివరాలు విడుదల చేసింది. నివాస గృహాల ధరల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. ► ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల ధరలు 2 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,650కు చేరింది. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో (ఎంఎంఆర్) ఒక శాతం పెరిగి చదరపు అడుగు రూ.10,750కు చేరింది. ► బెంగళూరు మార్కెట్లో 2 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.5,060గా ఉంది. ► పుణెలోనూ ఒక శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.5,580కు చేరింది. ► కోల్‌కతా మార్కెట్లో పెద్ద మార్పు లేదు. చదరపు అడుగు ధర రూ.4,385 నుంచి రూ.4,400 వరకు పెరిగింది. ► చెన్నై మార్కెట్లో ఒక శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.4,935గా ఉంది. ► ఇక హైదరాబాద్ మార్కెట్లో ఒక శాతం పెరిగి చదరపు అడుగు విక్రయ ధర రూ.4,195 నుంచి రూ.4,240కు చేరింది. ► 2020 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏడు ప్రధాన పట్టణాల్లో 45,200 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదు కాగా.. 2021 మొదటి మూడు నెలల్లో 58,290 ఇళ్ల విక్రయాలు నమోదు కావచ్చని అనరాక్ అంచనా వేస్తోంది. -
చైనాకు ప్రత్యామ్నాయం మనమే
సాక్షి, హైదరాబాద్: ‘వేగంగా పురోగమిస్తున్న రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనా లాక్డౌన్ సంక్షోభంలోకి నెట్టింది. వలస కార్మికులు సొంతూళ్లకు తిరుగు పయనం అవుతుండటం, ధరల పెరుగుదల వల్ల డెవలపర్లపై పెనుభారం పడనుంది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రియల్ ఎస్టేట్ రంగాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన సమయమిది. రిజిస్ట్రేషన్ రుసుము తగ్గింపు, రుణాలపై మారటోరియం గడువు పెంపు, తక్కువ వడ్డీకే గృహ రుణాలు వంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కరోనా నేపథ్యంలో చైనాకు భారత్‌ను అనేక దేశాలు ప్రత్యామ్నాయంగా చూస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగానికి దేశంలో ప్రత్యేకించి తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుంది’అని భారతీయ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ చాప్టర్ చైర్మన్, ఏఆర్కే çగ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం స్థితిగతులపై ఆయనతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ► రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం రెండు మూడేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థి క మాంద్యం ఉన్నా మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం మంచి స్థాయిలో ఉండేది. లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ రంగంలో పనిచేస్తున్న 90 శాతం మంది వలస కూలీలు తమ భవిష్యత్తుపై భయాందోళనకు గురవుతున్నారు. ► లాక్డౌన్ తొలగించిన తర్వాత పనులకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో మనసు మార్చుకున్నారు. దీంతో 40 రోజులకు పైగా వారికి రక్షణ కల్పిస్తూ, వేతనాలు, భోజన సదుపాయం కోసం లక్షల రూపాయలు వెచ్చించిన డెవలపర్లు ఆందోళనకు లోనవుతున్నారు. రైళ్లు నడుపుతున్నారనే విషయం తెలిసి సొంతూళ్లకు వెళ్లే ఆలోచన లేని వారు కూడా అనుమతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. వారిలో అధికంగా వలస కూలీలే ఉన్నారు. ► వేసవిలో నిర్మాణ రంగం పనులు శరవేగంగా సాగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలం ప్రారంభమైతే పనులకు అంతరాయం కలుగుతుంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడి వ్యయం పెరిగే అవకాశం ఉంది. ► నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉంది. వలస కార్మికులు తిరుగుముఖం పడితే ఎదురయ్యే సమస్యలను ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలసి వివరించాం. ప్రస్తుతమున్న కార్మికుల్లో విశ్వాసం నింపడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరాం. మా విజ్ఞప్తికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. ► ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి మంచి సహకారం ఉంది. నోడల్ అధికారిని నియమించి, ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా మా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్తున్న కార్మికులు తిరిగి వచ్చేందుకు మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశముంది. ► కూలీలు, ధరల పరంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రతి డెవలపర్ కోట్లాది రూపాయలను ప్రైవేటు సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పెట్టుబడి తీసుకురావాల్సిందే. ఎక్విప్మెంట్ను కూడా ఫైనాన్స్ ద్వారానే కొనుగోలు చేస్తారు. దీంతో రుణాలు, ఫైనాన్స్ కిస్తీలు ప్రతి నెలా లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడం బిల్డర్ల మీద ప్రభావం చూపుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ సిమెంటు, స్టీల్ ధరల పెరుగుదల, వేతనాల చెల్లింపు భారం పడుతుంది. ► వేతనాల్లో కోత, ఉద్యోగ భద్రత వంటి అంశాలు కొనుగోలుదారులపైనా ప్రభావం చూపడంతో బయ్యర్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలు, గృహ రుణాలపై వడ్డీని8 నుంచి 6 శాతానికి తగ్గించడంతో పాటు ప్రోత్సాహకాలు, ఉపశమన చర్యలు కేంద్రం ప్రకటించాలి. ► లాక్‌డౌన్‌కు సిద్ధంగా లేకపోవడంతో డెవలపర్లు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నా, ఖర్చులు మాత్రం తగ్గట్లేదు. మంజూరై న రుణాలకు సంబంధించి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా అదనంగా 20 నుంచి 25% మేర రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి. లాక్డౌన్ పీరియడ్‌లో బ్యాంకు రుణాలపై 3 నెలల పాటు మారటోరియం విధించారు. దీన్ని కనీసం ఏడాది పాటు పొడిగించడంతో పాటు, కొంత వడ్డీ కూడా రద్దు చేయాలి. ► అభివృద్ధి చెందిన దేశాలు వార్షిక ఆదాయంలో సుమారు 16 శాతం మేర సంక్షేమానికి ఖర్చు పెడుతుండగా, మన దేశంలో ఒక్క శాతం కూడా లేదు. కేంద్రం ఇప్పటివరకు రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీని అన్ని రంగాలకు కలిపి ప్రకటించింది. ► వ్యవసాయం తర్వాత నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సుమారు 250 రకాలైన పరిశ్రమలు నిర్మాణ రంగంపై ఆధార పడి మనుగడ సాగిస్తున్నందున, ఈ రంగాల ను కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రంగాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం హోదా ఇవ్వాలి. పన్ను ఎగవేతదారులు, నల్లధనం ఉన్న వారిపై చర్యలు తీసుకోండి. కానీ రియల్ ఎస్టేట్ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించండి. ► ప్రస్తుత సంక్షోభాన్ని చూసి డెవలపర్లు, బిల్డర్లు ఆందోళన చెందకుండా మన కుటుంబం, ఉద్యోగులు, కార్మికులను సురక్షితంగా చూసుకుందాం. కొంత నష్టం ఎదురైనా మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటాం. ఐటీ, వాణిజ్యం, టూరిజం తదితర రంగాలు దెబ్బతినడంతో రియల్టీ రంగంపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ► ప్రస్తుతం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు లాభాలు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై కాకుండా మనుగడ సాగించడంపై దృష్టి సారించాలి. కరోనా సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులకు భారత్‌ను చైనాకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో స్థిరాస్తి, నిర్మాణ రంగాలకు మంచి భవిష్యత్తు ఉంది. ► భూమి కొనుగోలు మొదలుకుని వినియోగదారుడికి అప్పగించేంత వరకు డెవలపర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమున్న 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే కొనుగోలుదారులు ముందుకొస్తారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ రంగం పుంజుకుంటుంది. -
మహమ్మారి ఎఫెక్ట్ : నిర్మాణ రంగం కుదేలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మహమ్మారి ప్రభావంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది గృహ విక్రయాలు 35 శాతం మేర తగ్గుతాయని ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్ధ అనరాక్ అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రభావం వాణిజ్య (కార్యాలయ, రిటైల్) రియల్‌ఎస్టేట్‌పైనా ఉంటుందని పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్లో మందగమనం కొనసాగుతున్నా మెరుగైన సామర్ధ్యం కనబరుస్తున్న వాణిజ్య నిర్మాణ రంగంపై మహమ్మారి ఎఫెక్ట్ పడనుండటంతో మొత్తంగా నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక 2019లో కార్యాలయ సముదాయానికి 40 మిలియన్ చదరపు అడుగుల స్ధలం లీజ్‌కు తీసుకోగా, ఈ ఏడాది అది 28 మిలియన్ చదరపు అడుగులకు పడిపోవచ్చని అనరాక్ అంచనా వేసింది. ఇక రిటైల్ రంగంలో లీజింగ్ సైతం ఈ ఏడాది 64 శాతం మేర పతనమవుతుందని పేర్కొంది. కోవిడ్-19 ప్రభావంతో దేశంలో రెసిడెన్షియల్ రియల్‌ఎస్టేట్‌కు డిమాండ్ పడిపోవడంతో పాటు లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటోందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. రియల్ ఎస్టేట్‌పై కోవిడ్-19 ప్రభావం పేరిట వెల్లడించిన నివేదికలో నిర్మాణ రంగ కార్యకలాపాలపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ మహమ్మారితో నిర్మాణ రంగంలో నిస్తేజం ఆవరించిందని అనరాక్ పేర్కొంది. లాక్డౌన్ నేపథ్యంలో సైట్ విజిట్లు, సంప్రదింపులు, డాక్యుమెంటేషన్, క్రయ, విక్రయ ప్రక్రియలు పూర్తిగా నిలిచిపోయాయని, మరో రెండు త్రైమాసికల్లో సైతం సంక్లిష్ట సమయం ఎదుర్కోవడం తప్పదని నివేదిక స్పష్టం చేసింది. సంక్షోభాన్ని అధిగమించి నిర్మాణ రంగం కుదురుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది. చదవండి : ‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’ -
హైదరాబాద్ రియల్టీలో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్సాహం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, కార్యాలయాల లావాదేవీల్లో వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ (హెచ్1) మధ్య కాలంలో నగరంలో కొత్త గృహాల లాంచింగ్స్‌లో 47 శాతం, ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా 11వ ఎడిషన్ అర్ధ సంవత్సర నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ మీడియాతో మాట్లాడారు. నివేదికలోని ముఖ్యమైన అంశాలివే.. 5,430 యూనిట్ల అమ్మకం.. 2019 హెచ్1లో నగరంలో కొత్తగా 5,430 గృహాలు ప్రారంభమయ్యాయి. 2018 హెచ్1లో ఇవి 3,706 యూనిట్లుగా ఉన్నాయి. ఫ్లాట్ల లాంచింగ్స్ ఎక్కువగా కూకట్పల్లి, మియాపూర్ వంటి ఉత్తరాది ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ప్రాజెక్ట్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఇక, అమ్మకాల్లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ అర్ధ సంవత్సరంలో నగరంలో 8,334 గృహాలు అమ్ముడుపోగా.. గతేడాది హెచ్1లో ఇవి 8,313 యూనిట్లు. ఈ ఏడాది అమ్మకాల్లో 63 శాతం గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువ. ధరల్లో 9 శాతం వృద్ధి.. నగరంలో సగటు చ.అ. ధరల్లో 9 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది హెచ్1లో చ.అ. సగటున రూ.4,012 కాగా.. ఇప్పుడది రూ.4,373కి పెరిగింది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్1తో పోలిస్తే 67 శాతం తగ్గి ప్రస్తుతం 4,265 యూనిట్లుగా నిలిచాయి. నిర్మాణం పూర్తయిన లేదా తుది దశలో ఉన్న గృహాల కొనుగోళ్లకే నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని, ఆయా గృహాలకు జీఎస్టీ లేకపోవటమే దీనికి కారణం. 38.5 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ నగరంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 38.5 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2018 హెచ్1లో ఇది 26..9 లక్షల చ.అ.లుగా ఉంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాలు 41 శాతం లావాదేవీలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే నగరంలో ఆఫీస్ స్పేస్ ధరలు 11 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం నెలకు చ.అ. ధర సగటున రూ.59 ఉంది. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో కార్యాలయాల ప్రాజెక్ట్‌లు విస్తరిస్తున్నాయి. -
బినామీలకు భూముల విందు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ రాజధాని నిర్మాణం అనే ముసుగులో భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి లాక్కున్న భూములను తన బినామీలైన రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు ఉపక్రమించారు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఎలాంటి టెండర్లు లేకుండా కమీషన్ల కోసం నామినేషన్‌పై తమకు నచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలు, ఏజన్సీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు... రిజర్వ్ రేటు పేరుతో భూముల అసలు ధర కన్నా తక్కువ ధరకు కట్టబెట్టటమే కాకుండా వాయిదాల పద్ధతిలో నెమ్మదిగా చెల్లించే వెసులుబాటును కూడా కల్పిస్తూ భారీ స్కాంకు తెర తీశారు. ఇందుకోసం సీఆర్డీఏ అనుసరిస్తున్న భూ కేటాయింపుల నిబంధనలను సైతం సమూలంగా మార్చేయడం గమనార్హం. ‘రియల్’ వ్యాపారులకు రాయితీతో రైతుల భూములు రాజధాని ప్రాంత రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు, రిబేటులతో కట్టబెట్టాలని టీడీపీ సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబరు 19న జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలింది. ప్రైవేట్ డెవలపర్లకు రాయితీలు, రిబేటులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు కేటాయించేందుకు పనితీరు, ఆర్థిక స్థోమత ఆధా రంగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు /నామినేషన్ / నేరుగా సంప్రదింపుల విధానాల ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీలకుపట్టణ అభివృద్ధి ప్రాజెక్టులను అప్పగించనున్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ అనుసరిస్తున్న భూ కేటాయింపుల విధానాలు, నిబంధనలు డెవలప్మెంట్కు అనుకూలంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం భూములు విక్రయించినా, లీజుకు ఇచ్చినా ఒప్పంద సమయంలోనే అందుకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం ప్రైవేట్ డెవలపర్స్‌కు సమస్యగా తయారైందని అంచనా వేస్తోంది. ఒకవేళ ప్రాజెక్టును మధ్యలో వదిలేస్తే అప్పటి వరకు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇవ్వడం, టెర్మినేషన్ పేమెంట్ లాంటి వెసులుబాటు లేదు. అందువల్లే ప్రైవేట్ సంస్థలు రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు రావడం లేదని, ఈ నేపథ్యంలో రాజధానిలో పెద్ద, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులను చేపట్టే ప్రైవేట్ డెవలపర్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు, రిబేటులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విక్రయించుకునే హక్కులు కూడా వారికే... రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలను వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములకు నిర్ధారించిన రిజర్వ్ ధరలో రాయితీలు, వాయిదాల రూపంలో చెల్లించేందుకు ప్రైవేట్ డెవలపర్లకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలు, ఏజెన్సీలు, అసోసియేషన్లు, జాయింట్ కంపెనీలను అనుమతించనున్నారు. విక్రయించిన లేదా లీజుకు ఇచ్చిన భూమిపై నూటికి నూరు శాతం అభివృద్ధి హక్కులను ప్రైవేట్ డెవలపర్స్‌కు కల్పిస్తారు. ప్రైవేట్ డెవలపర్స్ ఆ భూమిని విక్రయించుకోవడం లేదా లీజు / సబ్ లీజు / మూడో పార్టీకి బదలాయించే హక్కులను కూడా కల్పిస్తారు. అల్ట్రా మెగా, ఐకానిక్ ప్రాజెక్టులు, సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, టెక్నాలజీ లైసెన్సు కలిగిన ప్రాజెక్టులు, గతంలో టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాని ప్రాజెక్టులను ఇప్పటికే పని చేస్తున్న సంస్థలకు దరఖాస్తుల ఆహ్వానం లేదా నామినేషన్, సంప్రదింపుల విధానంలో అప్పగించాలని నిర్ణయించారు. జాప్యం జరిగితే అపరాధ వడ్డీతో బకాయిల చెల్లింపులు.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఆర్డీఏ బిల్లులను సకాలంలో చెల్లించకుంటే ఆ బకాయిలను అపరాధ వడ్డీతో చెల్లించేలా క్లాజు పొందుపరచాలని నిర్ణయించడం గమనార్హం. చెల్లింపుల్లో ఎంత సమయం జాప్యం జరిగిందనే అంశం ఆధారంగా అపరాధ వడ్డీ శాతాన్ని నిర్ణయిస్తారు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాజెక్టు నుంచి మధ్యలోనే నిషŠక్రమిస్తే అప్పటివరకూ ఆ ప్రాజెక్టుపై చేసిన ఖర్చును సదరు సంస్థకు సీఆర్డీఏ తిరిగి చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన కూడా పొందుపరిచారు. పెద్ద ప్రాజెక్టులకు 75 శాతం ధరకే భూమి పెద్ద ప్రాజెక్టులకు రూ. 200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు క్యాపిటల్ వ్యయంగా నిర్ధారించారు. ఈ కేటగిరీ ప్రాజెక్టులకు రిజర్వ్ ధరలో భూమిని 75 శాతం ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. ఉదాహరణకు ఎకరం రిజర్వ్ ధర నాలుగు కోట్ల రూపాయలుంటే మూడు కోట్ల రూపాయలకే భూమి ఇవ్వనున్నారు. ఇందుకు 25 ఎకరాల నుంచి 75 ఎకరాల వరకు కేటాయించనున్నారు. మెగా ప్రాజెక్టులకు 50 శాతం ధరకు భూమి.. మెగా ప్రాజెక్టులకు రూ. 500 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ వ్యయంగా నిర్ధారించారు. ఈ కేటగిరీ ప్రాజెక్టులకు రిజర్వ్ ధరలో భూమిని 50 శాతం ధరకే ఇస్తారు. అంటే ఎకరం రిజర్వ్ ధర నాలుగు కోట్ల రూపాయలుంటే రెండు కోట్ల రూపాయలకే భూమి ఇవ్వనున్నారు. ఇందుకోసం 75 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు కేటాయించనున్నారు. అల్ట్రా మెగా / ఐకానిక్ ప్రాజెక్టులకు 25 శాతం ధరకే భూమి అల్ట్రా మెగా/ ఐకానిక్ ప్రాజెక్టులకు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,500 కోట్లు క్యాపిటల్ వ్యయంగా నిర్ణయించారు. ఈ కేటగిరీ ప్రాజెక్టులకు భూమి రిజర్వ్ ధరలో 25 శాతం ధరకే ఇవ్వనున్నారు. అంటే ఎకరం నాలుగు కోట్ల రూపాయల రిజర్వ్ ధర ఉంటే కోటి రూపాయలకే ఇవ్వనున్నారు. ఇందుకు 150 ఎకరాలను కేటాయించనున్నారు. ప్రాజెక్టుల స్థాయి ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన విధించనున్నారు. (రైతుల భూములతో దోపిడీకి ప్రణాళిక) రాజధాని ప్రాంతం ప్రకటనకు ముందే తమ బినామీలతో రైతుల నుంచి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా దోపిడీ చేసిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే సీఆర్డీఏ భూ కేటాయింపు నిబంధనలను సమూలంగా మార్చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో నామినేషన్ పద్ధతిలో రాయితీపై పెద్ద ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు, అల్ట్రా మెగా, ఐకానిక్ ప్రాజెక్టుల పేరుతో బినామీలతో వేలాది ఎకరాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. తిరిగి ఆ భూములనే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుని భవనాలు నిర్మించి విక్రయించడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి పొందడానికి వ్యూహం రచించారు. -
కొనడానికైనా.. అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో సొంతిల్లు.. ఉన్నోళ్లకు మాత్రమే అనేది చాలా మంది అభిప్రాయం. కానీ, ఏడాదికి రూ.9 లక్షల ఆదాయమున్న ప్రతీ ఒక్కరూ సొంతిల్లు సొంతం చేసుకోవచ్చు. అంటే దీనర్థం నేటికీ హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్నాయని! కొనడానికే కాదు అద్దెకుండేందుకైనా చారిత్రక నగరి దగ్గరిదారేనని ఓ ప్రముఖ సంస్థ సర్వేలో తేలింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణెల్లో ‘‘స్థిరాస్తి కొనుగోలు.. అద్దెలు’’ అంశంపై సర్వే చేసింది. హైదరాబాద్.. ♦ నగరంలో స్థిరాస్తి కొనేందుకైనా, అద్దెకుండేదుకైనా ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ♦ నాలుగేళ్లుగా వాణిజ్య సముదాయాల అద్దె ధరలు 6.3 శాతం పెరిగాయి. అదే సమయంలో నివాస సముదాయాల ధరలు 10.46 శాతం మేర పడిపోయాయి. ♦ ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం సంపాదించేవారు ఇక్కడ నివాస సముదాయాన్ని కొనుగోలు చేయవచ్చు. బెంగళూరు.. ♦ ఐటీ, స్టార్టప్ హబ్‌గా పేరొందిన గార్డెన్ సిటీ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కు వగా ఉండటంతో ఇక్కడ నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలకు గిరాకీ ఉంది. ♦ గతేడాదితో పోల్చితే ఇక్కడి అద్దెలు 10.08 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి ధరలు మాత్రం 2.55 శాతం మేర పడిపోయాయి. ♦ ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ.15 లక్షల ఆదాయం ఉండాల్సిందే. చెన్నై.. ♦ దేశంలో స్థిరాస్తి ధరలు ప్రియంగా ఉన్న నగరాల్లో చెన్నైది మూడో స్థానం. తొలి రెండు స్థానాలు ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లవి. గతేడాదితో పోల్చితే చెన్నైలో ధరలు 8.78 శాతం పెరిగాయి. ఆసక్తికరంగా అద్దెలు మాత్రం 1.7 శాతం మేర పడిపోయాయి. ♦ ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం గడించేవారికి మాత్రమే చెన్నైలో స్థిరాస్తి సొంతమవుతుంది. ఢిల్లీ–ఎన్సీఆర్.. ♦ దేశ రాజధానిలో స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. నివాస సముదాయాల ధరలు విషయంలో ఢిల్లీది రెండో స్థానం. ♦ గత నాలుగేళ్లుగా రాజధానిలో నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలు 20 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి కొనుగోలు ధరలైతే 9.1 శాతం మేర పెరిగాయి. ♦ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతాల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏటా ఆదాయం కనీసం రూ.25 లక్షలకు పైగానే ఆర్జించాలి మరి. కోల్‌కతా.. ♦ స్థిరాస్తి కొనుగోలుౖకైనా, అద్దె విషయంలోనైనా కోల్కత్తా సమాంతరంగా వృద్ధి చెందుతుంది. ♦ ఏడాదికాలంగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 11.27 శాతం, అద్దెలు 11.48 శాతం మేర పెరిగాయి. ♦ ఏటా ఆదాయం రూ.15 లక్షలుంటే కోల్‌కతాలో ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. అహ్మదాబాద్.. ♦ హైదరాబాద్ తర్వాత స్థిరాస్తి కొనుగోలుౖకైనా, అద్దెకైనా సామాన్యులకు అందుబాటులో ఉన్న నగరమేదైనా ఉందంటే అది అహ్మదాబాదే. ♦ ఏటా ఆదాయం రూ.10 లక్షలుంటే చాలు ఇక్కడ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. అందుబాటు గృహాల్లో యువతే కీలకం సాక్షి, హైదరాబాద్: 2050 నాటికి జనాభాలోని 65 శాతం మంది 35 సంవత్సరాలకు చేరుకుంటారని.. వీళ్ల ప్రవర్తన, వ్యయ, మదింపులు, ట్రెండ్స్‌ను అర్థం చేసుకుంటేనే స్థిరాస్తి, రిటైల్ రంగాలు వృద్ధి చోదకాలుగా మారతాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు జాక్సీ షా సూచించారు. శుక్రవారమిక్కడ క్రెడాయ్ యూత్ వింగ్ 2వ వార్షిక కన్వెన్షన్ జరిగింది. ఈ సందర్భంగా యూత్ వింగ్, సీబీఆర్ఈ సంయుక్తంగా కలిసి ‘ద యూత్ బారోమీటర్’ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ♦ 82% మంది యువత (మిలీనియల్స్) తమ కుటుంబంతో నివసిస్తున్నారు. పెళ్లయ్యేంత వరకూ ఫ్యామిలీతోనే ఉండాలన్న సాంస్కృతిక బంధమే ఇందుకు కారణం. అధిక ప్రాపర్టీ ధరలు కూడా ఒకింత కారణమే. తల్లిదండ్రులతో నివ సించని 68% యువత అద్దెకు ఉండటానికి ఇష్టపడుతున్నారు. 35% యువత ఆస్తిని కొనుగోలు చేయడమనేది పెట్టుబడిగా భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. మొత్తమ్మీద ఎక్కువ శాతం యువత ఇంటిని కొనుగోలును లకి‡్ష్యంచినట్లు అందులోనూ నాణ్యమైన, లొకేషన్ ఆధారిత అందుబాటు గృహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ♦ మొత్తం జనాభాలో 25 శాతం మంది పని చేసే యువత ఉంటుంది. పని చేసేందుకు ఒక కంపెనీని ఎంచుకునే క్రమంలో 75% యువత ప్రాధాన్యతలు.. వేతనం, బెనిఫిట్సే! 73 శాతం మంది పని చేసే చోటు నుంచి 45 నిమిషాలకు మించి ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. -
రియల్‌కు ‘పెద్ద’ షాక్!
యాచారం: రియల్ వ్యాపారానికి ‘పెద్ద’ షాక్ తగిలింది. ప్లాట్ల ధరలు నెల క్రితంతో పోలిస్తే 30 శాతానికి పైగా పడిపోయాయి. స్థానికంగా ఫార్మాసిటీ ఏర్పాటు కావడం.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తున్న మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేశారు. దీనికోసం రూ.కోట్లలో ఖర్చు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాచారం, మాల్ కేంద్రాల్లోని ప్లాట్లు రోజుకు 50 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్ చేసేవారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో నాలుగు రోజులుగా పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలూ మూత పడ్డాయి. పడిపోయిన ధరలు యాచారం, మాల్ కేంద్రాల్లో 60కి పైగా వెంచర్లను ఏర్పాటు చేశారు. యాచారంలో గజం ధర రూ. 2 వేల నుంచి రూ.10 వేలకు పైగా ఉండగా... మాల్లో గజం ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. యాచారం, మాల్, నందివనపర్తి, గునుగల్, తక్కళ్లపల్లి, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో వందలాది ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు భారీగా అడ్వాన్స్ లు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు.. భవిష్యత్తులో ధరలు మరింత పతనమవుతాయనే బెంగతో వ్యాపారులు అడ్వాన్సులు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అటు నుంచి స్పందన ఉండడం లేదు. యాచారం, మాల్ కేంద్రాల్లోనే ప్రజలు రూ.15 కోట్లకు పైగా అడ్వాన్స్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్న వారు పెద్ద నోట్లు ఇస్తామని చెబుతుండడంతో వ్యాపారులు కంగుతింటున్నారు. -
అదిగదిగో.. జిల్లాకేంద్రం!
♦ ఈసాకుతో భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు ♦ ఇష్టారాజ్యంగా పెంచుతున్న దళారులు ♦ శంషాబాద్‌లో అడ్డగోలు దందా ♦ వినియోగదారులూ.. పారాహుషార్ శంషాబాద్: శంషాబాద్‌లో దళారుల దందా మూడు ప్లాట్లు.. ఆరు బిట్లు.. అనే విధంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం ప్రకటనతో రెక్కలు విప్పుకున్న రియల్ ఎస్టేట్ దళారులు ఖాళీగా ఉన్న భూములపై వాలిపోతున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ నిజమైన కొనుగోలుదారులను అవస్థల పాలుచేస్తున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నాటి నుంచి రియల్ వ్యాపారం మరోసారి జోరందుకుంది. దీనిని అదనుగా చేసుకున్న మధ్యవర్తుల దందా కూడా పెరిగిపోయింది. శంషాబాద్లోనే శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకముందే అదిగో జిల్లా కేంద్రం.. ఇదిగో జిల్లా కేంద్రం.. అంటూ భూముల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. శంషాబాద్ పంచాయతీ పరిధిలోని హుడా కాలనీలో సర్వే నంబరు 726 నుంచి 730 వరకు ఉన్న హెచ్ఎండీఏ స్థలాల్లో ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఔటర్ రింగురోడ్డు, నలభైనాలుగో నంబరు జాతీయ రహదారికి ఇది అత్యంత చేరువులో ఉండడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పట్టణవాసులు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఈ భూములపై పరిశీలన కూడా చేపట్టలేదు. ప్రజా సంఘాలు, పార్టీల నుంచి జిల్లా కేంద్రానికి డిమాండ్‌గా ఉన్న ఈ భూములకు సమీపంలోనే ఉన్న హుడా కాలనీ, ఎయిర్‌పోర్టు కాలనీలో పదిహేనురోజుల కిందట ఉన్న ధరలను మధ్యవర్తులు అడ్డగోలుగా పెంచేశారు. నెలరోజుల కిందట రూ. 2-3 వేలకు గజం ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 6-8 వేల వరకు చేరాయి. నిన్నమొన్నటి వరకు ఏమాత్రం డిమాండ్ లేని ఈ భూముల్లో మధ్యవర్తులు పెద్దఎత్తున తచ్చాడుతున్నారు. వీరు కృత్రిమంగా పెంచుతున్న ధరలతో సొంతిల్లు కోసం స్థలం కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఇక్కట్లు తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. దళారులు అడ్డగోలుగా విక్రయిస్తున్నా.. భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే వినిచయోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పట్టణంలోని హుడా కాలనీ సమీపంలో ఉన్న కొన్ని భూముల్లో ఓవ్యక్తి పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై ఇప్పటికే దళారుల మధ్య తీవ్రంగా చర్చజరుగుతోంది. ఇవే కాకుండా ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ బడావ్యాపారి స్థానిక రియల్ వ్యాపారులకు ఒప్పదం చేసిన వెంచర్లో కూడా కొన్ని ప్లాట్లను ఇద్దరు, ముగ్గురికి విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పందం చేసుకున్న వారితో పాత యజమానికి కూడా తిరిగి ప్లాట్లు విక్రయిస్తుండడడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్లాట్లు కొనుగోలు చేసే వారు ముందస్తుగా పూర్తి సమాచారంతో అప్రమత్తం కాకపోతే దళారుల చేతిలో భారీగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత రియల్ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటు స్థలంపై ఏమాత్రం స్పష్టత నివ్వకముందు దళారులు చేస్తున్న ప్రచారాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
'ఆ ఎయిర్ పోర్ట్ ప్లానింగ్ మోసపూరితం'
విజయనగరం : భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ మోసపూరితమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్టీకి చెందిన నేతలతో కలిసి విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో మంగళవారం బృందా కారత్ పర్యటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధిచేకూర్చేలా ఎయిర్పోర్ట్ ప్లానింగ్ ఉందని ఆమె ఆరోపించారు. సీపీఎం తరఫున పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆమె పేర్కొన్నారు. దేశంలోని చాలా ఎయిర్‌పోర్టులలో ఉద్యోగులను తొలగిస్తుంటే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోందని బృందా కారత్ విమర్శించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దోపిడీకి యత్నం
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ పీఎల్పీ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజీవరెడ్డి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే, ఘటనకు పాల్పడ్డ వారిలో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఎనిమిది మంది దొంగలు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.